పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలరాముని ఘోష యాత్ర

బలరాముని ఘోషయాత్ర

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలరాముని ఘోష యాత్ర)
రచయిత: పోతన


తెభా-10.2-483-సీ.
రనాథ! విను మొకనాఁడు తాలాంకుండు-
చుట్టాల బంధులఁ జూచు వేడ్క
సుందర కాంచన స్యందనారూఢుఁడై-
భాసిల్లుచున్న వ్రేల్లె కరిగి
చిరకాల సంగత స్నేహులై గోప గో-
పాంగనా నికర మాలింగనములు
ముచిత సత్కృతుల్‌ లుపఁ గైకొని మహో-
త్సుక లీల నందయశోదలకును

తెభా-10.2-483.1-తే.
వందనం బాచరించిన వారు మోద
మంది బిగియారఁ గౌఁగిళ్ల నొందఁ జేర్చి
మత దీవించి యంకపీమునఁ జేర్చి
శిము మూర్కొని చుబుకంబుఁ ము పుణికి.

టీక:- నరనాథ = పరీక్షిన్మహారాజా; వినుము = వినుము; ఒక = ఒకానొక; నాడు = దినమున; తాలాంకుండు = బలరాముడు {తాలాంకుడు - తాడిచెట్టు జండాగా కలవాడు, బలరాముడు}; చుట్టాలన్ = చుట్టములను; బంధులన్ = జ్ఞాతులను; చూచు = చూసెడి; వేడ్కన్ = కుతూహలముతో; సుందర = అందమైన; కాంచన = బంగారు; స్యందన = రథమును; ఆరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; భాసిల్లుచున్న = ప్రకాశించుచున్న; వ్రేపల్లె = వ్రేపల్లె {వ్రేపల్లె - రామ కృష్ణులు చిన్నతనము గడపిన నందుని మంద}; కున్ = కు; అరిగి = వెళ్ళి; చిరకాల = చాలాకాలమునకు; సంగత = కూడిన; స్నేహులు = మిత్రులు కలవాడు; ఐ = అయ్యి; గోప = గోపకులు; గోపాంగనా = గోపికాస్త్రీల; నికరము = సమూహము; ఆలింగనములు = కౌగలింతలను; సముచిత = తగిన; సత్కృతుల్ = మర్యాదలు; సలుపన్ = చేయుచుండగా; కైకొని = స్వీకరించి; మహా = గొప్పగా; ఉత్సుక = ఇష్టమైనకార్యముచేయు; లీలన్ = రీతిని; నంద = నందుడు; యశోదల = యశోదాదేవిల; కునున్ = కు; వందనంబులు = నమస్కారములు; ఆచరించినన్ = చేయగా; వారున్ = వారు; మోదమున్ = సంతోషమును; అంది = పొంది; బిగియార = గట్టిగా; కౌగిళ్ళన్ = సందిళ్ళలో; ఒందన్ = పొందునట్లు; చేర్చి = చేర్చుకొని; సమతన్ = చక్కగా; దీవించి = ఆశీర్వదించి; అంకపీఠమునన్ = ఒడిలో; చేర్చి = ఉంచుకొని; శిరమున్ = తలను; మూర్కొని = మూజూసి, వాసనచూసి; చుబుకంబున్ = గడ్డమును; కరమున్ = చేతితో; పుణికి = పుణికిపట్టుకొని.
భావము:- మహారాజా! ఒకనాడు బలరాముడు తన బంధుమిత్రులను చూసి రావడానికి సుందరమైన బంగారురథం ఎక్కి, వ్రేపల్లెకు వెళ్ళాడు. చాలా కాలం పాటు స్నేహ సాంగత్యాలు ఉండడం చేత గోపికలు గోపాలురు అతనిని ఆలింగనం చేసుకుని, తగిన మర్యాదలు చేశారు. ఆ గౌరవాలు అందుకుని బలరాముడు యశోదా నందులకు నమస్కరించాడు. వారు ఎంతో సంతోషించి కౌగలించుకున్నారు. దీవించి దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా తడిమారు.

తెభా-10.2-484-వ.
మఱియు నానందబాష్పధారాసిక్త కపోలయుగళంబులతోడం గుశలప్రశ్నంబుగా నిట్లని “రన్నా! నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారె? మమ్మెప్పుడు నరసిరక్షింప వలయు; మాకు నేడుగడయ మీరకాక యొరులు గలరే?” యని సముచిత సంభాషణంబులం బ్రొద్దుపుచ్చుచుండి; రంత.
టీక:- మఱియున్ = ఇంకను; ఆనంద = సంతోషముతోటి; బాష్ప = కన్నీటి; ధారా = ధారలతో; సిక్త = తడిసిన; కపోల = చెక్కిళ్ళ; యుగళంబుల = జంటల; తోడన్ = తోటి; కుశలప్రశ్నంబు = క్షేమసమాచార మడుగుచు; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి; అన్నా = నాయనా; నీవును = నీవు; నీ = నీ యొక్క; చిన్న = చిన్న; తమ్ముండు = తమ్ముడు; అగున్ = ఐన; వెన్నుండును = కృష్ణుడు; లెస్స = బాగా; ఉన్నవారె = ఉన్నారా; మమున్ = మమ్మలను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; అరసి = చూసుకొని; రక్షింపవలయున్ = కాపాడవలెను; మా = మా; కున్ = కు; ఏడుగడయ = రక్షకులు, దిక్కు; మీర = మీరే; కాక = తప్పించి; ఒరులు = మరింకొకరు; కలరే = ఉన్నారా, లేరు; అని = అని; సముచిత = తగినట్టి; సంభాషణంబులన్ = మాటలతో; ప్రొద్దు = కాలము; పుచ్చుచున్ = గడపుచు; ఉండిరి = ఉన్నారు; అంత = అంతట.
భావము:- ఆనందబాష్పాలు జాలువారుతుండగా కుశలప్రశ్నలు వేశారు “బలరామా! నీవూ నీ ముద్దుల తమ్ముడు కృష్ణుడూ క్షేమంగా ఉన్నారా? మమ్మల్ని మీరే రక్షించాలి. మాకు దిక్కు మీరు కాక మరెవరు ఉన్నారు” అంటూ సంతోషంతో చక్కగా సంభాషించారు.

తెభా-10.2-485-క.
గోపాలవరులు ప్రమదం
బాపోవని మది నివర్తి తాఖిల గేహ
వ్యాపారు లగుచు హలధరు
శ్రీపాదంబులకు నతులు సేసిరి వరుసన్.

టీక:- గోపాల = గోపకులలో; వరులు = ముఖ్యులు; ప్రమదంబు = సంతోషము; ఆపోవని = తనివితీరని; మదిన్ = మనసుతో; నివర్తిత = విడువబడిన; అఖిల = ఎల్ల; గేహ = గృహ సంబంధమైన; వ్యాపారులు = పనులు కలవారు; అగుచున్ = ఔతు; హలధరు = బలరాముని; శ్రీ = సంపత్కరము లగు; పాదంబుల్ = పాదముల; కున్ = కు; నతులు = మొక్కుట; చేసిరి = చేసిరి; వరుసన్ = వరసగా.
భావము:- అక్కడి గోపాలురు ఆనందంతో నిండిన హృదయాలతో తమ గృహకృత్యాలు మరచి మరీ బలరాముడికి పాదనమస్కారాలు చేశారు.

తెభా-10.2-486-క.
సీరియు వారికిఁ గరుణో
దారుండై నడపె సముచిక్రియ లంతం
గోరి తన యీడు గోపకు
మారులఁ జే చఱచి బలుఁడు మందస్మితుఁడై.

టీక:- సీరియున్ = బలరాముడు {సీరి - సీరము (నాగలి) ఆయుధముగా కలవాడు, బలరాముడు}; వారి = వారల; కిన్ = కి; కరుణ = దయ; ఉదారుండు = అధికముగా కలవాడు; ఐ = అయ్యి; నడపెన్ = చేసెను; సముచిత = తగిన; క్రియలన్ = మర్యాదలను; అంతన్ = అంతట; కోరి = ఇష్టముతో; తన = అతనికి; ఈడు = సమాన వయస్కు లైన; గోప = గొల్ల; కుమారులన్ = పిల్లవాళ్ళను; చేన్ = చేతితో; చఱచి = తట్టి; బలుడు = బలరాముడు; మందస్మితుడు = చిరినవ్వు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- హాలాయుధుడు బలరాముడు దయామయుడై వారందరినీ యథోచితంగా గౌరవించాడు. అటు పిమ్మట తన ఈడువారైన కొందరు గోపాలురను స్నేహపూర్వకంగా చేతితో చరచి చిరునవ్వు నవ్వాడు.

తెభా-10.2-487-క.
ని సుందర దేహద్యుతి
తాచలరుచులఁ దెగడ రాముఁడు వారల్‌
జియింప నేగి యొకచో
వినస్థలమున వసించి విలసిల్లు నెడన్.

టీక:- నిజ = తన; సుందర = అందమైన; దేహ = శరీరపు; ద్యూతిన్ = కాంతితో; రజతాచల = కైలాసపర్వతము; రుచులన్ = కాంతులను; తెగడన్ = తిరస్కరింపగా; రాముడు = బలరాముడు; వారల్ = వారు; భజియింపన్ = కొలుచుచుండగా; ఏగి = వెళ్ళి; ఒక = ఒకానొక; చోన్ = చోట; విజన = నిర్జనమైన; స్థలమునన్ = ప్రదేశము నందు; వసించి = ఉండి; విలసిల్లున్ = వినోదించుచుండు; ఎడన్ = సమయము నందు.
భావము:- బలభద్రుడు వెండికొండ వంటి తెల్లని శరీర కాంతులుతో శోభిస్తూ, గోపాలురతో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ఆ సమయంలో...

తెభా-10.2-488-కవి.
ణములం గనస్ఫుట నూపుర; జాలము ఘల్లనుచుం జెలఁగం
ములఁ గంకణముల్‌ మొరయన్ నలి; కౌనసియాడఁ గుచాగ్రములన్
రులు నటింపఁ గురుల్‌ గునియన్ విల; న్మణికుండల కాంతులు వి
స్ఫురిత కపోలములన్ బెరయన్ వ్రజ; సుందరు లందఱమందగతిన్.

టీక:- చరణములన్ = కాళ్లకు; కనక = బంగారపు; స్ఫుటత్ = పెద్దగా కనబడుతున్న; నూపుర = అందెల; జాలము = సమూహము; గల్లు = గల్లు; అనుచున్ = అను శబ్దము చేయుచు; చెలంగన్ = మోగుతుండగా; కరములన్ = చేతు లందలి; కంకణముల్ = కడియములు; మొరయన్ = చప్పుడు చేస్తుండగా; నలి = సన్నని; కౌను = నడుము; అసియాడన్ = ఊగుతుండగా; కుచ = స్తనముల; అగ్రములన్ = పైన; సరులు = హారములు; నటింపన్ = అల్లాడుచుండగా; కురుల్ = తల వెంట్రుకలు; గునియన్ = కదలాడుచుండగా; విలసత్ = ప్రకాశించుచున్న; మణి = రత్నాల; కుండల = చెవికుండలముల; కాంతులు = ప్రకాశపు కిరణములు; విస్ఫురిత = బాగా ప్రకాశిస్తున్న; కపోలములన్ = చెక్కిళ్ళ యందు; బెరయన్ = వ్యాపించగా; వ్రజ = గొల్ల; సుందరులు = భామలు; అందఱున్ = అందరు; మంద = మెల్లని; గతిన్ = నడకతో.
భావము:- కాళ్ళ బంగారుపట్టాలు ఘల్లుఘల్లు మని శబ్దం చేస్తుండగా, చేతికంకణాలు గణగణ ధ్వనిస్తుండగా నడుము చలిస్తూ ఉండగా, వక్షస్థలంపై తారాహారాలు నటిస్తుండగా, మణికుండలాల కాంతులు కపోలాలపై వ్యాపిస్తుండగా, గొల్లభామలు మెల్లగా అక్కడకి వచ్చారు.

తెభా-10.2-489-కవి.
ని బలభద్రుని శౌర్య సముద్రుని; సంచితపుణ్యు నణ్యునిఁ జం
ఘనసార పటీర తుషారసు; ధా రుచికాయు విధేయు సుధా
రిపుఖండను న్మణిమండను; సారవివేకు నశోకు మహా
త్మునిఁ గని గోపిక లోపిక లేక య; దుప్రభు నిట్లని రుత్కలికన్.

టీక:- చని = పోయి; బలభద్రుని = బలరాముని; శౌర్య = పరాక్రమము; సముద్రుని = సముద్ర మంత కలవానిని; సంచిత = కూడగట్టుకొనిన; పుణ్యున్ = పుణ్యము కలవానిని; అగణ్యునిన్ = ఎంచ శక్యము కానివానిని; చందన = గంధము; ఘనసార = కర్పూరము; పటీర = మంచిగంధము పూత; తుషార = మంచు; సుధా = అమృతము వంటి; రుచి = వర్ణము కల; కాయున్ = దేహము కలవానిని; విధేయున్ = వినయము కలవానిని; సుధాశనరిపుఖండను = బలరాముని {సుధాశన రిపు ఖండనుడు - సుధాశన (అమృతము ఆహారముగా గల, దేవతల) రిపు (శత్రువులను) ఖండనుడు (సంహరించిన వాడు), బలరాముడు}; సత్ = మంచి; మణి = రత్నాలచే; మండనున్ = అలంకరింపబడినవాని; సార = మిక్కిలి; వివేకున్ = వివేకము కలవానిని; అశోకున్ = నిత్యానందు డైన వానిని; మహాత్మునిన్ = గొప్పవానిని; కని = చూసి; గోపికలు = గొల్లభామలు; ఓపిక = తాలిమి; లేక = లేక; యదు = యాదవ; ప్రభున్ = రాజుతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = చెప్పిరి; ఉత్కలికన్ = తమకములతో.
భావము:- అలా వచ్చి, శౌర్య సముద్ఱ్ఱుడూ, చందనం వలె కర్పూరం వలె, మంచు వలె, అమృతం వలె, తెల్లని కాంతితో విలసిల్లుతున్నవాడూ, రాక్షసాంతకుడూ, వివేకవంతుడూ అయిన ఆ యాదవశ్రేష్ఠుడు బలరాముడిని చూసి, ఆపుకోలేని అనురాగంతో ఇలా అన్నారు.

తెభా-10.2-490-చ.
"ధర! నీ సహోదరుఁ డుదంచిత కంజవిలోచనుండు స
ల్లలిత పురాంగనా జనవిలాస విహార సమగ్ర సౌఖ్యముల్‌
లిగి సుఖించునే? మము నొకానొక వేళన యేని బుద్ధిలోఁ
లఁచునొ? నూతనప్రియలఁ దార్కొని యేమియుఁ బల్కకుండునో?

టీక:- హలధర = బలరామా; నీ = నీ యొక్క; సహోదరుడు = తోడపుట్టినవాడు; ఉదంచిత = మిక్కిలి చక్కనైన; కంజవిలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; సల్లలిత = మిక్కిలి మనోజ్ఞమైన; పుర = పట్టణవాసపు; అంగనా = స్త్రీల; జన = సమూహము యొక్క; విలాస = వినోదకరమైన; విహార = సంచారములు వలన; సమగ్ర = పరిపూర్ణమైన; సౌఖ్యముల్ = సుఖములు; కలిగి = కలిగి; సుఖించునే = సుఖముగా ఉన్నాడా; మమున్ = మమ్మల్ని; ఒకానొక = ఏదైనా ఒక; వేళనన్ = సమయము నందు; ఏనిన్ = అయినను; బుద్ధి = మనస్సు; లోన్ = అందు; తలచునొ = తలచుకొనునో; నూతన = కొత్త; ప్రియలన్ = ప్రియురాండ్రను; తార్కొని = కలిసి; ఏమియున్ = ఏమి కూడ; పల్కకుండునో = తలచకుండునో.
భావము:- “ఓ హాలాయుధుడా! బలరామా! నీ సోదరుడు పద్మాక్షుడు కృష్ణుడు అంతఃపురకాంతలతో విహరిస్తూ ఆనందిస్తున్నాడా? మమ్మల్ని ఎప్పుడైనా తలచుకుంటున్నాడా? క్రొత్త కాంతల వలన కలిగిన ఆనందంలో మైమరచి మమ్మల్ని గూర్చి మాట్లాడటం మానివేశాడా?

తెభా-10.2-491-క.
నీ జనకుల ననుజులఁ
నుజుల బంధువుల మిత్రతుల విడిచి నె
మ్మమున నొండు దలంపక
ను నమ్మినవారి విడువఁగునే హరికిన్?

టీక:- జననీజనకులన్ = పుట్టించిన తల్లిదండ్రులను; అనుజులన్ = తోడబుట్టినవారిని; తనుజులన్ = తనకు పుట్టినవారిని; బంధువులన్ = చుట్టములను; మిత్ర = స్నేహితుల; తతులన్ = సమూహములను; విడిచి = విడిచిపెట్టి; నెమ్మనమునన్ = నిండుమనసుతో; ఒండు = మరొక; తలంపక = చింత లేకుండ; తనున్ = తనను; నమ్మిన = నమ్మినట్టి; వారిన్ = వారిని; విడువన్ = విడిచిపెట్టుట; తగునే = న్యాయమేనా; హరి = కృష్ణుని; కిన్ = కి.
భావము:- మనస్సులో ఏమాత్రం సంకోచించకుండా తల్లితండ్రులనూ, సోదరులనూ, పుత్రులనూ, బంధువులనూ, మిత్రులనూ అందరినీ విడచి తననే నమ్ముకున్న మమ్మల్ని విడిచివెళ్ళటం శ్రీకృష్ణుడికి న్యాయమా, చెప్పు?

తెభా-10.2-492-సీ.
లలిత యామునసైకత స్థలమున-
నుండ మమ్మే మని యూఱడించె
విమల బృందావన వీథి మా చుబుకముల్‌-
పుణుకుచే నే మని బుజ్జగించెఁ
బుష్పవాటికలలోఁ బొలుచు మా కుచయుగ్మ-
మంటుచు నే మని యాదరించెఁ
గాసారముల పొంతఁ గౌఁగిట మముఁ జేర్చి-
య మొప్ప నే మని మ్మఁ బలికె

తెభా-10.2-492.1-తే.
న్నియు మఱచెఁ గాఁబోలు వెన్నుఁ డాత్మ
గోరి తాఁ జాయలున్నైన వారి విడుచు
ట్టి కృష్ణుఁడు దము ఱట్టువెట్టు ననక
యేల నమ్మిరి పురసతుల్‌ బేల లగుచు. "

టీక:- సలలిత = మనోజ్ఞమైన; యామున = యమునానది యొక్క; సైకత = ఇసుకతిన్నెల మీది; స్థలమునన్ = ప్రదేశమునందు; ఉండన్ = ఉండగా; మమ్మున్ = మమ్మల్ని; ఏమి = ఏమి; అని = చెప్పి; ఊఱడించెన్ = ఊరుకోబెట్టెను; విమల = నిర్మలమైన; బృందావన = బృందావనమునందలి; వీథిన్ = ప్రదేశమునందు; మా = మా యొక్క; చుబుకముల్ = గడ్డములు; పుణుకుచున్ = పట్టుకొని; ఏమి = ఏమి; అని = చెప్పి; బుజ్జగించెన్ = సముదాయించెను; పుష్ప = పూల; వాటికల = తోటల; లోన్ = లో; పొలుచు = ఉన్నట్టి; మా = మా యొక్క; కుచ = స్తనముల; యుగ్మమున్ = జంటను; అంటుచున్ = తాకుతు; ఏమి = ఏమి; అని = చెప్పి; ఆదరించెన్ = ఓదార్చెను; కాసారముల = సరస్సుల; పొంతన్ = వద్ద; కౌగిటన్ = కౌగిళ్ళలో; మమున్ = మమ్మల్ని; చేర్చి = తీసుకొని; నయము = బాగుండుట; ఒప్పన్ = కలుగగా; ఏమి = ఏమి; అని = చెప్పి; నమ్మబలికెన్ = నమ్మించెను; అన్నియున్ = అన్నిటిని; మఱచెన్ = మరచిపోయేడు; కాబోలు = కాబోలు; వెన్నుడు = కృష్ణుడు; ఆత్మ = మనసునందు; కోరి = కావాలని; తాన్ = తను; జాయలున్ = భార్యలు {జాయ – పెండ్లాము, వ్యు. జాయతే అస్యామ్ల – జనీ – ప్రాదుర్భావే – జనీ + యక్, కృ.ప్ర., పుత్ర రూపమున తానే యీమె యందు పుట్టుటచే ఈ వ్యవహారము}; ఐన = అగు; వారిన్ = వారిని; విడుచునట్టి = వదలిపెట్టెడి; కృష్ణుడు = కృష్ణుడు; తమున్ = తమను; ఱట్టుపెట్టున్ = అల్లరిచేయును; అనక = ఎంచక; ఏల = ఎందుకు; నమ్మిరి = నమ్మారు; పుర = పట్టణవాసపు; సతుల్ = స్త్రీలు; బేలలు = తెలివిలేనివారు; అగుచున్ = ఔతు.
భావము:- యమునానది ఇసుకతిన్నెల మీద మమ్మల్ని ఏమేమో చెప్పి ఎంత ఊరడించాడో; బృందావనంలో మా గడ్డాలు పట్టుకుని ఎంతలా బుజ్జగించాడో; పూల తోటలలో మా వక్షస్థలాన్ని తాకుతూ ఏ విధంగా ఆదరించాడో; సరోవరాల ప్రాంతాలలో మమ్మల్ని కౌగలించుకుని ఎంత విశ్వాసంగా మట్లాడాడో; మున్నగు విషయాలు అన్నింటినీ మరచిపోయాడు కాబోలు. శ్రీకృష్ణుడు తన్ను కోరి వలచివచ్చిన భార్యనైనా విడువ గలిగినవాడు. అటువంటి వానిని పురకాంతలు బేలలు లాగ ఎందుకు నమ్మారో?”

తెభా-10.2-493-మ.
ని యిబ్భంగి సరోజలోచనుని నర్మాలాపముల్‌ నవ్వులు
న్ననుబంధుల్‌ పరిరంభణంబులు రతివ్యాసంగముల్‌ భావముల్‌
వియంబుల్‌ సరసోక్తులుం దలఁచి యువ్విళ్ళూరు చిత్తంబులన్
నితానంగశరాగ్నిచేత దురవస్థం బొంది శోకించినన్.

టీక:- అని = అని; ఈ = ఈ; భంగిన్ = విధముగ; సరోజలోచనుని = కృష్ణుని {సరోజ లోచనుడు - పద్మాక్షుడు, కృష్ణుడు}; నర్మాలాపముల్ = చతురోక్తులను; నవ్వులున్ = నవ్వులను; అనుబంధుల్ = సంబంధములు; పరిరంభణంబులున్ = ఆలింగనములు; రతి = కలయికల; వ్యాసంగముల్ = వ్యవహారములు; భావముల్ = తలపులు; వినయంబుల్ = అనుకూల వర్తనలు; సరస = సరసపు; ఉక్తులున్ = మాటలు; తలచి = తలచుకొని; ఉవ్విళ్ళూరు = ఉత్సహించెడి; చిత్తంబులన్ = మనసు నందు; జనిత = పుట్టిన; అనంగ = మన్మథుని; శర = బాణములు అను; అగ్ని = తాపము; చేతన్ = చేత; దురవస్థన్ = దుర్దశలు; పొంది = పొంది; శోకించినన్ = విలపించగా.
భావము:- ఈ విధంగా శ్రీకృష్ణుడి చతురోక్తులు, నవ్వులు, అనురాగాలు, కౌగిలింతలు, రతికార్యాలు, వినయాలు, సరసాల్లాపాలు తలచుకుని ఉవ్విళ్ళూరుతూ, ప్రియవియోగబాధతో దుర్దశలపాలై ఆ గోపికలు వాపోయారు.

తెభా-10.2-494-వ.
అంత బలభద్రుండు వారల మనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరసచతురవచనంబులఁ గృష్ణుని సందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాసరంబులు గడపుచుఁ గాళిందీ తీరంబున.
టీక:- అంతన్ = అంతట; బలభద్రుండు = బలరాముడు; వారల = వారి; మనంబులన్ = మనస్సులలోని; సంతాపంబులున్ = దుఃఖములను; వారింపన్ = తొలగించు; ఉపాయంబులు = ఉపాయములు; అగు = ఐన; సరస = సరసపు; చతుర = ఛలోక్తుల; వచనంబులన్ = మాటలతో; కృష్ణుని = కృష్ణుని; సందేశంబులున్ = చెప్పి పంపిన మాటలు; చెప్పి = చెప్పి; విగత = తొలగిన; ఖేదలన్ = దుఃఖము కలవారిని; చేసి = చేసి; అచ్చటన్ = అక్కడ; మాస = నెలలు; ద్వయంబున్ = రెండు (2); నిలిచి = ఆగి; వసంత = వసంతత కాలపు; వాసరంబులున్ = రోజులు; గడపుచున్ = వెళ్ళబుచ్చచు; కాళిందీ = యమునానది యొక్క; తీరంబునన్ = తీరము నందు.
భావము:- అప్పుడు బలరాముడు వారి సంతాపాలు తొలగిపోయేలాగ మంచి మాటలు చెప్పి, శ్రీకృష్ణుడి సందేశం వినిపించి, వారి దుఃఖాన్ని తొలగించాడు. అలా వ్రేపల్లె లో రెండు నెలలపాటు ఉన్నాడు. ఒకనాడు కాళిందీతీరానికి వెళ్ళాడు.

తెభా-10.2-495-సీ.
మాకంద జంబీర మందార ఖర్జూర-
నసార శోభిత నములందు
నేలాలతా లోల మాతీ మల్లికా-
ల్లీమతల్లికా వాటికలను
రళ తరంగ శీర సాధు శీతల-
సైకతవేదికా స్థలములందు
కరంద రస పాన దవ దిందిందిర-
పుంజ రంజిత మంజు కుంజములను

తెభా-10.2-495.1-తే.
విలరుచి గల్గు సానుదేముల యందు
లిత శశికాంత ఘన శిలాలములందు
లీ నిచ్ఛావిహార విలోలుఁ డగుచు
సుందరీజనములు గొల్వఁ జూడ నొప్పె.

టీక:- మాకంద = మామిడి; జంబీర = నిమ్మ; మందార = మందార; ఖర్జూర = ఖర్జూర; ఘనసార = కర్పూర చెట్లచే; శోభిత = ప్రకాశించుచున్న; వనములు = అడవులు; అందున్ = లో; ఏలాలతా = ఎలకుల తీగల; అలోల = చలించుచున్న; మాలతీ = జాజితీగలు; మల్లికా = మల్లెతీగలు; వల్లీమతల్లికా = శ్రేష్ఠములైనతీగల; వాటికలను = తోపులందు; తరళ = కదులుతున్న; తరంగ = అలల; శీకర = నీటితుంపరలుచే; సాధు = చక్కగానున్న; శీతల = చల్లని; సైకతవేదికా = ఇసుకతిన్నెలమీది; స్థలముల్ = ప్రదేశముల; అందున్ = అందు; మకరందరస = పూతేనెలను; పాన = తాగుటచేత; మద = మత్తెక్కిన; ఇందిందిరన్ = తుమ్మెదల {ఇందిందిరము - పద్మసంపదతో కూడినది, తుమ్మెద (విద్యార్థి కల్పతరువు)}; పుంజ = సమూహములచేత; రంజిత = అందగిస్తున్న; మంజు = మనోజ్ఞమైన; కుంజములను = పొదరిండ్లలో;
విమల = నిర్మలమైన; రుచి = చక్కదనములు; కల్గు = ఉండు; సానుదేశముల = చదునైన కొండచరియల; అందున్ = అందు; లలిత = అందమైన; శశికాంత = చంద్రకాంత; ఘన = గొప్ప; శిలా = శిలల; తలముల = బల్లపరపుప్రాంతముల; అందున్ = అందు; లీలన్ = విలాసముగా; ఇచ్ఛా = ఇష్టమువచ్చినట్టు; విహార = సంచరించుటందు; విలోలుండు = ఆసక్తికలవాడు; అగుచున్ = ఔతు; సుందరీ = అందగత్తెల; జనములున్ = సమూహములు; కొల్వన్ = సేవించుచుండ; చూడన్ = చూడ; ఒప్పెన్ = చక్కగా ఉండెను.
భావము:- మామిళ్ళూ, నిమ్మలూ, మందారాలూ, ఖర్జూరాలూ, కర్పూరపు చెట్లూ శోభించే ఉద్యానవనాలలో; ఏలకి మాలతి మల్లె మొదలైన తీగెల పొదరిండ్లలో; తరంగాల తుంపరుల చేత మిక్కిలి చల్లనైన ఇసుక తిన్నెలపైన; మధుపానంతో మత్తిల్లిన గండుతుమ్మెదలతో నిండిన నికుంజాలలో; తళతళమెరిసే కొండచరియల మీద; చంద్రకాంత శిలావేదికలపైన; సుందరీమణులతో బలరాముడు స్వేచ్ఛగా సంచరించాడు.

తెభా-10.2-496-తే.
ట్లు విహరింప వరుణునియాజ్ఞఁ జేసి
వారుణీదేవి మద్య భావంబు నొంది
నిఖిల తరుకోటరములందు నిర్గమించి
మించు వాసనచేత వాసించె వనము.

టీక:- అట్లు = అలా; విహరింపన్ = విహరించుచుండగా; వరుణుని = వరుణదేవుని; ఆజ్ఞన్ = ఆజ్ఞ; చేసి = వలన; వారుణీదేవి = వారుణి అను రసాధిదేవత; మద్య = మద్య మను; భావంబున్ = ఆకృతి; ఒంది = పొంది; నిఖిల = ఎల్ల; తరు = వృక్షముల; కోటరముల = తొఱ్ఱల; అందున్ = నుండి; నిర్గమించు = బయటకు వచ్చు; వాసన = పరిమళము; చేతన్ = చేత; వాసించె = పరిమళించెను; వనము = అడవి అంతా.
భావము:- ఆ బలరాముడి ఘోషయాత్ర సమయంలో, వరుణుడి ఆజ్ఞ ప్రకారం వారుణీదేవి మద్యభావాన్ని పొంది సమస్తమైన చెట్లు, తొఱ్ఱలలో ప్రవేశించింది. అప్పుడు ఆ వనమంతా మిక్కిలిన వాసనలతో శోభించింది.

తెభా-10.2-497-వ.
అట్టియెడ.
టీక:- అట్టి = అలాంటి; ఎడన్ = సమయము నందు.
భావము:- ఆ సమయంలో....

తెభా-10.2-498-మ.
మొప్పారు నవీనవాసనల నాఘ్రాణించి గోపాల సుం
రులుం దానును డాయనేగి యతిమోదం బొప్ప సేవించి యా
ళాక్షుల్‌ మణిహేమకంకణఝణత్కారానుకారంబులై
తాళంబులు మ్రోయఁబాడుచును వేడ్కన్నాడుచున్ సోలుచున్

టీక:- కరము = మిక్కిలి; ఒప్పారు = చక్కగా ఉండెడి; నవీన = సరికొత్త, తాజా; వాసనలన్ = సువాసనలను; ఆఘ్రాణించి = వాసన చూసి; గోపాల = గొల్ల; సుందరులున్ = సుందరీమణులు; తానునున్ = అతను; డాయన్ = దగ్గరకు; ఏగి = వెళ్ళి; అతి = మిక్కిలి; మోదంబు = సంతోషము; ఒప్పెన్ = కలుగుచుండగా; సేవించి = తాగి; ఆ = ఆ; తరళాక్షుల్ = స్త్రీలు {తరళాక్షులు - తరళ (చలించెడి) అక్షులు (కన్నులు కలవారు), స్త్రీలు}; మణి = రత్నాల; హేమ = బంగారపు; కంకణ = గాజులు; ఝణత్ = ఝణఝణ అను ధ్వనులు; కార = చేయుటను; అనుకారంబులు = అనుసరించునవి; ఐ = అయ్యి; కరతాళంబులున్ = చప్పట్లు; మ్రోయన్ = కొడుతు; పాడుచును = పాడుతు; వేడ్కన్ = వినోదముగా; ఆడుచున్ = నాట్యములు చేయుచు; సోలుచున్ = వివశులై వాలుతు.
భావము:- ఆ క్రొత్త సువాసనలను ఆఘ్రాణించి వెళ్ళి గోపకాంతలతో కలిసి సంతోషంగా ఆ మద్యాన్ని సేవించాడు. అప్పుడు, వారు స్వచ్ఛమైన కన్నులు మిలమిల లాడుతుండగా, బంగారుకంకణాల ఝణ ఝణ ధ్వనులతో తాళంవేస్తూ ఆనందంతో ఆడిపాడి సోలిపోయారు.

తెభా-10.2-499-సీ.
నమీఁది బిరుదాంకిములైన గీతముల్‌-
వాడుచు రా బలద్రుఁ డంత
హిత కాదంబరీ ధుపానమదవిహ్వ-
లాక్షుండు లలితనీలాలకుండు
నాలోల నవపుష్పమాలికోరస్థ్సలుఁ-
నుపమ మణికుండలాంచితుండు
ప్రాలేయ సంయుక్త ద్మంబుగతి నొప్పు-
లలితానన ఘర్మలకణుండు

తెభా-10.2-499.1-తే.
గుచు వనమధ్యమున సలిలావగాహ
శీలుఁడై జలకేళికిఁ జేరి యమున
నిందు రమ్మని పిలువఁ గాళింది యతని
త్తుఁడని సడ్డసేయక సలుటయును.

టీక:- తన = అతను, బలరాముని; మీదన్ = మీద; బిరుద = సమర్థతలకు; అంకితములు = గురించినవి; ఐన = అయిన; గీతముల్ = పాటలు; పాడుచున్ = పాడుతు; రాన్ = రగా; బలభద్రుడు = బలరాముడు; అంతన్ = అంతట; మహిత = గొప్ప; కాదంబరీ = కాదంబరి అను {కాదంబరి - కదంబ రసముచే చేయబడిన మద్యము}; మధు = మద్యమును; పాన = తాగిన; మద = మత్తుచేత; విహ్వల = తేలిపోతున్న; అక్షుండు = కన్నులు కలవాడు; లలిత = మృదువైన; నీల = నల్లని; అలకుండున్ = ముంగురులు కలవాడు; ఆలోల = ఊగుతున్న; నవ = తాజా; పుష్ప = పూల; మాలికా = దండలు కల; ఉరస్థలుడు = వక్షస్థలము కలవాడు; అనుపమ = సాటిలేని; మణి = రత్నాల; కుండల = చెవికుండలములచేత; అంచితుండు = అలంకరింపబడినవాడు; ప్రాలేయ = మంచు బిందువులతో; సంయుక్త = కూడిన; పద్మంబు = పద్మముల; గతిన్ = రీతిని; ఒప్పు = చక్కగానున్న; సలలిత = మనోజ్ఞమైన; ఆనన = ముఖమునందు; ఘర్మ = చెమట; జలకణుండు = నీటిబిందువులు కలవాడు; అగుచున్ = ఔతు;
వన = అడవి; మధ్యమునన్ = లోపల; సలిల = నీటిలో; అవగాహ = స్నానము చేయవలెనని; శీలుండు = సిద్ధపడువాడు; ఐ = అయ్యి; జలకేళిన్ = జలకాలాడుట; కిన్ = కోసము; చేరి = పూని; యమునన్ = యమునానదిని; ఇందున్ = ఇక్కడకి; రమ్ము = రమ్ము; అని = అని; పిలువగాన్ = పిలువగా; కాళింది = యమున; అతనిన్ = బలరాముని; మత్తుడు = ఒళ్ళుమరచినవాడు; అని = అని; సడ్డజేయక = లక్ష్యపెట్టకుండ; మసలుటయును = మెలగెను.
భావము:- వారు బలరాముడి మీద బిరుదగీతాలు పాడుతూ అతని వద్దకు చేరారు. అప్పుడు వక్షస్థలంపై వ్రేలాడుతున్న పుష్పమాలతో, చెవుల కున్న మణికుండలాలతో, చెమటబిందువులతో నిండిన ముఖారవిందంతో శోభిస్తున్న బలరాముడికి జలకేళి ఆడాలనిపించింది. జలకేళి కోసం యమునానదిని “ఇటురా” అని పిలిచాడు. కాళింది మద్యం తాగి ఉన్నాడు కదా అని బలరాముడి మాట లక్ష్యపెట్ట లేదు.