తెభా-10.1-349-వ.
అనిన విని రా జిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; రాజు = పరీక్షిత్తు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా శుకమహర్షి యశోద బాలకృష్ణుని ముద్దు చేస్తోంది అని చెప్పగా విని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

తెభా-10.1-350-ఆ.
"గదధీశ్వరునకుఁ న్నిచ్చు తల్లి గా
నేమి నోము నోఁచె నీ యశోద?
పుత్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రి గా
నందుఁ డేమి జేసె? నందితాత్మ!

టీక:- జగదధీశ్వరున్ = హరి {జగదధీశ్వరుడు - జగత్ (లోకము) లన్నిటికి అధీశ్వరుడు (సర్వోత్కృష్ట అధిపతి), విష్ణువు}; కున్ = కి; చన్ను = చనుబాలు; ఇచ్చు = తాగించెడి; తల్లి = అమ్మ; కాన్ = అగుటకు; ఏమి = ఎట్టి; నోమున్ = నోములను; నోచెన్ = చేసెనో; ఈ = ఈ; యశోద = యశోద; పుత్రుడు = కుమారుడు; అనుచున్ = అంటూ; అతనిన్ = అతనిని; పోషింపన్ = పెంచుటకు; తండ్రి = తండ్రి; కాన్ = అగుటకు; నందుడు = నందుడు; ఏమి = ఎట్టి (పుణ్యములు); చేసెన్ = చేసెను; నందితాత్మ = శుకయోగి {నందితాత్మ - ఆనందమున ఉన్న ఆత్మ కలవాడు, శుకుడు}.
భావము:- శుకమహర్షీ! నీవు ఆత్మానందం పొందిన వాడవు. ఈ లోకాలన్నిటికీ ప్రభువూ భగవంతుడూ అయిన శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి పూర్వజన్మలలో ఏమి నోములు నోచిందో? శ్రీ హరిని పొషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏమి తపస్సులు చేసాడో?

తెభా-10.1-351-క.
ప్రబ్బిన భక్తిని హరిపైఁ
బ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ
బ్బుదు రట! హరిపోషణ
బ్బిన తలిదండ్రు లెచటి బ్బుదురొ? తుదిన్."

టీక:- ప్రబ్బిన = సందడించు; భక్తిని = భక్తితో; హరి = విష్ణుమూర్తి; పైన్ = మీద; కబ్బంబులున్ = కావ్యములు {కావ్యము (ప్ర) – కబ్బము (వి)}, కవిత్వము; చెప్పి = రచియించి; కవులున్ = పండితులు; కైవల్యశ్రీ = మోక్షసంపద; కిన్ = కున్; అబ్బుదురు = చెందుదురు; అట = అంటారు; హరి = శ్రీహరి యొక్క; పోషణమున్ = పెంచుట; అబ్బిన = లభించిన; తలిదండ్రులు = తల్లిదండ్రులు; ఎచటి = ఎంతగొప్పపదమున; కిన్ = కు; అబ్బుదురొ = పొందెదరు; తుదిన్ = చివరకు.
భావము:- కవీశ్వరులు ఎంతో భక్తితో శ్రీమహావిష్ణువు మీద కావ్యాలు వ్రాసి, మోక్షలక్ష్మీకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి ఆ విష్ణుమూర్తినే కని, పెంచి, పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి చేరుతారో?”

తెభా-10.1-352-వ.
అనిన విని రాజయోగికి శుకయోగి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; రాజయోగి = పరీక్షిత్తున; కిన్ = కు; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని రాజయోగి అయిన పరీక్షిన్మహారాజు అడుగగా, యోగిబ్రహ్మ శుకుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-353-సీ.
"వనీశ! విను ద్రోణుఁ నువాఁడు వసువుల-
యందు ముఖ్యుఁడు; ధర తని భార్య;
వారి నిద్దఱ బ్రహ్మ సుధపై జన్మించు-
డంచుఁ బంపిన వార తనిఁ జూచి
"విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి-
మా కిచ్చితేనిని హి జనింతు"
నవుడు "నట్ల కా"నియె వేల్పులపెద్ద-
యా ద్రోణుఁ డీ నందుఁడై జనించె

తెభా-10.1-353.1-ఆ.
ర యశోద యయ్యె; నుజేంద్రవైరియుఁ
మలగర్భుమాట గారవించి
ల్లిదండ్రు లనుచుఁ గ వారి మన్నించె;
ధిక భక్తితోడ లరి రిట్లు.

టీక:- అవనీశ = రాజా {అవనీశుడు - అవని (భూమి)కి ప్రభువు, రాజు}; విను = వినుము; ద్రోణుడు = ద్రోణుడు; అనువాడు = అనెడివాడు; వసువుల = వసువులు; అందున్ = లో; ముఖ్యుడు = ముఖ్యమైనవాడు; ధర = ధర అనెడి యామె; అతని = అతని యొక్క; భార్య = భార్య; వారిన్ = వారిని; ఇద్దఱన్ = ఇద్దరిని; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; వసుధ = నేల; పైన్ = మీద; జన్మించుడు = పుట్టండి; అంచున్ = అనుచు; పంపినన్ = పంపించగా; వారలు = వారు; అతనిన్ = అతనిని; చూచి = ఉద్దేశించి; విశ్వేశ్వరుండు = లోకము లన్నిటికి ప్రభువు; ఐన = అయిన; విష్ణు = నారాయణుని; సేవా = కొలుచుట యందలి; రతిన్ = ఆసక్తి; మా = మా; కున్ = కు; ఇచ్చి = ప్రసాదించితివి; ఏనిని = ఐనచో; మహిన్ = భూలోకమున; జనింతుము = పుట్టెదము; అనవుడు = అనగా; అట్ల = అట్లనే; కాక = అగుగాక; అనియె = పలికెను; వేల్పులపెద్ద = బ్రహ్మదేవుడు {వేల్పులపెద్ద - దేవతలందరి లోను అధికుడు , బ్రహ్మ}; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ద్రోణుడి = ద్రోణుడే; ఈ = ఈ; నందుడు = నందుడు; ఐ = అయ్యి; జనించెన్ = పుట్టెను.
ధర = ధర; యశోద = యశోదగా; అయ్యెన్ = పుట్టెను; దనుజేంద్రవైరియున్ = శ్రీహరి {దనుజేంద్రవైరి- రాక్షసులకు శత్రువు, విష్ణువు}; కమలగర్భు = బ్రహ్మదేవుని; మాటన్ = పలుకును; గారవించి = మన్నించి; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; అనుచున్ = అనుచు; తగన్ = చక్కగా; వారి = వారిని; మన్నించెన్ = గౌరవించెను; అధిక = గాఢమైన; భక్తి = భక్తి; తోడన్ = తోటి; అలరిరి = ఒప్పిరి; ఇట్లు = ఈ విధముగ.
భావము:- "ఓ పరీక్షిత్తు మహారాజా! చెప్తాను విను! వసువులు అనే దేవతలలో "ద్రోణుడు"అనేవాడు ముఖ్యుడు; అతని భార్య "ధర"; బ్రహ్మదేవుడు వారిద్దరినీ భూలోకంలో జన్మించమని ఆదేశించాడు; "విశ్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవించే భాగ్యం ప్రసాదించినట్లు అయితే అలాగే భూమిపై జన్మిస్తాము"అన్నారు ఆ దంపతులు; బ్రహ్మదేవుడు "అలాగే"అని అనుగ్రహించాడు; ఆ ద్రోణుడు అనే వసువే ఈ నందుడుగా జన్మించాడు, ధరాదేవి అనే వసువే యశోద; శ్రీమన్నారాయణుడు కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించాడు; ఎంతో భక్తితో, సంతోషంతో గౌరవించాడు;