పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పూర్ణి

పూర్ణి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పూర్ణి)
రచయిత: పోతన


తెభా-10.2-1340-చ.
సిజపత్త్రనేత్ర! రఘుత్తమ! దుష్టమదాసురేంద్రసం
ణ! దయాపయోధి! జనకాత్మభవాననపద్మమిత్ర! భా
స్కకులవార్ధిచంద్ర! మిహికావసుధాధరసూతిసన్నుత
స్ఫురితచరిత్ర! భక్తజనపోషణభూషణ! పాపశోషణా!

టీక:- సరసిజపత్త్రనేత్ర = శ్రీరామా {సరసిజ పత్త్ర నేత్రుడు - పద్మములవంటి నేత్రములు కలవాడు, శ్రీరాముడు}; రఘుసత్తమ = శ్రీరామా {రఘు సత్తముడు, రఘువంశ శ్రేష్ఠుడు, శ్రీరాముడు}; దుష్టమదాసురేంద్రసంహరణ = శ్రీరామా {దుష్ట మదాసురేంద్ర సంహరణుడు, దుష్ట (చెడ్డ) మదా (మదముగల) అసురేంద్ర (రాక్షసరాజులను) సంహరణుడు (చంపువాడు), శ్రీరాముడు}; దయాపయోధి = శ్రీరామా {దయా పయోధి - దయారసముచేత సముద్రుడు, శ్రీరాముడు}; జనకాత్మభవాననపద్మమిత్ర = శ్రీరామా {జనకాత్మ భవాననపద్మ మిత్రుడు - జనకాత్మభవ (సీతాదేవి యొక్క) ఆనన (ముఖము అను) పద్మమునకు మిత్రుడు (సూర్యుడు), శ్రీరాముడు}; భాస్కరకులవార్ధిచంద్ర = శ్రీరామా {భాస్కర కులవార్ధి చంద్రుడు - భాస్కరకుల (సూర్యవంశము అను) వార్ధి (సముద్రమునకు) చంద్రుడు, శ్రీరాముడు}; మిహికావసుధాధరసూతిసన్నుతస్ఫురితచరిత్ర = శ్రీరామా {మిహికావసుధాధరసూతిసన్నుతస్ఫురితచరిత్రుడు - మిహికా - హిమవత్, వసుధాధర - పర్వతుని, సూతి - కూతురిచేత, సన్నుత - స్తుతించబడిన, స్ఫురిత - ప్రకాశవంతమైన, చరిత్రుడు - నడవడి కలవాడు, పార్వతీదేవిచే కొనియాడబడిన చరిత్ర గలవాడు , శ్రీరాముడు}; భక్తజనపోషణభూషణ = శ్రీరామా {భక్తజనపోషణభూషణుడు - భక్తులైనవారిని కాపాడుట అను భూషణములు కలవాడు, శ్రీరాముడు}; పాపశోషణా = శ్రీరామా {పాపశోషణుడు - సమస్తమైన పాపములను నశింపజేయువాడు, శ్రీరాముడు}.
భావము:- శ్రీరామా! పద్మములవంటి నేత్రములు కలవాడ! రఘువంశశ్రేష్ఠుడ! దుష్ట మదముగల రాక్షసులను సంహరించు వాడ! దయారసమునకు సముద్రుడ! సీతాదేవి యొక్క ముఖ పద్మమునకు సూర్యుడ! సూర్యవంశము అను సముద్రమునకు చంద్రుడ! పార్వతీ దేవి చేత స్తుతింపబడే సుచారిత్రము కలవాడ! భక్తులను కాపాడుట అను భూషణములు కలవాడ! సమస్త పాపములను నశింప జేయువాడ! శ్రీరామ!

తెభా-10.2-1341-క.
మారీచభూరిమాయా
నీరంధ్రమహాంధకారనీరేజహితా!
క్ష్మామణవినుతపాదాం
భోరుహ! మహితావతార! పుణ్యవిచారా!

టీక:- మారీచభూరిమాయానీరంధ్రమహాంధకారనీరేజహితా = శ్రీరామా {మారీచ భూరిమాయా నీరంధ్ర మహాంధకార నీరేజహితుడు - మారీచుడను రాక్షసుని భూరి (మిక్కుటమైన) మాయలు అనెడి నీరంధ్ర (దట్టమైన) మహా (గొప్ప) అంధకార (చీకటికి) నీరేజహిత (పద్మములకు మిత్రుడు, సూర్యుడు), శ్రీరాముడు}; క్ష్మారమణవినుతపాదాంభోరుహమహితావతార = శ్రీరామా {క్ష్మా రమణ వినుత పాదాంభోరుహ మహితావతారుడు - క్ష్మారమణ (రాజుల చేత) వినుత (కొలచునట్టి) పాద (పాదములు అను) అంభోరుహ (పద్మములుగల) మహిత (మహిమాన్వితమైన) అవతారుడు (అవతారము కలవాడు), శ్రీరాముడు}; పుణ్యవిచారా = శ్రీరామా {పుణ్యవిచారుడు - ధర్మవిచారము కలవాడు, శ్రీరాముడు}.
భావము:- శ్రీరామ! మారీచుడనే రాక్షసుడిచేత కల్పించబడ్డ మాయ అనే దట్టమయిన అంధకారానికి సూర్యుడా! రాజులు కొలిచే పాదపద్మాలు కలవాడా! మహిమాన్విత అవతారాలు దాల్చినవాడా! పుణ్యాత్ముడా! శ్రీరామ!

తెభా-10.2-1342-మాలి.
ధిమదవిరామా! ర్వలోకాభిరామా!
సురిపువిషభీమా! సుందరీలోకకామా!
ణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!

టీక:- శరధిమదవిరామా = శ్రీరామా {శరధి మద విరాముడు - శరధి (సముద్రము యొక్క) మద (గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు}; సర్వలోకాభిరామా = శ్రీరామా {సర్వ లోకాభిరాముడు - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోజ్ఞుడు), శ్రీరాముడు}; సురరిపువిషభీమా = శ్రీరామా {సురరిపు విష భీముడు - సురరిపు (రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు}; సుందరీలోకకామా = శ్రీరామా {సుందరీ లోక కాముడు - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు}; ధరణివరలలామా = శ్రీరామా {ధరణివర లలాముడు - ధరణివర (రాజులలో) లలాముడు (శ్రేష్ఠుడు), శ్రీరాముడు}; తాపస స్తోత్ర సీమా = శ్రీరామా {తాపసస్తోత్రసీముడు - ఋషుల స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు}; సురుచిరగుణధామా = శ్రీరామా {సు రుచిర గుణ ధాముడు - సు (మిక్కిలి) రుచిర (మనోజ్ఞమైన) గుణ (సుగుణములకు) ధాముడు (ఉనికిపట్టైన వాడు), శ్రీరాముడు}; సూర్యవంశాబ్ధిసోమా = శ్రీరామా {సూర్య వంశాబ్ధి సోముడు - సూర్యవంశము అను అబ్ధి (సముద్రమునకు) సోముడు (చంద్రుడు), శ్రీరాముడు}.
భావము:- శ్రీరామచంద్ర! సముద్రుని గర్వాన్ని అణచినవాడ! సర్వలోకాలకూ సుందరుడా! రాక్షసులకు పరమ భయంకరుడా! సుందరీ జనులకు మన్మథుడా! రాజ శ్రేష్ఠుడా! మునీంద్రులచేత స్తుతింపబడేవాడా! సుగుణాలకు అలవాలమైన వాడా! సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడా! శ్రీరామచంద్ర!

