పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/రోహిణి బలభద్రుని కనుట

తెభా-10.1-62-తే.
దేవకీదేవికడుపులోఁ దేజరిల్లు
దీప్త గర్భంబు మెల్లనఁ దిగిచి యోగ
నిద్ర రోహిణికడుపున నిలిపి చనియెఁ;
డుపు దిగె నంచుఁ బౌరులు లగఁ బడగ.

టీక:- దేవకీ = దేవకీ అనెడి; దేవి = ఉత్తమురాలు; కడుపు = గర్భము; లోన్ = అందు; తేజరిల్లు = ప్రకాశించెడి; దీప్త = కాంతివంతమైన; గర్భంబున్ = పిండమును; మెల్లనన్ = మృదువుగా; తిగిచి = వెలువరించి; యోగనిద్ర = యోగమాయ; రోహిణి = రోహిణి యొక్క; కడుపునన్ = గర్భమునందు; నిలిపి = స్థిరపరచి; చనియెన్ = వెళ్ళిపోయెను; కడుపు = గర్భము; దిగెను = జారిపోయెను; అంచున్ = అనుచు; పౌరులు = పురజనులు; కలగన్ = కలత; పడగ = చెందగా.
భావము:- యోగనిద్రాదేవి, కాంతులు చిమ్ముతున్న దేవకీదేవి కడుపులో ఉన్న గర్భాన్ని నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులు బాధపడ్డారు.

తెభా-10.1-63-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- కొన్ని నెలలకు. .

తెభా-10.1-64-ఆ.
లము మిగులఁ గలుగ "లభద్రుఁ"డన లోక
మణుఁ డగుటఁ జేసి "రాముఁ"డనగ
తికిఁ బుట్టె గర్భసంకర్షణమున "సం
ర్షణుం"డనంగ నుఁడు సుతుఁడు.

టీక:- బలము = జ్ఞానైశ్వర్య ధైర్య శారీరక శక్తి; మిగులన్ = అధికముగ; కలుగన్ = కలిగి ఉండుటచేత; బలభద్రుడు = బలభద్రుడు; అనన్ = అని పిలవబడుతు; లోక = సమస్త లోకములకు; రమణుడు = సంతోషింప జేయువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; రాముడు = రాముడు; అనగన్ = అని పిలవబడుతు; సతి = ఇల్లాలు (రోహిణి); కిన్ = కి, అందు; పుట్టెన్ = జన్మించెను, అవతరించె; గర్భ = పిండమును; సంకర్షణమునన్ = మార్పిడి చేయబడుట చేత; సంకర్షణుండు = సంకర్షణుడు; అనగన్ = అని పిలవబడెడి; ఘనుడు = గొప్పవాడు; సుతుడు = పుత్రుడు.
భావము:- రోహిణిగర్భాన చాలా గొప్పవాడు అయిన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కనుక సంకర్షణుడు అనీ, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అనీ, అందరిని ఆనందింపచేసేవాడు కనుక రాముడు అనీ అతనికి పేర్లు వచ్చాయి.

తెభా-10.1-65-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతంబ = ఆ తరువాత.
భావము:- పిమ్మట. . .

తెభా-10.1-66-క.
కదుందుభి మనమున
శ్రీనాథుం డంశభాగశిష్టతఁ జొరఁగన్
భానురుచి నతఁడు వెలిఁగెను
గానఁగఁ బట్టయ్యె భూతణములకు నృపా!

టీక:- ఆనకదుందుభి = వసుదేవుడు; మనమునన్ = మనసునందు; శ్రీనాథుండు = విష్ణుమూర్తి యొక్క {శ్రీనాథుడు - శ్రీ (చిచ్ఛక్తి యైన లక్ష్మీదేవి)కి నాథుడు (భర్త), విష్ణువు}; అంశ = కళ యందలి; భాగ = భాగముచేత; శిష్టతన్ = శ్రేష్ఠత్వము; చొరగన్ = చేరుటచేత; భాను =సూర్యుని బోలు; రుచిన్ = కాంతితో; అతడు = అతను; వెలిగెనున్ = ప్రకాశించెను; కానగన్ = చూచుటకు; పట్టయ్యెన్ = నివాసభూతుడయ్యెను; భూత = జీవుల, పంచభూతము {పంచభూతములు - 1భూమి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము}; గణముల్ = సమూహముల; కున్ = కు; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించడంతో అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు. పంచభూతాలకూ జీవులకూకూడా అది చూసి ఆనందం కలిగింది.

తెభా-10.1-67-ఉ.
సుదేవుఁ డంతఁ దన యం దఖిలాత్మక మాత్మ భూతముం
బానరేఖయున్ భువనద్రమునై వెలుఁగొందుచున్న ల
క్ష్మీవిభు తేజ మచ్చుపడఁ జేర్చినఁ దాల్చి నవీనకాంతితో
దేకి యొప్పెఁ బూర్వయగు దిక్సతి చంద్రునిఁ దాల్చు కైవడిన్."

టీక:- ఆ = ఆ; వసుదేవుడు = వసుదేవుడు; అంత = అంతట; తన = అతని; అందున్ = శరీరములోపల; అఖిల = సమస్తము నందు; ఆత్మకమున్ = ఆత్మ ఐనది; ఆత్మభూతమున్ = పరమాత్మ ఐనది; పావనరేఖయున్ = నిత్యపవిత్రమైనది; భువన = సర్వలోకములకు; భద్రమున్ = శుభకరము ఐనది; ఐ = అయ్యి; వెలుగొందుచున్న = ప్రకాశించుచున్న; లక్ష్మీవిభు = విష్ణుమూర్తి యొక్క; తేజమున్ = వీర్యమున్; అచ్చుపడన్ = అచ్చొత్తినట్లేర్పడగా; చేర్చినన్ = ప్రవేశపెట్టగా; తాల్చి = ధరించి; నవీన = సరికొత్త; కాంతి = తేజస్సు; తోన్ = తోటి; దేవకి = దేవకీదేవి; ఒప్పెన్ = చక్కగా ఉండెను; పూర్వ = తూర్పుది; అగు = ఐన; దిక్ = దిక్కు అనెడి; సతి = ఇల్లాలు; చంద్రునినన్ = చంద్రుడిని; తాల్చు = ధరించెడి; కైవడిన్ = విధముగ.
భావము:- అలా తనలో విష్ణుతేజం ప్రవేశించిన వసుదేవుడు, ఆ తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశపెట్టాడు. ఆ విష్ణుతేజస్సు సృష్టి అంతా నిండి ఉండేది. అన్నిటికి ఆత్మ అయినది. లోకాలను పునీతం చేయగలది. లోకాలు అన్నిటికి క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణువుని యొక్క తేజస్సు అది. ఆ తేజస్సు చక్కగా తనలో ప్రవేశించడంతో, దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పుదిక్కు అనే స్తీ చంద్రోదయానికి ముందు చంద్రునికాంతితో నిండిపోయినట్లు, దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది.”

తెభా-10.1-68-వ.
అనిన విని తర్వాతి వృత్తాంతం బెట్లయ్యె నని రా జడిగిన శుకుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; తర్వాతి = ఆ తరువాత జరిగిన; వృత్తాతంబున్ = విషయములు; ఎట్లు = ఏ విధముగ; అయ్యెన్ = జరిగినవి; అని = అన; రాజు = రాజు (పరీక్షిత్తు); అడిగినన్ = అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- అలా శుకముని చెప్పగా విన్న పరీక్షుత్తు కుతూహలంతో “ఆ తరువాత ఏమి జరిగింది.” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా చెప్పసాగాడు.

తెభా-10.1-69-క.
“గురుతరముగఁ దన కడుపునఁ
సిజగర్భాండభాండ యములు గల యా
రి దేవకి కడుపున భూ
ణార్ధము వృద్ధిఁబొందె బాలార్కు క్రియన్.

టీక:- గురుతరముగన్ = మిక్కిలి గొప్పగ {గురుతనము - గురుతరము - గురుతమము}; తన = తన యొక్క; కడుపునన్ = గర్భము నందు; సరసిజగర్భాండ = బ్రహ్మాండముల; భాండ = భాండముల; చయములు = అనేకములు; కల = కలిగి ఉన్న; ఆ = ఆ; హరి = విష్ణుమూర్తి; దేవకి = దేవకీదేవి; కడుపునన్ = గర్భము నందు; భూ = భూమిని; భరణ = సంరక్షణ; అర్థమున్ = కొరకు; వృద్ధిన్ = పెరుగుటను; పొందెన్ = పొందెను; బాల = లేత; అర్కు = సూర్యుని; క్రియన్ = వలె.
భావము:- ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయసూర్యునిలాగ వృద్ధిపొందాడు.

తెభా-10.1-70-వ.
అంత.
టీక:- అంత = అప్పుడు.
భావము:- అలా భగవదవతారాన్ని దేవకీదేవి గర్భంలో దాచుకున్న ఆ సమయంలో . .

తెభా-10.1-71-సీ.
విమతులమోములు వెలవెలఁ బాఱంగ-
విమలాస్యమోము వెల్వెలకఁ బాఱె;
లయు వైరులకీర్తి మాసి నల్లనగాఁగ-
నాతిచూచుకములు ల్లనయ్యె;
దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట-
లేమ యారున రోమలేఖ మెఱసె;
రి మానసముల కాహారవాంఛలు దప్ప-
నజాక్షి కాహారవాంఛ దప్పె;

తెభా-10.1-71.1-తే.
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర
డత వాటిల్లె శత్రులు డను పడఁగ;
న్ను రుచియయ్యెఁ బగతురు న్ను చొరఁగ;
వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁబొంద.

టీక:- విమతుల = కంస చాణూరాదుల {విమతులు - శత్రువులు, కంసాదులు}; మోములున్ = ముఖములు; వెలవెలబాఱంగ = కాంతివిహీనములుకాగ; విమలాస్య = స్త్రీ {విమలాస్య - తేటయైన అస్య (మోముగలామె), సుందరి}; మోము = ముఖము; వెల్వెలక = కాంతివిహీనత్వము; పాఱెన్ = పోయినది; మలయు = వ్యాపించుచున్న; వైరుల = శత్రువుల యొక్క; కీర్తి = యశస్సు; మాసి = కాంతిచెడి; నల్లనన్ = నల్లగా, నశించినది; కాగన్ = అయిపోగా; నాతి = స్త్రీ; చూచుకములు = స్తనాగ్రములు; నల్లనన్ = నల్లగా; అయ్యెన్ = అయినవి; దుష్ట = దుష్టుల యొక్క; ఆలయంబులన్ = ఆవాసములందు; ధూమ = పొగ; రేఖలు = చుట్టలు; పుట్టన్ = లేచుచుండగ; లేమ = స్త్రీ; ఆరునన్ = నూగారునందు; రోమ = వెంట్రుకల; లేఖ = వరుసలు; మెఱసెన్ = ప్రకాశించినవి; అరి = శత్రువుల యొక్క; మానసముల్ = మనసుల; కున్ = కు; ఆహారవాంఛలున్ = ఆకళ్ళు; తప్పన్ = లేకపోతుండగా; వనజాక్షి = స్త్రీ {వనజాక్షి - తామరలవంటి కన్నులుగలామె, స్త్రీ}; కిన్ = కి; ఆహార = తిన; వాంఛ = బుద్ధి; తప్పెన్ = కాకపోతుండెను.
శ్రమమున్ = బడలికలు; సంధిల్లెన్ = కలిగెను; రిపుల్ = శత్రువుల; కున్ = కు; శ్రమమున్ = బడలిక; కదురన్ = కలుగుతుండగ; జడత = బుద్ధిమాంధ్యము; వాటిల్లెన్ = సంభవించినది; శత్రులు = శత్రువులు; జడను = స్తబ్దత్వము; పడగన్ = కలుగగా; మన్ను = మట్టిపై; రుచి = ఇష్టము; అయ్యెన్ = కలిగెను; పగతురు = శత్రువులు; మన్ను = మట్టిలో; చొరగన్ = కలసిపోవుటకు; వెలది = స్త్రీ; ఉదరంబున్ = కడుపు; లోన్ = అందు; హరి = విష్ణుమూర్తి; వృద్ధిపొందెన్ = పెరిగెను.
భావము:- దేవకీదేవికి గర్భవతులైన స్తీలకు ఉండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖము తెల్లపడుతుండగా, దుర్మార్గుల ముఖాలు వెలవెలపోడం మొదలయింది. ఆమె చనుమొనలు నల్లపడుతుండగా, శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైంది. ఆమె పొత్తికడుపుపై నూగారు మెరుస్తుండగా, దుష్టుల ఇండ్లలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా, శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానివేసింది. ఆమెకు బద్ధకము కలుగుతూంటే, శత్రువులకు తెలియని అలసట మొదలైంది. శత్రువులు మట్టికరచే స్థితి వస్తూ ఉన్నట్లు, ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువ అయింది. ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధిచెందసాగాడు.

తెభా-10.1-72-వ.
మఱియును.
టీక:- మఱియునున్ = ఇంకను.
భావము:- ఇంకనూ. . .

తెభా-10.1-73-సీ.
లిల మా యెలనాఁగ ఠరార్భకునిఁ గానఁ-
నిన కైవడి ఘర్మలిల మొప్పె;
నొగిఁ దేజ మా యింతి యుదరడింభకు గొల్వఁ-
దిసిన క్రియ దేహకాంతి మెఱసెఁ;
వనుఁ డా కొమ్మ గర్భస్థుని సేవింప-
నొలసెనా మిక్కిలి యూర్పు లమరెఁ;
గుంభిని యా లేమ కుక్షిగు నర్చింపఁ-
జొచ్చుభంగిని మంటి చొరవ దనరె;

తెభా-10.1-73.1-ఆ.
గన మిందువదనడుపులో బాలు సే
లకు రూపు మెఱసి చ్చినట్లు
యలువంటి నడుము హుళ మయ్యెను; బంచ
భూతమయుఁడు లోనఁ బొదల సతికి.

టీక:- సలిలము = నీరు; ఆ = ఆ; ఎలనాగ = స్త్రీ {ఎలనాగ - యౌవనమున ఉన్నామె, పడతి}; జఠర = గర్భస్తుడైన; అర్భకునిన్ = పిల్లవానిని; కానన్ = దర్శించుకొనుటకై; చనిన = వెళ్ళిన; కైవడిన్ = విధముగ; ఘర్మ = చెమట; సలిలము = నీరు; ఒప్పెను = ఒప్పియున్నది; ఒగిన్ = క్రమముగ; తేజమున్ = తేజస్సు; ఆ = ఆ; ఇంతి = స్త్రీ; ఉదరడింభకున్ = కడుపులోని పిల్లవానిని; కొల్వ = సేవించుకొనుటకు; కదిసిన = చేరిన; క్రియన్ = విధముగ; దేహ = శరీరపు; కాంతి = ప్రకాశము; మెఱసెన్ = మెరుపులుపొందెను; పవనుడు = వాయువు; ఆ = ఆ; కొమ్మన్ = పడతి యొక్క; గర్భస్థుని = కడుపులో నున్నవాని; సేవింపన్ = కొలచుటకు; ఒలసెన్ = ప్రసరించేనా; ఆ = అన్నట్లుగ; మిక్కిలి = అధికముగ; ఉర్పులు = నిట్టూర్పులు; అమరెన్ = ఒప్పెను; కుంభిని = భూమి; ఆ = ఆ; లేమ = స్త్రీ; కుక్షిగున = కడుపులో నున్నవాని; అర్చింపన్ = సేవించుటకు; చొచ్చు = ప్రవేశించెడి; భంగినిన్ = విధముగ; మంటి = మన్నుతినుట యందు; చొరవ = ఆసక్తి; తనరె = అతిశయించెను.
గగనము = ఆకాశము; ఇందువదన = చంద్రముఖి; కడుపు = గర్భము; లోన్ = లోపల; బాలున్ = పిల్లవాని; సేవల్ = కొలచుటకి; కున్ = కు; రూపు = ఆకృతి; మెఱసెన్ = అతిశయించి; వచ్చిన = వచ్చిన; అట్లు = విధముగా; బయలు = ఆకాశము, అతిసన్ననైన; వంటి = వంటిదైన; నడుము = నడుము; బహుళ = లావెక్కినది; అయ్యెన్ = అయినది; పంచభూత = పంచమహాభూతములు; మయుడు = తానైనవాడు; లోనన్ = లోపల; పొదలన్ = వృద్ధిచెందగా; సతి = ఇల్లాలు; కిన్ = కు.
భావము:- పంచభూతాత్మకుడు అయిన విష్ణుమూర్తి దేవకి గర్భంలో పెరుగుతూ ఉండటంతో. పంచభూతాలలో జలములు ఆ గర్భస్థ బాలుడిని చూడడానికి వెళ్ళాయా అన్నట్లు, ఆమెకు చెమటలు పోయడం మొదలెట్టాయి; అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చినట్లు, ఆమె శరీరం కాంతితో మెరిసింది; ఆ గర్భస్తుడైన శిశువును వాయుదేవుడు సేవించబోయినట్లు, ఆమెకు నిట్టూర్పులు ఎక్కువ అయ్యాయి; భూమి ఆ కడుపులోని పిల్లాడిని పూజించడానికి వెళ్ళిందా అన్నట్లు, దేవకీదేవికి మన్నుపై ప్రీతి ఎక్కువైంది; గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి అకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు, కనుపించని ఆమె నడుము విశాలమైంది.

తెభా-10.1-74-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతరంబ = ఆ తరువాత.
భావము:- అటుపిమ్మట . . . .

తెభా-10.1-75-సీ.
తివకాంచీగుణం ల్లన బిగియంగ-
వైరివధూ గుణవ్రజము వదలె;
మెల్లన తన్వంగి మెయిదీవ మెఱుఁగెక్క-
దుష్టాంగనాతనుద్యుతు లడంగె;
నాతి కల్లన భూషములు పల్పలనగాఁ-
రసతీభూషణ పంక్తు లెడలె;
లకంఠి కొయ్యన ర్భంబు దొడ్డుగాఁ-
రిపంథిదారగర్భములు పగిలెఁ;

తెభా-10.1-75.1-తే.
బొలఁతి కల్లన నీళ్ళాడు ప్రొద్దు లెదుగ
హితవల్లభ లైదువలై తనర్చు
ప్రొద్దు లన్నియుఁ గ్రమమున బోవఁ దొడగెఁ;
నువిదకడుపున నసురారి యుంటఁజేసి.

టీక:- అతివ = స్త్రీ; కాంచీ = మొలనూలు; గుణంబున్ = పోగులు; అల్లన = క్రమముగా; బిగియంగన్ = బిగిసిపోతుండగా; వైరి = శత్రువుల; వధూ = భార్యల; గుణ = మంగళసూత్రముల; వ్రజమున్ = సమూహము; వదలెన్ = సడలినవి; మెల్లనన్ = క్రమముగా; తన్వంగి = సుందరి {తన్వంగి - సన్నని దేహము గలామె, స్త్రీ}; మెయి = దేహము అనెడి; తీవ = తీగ; మెఱుగెక్కన్ = మెరుపుపొందగా; దుష్ట = దుష్టుల యొక్క; అంగనా = భార్యల; తను = శరీరపు; ద్యుతులు = కాంతులు; అడంగెన్ = అణగిపోయెను; నాతి = స్త్రీ; కిన్ = కి; అల్లన = మెల్లగ; భూషణములున్ = ఆభరణములు; పల్పలన = విరళములు; కాన్ = కాగా; పర = శత్రుల; సతి = భార్యల; భూషణ = ఆభరణముల; పంక్తులు = పేర్లు, వరుసలు; ఎడలెన్ = వీడిపోయెను; కలకంఠి = స్త్రీ {కలకంఠి - కోయిలవంటి కంఠముగలామె, స్త్రీ}; కిన్ = కి; ఒయ్యనన్ = క్రమముగా; గర్భంబున్ = కడుపు; దొడ్డ = పెద్ది; కాన్ = అగుతుండగ; పరిపంథి = శత్రువుల; దార = భార్యల; గర్భములున్ = గర్భస్థపిండములు; పగిలెన్ = బద్దలైపోయినవి; పొలతి = సుందరి; కిన్ = కి; అల్లనన్ = క్రమముగ.
నీళ్ళాడు = ప్రసవపు; ప్రొద్దులు = దినములు; ఎదుగన్ = దగ్గరౌతుండగా; అహిత = పగవారి; వల్లభల = భార్యలు; ఐదువలు = పునిస్త్రీలు; ఐ = అయ్యి; తనర్చు = అతిశయించెడి; ప్రొద్దులు = దినములు; అన్నియున = అన్ని; క్రమమునన్ = వరుసగా; పోవ = గడచిపోవ; తొడగెన్ = సాగెను; ఉవిద = స్త్రీ; కడుపుననన్ = గర్భములో; అసురారి = విష్ణుమూర్తి {అసురారి - అసుర (రాక్షసులకు) అరి (శత్రువు), విష్ణువు}; ఉంటన్ = ఉండుటచేత; చేసి = వలన.
భావము:- దేవకీదేవి గర్బాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండడం చేత; ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగిసిపోతూ ఉంటే, శత్రువుల భార్యల మంగళ సూత్రాల త్రాళ్ళు జారిపోసాగాయి; తన శరీరకాంతి హెచ్చుతూ ఉండగా, పగవారి భార్యల శరీర కాంతులు మాసిపోసాగాయి; ఆమెకు ఆభరణాలు బరువు అనిపిస్తుండగా, శత్రుభార్యల కడుపులు జారిపోసాగాయి; ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్నకొద్దీ శత్రువుల భార్యలు ముత్తైదువలుగా ఉండే దినాలు తరిగిపోసాగాయి.

తెభా-10.1-76-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- ఈవిధంగా లోకాలన్నింటినీ కడుపులో దాచుకున్న విష్ణువును తన గర్భంలో ఇలా మోస్తూ. .

తెభా-10.1-77-ఆ.
జ్ఞానఖలునిలోని శారదయును బోలె
టములోని దీపళిక బోలె
భ్రాతయింట నాఁకఁ డియుండె దేవకీ
కాంత విశ్వగర్భర్భ యగుచు.

టీక:- జ్ఞానఖలుని = జ్ఞానరహితుని; లోని = అందలి; శారదయునున్ = చదువు; పోలెన్ = వలె; ఘటము = కుండ; లోని = లోపల ఉంచబడిన; దీప = దీపపు; కళిక = శిఖ; పోలెన్ = వలె; భ్రాత = సోదరుని; ఇంటన్ = నివాసమునందు; ఆకన్ = చెఱసాలలో; పడి ఉండెన్ = పడి ఉండెను; దేవకీకాంత = దేవకీదేవి; విశ్వగర్భ = విష్ణువు {విశ్వగర్భుడు - పద్నాలుగు లోకములు ఉదరమున కలవాడు, విష్ణువు}; గర్భ = గర్భమున కలామె; అగుచున్ = అగుచు.
భావము:- అజ్ఞాని నోట సరస్వతి వలె, కుండ లోపల పెట్టిన దీపకణికలాగ దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధించబడి ఉంది. అలా నిర్బంధంలో అణగిమణిగి ఉండిపొయింది.

తెభా-10.1-78-వ.
అంత న క్కాంతాతిలకంబు నెమ్మొగంబు తెలివియును, మేనిమెఱుంగును, మెలంగెడి సొబగునుం జూచి వెఱఁగుపడి తఱచు వెఱచుచుఁ గంసుండు తనలో నిట్లనియె.
టీక:- అంతన్ = అప్పుడు; ఆ = ఆ; కాంతా = స్త్రీలలో; తిలకంబున్ = శ్రేష్ఠురాలు; నెఱ = నిండైన; మొగంబున్ = ముఖము నందు; తెలివియునున్ = తేజస్సు; మేని = దేహపు; మెఱుంగును = కాంతి; మెలంగెడి = నడయాడుట యందలి; సొబగున్ = చందమును; చూచి = కనుగొని; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; తఱచున్ = అధికముగ; వెఱచుచున్ = బెదురుతూ; కంసుండు = కంసుడు; తన = అతని మనసు; లోన్ = లోపల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతకంతకూ అతిశయిస్తున్న ఆమె ముఖంలోని కాంతిని శరీరపు మెరుపునూ అందాన్ని చూసి కంసుడు నిశ్చేష్టుడు అవుతున్నాడు. అస్తమానూ భయపడుతూ తనలోతను ఇలా అనుకోసాగాడు.

తెభా-10.1-79-క.
"కన్నులకుఁ జూడ బరువై
యున్నది యెలనాఁగగర్భ ముల్లము గలగన్
ము న్నెన్నఁడు నిట్లుండదు
వెన్నుఁడు చొరఁ బోలు గర్భవివరములోనన్.

టీక:- కన్నులన్ = కళ్ళతో; చూడన్ = చూచుటకు; బరువు = భారముగ ఉన్నది; ఐ = అయ్యి; ఉన్నది = ఉన్నది; ఎలనాగ = స్త్రీ యొక్క; గర్భమున్ = గర్భము; ఉల్లము = మనసు; కలగన్ = కలత చెందునట్లుగ; మున్ను = ఇంతకు పూర్వము; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; ఇట్లు = ఈ విధముగ; ఉండదు = లేదు; వెన్నుడు = విష్ణువు; చొరన్ = ప్రవేశించుటచేత; పోలున్ = కాబోలు; గర్భవివరము = గర్భాశయము; లోనన్ = లోపల.
భావము:- “ఈమె గర్భం చూస్తూ ఉంటే, నా గుండె బరువెక్కుతోంది. మనస్సు కలవరపడుతోంది. ఇంతకు ముందు ఏ గర్భాన్ని చూసినా ఇలా అవ్వ లేదు. ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉండవచ్చు.

తెభా-10.1-80-ఉ.
మి దలంచువాఁడ? నిఁక నెయ్యది కార్యము? నాఁడునాఁటికిం
గామిని చూలు పెంపెసఁగె; ర్భిణిఁ జెల్లెలి నాఁడు పేద నే
నేని చంపువాడఁ? దగ వేలని చంపితినేని శ్రీయు ను
ద్దాయశంబు నాయువును ర్మమునుం జెడిపోవ కుండునే?

టీక:- ఏమి = ఎట్టి; తలచువాడను = ఆలోచనచేయను; ఇక = ఇకపైన; ఎయ్యది = ఏది; కార్యము = చేయదగినపని; నాడునాటికిన్ = నానాటికి; కామిని = పడతి {కామిని -కామము కలామె, స్త్రీ}; చూలు = గర్భము; పెంపెసగెన్ = మిక్కిలి వృద్ధిచెందినది; గర్భిణిన్ = కడుపుతో ఉన్నామెను; చెల్లెలిన్ = చిన్నసోదరిని; ఆడుపేదన్ = పాపం ఆడపిల్లని; నేన్ = నేను; ఏమి = ఎందుకు; అని = అని; చంపువాడన్ = సంహరించను; తగవు = గొడవ; ఏలన్ = ఎందుకని; చంపితిని = వధించితిని; ఏని = ఐనచో; శ్రీయును = ఐశ్వర్యము; ఉద్దామ = గొప్ప; యశంబున్ = కీర్తి; ఆయువున్ = ఆయుష్షు; ధర్మమునున్ = ధర్మములు; చెడిపోవకన్ = క్షీణించకుండగ; ఉండునే = ఉండునా, ఉండవు.
భావము:- ఇప్పుడు నేనేమి మంత్రాంగం ఆలోచించాలి? ఏమి తంత్రం చేయాలి? రోజురోజుకీ ఈమె గర్భం కాంతిమంతం అవుతూ ఉంది? ఇటు చూస్తే ఈమె ఆడకూతురు గర్భవతి చెల్లెలూ కదా ఎట్లా చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చంపానంటే, నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నాశనమైపోవా?

తెభా-10.1-81-క.
వావి యెఱుంగని క్రూరుని
జీన్మృతుఁ డనుచు నిందఁ జేయుదు; రతడుం
బోవును నరకమునకు; దు
ర్భాముతో బ్రదుకు టొక్క బ్రదుకే తలఁపన్?"

టీక:- వావి = బంధుత్వపు వరుసను; ఎఱుంగని = తెలిసికొన లేని; క్రూరుని = కఠినుని; జీవన్మృతుడు = ప్రాణమున్న శవము; అనుచున్ = అని; నింద = దూషణలు (లోకులు); చేయుదురు = చేసెదరు; అతడున్ = అతను కూడ; పోవును = పోవును; నరకమున్ = నరక లోకమున; కున్ = కు; దుర్భావము = చెడ్డవాడు అనిపించుకొనుట; తోన్ = తోటి; బ్రతుకుట = జీవించుట; ఒక్క = అదికూడ ఒక; బ్రదుకే = జీవితమా, కాదు; తలపన్ = తరచి చూసినచో.
భావము:- “వావివరుసలు చూడని క్రూరుడు బ్రతికి ఉన్నా చచ్చిన వాడే” అని నిందిస్తారు లోకులు అలాంటి వాడు నరకానికి పోతాడు. దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా?”

తెభా-10.1-82-వ.
అని నిశ్చయించి క్రౌర్యంబు విడిచి, ధైర్యంబు నొంది, గాంభీర్యంబు వాటించి, శౌర్యంబు ప్రకటించుకొనుచు, దిగ్గనం జెలియలిం జంపు నగ్గలిక యెగ్గని యుగ్గడించి మాని, మౌనియుం బోలెనూర కుండియు.
టీక:- అని = అని; నిశ్చయించుకొని = నిర్ణయించుకొని; క్రౌర్యంబున్ = క్రూరత్వమును; విడిచి = విడనాడి; ధైర్యంబున్ = ధైర్యమును; ఒంది = తెచ్చుకొని; గాంభీర్యంబున్ = గాంభీర్యమును; పాటించి = వహించి; శౌర్యంబున్ = పరాక్రమమును; ప్రకటించుకొనుచు = చూపుతూ; దిగ్గనన్ = చటుక్కున; చెలియలిన్ = చెల్లెలిని; చంపున్ = వధించెడి; అగ్గలిక = పూనిక; ఎగ్గు = కీడు; అని = అని; ఉగ్గడించి = గట్టిగా చెప్పుకొని; మాని = విడిచిపెట్టి; మౌనియున్ = మౌనవ్రతధారి; పోలెన్ = వలె; ఊరకుండియు = ఊరుకొన్నప్పటికి;
భావము:- ఇలా అని ఆలోచించి నిశ్చయించుకుని, క్రౌర్యం మాని, ధైర్యం తెచ్చుకొనిస గాంభీర్యం పైపైన పులుముకుని, శూరునిలా ప్రవర్తించాడు. “చెల్లెలిని చంపడం మహా పాపం” అని గట్టిగా భావించాడు. ఆతర్వాత ఏమీ మాట్లాడకుండా మౌనిలాగ శాంతస్వభావం ప్రకటిస్తూ ఉండిపోయాడు.

తెభా-10.1-83-ఆ.
పాపరాని దొడ్డ గపుట్టె నిక నెట్టు
లిందుముఖికిఁ జక్రి యెపుడు పుట్టుఁ?
బుట్టినపుడె పట్టి పురిటింటిలోఁ దెగఁ
జూతు ననుచు నెదురుచూచుచుండె.

టీక:- పాపరాని = అణచుకోలేని; దొడ్డ = పెద్ద; పగన్ = పగ; పుట్టెన్ = జనించినది; ఇక = ఇకపైన; ఎట్టుల = ఎలా; ఇందుముఖి = సౌందర్యవతి {ఇందుముఖి - చంద్రుని వంటిమోము గలామె, స్త్రీ}; చక్రి = మహావిష్ణువు; ఎపుడు = ఎప్పుడు; పుట్టున్ = ప్రసవించును; పుట్టినప్పుడె = ప్రసవించగానె; పట్టి = పట్టుకొని; పురిటింటి = ప్రసవము జరిపెడి గది; లోన్ = అందే; తెగజూతున్ = వధించెదను; అనుచున్ = అంటూ; ఎదురుచూచుచుండె = ఎదురుచూస్తుండెను;
భావము:- అయినా లోలోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు. “తప్పించుకోలే నంతటి గొప్ప శత్రుత్వం పుట్టుకు వచ్చింది. ఇంకెలాగ? ఈమెకు విష్ణువు ఎప్పుడు పుడతాడో? ఏమిటో? పుట్టగానే పురిటింట్లోనే వాడిని పట్టుకుని చంపేస్తాను.” అంటూ దేవకి ప్రసవించే సమయంకోసం ఎదురుచూడసాగాడు.

తెభా-10.1-84-వ.
మఱియు వైరానుబంధంబున నన్యానుసంధానంబు మఱచి యతండు.
టీక:- మఱియున్ = ఇంకను; వైర = శత్రుత్వపు; అనుబంధము = బంధుత్వముతో; అన్య = ఇతరమైన; అనుసంధానమున్ = దృష్టిపెట్టుట; మఱచి = చేయలేకుండగ; అతండు = అతను.
భావము:- విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా, కంసుడు విష్ణువు తప్ప ఇతర విషయాలు సమస్తం మరచిపోయాడు.

తెభా-10.1-85-క.
తిరుగుచుఁ గుడుచుచుఁ ద్రావుచు
రుగుచుఁ గూర్చుండి లేచు నవరతంబున్
రిఁ దలఁచితలఁచి జగ మా
రిమయ మని చూచెఁ గంసుఁ డాఱని యలుకన్.

టీక:- తిరుగుచున్ = ప్రవర్తిల్లుచు; కుడుచుచున్ = తింటు; త్రావుచున్ = తాగుతూ; అరుగున్ = నడచుచు; కూర్చుండి = ఆసీనుడు అయ్యి; లేచుచు = పైకి లేస్తూ; అనవరతంబున్ = ఎల్లప్పుడు; హరిన్ = విష్ణుమూర్తిని; తలచితలచి = మిక్కిలి మననము చేసి; జగము = భువనమంతా; హరి = విష్ణు; మయము = నిండినది; అని = అని; చూచెన్ = భావించసాగెను; కంసుడు = కంసుడ; ఆఱని = ఉపశమింపని; అలుకన్ = పగతో.
భావము:- తిరుగుతున్నా, భోజనంచేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా, ఎప్పుడూ విష్ణువునే స్మరించసాగాడు. క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమయంగానే దర్శించసాగాడు.

తెభా-10.1-86-వ.
వెండియు.
టీక:- వెండియున్ = ఇంకను.
భావము:- ఇంకా కంసుడి పరిస్థితి ఎలా ఉంది అంటే. .

తెభా-10.1-87-సీ.
శ్రవణరంధ్రముల నే బ్దంబు వినఁబడు-
ది హరిరవ మని యాలకించు;
క్షిమార్గమున నెయ్యది చూడఁబడు నది-
రిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ;
దిరుగుచో దేహంబు తృణమైన సోఁకిన-
రికరాఘాతమో నుచుఁ నులుకు;
గంధంబు లేమైన ఘ్రాణంబు సోఁకిన-
రిమాలికాగంధ నుచు నదరుఁ;

తెభా-10.1-87.1-తే.
లుకు లెవ్వియైనఁ లుకుచో హరిపేరు
లుకఁబడియె ననుచు బ్రమసి పలుకుఁ;
లఁపు లెట్టివైనఁ లఁచి యా తలఁపులు
రితలంపు లనుచు లుఁగఁ దలఁచు.

టీక:- శ్రవణ = చెవుల; రంధ్రములన్ = కన్నములందు; ఏ = ఏ విధమైన; శబ్దంబున్ = చప్పుడు; వినబడున్ = వినబడినను; అది = అది; హరి = విష్ణువు యొక్క; రవము = పలుకు; అని = అని; ఆలకించున్ = వినును; అక్షి = కంటికి; మార్గమునన్ = ఎదురుగా; ఎయ్యది = ఏదైతే; చూడబడున్ = కనబడుతుందో; అది = దానిని; హరి = విష్ణువు యొక్క; మూర్తి = స్వరూపము; కానోపున్ = అయ్యుండవచ్చును; అంచున్ = అనుచు; చూచున్ = అనుకొనును; తిరుగుచోన్ = నడయాడెడి యప్పుడు; దేహంబున్ = శరీరమును; తృణము = గడ్డిపరక; ఐనన్ = అయినను; సోకినన్ = తగిలినచో; హరి = విష్ణువు యొక్క; కర = చేతి; ఘాతము = దెబ్బేమో; అనుచున్ = అనుచు; ఉలుకున్ = ఉలికిపడును; గంధంబులు = వాసనలు; ఏమైనన్ = ఏవైనసరే; ఘ్రాణంబున్ = ముక్కుకు; సోకినన్ = తగిలినచో; హరి = విష్ణువు యొక్క; మాలికా = పూలహారముల; గంధము = వాసనలు; అనుచున్ = అనుచు; అదరున్ = ఉలికిపడును; పలుకులు = మాటలు; ఎవ్వియైనన్ = ఏవైనాసరే; పలుకుచోన్ = మాట్లాడినచో.
హరి = విష్ణువు యొక్క; పేరు = నామము; పలుకబడియెన్ = ఉచ్చరించిరి; అనుచున్ = అనుచు; భ్రమసి = భ్రమపడి; పలుకున్ = మాటలనుచుండును; తలపులు = ఆలోచనలు; ఎట్టివి = ఎలాంటివి; ఐనన్ = అయినప్పటికి; తలచి = తలచుకొని; ఆ = ఆ; తలపులు = ఆలోచనలు; హరి = విష్ణువు యొక్క; తలంపులు = ఆలోచనలు; అనుచున్ = అనుచు; అలగన్ = కోపగించవలెనని; తలచు = అనుకొనును.
భావము:- చెవులకు ఏ శబ్దం వినబడినా అది విష్ణువు మాటేనని వింటూ ఉన్నాడు. కనులకి ఏది కనిపించినా అది విష్ణుదేవుడి రూపమేనని చూస్తున్నాడు. శరీరానికి గడ్డిపరక తగిలినా విష్ణుని చేయి తగిలిందేమోనని ఉలుక్కిపడుతూ ఉన్నాడు. ముక్కుకు ఏవాసన సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమోనని అదిరిపడుతున్నాడు. తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమోనని భ్రమపడి విష్ణువు పేరే పలుకుతున్నాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు.