తెభా-10.1-813-వ.
అట్లా నదీతీరంబు చేరం జని గజగమనలు విజనప్రదేశంబున వలువలు విడిచి యిడి మది శంకలేక యకలంకలై గ్రుంకులిడఁ జలంబున జలంబు జొచ్చి.
టీక:- అట్లా = ఆ విధముగా; నదీ = యమునానదీ; తీరంబున్ = గట్టు; చేరన్ = వద్దకు; చని = వెళ్ళి; గజగమనలు = అందగత్తెలు {గజగమన - గజ (ఏనుగు వలె ఒయ్యారమైన) గమన (నడక కలామె), స్త్రీ}; విజన = జను లెవ్వరు లేని; ప్రదేశంబునన్ = చోటు నందు; వలువలు = బట్టలు; విడిచి = విప్పి; ఇడి = పెట్టి; మదిన్ = మనసు లందు; శంక = వెరవు, అనుమానమ; లేక = లేకుండా; అకలంకలు = నిర్మల మనసు కలవారు; కుంకులిడన్ = స్నానములు చేయుటకు; చలంబునన్ = పట్టుదలతో; జలంబున్ = నీటి యందు; చొచ్చి = ప్రవేశించి.
భావము:- ఇలా ఆ గజగమనలు కాళిందీనదీ తీరాన చేరి ఒక ఏకాంత స్థలంలో కోకలు విడిచిపెట్టారు. కళంకరహితలు అయిన ఆ కలువకన్నుల సుందరాంగులు జలకాలాడటం కోసం మనసులో ఏ జంకు లేకుండా పట్టుదలతో నదిలో నీటిలోకి దిగారు.

తెభా-10.1-814-క.
వారిజలోచనుఁ బాడుచు
వారిజలోచనలు వారివారికి వేడ్కన్
వారివిహారము సలిపిరి
వారి విహారములు జగతివారికిఁ గలవే?

టీక:- వారిజలోచనున్ = పద్మాక్షుని, కృష్ణుని; పాడుచున్ = కీర్తించుచు; వారిజలోచనులు = సుందరీమణులు {వారిజ లోచన - వారిజ (పద్మములవంటి) లోచన (కన్నులు కలామె), స్త్రీ}; వారివారి = తమలోతామ; కిన్ = కి; వేడ్కన్ = వినోదముగా; వారి = జల; విహారమున్ = క్రీడలు; సలిపిరి = ఆడిరి; వారి = వారి యొక్క; విహారములు = వినోదసంచారములు; జగతి = లోకములోని; వారి = జనుల; కిన్ = కి; కలవే = ఉన్నాయా, లేవు.
భావము:- ఆ పద్మనేత్రాల వనితలు, పద్మాక్షుడు అయిన కృష్ణుడి మీద పాటలు పాడుతూ, ఇష్టం వచ్చినట్లు వేడుకలతో జలక్రీడలు ఆడారు. వారి ఆ విహారాలు ఆ ఆనంద పారవశ్యాలు ఈ లోకంలో ఎవరికి మాత్రం దొరుకుతాయి?

తెభా-10.1-815-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు.
భావము:- అలా గోపికలు నగ్నంగా జలకాలాడుతూ ఉన్నప్పుడు. . .

తెభా-10.1-816-క.
తోజనయనలు యమునా
తోములం దుండు టెఱిఁగి దూరగుఁ డయ్యున్
తోజనయనుఁడు హరి తన
తోము వారలును దానుఁ దోతెంచె నృపా!

టీక:- తోయజనయనలు = పడతులు {తోయజనయన - పద్మములవంటి కన్నులు కలామె, స్త్రీ}; యమునా = యమునానదీ; తోయములన్ = నీటి; అందున్ = లో; ఉండుట = ఉండుటను; ఎఱిగి = తెలిసి; దూరగుడు = దూరముగా ఉన్నవాడు; అయ్యున్ = అయినప్పటికి. తోయజనయనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; హరి = కృష్ణుడు; తన = తన; తోయమువారలును = స్నేహితులు; తానున్ = అతను; తోతెంచెను = కలిసి వచ్చెను; నృపా = రాజా.
భావము:- రాజా! ఆ పద్మనేత్రల గోపికలు యమునా నదీ జలాలలో ఈదులాడుతున్నారు అని, దూరంలో ఉన్న కృష్ణుడు తెలుసుకున్నాడు. వెంటనే తోటి గోపబాలకులతో అక్కడికి వచ్చాడు.

తెభా-10.1-817-త.
"లకుం"డని తోడివారలఁ న్నుసన్నల నిల్పుచుం
ము లొయ్యన నేలఁ బెట్టుచుఁ ద్మనేత్రుఁడు మౌనియై
పొల మాటున నల్లనల్లనఁ బొంచి పొంచి నతాంగుఁడై
ను గోరుచు డాసి వ్రేతల యంబరంబులు దొంగిలెన్.

టీక:- కదలకుండు = కదలబోకండి; అని = అని; తోడివారలన్ = సహచరులను; కన్ను = కంటితో చేసెడి; సన్నలన్ = సంజ్ఞలచేత; నిల్పుచున్ = నిలువరించుచు; పదములు = అడుగులను; ఒయ్యన = మెల్లగా; నేలన్ = నేలమీద; పెట్టుచున్ = వేయుచు; మౌని = మౌనము వహించినవాడు; ఐ = అయ్యి; పొదలన్ = పొదలకు; మాటునన్ = చాటుగా; అల్లనల్లన = మెల్ళిమెల్లిగా; పొంచిపొంచి = మిక్కిలి దాగుకొనుచు; నత = వంగిన; అంగుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; అదను = అవకాశము, సమయము; కోరుచున్ = అపేక్షించుచు; డాసి = చేరి; వ్రేతల = గోపికల యొక్క; అంబరంబులున్ = వస్త్రములను; దొంగిలెన్ = అపహరించెను.
భావము:- అలా వచ్చిన కృష్ణుడు, “కదలకుండా ఉండండి” అని తోటి గోపబాలకులకు కనుసైగలు చేసాడు. చప్పుడు కాకుండా అడుగులేస్తూ, మౌనంగా, పొదలమాటున, మెల్ల మెల్లగా, పొంచి పొంచి, వంగి వంగి మరీ వెళ్ళాడు. సరైన సమయం కనిపెట్టి చేరి ఆ గొల్లభామల వలువలు అపహరించాడు.

తెభా-10.1-818-వ.
ఇట్లు దొంగిలి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; దొంగిలి = అపహరించి.
భావము:- అలా వలువలు దొంగిలించి. . .

తెభా-10.1-819-శా.
ద్యద్గంధగజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుం
డాద్యుం డర్భకు భంగి నర్భకులతో హాసార్థియై కొంచు ద
న్నద్యంభఃకణ శీతవాత జనితానందంబుతో నెక్కెఁ దా
ద్యోముక్త దురంతపాదప జనుస్సంతాపమున్ నీపమున్.

టీక:- ఉద్యత్ = పుట్టుచున్న; గంధ = మదజలము కలిగిన; గజ = ఏనుగులలో; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; గౌరవముతో = గంభీరత్వముతో; యోషా = స్త్రీల; అంబరంబుల్ = వస్త్రములను; విభుండు = కృష్ణుడు {విభుడు - సర్వేశ్వరుడు, విష్ణువు}; ఆద్యుండు = కృష్ణుడు {ఆద్యుడు - ప్రపంచోత్పత్తి స్థితి లయములకు మూలపరుషుడు, విష్ణువు}; అర్భకున్ = బాలుని; భంగిన్ = వలె; అర్భకుల్ = పిల్లల; తోన్ = తోటి; హాస = నవ్వులాటను; అర్థి = కోరువాడు; ఐ = అయ్యి; కొంచున్ = అపహరించుచు; తత్ = ఆ; నది = నది యొక్క; అంభః = నీటి; కణ = తుంపరలచేత; శీత = చల్లని; వాత = గాలివలన; జనిత = కలిగిన; ఆనందంబు = సంతోషము; తోన్ = తోటి; ఎక్కెన్ = ఎక్కెను; తాన్ = అతను; సద్యః = అప్పటికప్పుడే; ముక్త = విడువబడిన; దురంత = అంతులేని; పాదప = వృక్షముగా; జనుః = జన్మఎత్తుట అనెడి; సంతాపమున్ = పరితాపముకల దానిని; నీపమున్ = కడిమి చెట్టును.
భావము:- విశ్వవిభుడూ, ఆది దేవుడూ అయిన ఆ చిన్ని కృష్ణుడు. చిన్న పిల్లవాడి లాగ తోటిపిల్లలతో కూడి పరిహాసానికి ఆడువారి అంబరములు అపహరించి మత్తగజేంద్రుడిలా యమునానది జలకణాలచే చల్లపడిన పిల్లవాయువుల వలన కలిగే ఆనందంతో నడచి ఒక కడిమిచెట్టు ఎక్కాడు. అతడు ఎక్కగానే ఆ చెట్టు వృక్ష జన్మం వల్ల తనకు కలిగిన సంతాపాన్ని అంతా వెంటనే పోగొట్టుకుంది.

తెభా-10.1-820-వ.
అప్పు డయ్యింతు లిట్లనిరి.
టీక:- అప్పుడు = ఆ సమయము నందు; ఇంతులు = స్త్రీలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అలా కృష్ణుడు బట్టలు పట్టుకుపోడం చూసిన ఆ యాదవ యువతులు ఇలా అన్నారు.

తెభా-10.1-821-క.
"మామా వలువలు ముట్టకు
మామా! కొనిపోకుపోకు న్నింపు తగన్
మా మాన మేల కొనియెదు?
మా మానసహరణ మేల? మానుము కృష్ణా!

టీక:- మామా = మావి మావి; వలువలు = వస్త్రములు; ముట్టకు = ముట్టుకొనకుము; మామా = నాయనా; కొనిపోకుపోకు = పట్టుకుపోబోకుము; మన్నింపు = మామాట గౌరవించుము; తగన్ = మిక్కిలిగా; మా = మా యొక్క; మానము = మర్యాదను; ఏల = ఎందుకు; కొనియెదవు = తీసెదవు; మా = మా యొక్క; మానస = మనస్సులను; హరణము = అపహరించుట; ఏలన్ = ఎందుకు; మానుము = విడువము; కృష్ణా = కృష్ణుడా.
భావము:- "నాయనా! కృష్ణా! మా బట్టలు తాకవద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.
గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్ధమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహ్మతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పండితవరేణ్యులు పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు “ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.

తెభా-10.1-822-సీ.
హుజీవనముతోడ భాసిల్లి యుండుటో?-
గోత్రంబు నిలుపుటో కూర్మితోడ?
హి నుద్ధరించుటో? నుజసింహంబవై-
ప్రజలఁ గాచుటొ? కాక లిఁ దెరల్చి
పిన్నవై యుండియుఁ బెంపు వహించుటో?-
రాజుల గెలుచుటో ణములోన?
గురునాజ్ఞ జేయుటో? గుణనిధి వై బల-
ప్రఖ్యాతిఁ జూపుటో ద్రలీల?

తెభా-10.1-822.1-ఆ.
బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో?
లికితనము చేయ నత గలదె?
వావి లేదు వారి వారు నా వారని
యెఱుఁగ వలదె? వలువ లిమ్ము కృష్ణ!

టీక:- బహు = గొప్ప, అధికమైన; జీవనము = జీవిక, జలము; తోన్ = తోటి; భాసిల్లి = ప్రకాశించియుండుటో, మత్స్యావతారమున భాసిల్లి; ఉండుటో = ఉండుటకాని; గోత్రంబున్ = వంశప్రతిష్ఠను, కొండను; నిలుపుటో = ఉద్దరించుటకాని, కూర్మము ఐ అసరా ఇచ్చుటకాని; కూర్మి = ప్రీతితో, ప్రేమతో; మహిన్ = రాజ్యమును, భూమండలమును; ఉద్దరించుటో = ఏలుటకాని, వరహము ఐ భూమినెత్తుటకాని; మనుజసింహంబవు = మానవశ్రేష్ఠుడవు, నరసింహుడవు; ఐ = అయ్యి; ప్రజలన్ = గోపకులను, లోకులను; కాచుటో = ఏలుటకాని, కాపాడుటకాని; కాకన్ = లేదా; బలిన్ = కొవ్వినవారిని, బలిచక్రవర్తిని; తెరల్చి = తరిమికొట్టి; పిన్నవు = బాలుడవు, వామనుడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికి; పెంపు = అతిశయము, త్రివిక్రమ వైభవము; వహించుటో = చూపుటకాని, ప్రదర్శించుటకాని; రాజులన్ = శత్రురాజులను, లోకములోని రాజులందరను; గెలుచుటో = జయించుటకాని, పరశురామునిగా శిక్షించుటగాని; రణములోనన్ = యుద్ధభూమియందు; గురున్ = పెద్దల యొక్క, తండ్రి యొక్క; ఆజ్ఞ = ఆజ్ఞను; చేయుటో = పాటించుటకాని, పాలించుటకాని (రామావతారము పితృవాక్యపాలన); గుణనిధివి = మంచిగుణములు కలవాడవు; ఐ = అయ్యి; బల = బలముయొక్క, బలరాముని యొక్క; ప్రఖ్యాతిన్ = ప్రసిద్ధిని; చూపుటో = ప్రదర్శించుటకాని, ప్రకాశముచేయుటకాని; భద్ర = శుభకరమైన; లీలన్ = విహారములతో.
బుధులు = జ్ఞానులు; మెచ్చన్ = శ్లాఘించునట్లుగా; భువిన్ = భూలోకమున; ప్రబుద్ధతన్ = మిక్కిలి జ్ఞానముతో, బుద్ధునిగా; మెఱయుటో = ప్రకాశించుటకాని; కలికితనము = కొంటెతనపుపనులు, కల్కిచేయుపనులు; చేయన్ = చేయుటయందు; ఘనత = గొప్పదనము; కలదె = ఉన్నదా; వావి = బంధుత్వములన్నది; లేదు = లేదు; వారి = ఇతరులకుచెందిన; వారు = వారు; నా = తనకు చెందిన; వారు = వారు; అని = అని; ఎఱుగన్ = తెలిసికొన; వలదె = వద్దా; వలువలు = వస్త్రములు; ఇమ్ము = ఇచ్చివేయుము; కృష్ణ = కృష్ణుడ.
భావము:- ఓ కిట్టయ్యా! ఏం పనయ్యా యిది!దొడ్డ బ్రతుకుతో వన్నెకెక్కడం కాని (జలరాశిలో విలసిల్లుట – మత్స్యావతారం); కూర్మితో కులం ప్రతిష్ట నిలబెట్టటంకాని ( కొండను మూపున నిల్పుట – కూర్మావతారం); భూమిని రక్షించటంకాని (భూదేవిని పైకి లేవనెత్తుట – వరహావతారము); పురుషపుంగవుడవై జనులను కాపాడటంకాని ( నరకేసరియై భక్తుల రక్షించుట – నృసింహావతారం); వయసున పసివాడవయ్యు దుష్టులు బలవంతులు నైనవారిని నిగ్రహించి ప్రఖ్యాతి వహించుటకాని (వటువు రూపమున బలిచక్రవర్తి నణచి కీర్తిపొందుట – వామనావతారం); యుద్ధాలలో రాజులను గెలవటం కాని (ఇరవైయొక్క మార్లు క్షత్రియులను జయించుట – పరశురామావతారం); గురువు లాజ్ఞలు పాటించడమో (తండ్రి ఆజ్ఞను పాటించుట, రామావతారము); గుణనిధివై బలమును ప్రదర్శించడమో (బలరామావతారం); పండితులు ప్రశంసించేలా ప్రబుద్ధుడవై లోకంలో ప్రకాశించటం కాని (పొందిన జ్ఞానంతో పండితుల ప్రశంసలకు పాత్రుడగుట - బుద్ధావతారం) తగిన పని. అంతే కాని యిలాంటి వంచకత్వం యే మాత్రం గొప్పదనంకాదయ్యా. (కల్కి పదంతో కల్క్యావతారం సూచన). నీకు వావివారసలు లేనట్లుంది, తనవారు పరాయివారు అనే వివేకం అక్కరలేదా (భగవంతునికి వావివరసలు, స్వపక్ష పరపక్షాలు లేవు). మా బట్టలు మా కిచ్చెయ్యవయ్యా.

తెభా-10.1-823-క.
కొంటివి మా హృదయంబులు;
గొంటివి మా మనము; లజ్జఁ గొంటివి; వలువల్
గొంటి; విఁక నెట్లు చేసెదొ;
కొంటెవు గద; నిన్ను నెఱిఁగికొంటిమి కృష్ణా!

టీక:- కొంటివి = దొంగిలించితివి; మా = మా యొక్క; హృదయంబులున్ = హృదయములను; కొంటివి = అపహరించితివి; మా = మా యొక్క; మనమున్ = మనసును; లజ్జన్ = సిగ్గును; కొంటివి = పోగొట్టితివి; వలువలు = వస్త్రములను; కొంటివిన్ = అపహరించితివి; ఇకన్ = ఇంక; ఎట్లు = ఏవిధముగ; చేసెదొ = చేసెదవో; కొంటెవు = కొంటెవాడివి; కద = కదా; నిన్నున్ = నిన్ను; ఎఱిగికొంటిమి = తెలిసికొంటిమి; కృష్ణా = కృష్ణుడా.
భావము:- కృష్ణా! మా మనసులు దొంగిలించావు; మా మానాలు అపహరించావు; మా సిగ్గులు దోచావు; మా వస్త్రాలు పట్టుకుపోయావు; ఇంకా ఏమి చేయబోతున్నావో ఏమిటో తెలియము; ఓ కొంటెగోపాలా! నీ గుట్టు కనిపెట్టేసామయ్యా!

తెభా-10.1-824-సీ.
రాజసంబున నీవు రంజిల్లు టెఱుఁగమే-
చెలరేఁగి వింతలు చేయుచుండ?
త్త్వసంపద గల్గి రుగుటఁ దలపమే-
సిరి గల్గి యన్యులఁ జెనకుచుండ?
గురుతర శక్తియుక్తుఁడ వౌట యెఱుఁగమే-
తామసంబున నెగ్గు లఁచుచుండ?
నొకభంగితో నుండకుంట జింతింపమే-
మాయావియై మాఱులయుచుండ?

తెభా-10.1-824.1-ఆ.
నేమి జాడవాఁడ? వేపాటి గలవాఁడ?
వే గుణంబు నెఱుఁగ? వెల్ల యెడల
నొదిగి యుండ నేర వోరంత ప్రొద్దును?
టము లీఁగదయ్య! ద్మనయన!

టీక:- రాజసంబునన్ = రాచఠీవితో,రజోగుణముతో; నీవున్ = నీవు; రంజిల్లుటన్ = ప్రకాశించుటను; ఎఱుగమే = ఎరుగమా, ఎరుగుదుము; చెలరేగి = విజృంభించి; వింతలు = విచిత్రమైనపనులు,సృష్ఠి; చేయుచుండన్ = చేస్తుండగా; సత్త్వసంపద = బలము, సత్త్వగుణము; కల్గి = కలిగుండి; జరుగుట = మెలగుట, స్థితినుంచుట; తలపమె = తెలియమా, తెలియును; సిరి = సంపదలు; కల్గి = ఉండి; అన్యులన్ = సాత్వికులు కానివారిని; చెనకుచుండన్ = కలవరపెట్టుచుండగా; గురుతర = అత్యధికమైన {గురు - గురుతరము - గురుతమము}; శక్తిన్ = బలమును; యుక్తుడవు = కలవాడవు; ఔట = అగుట; ఎఱుగమే = ఎరుగమా, ఎరుగుదుము; తామసంబునన్ = కోపముచేత, తమోగుణముతో; ఎగ్గు = చెరుపు, లయము; తలచుచుండన్ = పొందించుచుండగా; ఒక = ఒకేరకమైన; భంగిన్ = విధముగా; ఉండకుంటన్ = ఉండకపోవుటను; చింతింపమే = తెలియమా, తెలియును; మాయావి = మాయలుచేయువాడవు; ఐ = అయ్యి; మాఱుమలయుచుండన్ = గర్వముతో మెలగుటను; ఏమి = ఎట్టి; జాడ = నడవడికగలవాడవు; ఏపాటిగలవాడవు = ఎంతశక్తిమంతుడవు; ఏ = ఎలాంటి , ఏ.
గుణంబులు = మంచిగుణములు, త్రిగుణములు; ఎఱుగవు = నీయందులేవు; ఎల్ల = అన్ని; ఎడలన్ = చోట్లయందు; ఒదిగి = అణిగి, ఇరుక్కొని; ఉండనేరవు = ఉండలేవు; ఓ = ఒక; అంత = కొంచెమైన; ప్రొద్దును = సమయముకూడ; పటములు = వస్త్రములు; ఈగదా = ఇమ్ము; అయ్య = నాయనా; పద్మనయన = పద్మాక్ష, కృష్ణా.
భావము:- తామరరేకుల వంటి కన్నుల కల ఓ కృష్ణా! నీవు విజృంభించి విచిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటావు. అందుకే నీవు రజోగుణంతో ఒప్పినవాడవని మాకు తెలియదా? సిరి ఉండి కూడా పరులను ఎదిరిస్తూ ఉంటావు. అందుకే నీవు సత్త్వగుణ సంపన్నుడవని మేము ఊహించలేమా? తమోగుణంతో నీవు దుర్మార్గులకు ఎగ్గులు తలపెడుతూ ఉంటావు అందుకే మిక్కిలి గొప్పశక్తితో కూడిన వాడవని మేమనుకోవడం లేదా? మాయతో కూడినవాడవై తిరుగుతూ ఉంటావు కనుకనే ఒకే తీరుగా ఉండేవాడివి కావని మేము భావించడం లేదా? కృష్ణా! నీ జాడ లేమి టయ్యా? నీవు ఎంతటి వాడవు? నీవు గుణమెరుగని వాడివి; ఎప్పుడూ ఒకే చోట కుదురుగా ఉండవు. మా వస్త్రాలు మాకు ఇచ్చెయ్య వయ్యా!

తెభా-10.1-825-క.
రాజుల నెఱుఁగవు బలిమిని
రాజిల్లెదు చీర లీవు మణుల మింకన్
రాజున కెఱిఁగించెద; మో
రాజీవదళాక్ష! నీవు రాజవె ధరకున్? "

టీక:- రాజులన్ = నిను శిక్షించ గలవారిని; ఎఱుగవు = ఎవరులేరు; బలిమినిన్ = స్వశక్తిచేత; రాజిల్లెదు = ప్రకాశించెదవు; చీరలు = వస్త్రములు; ఈవు = ఇయ్యవు; రమణులము = స్త్రీలము మేమందరము; ఇంకన్ = మరి; రాజున్ = ఈదేశ పాలకున; కున్ = కు; ఎఱిగించెదము = తెలిపెదము; ఓ = ఓయీ; రాజీవదళాక్షా = కృష్ణా; నీవున్ = నీ వొక్కడవేనా; రాజవె = రాజువా ఏమి; ధరకున్ = భూమిపైన.
భావము:- రాజీవలోచనాల నల్లనయ్యా! రాజుల మర్యాదలంటే ఏమో నీకు తెలిసినట్లు లేదు. బలవంతుడై నట్లు ప్రవర్తిస్తున్నావు. మేము అబలలము మా వలువలు మాకు ఇయ్యకున్నావు. మేము నందరాజుకు ఈ విషయం చెప్తాము. నీవేమైనా ఈ దేశానికి రాజువా, ఏమిటి?”

తెభా-10.1-826-వ.
అని పలికిన కన్నియల పలుకు లాలించి మందహాస సుందర వదనారవిందుండై గోపాలబాలకులకరంబులం గరంబులు వ్రేసి య మ్ముద్దియల నుద్దేశించి నెఱవాది చతురుం డిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = చెప్పిన; కన్నియల = కన్నెపిల్లల; పలుకులున్ = మాటలను; ఆలించి = విని; మందహాస = చిరునవ్వుగల; సుందర = అందమైన; వదన = మోము అనెడి; అరవిందుడు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; గోపాల = గొల్ల; బాలకుల = పిల్లల; కరంబులన్ = చేతులలో; కరంబులున్ = చేతులు; వ్రేసి = వేసి; ఆ = ఆ యొక్క; ముద్దియలన్ = ముగ్ధల; ఉద్దేశించి = తో; నెఱవాది = చక్కగా మాట్లాడువాడు; చతురుండు = నేర్పరి, కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా గోపికలు అంటున్న మాటలు శ్రీకృష్ణుడు విన్నాడు. ఆయన ముఖపద్మం ముసిముసి నవ్వులతో చక్కగా అయింది. తోటి గొల్లపిల్లల చేతులతో చేతులు కలిపినెరజాణలలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ వనితలతో ఇలా అన్నాడు.

తెభా-10.1-827-శా.
"రామల్ రామలతోడి నీ పనికిగా రాగింతురే మీ క్రియన్
మోమోటేమియు లేక దూఱెదరు మీ మోసంబు చింతింప రం
భో ధ్యంబున నుండి వెల్వడి వెసం బూర్ణేందుబింబాననల్
మీమీ చీరలు వచ్చి పుచ్చుకొనుఁడా; మీకిచ్చెదం జెచ్చెరన్. "

టీక:- రామల్ = స్త్రీలు; రామల = మగవారి; తోడి = తోటి; ఈ = ఇలాంటి; పని = పని; కిగాన్ = కోసము; రాగింతురే = అనురాగము పొందుదురా; మీ = మీ; క్రియన్ = వలె; మోమోటము = మొహమాటము; ఏమియున్ = ఏమాత్రము; లేకన్ = లేకుండగా; దూఱెదరు = దూషించెదరు; మీ = మీ యొక్క; మోసంబు = మనసులోనిమాట; చింతింపరు = తలపరు; అంభో = నీటి; మధ్యంబునన్ = లోపల; నుండి = నుండి; వెల్వడి = బయటకు వచ్చి; వెసన్ = శీఘ్రమే; పూర్ణేందుబింబాననల్ = అందగత్తెలు {పూర్ణేందు బింబానన - పూర్ణ (నిండు) ఇందు (చంద్రుని) బింబ (బింబమువంటి) ఆనన (మోము కలామె), స్త్రీ}; మీమీ = మీలో ఎవరివివారు; చీరలున్ = వస్త్రములను; వచ్చి = ఇక్కడకు వచ్చి; పుచ్చుకొనుడా = తీసుకొనండి; మీ = మీ; కున్ = కు; ఇచ్చెదన్ = ఇచ్చివేసెదను; చెచ్చెరన్ = వెంటనే.
భావము:- “నిండుజాబిలి లాంటి గుండ్రటి మోములు కల ముగుదలులారా! ఆడువారు అవనీపతులతో మీలా ప్రవర్తిస్తారా? కొంచెము కూడా మొహమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారే; కానీ, మీ తప్పు మీరు చూసుకోడం లేదు; నీటిలో నుండి వెంటనే బయటకు వచ్చి, నా దగ్గరకు రండి; మీ వలువలు తీసుకోండి; ఇదిగో ఇప్పుడే మీ కిచ్చేస్తాను.”

తెభా-10.1-828-వ.
అనిన న మ్మానవతు లొండండురుల మొగంబులుచూచి నగుచు, మర్మంబులు నాటిన మాటలకు మగుడం బలుక సిగ్గుపడచు, నగ్గలం బైన చలిని వలిగొని కంఠప్రమాణజలంబులం దుండి డోలాయమాన మానస లై యిట్లనిరి.
టీక:- అనినన్ = అనగా; ఆ = ఆ యొక్క; మానవతులు = అభిమానవంతులు; ఒండొరుల = ఒకరికొకరు; మొగంబులున్ = ముఖములు; చూచి = చూసి; నగుచున్ = నవ్వుతు; మర్మంబులున్ = మర్మములను; నాటిన = తాకినట్టి; మాటలు = మాటల; కున్ = కు; మగుడన్ = మారు; పలుకన్ = పలుకుటకు; సిగ్గుపడుచున్ = లజ్జపొందుతు; అగ్గలంబు = అధికము; ఐన = అయినట్టి; చలిని = చలి వలన; వలిగొని = వణకుపుట్టి; కంఠ = మెడ; ప్రమాణ = లోతు; జలంబులన్ = నీటి; అందున్ = లో; ఉండి = ఉండి; డోలాయమాన = సందేహపడుతున్న; మానసలు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- శ్రీకృష్ణుని పలుకులు వినిన అభిమానవతులైన ఆ గొల్లస్త్రీలు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. మనసు మర్మాలను హరించే మాధవుని మాటలకు బదులు పలకడానికి వారు లజ్జితులయ్యారు. ఎక్కుగా ఉన్న చలికి గడగడ వణుకుతూ గొంతు లోతు నీళ్ళలో నిలబడి వెనుక ముందుకు ఊగిసలాడుతున్న మనసులతో వారు ఇలా అన్నారు.

తెభా-10.1-829-క.
"మా లువ లాగడంబున
నీ వేటికిఁ బుచ్చుకొంటి? నీ వల్పుఁడవే?
నీ వెఱుఁగని దేమున్నది?
నీ వందఱిలోన ధర్మనిరతుఁడవు గదే?

టీక:- మా = మా యొక్క; వలువలు = వస్త్రములను; ఆగడంబునన్ = దుడుకుతనముతో; నీవున్ = నీవు; ఏటికిన్ = ఎందుకు; పుచ్చుకొంటి = తీసుకొంటివి; నీవున్ = నీవు; అల్పుడవే = చిన్నవాడవా; నీవున్ = నీవు; ఎఱుగనిది = తెలియనట్టిది; ఏమి = ఏమిటి; ఉన్నది = ఉంది; నీవున్ = నీవు; అందఱి = అందరి; లోనన్ = అందును; ధర్మనిరతుడవు = ధర్మనిష్ఠ గలవాడవు; కదే = కదా.
భావము:- “అల్లరివాడివై మా వలువలు ఎందుకు దోచాసావు? అందరిలోకి నువ్వే మహా గొప్ప ధర్మపరుడవు కదా. నీవు ఏమన్నా తక్కువవాడవా ఏమిటయ్యా? నీకు తెలియనిది ఏముందిలే.

తెభా-10.1-830-శా.
ఇంతుల్ తోయము లాడుచుండ మగవా రేతెంతురే? వచ్చిరా
యింతల్ చేయుదురే? కృపారహితులై యేలోకమందైన నీ
వింతల్ నీ తలఁబుట్టెఁ గాక; మఱి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ
చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే.

టీక:- ఇంతుల్ = స్త్రీలు; తోయములాడుచున్ = స్నానములు చేయుచు; ఉండన్ = ఉన్నప్పుడు; మగవారు = పురుషులు; ఏతెంతురే = వచ్చెదరా; వచ్చిరా = వచ్చినప్పటికిని; ఇంతల్ = ఇంత ఎక్కువగా; చేయుదురే = చేస్తారా; కృపా = దయ; రహితుల్ = లేనివారు; ఐ = అయ్యి; ఏ = ఎట్టి; లోకము = లోకమున; అందున్ = లో; ఐనన్ = అయినప్పటికి; వింతల్ = ఇలాం టాశ్చర్యకర పనులు; నీ = నీ యొక్క; తలన్ = బుఱ్ఱలోనే; పుట్టెన్ = పుట్టినవి; కాక = అంతే తప్పించి; మఱి = ఇంక; ఏవీ = ఎక్కడ ఉన్నవి; కృష్ణా = కృష్ణా; ఓచెల్ల = ఔరౌర; నీ = నీ; చెంతన్ = వద్ద; దాసులము = భక్తులము; ఐ = అయ్యి; చరించెదము = మెలగెదము; మా = మా యొక్క; చేలంబులు = వస్త్రములు; ఇప్పించవే = ఇచ్చివేయుము.
భావము:- కృష్ణా! ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు. మగవాళ్ళు ఆ ఛాయలకు వస్తారా? వచ్చారే అనుకో దయలేకుండా ఎక్కడైనా ఇలాంటి అల్లరి పనులు చేస్తారా? ఔరా! ఈ విచిత్రమైన చర్యలు నీకే సరిపోయాయిలే. మరింక ఎక్కడా ఉండవు. నీకు బానిసలై ఉంటాము కాని మా కోకలు మాకిప్పించు.

తెభా-10.1-831-క.
చ్చెదము నీవు పిలిచిన;
నిచ్చెద మేమైనఁగాని; నెట జొరు మనినం
జొచ్చెదము; నేఁడు వస్త్రము
లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా! "

టీక:- వచ్చెదము = వత్తుము; నీవున్ = నీవు; పిలిచినన్ = పిలిచినచో; ఇచ్చెదము = ఇచ్చివేసెదము; ఏమైనన్ = ఏదైనను సరే; కానిన్ = కాని; ఎటున్ = ఎక్కడకు; చొరుము = చొరబడుడు; అనినన్ = అన్నప్పటికిని; చొరెదము = చొరబడెదము; నేడు = ఇవాళ; వస్త్రములున్ = బట్టలను; ఇచ్చి = ఇచ్చివేసి; మమున్ = మమ్ములను; కరుణ = దయ; తోడన్ = తోటి; ఏలుము = పాలింపుము; కృష్ణా = కృష్ణా.
భావము:- కృష్ణా! నీవు పిలవగానే వస్తాము. నీ వేది కోరినా ఇస్తాము. నీ వెక్కడికి పొమ్మన్నా పోతాము. ఇప్పుడు మా చీరలు మాకిచ్చేసి దయతో మమ్మేలుకో.”

తెభా-10.1-832-వ.
అనిన దరహసితవదనుండై హరి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; దరహసిత = చిరునవ్వు గల; వదనుండు = మోము గల వాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- గోపికల మాటలువిని చిరునవ్వుతో శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు. . .

తెభా-10.1-833-క.
"ఏ రుణుఁడు మగఁ డౌటకు
మీ పములు చెప్పుఁ డింక మీ యానలు సుం
డీ ప్పిన నీ కూరిమి
మీ లలనె పుట్టెనోటు మేదిని లేదే?

టీక:- ఏ = ఎవరు ఆ; తరుణుడు = యువకుడు {తరుణుడు - యుక్తవయసువాడు, యువకుడు}; మగడు = భర్త; ఔట = అగుట; కున్ = కు; మీ = మీ యొక్క; తపములున్ = తపస్సులు; చెప్పుడు = చెప్పండి; ఇంకన్ = మరి; మీ = మీ మీ; ఆనలు = ఒట్టు; సుండీ = సుమా; తప్పినన్ = లేకపోయినట్లయితే; ఈ = ఇట్టి; కూరిమి = ప్రేమ; మీ = మీ యొక్క; తలలనె = మనసు లందె; పుట్టెనోటు = కలిగినదా ఏమి; మేదినిన్ = భూలోకము నందు; లేదే = లేదా ఏమి, ఉన్నదే కదా.
భావము:- “ఓ పడతులారా! ఏ పడచువాడిని పతిగా కోరి మీరు ఈ వ్రతం చేస్తున్నారో నిజం చెప్పండి, అసత్యమాడితే మీ మీద ఒట్టు సుమా. ఈ వలపు మీకు మాత్రమే పుట్ట లేదు లెండి. లోకంలో సర్వత్రా ఉన్నదే కదా.

తెభా-10.1-834-క.
వ్వనిఁ గని మోహించితి?
రెవ్వఁడు మీ మానధనములెల్ల హరించెన్?
నివ్వటిలె మీకుఁ గూరిమి
యెవ్వనిపైఁ? బలుకరాదె? యే నన్యుఁడనే?"

టీక:- ఎవ్వనిన్ = ఎవరిని; కని = చూసి; మోహించితిరి = మోహమున పడితిరి; ఎవ్వడు = ఎవరు; మీ = మీ యొక్క; మాన = మానములు అనెడి; ధనమున్ = సంపదను; ఎల్లన్ = సమస్తమును; హరించెన్ = అపహరించెను; నివ్వటిలెన్ = వృద్ధిపొందెను; మీ = మీ; కున్ = కు; కూరిమి = స్నేహము; ఎవ్వని = ఎవరి; పైన్ = మీద; పలుకరాదె = చెప్పండి; ఏన్ = నేను; అన్యుడనే = పరాయివాడనా,కాదుకదా.
భావము:- మీరు ఎవరిని చూసి మోహించారు? మీ మానధనం అపహరించిన ఆ మగవాడు ఎవరు? ఎవరి మీద మీకు ప్రణయం నెలకొన్నది? నేనేమైనా పరాయివాడనా! నిజం చెప్పండి.”

తెభా-10.1-835-వ.
అనిన విని సుందరు లన్యోన్య సందర్శనంబులు చేయుచు, హృదయారవిందంబులఁ గందర్పుండు సందడింప నగుచు నిరుత్తరలయి యున్న లోకోత్తరుం డిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; విని = విని; సుందరులు = స్త్రీలు; అన్యోన్య = ఒకరి నొకరు; సందర్శనంబులు = చూచుకొనుట; చేయుచున్ = చేయచు; హృదయ = మనసులు అనెడి; అరవిందంబులన్ = పద్మము లందు; కందర్పుండు = మన్మథుడు; సందడింపన్ = అలజడిరేపగా; నగుచున్ = నవ్వుతు; నిరుత్తరలు = మారు పలుకనివారు; అయి = అయ్యి; ఉన్నన్ = ఉండగా; లోకోత్తరుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని కృష్ణు అడిగిన మాటలు విని గొల్లచెలియలు ఒకరి నొకరు చూచుకున్నారు. వారి హృదయపద్మాలలో మరులు హెచ్చాయి. వారు నవ్వుతూ మిన్నకున్నారు. అప్పుడు లోకమాన్యుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు

తెభా-10.1-836-క.
"నా యింటికి దాసులరై
నా యాజ్ఞ వహించి మీరు డచెదరేనిన్
మీ యంబరంబు లిచ్చెదఁ
దోయంబులు వెడలి రండు తొయ్యలులారా! "

టీక:- నా = నా యొక్క; యింటి = నివాసమున, వద్ద; కిన్ = కి; దాసులరు = సేవచేయువారు, భక్తులు; ఐ = అయ్యి; నా = నా యొక్క; ఆజ్ఞ = చెప్పినమాట; వహించి = పూని, ధరించి; మీరు = మీరు; నడచెదరు = అలా వర్తించెదరు; ఏనినే = అయినచో; మీ = మీ యొక్క; అంబరంబులు = వస్త్రములు; ఇచ్చెదన్ = ఇచ్చివేసెదను; తోయంబులున్ = నీటినుండి; వెడలి = వెలువడి; రండు = రండి; తొయ్యలులారా = ఓ ఇంతులు.
భావము:- “ఓ వనితలారా! నా ఇంటిదాస్యం చేస్తూ నా అజ్ఞ ప్రకారం మీరు నడచుకుంటామంటే, మీ చీరలు మీకిస్తాను. నీటిలో నుండి బయటకు రండి.”

తెభా-10.1-837-వ.
అనిన విని హరిమధ్యలు చలికి వెఱచి సలిలమధ్యంబున నిలువనోపక.
టీక:- అనినన్ = అని చెప్పగా; విని = విని; హరిమధ్యలు = అందగత్తెలు {హరి మధ్యలు - సింహమువంటి నడుము కలవారు, స్త్రీలు}; చలి = శీతగాలి; కిన్ = కి; వెఱచి = బెదరి; సలిల = నీటి; మధ్యంబునన్ = లో; నిలువన్ = ఉండ; ఓపకన్ = లేక;
భావము:- ఆ కృష్ణుడి మాటలు విన్నారు. సన్నని నెన్నడుములు కల ఆ గొల్లభామలు చలికి భయపడి నీటిలో ఉండ లేకపోయారు.

తెభా-10.1-838-క.
కొంఱు వెడలుద మందురు;
కొంఱు వెడలుటయు సిగ్గుఁగొను గోవిందుం
డందురు; కొందఱు దమలోఁ
గొంల మందుదురు వడఁకుఁగొని మనుజేంద్రా!

టీక:- కొందఱు = కొంతమంది; వెడలుదము = వెళ్దాము; అందురు = అనుచున్నారు; కొందఱు = కొంతమంది; వెడలుటయున్ = వెళ్ళగానే; సిగ్గున్ = సిగ్గిలునట్లు; కొనున్ = చేయును; గోవిందుండు = కృష్ణుడు; అందురు = అనుచున్నారు; కొందఱున్ = కొంతమంది; తమలో = మనసు లందు; కొందలము = కలత; అందుదురు = పడుదరు; వడకున్ = వణికి; కొని = పోతు; మనుజేంద్ర = రాజా {మనుజేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! చలికి గడగడ లాడుతూ ఆ కన్నెలలో కొందరు “బయటకు వెళదాం” అంటారు; “వెళితే శ్రీ కృష్ణుడు మన సిగ్గు తీయడం తధ్యం” అంటారు మరికొందరు; ఇంకొందరు ఎటూతోచక తమలో ఆందోళన చెందుతున్నారు.

తెభా-10.1-839-వ.
మఱియు నెట్టకేలకుఁ జిత్తంబులు గట్టిపఱచుకొని తనుమధ్యలు తోయ మధ్యంబు వెలువడి.
టీక:- మఱియున్ = మళ్ళీ; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; చిత్తంబులున్ = మనసులు; గట్టిపఱచుకొని = దృఢపరచుకొని; తనుమధ్యలు = యువతలు {తనుమధ్యలు - సన్నని నడుము కలవారు, స్త్రీలు}; తోయ = నీటి; మధ్యంబు = నడుమనుండి; వెలువడి = బయటపడి.
భావము:- చిట్టచివరకు ఎలాగో మనసులు దిటవు పరచుకుని సన్నని నడుములు కల ఆ గోపకన్యలు నీటిలో నుండి బయటకు వచ్చారు.

తెభా-10.1-840-క.
చంత్పల్లవ కోమల
కాంన నవరత్నఘటిత కంకణరుచిరో
దంచిత కరసంఛాదిత
పంచాయుధగేహ లగుచుఁ డతులు వరుసన్.

టీక:- చంచత్ = వణుకుతున్నట్టి; పల్లవ = చిగురాకుల వంటి; కోమల = మృదువైన; కాంచన = బంగారపు; నవరత్న = నవరత్నములు {నవరత్నములు - 1వజ్రము 2వైఢూర్యము 3గోమేధికము 4పుష్యరాగము 5మరకతము 6మాణిక్యము 7నీలము 8ప్రవాళము 9ముత్యము అనెడి తొమ్మిది మణులు}; ఘటిత = పొదిగినట్టి; కంకణ = గాజులు; రుచిర = ప్రకాశవంతములైన; ఉత్ = మిక్కిలి; అంచిత = అందమైన; కర = చేతులచే; సంఛాదిత = బాగా కప్పుకొన్నట్టి; పంచాయుధగేహలు = గుహ్యేంద్రియము కలవారు {పంచాయుధగేహము - పంచాయుధుని (మన్మథుని) గేహము (నివాసము), స్త్రీల రహస్యేంద్రియము, ఉపస్తు}; అగుచున్ = ఔతు; పడతులు = ఇంతులు; వరుసన్ = వరసకట్టి.
భావము:- ఆ స్త్రీలు చిగురుటాకువలె మృదువైనవీ; నవరత్నాలు పొదిగిన బంగారుగాజుల కాంతితో మిలమిల మెరిసేవి; అయిన తమ చేతులతో మర్మాంగాలు దాచుకుని మడుగు నుండి క్రమంగా బయటకు వచ్చారు.

తెభా-10.1-841-వ.
చని ప్రౌఢలైన సుందరుల ముందట నిడుకొని మందగమనలు మందహాసంబుతోడ నెదుర నిలిచిన నరవిందనయనుం డిట్లనియె.
టీక:- చని = వెళ్ళి; ప్రౌఢలు = పెద్దవారు; ఐన = అయినట్టి; సుందరులన్ = అందగత్తెలను; ముందటన్ = వరుసలో ముందువైపు; ఇడుకొని = పెట్టుకొని; మందగమనలు = ఇంతులు {మంద గమనలు - మెల్లని నడక కలవారు, స్త్రీలు}; మందహాసంబు = చిరునవ్వుల; తోడన్ = తోటి; ఎదురన్ = ఎదురుగా; నిలిచినన్ = నిలబడగా; అరవిందనయనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ఇట్లు = ఈ విధము; అనియె = పలికెను.
భావము:- మెల్లగ నడిచే ఆ గొల్లభామలు తమలో పెద్దవారు అయిన పడతులను ముందు నిలుపుకుని, చిరునవ్వులు చిందిస్తూ, కమలనేత్రుని ఎదుట నిలిచారు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడు .

తెభా-10.1-842-సీ.
"శృంగారవతులార! సిగ్గేల? మిముఁ గూడి-
పిన్ననాటను గోలెఁ బెరిగినాఁడ;
నెఱుఁగనే మీలోన నెప్పుడు నున్నాఁడ-
నేను జూడని మర్మ మెద్ది గలదు?
వ్రతనిష్ఠలై యుండి లువలు గట్టక-
నీరు జొత్తురె మీరు నియతిఁ దప్పి?
కాత్యాయనీదేవిఁ ల్ల చేయుట గాక-
నీ రీతి నోమువా రెందుఁ గలరు?

తెభా-10.1-842.1-ఆ.
వ్రతము ఫలము మీకు లసినఁ జక్కఁగ
నింతు లెల్లఁ జేతు లెత్తి మ్రొక్కి
చేరి పుచ్చుకొనుఁడు చీరలు; సిగ్గు పో
నాడనేల? యెగ్గు లాడనేల?"

టీక:- శృంగారవతులారా = ఓ పడతులు; సిగ్గున్ = లజ్జించుట; ఏలన్ = ఎందుకు; మిమున్ = మిమ్ములను; కూడి = కలిసి; పిన్ననాటను = చిన్నప్పటి; గోలెన్ = నుండి; పెఱిగినాడన్ = పెరిగినవాడను; ఎఱుగనే = తెలిసినవాడనుకానా ఏమి; మీ = మీ; లోనన్ = లోపల; ఎప్పుడున్ = ఎప్పుడు; ఉన్నాడన్ = ఉన్నవాడనే; నేనున్ = నేను; చూడని = తెలియనట్టి; మర్మము = రహస్యము; ఎద్ది = ఏమిటి; కలదు = ఉన్నది; వ్రత = నోమునోచెడి; నిష్ఠలు = సంకల్పించుకొన్నవారు; ఐ = అయ్యి; ఉండి = ఉండికూడ; వలువలు = బట్టలు; కట్టకన్ = కట్టుకొనకుండ; నీరున్ = నీటిలోకి; చొత్తురె = దిగుతారా; మీరు = మీరు; నియతిన్ = నియమమును; తప్పి = తప్పి; కాత్యాయనీదేవి = పార్వతీదేవిని; కల్ల = మోసము; చేయుట = చేయుట; కాకన్ = అగునట్లుగా; ఈ = ఈ; రీతిన్ = విధముగ; నోమున్ = వ్రతమునోచు; వారు = వారలు; ఎందు = ఎక్కడ; కలరు = ఉంటారు, ఉండరు.
వ్రతము = నోము యొక్క; ఫలమున్ = ప్రయోజనము; మీ = మీ; కున్ = కు; వలసినన్ = కావలసినచో; చక్కగా = చక్కగా; ఇంతులు = పడతులు; ఎల్లన్ = అందరు; చేతులన్ = చేతులను; ఎత్తి = పైకెత్తి; మ్రొక్కి = నమస్కరించి; చేరి = దగ్గరకు వచ్చి; పుచ్చుకొనుడు = తీసుకోండి; చీరలు = వస్త్రములు; సిగ్గున్ = సిగ్గు; పోన్ = పడుతున్నట్లు; ఆడన్ = మాట్లాడుట; ఏలన్ = ఎందుకు; ఎగ్గు = దూషణములు; ఆడన్ = పలుకుట; ఏలన్ = ఎందుకు.
భావము:- “అమ్మాయిలూ! ఎందుకు సిగ్గుపడతారు? చిన్నప్పటి నుంచీ మీతోనే పెరిగాను కదా. ఎప్పుడూ మీతోనే ఉన్నాను. నాకు తెలియదా. నేను చూడని రహస్యం ఏముంది. మీరు కాత్యాయనీ వ్రతదీక్షను ఆచరిస్తూ కూడా చీరలు ధరించకుండా, నియమం విడిచిపెట్టి జలకాలు ఆడవచ్చునా? ఇది అంబికాదేవికి అపరాధం చేయడమే కదా. ఈ విధముగా నోమునోచే జవ్వనులు ఎక్కడైనా ఉంటారా? వ్రతఫలం దక్కాలని మీరు అనుకుంటే చక్కగా చేతులెత్తి నాకు నమస్కరించండి. నా చెంతకు వచ్చి మీ బట్టలు పుచ్చుకోండి. సిగ్గు చెడేటట్లు చెప్పడం ఎందుకు? ఇలా దెప్పడం ఎందుకు?”

తెభా-10.1-843-వ.
అనిన విని మానవతులు తమలోన.
టీక:- అనినన్ = అనగా; విని = విని; మానవతులు = పడతులు {మానవతులు - మంచి మానము కలవారు, మంచిస్త్రీలు}; తమలోన = వారిలోవారు.
భావము:- అభిమానవతులైన ఆ యువతులు పరమపురుషుని పలుకులు విని ఇలా తమలో ఆలోచించుకుని. . . .

తెభా-10.1-844-మ.
వ్రముల్ జేయుచు నొక్క మాటయిన నెవ్వానిన్ విచారించినన్
వ్రభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు లీక్షించియున్
చేలాప్లవనంబు నేడు వ్రతభంగం బంచు శంకించి ఫా
ట న్యస్త కరాబ్జలై సరసలీలన్ మ్రొక్కి రట్లందఱున్.

టీక:- వ్రతముల్ = నోములు; చేయుచున్ = నోచుచు; ఒక్క = ఒకేఒక; మాటు = సారి; అయినన్ = అయినప్పటికి; ఎవ్వానిన్ = ఎవనిని; విచారించినన్ = తలచినచో; వ్రత = వ్రతములకు కలుగు; భంగంబులున్ = విఘ్నములు; మానున్ = తొలగిపోవునో; అట్టి = అటువంటి; వరదున్ = కృష్ణుని {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; వామాక్షులు = అందగత్తెలు {వామాక్షి - వామమైన (అందమైన) అక్షి (కన్నులు కలామె), స్త్రీ}; ఈక్షించియున్ = దర్శించినప్పటికి; గత = విడిచిన; చేలా = వస్త్రములతో; ప్లవనంబు = స్నానము చేయుట; నేడు = ఇవాళ; వ్రత = నోమునకు; భంగంబున్ = చెరుపు; అంచున్ = అని; శంకించి = సందేహించి; ఫాలతట = నుదుటిపై; న్యస్త = ఉంచిన; కర = చేతులు అనెడి; అబ్జలు = పద్మములు కలవారు; ఐ = అయ్యి; సరస = తగిన; లీలన్ = విధముగ; మ్రొక్కిరి = నమస్కరించిరి; అట్లు = ఆవిధముగ; అందఱున్ = ఎల్లరు.
భావము:- అభిమతాలైన వ్రతాలు ఆచరిస్తూ ఒక్కసారి ఏ ఉత్తమశ్లోకుడిని స్మరిస్తే వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అట్టి వరాలు ప్రసాదించే పరాత్పరుణ్ణి ఆ గొల్లభామలు వీక్షించారు. కట్టుకోకలు విడచి స్నానమాడటం వ్రతభంగం అవ్న సంగతి తెలుసుకుని, వారు జంకారు. అందరూ అరవిందాల వంటి అందమైన తమ హస్తాలను నుదుట ఉంచుకుని కృష్ణుడికి ఒయ్యారంగా మ్రొక్కారు.