తెభా-10.2-1343-గ.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందుఁ బ్రద్యుమ్న జన్మంబును, శంబరోద్యోగంబును, సత్రాజిత్తునకు సూర్యుండు శమంతకమణి నిచ్చుటయుఁ దన్నిమిత్తంబునం ప్రసేనుని సింహంబు వధియించుటయు, దాని జాంబవంతుండు దునిమి మాణిక్యంబు గొనిపోవుటయు, గోవిందుండు ప్రసేనుని దునిమి మణిఁ గొనిపోయె నని సత్త్రాజిత్తు కృష్ణునందు నింద నారోపించుటయుఁ, గృష్ణుండు దన్నిమిత్తంబున జాంబవంతునిం దొడరి మణియుక్తంబుగా జాంబవతిం గొనివచ్చి వివాహం బగుటయు, సత్త్రాజిత్తునకు మణి నిచ్చుటయు, సత్యభామా పరిణయంబును, బాండవులు లాక్షాగృహంబున దగ్ధులైరని విని వాసుదేవుండు బలభద్ర సహితుం డయి హస్తినాపురంబున కరుగుటయు, నక్రూర కృతవర్మల యనుమతంబున శతధన్వుండు సత్త్రాజిత్తుఁ జంపి మణిఁ గొనిపోవుటయుఁ, దదర్థం బా సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించిన నతండు మరలి చనుదెంచి శతధన్వుం ద్రుంచుటయు, బలభద్రుండు మిథిలానగరంబునకుం జనుటయు, నందు దుర్యోధనుండు రామునివలన గదావిద్య నభ్యసించుటయుఁ, గృష్ణుండు సత్రాజిత్తునకుం బరలోకక్రియలు నడపుటయు, శమంతకమణిం దాఁచిన వాఁడయి యక్రూరుండు భయంబున ద్వారకానగరంబు విడిచిపోయిన నతని లేమి ననావృష్టి యైనం గృష్ణుం డక్రూరుని మరల రప్పించుటయు, దామోదరుం డింద్రప్రస్థపురంబున కరుగుటయు, నం దర్జున సమేతుం డయి మృగయావినోదార్థం బరణ్యంబునకుం జని, కాళిందిం గొనివచ్చుటయు, ఖాండవ దహనంబును, నగ్నిపురుషుం డర్జునునకు నక్షయతూణీర గాండీవ కవచ రథ రథ్యంబుల నిచ్చుటయు, మయుండు ధర్మరాజునకు సభ గావించి యిచ్చుటయు, నగధరుండు మరలి నిజనగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహంబగుటయు, మిత్రవిందా నాగ్నజితీ భద్రా మద్రరాజకన్యలం గ్రమంబునఁ గరగ్రహణం బగుటయు, నరకాసుర యుద్ధంబును, దద్గృహంబున నున్న రాజకన్యకలం బదాఱువేలం దెచ్చుటయు, స్వర్గగమనంబును, నదితికిం గుండలంబు లిచ్చుటయుఁ, బారిజాతాపహరణంబును, బదాఱువేల రాజకన్యలం బరిణయం బగుటయు, రుక్మిణీదేవి విప్రలంభంబును, రుక్మిణీ స్తోత్రంబును, గృష్ణకుమారోత్పత్తియుఁ, దద్గురు జనసంఖ్యయుఁ, బ్రద్యుమ్ను వివాహంబును, ననిరుద్ధు జన్మంబును, దద్వివాహార్థంబు కుండిననగరంబునకుం జనుటయు, రుక్మి బలభద్రుల జూదంబును, రుక్మి వధయు, నుషాకన్య యనిరుద్ధుని స్వప్నంబునం గని మోహించుటయుఁ, ద న్నిమిత్తంబునఁ, జిత్రరేఖ సకలదేశ రాజులఁ బటంబున లిఖించి చూపి యనిరుద్ధునిఁ దెచ్చుటయు, బాణాసుర యుద్ధంబును, నృగోపాఖ్యానంబును, బలభద్రుని ఘోష యాత్రయుఁ, గాళింది భేదనంబును, గృష్ణుండు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల వధించుటయుఁ, గాశీరాజపుత్రుం డయిన సుదక్షిణుం డభిచారహోమంబు గావించి కృత్యం బడసి కృష్ణుపాలికిం బుత్తెంచిన సుదర్శనంబుచేతఁ గృత్యను సుదక్షిణ సహితంబుగాఁ గాశీపురంబును భస్మంబు సేయుటయు, బలరాముండు రైవతనగరంబు నందు ద్వివిదుండను వనచరుని వధియించుటయు, సాంబుండు దుర్యోధనుకూఁతు రగు లక్షణ నెత్తికొనివచ్చినఁ గౌరవు లతనిం గొనిపోయి చెఱఁబెట్టుటయుఁ, దద్వృత్తాంతం బంతయు నారదువలన విని బలభద్రుండు నాగనగరంబునకుఁ జనుటయుఁ, గౌరవు లాడిన యగౌరవవచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగం బడఁద్రోయ గమకించుటయుఁ, గౌరవులు భయంబున నంగనాయుక్తంబుగా సాంబునిం దెచ్చి యిచ్చుటయు, బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుటయు, నారదుండు హరి పదాఱువేల కన్యకల నొకముహూర్తంబున నందఱ కన్నిరూపులై వివాహంబయ్యె నని విని తత్ప్రభావంబు దెలియంగోరి యరుగుదెంచుటయుఁ, దన్మాహాత్మ్యంబు సూచి మరలి చనుటయు, జరాసంధునిచేత బద్ధు లైన రాజులు కృష్ణు పాలికి దూతం బుత్తెంచుటయు, నారదాగమనంబును, బాండవుల ప్రశంసయును, నుద్ధవ కార్యబోధంబును, నింద్రప్రస్థాగమనంబును, ధర్మరాజు రాజసూయారంభంబును, దిగ్విజయంబును, జరాసంధ వధయును, రాజ బంధమోక్షణంబును, రాజసూయంబు నెఱవేర్చుటయును, శిశుపాల వధయును, నవభృథంబును, రాజసూయ వైభవదర్శ నాసహమాన మానసుం డయి సుయోధనుండు మయనిర్మిత సభామధ్యంబునం గట్టిన పుట్టంబులు దడియం ద్రెళ్ళుటయుఁ, దన్నిమిత్తపరిభవంబు నొంది రారాజు నిజపురి కరుగుటయుఁ, గృష్ణుండు ధర్మరాజ ప్రార్థితుం డయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థంబున వసియించుటయు, సాళ్వుండు దపంబు సేసి హరుని మెప్పించి సౌభకాఖ్యం బగు విమానంబు వడసి నిజసైన్య సమేతుండై ద్వారకానగరంబు నిరోధించుటయు, యాదవ సాళ్వ యుద్ధంబును, గృష్ణుండు మరలి చనుదెంచి సాల్వుం బరిమార్చుటయును, దంతవక్త్ర వధయును, విదూరథ మరణంబును, గృష్ణుండు యాదవ బల సమేతుండై క్రమ్మఱ నిజపురంబునకుం జనుటయును, గౌరవ పాండవులకు యుద్ధం బగునని బలదేవుండు తీర్థయాత్ర సనుటయు, నందు జాహ్నావీప్రముఖ నదులం గృతస్నానుం డయి నైమిశారణ్యంబునకుం జనుటయు, నచ్చటి మునులు పూజింపం బూజితుం డయి తత్సమీపంబున నున్నతాసనంబున నుండి సూతుండు దన్నుం గని లేవకున్న నలిగి రాముండు గుశాగ్రంబున నతని వధించుటయు, బ్రహ్మహత్యా దోషంబు గలిగె నని మునులు వలికిన సూతుం బునర్జీవితుం జేయుటయు, నమ్మునులకుం బ్రియంబుగాఁ గామపాలుం డిల్వల సుతుండగు పల్వలుం బరిమార్పుటయు, వారిచేత ననుమతుం డయి హలధరుండు దత్సమీప తీర్థంబుల