పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/విదురుని తీర్థాగమనంబు


తెభా-3-3-ఉ.
"పాండునృపాల నందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్
భంనభూమిలో గెలిచి పాండుర శారదచంద్రచంద్రి కా
ఖంయశః ప్రసూన కలికావళిఁ గౌరవరాజ్యలక్ష్మి నొం
డొం యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండగన్.

టీక:- పాండు = పాండు; నృపాల = రాజు యొక్క; నందనులు = పూత్రులు; బాహు = భుజ; బలంబునన్ = బలము వలన; ధార్తరాష్ట్రులన్ = దుర్యోధనాదులను {ధార్తరాష్ట్రులు - ధృతరాష్ట్రుని కొడుకులు, దుర్యోధనాదులు}; భండన = యుద్ధ; భూమి = రంగము; లోన్ = లోపల; గెలిచి = జయించి; పాండుర = తెల్లని; శారద = శరదృతువు నందలి; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల వంటి; అఖండ = అంతులేని; యశః = కీర్తి యనే; ప్రసూన = పుష్పముల; కలిక = మొగ్గల; ఆవళిన్ = వరుసతో; కౌరవ = కురువంశపు; రాజ్య = రాజ్యము యొక్క; లక్ష్మిన్ = సంపదను; ఒండొండ = ఒక్కొక్కటిగ; అలంకరింపుచు = అలంకరిస్తూ; జయ = జయము యొక్క; ఉన్నతిన్ = గొప్పదనముతో; రాజ్యమున్ = రాజ్యమును; చేయుచు = పాలించుచు; ఉండగన్ = ఉండగా.
భావము:- పాండురాజు కుమారులైన ధర్మరాజు మున్నగు వారు బాహువిక్రమంతో ధృతరాష్ట్రుని కొడుకులైన దుర్యోధనుడు మున్నగు కౌరవులను రణరంగంలో జయించారు. స్వచ్ఛమైన శరత్కాలపు పండు వెన్నెలలాంటి అఖండకీర్తిని ఆర్జించారు. అలా యశస్సు అనే పూలమొగ్గలతో కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు. ఈవిధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలన సాగించారు.

తెభా-3-4-క.
నుజేంద్ర! విదురుఁ డంతకు
మును వనమున కేఁగి యచట మునిజనగేయున్
వినుత తపోధౌరేయున్
ను ననుపమ గుణవిధేయుఁ నె మైత్రేయున్.

టీక:- మనుజ = మానవులకు; ఇంద్ర = ప్రభువు, రాజు; విదురుడున్ = విదురుడు; అంతకుమును = అంతకు ముందే; వనమునకున్ = అడవికి; ఏగి = వెళ్ళి; అచటన్ = అక్కడ; ముని = మునుల; జన = సమూహముచే; గేయున్ = పొగడబడువానిని; వినుత = పొగడబడిన; తపస్ = తాపసులలో; ధౌరేయున్ = అగ్రగణ్యుని; ఘనున్ = గొప్పవానిని; అనుపమ = సాటిలేని; గుణ = గుణములకు; విధేయున్ = విధేయుని; కనెన్ = చూచెను; మైత్రేయున్ = మైత్రేయుని.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! అంతకు ముందే; అంటే మహాభారత యుద్ధం జరగటానికంటే ముందే విదురుడు అడవులకు వెళ్ళాడు. అక్కడ మునులచే కీర్తింపబడేవాడూ, ప్రశస్తమైన తపస్సులో పేరెన్నికగన్నవాడూ, సాటిలేని మేటి గుణాలు కలిగి పొగడ తగినవాడు అయిన మైత్రేయుణ్ణి సందర్శించాడు.

తెభా-3-5-క.
నుఁగొని తత్పాదంబులు
ఫాలము సోక మ్రొక్కి గ నిట్లనియెన్
"మునివర! సకల జగత్పా
చరితుఁడు గృష్ణుఁ డఖిల వంద్యుం డెలమిన్.

టీక:- కనుఁగొని = చూచి; తత్ = అతని; పాదముల్ = పాదములను; తన = తన యొక్క; ఫాలము = నుదురు; సోకన్ = తగులునట్లు; మ్రొక్కి = నమస్కరంచి; తగన్ = తగినట్లుగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; వర = ఉత్తమా; సకల = సమస్త; జగత్ = లోకములను; పావన = పవిత్రము చేయు; చరితుడు = ప్రవర్తన కలవాడును; కృష్ణుడు = కృష్ణుడు; అఖిల = అందరి చేతను; వంద్యుండు = పూజింపబడువాడు; ఎలమిన్ = కుతూహలముతో;
భావము:- అలా మైత్రేయుణ్ణి దర్శించి ఆ మహాముని పాదాలపై తన నుదురు సోకేలా నమస్కారం చేసి విదురుడు ఇలా అన్నాడు, “మునిశేఖరా! మైత్రేయా! సర్వలోకాలను పవిత్రము చేయు చరిత్ర కలవాడు, అందరిచేత పూజింపబడేవాడు ఐన శ్రీకృష్ణుడు....

తెభా-3-6-క.
మండితతేజోనిధి యై
పాంవ హితమతిని దూతభావంబున వే
దంపురి కేగి కురుకుల
మంనుఁ డగు ధార్తరాష్ట్రు మందిరమునకున్.

టీక:- మండిత = అలంకరింపబడిన; తేజస్ = తేజస్సునకు; నిధి = గని వంటివాడు; ఐ = అయి; పాండవ = పాండవులకు; హిత = మేలు; మతిన్ = చేయు నుద్దేశ్యముతో; దూత = దూతగా; భావంబునన్ = పనిచేయుచు; వేదండపురి = హస్తినాపురము; కిన్ = కి; ఏగి = వెళ్ళి; కురు = కౌరవ; కుల = వంశమునకు; మండనుడు = అలంకారము; అగు = అయిన; ధార్తరాష్ట్రు = దుర్యోధనుని; మందిరమున్ = భవనము; కున్ = కు.
భావము:- తేజస్సు అనే నిధిని భూషణంగా కలిగినవాడై, ఆ గోవిందుడు పాండవుల మేలు కోరి, రాయబారి బాధ్యత స్వీకరించి హస్తినాపురానికి వెళ్ళాడు. కౌరవ వంశాన్ని అలంకరించి ఉన్న ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని సౌధానికి .....

తెభా-3-7-తే.
నఁగ నొల్లక మద్గృహంబునకు భక్త
త్సలుం డగు కృష్ణుండు చ్చు టేమి
తము? నా కది యెఱిఁగింపు రుణతోడ"
నుచు విదురుండు మైత్రేయు డిగె"ననిన.

టీక:- చనగన్ = వెళ్ళుటకు; ఒల్లక = ఒప్పుకొనక; మత్ = మాయొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; భక్త = భక్తులందు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; అగు = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; వచ్చుటన్ = వచ్చుటకు; ఏమి = ఏమి; కతము = కారణము; నాకున్ = నాకు; అది = దానిని; ఎఱిగింపుము = తెలుపుము; కరుణ = దయ; తోడఁ = తో; అనుచున్ = అని; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; అడిగెన్ = అడిగెను; అనిన = అనగా.
భావము:- భక్తుల ఎడ వాత్సల్య పూరితుడు కృష్ణుడు దుర్యోధనుని ధామమునకు పోవుటకు ఇష్టపడక, ప్రత్యేకంగా నా ఇంటికి దయచేసాడు. ఇట్లా రావడానికి కారణం ఏమిటి దయచేసి ఇందులో ఉన్న రహస్యం నాకు విప్పి చెప్పు” అని విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు.

తెభా-3-8-క.
విని వెఱఁగంది పరీక్షి
న్మనుజవరేణ్యుండు విమలతి నిస్తంద్రున్
మునికుల జలనిధి చంద్రున్
సునిశిత హరిభక్తిసాంద్రు శుకయోగీంద్రున్.

టీక:- విని = వినినవాడై; వెఱగంది = ఆశ్చర్యపడి; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; మనుజవరేణ్యుడు = రాజు {మనుజవరేణ్యుడు – మానవులలో గొప్పవాడు, రాజు}; విమల = నిర్మలమైన; మతి = మనసు కలవాడు; నిస్తంద్రున్ = ఏమరుపాటు లేని వానిని; ముని = మునుల; కుల = సమూహమను; జలనిధి = సముద్రమునకు {జలనిధి - నీటికి గని వంటిది, సముద్రము}; చంద్రున్ = చంద్రుని; సునిశిత = సునిశితమైన; హరి = హరిమీద; భక్తిన్ = భక్తి; సాంద్రున్ = చిక్కగా కలవానిని; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని.
భావము:- ఇలా చెప్పుతున్న మహర్షి మాటలు విని పరీక్షిన్మహారాజు ఆశ్చర్యపోయి; పరిశుద్ధమైన మనస్సు గలవాడూ, స్థిర సంకల్పుడూ, ముని జనము అనే సముద్రానికి చంద్రుని వంటి వాడూ, తిరుగులేని దట్టమైన హరిభక్తి గల వాడూ అయిన శుకమహర్షి వైపు చూసాడు.

తెభా-3-9-క.
ని యిట్లనె "మైత్రేయుని
ఘుండగు విదురుఁడే రస్యము లడిగెన్?
ముని యేమి చెప్పె? నే పగి
దినిఁ దీర్థములాడె? నెచటఁ దిరుగుచు నుండెన్?

టీక:- కని = చూచి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; మైత్రేయునిన్ = మైత్రేయుని; అనఘుండు = పుణ్యుని; అగు = అగు; విదురుడు = విదురుడు; ఏ = ఏ; రహస్యములన్ = రహస్యములను; అడిగెన్ = అడిగెను; ముని = మునీశ్వరుడు; ఏమి = ఏమి; చెప్పెన్ = చెప్పెను; ఏ = ఏ; పగిది = విధమున; తీర్థములు = తీర్థములలో స్నానములు; ఆడెన్ = చేసెను; ఎచటన్ = ఎక్కడెక్కడ; తిరుగుచున్ = విహరిస్తూ; ఉండెన్ = ఉండెను.
భావము:- అప్పుడు పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు “పుణ్యుడైన విదురుడు మాన్యుడైన మైత్రేయుని ఏ యే రహస్యాలు అడిగాడు; అందుకు ఆ మహాముని యేమేమి సమాధానాలు చెప్పాడు; విదురుడు ఏ యే తీర్థాలలో ఏ విధంగా స్నానం చేసాడు; ఎక్క డెక్కడ ఏ విధంగా సంచరించాడు;

తెభా-3-10-తే.
న్నిదెలియంగ నానతి యిచ్చి నన్ను
ర్థి రక్షింపవే విమలాంతరంగ!
నదయాపాంగ! హరిపాదమలభృంగ!
హితగుణసంగ! పాపతమఃపతంగ!"

టీక:- ఇన్నియున్ = ఇవన్నీ; తెలియంగ = తెలియునట్లు; ఆనతి యిచ్చి = చెప్పి; నన్ను = నన్ను; అర్థిన్ = కోరి; రక్షింపవే = కాపాడవా; విమల = నిర్మలమైన; అంతరంగ = హృదయము కలవాడ; ఘన = గొప్ప; దయా = దయతో నిండిన; అపాంగ = కటాక్షము కలవాడ; హరి = కృష్ణుని; పాద = పాదములను; కమల = పద్మములకు; భృంగ = తుమ్మెద వంటివాడ; మహిత = గొప్ప; గుణ = గుణములు; సంగ = కూడినవాడ; పాప = పాపములను; తమస్ = చీకటికి; పతంగ = సూర్యుని వంటి వాడా.
భావము:- ఓ మహర్షీ! నీవు స్వచ్ఛమైన హృదయం గలవాడవు; కరుణతో నిండిన కడగంటి చూపులు గలవాడవు; విష్ణుమూర్తి పాదాలనే పద్మాలను ఆశ్రయించే తుమ్మెద లాంటి వాడవు; నీవు ఉత్తమ గుణ సంపన్నుడవు; పాపాలు అనే చీకటిని పటాపంచలుచేసే సూర్యభగవానుడవు; దయచేసి ఇవన్నీ వివరించి అపన్నుడనైన నన్ను రక్షించు.”

తెభా-3-11-చ.
వుడు బాదరాయణి ధరాధిపుతో ననుఁ "బూరువంశ వ
ర్థ! విను కష్టుఁడైన ధృతరాష్ట్ర నృపాలుఁడు పెంపుతో సుయో
ముఖ పుత్రులం గడు ముదంబునఁ బెంపుచుఁ బాండురాజు ద
ప్పి పిదపం దదాత్మజులు పెల్కుఱి తన్నని చేర వచ్చినన్.

టీక:- అనవుడు = అనగా; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బదరీవనమున వసించువాని (వ్యాసుని) కుమారుడు, శుకుడు}; ధరాధిపు = రాజు {ధరాధిపుడు - భూమికి ప్రభువు, రాజు}; తోన్ = తో; అనున్ = పలికెను; పూరు = పూరుని {పూరుడు - యయాతి మహారాజు పుత్రుడు, తరువాతివారు కురువు, కౌరవులు, పాండవులు, పరీక్షిత్తు}; వంశ = వంశమును; వర్థన = వృద్ధి చేయువాడ; విను = వినుము; కష్టుడు = నీచుడు; ఐన = అయిన; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడు అను; నృపాలుడు = రాజు {నృపాలుడు - నరులను పాలించు వాడు, రాజు}; పెంపుతో = అతిశయించి; సుయోధన = దుర్యోధనుడు; ముఖ = మొదలగు; పుత్రులన్ = కొడుకులను; కడు = మిక్కిలి; ముదంబునన్ = ప్రేమతో; పెంపుచున్ = పెంచుతూ; పాండురాజు = పాండురాజు {పాండురాజు - పాండవుల తండ్రి, ధృతరాష్ట్రుని తమ్ముడు}; తప్పిన = మరణించిన; పిదపన్ = తరువాత; తత్ = అతని; ఆత్మజులు = సంతానము; పెల్కుఱి = భయముతో విలవిలలాడుతూ; తన్నని = తనే అండ అని; చేర = దగ్గరకు; వచ్చినన్ = రాగా.
భావము:- అలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు “పురు వంశం ప్రతిష్ఠను వృద్ధిచేసిన వాడా! విను. దుర్యోధనుడు మొదలైన తన కుమారులను దుష్టుడైన ధృతరాష్ట్రుడు ఎక్కువ గారాబంగా పెంచాడు. పాండురాజు కుమారులు పాండవులు తండ్రి పరమపదించగానే భయంతో కంపించి అతని అండ చేరారు.

తెభా-3-12-వ.
ఇట్లువచ్చిన పాండవుల యెడ నసూయా నిమగ్నులై సుయోధనాదులు.
టీక:- ఇట్లు = ఈవిధముగ; వచ్చినన్ = రాగా; పాండవుల = పాండవుల {పాండవులు - పాండురాజు పుత్రులు, ధర్మరాజాదులు}; ఎడన్ = యందు; అసూయా = అసూయలో; నిమగ్నులు = మునిగినవారు; ఐ = అయి; సుయోధన = దుర్యోధనుడు; ఆదులు = మొదలగువారు;
భావము:- ఇట్లు వచ్చిన పాండవుల యందు సుయోధనుడు మున్నగు కౌరవులు అసూయా నిమగ్నులు అయ్యారు;

తెభా-3-13-క.
పెట్టిరి విషాన్న; మంటం
ట్టిరి ఘనపాశములను; గంగానదిలో
నెట్టిరి; రాజ్యము వెడలం
గొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై.

టీక:- పెట్టిరి = పెట్టిరి; విష = విషము కలిపిన; అన్నమున్ = భోజనమును; అంటన్ = గట్టిగా; కట్టిరి = కట్టివేసిరి; ఘన = పెద్ద; పాశములన్ = తాళ్ళతో; గంగా = గంగ అను; నది = నది; లోన్ = లోనికి; నెట్టిరి = తోసివేసిరి; రాజ్యమున్ = రాజ్యమునుండి; వెడలంగొట్టిరి = గెంటివేసిరి; ధర్మంబు = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; కుటిల = వంకర; ఆత్మకులు = స్వభావము కలవారు; ఐ = అయి.
భావము:- ధర్మదూరులు కుటిల బుద్ధులు అయి విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళ్ళతో కట్టారు, గంగానదిలోకి నెట్టారు. రాజ్యంనుండి వెళ్ళ గొట్టారు.,
శుకుడు పరీక్షిత్తునకు అసూయా మగ్ను లైన కౌరవులు పాండవుల యెడ చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు

తెభా-3-14-క.
క్రూరాత్ము లగుచు లాక్షా
గారంబున వారు నిద్ర గైకొని యుండన్
దారుణ శిఖిఁ దరికొలిపిరి
మాణకర్మముల కప్రత్తులు నగుచున్.

టీక:- క్రూర = క్రూరమైన; ఆత్ములు = స్వభావము కలవారు; అగుచున్ = అవుతూ; లాక్ష = లక్క; ఆగారంబునన్ = ఇంటిలో; వారు = వారు; నిద్రగైకొని = నిద్రపోవుచు; ఉండగన్ = ఉండగా; దారుణ = దారుణమైన; శిఖిన్ = మంటలను; తరికొలిపిరి = ముట్టించిరి; మారణ = ప్రాణములను తీయు; కర్మములకున్ = పనులకు; అప్రమత్తులు = సిద్ధపడువారు; అగుచున్ = అవుతూ.
భావము:- పాండవులు లక్క ఇంట్లో మైమరిచి నిద్రపోతూ ఉండగా క్రూరహృదయులైన కౌరవులు ఇంటికి నిప్పంటించారు. వారిని రూపు మాపటానికి ఎన్నో పన్నాగాలు ఏమరుపాటు లేకుండా పన్నారు.

తెభా-3-15-తే.
సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ
విలస దవభృథస్నాన పవిత్రమైన
దౌపదీ చారు వేణీభరంబు పట్టి
కొలువులోపల నీడ్చిరి కుత్సితమున.

టీక:- సూరి = పండితుల; జన = సమూహముచే; గేయము = స్తుతింపదగినది; అగు = అయిన; రాజసూయ = రాజసూయము అను; యజ్ఞ = యజ్ఞమువలన; విలసత్ = విశిష్టమైన; అవభృథ = యజ్ఞాంతమున చేసెడి పుణ్య; స్నాన = స్నానముచే; పవిత్రము = పావనము చేయబడినది; ఐన = అయినట్టి; ద్రౌపదీ = ద్రౌపది యొక్క {ద్రౌపది - ద్రుపద రాకుమారి}; చారు = అందమైన; వేణీ = జుట్టు; భరమున్ = ముడిని; పట్టి = పట్టుకొని; కొలువు = సభ; లోపలన = లోనికి; ఈడ్చిరి = లాక్కొచ్చిరి; కుత్సితమున = నీచబుద్ధితో.
భావము:- పండితవరేణ్యుల ప్రశంసలు అందుకొనెడి రాజసూయ యాగంతో విశిష్ఠమైన అవభృథస్నానంతో పరమ పవిత్రమై ఒప్పారుతున్న ద్రుపదమహారాజు పుత్రిక పాంచాలి కొప్పు పట్టుకొని పరమ నీచంగా నిండు సభలోకి ఈడ్చుకొచ్చారు.

తెభా-3-16-క.
కావున వారల కపకృతిఁ
గావింపని దొక దినంబు లుగదు, తమ జ
న్మాధి నిజ నందనులను
వావిరి నయ్యంధనృపతి లదనఁ డయ్యెన్.

టీక:- కావున = అందుచేత; వారల = వారి; కిన్ = కి; అపకృతి = అపకారము; కావింపనిది = చేయకుండగ; ఒక = ఒకటైనా; దినము = రోజు; కలుగదు = జరుగదు; తమ = తమయొక్క; జన్మ = జన్మ; అవధి = ఉన్నంత వరకు; నిజ = తన యొక్క; నందనులన్ = కొడుకులను; వావిరిన్ = పద్ధతులను; ఆ = ఆ యొక్క; అంధ = గ్రుడ్డి; నృపతి = రాజు {నృపతి - నరులకు ప్రభువు, రాజు}; వలదు = వద్దు; అనడు = అననివాడు; అయ్యెను = ఆయెను.
భావము:- కౌరవులు పాండవులకు ఇలా ఆజన్మాంతం అపకారం చెయ్యని రోజే లేదు. ఆ గుడ్డి రాజు ఏమో కొడుకులకు అడ్డు చెప్పలేకపోయాడు.

తెభా-3-17-తే.
మాయజూదంబు పన్ని దుర్మార్గవృత్తిఁ
బుమిఁ గొని యడవులకుఁ బో డువ నచటఁ
దిరిగి వారలు సమయంబు దీర్చి యేఁగు
దెంచి తమ యంశ మడిగినఁ బంచి యిడక.

టీక:- మాయ = మోసముతో కూడిన; జూదమున్ = జూదమును; పన్ని = కుట్రచేసి; దుర్మార్గ = చెడుదారి పట్టిన; వృత్తిన్ = పద్ధతులతో; పుడమిన్ = రాజ్యమును; కొని = లాక్కొని; అడవులు = అరణ్యముల; కున్ = కి; పోన్ = పోవునట్లు; నడువ = గెంటివేయగా; అచటన్ = అక్కడనుండి; తిరిగి = మరల; వారలు = వారు; సమయంబు = గడువును; తీర్చి = తీర్చి; ఏగుదెంచి = వచ్చి; తమ = తమ యొక్క; అంశమున్ = పాలు; అడిగినన్ = అడుగగా; పంచి = పంచి; ఇడక = ఇవ్వక.
భావము:- కౌరవులు మాయా జూదంలో అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని లాక్కొన్నారు. వారిని అడవులకు వెళ్ళగొట్టారు. పాండవులు ఒడంబడిక ప్రకారం గడువు ముగిశాక తిరిగివచ్చి తమకు రావలసిన రాజ్యభాగాన్ని అడిగితే ఇవ్వలేదు.

తెభా-3-18-వ.
ఉన్నయెడ.
టీక:- ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమందు.
భావము:- ఇలా ఉండగా;

తెభా-3-19-చ.
ల నియంత యైన హరి ర్వశరణ్యుఁడు మాధవుండు సే
నవ కల్పకంబు భగవంతుఁ డనంతుఁ డనంతశక్తి నం
ధరుఁ డబ్జలోచనుఁడు ర్మతనూభవుచే నియుక్తుఁడై
కుటిల భక్తి యోగమహితాత్మకుఁడై ధృతరాష్ట్రు పాలికిన్.

టీక:- సకలనియంత = కృష్ణుడు {సకలనియంత - సమస్తమును నియమించువాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు {హరి - దురితములను హరించువాడు, విష్ణువు}; సర్వశరణ్యుడు = కృష్ణుడు {సర్వశరణ్యుడు - అందరకును శరణ్యుడు (శరణుజొచ్చుటకు తగినవాడు), విష్ణువు}; మాధవుండు = కృష్ణుడు {మాధవుడు - మాధవి యొక్క భర్త, విష్ణువు}; సేవకనవకల్పము = సేవించువారికి {సేవకనవకల్పము - సేవించువారికి కొత్త కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; భగవంతుడు = కృష్ణుడు {భగవంతుడు – మహిమ కలవాడు, విష్ణువు}; అనంతుడు = కృష్ణుడు {అనంతుడు – అంతము లేనివాడు, విష్ణువు}; అనంతశక్తి = కృష్ణుడు {అనంతశక్తి - అనంతమైన శక్తి కలవాడు, విష్ణువు}; నందకధరుడు = కృష్ణుడు {నంకధరుడు - నందకము అను కత్తి ధరించువాడు, విష్ణువు}; అబ్జలోచనుడు = కృష్ణుడు {అబ్జలోచనుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; ధర్మతనూభవు = ధర్మరాజు {ధర్మతనూభవుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; చేన్ = చేత; నియుక్తుడు = నియోగింపబడినవాడు; ఐ = అయి; అకుటిల = కుటిలము కాని; భక్తియోగ = భక్తియోగముచే; మహిత = గొప్ప; ఆత్మకుడు = ఆత్మ కలవాడు; ఐ = అయి; ధృతరాష్ట్రు = ధృతరాష్ట్రుని; పాలికిన్ = వద్దకు.
భావము:- నిఖిల సృష్టికీ నియంత యైన హరి, అఖిల లోక శరణ్యుడైన మాధవుడు, ఆశ్రితజన పారిజాతమైన భగవంతుడు, అంతం లేనివాడూ, ఎంతో శక్తి సంపన్నుడూ, నందకం అనే ఖడ్గాన్ని ధరించినవాడూ, పద్మాక్షుడూ అయిన శ్రీకృష్ణుడు నిష్కళంకమైన భక్తియోగానికి అంకితమైన మనస్సు కలవాడైన ధర్మరాజు నియమించిన ప్రకారం రాయబారం నడపటానికి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లాడు.

తెభా-3-20-క.
ని యచట భీష్మ గురు త
త్తయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్
విని యనుమోదింపఁగ ని
ట్లనియెన్ ధృతరాష్ట్రుతోడ వనీనాథా!

టీక:- చని = వెళ్లి; అచటన్ = అక్కడ; భీష్మ = భీష్ముడు; గురు = ద్రోణాచార్యుడు {ద్రోణాచార్యుడు - కౌరవ. పాండవులకు గురువు}; తత్ = అతని; తనయ = కొడుకు, అశ్వత్థామ; కృపాచార్య = కృపాచార్యుడు; నిఖిల = సమస్తమైన; ధాత్రీపతులున్ = రాజులు {ధాత్రీపతులు - భూమికి పతి యైనవారు, రాజులు}; విని = వినినవారై; అనుమోదింపగన్ = ఒప్పుకొనగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; ధృతరాష్ట్రు = ధృతరాష్ట్రుని; తోడన్ = తో; అవనీనాథ = రాజా {అవనీనాథుడు - భూమికి నాథుడు, రాజు}.
భావము:- పరీక్షిత్తు భూపతీ! అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు అక్కడ భీష్ముడూ, ద్రోణుడూ, అశ్వత్థామా, కృపుడూ, సకల దేశాల రాజులూ, అందరూ విని సంతోషించే విధంగా ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు.

తెభా-3-21-క.
"కౌవ పాండవు లిరువురు
నాయ నీ కొక్క సమమ వనీవర! నీ
వే రీతి నైన బాండుకు
మారుల పాలొసఁగి తేని ను నుభయంబున్."

టీక:- కౌరవ = కౌరవులు నూర్గురు; పాండవులు = పాండవులు ఐదుగురు {పాండవులు - పంచపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు}; ఇరువురున్ = ఇద్దరును; అరయన్ = చూడగా; నీకున్ = నీకు; ఒక్కసమమ = సమానమే; అవనీవర = రాజ {అవనీవర - భూమికి వరుడు, రాజు}; నీవు = నీవు; ఏరీతిన్ = ఏవిధముగనైన; పాండుకుమారుల = పాండవుల; పాలు = వంతు, భాగము; ఒసంగితేని = ఇచ్చినచో; మనున్ = బ్రతుకుదురు; ఉభయంబున్ = ఇద్దరును.
భావము:- “మహారాజ నువ్వు కన్న కౌరవులు, నీ తమ్ముడు కన్న పాండవులు ఇద్దరూ నీకు సమానమే. నీవు ఎలాగైనా సరే పాండవుల వాటాకు రావలసిన రాజ్యభాగం ఇచ్చినట్లైతే ఉభయులు క్షేమంగా ఉంటారు.”

తెభా-3-22-క.
ని ధర్మ బోధమునఁ బలి
కి మాటలు చెవుల నిడమి గృష్ణుఁడు విదురున్
నీతిమంతుఁ బిలువం
నిచినఁ జనుదెంచెఁ గురుసభాస్థలమునకున్.

టీక:- అని = అని; ధర్మ = ధర్మమార్గమును; భోదమునన్ = తెలుపుతూ; పలికిన = చెప్పిన; మాటలు = మాటలు; చెవులనిడమిన్ = వినిపించుకొనకపోవుటచే; కృష్ణుడు = కృష్ణుడు; విదురున్ = విదురుని; ఘన = మిక్కిలి; నీతిమంతున్ = నీతిమంతుని; పిలువన్ = పిలుచుటకై; పనిచిన = పంపగా; చనుదెంచె = వచ్చెను; కురు = కౌరవుల యొక్క; సభాస్థలమున్ = సభ; కున్ = కి;
భావము:- ఆవిధంగా శ్రీకృష్ణుడు ధర్మప్రబోధం చేసాడు. ఆ మాటలు వారు వినిపించుకోలేదు. అప్పుడు ఆయన నీతిశాస్త్రం బాగా తెలిసిన విదురుణ్ణి పిలిపించాడు. విదురుడు కౌరవుల కొలువుకూటానికి వచ్చాడు.

తెభా-3-23-వ.
చనుదెంచి యచటి జనంబులచేత నుపస్థితంబైన కార్యంబు దెలుపంబడినవాఁడై ధృతరాష్ట్రు నుద్దేశించి యిట్లనియె.
టీక:- చనుదెంచి = వచ్చి; అచటి = అక్కడి; జనంబులన్ = జనుల; చేతన్ = చే; ఉపస్థితంబు = సంసిద్ధము; ఐన = అయినట్టి; కార్యంబున్ = పనిని; తెలుపంబడిన = తెలియజేయబడిన; వాడు = వాడు; ఐ = అయి; ధృతరాష్ట్రున్ = ధృతరాష్ట్రుని; ఉద్దేశించి = కి; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను.
భావము:- .విదురుడు అక్కడ ఉన్న వాళ్ళ నుండి జరుగుతున్న సభా వ్యవహారమంతా తెలుసుకొని, ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు.

తెభా-3-24-మ.
"ణీనాయక! పాండుభూవిభుఁడు నీ మ్ముండు; దత్పుత్రులం
రిరక్షించిన ధర్మముం దగవునుం బాటిల్లు; వంశంబు సు
స్థిసౌఖ్యోన్నతిఁ జెందు శత్రుజయముం జేకూరు; గోపాల శే
రు చిత్తంబును వచ్చు నట్లగుట యౌఁ గౌరవ్యవంశాగ్రణీ!

టీక:- ధరణీనాయక = రాజా {ధరణీనాయక - భూమికి నాయకుడు, రాజు}; పాండుభూవిభుడు = పాండురాజు; నీ = నీ యొక్క; తమ్ముండు = తమ్ముడు; తత్ = అతని; పుత్రులన్ = కొడుకులను; పరి = బాగుగ; రక్షించినన్ = రక్షించినచో; ధర్మమున్ = ధర్మమును; తగవునున్ = న్యాయము; పాటిల్లున్ = కలుగును, సిద్ధించును; వంశంబు = కులము; సు = చక్కని; స్థిర = స్థిరత్వమును; సౌఖ్య = సౌఖ్యమును; ఉన్నతిన్ = పెంపుదల; చెందున్ = పొందును; శత్రు = శత్రువులపై; జయమున్ = జయమును; చేకూరు = కలుగును; గోపాలశేఖరున్ = కృష్ణుని; చిత్తంబునున్ = అనుకొన్నదియు; వచ్చును = జరుగును; అట్లు = ఆవిధముగ; అగుటన్ = జరుగుట; ఔ = మంచిది; కౌరవ్యవంశాగ్రణీ = ధృతరాష్ట్రా {కౌరవ్యవంశాగ్రణి - కురువంశమునకు పెద్దవాడు, ధృతరాష్ట్రుడు}.
భావము:- ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండురాజు నీ తమ్ముడు. కనుక ఆయన కుమారుల్ని సంరక్షించడం ధర్మమూ, న్యాయమూ. కురుకులచూడామణీ! మీరు ఇలా చేస్తే మీ వంశం శాశ్వత సుఖసంపదలతో వర్థిల్లుతుంది. మీకు శత్రు విజయం లభ్యం అవుతుంది. గోపాలశిరోమణి అయిన కృష్ణుని మనస్సుకు ప్రియం కలిగించినట్లు కూడా అవుతుంది.

తెభా-3-25-ఆ.
వారితండ్రి పాలు వారికి నొసఁగి నీ
పాలు సుతుల కెల్లఁ బంచియిచ్చి
లము విడిచి ధర్మ లవడ నీ బుద్ధిఁ
జొనుపవయ్య! కులము నుపవయ్య!

టీక:- వారి = వారి యొక్క; తండ్రి = తండ్రి యొక్క; పాలు = వంతు; వారికిన్ = వారికి; ఒసగి = ఇచ్చి; నీ = నీ యొక్క; పాలు = వంతు; సుతుల = కొడుకుల; కున్ = కు; ఎల్లన్ = అందరికిని; పంచి = పంచి; ఇచ్చి = ఇచ్చి; చలము = మాత్సర్యము; విడిచి = వదలి; ధర్మము = ధర్మము; అలవడన్ = అగునట్లు; నీ = నీ యొక్క; బుద్ధిన్ = మనసున; చొనుపుము = ప్రవేశపెట్టుము; అయ్య = తండ్రీ; కులమున్ = వంశమును; మనుపు = కాపాడు; అయ్య = తండ్రీ.
భావము:- . వారి తండ్రి భాగం వారికి ఇవ్వు. నీ భాగం కొడుకులకు పంచి ఇవ్వు. ఈర్ష్య వదలిపెట్టు. ధర్మమార్గంలో మనస్సు ప్రవేశపెట్టు. వంశాన్ని నిలబెట్టు.

తెభా-3-26-చ.
వినుము; నృపాల నా పలుకు వేయును నేల సమీరసూతి నీ
యుల పేరు విన్నఁ బదతాడిత దుష్టభుజంగమంబు చా
డ్పునఁ గనలొందు; నింతయును మున్నునుఁ జెప్పితిఁ గాదె వానిచే
భవదీయ పుత్రులకుఁ ప్పదు మృత్యు వదెన్ని భంగులన్.

టీక:- వినుము = వినుము; నృపాల = రాజా {నృపాలుడు - నరులను పాలించువాడు, రాజు}; నా = నా; పలుకు = మాట; వేయున్ = వేలకొలది మాటలు; ఏల = ఎందులకు; సమీరసూతి = భీముడు {సమీరసూతి - వాయుదేవుని కొడుకు, భీముడు}; నీ = నీ యొక్క; తనయులన్ = కొడుకుల; పేరు = పేరు; విన్నన్ = విన్నంతనే; పద = కాలిచే; తాడిత = తొక్కబడిన; దుష్ట = చెడ్డ; భుజంగంబున్ = పాము; చాడ్పునన్ = వలె; కనలొందున్ = కోపించును; ఇంతయున్ = ఇది అంతయును; మున్నునున్ = ఇంతకు ముందే; చెప్పితిన్ = చెప్పాను; కాదె = కదా; వానిచేతన = వాటి వలన; భవదీయ = నీ యొక్క; పుత్రుల = కొడుకుల; కున్ = కు; తప్పదు = తప్పదు; మృత్యువు = చావు; అది = అది; ఎన్నిభంగులన్ = ఏమైనా సరే.
భావము:- రాజా! ధృతరాష్ట్రా! నా మాట పాటించు. నీకొడుకు దుడుకుతనం విన్నప్పుడల్లా ఆ భీమసేనుడు కాలుతో తొక్కిన కాలసర్పం లాగా మండిపడతాడు. ఇదంతా నీకు ముందే చెప్పాను గదా; ఎలాగైనా సరే ఆ వాయుదేవుని కుమారుడు భీముడి చేతిలో నీ కుమారులకు చావు తప్పదు.

తెభా-3-27-వ.
అదియునుంగాక.
టీక:- అదియునుం = అంతే; కాక = కాక.
భావము:- అంతే కాదు,

తెభా-3-28-క.
నీపుత్రుల శౌర్యంబునుఁ
జాపాచార్యాపగాత్మజాత కృపభుజా
టోపంబునుఁ గర్ణు దురా
లాపంబులు నిజముగాఁ దలంతె మనమునన్.

టీక:- నీ = నీ; పుత్రుల = కొడుకుల; శౌర్యంబును = శౌర్యమును; చాపాచార్య = ద్రోణుని {చాపాచార్యుడు - విలువిద్యకొరకైన గురువు, ద్రోణుడు}; అపగాత్మజాత = భీష్ముని {అపగాత్మజాత - అపగా (నది) ఆత్మజాత (పుత్రుడు), భీష్ముడు}; కృప = కృపాచార్యుని; భుజ = బాహు; ఆటోపంబున్ = బలమును; కర్ణు = కర్ణుని; దురాలాపంబులున్ = చెడ్డవాగుడును; నిజము = నిజము; కాన్ = అని; తలంతె = అనుకొనినావా; మనమునన్ = నీ మనసులో.
భావము:- మహారాజా! నీ కన్న కొడుకుల ప్రతాపాలూ, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్యుల పటాటోపాలూ అంగరాజు కర్ణుడి అసందర్భ ప్రలాపాలూ ఇవన్నీ నిజమే అని నీ మనస్సులో కాని నమ్ముతున్నావా.

తెభా-3-29-వ.
అట్లేని వినుము.
టీక:- అట్లేని = అలా అయితే; వినుము = విను.
భావము:- అలా అయితే విను.

తెభా-3-30-ఉ.
రమేశుచే జగము లీ సచరాచరకోటితో సము
ద్దీపితమయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ
రీతి ముఖ్య దేవ ముని బృందము; లెవ్వఁ డనంతుఁ డచ్యుతుం
డా పురుషోత్తముండు గరుణాంబుధి గృష్ణుఁడు పో నరేశ్వరా!

టీక:- ఏ = ఏ; పరమేశు = దేవుని {పరమేశు - సమస్తమునకు పరమమైన ఈశ్వరుడు, కృష్ణుడు}; చేన్ = చేత; జగములు = లోకములు; ఈ = ఈ; సచరాచర = చరాచర జీవరాశులు; కోటి = అన్నింటి; తోన్ = తోటి; సమ = చక్కగా; ఉద్దీపితము = వెలుగునవి; అయ్యెన్ = అయినవో; ఏ = ఏ; విభుని = ప్రభువు యొక్క; దివ్య = దివ్యమైన; కళా = కళల; అంశజులు = అంశతో పుట్టినవారో; అబ్జగర్భ = బ్రహ్మ {అబ్జగర్భ - అబ్జము (పద్మము) నుండి గర్భ (పుట్టినవాడు), బ్రహ్మ}; గౌరీపతి = శివుడు {గౌరీపతి - గౌరీదేవి యొక్క భర్త, శివుడు}; ముఖ్య = మొదలగు; దేవ = దేవతల; ముని = మునుల; బృందములు = సమూహములు; ఎవ్వడు = ఎవడు; అనంతుడు = అంతము లేనివాడు; అచ్యుతుండు = నాశనము లేనివాడు {అచ్యుతః – చ్యుతి లేనివాడు, స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు, ఎట్టి వికారములు లేనివాడు, విష్ణుసహస్రనామములు శ్రీశంకరభాష్యంలో 100వ నామం, 318వ నామం}; ఆ = ఆ; పురుషోత్తముండు = పురుషులలో ఉత్తముడు; కరుణాంబుది = కరుణకు సముద్రుడు; కృష్ణుడుపో = కృష్ణుడే సుమా; నరేశ్వరా = రాజా {నరేశ్వరుడు - నరులకు ప్రభువు, రాజు}.
భావము:- అయితే, విను. ఓ భూపాలా! దయాసముద్రుడు అయిన ఈ శ్రీకృష్ణుడే, పురుషోత్తముడు, ఈ పరమేశ్వరుని అనుగ్రహం వల్లే ఈ ప్రపంచం చరాచర జంతుజాలంతో సహా ప్రకాశిస్తూ ఉంది; బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలైన దేవతలూ, మునిగణమూ అందరూ ఈ దేవుని దివ్యమైన అంశాల నుండి జన్మించిన వారే; అనంతుడూ, అచ్యుతుడూ ఇతడే సుమా;

తెభా-3-31-ఉ.
ట్టి జగన్నివాసుఁడు మురాసురభేది పరాపరుండు చే
ట్టి సఖుండు, వియ్యమును, బాంధవుఁడున్, గురుఁడున్, విభుండునై
యిట్టలమైన ప్రేమమున నెప్పుడుఁ దోడ్పడుచుండు వారలం
జుట్టన వ్రేల నెవ్వరికిఁ జూపఁగ వచ్చునె? పార్థివోత్తమా!

టీక:- అట్టి = అటువంటి; జగన్నివాసుడు = కృష్ణుడు {జగన్నివాసుడు - లోకమే తన నివాసముగ ఉన్నవాడు, కృష్ణుడు}; మురాసురభేది = కృష్ణుడు {మురాసురభేది - ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు}; పరాపరుడు = కృష్ణుడు {పరాపరుడు - పరమునకే అపరమైనవాడు, కృష్ణుడు}; చేపట్టి = స్వీకరించి {చేపట్టు - చేయి పట్టు, స్వీకరించు}; సఖుండు = స్నేహితుడు; వియ్యము = పెళ్ళిద్వారా బంధువు; బాంధవుడున్ = చుట్టమును; గురుడున్ = కాపాడువాడు {గురువు - 1. ఉపాధ్యాయుడు 2. బృహస్పతి 3. కులముపెద్ద 4. తండ్రి 5. తండ్రితోడబుట్టినవాడు 6. తాత 7. అన్న 8. మామ 9. మేనమామ 10. రాజు 11. కాపాడువాడు}; విభుండు = ప్రభువు; ఐ = అయి; ఇట్టలమైన = మిక్కిలి; ప్రేమమున = ప్రేమతో; ఎప్పుడున్ = ఎప్పుడూ; తోడ్పడుచున్ = సహాయపడుతూ; ఉండు = ఉండును; వారలన్ = వారిని; చుట్టనవ్రేలన్ = చూపుడువేలితో; ఎవ్వరికిన్ = ఎవరికైనాసరే; చూపగన్ = చూప; వచ్చునే = తరమే; పార్థివోత్తమా = రాజోత్తమా.
భావము:- . ఓ ధృతరాష్ట్ర రాజోత్తమా! ఆ శ్రీకృష్ణుడు సామాన్యుడా, లోకాలు అన్ని తన లోనే ఉంచుకున్న వాడూ, మురుడు అనే రాక్షసుణ్ణి మట్టుపెట్టినవాడూ, సర్వశ్రేష్ఠుడూనూ. ఆయనే చెలికాడుగా, వియ్యంకుడిగా, చుట్టంగా, ప్రబోధకుడిగా, ప్రభువుగా అతిశయించిన అనురాగంతో ఎల్లప్పుడూ పాండవులకు అండగా తోడ్పడుతూ ఉంటాడు. అలాంటి పాండవులను వేలెత్తి చూపడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా?

తెభా-3-32-ఉ.
కావునఁ బాండునందనులఁ గాఱియ వెట్టక రాజ్యభాగమున్
వావిరి నిచ్చి రాజ్యమును వంశముఁ బుత్రుల బంధువర్గముం
గావుము; కాక లోభి యగు ష్ట సుయోధను మాట వింటివే
భూర! నీ యుపేక్ష నగుఁ బో కులనాశము బంధునాశమున్.

టీక:- కావునన్ = అందుచేత; పాండునందనులన్ = పాండవులను {పాండునందనులు - పాండురాజు పుత్రులు, పాండవులు}; కాఱియ = యాతనలు; పెట్టక = పెట్టకుండ; రాజ్య = రాజ్యములోని; భాగమున్ = వంతు; వావిరి = పద్దతి ప్రకారము పంచి; ఇచ్చి = ఇచ్చి; రాజ్యమునున్ = రాజ్యమును; వంశమున్ = కులమును; పుత్రులన్ = కొడుకులను; బంధు = బందువుల; వర్గమున్ = సమూహమును; కావుమున్ = కాపాడుదువు; కాక = కాక; లోభి = పిసినిగొట్టు; అగు = అయిన; కష్ట = చెడ్డ; సుయోధను = దుర్యోధను; మాట = మాట; వింటివే = విన్నట్లయితే; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు, రాజు}; నీ = నీ యొక్క; ఉపేక్షన్ = నిర్లక్ష్యము వలన; అగున్ = కలుగును; పో = సుమా; కుల = వంశమునకు; నాశమున్ = నాశనమును; బంధు = బంధువుల; నాశమున్ = నాశనమును.
భావము:- అందుకని, నా మాట విని పాండువుల్ని బాధపెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చేసి దేశాన్నీ, వంశాన్నీ, పుత్రుల్నీ, బంధువుల్నీ కాపాడు; అలాకాక పరమ లోభీ, దుష్టుడూ అయిన దుర్యోధనుని మాటలు విన్నావా; నీ నిర్లక్ష్యం కారణంగా కులనాశం, బంధునాశం జరిగితీరుతుంది.

తెభా-3-33-తే.
కనికై యిట్లు కుల మెల్ల నుక్కడింప
నెత్తికొనఁ జూచె దిది నీతియే నృపాల!
వినుము; నామాట; నీ సుయోనుని విడిచి
కుము రాజ్యంబుఁ దేజంబు నిలుపవయ్య."

టీక:- ఒకనికి = ఒకడి కోసము; ఐ = అయి; ఇట్లు = ఈవిధముగ; కులము = వంశము; ఎల్లన్ = అంతటిని; ఉక్కడింపన్ = సంహరింపను; ఎత్తికొన = యత్నించ; చూచెదు = చూస్తున్నావు; ఇది = ఇది; నీతియే = ఏమి నీతి (మంచిది కాదు); నృపాల = రాజా {నృపాలుడు - నరులను పాలిండువాడు, రాజు}; వినుము = విను; నా = నా; మాటన్ = సలహాని; ఈ = ఈ; సుయోధనుని = దుర్యోధనుని; విడిచి = వదలిపెట్టి; కులము = మంశమును; రాజ్యంబున్ = రాజ్యమున్; తేజంబున్ = తేజస్సుని; నిలుపు = నిలబెట్టుము; అయ్య = తండ్రి.
భావము:- ఇదెక్కడి రాజనీతి మహారాజా! ఒక్కడి కోసం వంశమంతా ధ్వంసం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నావు; నా మాట విను; ఈ దుర్యోధనుడి మాట విడిచిపెట్టు. వంశమర్యాదనూ, దేశాన్నీ, తేజస్సునీ కాపాడు.”

తెభా-3-34-క.
ని యిట్లుఁ దఱిమి చెప్పిన
విని దుర్యోధనుఁడు రోషవివశుండై తా
నితనయ శకుని దుశ్శా
నుల నిరీక్షించి తామసంబునఁ బలికెన్.

టీక:- అని = అని; ఇట్లు = ఈవిధముగ; తఱిమి = నొక్కి; చెప్పినన్ = చెప్పగా; విని = విని; దుర్యోధనుడు = దుర్యోధనుడు; రోష = రోషము వలన; వివశుండు = ఒడలు తెలియని వాడు; ఐ = అయి; తాన్ = తను; ఇనతనయ = కర్ణుని {ఇనతనయుడు - ఇన(సూర్యుని) తనయుడు(పుత్రుడు), కర్ణుడు}; శకుని = శకునిని {శకుని - దుర్యోధనుని మేనమామ}; దుశ్శాసనులన్ = దుశ్శాసనులను {దుశ్శా,నుడు - దుర్యోధనుని తమ్ముడు}; నిరీక్షించి = చూచి; తామసంబునన్ = దురహంకారముతో; పలికెన్ = అనెను.
భావము:- అని ఈ విధంగా విదురుడు నొక్కి చెప్పాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు రోషావేశంతో వశం తప్పిపోయాడు. తన మిత్రుడూ సూర్యుని కుమారుడూ అయిన కర్ణుణ్ణీ, మేనమామ శకునినీ, తమ్ముడైన దుశ్శాసనుణ్ణీ చూచి అహంకారంతో ఇలా అన్నాడు.

తెభా-3-35-క.
"దాసీపుత్రుని మీరలుఁ
దాసీనుం జేయ కిటకుఁ గునె పిలువఁగా?
నాసీనుండై ప్రేలెడు
గాసిలి చెడిపోవ వెడలఁగా నడువుఁ డిఁకన్.

టీక:- దాసీ = దాసి యొక్క; పుత్రుని = పుత్రుని; మీరలు = మీరు; తాన్ = అతను; ఆసీనుంజేయన్ = కూర్చొనబెట్టుటకు; ఇటకున్ = ఇక్కడ; తగునే = తగునా ఏమి; పిలువగాన్ = పిలుచుట; ఆసీనుండు = కూర్చొని ఉన్నవాడు; ఐ = అయి; ప్రేలెడు = వదరుచుండెను; గాసిలి = పనికిరానివాదై; చెడిపోవ = చెడిపోయేలా; వెడలగానడువుడీ = వెళ్ళగొట్టండి; ఇఁకన్ = ఇంక.
భావము:- “దాసీపుత్ర్తుణ్ణి తీసుకొని వచ్చి ఆసనం ఇచ్చి కూర్చోపెట్టారు. ఇటువంటి వాళ్లను ఈ సభకు ఎందుకు పిలిపించారు. కుదురుగా కూర్చొని పనిరాకుండా పోయే అధిక ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. వెంటనే గెంటివెయ్యండి.”