తెభా-10.1-226-క.
నిబ్బరపు దప్పి మంటలు
ప్రబ్బిన, ధృతి లేక, నేత్ర ద హస్తంబుల్
గొబ్బున వివృతములుగ, నా
గుబ్బనుచున్నట్టి కూఁతఁ గూలెన్ నేలన్.

టీక:- నిబ్బరపు = అధికమైన; దప్పిన్ = దాహముతో; మంటలు = మండిపోవుటలు; ప్రబ్బినన్ = వ్యాపించగా; ధృతి =ధైర్యము; లేక = తప్పి; నేత్ర = కళ్ళు; పద = కాళ్ళు; హస్తంబుల్ = చేతులు; గొబ్బునన్ = శీఘ్రముగా; వివృతములుగన్ = విస్తారమైనట్టి; ఆ = ఆ; గుబ్బు = గుబ్బు (కూలుట యందలి ధ్వన్యనుకరణ); అనుచున్నట్టి = అనెడి; కూతన్ = శబ్దముతో; కూలెన్ = పడిపోయెను; నేలన్ = నేలమీద.
భావము:- పూతనకు భయంకరమైన మంటలు లోపలి నుంచి చెలరేగాయి. కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయి నేలమీద పడిపోయింది. కను గుడ్లు వెళ్ళుకొచ్చాయి. పెద్ద ఆర్తనాదంతో కూలి చచ్చిపోయింది.

తెభా-10.1-227-మ.
రెం గొండలతోడ భూమి; గ్రహతారానీకముల్ మింటిపై
బెరెన్; దిక్కుల మాఱు మ్రోత లెసఁగెన్; భీతిల్లి లోకంబులుం
లం బాఱెను; వజ్రభిన్నగిరిరేఖం బూర్వదేహంబుతోఁ
ద్రిశధ్వంసిని గూలి, కుయ్యిడిన దద్దీర్ఘోరు ఘోషంబునన్.

టీక:- అదరెన్ = కంపించెను; కొండల = గిరుల; తోడన్ = తోపాటు; భూమి = నేల; గ్రహ = గ్రహములు; తార = నక్షత్రముల; అనీకముల్ = సమూహములు; మింటి = ఆకాశము; పైన్ = మీద; బెదరెన్ = భయబడినవి; దిక్కుల = నల్దిక్కు లందు; మాఱుమ్రోతలు = ప్రతిధ్వనులు; ఎగసెన్ = లేచినవి; భీతిల్లి = భయపడిపోయి; లోకంబులున్ = ముల్లోకముల జీవులు; కదలంబాఱెను = కలతచెందెను; వజ్ర = వజ్రాయుధముచేత; భిన్న = నరకబడిన; గిరి = పర్వతము; రేఖన్ = వలె; పూర్వదేహంబు = ఎప్పటి రూపు; తోన్ = తోటి; త్రిదశ = దేవతలను; ధ్వంసిని = హింసించెడి ఆమె; కూలి = పడిపోయి; కుయ్యిడినన్ = కుయ్యో మనగా; తత్ = ఆ యొక్క; దీర్ఘ = పెద్దదైన; ఉరు = గట్టి; ఘోషంబునన్ = అరుపుతో.
భావము:- ఆ రాక్షసికి చావు దగ్గర పడటంతో, తన భయంకర రూపం వచ్చేసింది. పెద్ద గావుకేక పెట్టి, ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు కూలిన కొండలా పెద్ద దేహంతో దభాలున నేల కూలింది. అతి భీకరమైన ఆ ధ్వనికి దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. పర్వతాలతో పాటు భూమి అదిరింది. ఆకాశంలో గ్రహాలు, తారలు కదిలి పోయాయి. లోకాలు అన్ని బెదరి చెదరి పోయాయి.

తెభా-10.1-228-క.
ప్పుడు దెప్పరమగు నా
ప్పుడు హృదయములఁ జొచ్చి, సందడి పెట్టన్,
ముప్పిరిఁగొని పడి; రెఱుకలు
ప్పి ధరన్, గొల్ల లెల్లఁ ల్లడపడుచున్

టీక:- అప్పుడు = ఆ సమయము నందు; తెప్పరము = దుస్సహమైనది; అగు = ఐన; ఆ = ఆ; చప్పుడు = శబ్దము; హృదయములన = గుండెలలో; చొచ్చి = దూరి; సందడి = సంకట; పెట్టన్ = పెడుతుండగా; ముప్పిరిగొని = ఉక్కిరిబిక్కిరి; పడిరి = ఐపోయిరి; ఎఱుకలు = దేహస్మృతులు; తప్పి = తప్పిపోయి; ధరన్ = నేలమీద; గొల్లలు = గోపకులు; ఎల్లన్ = అందరును; తల్లడపడుచున్ = తత్తరపడుతు.
భావము:- భయంకరమైన ఆ శబ్దం గోపకుల హృదయాలలో దూరి అలజడి రేపింది. వారు అందరు భయంతో బెంబేలుపడి, మెలికలు తిరుగుతూ, స్పృహతప్పి పడిపోయారు.

తెభా-10.1-229-క.
ఱభిరండ రక్కసి
నైశరీరంబు నేల లియంబడినన్
యోనమున్నర మేర ధ
రాజంబులు నుగ్గులయ్యె, రాజవరేణ్యా!

టీక:- ఆ = ఆ; జఱభి = దుష్టురాలు(తిట్టు); రండ = కుంకముండ (తిట్టు); రక్కసి = రాక్షసి; నైజ = తన సహజమైన; శరీరంబున్ = దేహముతో; నేలన్ = భూమి; నలియన్ = నలిగిపోవునట్లుగా; పడినన్ = పడిపోగా; యోజనమున్నర = ఒకటిన్నర యోజనముల; మేరన్ = వరకు; ధరాజంబులు = చెట్లు {ధరాజము - ధర (నేల)ను జము (పుట్టినది), చెట్టు}; నుగ్గులు = చూర్ణములైనవి; అయ్యెన్ = అయినవి; రాజవరేణ్య = మహారాజ.
భావము:- పరీక్షిన్మహారాజా! క్రూరురాలు, నీచురాలు ఐన ఆ రక్కసి తన అసలు దేహంతో నేలమీద పడిపోవడంతో, ఒకటిన్నర ఆమడల (12 లేదా 14 కిమీ) పరిధిలోని చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయిపోయాయి. (యోజనం / ఆమడ అంటే 8 నుండి 9 కిమీలకు సమానం)

తెభా-10.1-230-సీ.
దారుణ లాంగలదండ దంతంబులు-
గ గహ్వరముఁ బోలు నాసికయును,
గండశైలాకృతి ల కుచయుగమును-
విరిసి తూలెడు పల్లవెండ్రుకలును,
జీఁకటినూతులఁ జెనయు నేత్రంబులుఁ-
బెనుదిబ్బఁ బోలెడి పెద్ద పిఱుఁదుఁ,
జాఁగుకట్టలఁ బోలు రణోరుహస్తంబు-
లింకినమడువుతో నెనయు కడుపుఁ,

తెభా-10.1-230.1-తే.
లిగి షట్క్రోశ దీర్ఘమై దిసి చూడ,
యదమగు దాని ఘనకళేరముఁ జూచి,
గోపగోపీజనంబులు గుంపుగూడి,
బెగడుచుండిరి మనముల బెదరు గదిరి.

టీక:- దారుణ = భయంకరమైన; లాంగలదండ = నాగలిదండము, నాగలిమేడి; దంతంబులున్ = పళ్ళు; నగ = కొండ; గహ్వరమున్ = గుహ; పోలు = వంటి; నాసికయును = ముక్కు; గండశైల = గండ్రాళ్ళ; ఆకృతి = వంటిరూపు; కల = కలిగిన; కుచ = స్తనముల; యుగమును = జంట; విరిసి = విరబోసుకొని; తూలెడు = చలించెడి; పల్ల = కావిరంగు; వెంట్రుకలును = శిరోజములు; చీకటి = అంధకారమయమైన; నూతులన్ = బావుల; చెనయు = వంటి; నేత్రంబులున్ = కళ్ళు; పెను = పెద్ద; దిబ్బన్ = మట్టిదిబ్బలను; పోలెడి = వంటి; పెద్ద = పెద్దపెద్ద; పిఱుదున్ = పిఱ్ఱలు; చాగు = దీర్ఘమైన; కట్టలున్ = కట్టెలు; పోలు = వంటి; చరణ = కాళ్ళు; ఊరు = తొడలు; హస్తంబులు = చేతులు; ఇంకిన = ఎండిపోయిన; మడువు = చెరువు; తోన్ = తోటి; ఎనయు = పోలెడి; కడుపున = పొట్ట; కలిగి = ఉండి.
షట్ = ఆరు (6); క్రోశ = కోసుల; దీర్ఘము = పొడవుకలది; ఐ = అయ్యి; కదిసి = దగ్గరకు వెళ్ళి; చూడన్ = చూచుటకు; భయదము = భీకరము; అగు = అయిన; దాని = ఆమె యొక్క; ఘన = పెద్ద; కళేబరమున్ = ప్రాణములేని కట్టెను; చూచి = కనుగొని; గోప = గోపకులు; గోపీ = గోపికలైన; జనంబులు = వారు; గుంపుగూడి = గుంపులుకట్టి; బెగడుచుండిరి = వెరచుచుండిరి; మనములన్ = మనసులందు; బెదురు = భయము; కదిరి = కలిగి.
భావము:- ఆ రాక్షసి కోరలు నాగలిమేడి అంత ఉన్నాయి. ముక్కు రంధ్రాలు కొండ గుహలలా ఉన్నాయి. స్తనాలు రెండు కొండరాళ్ళ లాగ ఉన్నాయి. ఎఱ్ఱని వెంట్రుకలు గాలికి ఎగురుతున్నాయి. కళ్ళు చీకటి నూతులు కన్న లోతుగా ఉన్నాయి. విశాలమైన పిరుదులు పెద్ద దిబ్బలని పోలి ఉన్నాయి. కాళ్ళు చేతులు పొడుగైన కాలువ కరకట్టలు వలె ఉన్నాయి. కడుపు ఇంకిపోయిన చెరువులా ఉంది. ఆరు క్రోసుల (3.6X6 కిమీ) పొడవైన దాని భయంకరమైన పెద్ద దేహాన్ని గొల్ల స్త్రీలు గొల్ల పురుషులు గుంపులుగా చూసి మనసులో బెదురు పుట్టి, కళవళ పడుతున్నారు.

తెభా-10.1-231-వ.
ఇ వ్విధంబునన్.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- ఇలా

తెభా-10.1-232-క.
ఱిఁ గుడువఁగ నడచెన్,
నూనఫుల్లాబ్జలోచనుఁడు, హరి మృత్యు
ద్యోనఁ గృతముని సముదయ
యానఁ, బూతన నెఱింగి యాతనలీలన్.

టీక:- ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; కుడువగన్ = చనుబాలు తాగుట ద్వారా; అడచెను = అణచివేసెను; నూతనఫుల్లాబ్జలోచనుడు = బాలకృష్ణుడు {నూతన ఫుల్లాబ్జ లోచనుడు - కొత్తగా విరిసిన పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; హరి = బాలకృష్ణుడు {హరి - భక్తుల పాపములను హరించువాడు, విష్ణువు}; మృత్యు = మరణమును; ద్యోతనన్ = కనిపింపజేయు ఆమెను; కృత = కలిగించిన; ముని = ఋషుల యొక్క; సముదయ = సమూహములకు; యాతనన్ = కష్టపెట్టెడి ఆమె; పూతనన్ = పూతనను; ఎఱింగి = తెలిసికొని; ఆ = అటువంటి; తన = తన యొక్క; లీలన్ = లీలాకృత్యముతో.
భావము:- ఈ విధంగా, అప్పుడే విరిసిన పద్మాల వంటి కన్నులున్న కృష్ణుడు, చనుబాలు తాగే నెపంతో పూతనను అవలీలగా సంహరించాడు. మరి ఆ రక్కసి మృత్యువులాగా పసిపిల్లలని చంపేది, మునులను బాధ పెట్టేది, యాతనలపాలు చేసేది కదా.

తెభా-10.1-233-క.
విధరరిపు గమనునికిని
విగళ సఖునికిని, విమల విష శయనునికిన్,
విభవభవ జనకునికిని,
వికుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్?

టీక:- విషధర రిపు = గరుత్మంతునిపై {విషధర రిపుడు - విషధర (సర్పములకు) రిపుడు (శత్రువు), గరుత్మంతుడు}; గమనుని = విహరించువాని; కిని = కి; విషగళ = పరమశివుని {విషగళుడు - విషమును కంఠమున ధరించినవాడు, శంకరుడు}; సఖుని = స్నేహితుని; కిని = కి; విమల = నిర్మలమైన; విషశయనుని = శేషశాయి {విషశయనుడు - విష (జలము)పై శయనుడు, విష్ణువు}; కిన్ = కి; విషభవభవ = బ్రహ్మదేవుని {విషభవభవుడు - విష (నీటియందు) భవ (పుట్టెడిది) యైన పద్మమున భవ (పుట్టినవాడు), బ్రహ్మ}; జనకుని = తండ్రి; కిని = కి; విష = విషము పూసిన; కుచ = స్తనముల; చను =వెలువడు; విషమున్ = విషమును; కొనుట = తీసుకొనుట; విషమే = కష్టమా, కాదు; తలపన్ = తరచిచూసినచో.
భావము:- విషము కోరలలో ధరించే నాగులను చీల్చెడి గరుత్మంతుడు వాహనంగా కలవాడు, కంఠమున విషము ధరించెడి శంకరుని మిత్రుడు, ప్రళయకాలమున విషము (జలము)పై శయనించు నిర్మలమైన వాడు, విషము (నీటి) యందు పుట్టెడి పద్మము నందు జనించిన వాడైన బ్రహ్మదేవునికి తండ్రియైన వాడు అయినట్టి సాక్షాత్తు మహావిష్ణువు యైన ఈ బాలుడికి విషము చిమ్మే చన్నులతో తిరిగే ఒక రాకాసి విషం లాగివేయటం విషమ (పెద్ద కష్ట)మైన పనా, కానేకాదు.

తెభా-10.1-234-వ.
అంత నా గోపగోపీజనంబులు దెలిసి, రోహిణీయశోదలం గూడుకొని, బెగ్గడిలక డగ్గఱి.
టీక:- అంతన్ = అప్పుడు; ఆ = ఆ; గోప = గోపకులు; గోపీ = గోపికలైన; జనంబులు = వారు; తెలిసి = తెలిసికొని; రోహిణీ = రోహిణీదేవి; యశోదలన్ = యశోదాదేవిలను; కూడుకొని = తోపాటు; బెగ్గడిలక = వెరవకుండగ; డగ్గఱి = దగ్గరకువెళ్ళి.
భావము:- ఇంతలో ఆ విషయం ఆ గొల్లవాళ్ల లోని స్త్రీ పురుషులకు అందరికి తెలిసింది. యశోదా రోహిణిలతో కలిసి వచ్చి బెదరిపోకుండా దగ్గరకి వచ్చి. . .

తెభా-10.1-235-శా.
నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతిఁ గ్రీడింప, "నో!
బాలా! ర"మ్మని మూపుఁ జేర్చుకొని, సంస్పర్శించి, యూరార్చుచున్
గోలాంగూలముఁ ద్రిప్పి, గోవురజమున్ గోమూత్రముం జల్లి, త
ద్బాలాంగంబుల గోమయం బలఁది; రా పండ్రెండు నామంబులన్.

టీక:- నేలన్ = భూమిపైన; కూలిన = పడిపోయిన; దాని = ఆమె యొక్క; పెన్ను = బాగ పెద్ద; ఉరము = వక్షస్థలము; పైన్ = మీద; నిర్భీతిన్ = భయము లేకుండగ; క్రీడింపన్ = ఆడుకొంటుండగా; ఓ = ఓయీ; బాలా = పిల్లవాడా; రమ్ము = రా; అని = అని; మూపున్ = భుజముపై; చేర్చుకొని = ఎత్తుకొని; సంస్పర్శించి = ఒడలు నిమిరి; ఊరార్చుచున్ = ఊరడించుచు; గో = ఆవు యొక్క; లాంగూలమున్ = తోకను; త్రిప్పి = దిగదుడిచి; గోవు = ఆవు యొక్క; రజమున్ = కాలి దుమ్మును; గో = ఆవు యొక్క; మూత్రమున్ = పంచితము (ఉచ్చ); చల్లి = చిలకరించి; తత్ = ఆ; బాల = పిల్లవాని; అంగంబులన్ = ద్వాదశావయవములకు (12) {ద్వాదశావయవములు - 1నుదురు 2మెడ 3రొమ్ము 4బొడ్డు 5-6మూపులు 7-8మోచేతులకీళ్ళు 9-10మణికట్టులు 11-12మోకాళ్ళు}; గో = ఆవు యొక్క; మయంబున్ = పేడను; అలదిరి = రాసిరి; ఆ = ఆ; పండ్రెండు = ద్వాదశ (12); నామంబులన్ = కేశవనామములు.
భావము:- చచ్చి పడి ఉన్న ఆ రాకాసి విశాలమైన వక్షస్థలం మీద చిన్నికృష్ణుడు నిర్భయంగా ఆడుకుంటున్నాడు. రమ్మని పిలిచి ఎత్తుకున్నారు ఒళ్ళు నిమురుతూ ఓదార్చారు. పీడ వదలిపోడానికి ఆవుతోక పిల్లవాడి చుట్టు తిప్పి దిష్టి తీశారు. గోధూళిని, గోమూత్రాన్ని బాలుని మీద చల్లారు. పన్నెండు నామాలతో పన్నెండు అవయవాలు లోను గోమయము (ఆవుపేడ) పట్టించారు.

తెభా-10.1-236-వ.
మఱియు నంతటం దనియక, గోపిక లాచమనంబు జేసి దక్షులై, మునుపుగాఁ దమకు రక్షాకరంబగు బీజన్యాసంబు సేసికొని, "చిన్నియన్న! నీ యడుగు లజుండును, జానువు లనిలుండును, దొడలు యజ్ఞుండును, గటితలం బచ్యుతుండును, గడుపు హయాస్యుండును, హృదయంబు గేశవుండును, నురము నీశుండును, గంఠంబు నినుండును, భుజంబుల జతుర్భుజుండును, ముఖంబు త్రివిక్రముండును, శిరం బీశ్వరుండును రక్షింతురు; ముందు చక్రియు, వెనుక గదాధరుండైన హరియుఁ, బార్శ్వంబుల ధనుర్ధరుండైన మధువైరియు, నసిధరుండగు నజనుండును, గోణంబుల శంఖచక్ర గదాధరుండైన యురుగాయుండును, మీఁదు నుపేంద్రుడును, గ్రిందు దార్క్ష్యుండు, నంతటను హలధరుండగు పురుషుండును, గాతురు; నీ యింద్రియంబుల హృషీకేశుండును, బ్రాణంబుల నారాయణుండును, జిత్తంబు శ్వేతద్వీపపతియును, మనంబును యోగీశ్వరుండైన కపిలుండును, బుద్ధిని బృశ్నిగర్భుండు, నహంకారంబున భగవంతుండైన పరుండును బాలనంబు సేయుదురు; నీవు క్రీడించునెడ గోవిందుండును, శయనించు తఱి మాధవుండును, నడచువేళ వైకుంఠుండును, గూర్చున్న సమయంబున శ్రీపతియును, గుడుచు కాలంబున సర్వభక్షకుం డయిన యజ్ఞభుజుండు నేమఱకుండుదురు; నిన్నుఁ బేర్కొనిన దుస్వప్న వృద్ధబాలగ్రహంబులును, గూశ్మాండ, డాకినీ, యాతుధానులును, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచ వినాయకులును, గోటరాదులును, జ్యేష్ఠాది భూతనాథులును, మాతృకాదిగణంబులు నశియింతురు; నీ యందుఁ బ్రాణేంద్రియ శరీరనిరోధంబు లైన యున్మాదంబులు, నపస్మారంబులును, మహోత్పాతంబులును బొందకుండుం గావుత!"యని రక్షచేసి దీవించి; రంత.
టీక:- మఱియున్ = ఇంకను; అంతటన్ = వానితో; తనియకన్ = తనివితీరక; గోపికలు = గొల్లస్త్రీలు; ఆచమనంబు = కేశవాది నామములు జపించి పుడిసిలి(అరచేతి)తో నీరు తీసుకొని; చేసి = చేసి; దక్షులు = అర్హత కలవారు; ఐ = అయ్యి; మునుపుగాన్ = ముందుగా; తమ = వారి, స్వంతమునకు; కున్ = కి; రక్షాకరంబు = రక్షణ కలిగించునవి; అగు = ఐన; బీజన్యాసంబున్ = బీజన్యాసమును {బీజన్యాసముచేయుట - ప్రణవాదిగా ద్వాదశాక్షరి (ఓంనమో భగవతే వాసుదేవాయః) జపము అంగన్యాస పూర్తిగా (లలాటాది స్థానములను తాకుట కలదిగా) ఆచరించుట}; చేసికొని = చేసికొని; చిన్ని = చంటి; అన్న = తండ్రి; నీ = నీ యొక్క; అడుగులన్ = అడుగుల యందు; అజుండును = బ్రహ్మదేవుడు; జానువులన్ = మోకాళ్ళను; అనిలుండును = వాయుదేవుడును; తొడలన్ = తొడలను; యజ్ఞుండును = యజ్ఞమూర్తి ఐన అగ్ని; కటి = మొల; తలంబునన్ = ప్రాంతమును; అచ్యుతుండును = విష్ణుమూర్తి {అచ్యుతుడు - చ్యుతము (జారుట) లేనివాడు, విష్ణువు}; కడుపున్ = బొజ్జను; హయాస్యుండును = హయగ్రీవమూర్తి; హృదయంబున్ = మనసును; కేశవుండును = విష్ణుమూర్తి {కేశవుడు - కేశి అనెడి రాక్షసిని చంపినవాడు, విష్ణువు}; ఉరమున్ = వక్షస్థలమును; ఈశుడున్ = ఈశానుడును; కంఠంబున్ = గొంతును; ఇనుండును = సూర్యుడు; భుజంబులన్ = బాహువులను; చతుర్భుజుండును = విష్ణుమూర్తి {చతుర్భుజుడు - నాలుగు చేతులు గలవాడు, విష్ణువు}; ముఖంబున్ = మోమును; త్రివిక్రముండును = వామనుడు {త్రివిక్రముడు - ముల్లోకమును ఆక్రమించిన వాడు, వామనావతారుడు, విష్ణువు}; శిరంబున్ = తలను; ఈశ్వరుండును = పరమశివుడు; రక్షింతురు = కాపాడుగాక; ముందు = ముందు వైపు; చక్రియున్ = విష్ణుమూర్తి {చక్రి - చక్రము ఆయుధముగా కలవాడు, విష్ణువు}; వెనుకన్ = వీపు వైపు; గదా = గదాయుధము; ధరుండు = ధరించినవాడు; ఐన = అయిన; హరియున్ = విష్ణుమూర్తి; పార్శ్వంబులన్ = ఇరుపక్కల; ధనుస్ = విల్లును; ధరుండు = ధరించినవాడు; ఐన = అయిన; మధువైరియున్ = విష్ణుమూర్తి {మధువైరి - మధు అనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు}; అసి = ఖడ్గమును; ధరుండు = ధరించినవాడు; అగు = అయిన; అజనుండును = అజనుడు; కోణంబులన్ = మూలలందు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; ధరుండు = ధరించినవాడు; ఐన = అయిన; ఉరుగాయుండును = ఉరుగాయుడు; మీదను = పైభాగమందు; ఉపేంద్రుడును = విష్ణుమూర్తి {ఉపేంద్రుడు - ఇంద్రుని సోదరుడు, విష్ణువు}; క్రిందున్ = కిందవైపునందు; తార్క్ష్యుండును = గరుడుడు; అంతటను = సర్వప్రదేశములందును; హల = నాగేలు ఆయుధము; ధరుండు = ధరించినవాడు; అగు = ఐన; పురుషుండును = సర్వకారణభూతుండు; కాతురు = కాపాడుగాక; నీ = నీ యొక్క; ఇంద్రియంబులన్ = సర్వేంద్రియములను {ఏకదశేంద్రియములు - 5జ్ఞానేంద్రియములు (1కన్ను 2ముక్కు 3నాలుక 4చెవి 5చర్మము) 5కర్మేంద్రియములు (1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుహ్యేంద్రియము 5గుదము) మరియు 1మనసు మొత్తం 11}; హృషీకేశుండును = విష్ణుమూర్తి {హృషీకేశుడు - హృషీకము (ఇంద్రియము)లకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; ప్రాణంబులన్ = పంచప్రాణములను {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; నారాయణుండును = విష్ణుమూర్తి {నారాయణుడు - నారములందు పుట్టినవాడు, విష్ణువు}; చిత్తంబున్ = చిత్తమును; శ్వేతద్వీపపతియును = శ్రీహరి {శ్వేతద్వీపపతి - శ్వేతద్వీపవాసిని (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు}; మనంబున్ = మనస్సును; యోగీశ్వరుండు = కపిలుడు {యోగీశ్వరుడు - యోగులలో ఈశ్వరుడు, కపిలావతారుడు, విష్ణువు}; ఐన = అయినట్టి; కపిలుండును = కపిలుడు; బుద్ధినిన్ = మతిని; పృశ్నిగర్భుండును = విష్ణుమూర్తి {పృశ్నిగర్భుడు - పృశ్ని కుమారుడు, విష్ణువు}; అహంకారంబునన్ = అహంకారమునందు; భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - షడ్గుణైశ్వర్య సంపన్నుడు}; ఐన = అయిన; పరుండునున్ = పరబ్రహ్మ {పరుడు - పరాత్పరుడు, పరబ్రహ్మ, విష్ణువు}; పాలనంబునన్ = కాపాడుట; చేయుదురు = చేయుగాక; నీవున్ = నీవు; క్రీడించున్ = ఆడెడి; ఎడన్ = సమయములందు; గోవిందుడును = విష్ణుమూర్తి {గోవిందుడు - వేదవేది, విష్ణువు}; శయనించు = పరుండు; తఱిన్ = సమయము లందు; మాధవుండును = విష్ణుమూర్తి {మాథవుడు - లక్ష్మీపతి, విష్ణువు}; నడచున్ = నడచెడి; వేళన్ = అప్పుడు; వైకుంఠుండును = విష్ణుమూర్తి {వైకుంఠుడు - వైకుంఠము (మొక్కపోనిలోకము)నకు అధిపతి, విష్ణువు}; కూర్చున్న = కూర్చుండెడి; సమయంబునన్ = అప్పుడు; శ్రీపతియున్ = లక్ష్మీపతి; కుడుచున్ = తినెడి; కాలంబునన్ = అప్పుడు; సర్వభక్షకుండు = అన్నిటిని తినువాడు; అయిన = ఐనట్టి; యజ్ఞభుజుండున్ = విష్ణుమూర్తి {యజ్ఞభుజుడు - అన్ని హవిర్భాగములను (ఆయా దేవతా రూపములలో) తినువాడు, విష్ణువు}; ఏమఱకుండుదురు = అప్రమత్తులుగకాపాడుగాక; నిన్నున్ = నీ యొక్క; పేర్కొనిన = పేరుతలచినచో; దుస్వప్న = చెడ్డకలలు; వృద్ధ = వృద్ధగ్రహములు; బాలగ్రహంబున్ = బాలగ్రహములు; కూశ్మాండ = కూశ్మాండపిశాచములు; డాకినీ = డాకినీపిశాచములు; యాతుధానులును = రాక్షసపిశాచములు; భూత = భూతపిశాచములు; ప్రేత = ప్రేతపిశాచములు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; పిశాచ = పిశాచములు; వినాయకులున్ = వినాయక క్షుద్రదేవతలు; కోటరాదులు = కోటరీ ఆది పిశాచములు; జ్యేష్ఠ = జ్యేష్ఠదేవత; ఆది = మున్నగు; భూతనాథులునున్ = భూతాధిపతులు; మాతృక = మాతృక ఆది {మాతృక - ఎడమపక్క కొమ్ము చెవి మున్నగునవి కొరవడిన ఏనుగు, దీని వలన అధిపతికి దారిద్ర్యము కలుగును}; గణంబులును = గణదేవతలును; నశియింతురు = నశించిపోదురు; నీ = నీ; అందున్ = ఎడల; ప్రాణ = ప్రాణములకు; ఇంద్రియ = ఇంద్రియములకు; శరీర = దేహమునకు; నిరోధంబులు = ఇబ్బంది కలిగిచెడివి; ఐన = అయిన; ఉన్మాదంబులున్ = చిత్తాది చాంచల్యములు; అపస్మారంబులును = బుద్ధిభ్రమ కరణములు; మహ = గొప్ప; ఉత్పాతంబులును = ఆపదలను సూచించునవి; పొందకుండు = కలుగకుండు; కావుత = కాక; అని = అని; రక్షచేసి = రక్షకట్టి; దీవించిరి = ఆశీర్వదించిరి; అంత = అప్పుడు.
భావము:- గోపికలకు అంతటితో తృప్తి కలుగలేదు. అంగాంగాలకు మహారక్ష కట్టదలచి ఆచమనం చేశారు. బాలునకు రక్షకట్టే ముందు తమకు రక్షకోసం బీజన్యాసం చేసుకొన్నారు. బాలునికి రక్ష కట్టడం మొదలు పెట్టారు. “చిన్ని తండ్రి! నీ పాదాలు బ్రహ్మ, మోకాళ్లు వాయువు, తొడలు యజ్ఞుడు, నడుము అచ్యుతుడు, కడుపు హయగ్రీవుడు, హృదయం కేశవుడు, వక్షస్థలము ఈశుడు, భుజాలు చతుర్భుజుడు, ముఖము త్రివిక్రముడు, శిరస్సు ఈశ్వరుడు రక్షిస్తారు. అంతేకాక, నీ ముందు చక్రధారి అయిన విష్ణువు, వెనుక గదాధారి అయిన శ్రీహరి, కుడి పక్క ధనుర్ధారి అయిన మధువైరి, ఎడమ పక్క ఖడ్గధరుడైన అజనుడు, కోణములలో శంఖ చక్ర గదా ధరుడైన ఉరుగాయుడు, మీద ఉపేంద్రుడు ఐన విష్ణువు, కింద గరుత్మంతుడు, అంతట హలధరుడు అయిన పురుషుడు రక్షిస్తారు. నీ ఇంద్రియాలు హృషీకేశుడు, ప్రాణాలు నారాయణుడు, చిత్తము శ్వేతద్వీపవతి, మనస్సు యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధి పృశ్నిగర్భుడైన విష్ణువు, అహంకారం భగవంతుడైన పరమపురుషుడు రక్షిస్తూ ఉంటారు. నీవు ఆడుతుండగా గోవిందుండు, నిద్రించేటప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుండు, కూర్చొన్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు ఏమరుపాటు లేకుండా నిన్ను రక్షిస్తూ ఉంటారు. నీ పేరు పలికితే చాలు పీడ కలలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూశ్మాండాలు, డాకినీ పిశాచాలు, యాతుధానులనే దుష్టశక్తులు, ప్రేత, యక్ష, రాక్షస, పిశచాదులు నశించిపోతాయి. గోటర, రేవత అనే దుష్టశక్తులు, జ్యేష్ఠదేవి, పూతన, మాతృకలు మొదలైన గణాలన్ని నాశనమై పోతాయి. నీ యందు ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని బాధించే ఉన్మాదాలు, మూర్ఛలు, మహోత్పాతాలు చేరకుండు గాక!” అని బాలుడికి రక్షపెట్టి దీవించారు.

తెభా-10.1-237-క.
పెద్ద వేడబంబుల
పానికిని జన్నుఁ గుడిపి, పానుపుపై సం
స్థాపించి, కప్పి, "కూరుకు
మో పాపఁడ!"యని యశోద యొయ్యనఁ బాడెన్.

టీక:- ఆ = ఆ; పెద్ద = అధికమైన; వేడబంబుల = మాయలు కల; పాపని = పిల్లవాని; కిన్ = కి; చన్నున్ = స్తన్యమును; కుడిపి = తాగించి; పానుపు = పక్క, పడక; పైన్ = మీద; సంస్థాపించి = కుదురుకొల్పి, పడుకోబెట్టి; కప్పి = దుప్పటి కప్పి; కూరుకుము = నిద్ర పొమ్ము; ఓ = ఓయీ; పాపడ = పిల్లవాడ; అని = అని; యశోద = యశోద; ఒయ్యనన్ = తిన్నగా, వెంటనే; పాడెన్ = జోలపాడెను.
భావము:- ఆ పెను మాయల చంటి పాపడికి చనుబాలు పట్టి పానుపు మీద పరుండబెట్టారు “ఇక నిద్రపో నాయనా” అని యశోద జోల పాట పాడింది.

తెభా-10.1-238-వ.
అంత నందుండు మొదలయిన గోపకులు మథురనుండి వచ్చి, రక్కసి మేనుఁ గని, వెఱఁగుపడి, “మున్ను వసుదేవుం డుత్పాతంబు లెఱింగి చెప్పె; నతండు మహాయోగి” యని పొగిడి, కఠోరం బగు పూతన యొడలు గుఠారంబుల నఱకి, తమ కుటీరంబులకుం దవ్వగు ప్రదేశంబున పటీరంబుల దహనంబు, సంగ్రహించి దహించి; రంత.
టీక:- అంతన్ = అప్పుడు; నందుండు = నందుడు; మొదలయిన = మున్నగు; గోపకులు = యాదవులు; మథుర = మథురానగరము; నుండి = నుండి; వచ్చి = వచ్చి; రక్కసి = రాక్షసి యొక్క; మేనున్ = కళేబరమును; కని = చూసి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; మున్ను = ఇంతక్రితము; వసుదేవుండు = వసుదేవుడు; ఉత్పాతంబులున్ = గొప్పఆపదలను; ఎఱింగి = తెలిసికొని; చెప్పెను = హెచ్చరించెను; అతండు = అతను; మహా = గొప్ప; యోగి = ఋషి; అని = అని; పొగిడి = స్తుతించి; కఠోరంబులు = కఠినమైనది; అగు = ఐన; పూతన = పూతన యొక్క; ఒడలున్ = కళేబరమును; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; నఱకి = నరికేసి; తమ = వారి యొక్క; కుటీరంబుల = నివాసముల; కున్ = కు; దవ్వు = దూరముగా ఉండునది; అగు = ఐన; ప్రదేశంబునన్ = చోటు నందు; పటీరంబులన్ = గంధపుచెక్కలతో; దహనంబు = చితిని; సంగ్రహించి = పేర్చి; దహించిరి = కాల్చిరి; అంత = అప్పుడు.
భావము:- అప్పుడు నందుడు మొదలైన యాదవ నాయకులు మధురా నగరం నుండి వచ్చి, ఆ రాకాసి కళేబరాన్ని చూసి నివ్వెరపోయారు “వసుదేవుడు మహా యోగి కనుక ఈ జరగబోయే ఉత్పాదాలు ముందే ఊహించి చెప్పాడు” అని మెచ్చుకొన్నారు. తరువాత కఠినమైన పూతన కళేబరాన్ని గొడ్డళ్ళతో నరికి ముక్కలు ముక్కలు చేసారు. తమ ఇళ్ళకు దూరంగా చందనం కఱ్ఱలు పేర్చి ఆ కళేబరం ముక్కలు దహనం చేసారు.

తెభా-10.1-239-ఆ.
పొగిలి పొగిలి, కాలు గువదేహంబున
రు పరిమళముల పొలు వెడలె;
దేహకల్మషములు శ్రీహరి ముఖమునఁ
ద్రావఁబడుటఁ జేసి, భూరేణ్య!

టీక:- పొగిలిపొగిలి = మిక్కిలి రాజుకొని; కాలు = దహిస్తున్న; మగువ = స్త్రీ యొక్క; దేహంబునన్ = శరీరమునుండి; అగరు = అగరు సుగంధపు; పరిమళముల = సువాసనల; పొగలు = పొగలు; వెడలెన్ = వెలువడెను; దేహ = శారీరక; కల్మషములున్ = దోషములు, కుళ్ళు; శ్రీహరి = శ్రీకృష్ణుని యొక్క; ముఖమునన్ = నోటితో; త్రావబడుటన్ = తాగబడుట; చేసి = వలన; భూవరేణ్య = మహారాజ {భూవరేణ్యుడు - భూవరు (రాజులలో) వరేణ్యుడు (గొప్పవాడు), మహారాజు}.
భావము:- ఓ పరీక్షిత్తు మహారాజా! ఆ పూతన కళేబరం రగిలి రగిలి కాలుతుంటే అగరు సువాసనల పొగలు వెలువడ్డాయి. మరి విష్ణుమూర్తి ఆమె విషపు పాలతోపాటు ప్రాణాలే కాదు శరీరం లోని మాలిన్యాలన్నీ తాగేశాడు కదా.

తెభా-10.1-240-క.
రి దనమీఁదం బదములు
ములు నిడి, చన్ను గుడిచి, దిసినమాత్రన్
రిజనని పగిదిఁ బరగతి
రిగెను దురితములు బాసి సురాంగనయున్.

టీక:- హరి = శ్రీకృష్ణుడు; తన = ఆమె; మీదన్ = పైన; పదములున్ = కాళ్ళు; కరములన్ = చేతులను; ఇడి = పెట్టి; చన్నున్ = చనుపాలు; కుడిచి = తాగి; కదిసిన = దగ్గరచేరిన; మాత్రన్ = మాత్రముచేత; హరి = విష్ణుమూర్తి; జనని = తల్లి; పగిదిన్ = వలె; పరగతి = పరమపదమున; కిన్ = కి; అరిగెను = వెళ్ళెను; దురితములున్ = పాపములు; పాసి = తొలగి; అసుర = రాక్షస; అంగన = స్త్రీ.
భావము:- అంతటి పాపిష్టి రాక్షసి, కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి, చనుబాలు తాగినంత మాత్రాన పాపాలు అన్ని పటాపంచలైపోయి, విష్ణువు తల్లి లాగ పరమగతికి వెళ్ళింది.

తెభా-10.1-241-క.
వెన్నుని కొకమఱి విషమగు
న్నిచ్చిన బాలహంత్రి నెనట దివికిన్;
వెన్నునిఁ గని, పెంచుచుఁ దన
న్నిచ్చిన సతికి మఱియు న్మము గలదే?

టీక:- వెన్నుని = శ్రీకృష్ణుని; కిన్ = కి; ఒక = ఒకే ఒక్క; మఱి = సారి; విషమున్ = వ్యతిరిక్తమైనవి; అగు = ఐన; చన్నున్ = చనుపాలను; ఇచ్చినన్ = ఇవ్వగా; బాల = శిశు; హంత్రి = హంతకురాలు; చనెను = వెళ్ళినది; అట = అట; దివి = స్వర్గమున; కిన్ = కు; వెన్నుని = శ్రీకృష్ణుని; కని = పుట్టించి; పెంచుచున్ = పోషించుచు; తన = ఆమె యొక్క; చన్నున్ = చనుబాలను; ఇచ్చినన్ = ఇచ్చినట్టి; సతి = ఇల్లాలున; కిన్ = కు; మఱియున్ = మళ్ళీ; జన్మము = పుట్టుట; కలదే = కలుగునా, కలుగదు.
భావము:- విష్ణువుకు ఒక్కసారి విషపూరితమైన చనుబాలు ఇచ్చిన బాలహంతకురాలైన రాకాసి కూడ స్వర్గానికి వెళ్ళిందట. మరి ఇంక విష్ణుమూర్తిని కన్నతల్లికి, పాలిచ్చి పెంచిన తల్లికి మోక్షం తప్పక లభిస్తుంది కాని, మళ్ళీ జన్మ అన్నది ఉంటుందా?

తెభా-10.1-242-క.
రిఁ గని, చన్నులు గుడిపెడి
రుణులు ప్రాపించు పదము లఁపఁగ వశమే?
రి యారగించుటకుఁ బా
ల్గురిసిన ధేనువులు ముక్తి కొనలఁ జరించున్.

టీక:- హరిన్ = శ్రీకృష్ణుని; కని = జన్మనిచ్చి; చన్నులు = చనుబాలు; కుడిపెడి = తాగించెడి; తరుణులున్ = ఇంతులు; ప్రాపించు = పొందెడి; పదము = స్థానము; తలపగన్ = ఊహించుట; వశమే = సాధ్యమా, కాదు; హరి = శ్రీకృష్ణుడు; ఆరగించుట = తాగుట; కున్ = కు; పాలు = పాలను; కురిసిన = సమృద్ధిగానిచ్చిన; ధేనువులు = ఆవులు; ముక్తి = మోక్షము; కొనలన్ = అంతమువరకు; చరించున్ = చేరుకొనును.
భావము:- చక్రిని కని చనుబాలు తాగించగలిగిన యువతులకు లభించే ఉత్తమలోకాలు ఊహించడం సాధ్యం కాదు. చక్రి తాగడానికి పాలను ఇచ్చిన గోవులు పరమపదం పొలిమేరలలో తిరుగు తుంటాయి.

తెభా-10.1-243-క.
పూతన మెయిగంధము
గోపాలు రెఱింగి, "యిట్టి కువనిత యొడలం
దీపాటి స్వాదుగంధము
ప్రాపించునె"యనుచుఁ జనిరి ల్లెల కధిపా!

టీక:- ఆ = ఆ; పూతన = పూతన యొక్క; మెయి = దేహపు; గంధము = సువాసన; గోపాలురు = యాదవులు; ఎఱింగి = తెలిసికొని; ఇట్టి = ఇటువంటి; కు = చెడ్డ; వనిత = స్త్రీ; ఒడలున్ = దేహము; అందున్ = అందు; ఈపాటి = ఇంతటి; స్వాదు = మంచి; గంధము = సువాసన; ప్రాపించునె = పొందుతుందా, వింతకదా; అనుచున్ = అనుచు; చనిరి = వెళ్ళిరి; పల్లెలు = మందల; కున్ = కు; అధిపా = రాజా.
భావము:- ఆ పూతన కళేబరంనుంచి మంచి సువాసనలు రావడం గోపాలకులు గమనించారు. ఆశ్చర్యంతో “ఇంతటి దుష్టురాలి శరీరంలోంచి ఇంత చక్కటి సుగంధమా” అనుకొంటు తమతమ పల్లెలకి వెళ్లారు.

తెభా-10.1-244-వ.
అంత నందుండు పరమానందంబున నింటికిఁ జని, వ్రేతలచేత రక్కసిచేత లన్నియు నెఱంగి, వెఱఁగుపడి, పాపని లేపి, శిరంబు మూర్కొని, ముద్దాడి, ముదంబున నుండె;” నని చెప్పిన విని, పరీక్షిన్నరేంద్రుఁ డిట్లనియె.
టీక:- అంతన్ = అప్పుడు; నందుండు = నందుడు; పరమానందంబునన్ = అత్యధిక సంతోషముతో; ఇంటి = నివాసమున; కిన్ = కు; చని = వెళ్ళి; వ్రేతల = గోపికల; చేతన్ = వలన; రక్కసి = రాక్షసస్త్రీ; చేతలు = చేష్టలు; అన్నియున్ = సమస్తమును; ఎఱింగి = తెలిసికొని; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; పాపని = శిశువును; లేపి = పైకి తీసుకొని; శిరంబున్ = తలను; మూర్కొని = మూచూచి; ముద్దాడి = ముద్దుచేసి; ముదంబునన్ = సంతోషముతో; ఉండెను = ఉండెను; అని = అని; చెప్పిన = తెలియజెప్పిన; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుండు = మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతటి ప్రమాదం తప్పిపోయినందుకు చాలా సంతోషంగా నందుడు ఇంటికి వెళ్ళాడు. గోపికలు పూతన చేష్టలు అన్ని చెప్పగా విని, ఆశ్చర్యపోయాడు. చంటిపిల్లాడిని లేపి శిరస్సు మూర్కొని ముద్దుపెట్టుకొన్నాడు. కొడుకుకి ఆపద తప్పినందుకు సంతోషించాడు.” ఈ విధంగా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు.

తెభా-10.1-245-క.
"ఏయే యవతారంబుల
నే యే కర్మములు జేసె నీశుఁడు హరి; భ
ద్రాతనము లన్నియు వినఁ
బాదు చిత్తంబు; చెవులపండువు లయ్యెన్.

టీక:- ఏయే = ఎట్టి; అవతారంబువన్ = అవతారములందు; ఏయే = ఎట్టి; కర్మముల్ = పనులు; చేసెన్ = ఆచరించను; ఈశుడున్ = నారాయణుడు {ఈశుడు - ఈశత్వము (సర్వనియామకత్వము), కలవాడు, విష్ణువు}; హరి = నారాయణుడు; భద్రాయతనములు = మేలు కలిగించెడివి {భద్రాయతనములు - భద్రములు (మంగళముల) కి ఆయతనములు (ఇళ్ళు), మేలుకలిగించెడివి}; అన్నియున్ = అన్నింటిన; వినన్ = వినుటను; పాయదు = వదలదు; చిత్తంబున్ = మనస్సు; చెవులన్ = చెవులకి; పండువులు = ఆనందములు; అయ్యెన్ = కలిగెను.
భావము:- “భగవంతుడైన విష్ణుమూర్తి ఏయే అవతారాలలో ఏమేం పనులు చేసాడు. అవి విన్నవారిని రక్షిస్తాయి. నా మనస్సు వాటి మీదకు తప్పించి ఇంకో వాటి మీదకు పోదు. హరి చరిత్రలు వినడానికి చెవులకు పండుగలాగా ఉంటాయి.

తెభా-10.1-246-క.
రుసంసారపయోనిధి
ణంబులు, పాపపుంజ ళనంబులు, శ్రీ
ణంబులు, ముక్తి సమా
ణంబులు, బాలకృష్ణు సంస్మరణంబుల్.

టీక:- ఉరు = గొప్ప; సంసార = సంసారము అనెడి; పయోనిధిన్ = సముద్రమును; తరణంబులు = దాటించునవి; పాప = పాపముల; పుంజ = సమూహములకు; దళనంబులు = ఖండించునవి; శ్రీ = శుభములను; కరణంబులు = కలిగించునవి; ముక్తి = మోక్షమును; సమ = చక్కగా; ఆచరణంబులు = సమకూర్చునవి; బాల = బాలునిగా ఉన్న; కృష్ణు = శ్రీకృష్ణుని; సంస్మరణలు = మననము చేయుటలు.
భావము:- బాలకృష్ణుని గొప్ప పనుల స్మరణలు సంసారమనే మహా సముద్రాన్ని దాటించే నావలు. అవి పాపాల సమూహాలను పార తోలుతాయి, సకల సంపదలు సమకూరుస్తాయి, మోక్ష పదానికి మంచి మార్గాలు.

తెభా-10.1-247-వ.
అని “తరువాత బాలకృష్ణుం డేమి చేసె? నా యందుఁ గృపగలదేనిం జెప్పవే!” యని యడిగిన, రాజునకు శుకుం డిట్లనియె.
టీక:- అని = అని; తరువాత = పిమ్మట; బాలకృష్ణుండు = బాలకృష్ణుడు; ఏమి = ఏమి; చేసెన్ = ఆచరించను; నా = నా; అందున్ = ఎడల; కృప = కరుణ; కలదేని = ఉన్నట్లయితే; చెప్పవే = చెప్పుము; అని = అని; అడిగిన = అర్థించినట్టి; రాజున్ = పరీక్షిత్తు; కున్ = కి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- నా మీద దయ ఉంటే ఆ తరువాత బాలకృష్ణుడు ఏమి చేసాడో చెప్పవలసినది” అని పరీక్షిత్తు అడుగగా, శుకబ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు.