పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/పాలుతాగి విశ్వరూప ప్రదర్శన

తెభా-10.1-279-వ.
అని పలికి రంత నందుండు మున్ను దనకు వసుదేవుండు జెప్పిన మాటలకు వెఱఁగుపడుచుండె మఱియును.
టీక:- అని = అని; పలికిరి = అన్నారు; అంతన్ = అప్పుడు; నందుండు = నందుడు; మున్ను = ఇంతకు ముందు; తన = అతని; కున్ = కి; వసుదేవుండు = వసుదేవుడు; చెప్పిన = తెలిపినట్టి; మాటలు = పలుకుల; కున్ = కు; వెఱంగుపడుచుండెన్ = ఆశ్చర్యపోతుండెను; మఱియును = ఇంకను.
భావము:- ఇలా గొల్లభామలు తమలో అనుకుంటూ ఉంటే, నందుడు ఇంతకు ముందు వసుదేవుడు తనకు చెప్పిన మాటలు గుర్తుచేసుకుని ఆశ్చర్యపోసాగాడు.

తెభా-10.1-280-సీ.
ననాథ! యొకనాడు న్ను చేఁపినఁ దల్లి-
చిన్ని ముద్దుల కృష్ణుఁ జేరఁ దిగిచి
యెత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి-
న్నిచ్చి నెమ్మోము క్క నివిరి
ల్లని నగవుతో నావులించిన బాలు-
దన గహ్వరమున వారినిధులు
దిశలు భూమియు వనద్వీపశైలంబులు-
నేఱులు గాలియు నినుడు శశియు

తెభా-10.1-280.1-ఆ.
హనుఁ డాకసంబు దారలు గ్రహములు
ఖిలలోకములు జరాచరంబు
లైన భూతగణము న్నియు నుండుటఁ
జూచి కన్నుమోడ్చి చోద్యపడియె.

టీక:- జననాథ = రాజా {జననాథుడు - జనులకు పతి, రాజు}; ఒక = ఒకానొక; నాడు = దినమున; చన్నున్ = స్తనము నందు; చేపిన = పాలు ఉబ్బగా; తల్లి = తల్లి; చిన్ని = చిన్నవాడైన; ముద్దుల = గారాల; కృష్ణున్ = కృష్ణుని; చేరన్ = దగ్గరకు రమ్మని; తిగిచి = తీసుకొని; ఎత్తి = ఎత్తుకొని; పెందొడల = పెద్దవైన తొడల; పైన్ = మీద; ఇడికొని = పెట్టికొని; ముద్దాడి = ముద్దులు పెట్టుకొని; చన్నున్ = చనుబాలు; ఇచ్చి = తాగించి; నెఱ = విశాలమైన; మోమున్ = ముఖమును; చక్కన్ = చక్కగా; నివిరి = నిమిరి; అల్లని = మెల్లని; నగవు = నవ్వు; తోన్ = తోపాటు; ఆవులించిన = ఆవులింతలిడగా; బాలు = పిల్లవాని; వదనగహ్వరమున = నోటి యందు; వారినిధులున్ = సముద్రములు; దిశలున్ = దిక్కులు; భూమియున్ = భూమండలము; వన = అడవులు; ద్వీప = ద్వీపములు; శైలంబులున్ = పర్వతములు; ఏఱులున్ = నదులు; గాలియున్ = వాయువు; ఇనుడు = సూర్యుడు; శశియున్ = చంద్రుడు.
దహనుడు = అగ్ని; ఆకసంబున్ = ఆకాశము; తారలున్ = నక్షత్రములు; గ్రహములున్ = గ్రహములు; అఖిల = సమస్తమైన; లోకములున్ = లోకములు; చర = చరించగలిగినవి; అచర = చరించలేనివి; ఐన = అయినట్టి; భూతగణములు = జీవజాలములు; అన్నియును = సమస్తము; ఉండుటన్ = ఉండుటను; చూచి = చూసి; కన్ను = కళ్ళు; మోడ్చి = మూసికొని; చోద్యపడియె = ఆశ్చర్యపోయెను.
భావము:- ఓ జనాధిప! పరీక్షిన్మహారాజా! యశోదకు ఒకనాడు పాలిండ్లు చేపుకు వచ్చాయి. తన ముద్దుల కృష్ణుని ఎత్తుకొని, ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడింది. చిన్న కృష్ణునికి చక్కగా పాలు తాగించింది. ప్రేమగా ముఖం నిమురసాగింది. ఆ అల్లరి పిల్లాడు తన మాయలమారి చిరునవ్వులు నవ్వుతు నిద్రవస్తున్నట్లు ఆవులించాడు. అతని నోరు పెద్ద కొండగుహవలె యశోదకు కనబడింది. ఆ లోతులలో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, తారలు, గ్రహాలు, సర్వలోకాలు చరచారాలైన అన్ని జీవరాశుల తోసహా కనబడ్డాయి. ఆమె కన్నులు అరమోడ్పులు అయ్యాయి. ఆమె నివ్వెరపోయింది.
వదన గహ్వరము అంటే వాక్ స్థానమైనది. మరి ఈ చరాచరజగత్తు సమస్తం వాగధిష్టానం. . అంటే శబ్దనిష్ఠం కదా. “సర్వంశబ్దనిష్ఠంజగత్” అని ప్రమాణం. అంటే శబ్దం లేకపోతే ఏమి లేదని. ఆహా ఏమి చోద్యం. చూపుతున్నవాడు సాక్షాత్తు పరబ్రహ్మ. చూపుతున్నది తల్లి జీవజాలం సమస్తం అనుకోవచ్చా. జననాథుడు అంటే జీవజాలంలో జ్ఞానం గల మానవు లందరి నాథుడు కదా.

తెభా-10.1-281-వ.
అంత నొక్కనాడు వసుదేవు పంపున యాదవ పురోహితుం డైన గర్గుండు మందకుం జనుదెంచిన నందుం డతనిఁ గనుంగొని లేచి నిలిచి కృతాంజలి యై.
టీక:- అంతన్ = అంతట; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; వసుదేవున్ = వసుదేవుని చేత; పంపునన్ = చెప్పబడి; యాదవ = యాదవులకు; పురోహితుండు = పురోహితుడు; ఐన = అయినట్టి; గర్గుండు = గర్గుడు; మంద = వ్రేపల్లె; కున్ = కు; చనుదెంచిన = రాగా; నందుండు = నందుడు; అతనిన్ = అతనిని; కనుంగొని = చూసి; లేచి = ఆసనమునుండి లేచి; నిలిచి = నిలబడి; కృతాంజలి = నమస్కరించినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ రోజుల్లో ఒకరోజు వసుదేవుడు యాదవుల పురోహితుడు అయిన గర్గుడిని, నందుడి మందకు వెళ్ళమని పురమాయించేడు. అలా గర్గుడు రాగానే నందుడు తన ఆసనం గబుక్కున దిగి, చేతులు జోడించి నిలబడి. . .

తెభా-10.1-282-క.
కోరి భజించెను నందుఁడు
సాగుణాచారమార్గు త్సంసర్గు
న్నారాధితభర్గున్ మతి
దూరితషడ్వర్గుఁ గుజనదుర్గున్ గర్గున్.

టీక:- కోరి = ప్రీతిగా; భజించెను = సేవించెను; నందుడు = నందుడు; సార = శ్రేష్ఠమైన; గుణ = సుగుణములు; ఆచార = నడవడికలతో; మార్గున్ = నడచువానిని; సత్ = మంచివారితో; సంసర్గున్ = చేరిక కలవానిని; ఆరాధిత = అర్చింపబడిన; భర్గున్ = పరమశివుడు కలవానిని; మతిన్ = మనసునుండి; దూరిత = దూరము చేయబడిన; షడ్వర్గున్ = అరిషడ్వర్గములు కలవాని {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు}; కుజన = చెడ్డవారికి; దుర్గున్ = పొందరానివానిని; గర్గున్ = గర్గుడుని.
భావము:- ఆ గర్గమహాముని ఎంతో మంచి గుణాలూ నడవడికలూ కలవాడు; గొప్ప శివ భక్తుడు; ఎల్లప్పుడూ సత్సాంగత్యంతో ఉండేవాడు, దుర్జన సాంగత్యం వర్జించి మెలగేవాడు; కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు విడిచిన వాడు; పైగా పురోహితుడు. అంతటివాని రాకతో సంతోషించినవాడై, మిక్కిలి ప్రీతితో ఆ గర్గుని సేవించాడు.

తెభా-10.1-283-వ.
మఱియుఁ దగిన సత్కారంబులు జేసి ఇట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; తగిన = అర్హమైన; సత్కారంబులున్ = మర్యాదలు; చేసి = చేసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా సేవించి, తగిన అతిథి సత్కారాలు చేసి, నందుడు గర్గమునితో ఇలా అన్నాడు

తెభా-10.1-284-క.
"ఊక రారు మహాత్ములు
వా ధముల యిండ్లకడకు చ్చుట లెల్లం
గాణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా!

టీక:- ఊరకన్ = కారణము లేకుండగ; రారు = రాబోరు; మహాత్ములు = గొప్పవారు {మహాత్ములు - గొప్ప చిత్తవృత్తి గలవారు, గొప్పవారు}; వారు = అట్టివారు; అధముల = అల్పుల; ఇండ్ల = నివాసముల; కడ = వద్ద; కున్ = కు; వచ్చుట = రావడ మన్నది; ఎల్లన్ = అంతయు; కారణము = కారణము; మంగళముల్ = శుభముల; కున్ = కు; నీ = నీ యొక్క; రాక = వచ్చుట; శుభంబు = మంచిది; మా = మా; కున్ = కు; నిజము = తథ్యము యిది; మహాత్మా = గొప్పవాడా.
భావము:- "ఓ మహాత్ముడవైన గర్గమహాముని! మీవంటి పెద్దలు, మా వంటి సామాన్యుల ఇళ్ళకు ఉత్తినే రారు. వచ్చారంటే తప్పకుండా ఏదో గొప్ప మేలు సిద్ధించడానికి మాత్రమే. అందుకే "ఊరక రారు మహాత్ములు"అన్న నానుడి ప్రసిద్ధమైంది కదా. కాబట్టి, తమ రాక వలన మాకు తప్పకుండా శుభాలు కలుగుతాయి. ఇది సత్యం.

తెభా-10.1-285-శా.
జ్యోతిశ్శాస్త్రుల కెల్ల మేటరివి తేజోమూర్తి వాశాంత వి
ఖ్యా స్ఫూర్తివి బ్రహ్మబోధనుఁడ వార్ణింపు నా పల్కు ని
ర్ణీతుండైన గురుండు మానవులకున్ విప్రోత్తముం డండ్రు నీ
చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబుఁ గావింపవే."

టీక:- జ్యోతిశాస్త్రుల = జ్యోతిషశాస్త్ర పండితుల; కిన్ = కి; ఎల్లన్ = అందరిలోను; మేటరవి = శ్రేష్ఠుడవు; తేజస్ = తేజస్సు కల; మూర్తివి = ఆకృతి కలవాడవు; ఆశాంత = దిగంతములవరకు; విఖ్యాత = ప్రసిద్ధమైన; స్ఫూర్తివి = స్ఫురణ కలవాడవు; బ్రహ్మబోధనుడవు = బ్రహ్మజ్ఞానము కలవాడవు; ఆకర్ణింపు = వినుము; నా = నా యొక్క; పల్కున్ = మాటలను; నిర్ణీతుండు = నిర్ణయింపబడినవాడు; ఐన = అయిన; గురుండు = గురువు; మానవుల్ = నరుల; కున్ = కు; విప్ర = బ్రాహ్మణుడైన; ఉత్తముండు = ఉత్తముడు; అండ్రున్ = అనెదరు; నీ = నీ యొక్క; చాతుర్యంబునన్ = నేర్పుతోటి; ఈ = ఈ; కుమారుల్ = బాలుర; కున్ = కు; సంస్కారంబు = నామకరణాది కర్మలను; కావింపవే = చేయుము.
భావము:- మానవులకు తమ కుల పురోహితుడే సర్వోత్తమమైన విప్రుడు అంటారు. పైగా మీరు గొప్ప జ్యోతిష్కులలో శ్రేష్ఠులు, మిక్కిలి తేజోవంతులు. నలుదిక్కులా పాకిన కీర్తి కలవారు. బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు. కాబట్టి. దయచేసి నా అభ్యర్థన మన్నించి, ఈ పిల్లలకు నామకరణము మొదలైన సంస్కారాలు చేయించి వీరిని పరిశుద్ధులను చెయ్యి."