స్నాతుండయి గంగా సాగర సంగమంబునకుం జనుటయు, మహేంద్రనగ ప్రవేశంబును, బరశురామ దర్శనంబును, సప్త గోదావరిం గ్రుంకుటయు, మఱియు మధ్యదేశంబునంగల తీర్థంబులాడి శ్రీశైల వేంకటాచలంబులు దర్శించుటయు, వృషభాద్రి హరి క్షేత్ర సేతుబంధ రామేశ్వరములం గని తామ్రపర్ణీ తీర్థంబు లాడుటయు, గోదానంబు లొనరించి మలయగిరి యందు నగస్త్యునిం గనుటయు, సముద్రకన్యా దుర్గాదేవుల నుపాసించుటయు, నందు బ్రాహ్మణజనంబువలనం బాండవ ధార్తరాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతి నొంది రని వినుటయు, వాయునందన సుయోధనులు గదా యుద్ధసన్నద్ధు లగుట విని వారిని వారించుటకై, రౌహిణేయుం డందుల కరుగుటయు, నచట వారిచేతం బూజితుండయి వారిని వారింప లేక మగిడి ద్వారక కరుగుటయుఁ, గొన్ని వాసరంబులకు మరల నైమిశారణ్యంబునకుం బోయి యచట యజ్ఞంబు సేసి రేవతియుం దానును నవభృథంబాడి నిజపురంబున కేతెంచుటయుఁ, గుచేలోపాఖ్యానంబును, సూర్యోపరాగంబునం గృష్ణుఁడు రామునితోఁ జేరి పురరక్షణంబునకుఁ బ్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశసహస్రాంగనా పరివృతుండయి యక్రూర వసుదేవోగ్రసేనాది యాదవ వీరులు దోడరా శమంతపంచక తీర్థంబున కరిగి కృతస్నానుండయి వసియించి యుండుటయుఁ, బాండవకౌరవాది సకల రాజలోకంబును దత్తీర్థంబునకు వచ్చుటయుఁ, గుంతీదేవి దుఃఖంబును, నందయశోదా సహితు లైన గోపగోపి జనంబులు చనుదెంచుటయుఁ, గుశలప్రశ్నాది సంభాషణంబులును, మద్రకన్యా ద్రౌపదీ సంభాషణంబును, దదనంతరంబ సకల రాజలోకంబును శమంతపంచకతీర్థంబున స్నాతులై రామకృష్ణాది యాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజ దేశంబులకుఁ బోవుటయుఁ, గృష్ణుని దర్శించుటకు మునీంద్రు లేతెంచుటయు, వారి యనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయు, నంద యశోదాది గోపికానివహంబుల నిజపురంబున కనిచి యుగ్రసేనాది యాదవవీరులుం దానును మాధవుండు నిజపురప్రవేశంబు సేయుటయుఁ, దొల్లి కంసునిచేత హతులై బలిపురంబున నున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయాబలంబునఁ దెచ్చి యామె కిచ్చుటయు, నర్జునుండు సుభద్రను వివాహంబగుటయుఁ, గృష్ణుండు మిథిలానగరంబున కరుగుటయు, శ్రుతదేవ జనకుల చరిత్రంబును, వారలతో బ్రాహ్మణ ప్రశంస సేయుటయు, శ్రుతిగీతలును, హరిహరబ్రహ్మల తారతమ్య చరిత్రంబును, గుశస్థలి నుండు బ్రాహ్మణుని చరిత్రంబును, నతని తనయులు పరలోకంబునకుం బోయినఁ గృష్ణార్జునులు తమ యోగబలంబున వారిం దెచ్చి యవ్విప్రున కిచ్చుటయుఁ గృష్ణుం డర్జునుని వీడ్కొని ద్వారక కరుగుటయు, నందు మాధవుం డయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండయి విహరించుటయు, యాదవ వృష్ణి భోజాంధక వంశ చరిత్రంబును నను కథలు గల దశమస్కంధంబు నందు నుత్తరభాగము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శ్రీమంతమైన; పరమేశ్వర = భగవంతుని; కరుణా = దయ; కలిత = కలిగినట్టి వాడు; కవితా = కవిత్వమును; విచిత్ర = వివరముగా చిత్రించువాడు; కేసనమంత్రి = కేసనమంత్రికి; పుత్ర = కొడుకు; సహజ = సహజసిద్ధముగా; పాండిత్య = పాండిత్యమబ్బినవాడు; పోతనామాత్య = పోతనామాత్యుడు చేత; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయిన; శ్రీమత్ = శ్రీమంతమైన; మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = అందు; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుని; జన్మంబును = పుట్టుక; శంబర = శంబరాసురుని; ఉద్యోగంబును = వృత్తాంతము; సత్రాజిత్తు = సత్రాజిత్తున; కున్ = కు; సూర్యుండు = సూర్యుడు; శమంతకమణిని = శమంతకమణిని; ఇచ్చుటయున్ = ఇచ్చుట; తత్ = దానిని; నిమిత్తంబునన్ = కారణముచేత; ప్రసేనుని = ప్రసేనుడిని; సింహంబు = సింహము; వధియించుటయు = చంపుట; దాని = దానిని; జాంబవంతుండు = జాంబవంతుడు; తునిమి = చంపి; మాణిక్యంబున్ = మణిని; కొనిపోవుట = తీసుకువెళ్ళుట; గోవిందుండు = గోవిందుడు; ప్రసేనుని = ప్రసేనుని; తునిమి = చంపి; మణిన్ = శమంతకమణిని; కొనిపోయెను = తీసుకుపోయెను; అని = అని; సత్రాజిత్తు = సత్రాజిత్తుడు; కృష్ణున్ = కృష్ణుడి; అందున్ = మీద; నిందన్ = నిందను; ఆరోపించుటయున్ = వేయుట; కృష్ణుండు = కృష్ణుడు; తత్ = దాని; నిమిత్తంబునన్ = కొరకు; జాంబవంతునిన్ = జాంబవంతుడిని; తొడరి = ఎదిరించి; మణి = రత్నముతో; యుక్తంబుగా = పాటుగా; జాంబవతిన్ = జాంబవతిని; కొనివచ్చి = తీసుకు వచ్చి; వివాహంబు = పెండ్లి; అగుటయున్ = చేసుకొనుట; సత్రాజిత్తు = సత్రాజిత్తున; కున్ = కు; మణిన్ = మణిని; ఇచ్చుటయున్ = ఇచ్చుట; సత్యభామా = సత్యభామ యొక్క; పరిణయంబునున్ = వివాహము; పాండవులు = పాండవులు; లాక్షా = లక్క; గృహంబునన్ = ఇంటిలో; దగ్ధులు = కాలిపోయినవారు; ఐరి = అయ్యారు; అని = అని; విని = విని; వాసుదేవుండు = కృష్ణుడు; బలభద్ర = బలరాముడు; సహితుండు = కూడ ఉన్నవాడు; అయి = ఐ; హస్తినాపురంబు = హస్తినాపురమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; అక్రూర = అక్రూరుని; కృతవర్మ = కృతవర్మల యొక్క; అనుమతంబునన్ = అంగీకారముతో; శతధన్వుండు = శతధన్వుడు; సత్రాజిత్తున్ = సత్రాజిత్తుని; చంపి = చంపి; మణిన్ = శమంతకమణిని; కొనిపోవుటయున్ = తీసుకుపోవుట; తత్ = ఆ; అర్థంబున్ = విషయమై; ఆ = ఆ ప్రసిద్ధురాలైన; సత్యభామ = సత్యభామ; కరినగరంబున్ = హస్తినాపురమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; కృష్ణున = కృష్ణుని; కున్ = కి; విన్నవించినన్ = చెప్పగా; అతండు = అతను; మరలి = వెనుకకు; చనుదెంచి = వచ్చి; శతధన్వున్ = శతధన్వుడిని; త్రుంచుటయున్ = చంపుట; బలభద్రుండు = బలరాముడు; మిథిలానగరంబున = మిథిలానగరమున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుట; అందున్ = అక్కడ; దుర్యోధనుండు = దుర్యోధనుడు; రాముని = బలరాముని; వలన = వలన; గదావిద్యన్ = గదాయుధవిద్యను; అభ్యసించుటయున్ = నేర్చుకొనుట; కృష్ణుండు = కృష్ణుడు; సత్రాజిత్తు = సత్రాజిత్తున; కున్ = కు; పరలోకక్రియలు = అపరకర్మలు; నడపుటయున్ = చేయుట; శమంతకమణిన్ = శమంతకమణిని; దాచినవాడు = దాచినవాడు; అయి = ఐ; అక్రూరుండు = అక్రూరుడు; భయంబునన్ = భయముతో; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమును; విడిచి = వదలిపెట్టి; పోయినన్ = పోగా; అతని = అతను; లేమినిన్ = లేకపోవుటచేత; అనావృష్టి = కరువు; ఐనన్ = కలుగగా; కృష్ణుండు = కృష్ణుడు; అక్రూరుని = అక్రూరుని; మరల = మళ్ళీ; రప్పించుటయున్ = రప్పించుట; దామోదరుండు = కృష్ణుడు; ఇంద్రప్రస్థపురంబు = ఇంద్రప్రస్థపురమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; అందున్ = అక్కడ; అర్జున = అర్జుని; సమేతుండు = కూడ ఉన్నవాడు; అయి = అయ్యి; మృగయావినోద = వేట; అర్థంబున్ = కోసము; అరణ్యంబు = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; కాళిందిన్ = కాళిందిని; కొనివచ్చుటయున్ = తీసుకుని వచ్చుట; ఖాండవ = ఖాండవవనమును; దహనంబునున్ = దహింపజేయుట; అగ్నిపురుషుండు = అగ్నిదేవుడు; అర్జును = అర్జునుని; కున్ = కి; అక్షయ = తరగని; తూణీరంబున్ = బాణముల పొదిని; గాండీవ = గాండీవమును; కవచ = కవచమును; రథ = రథమును; రథ్యంబులన్ = గుఱ్ఱములను; ఇచ్చుటయున్ = ఇచ్చుట; మయుండు = మయుడు; ధర్మరాజు = ధర్మరాజున; కున్ = కు; సభ = సభను; కావించి = నిర్మించి; ఇచ్చుటయున్ = ఇచ్చుట; నగధరుండు = కృష్ణుడు; మరలి = వెనుతిరిగి; నిజ = తన; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; అరుగుదెంచి = వచ్చి; కాళిందిని = కాళిందిని; వివాహంబు = పెండ్లి; అగుటయున్ = అగుట; మిత్రవిందా = మిత్రవింద; నాగ్నజితీ = నాగ్నజితి; భద్రా = భద్ర; మద్ర = మద్రదేశపు; రాజకన్యలన్ = రాకుమారిని; క్రమంబునన్ = వరుసగా; కరగ్రహణంబు = పెండ్లి; అగుటయున్ = ఆడుట; నరకాసుర = నరకాసురునితో; యుద్ధంబునున్ = యుద్ధము; తత్ = అతని; గృహంబునన్ = ఇంటిలో; ఉన్న = ఉన్నట్టి; రాజకన్యలన్ = రాకుమార్తెలను; పదాఱువేలన్ = పదహారువేల మందిని (16,000); తెచ్చుటయున్ = తీసుకుని వచ్చుట; స్వర్గ = స్వర్గమునకు; గమనంబును = వెళ్ళుట; అదితి = అదితి; కిన్ = కి; కుండలంబులున్ = చెవికుండలములను; ఇచ్చుటయున్ = ఇచ్చుట; పారిజాత = పారిజాతవృక్షమును; అపహరణంబును = దొంగిలించుట; పదాఱువేల = పదహారువేల మంది (16,000); రాజకన్యలన్ = రాకుమారీలను; పరిణయంబున్ = వివాహము; అగుటయున్ = ఆడుట; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; విప్రలంబంబును = వంచనము; రుక్మిణీ = రుక్మిణీదేవి; స్తోత్రంబునున్ = స్తోత్రము; కృష్ణ = కృష్ణునికి; కుమార = పుత్రులు; ఉత్పత్తియున్ = కలుగుట; తత్ = వారి; గురు = పెద్ద; జన = సంతానముల; సంఖ్యయున్ = లెక్క; ప్రద్యుమ్ను = ప్రద్యుమ్నుని; వివాహంబునున్ = పెండ్లి; అనిరుద్ధు = అనిరుద్దుని; జన్మంబును = పుట్టుక; తత్ = అతని; వివాహ = పెండ్లి; అర్థంబున్ = కోసము; కుండిననగరంబు = కుండిననగరమున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుట; రుక్మి = రుక్మి; బలభద్రుల = బలరాముడుల; జూదంబును = జూదము; రుక్మి = రుక్మి; వధయును = వధ; ఉషాకన్య = ఉషాకన్య; అనిరుద్ధుని = అనిరుద్ధుని; స్వప్నంబునన్ = కలలో; కని = చూసి; మోహించుటయున్ = మోహించుట; తన్నిమిత్తంబునన్ = అందుచేత; చిత్రరేఖ = చిత్రరేఖ; సకల = ఎల్ల; దేశ = దేశముల యొక్క; రాజులన్ = రాజులను; పటంబునన్ = చిత్రపటము, బట్టపై; లిఖించి = గీసి; చూపి = చూపించి; అనిరుద్ధునిన్ = అనిరుద్ధుని; తెచ్చుటయున్ = తీసుకొనివచ్చుట; బాణాసుర = బాణాసురుని; యుద్ధంబును = యుద్ధము; నృగోపాఖ్యానంబును = నృగోపాఖ్యానము; బలభద్రుని = బలరాముడి; ఘోష = అలమందకు; యాత్రయున్ = వెళ్ళుట; కాళింది = యమునను; భేదనంబును = చీల్చుట; కృష్ణుండు = కృష్ణుడు; పౌండ్రకవాసుదేవ = పౌండ్రకవాసుదేవుడు; కాశీరాజుల = కాశీరాజులను; వధించుటయున్ = చంపుట; కాశీరాజ = కాశీరాజు యొక్క; పుత్రుండు = కొడుకు; అయిన = ఐన; సుదక్షిణుండు = సుదక్షిణుడు; అభిచారహోమంబున్ = హింసార్థకమైన హోమము; కావించి = చేసి; కృత్యన్ = కృత్యను; పడసి = పొంది; కృష్ణు = కృష్ణుని; పాలి = మీద; కిన్ = కి; పుత్తెంచినన్ = పంపగా; సుదర్శనంబు = సుదర్శనచక్రము; చేతన్ = చేత; కృత్యను = కృత్యను; సుదక్షిణ = సుదక్షిణుడు; సహితంబుగాన్ = తోసహా; కాశీపురంబును = కాశీపురమును; భస్మంబు = కాల్చివేయుట; చేయుటయున్ = చేయుట; బలరాముండు = బలరాముడు; రైవతనగరంబున్ = రైవతనగరము; అందున్ = లో; ద్వివిదుండు = ద్వివిదుండు; అను = అనెడి; వనచరుని = వానరమును; వధియించుటయు = చంపుట; సాంబుడు = సాంబుడు; దుర్యోధన = దుర్యోధనుని; కూతురు = పుత్రిక; అగు = ఐన; లక్షణన్ = లక్షణను; ఎత్తుకొనివచ్చినన్ = ఎత్తుకుని రాగా; కౌరవులు = కౌరవులు; అతనిన్ = అతనిని; కొనిపోయి = తీసుకువెళ్ళి; చెఱబెట్టుటయున్ = బంధించుట; తత్ = ఆ; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = అంతటిని; నారదు = నారదుని; వలన = వలన; విని = విని; బలభద్రుండు = బలరాముడు; నాగనగరంబున = హస్తినాపురమున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుట; కౌరవులు = కౌరవులు; ఆడిన = పలికిన; అగౌరవ = అవమానపు; వచనంబులు = మాటల; కున్ = కు; బలరాముండు = బలరాముడు; కోపించి = కోపగించి; హస్తినాపురంబును = హస్తినాపురమును; గంగన్ = గంగానదిలో; త్రోయన్ = పడవేయుటకు; గమకించుటయున్ = యత్నించుట; కౌరవులు = కౌరవులు; భయంబునన్ = భయముతో; అంగనా = స్త్రీ; యుక్తంబుగా = తోసహా; సాంబునిన్ = సాంబుడుని; ఇచ్చుటయున్ = ఇచ్చుట; బలభద్రుండు = బలరాముడు; ద్వారకానగరంబు = ద్వారకానగరమున; కున్ = కు; వచ్చుటయున్ = వచ్చుట; నారదుండు = నారదుడు; హరి = కృష్ణుడు; పదాఱువేల = పదహారువేల (16,000); కన్యకలన్ = వధువులను; ఒక = ఒకే; ముహుర్తంబునన్ = ముహుర్తము నందే; అందఱ = అందరి; కిన్ = కి; అన్ని = అన్ని; రూపులు = ఆకృతులు కలవాడు; ఐ = అయ్యి; వివాహంబున్ = పెండ్లి; అయ్యెన్ = ఆడెను; అని = అని; విని = విని; తత్ = ఆ; భావంబున్ = విధానమును; తెలియన్ = తెలిసికొన; కోరి = కోరి; అరుగుదెంచుటయున్ = వచ్చుట; తత్ = ఆ; మహాత్మ్యంబున్ = గొప్పప్రభావమును; చూచి = చూసి; మరలి = వెనుదిరిగి; చనుటయున్ = వెళ్ళిపోవుట; జరాసంధుని = జరాసంధుడి; చేతన్ = వలన; బద్ధులు = చెరపట్టబడిన; రాజులున్ = రాజులు; కృష్ణు = కృష్ణుని; పాలి = వద్ద; కిన్ = కు; దూతన్ = దూతను; పుత్తెంచుటయున్ = పంపించుట; నారద = నారదుని; ఆగమనంబును = వచ్చుట; పాండవుల = పాండవుల; ప్రశంసయును = ప్రశంస; ఉద్ధవ = ఉద్ధవుని; కార్య = చేయవలసినపని; బోధంబునున్ = తెలియజెప్పుట; ఇంద్రప్రస్థ = ఇంద్రప్రస్థపురము; ఆగమనంబును = వెళ్ళుట; ధర్మరాజు = ధర్మరాజు; రాజసూయ = రాజసూయయాగము; ఆరంభంబును = ప్రారంభము; దిగ్విజయంబును = దిగ్విజయము; జరాసంధవధయును = జరాసంధవధ; రాజ = రాజుల; బంధ = చెరనుండి; మోక్షణంబునున్ = విడిపించుట; రాజసూయంబున్ = రాజసూయయాగము; నెఱవేర్చుట = పరిపూర్ణము చేయించుట; శిశుపాలవధయును = శిశుపాలవధ; అవభృథంబును = అవభృథ స్నానము; రాజసూయ = రాజసూయయాగము; వైభవ = వైభవమును; దర్శన = చూసి; అసహమాన = సహించలేని; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; సుయోధనుండు = దుర్యోధనుడు; మయ = మయునిచేత; నిర్మిత = నిర్మింపబడిన; సభా = సభ; మధ్యంబునన్ = నడుమ; కట్టిన = కట్టుకొన్న; పుట్టంబులున్ = బట్టలు; తడియన్ = తడిసిపోవునట్లు; త్రెళ్ళుటయున్ = తూలిపోవుట; తన్నిమిత్తంబునన్ = అందుచేత; పరిభవంబునున్ = పరాభవమును; ఒంది = పొంది; రారాజు = రారాజు దుర్యోధనుడు; నిజ = తన; పురి = నగరమున; కిన్ = కు; అరుగుటయున్ = వెళ్ళిపోవుట; కృష్ణుండు = కృష్ణుడు; ధర్మరాజ = ధర్మరాజుచేత; ప్రార్థితుండు = వేడుకొనబడినవాడు; అయి = ఐ; యాదవులన్ = యాదవులను; నిలిపి = ఉంచి; కొన్ని = కొన్ని; నెలలు = మాసములు; ఖాండవప్రస్థంబునన్ = ఖాండవప్రస్థము నందు; వసియించుటయున్ = ఉండుట; సాళ్వుండు = సాళ్వుడు; తపంబు = తపస్సు; చేసి = చేసి; హరుని = శివుని; మెప్పించి = మెప్పించి; సౌభక = సౌభకము; ఆఖ్యంబు = అను పేరు కలది; అగు = ఐన; విమానంబున్ = విమానమును; పడసి = పొంది; నిజ = తన; సైన్య = సేనలతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ద్వారకానగరంబు = ద్వారకానగరమును; నిరోధించుటయున్ = చుట్టుముట్టుట; యాదవ = యాదవుల; సాళ్వ = సాళ్వుల; యుద్ధంబును = యుద్ధము; కృష్ణుండు = కృష్ణుడు; మరలి = వెనుదిరిగి; చనుదెంచి = వచ్చి; సాల్వున్ = సాల్వుని; పరిమార్చుటయును = చంపుట; దంతవక్త్రవధయును = దంతవక్త్రవధ; విదూరథ = విదూరథుని; మరణంబునున్ = మరణము; కృష్ణుండు = కృష్ణుడు; యాదవ = యాదవ; బల = సైన్యములతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరలి; నిజ = తన; పురంబు = నగరమున; కున్ = కు; చనుటయునున్ = వెళ్ళుట; కౌరవ = కౌరవుల; పాండవుల = పాండవుల; కున్ = కు; యుద్ధంబు = యుద్ధము; అగును = జరుగును; అని = అని; బలదేవుండు = బలరాముడు; తీర్థయాత్ర = తీర్థయాత్రకు; చనుటయున్ = వెళ్ళుట; అందున్ = అక్కడ; జాహ్నవీ = జాహ్నవీనది; ప్రముఖ = మున్నగు; నదులన్ = నదు లందు; కృతస్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; నైమిశారణ్యంబున్ = నైమిశారణ్యమున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుట; అచ్చటి = అక్కడి; మునులు = ఋషులు; పూజింపన్ = పూజించగా; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; తత్ = ఆ; సమీపంబునన్ = దగ్గరలో; ఉన్నత = ఎత్తైన; ఆసనంబునన్ = ఆసనముపై; ఉండి = కూర్చుండి; సూతుండు = సూతుడు; తన్నున్ = తనను; కని = చూసి; లేవకున్నన్ = లేవకపోవుటచేత; అలిగి = కోపించి; రాముండు = బలరాముడు; కుశాగ్రంబునన్ = దర్భమొనతో; అతనిన్ = అతనిని; వధించుటయున్ = వధించుట; బ్రహ్మహత్యా = బ్రహ్మహత్య; దోషంబున్ = పాపము; కలిగెను = కలిగినది; అని = అని; మునులు = మునులు; పలికినన్ = చెప్పగా; సూతున్ = సూతుని; పునరుజ్జీవుని = మరలబతికినవానిగా; చేయుటయున్ = చేయుట; ఆ = ఆ; మునులు = మునులు; కున్ = కు; ప్రియంబుగాన్ = ప్రియము కలుగునట్లు; కామపాలుండు = బలరాముడు; ఇల్వల = ఇల్వలుని; సుతుండు = కొడుకు; అగు = ఐన; పల్వలున్ = పల్వలుని; పరిమార్చుటయున్ = చంపుట; వారి = వారల; చేతన్ = చేత; అనుమతుండు = అనుమతిపొందినవాడు; ఐ = అయ్యి; హలధరుండు = బలరాముడు; తత్ = ఆ; సమీప = దగ్గరలోని; తీర్థంబులన్ = తీర్థము లందు; స్నాతుండు = స్నానముచేసినవాడు; అయి = ఐ; గంగా = గంగానది; సాగర = సముద్రముల; సంగమంబునన్ = సంగమంబున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుట; మహేంద్ర = మహేంద్ర; నగ = పర్వతము; ప్రవేశంబును = చేరుట; పరశురామ = పరశురాముని; దర్శనంబు = దర్శనము; సప్తగోదావరిన్ = సప్తగోదావరిలో; క్రుంకుటయున్ = స్నానముచేయుట; మఱియున్ = ఇంకను; మధ్య = మధ్య; దేశంబునన్ = దేశము లందు; కల = ఉన్నట్టి; తీర్థంబులున్ = తీర్థము లందు; ఆడి = స్నానము చేసినవాడు; శ్రీశైల = శ్రీశైలము; వేంకటాచలంబులు = వేంకటాచలములు; దర్శించుటయున్ = దర్శించుట; వృషభాద్రిన్ = వృషభాద్రిని; హరిక్షేత్ర = హరిక్షేత్రము; సేతుబంధ = సేతిబంధ; రామేశ్వరములన్ = రామేశ్వరములను; కని = దర్శించి; తామ్రపర్ణిన్ = తామ్రపర్ణి నది యందు; తీర్థంబులున్ = జలకాలు; ఆడుటయున్ = ఆడుట; గోదానంబులు = గోదానములు; ఒనరించి = చేసి; మలయగిరి = మలయగిరి; అందున్ = అందు; అగస్త్యునిన్ = అగస్త్యుని; కనుటయున్ = దర్శించుట; సముద్రకన్యా = కన్యాకుమారి; దుర్గాదేవులన్ = దుర్గాదేవిని; ఉపాసించుటయున్ = కొలచుట; అందున్ = అక్కడ; బ్రాహ్మణ = విప్ర; జనంబుల = సమూహము; వలన = వలన; పాండవ = పాండవుల; ధార్తరాష్ట్ర = కౌరవుల; భండనంబునన్ = యుద్ధము నందు; సకల = ఎల్ల; రాజ = రాజుల; లోకంబును = సమూహములు; మృతినొందిరి = చనిపోయిరి; అని = అని; వినుటయున్ = వినుట; వాయునందన = భీముడు; సుయోధనులు = దుర్యోధనులు; గదాయుద్ధ = గదాయుద్ధమునకు; సన్నద్ధులు = సిద్ధపడువారు; అగుట = అగుట; విని = విని; వారిని = వారిని; వారించుట = ఆపుట; కై = కోసము; రౌహిణేయుండు = బలరాముడు; అందుల = అక్కడ; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; అచట = అక్కడ; వారి = వారల; చేతన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; అయి = ఐ; వారిని = వారిని; వారింపలేక = వారింపలేక; మగిడి = వెనుదిరిగి; ద్వారక = ద్వారకానగరమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; కొన్ని = కొన్ని; వాసరంబుల్ = దినముల; కున్ = కు; మరల = మళ్ళీ; నైమిశారణ్యంబున్ = నైమిశారణ్యమున; కున్ = కు; పోయి = వెళ్లి; అచట = అక్కడ; యఙ్ఞంబు = యాగము; చేసి = చేసి; రేవతి = రేవతీదేవి; తానును = అతను; అవభృథంబు = అవభృథస్నానములు; ఆడి = చేసి; నిజ = తన; పురంబున్ = పట్టణమున; కున్ = కు; ఏతెంచుటయున్ = వచ్చుట; కుచేలోపాఖ్యానంబును = కుచేలోపాఖ్యానము; సూర్యోపరాగంబునన్ = సూర్యగ్రహణము నందు; కృష్ణుడు = కృష్ణుడు; రాముని = బలరాముని; తోన్ = తోటి; చేరి = కలిసి; పుర = పట్టణము యొక్క; రక్షణంబు = రక్షణ; ప్రద్యుమ్నా = ప్రద్యుమ్నుడు; ఆది = మున్నగు; కుమారులన్ = కొడుకులను; నిలిపి = నియమించి; షోడశసహస్ర = పదహారువేల; అంగన = స్త్రీలచేత; పరివృతుండు = చుట్టుచేరినవాడు; అయి = ఐ; అక్రూర = అక్రూరుడు; వసుదేవ = వసుదేవుడు; ఉగ్రసేన = ఉగ్రసేనుడు; ఆది = మున్నగు; యాదవ = యాదవవంశపు; వీరులున్ = శూరులు; తోడన్ = కూడా; రాన్ = వస్తుండగా; శమంతపంచక = శమంతపంచకము అను; తీర్థంబు = తీర్థమున; కున్ = కు; అరిగి = వెళ్ళి; కృత = చేసిన; స్నానుండు = స్నానము కలవాడు; ఐయి = ఐ; వసియించి = ఉండి; ఉండుటయున్ = ఉండుట; పాండవ = పాండవులు; కౌరవ = కౌరవులు; ఆది = మున్నగు; సకల = ఎల్ల; రాజ = రాజుల; లోకంబును = సమూహము; తత్ = ఆ; తీర్థంబు = తీర్థమున; కున్ = కు; వచ్చుటయున్ = వచ్చుట; కుంతీదేవి = కుంతీదేవి; దుఃఖంబును = దుఃఖము; నంద = నందుడు; యశోదా = యశోద; సహితులు = కూడి ఉన్నవారు; ఐన = అయిన; గోప = గోపకులు; గోపి = గోపికలు; జనంబులున్ = సమూహములు; చనుదెంచుటయున్ = వచ్చుట; కుశలప్రశ్న = కుశలప్రశ్నలు; ఆది = మున్నగు; సంభాషణంబులు = ముచ్చట్లు; మద్రకన్యా = మద్రరాకుమారి, లక్షణ; ద్రౌపదీ = ద్రౌపదీదేవి; సంభాషణంబును = ముచ్చట్లు; తదనంతరంబ = పిమ్మట; సకల = ఎల్ల; రాజ = రాజుల; లోకంబును = సమూహము; శమంతపంచక = శమంతపంచకము అను; తీర్థంబునన్ = తీర్థము నందు; స్నాతులు = స్నానములు చేసినవారు; ఐ = అయ్యి; రామ = బలరాముడు; కృష్ణ = కృష్ణుడు; ఆది = మున్నగు; యాదవ = యాదవవంశపు; వీరులన్ = శూరుల; ఆమంత్రణంబు = అనుమతులు; చేసి = తీసుకొని; నిజ = తమ; దేశంబుల్ = రాజ్యముల; కున్ = కు; పోవుటయున్ = పోవుట; కృష్ణుని = కృష్ణుడుని; దర్శించుట = దర్శించుట; కున్ = కు; మునీంద్రులు = మునీంద్రులు; ఏతెంచుటయున్ = వచ్చుట; వారి = వారి యొక్క; అనుమతిని = అనుమతితో; వసుదేవుండు = వసుదేవుడు; యాగంబున్ = యజ్ఞము; నెరవేర్చుటయున్ = చేయుట; నంద = నందుడు; యశోద = యశోదాదేవి; ఆది = మున్నగు; గోపికా = గోపస్త్రీల; నివహంబులన్ = సమూహములను; నిజ = తమ; పురంబు = నగరమునకు; అనిచి = పంపించి; ఉగ్రసేన = ఉగ్రసేనుడు; ఆది = మున్నగు; యాదవ = యాదవవంశపు; వీరులున్ = వీరులు; తానును = అతను; మాధవుడు = కృష్ణుడు; నిజ = తన; పుర = పట్టణము నందు; ప్రవేశంబు = ప్రవేశించుట; చేయుటయున్ = చేయుట; తొల్లి = మునుపు; కంసుని = కంసుని; చేతన్ = వలన; హతులు = చనిపోయినవారు; ఐ = అయ్యి; బలి = బలిచక్రవర్తి; పురంబునన్ = పట్టణము నందు; ఉన్న = ఉన్నట్టి; దేవకీదేవి = దేవకీదేవి; సుతులన్ = పుత్రులను; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడు; యోగమాయా = యోగమాయ యొక్క; బలంబునన్ = సామర్థ్యముచేత; తెచ్చి = తీసుకు వచ్చి; ఆమె = ఆమె; కున్ = కు; ఇచ్చుటయున్ = ఇచ్చుట; అర్జునుండు = అర్జునుడు; సుభద్రను = సుభద్రను; వివాహంబు = పెండ్లి; అగుటయున్ = ఆడుట; కృష్ణుండు = కృష్ణుడు; మిథిలానగరంబు = మిథిలానగరమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; శ్రుతదేవ = శ్రుతదేవుడు; జనకుల = జనకుల; చరిత్రంబును = చరితంబును; వారల = వారి; తోన్ = తోటి; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; ప్రశంస = కొనియాడుట; చేయుటయున్ = చేయుట; శ్రుతిగీతలున్ = శ్రుతిగీతలు; కృష్ణుండు = కృష్ణుడు; మఱలి = వెనుదిరిగి; తన = తన యొక్క; పురంబు = నగరమున; కున్ = కు; అరుగుదెంచుటయున్ = వచ్చుట; హరి = విష్ణుమూర్తి; హర = శివుడు; బ్రహ్మ = బ్రహ్మదేవుల; తారతమ్య = భేదము యొక్క; చరిత్రంబును = వృత్తాంతము; కుశస్థలిన్ = కుశస్థలిని; ఉండు = ఉండెడి; బ్రాహ్మణుని = విప్రుని; చరిత్రంబును = నడవడిక; అతని = అతని; తనయులు = కొడుకులు; పరలోకంబునకుంబోయినఁన్ = చనిపోగా; కృష్ణ = కృష్ణుడు; అర్జునులు = అర్జునుడు; తమ = వారి; యోగ = యోగమాయ యొక్క; బలంబునన్ = శక్తిచేత; వారిన్ = వారలను; తెచ్చి = తీసుకు వచ్చి; ఆ = ఆ; విప్రు = బ్రాహ్మణున; కున్ = కు; ఇచ్చుటయున్ = ఇచ్చుట; కృష్ణుండు = కృష్ణుడు; అర్జునుని = అర్జునుడును; వీడ్కొని = వీడ్కోలుచెప్పి; ద్వారక = ద్వారకానగరమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; అందున్ = అక్కడ; మాధవుండు = కృష్ణుడు; అయ్యై = ఆయా; ప్రదేశంబులన్ = ప్రదేశములలో; సకల = ఎల్ల; భార్యా = భార్యలచేత; పరివృతుండు = కూడినవాడు; అయి = ఐ; విహరించుటయున్ = విహరించుట; యాదవ = యాదవ; వృష్ణి = వృష్ణి; భోజ = భోజ; అంధక = అంధక; వంశ = వంశముల; చరిత్రంబున్ = కథ; అను = అనెడి; కథలు = వృత్తాంతములు; కల = ఉన్నట్టి; దశమ = పదవ; స్కంధంబున్ = స్కంధమున; అందు = లోని; ఉత్తర = ఉత్తర; భాగము = భాగము.`
భావము:- ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో ప్రద్యుమ్నుని జన్మము; శంబరాసురుని వృత్తాంతము; సత్రాజిత్తునకు సూర్యుడు శమంతకమణిని ఇచ్చుట; ఆ కారణముచేత ప్రసేనుడిని సింహము చంపుట; దానిని జాంబవంతుడు చంపి మణిని తీసుకువెళ్ళుట; గోవిందుండు ప్రసేనుని చంపి శమంతకమణిని తీసుకుపోయాడు అని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి మీద నింద వేయుట; శ్రీకృష్ణుడు అందుకోసం జాంబవంతుడిని ఎదిరించి రత్నముతో పాటుగా జాంబవతిని తీసుకువచ్చి వివాహము చేసికొనుట సత్రాజిత్తునకు మణిని ఇచ్చుట; సత్యభామా పరిణయము; పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారు అని విని కృష్ణుడు బలభద్ర సహితుడు అయి హస్తినాపురమునకు వెళ్ళుట; అక్రూర కృతవర్మల అంగీకారముతో శతధన్వుడు సత్రాజిత్తుని చంపి శమంతకమణిని తీసుకుపోవుట; ఆ విషయమై సత్యభామ హస్తినాపురమునకు వెళ్ళి కృష్ణునికి చెప్పగా అతను వెనుకకు వచ్చి శతధన్వుని చంపుట బలరాముడు మిథిలానగరమునకు వెళ్ళుట; అక్కడ; దుర్యోధనుడు బలరాముని వద్ద గదావిద్య నేర్చుకొనుట; కృష్ణుడు సత్రాజిత్తునకు అపరకర్మలు చేయుట; శమంతకమణిని దాచిన అక్రూరుడు భయముతో ద్వారక విడిచి పోవుట; అతను లేకపోవుటచేత అనావృష్టి కలుగగా శ్రీకృష్ణుడు అక్రూరుని మరల రప్పించుట; దామోదరుడు ఇంద్రప్రస్థ పురమునకు వెళ్ళుట; అక్కడ అర్జునుని; సమేతుడు అయి వేటకి అడవికి వెళ్ళి కాళిందిని తీసుకు వచ్చుట; ఖాండవ దహనము చేయుట; అగ్నిదేవుడు అర్జునునికి అక్షయ తూణీరములు, గాండీవము, కవచము, రథము, గుఱ్ఱములు ఇచ్చుట; మయుడు ధర్మరాజునకు సభ నిర్మించి ఇచ్చుట; నగధరుండు తన పట్టణమునకు వెనుతిరిగి వచ్చి కాళిందిని; వివాహమాడుట; మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మద్ర రాజకన్యలను వరుసగా పెండ్లాడుట; నరకాసురునితో యుద్ధము అతని గృహములో ఉన్న రాజ కన్యలను పదహారువేల మందిని (16,000) తీసుకు వచ్చుట; స్వర్గ గమనము; అదితికి చెవికుండలములను ఇచ్చుట; పారిజాతాపహరణము; పదహారువేల మంది (16,000) రాజకన్యలను పరిణయ మాడుట; రుక్మిణీదేవి విప్రలంబము; రుక్మిణీదేవి స్తోత్రము; కృష్ణకుమార ఉత్పత్తి; వారి గురువుల లెక్క; ప్రద్యుమ్నుని వివాహము; అనిరుద్ధుని జన్మము; అతని వివాహం కోసము కుండిననగరమునకు వెళ్ళుట; రుక్మి బలభద్రుల జూదము, రుక్మి వధ; ఉషాకన్య కలలో అనిరుద్ధుని చూసి మోహించుట; చిత్రరేఖ సకల దేశాల రాజులను చిత్రపటముపై లిఖించి చూపించి అనిరుద్ధుని తీసుకువచ్చుట; బాణాసురయుద్ధము; నృగోపాఖ్యానము; బలభద్రుని ఘోషయాత్ర; యమునను చీల్చుట; శ్రీకృష్ణుడు పౌండ్రకవాసుదేవుడు, కాశీరాజులను చంపుట; కాశీరాజు కొడుకు సుదక్షిణుడు అభిచారహోమం చేసి కృత్యను కృష్ణునిమీదకి పంపగా సుదర్శనచక్రము కృత్యను, సుదక్షిణుడు సహితంగా కాశీపురమును కాల్చివేయుట బలరాముడు; రైవతనగరములో ద్వివిదుని వధించుట; సాంబుడు దుర్యోధనుని కూతురు లక్షణను ఎత్తుకురాగా కౌరవులు అతనిని తీసుకువెళ్ళి చెఱబెట్టుట; ఆ విషయము నారదుని వలన విని బలరాముడు హస్తినాపురమునకు వెళ్ళుట; కౌరవులు ఆడిన అవమానపు మాటలకు కోపగించి హస్తినాపురమును గంగానదిలో పడవేయ బోవుట; కౌరవులు భయముతో అంగనాయుక్తముగా సాంబుడుని ఇచ్చుట; బలరాముడు ద్వారకకు వచ్చుట; నారదుడు, కృష్ణుడు పదహారువేల (16,000) కన్యకలను ఒకే ముహుర్తంలోనే అందఱికి అన్ని రూపులుతో పెండ్లి ఆడెను అని విని ఆ విధానము తెలిసికొన కోరి వచ్చుట; ఆ మహాత్మ్యమును చూసి మరలిపోవుట; జరాసంధుడి చేత చెరపట్టబడిన రాజులు కృష్ణుని వద్దకు దూతను పంపించుట; నారదుని ఆగమనము; పాండవుల ప్రశంస; ఉద్ధవుడు చేయవలసినపని తెలియజెప్పుట; ఇంద్రప్రస్థకు వెళ్ళుట; ధర్మరాజు రాజసూయ యాగము ప్రారంభము; దిగ్విజయము; జరాసంధ వధ; రాజులను చెరనుండి విడిపించుట; రాజసూయ యాగము నెఱవేర్చుట; శిశుపాలవధ; అవభృథము, రాజసూయ యాగముల వైభవము చూసి సహించలేని దుర్యోధనుడు మయసభలో కట్టుకొన్న బట్టలు తడిసిపోవునట్లు తూలుట; తన్నిమిత్తమైన పరాభవమును పొంది రారాజు వెళ్ళిపోవుట; కృష్ణుడు ధర్మరాజుచేత వేడుకొనబడి నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థము నందు ఉండుట; సాళ్వుడు తపస్సు చేసి హరుని మెప్పించి సౌభకము అను విమానము పొంది ద్వారకానగరమును నిరోధించుట; యాదవ సాళ్వ యుద్ధము; కృష్ణుడు వెనుదిరిగి వచ్చి సాల్వుని చంపుట; దంతవక్త్రవధ; విదూరథుని మరణము; కృష్ణుడు యాదవ సైన్యములతో మరలి ద్వారకకు వెళ్ళుట; కౌరవ పాండవుల యుద్ధము జరుగును అని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళుట; అక్కడ జాహ్నవీనది మున్నగు నదులందు స్నానముచేసి, నైమిశారణ్యమునకు వెళ్ళుట; అక్కడి ఋషులుచే పూజింపబడి దగ్గరలో ఉన్నత ఆసనముపై కూర్చుండి ఉన్న సూతుడు తనను చూసి లేవకపోవుటకు అలిగి బలరాముడు దర్భమొనతో అతనిని వధించుట; బ్రహ్మహత్యా దోషము కలిగినది అని మునులు చెప్పగా సూతుని; పునరుజ్జీవుని చేయుట; బలరాముడు ఇల్వలుని కొడుకు పల్వలుని చంపుట; వారి అనుమతిపొంది బలరాముడు ఆ సమీప తీర్థము లందు స్నానము చేసి గంగాసాగర సంగమమునకు వెళ్ళుట; మహేంద్ర పర్వతము చేరుట; పరశురామ దర్శనము; సప్తగోదావరిలో స్నానము చేయుట; ఇంకను ఉన్నట్టి తీర్థములందు స్నానము చేసి, శ్రీశైలము, వేంకటా చలములు దర్శించుట; వృషభాద్రి హరిక్షేత్రము సేతుబంధము రామేశ్వరములను దర్శించి తామ్రపర్ణి యందు జలకాలు ఆడుట; గోదానములు చేసి; మలయగిరిలో అగస్త్యుని దర్శించుట; కన్యాకుమాని కొలచుట; అక్కడ బ్రాహ్మణుల వలన పాండవ కౌరవుల యుద్ధమునందు సకల రాజులు చనిపోయిరి అని, భీమ సుయోధనులు గదాయుద్ధమునకు సిద్ధపడ్డారు అని విని వారిని వారించుటకై బలరాముడు అక్కడకు వెళ్ళుట; అక్కడ వారిచేత పూజింపబడి వారిని వారింపలేక వెనుదిరిగి ద్వారకకు వెళ్ళుట; మరల నైమిశారణ్యానికి పోయి అక్కడ యాగము చేసి రేవతీదేవి తాను అవభృథస్నానములు చేసి ద్వారకు వచ్చుట; కుచేలోపాఖ్యానము; సూర్యగ్రహణము నందు కృష్ణుడు బలరాముడు పురరక్షణకు కొడుకులను నిలిపి పదహారువేల స్త్రీలతోకూడి అక్రూర వసుదేవ ఉగ్రసేనాది యాదవశూరులు కూడ రాగా శమంతపంచకం వెళ్ళి స్నానములు చేసి వసియించి ఉండుట; పాండవ కౌరవాది సకల రాజులు ఆ తీర్థమునకు వచ్చుట; కుంతీదేవి దుఃఖము; నందయశోదా సహితులు ఐన గోపగోపికా జనాలు వచ్చుట; కుశలప్రశ్నలు ముచ్చట్లు; మద్రరాకుమారి లక్షణ ద్రౌపదీదేవిల ముచ్చట్లు; పిమ్మట, సకల రాజులు శమంతపంచకమున స్నానములు చేసి బలరామ కృష్ణాది యాదవ శూరుల అనుమతులు తీసుకొని తమ రాజ్యముకు పోవుట; కృష్ణుని దర్శించుటకు మునీంద్రులు వచ్చుట; వారి అనుమతితో వసుదేవుడు యాగము చేయుట; నంద యశోదాది గోపికలను తమ పురమునకు పంపించి ఉగ్రసేనాది యాదవ వీరులు తాను కృష్ణుడు ద్వారకకు చేరుట; ఇంతకు మునుపు కంసునిచేత చనిపోయి బలి పట్టణమునందు ఉన్న దేవకీదేవి పుత్రులను రామకృష్ణులు యోగమాయా బలంతో తీసుకు వచ్చి ఆమెకు ఇచ్చుట; అర్జునుడు సుభద్రను పెండ్లాడుట; కృష్ణుడు మిథిలకు వెళ్ళుట; శ్రుతదేవ జనకుల చరిత్రలు; బ్రాహ్మణ ప్రశంస; శ్రుతిగీతలు; కృష్ణుడు మఱలి తన నగరమునకు వచ్చుట; హరి హర బ్రహ్మదేవుల తారతమ్య వృత్తాంతము; కుశస్థలి విప్రుని చరిత్ర, అతని కొడుకులు చనిపోగా కృష్ణార్జునులు వారిని తీసుకు వచ్చి విప్రునకు ఇచ్చుట; కృష్ణుడు అర్జునునికి వీడ్కోలుచెప్పి ద్వారకకు వెళ్ళుట; అక్కడ మాధవుడు ఎల్ల భార్యలచేత పరివృతుడు అయి విహరించుట; యాదవ వృష్ణి భోజ అంధక వంశముల చరిత్రలు అనే కథలున్న దశమస్కంధంబులో ఉత్తరభాగము.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు.