పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/దేవహూతి పరిణయంబు


తెభా-3-762-వ.
అంత స్వాయంభువుండు గనకరథారూఢుం డగుచు నిజభార్యా సమేతుం డై భర్తృవాంఛాపరయైన పుత్రికం దోడ్కొనుచు నిజ తనూజకుం దగిన వరు నన్వేషించుచు భువనంబునం గలయం గ్రుమ్మరి; యెందునుం గానక వచ్చివచ్చి.
టీక:- అంతన్ = అప్పుడు; స్వాయంభువుండు = స్వాయంభువుడు; కనక = బంగారు; రథా = రథమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; అగుచున్ = అవుతూ; నిజ = తన యొక్క; భార్యా = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భర్తృ = భర్తను; వాంఛా = కోరుట యందు; పర = లగ్నమైనది; ఐన = అయిన; పుత్రికన్ = కూతురిని; తోడ్కొనుచున్ = కూడా తీసుకెళుతూ; నిజ = తన యొక్క; తనూజ = కూతురున; కున్ = కు; తగిన = తగిన; వరున్ = భర్తను; అన్వేషించుచు = వెతుకుతూ; భువనంబుననన్ = లోకములో; కలయన్ = కలియ; గ్రుమ్మరి = తిరిగి; ఎందునున్ = ఎక్కడను; కానక = కనిపించక; వచ్చివచ్చి = వెళ్ళివెళ్లి.
భావము:- అప్పుడు స్వాయంభువ మనువు బంగారు రథమెక్కి భార్యతో కూడి పెండ్లికి ఎదిగిన తన కుమార్తెను వెంట బెట్టుకొని, ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషిస్తూ లోకాలన్నీ తిరిగి, ఎక్కడా అటువంటివాడు కనబడక వచ్చి వచ్చి…

తెభా-3-763-ఉ.
ముంటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు విష్ణుఁడు గర్దమున్ మహా
నం మెలర్పఁ జూచి నయనంబుల రాలిన బాష్పముల్ ధరన్
బిందువులై వెసం దొరఁగి పేర్చి సరస్వతిఁ జుట్టి పాఱుటన్
బిందుసరోవరం బనెడి పేరఁ దనర్చిన పుణ్యతీర్థమున్.

టీక:- ముందటన్ = ఎదురుగ; కాంచెన్ = చూసెను; అంతన్ = అక్కడ; బుధ = జ్ఞానులలో; ముఖ్యుడు = శ్రేష్ఠుడు; విష్ణుడు = విష్ణుమూర్తి; కర్దమున్ = కర్దమును; మహా = గొప్ప; ఆనందము = సంతోషము; ఎలర్పన్ = చిగురించగా; చూచి = చూసి; నయనంబులన్ = కన్నులనుండి; రాలిన = రాలి పడిన; భాష్పముల్ = కన్నీటి బొట్లు; ధరన్ = నేలను; బిందువులు = బొట్లు; ఐ = అయ్యి; వెసన్ = శ్రీఘ్రమే; దొరగి = కలసి; పేర్చి = సమూహములై; సరస్వతిన్ = సరస్వతీనదిని; చుట్టి = చుట్టుకొని; పాఱుటన్ = పారుటచేత; బిందుసరోవరంబు = బిందుసరోవరము; అనెడి = అను; పేరన్ = పేరుతో; తనర్చినన్ = ప్రసిద్ధికెక్కినట్టి; పుణ్యతీర్థమున్ = పుణ్యతీర్థమును.
భావము:- కర్దముని విష్ణువు దయతో చూచినప్పుడు, కర్దముని కన్నులనుండి రాలిన ఆనందబాష్ప బిందువులు నేలపై పడి, సరస్వతీ నది తనను చుట్టుకొని ప్రవహించునట్లుగా, బిందుసరోవరం ఏర్పడి ప్రసిద్ధమైన పుణ్యతీర్థమైనది. స్వాయంభువ మనువు తన కూమార్తెకు వరునికోసమై తిరుగుతూ, తన కన్నులముందర ఆ బిందుసరోవరాన్ని చూశాడు.

తెభా-3-764-ఉ.
అందుఁ దమాల సాల వకుళార్జున నింబ కదంబ పాటలీ
చంన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మా
కం కుచందనక్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా
కుం మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్

టీక:- అందున్ = దానిలో; తమాల = కానుగచెట్లు; సాల = మద్ధిచెట్లు; వకుళ = పొగడచెట్లు; అర్జున = తెల్లమద్ధిచెట్లు; నింబ = వేపచెట్లు; కదంబ = కడిమిచెట్లు; పాటలీ = కలిగొట్టిచెట్లు; చందన = గంధపుచెట్లు; నారికేళ = కొబ్బరిచెట్లు; ఘనసార = కర్పూరపుచెట్లు; శిరీష = దిరిసెనపువ్వుచెట్లు; లవంగ = లవంగతీగలు; లుంగ = పుల్లమాదీఫలచెట్లు; మాకంద = తియ్యమామిడిచెట్లు; కుచందన = ఎఱ్ఱగంధపుచెట్లు; క్రముక = పోకచెట్లు; కాంచన = సంపెంగచెట్లు; బిల్వ = మారేడుచెట్లు; కపిత్థ = వెలగచెట్లు; మల్లికా = మల్లెలు; కుంద = మొల్లలు; మధూక = ఇప్పచెట్లు; మంజుల = మనోహరమైన; నికుంజములన్ = పొదరిండ్లతో; తనరారి = విలసిల్లుతూ; వెండియున్ = ఇంకనూ.
భావము:- అక్కడ కర్దముని తపోవనం ఉంది. ఆ ఆశ్రమ వాటిక కానుగచెట్లు, మద్దిచెట్లు, పొగడచెట్లు, తెల్లమద్దిచెట్లు, వేపచెట్లు, కడిమిచెట్లు, కలిగొట్టుచెట్లు, చందనవృక్షాలు, కొబ్బరిచెట్లు, కర్పూరవృక్షాలు, దిరిసెనచెట్లు, లవంగలతలు, మాదీఫలాల చెట్లు, తియ్యమామిడిచెట్లు, ఎఱ్ఱచందనం చెట్లు, పోకచెట్లు, సంపెంగచెట్లు, మారేడుచెట్లు, వెలగచెట్లు, మల్లెలు మొల్లలు అల్లుకొన్న చక్కని పొదరిండ్లు కలిగి విలసిల్లుతున్నది. ఇంకా…

తెభా-3-765-క.
రిపక్వఫలభరానత
రుశాఖానికర నివసిస్ఫుట విహగో
త్క బహుకోలాహలరవ
రితదిగంతములు గలిగి వ్యం బగుచున్.

టీక:- పరిపక్వ = బాగుగా పండిన; ఫల = పండ్ల యొక్క; భరా = బరువుచే; నత = వంగిన; తరు = వృక్షముల; శాఖా = కొమ్మల; నికర = సమూహములలో; నివసిత = నివసించుచున్న; స్ఫుస్ఫుట = వినబడుతున్న; విహగ = పక్షులచేత; ఉత్ = గట్టిగా; కర = చేయబడుతున్న; బహు = మిక్కిలి; కోలాహల = కోలాహలము యొక్క; రవ = ధ్వనులచే; భరిత = నిండిన; దిక్ = దిక్కుల; అంతములు = చివరలు; కలిగి = కలిగి; భవ్యంబున్ = శుభకరము; అగుచున్ = అవుతూ.
భావము:- బాగా పండిన పండ్ల బరువుతో క్రిందికి వంగిన చెట్ల కొమ్మలమీద నివసించే పక్షిమూకల కలకల ధ్వనులతో దిగంతాలు ప్రతిధ్వనిస్తూ ఆ ఆశ్రమం శుభకరంగా ఉంది.

తెభా-3-766-క.
తి నిశిత చంచు దళన
క్ష నిర్గత పక్వఫలరసాస్వాదన మో
ది రాజశుక వచోర్థ
శ్రుఘోషము సెలఁగ శ్రవణసుఖదం బగుచున్.

టీక:- అతి = మిక్కిలి; నిశిత = వాడియైన; చుంచు = ముక్కులతో; దళన = చీల్చబడిన; క్షత = పగుళ్ళ నుండి; నిర్గత = వెలువడుతున్న; పక్వ = పండిన; ఫల = పండ్ల యొక్క; రస = రసమును; ఆస్వాద = ఆసక్తిగా తీసుకొనుటచే; మోదిత = సంతోషిస్తున్న; రాజశుక = రాచిలుకల; వచస్ = పలుకులు; అర్థ = స్ఫుస్ఫురిస్తున్న; శ్రుత = వేద; ఘోషమున్ = శబ్దములు; చెలంగ = చెలరేగగా; శ్రవణ = చెవులకు; సుఖదంబు = సుఖప్రదము; అగుచున్ = అవుతుండగా.
భావము:- పండిన పండ్లను మిక్కిలి వాడిగా ఉన్న తమ ముక్కులతో పొడిచి, ఆ సందులనుండి స్రవిస్తూ ఉన్న ఫలరసాన్ని త్రాగి, రామచిలుకలు సంతోషంతో చేస్తున్న అర్థవంతాలైన వేదగానాలు వీనులవిందు చేస్తున్నాయి.

తెభా-3-767-క.
లితసహకారపల్లవ
లితాస్వాదన కషాయకంఠ విరాజ
త్కకంఠ పంచమస్వర
నాదము లుల్లసిల్లఁ డురమ్యములై.

టీక:- లలిత = సుకుమారమైన; సహకార = మామిడి చెట్ల; పల్లవన్ = చిగుళ్ళను; కలిత = మనోహరమైన; ఆస్వాదన = అసక్తితో తినుటవలన; కషాయ = పదునెక్కిన; కంఠ = గొంతులతో; విరాజత్ = విరాజిల్లుతున్న; కలకంఠ = కోయిలల {కలకంఠ - కల (చక్కని), కంఠ, (కంఠములు గలది), కోయిల}; పంచమస్వర = పంచమస్వరములో; కల = మనోహరమైన; నాదములన్ = నాదములతో; ఉల్లసిల్ల = సంతోషించగ; కడు = మిక్కిలి; రమ్యములు = సొగసైనవి; ఐ = అయ్యి.
భావము:- లేత తియ్య మామిడి చిగుళ్ళను తినడం వల్ల వగరెక్కి పొగరెక్కిన కోయిలలు పంచమస్వరంతో మధురంగా కూస్తున్నాయి.

తెభా-3-768-క.
తుల తమాల మహీజ
ప్రతిక్షణజాత జలదరిశంకాంగీ
కృ తాండవఖేలన విల
సిపింఛవిభాసమాన శిఖి సేవ్యంబై.

టీక:- అతుల = సాటిలేని; తమాల = కానుగ; మహీజ = చెట్ల; ప్రతతి = సమూహ; క్షణత్ = చూచుటచే; జాత = కలగిన; జలద = మేఘములని; పరిశంక = గట్టి సందేహమును; అంగీకృత = ఒప్పుకొన్న; తాండవ = నృత్య; ఖేలన = క్రీడలో; విలసిత = విలాసములు కల; పింఛ = పింఛములతో; విభాసమాన = ప్రకాశిస్తున్నటువంటి; శిఖి = నెమళ్లచే; సేవ్యంబున్ = కొలవబడుతున్నది; ఐ = అయ్యి.
భావము:- అక్కడి సాటిలేని తమాలవృక్షాలను చూచి మేఘాలని భ్రాంతిపడి నెమళ్ళు ఉల్లాసంతో ఒళ్ళు మరచి పురులు విప్పి చూడముచ్చటగా ఆడుతున్నాయి.

తెభా-3-769-క.
కారండవ జలకుక్కుట
సాస బక చక్రవాక ట్పద హంసాం
భోరుహ కైరవ నవక
ల్హా విరాజిత సరోరుహాకర యుతమై.

టీక:- కారండవ = నీటిపక్షులు; జలకుక్కుట = నీటికోళ్ళు; సారస = బెగ్గురుపక్షులు; బక = కొంగలు; చక్రవాక = చక్రవాక పక్షులు; షట్పద = తుమ్మెదలు; హంస = హంసలు; అంభోరుహ = తామరపువ్వులు; కైరవ = కలువపువ్వులు; నవ = లేత; కల్హార = తెల్లకలువ పువ్వులుతో; విరాజిత = విరాజిల్లుతున్న; సరోరుహ = పద్మముల; ఆకర = సమూహములతో; యుతము = కూడినది; ఐ = అయ్యి.
భావము:- నీటి పక్షులతో, నీటికోళ్ళతో, బెగ్గురు పక్షులతో, కొంగలతో, చక్రవాకాలతో, తుమ్మెదలతో, కలహంసలతో, కమలాలతో, తెల్ల కలువలతో, ఎఱ్ఱ కలువలతో విరాజిల్లే సరోవరాలు ఉన్నాయి.

తెభా-3-770-క.
రి పుండరీక వృక కా
శశ భల్లూక హరిణ మరీ హరి సూ
ఖడ్గ గవయ వలిముఖ
భప్రముఖోగ్ర వన్యత్త్వాశ్రయ మై.

టీక:- కరి = ఏనుగులు; పుండరీక = పెద్దపులులు; వృక = తోడేళ్ళు; కాసర = అడవిదున్నలు; శశ = కుందేళ్ళు; భల్లూక = ఎలుగుబంట్లు; హరిణ = లేళ్ళు; చమరీ = చమరీమృగములు; హరి = సింహములు; సూకర = అడవిపందులు; ఖడ్గ = ఖడ్గ మృగములు; గవయ = దుప్పులు; వలిముఖి = కోతులు; శరభ = శరభమృగములు; ప్రముఖ = మొదలగు; వన్య = అడవి; సత్త్వ = జంతువులకు; ఆశ్రమము = నివాసము; ఐ = అయ్యి.
భావము:- ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్ళు, అడవిదున్నలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, లేళ్ళు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, దుప్పులు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలు సంచరిస్తున్నాయి.

తెభా-3-771-వ.
ఒప్పు నప్పరమ తాపసోత్తముని యాశ్రమంబుఁ గనుంగొని మిత పరిజనంబులతోడం జొచ్చి; యందు.
టీక:- ఒప్పు = చక్కగా ఉన్న; ఆ = ఆ; పరమ = అత్యుత్తమ; తాపస = తాపసులలో; ఉత్తముని = ఉత్తముని; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; కనుంగొని = చూసి; మిత = కొద్ధిమంది; పరిజనంబులు = సేవకులు; తోడన్ = తోటి; చొచ్చి = ప్రవేశించి; అందు = దానిలో.
భావము:- అటువంటి కర్దమ మునీంద్రుని తపోవనాన్ని దర్శించి స్వాయంభువ మనువు పరిమిత పరివారంతో ఆశ్రమంలోనికి ప్రవేశించి, అక్కడ…

తెభా-3-772-సీ.
అంచితబ్రహ్మచర్యవ్రతయోగ్యమై-
విలసిల్లు ఘనతపోవృత్తిచేత
దేహంబు రుచిర సందీప్తమై చెలువొందఁ-
డుఁ గృశీభూతాత్మ కాయుఁ డయ్యు
లినోదరాలాపవసుధాపూరంబు-
శ్రోత్రాంజలులఁ ద్రావి చొక్కి యున్న
తనఁ గృశీభూతకాయుండు గాక జ-
టాల్కలాజిన శ్రీ వెలుంగఁ

తెభా-3-772.1-తే.
మలపత్ర విశాలనేత్రములు దనర
లిన సంస్కార సంచితార్ఘ నూత్న
త్నమును బోలి యున్న కర్దమునిఁ జూచి
క్తి నమ్మను వెఱఁగెఁ దత్పాదములకు.

టీక:- అంచిత = చక్కటి; బ్రహ్మచర్య = బ్రహ్మచర్యమును; వ్రత = పాటించుటకు; యోగ్యము = తగినట్టిది; ఐ = అయ్యి; విలసిల్లు = అతిశయించుచున్న; ఘన = గొప్ప; తపస్ = తాపస; వృత్తి = విధానముల; చేత = వలన; దేహంబున్ = శరీరము; రుచిర = కాంతితో; సందీప్తము = బాగా ప్రకాశిస్తున్నది; ఐ = అయ్యి; చెలువొందన్ = అందగించగా; కడు = మిక్కిలి; కృశీభూత = చిక్కిపోయిన; ఆత్మ = స్వంత; కాయుడు = శరీరముకలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; నలినోదారు = గోవిందుని {నలినోదరుడు - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; ఆలాప = కీర్తనలు అను; నవ = కొత్త; సుధా = అమృతపు; పూరంబున్ = ప్రవాహమును; శ్రోత్రా = చెవులు అను; అంజలులన్ = దోసిళ్ళతో; త్రావి = తాగి; చొక్కి = పరవశించి; ఉన్న = ఉన్నట్టి; కతన = కారణముచే; కృశీభూత = నీరసించిన; కాయుండు = శరీరము కలవాడు; కాక = కాకుండగ; జటా = జటలు; వల్కల = నారబట్టలు; అజిన = చర్మములు అను; శ్రీ = సంపదలు; వెలుంగన్ = ప్రకాశించగ; కమల = కలువ; పత్ర = రేకుల వంటి;
విశాల = విశాలమైన; నేత్రములు = కన్నులు; తనరన్ = ఒప్పియుండగ; నలి = యోగ్యమైన; అసంస్కార = సానపెట్టకనే; సంచిత = సంపాదించిన; అనర్ఘ = వెలకట్టలేని; నూత్న = కొత్త; రత్నమునున్ = రత్నమును; పోలి = పోలి; ఉన్న = ఉన్నట్టి; కర్దమునిన్ = కర్దముని; చూచి = చూసి; భక్తిన్ = భక్తితో; ఆ = ఆ; మనువు = మనువు; ఎఱగెన్ = నమస్కరించెను; తత్ = అతని; పాదముల = పాదముల; కున్ = కు.
భావము:- పవిత్రమైన బ్రహ్మచర్య వ్రతానికి తగిన తపోవ్యాపారం చేత చక్కగా ప్రకాశిస్తున్న కర్దముని శరీరం మిక్కిలి చిక్కిపోయినప్పటికీ విష్ణు సంకీర్తనం అనే అమృతరసాన్ని దొన్నెలవంటి చెవులతో త్రాగి ఉండడం వల్ల కృశించినట్లుగా కనిపించడం లేదు. జడలూ, నారచీరలూ, జింక చర్మమూ ధరించి తామరరేకులవంటి విశాలమైన నేత్రాలతో ఒప్పుతూ సానబట్టని వెలకట్టరాని వినూత్న రత్నంలా వెలుగుతున్నాడు. అటువంటి కర్దముని చూచి స్వాయంభువ మనువు భక్తిభావంతో ఆయన పాదాలకు నమస్కరించాడు.

తెభా-3-773-వ.
ఇట్లు వందనంబు గావించినం గర్దముండు దన గృహంబునకు విందై చనుదెంచిన యమ్మనువు నాదరించి; యర్ఘ్యపాద్యాది విధులం బరితుష్టునిం గావించి; పూర్వోక్తంబైన భగవదాదేశంబు సంస్మరించి స్వాయంభువున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వందనంబున్ = నమస్కారము; కావించినన్ = చేయగా; కర్దముండు = కర్దముడు; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; విందు = భోజనమున; ఐ = కై; చనుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; మనువున్ = మనువును; ఆదరించి = ఆదరించి; అర్ఘ్య = చేతులు కడుగుకొను నీరు; పాద్య = పాదములను కడుగుకొనుటకు నీరు ఇచ్చటలు అను; విధులను = పనులతో; పరితుష్టునిన్ = సంతుష్టుడిని; కావించి = చేసి; పూర్వ = ముందుగ; ఉక్తంబున్ = చెప్పబడినది; ఐన = అయిన; భగవత్ = భగవంతుని; ఆదేశంబున్ = ఆజ్ఞను; సంస్మరించి = గుర్తుచేసుకొని; స్వాయంభువున్ = స్వాయంభువుని; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా నమస్కరించగా కర్దముడు స్వాయంభువ మనువును తన ఇంటికి వచ్చిన అతిథిగా భావించి అర్ఘ్యపాద్యాలతో తృప్తి పరచి, భగవంతుని ఆదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని అతనితో ఇలా అన్నాడు.

తెభా-3-774-సీ.
రగుణాకర! భగద్భక్తి యుక్తుఁడ-
వైన త్వదీయ పర్యటన మెల్ల
శిష్టపరిగ్రహదుష్టనిగ్రహముల-
కొఱకుఁ గదా పుణ్యపురుష! మఱియు
నజహితాహిత హ్నిసమీర వై-
స్వత వార్దిప వాసవాత్మ
కుఁడవు హరిస్వరూపుఁడ వైన నీకును-
మానితభక్తి నస్కరింతు

తెభా-3-774.1-తే.
నఘ! నీ వెప్పుడేనేమి ఖిలలోక
జైత్ర మగు హేమమణిమయ స్యందనంబు
నెక్కి కోదండపాణివై యిద్ధ సైన్య
దవిఘట్టనచే భూమిభాగ మగల.

టీక:- వర = శ్రేష్ఠమైన; గుణ = గుణములకు; ఆకర = నివాసమైనవాడ; భగవత్ = భగవంతునిఎడల; భక్తి = భక్తి; యుక్తుడవు = కలిగినవాడవు; ఐన = అయినట్టి; త్వదీయ = నీ యొక్క; పర్యటనము = ప్రయాణములు చేయుట; ఎల్లన్ = అంతయు; శిష్ట = మంచివారిని; పరిగ్రహ = ఆదరించుట; దుష్ట = చెడ్డవారిని; నిగ్రహముల = శిక్షించుట; కొఱకున్ = కోసమై; కదా = కదా; పుణ్యపురుష = పుణ్యాత్ముడా; మఱియున్ = ఇంకను; వనజహితాహిత = సూర్యచంద్రులు {వనజహితాహితులు - వనజ (పద్మము)నకు హిత (ఇష్టుడు, సూర్యుడు) అహిత (అయిష్టుడు, చంద్రుడు)}; వహ్ని = అగ్నిహోత్రుడు; సమీర = వాయుదేవుడు; వైవస్వత = యముడు; వార్ధిప = వరుణుడు {వార్ధిపుడు - వార్ధి (సముద్రము)నకు ప్రభువు, వరుణుడు}; వాసవ = ఇంద్రుల యొక్క; ఆత్మకుండవు = అంశలు కలవాడవు; హరి = మహావిష్ణువు యొక్క; స్వరూపుడవు = రూపమైనవాడవు; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; మానిత = మన్ననపూర్వక; భక్తిన్ = భక్తితో; నమస్కరింతున్ = నమస్కారము చేసెదను; అనఘ = పుణ్యుడా;
నీవు = నీవు; ఎప్పుడేనేమి = ఎప్పుడైతే; అఖిల = సమస్తమైన; లోక = లోకములను; జైత్రము = జయించునది; అగు = అయిన; హేమ = బంగారము; మణి = మణులతో; మయ = నిండిన; స్యందనంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; కోదండ = విల్లును; పాణి = చేతబట్టినవాడవు; ఐ = అయ్యి; ఇద్ధ = ప్రసిద్ధమైన; సైన్య = సైన్యము యొక్క; పద = అడుగుల; ఘట్టన = తాకిడి; చేన్ = చేత; భూమి = భూమి యొక్క; భాగము = భాగము; అగలన్ = అదురునట్లు.
భావము:- ఉత్తమ గుణాలకు స్థానమైన రాజా! భగవద్భక్తుడవైన నీవు దుర్జనులను శిక్షించడానికి, సజ్జనులను రక్షించడానికి లోకంలో పర్యటిస్తూ ఉంటావు. ఓ పుణ్యపురుషా! నీవు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, వరుణుడు, ఇంద్రుల అంశలు కలవాడవు. విష్ణుస్వరూపుడవు. అటువంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ సమస్త లోకాలలో విజయాన్ని సంపాదించే మణులు పొదిగిన బంగారు రథమెక్కి, విల్లు ధరించి, వీర సైనికుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లగా జైత్రయాత్ర సాగిస్తుంటావు.

తెభా-3-775-మ.
ణిం బోలెఁ జరింపకున్న ఘననిద్రం బొంది యెందేని భూ
! పద్మోదరకల్పితంబు లగు నీ ర్ణాశ్రమోదార వి
స్త పాథోనిధిసేతుభూతమహిమాచారక్రియల్ తప్పి సం
మై చోరభయంబునన్ నిఖిల లోకంబుల్ నశించుం జుమీ."

టీక:- తరణిన్ = సూర్యుని; పోలెన్ = వలె; చరింపకన్ = తిరుగకుండగ; ఉన్నన్ = ఉన్నచో; ఘన = గాఢమైన; నిద్రన్ = నిద్రను; పొంది = పొంది; ఎందేనిన్ = ఎక్కడైననూ; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు (ప్రభువు), రాజు}; పద్మోదరు = బ్రహ్మదేవునిచే; కల్పితంబులున్ = సృష్టింపబడినవి; అగు = అయిన; ఈ = ఈ; వర్ణా = వర్ణముల ధర్మములు {వర్ణములు - చాతుర్వర్ణములు, 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = ఆశ్రము ధర్మములు అను {ఆశ్రమములు - చతురాశ్రమములు, 1బ్రహ్మచర్యము 2గార్హస్తము 3వానప్రస్తము 4సన్న్యాసము}; ఉదార = మహా; విస్తార = విస్తారమైన; పాథోనిధి = సముద్రమునకు {పాథోనిధి - పాథస్ (జలము)నకు నిధి (ఆవాసము) వంటిది, సముద్రము}; సేతు = ఆనకట్ట; భూత = వంటి; మహిమ = గొప్ప; ఆచార = ఆచారముల {ఆచారములు - విధినిషేధములు}; క్రియల్ = విధానములు; తప్పి = తప్పిపోయి; సంకరము = కలుషితము; ఐ = అయ్యి; చోర = దొంగల; భయంబునన్ = భయముతో; నిఖిల = సమస్తమైన; లోకంబుల్ = లోకములును; నశించున్ = నాశనమైపోవును; చుమీ = సుమీ.
భావము:- ఓ రాజా! నీవు ఈ జగత్తులో సూర్యునివలె సంచరించకపోతే ఈ లోకాలన్నీ నిద్రలో మునిగి, బ్రహ్మచే కల్పించబడిన వర్ణాశ్రమాలు అనే సముద్రం అల్లకల్లోలమై, సేతువువంటి సదాచార సంపద సంకరమై పోతుంది. జాతి సాంకర్యం ఏర్పడి దొంగల భయంవల్ల లోకాలన్నీ నశించిపోతాయి.

తెభా-3-776-వ.
అని పలికి "భవదాగమనంబునకు నిమిత్తం బెయ్యది"యనవుడు సమాహిత సకలనిత్యకర్మానుష్ఠానుండైన మునీంద్రునకు స్వాయంభువుం డిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; భవత్ = నీ యొక్క; ఆగమనంబున్ = రాక; కున్ = కు; నిమిత్తంబున్ = కారణము; ఎయ్యది = ఏది; అనవుడు = అని అడుగగా; సమాహిత = చక్కగా చేయబడిన; సకల = సమస్తమైన; నిత్య = ప్రతిదినము చేయవలసిన; కర్మ = కర్మ, పని; అనుష్ఠానుండు = ఆచరించినవాడు; ఐన = అయినట్టి; ముని = మునులలో; ఇంద్రున్ = ఇంద్రుని; కున్ = కి; స్వాయంభువుండు = స్వాయంభువుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- అని చెప్పి “నీ రాకకు కారణం ఏమిటి?” అని అడుగగా, నిత్యకర్మానుష్ఠాలు నిర్వర్తించిన కర్దమ ప్రజాపతితో స్వాయంభువ మనువు ఇలా అన్నాడు.

తెభా-3-777-క.
"ససిజగర్భుఁడు దనచే
విచిత మైనట్టి వేదవితతుల నెల్లన్
వెలయించుటకై బుధ
మిమ్ముం దన ముఖంబులన సృజించెన్.

టీక:- సరసిజగర్భుడు = బ్రహ్మదేవుడు {సరసిజగర్భుడు, సరసిజము (పద్మము) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; తన = తన; చేన్ = చేత; విరచితము = చక్కగ వ్రాయబడినది; ఐనట్టి = అయినట్టి; వేద = వేదముల; వితతులన్ = సమూహములను; ఎల్లన్ = సమస్తమును; ధరన్ = భూమిపై; వెలయించుట = స్థాపించుట; కై = కోసమై; బుధ = జ్ఞానులలో; వర = శ్రేష్ఠుడా; మిమ్మున్ = మిమ్ములను; తన = తన యొక్క; ముఖంబు = ముఖము; వలనన్ = వలన; సృజియించెన్ = సృష్టించెను.
భావము:- “ఓ మునివరేణ్యా! బ్రహ్మ తాను రచించిన వేదాల నన్నింటినీ ఈ భూమిమీద వెలయించడానికి మిమ్ములను తన ముఖంనుండి సృష్టించాడు.

తెభా-3-778-క.
దురితస్వరూప పాట
చ్చపీడం బొందకుండ కలక్షోణిం
రిపాలించుటకై మము
విందభవుండు భుజము లందు సృజించెన్.

టీక:- దురిత = పాపము యొక్క; స్వరూప = రూపము కలవారైన; పాటచ్చర = బందిపోటుదొంగల వలన; పీడన్ = బాధను; పొందకుండన్ = పొందకుండా; సకల = సమస్తమైన; క్షోణిన్ = భూమిని; పరిపాలించుట = చక్కగా పాలించుట; కై = కోసమై; మమున్ = మమ్ములను; అరవిందసంభవుండు = బ్రహ్మదేవుడు {అరవింద సంభవుడు - అరవిందము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; భుజముల = భుజముల; అందున్ = అందు; సృజించెన్ = సృష్టించెను.
భావము:- దుర్మార్గులైన దొంగల బాధలను పొందకుండా సమస్త భూమిని పాలించడానికి బ్రహ్మ తన భుజాలనుండి మమ్మల్ని సృష్టించాడు.

తెభా-3-779-క.
నెఱి నట్టి జలజభవునకుఁ
మంతఃకరణ గాత్రములై వరుసం
రఁగిన బ్రహ్మక్షత్రము
య రమాధీశ్వరునకు వనీయంబుల్.

టీక:- నెఱిన్ = చక్కగా; అట్టి = అటువంటి; జలజభవున్ = బ్రహ్మదేవుని {జలజ భవుడు - జలజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; కున్ = కి; కరము = మిక్కిలి; అంతఃకరణ = మనసును; గాత్రకములు = శరీరమును; ఐ = అయ్యి; వరుసన్ = వరుసగా; పరగినన్ = ప్రసిద్ధకెక్కిన; బ్రహ్మ = బ్రాహ్మణ; క్షత్రముల్ = క్షత్రియములు; అరయన్ = తరచిచూసిన; రమాధీశ్వరున్ = విష్ణుమూర్తి {రమాధీశ్వరుడు - రమ (లక్ష్మీదేవి)కి అధీశ్వరుడు (భర్త), విష్ణువు}; కున్ = కి; అవనీయంబుల్ = రక్షింపదగినవి.
భావము:- ఆ బ్రహ్మకు బ్రాహ్మణజాతి అంతఃకరణంగా, క్షత్రియజాతి శరీరంగా ఒప్పుతున్నవి. ఈ రెండూ విష్ణుదేవునిచేత తప్పక రక్షింపవలసినవి.

తెభా-3-780-వ.
కావున; హరిస్వరూపుండవై దుర్జనదుర్దర్శనుండ వయిన నినుం గనుట మదీయ భాగ్యంబున సిద్దించె; భవత్పాదకంజ కింజల్కపుంజరంజితం బైన మదీయ మస్తకంబును దావక వచనసుధాపూరితంబు లైన శ్రవణంబులును మంగళకరత్వంబున సాఫల్యంబునుం బొందె; నేను కృతార్థుండ నైతి; దుహితృస్నేహదుఃఖ పరిక్లిన్నాంతఃకరణుండ నై సకలదేశ భ్రమణ ఖిన్నుండ నైన నా విన్నపం బవధరింపు;"మని యిట్లనియె.
టీక:- కావునన్ = అందుచేత; హరి = విష్ణుమూర్తి యొక్క; స్వరూపుండవు = స్వరూపమైనవాడవు; ఐ = అయ్యి; దుర్జన = చెడ్డవారికి; దుర్దర్శనుండవు = చూచుటకు శక్యము కానివాడవు; అయిన = అయినట్టి; నినున్ = నిన్ను; కనుట = చూచుట; మదీయ = నా యొక్క; భాగ్యంబునన్ = అదృష్టము వలన; సిద్ధించెన్ = సంభవించినది; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; కంజ = పద్మముల {కంజము - కం (నీరు) యందు జము (పుట్టినది), పద్మము}; కిజల్క = కేసరముల; పుంజ = గుత్తులచేత; రంజితంబున్ = ప్రకాశింపచేయబడినవి; అయిన = అయినట్టి; మదీయ = నా యొక్క; మస్తకంబునున్ = శిరస్సును; తావక = నీ యొక్క; వచన = పలుకులు అను; సుధా = అమృతముచే; పూరితంబులు = నిండినవి; ఐన = అయినట్టి; శ్రవణంబులును = చెవులును; మంగళ = శుభములను; కరత్వంబునన్ = కలిగించుటచే; సాఫల్యంబునున్ = సఫలతను; పొందెన్ = పొందెను; నేను = నేను; కృతార్థుండను = కృతార్థుడను {కృతార్థుడు - పూర్తిచేసిన అర్థములు (వలసినవి) కలవాడు}; ఐతిన్ = అయితిని; దుహితృ = పుత్రిక యందలి; స్నేహ = వాత్సల్యము వలన; దుఃఖ = దుఃఖముతో; పరిక్లిన్న = మిక్కిలి బాధపడుతున్న; అంతఃకరణుండను = మనసు కలవాడను; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; దేశ = దేశములను; భ్రమణ = తిరుగుటచే; ఖిన్నుండను = అలసినవాడను; ఐన = అయినట్టి; నా = నా యొక్క; విన్నపంబున్ = విజ్ఞాపనను; అవధరింపము = ఆలకింపుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- విష్ణుస్వరూపుడవూ, దుష్టులకు చూడరానివాడవూ అయిన నీ దర్శనం నా అదృష్టం వల్ల లభించింది. నీ పాద పద్మాలలోని కేసరాల వల్ల ఎఱ్ఱబడిన నా శిరస్సూ, నీ మాటలు అనే అమృతంతో నిండిన నా చెవులూ సకల శుభాలకు స్థానాలై సఫలత్వాన్ని పొందాయి. నేను ధన్యుడ నయ్యాను. కుమార్తెపై గల వాత్సల్యం వల్ల మనస్సులో ఆందోళనపడుతూ, సమస్త దేశాలు తిరిగి అలసిపోయాను. నా విన్నపాన్ని ఆలకించు” అని ఇంకా ఇలా అన్నాడు.

తెభా-3-781-మ.
"యోగీశ్వర! దేవహూతి యను నీ వామాక్షి మత్పుత్రి దా
లావణ్య గుణాఢ్యులన్ వినియు నెవ్వారిన్ మదిం గోర కా
తుయై నారదు పంపునన్ మిము వరింతున్నంచు నేతెంచె నీ
రుణీభిక్షఁ బరిగ్రహింపుము శుభోదాత్తక్రియాలోలతన్.

టీక:- వర = ఉత్తమమైన; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠమైనవాడ; దేవహూతి = దేవహూతి; అనున్ = అనెడి; ఈ = ఈ; వామాక్షి = చక్కని కన్నులు ఉన్నామె; మత్ = నా యొక్క; పుత్రి = పుత్రిక; తాన్ = ఆమె, తాను; వర = ఉత్తమమైన; లావణ్య = లావణ్యము; గుణ = గుణములు అను; ఆఢ్యులన్ = సంపదలు కలవారిని; వినియున్ = విన్నప్పటికిని; ఎవ్వారినిన్ = ఎవరినీ; మదిన్ = మనసున; కోరకన్ = కోరుకోకుండ; ఆతుర = ఆతృత కలామె; ఐ = అయ్యి; నారదున్ = నారదుని యొక్క; పంపునన్ = ఆజ్ఞానుసారము; మిమున్ = మిమ్ములను; వరింతున్ = పెండ్లాడెదను; అని = అని; అంచున్ = అంటూ; ఏతెంచెన్ = వచ్చినది; ఈ = ఈ; తరుణీ = స్త్రీ అను {తరుణి - తరుణ (తగిన) వయసున ఉన్న స్త్రీ}; భిక్షన్ = భిక్షను; పరిగ్రహింపుము = స్వీకరింపుము; శుభ = శుభకరమైన; ఉదాత్త = గొప్ప; క్రియా = పనులందు; లోలతన్ = ఆసక్తితో.
భావము:- “ఓ మహాయోగీశ్వరా! దేవహూతి అనే ఈ కన్యక నా కూతురు. ఈమె లోకంలో మిక్కిలి సౌందర్యవంతులైన పురుషులను ఎవ్వరినీ వరించడానికి ఇష్టపడక, చింతాక్రాంతురాలై, నారద మహర్షి వల్ల నీ రూపగుణాలను విని నిన్నే వివాహమాడాలని వచ్చింది. అందుకని నీవు ఈ శుభకార్యానికి అంగీకరించి నా కుమార్తెను స్వీకరించు.

తెభా-3-782-క.
లినగృహమేధిక క
ర్మములకు ననురూపగుణ విరాజితశీల
క్రములఁ దనరిన తరుణిం
బ్రదమున వరింపు మయ్య వ్యచరిత్రా!

టీక:- అమలిన = స్వచ్ఛమైన; గృహము = ఇంటి పనులు; మేధిక = పశుపాలన; కర్మములన్ = పనుల; కున్ = కు; అనురూప = అనుకూలమైన; గుణ = గుణములతో; విరాజిత = ప్రకాశించునట్టి; శీల = నడవడిక; క్రమము = క్రమశిక్షణలతో; తనరిన = పెరిగిన; తరుణిన్ = తగిన వయసు స్త్రీని; ప్రమదంబునన్ = సంతోషముతో; వరింపుము = పెండ్లిచేసుకొనుము; భవ్య = పుణ్య; చరిత్రా = నడవడిక కలవాడ.
భావము:- పవిత్రచరిత్రా! శుద్ధమైన గృహస్థాశ్రమ కృత్యాలను నిత్యం నిర్వహించడానికి అనురూపమైన గుణమూ, శీలమూ కల ఈ కాంతను సంతోషంతో అర్ధాంగిగా అంగీకరించు.

తెభా-3-783-క.
ఘ! విరక్తుల కైనం
యంత లభించు సౌఖ్యతి వర్జింపం
దఁట కాముకులకు న
బ్బి మానుదురే? లభించు ప్రియసౌఖ్యంబుల్.

టీక:- అనఘ = పుణ్యుడా; విరక్తుల్ = వైరాగ్యము చెందినవారి; కిన్ = కి; ఐనన్ = అయినను; తనయంతన్ = తనంతతనే; లభించు = దొరకు; సౌఖ్య = సుఖముల; తతిన్ = సమూహములను; వర్జింపన్ = వదలుట; చనదు = తగదు; అట = అట; కాముకుల్ = కోరిక కలవారి; కున్ = కి; అబ్బిన = లభించిన; మానుదురే = వదలుదురా ఏమి; లభించు = దొరకిన; ప్రియ = ఇష్టమైన; సౌఖ్యముల్ = సుఖప్రదములను.
భావము:- ఓ పుణ్యాత్మా! ఎంతటి విరక్తులకైనా అయాచితంగా తమంత తామే లభించిన సౌఖ్యాలను వదలకూడదని అన్నారు కదా! అటువంటప్పుడు కోరుకున్నవాళ్ళు అనుకోకుండా లభించిన ఇష్టమైన సుఖాలను మానుకుంటారా?

తెభా-3-784-క.
వినుము ఫలారంభుఁడు గృప
ణుని నడిగినఁ దన యశంబునుం దగు మానం
బును జెడుఁ గావునఁ దగ నీ
వెయ వివాహేచ్ఛఁ దగులు టెఱిఁగి యిచటికిన్.

టీక:- వినుము = వినుము; ఫల = ఫలితమునకై; ఆరంభుడు = యత్నిస్తున్నవాడు; కృపణునిన్ = దీనునిన్; అడిగినన్ = అడిగినచో; తన = తన యొక్క; యశంబునున్ = కీర్తి; తగున్ = తగ్గిపోవును; మానంబునున్ = గౌరవము కూడ; చెడున్ = చెడిపోవును; కావునన్ = అందుచేత; తగన్ = అవశ్యము; నీవు = నీవు; ఎనయన్ = సరిగ; వివాహ = పెండ్లాడు; ఇచ్ఛన్ = కోరిక యందు; తగులుట = చిక్కుట; ఎఱిగి = తెలిసి; ఇచటికిన్ = ఇక్కడకి.
భావము:- ఇంకా విను. ఫలితం పొందడం కోసం ఒక పని చేయడానికి పూనుకొన్నవాడు లోభిని అడిగితే ఆ పని చెడడమే కాక, గౌరవానికి భంగం కూడ వాటిల్లుతుంది. నీవు వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నావని తెలిసికొని ఇక్కడికి…

తెభా-3-785-క.
నుదెంచితి మస్మత్ప్రా
ర్థనఁ గైకొని మత్తనూజఁ గ వరియింపుం"
ముని స్వాయంభువునిం
నుఁగొని మరలంగ బలికెఁ డు మోదమునన్.

టీక:- చనుదెంచితిమి = వచ్చితిమి; అస్మత్ = మా యొక్క; ప్రార్థనన్ = విన్నపమును; కైకొని = అంగీకరించి; మత్ = నా యొక్క; తనూజన్ = పుత్రికను; తగన్ = శ్రీఘ్రమే; వరియింపుడు = పెండ్లాడండి; అనన్ = అనగా; ముని = ముని; స్వాయంభువునిన్ = స్వాయంభువుని; కనుగొని = చూసి; మరలంగన్ = మారు; పలికెన్ = పలికెను; కడు = మిక్కిలి; మోదమునన్ = సంతోషముతో.
భావము:- వచ్చాను. నా విన్నపాన్ని మన్నించి నా కుమార్తెను వరించు” అని చెప్పిన స్వాయంభువ మనువును చూచి కర్దముడు సంతోషంతో ఇలా అన్నాడు.

తెభా-3-786-సీ.
"నఘ! నీచేత నన్యదత్తముగఁ బ్ర-
తిష్ఠితంబైన యీ తీవబోఁడి
మనీయరూపరేఖావిలాసంబుల-
మానితలక్ష్మీసమాన యగుచు
నొకనాఁటి రాత్రి యం దుడురాజచంద్రికా-
వళిత నిజ సౌధలము నందు
హిత హిరణ్మయ మంజీర శోభిత-
రణ యై నిజ సఖీ హిత యగుచుఁ

తెభా-3-786.1-తే.
గందుకక్రీడఁ జరియింప గన మందు
రవిమానస్థుఁ డగుచు విశ్వావసుండు
నాఁగఁ దనరిన గంధర్వనాయకుండు
రుణిఁ జూచి విమోహియై రణిఁ బడియె.

టీక:- అనఘ = పుణ్యుడా; నీ = నీ; చేతన్ = చేత; అనన్యదత్తమునగన్ = ఇతరులకిచ్చినది కాదని {అనన్యదత్తము - అన్యదత్తము (ఇతరులకిచ్చినది) కానిది}; ప్రతిష్టింపబడినది = స్థిరీకరింపబడినది; ఐన = అయిన; ఈ = ఈ; తీవబోడిన్ = అందగత్తెను {తీవబోడి - పూలతీగ వంటి దేహము కలామె, అందగత్తె}; కమనీయ = మనోహరమైన; రూప = అందము; రేఖ = చందము; విలాసంబులన్ = విలాసములతో; మానిత = గౌరవింపతగిన; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాన = సమానురాలు; అగుచున్ = అవుతూ; ఒక = ఒక; నాటి = దినము; రాత్రి = రాత్రి; అందున్ = అందు; ఉడురాజు = చంద్రుని; చంద్రికా = వెన్నెలలో; ధవళిత = తెల్లనైన; నిజ = తన యొక్క; సౌధ = మేడ; తలమునన్ = మీది స్థలము; అందున్ = అందు; మహిత = గొప్ప; హిరణ్మయ = బంగారపు; మంజీర = గజ్జలపట్టీతో; శోభిత = సొగసైన; చరణ = పాదములుకలది; ఐ = అయ్యి; నిజ = తన; సఖీ = స్నేహితురాళ్లతో; సహిత = కూడినది; అగుచున్ = అవుతూ; కందుక = బంతి; క్రీడన్ = ఆట; చరియింపన్ = ఆడుతుండగా;
గగనము = ఆకాశము; అందున్ = అందు; వర = ఉత్తమ; విమానస్థుండు = విమానమున ఉన్నవాడు; అగుచున్ = అవుతూ; విశ్వావసుండు = విశ్వావసుడు; నాగన్ = అనబడెడి; తనరిన = అతిశయించిన; గంధర్వ = గంధర్వుల; నాయకుండు = నాయకుడు; తరుణిన్ = (ఈ) స్త్రీని; చూచి = చూసి; విమోహి = బాగుగా మోహమునపడినవాడు; ఐ = అయ్యి; ధరణిన్ = భూమిపైన; పడియెన్ = పడిపోయెను.
భావము:- “ఓ పుణ్యాత్మా! అన్యులను కాదని నాకోసం తీసుకొని వచ్చిన ఈ లతాంగి అందచందాలలో మహాలక్ష్మితో సమానురాలై ఒకనాటి రాత్రి చంద్రుని వెన్నెలతో మెరుస్తున్న తన మేడపై పాదాలకు బంగారు అందెలు అలంకరించుకొని చెలికత్తెలతో ఆడుకొంటుండగా ఆకాశంలో విమానంలో వెళ్తున్న విశ్వావసుడనే గంధర్వరాజు ఈమెను చూచి మోహంతో తూలి నేలపైన పడ్దాడు.

తెభా-3-787-తే.
పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు
లీ తలోదరిఁ బొడగాన రేమిసెప్ప
ట్టి కొమరాలు భాగ్యోదమునఁ దాన
చ్చి కామింప నొల్లనివాఁడు గలఁడె.

టీక:- పుండరీకాక్షునిన్ = హరిని {పుండరీ కాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు కలవాడు}; ఎఱుగని = తెలియని; పురుష = నరులలో; పశువులు = జంతువుల వంటి వారు; ఈ = ఈ; తలోదరిన్ = స్త్రీని {తలోదరి - తల (శిరోజములు) ఉదారముగ (అధికముగా) కలది, స్త్రీ}; పొడగానరు = చూడలేరు; ఏమి = ఏమి; చెప్పన్ = చెప్పను; అట్టి = అటువంటి; కొమరాలు = యువతి {కోమరాలు - కొమరము (యౌవనము)న ఉన్నామె, యువతి}; భాగ్య = అదృష్టము; ఉదయమునన్ = కలసివచ్చుటచే; తానన్ = తానే; వచ్చి = వచ్చి; కామింపన్ = కోరగా; ఒల్లనివాడు = వద్దనువాడు; కలడె = ఉంటాడా ఏమిటి.
భావము:- విష్ణువును తెలిసికొనని పురుష పశువులు ఈమెను చూడలేరు. ఏం చెప్పను? అటువంటి జవరాలు అదృష్టవశాన తనంత తాను వలచినప్పుడు కోరుకొననివాడు ఉంటాడా?

తెభా-3-788-క.
న్యారత్నమునకు
నాకును గుణరూపవర్తనంబుల యెడ నా
లోకింప సమమ కావునఁ
గైకొని వరియింతు విగతల్మషవృత్తిన్.

టీక:- ఈ = ఈ; కన్యా = కన్యలలో; రత్నమున్ = మణి; కున్ = కిని; నాకున్ = నాకును; గుణ = గుణములలోను; రూప = రూపములోను; వర్తనంబులు = ప్రవర్తనలు; ఎడన్ = అందును; ఆలోకింపన్ = తరచిచూసిన; సమమ = సమానముగా ఉన్నవి; కావునన్ = అందుచేత; కైకొని = చేపట్టి; వరియింతున్ = పెండ్లాడెదను; విగత = వదలిపోయిన; కల్మష = పాపపు; వృత్తిన్ = వర్తనతో.
భావము:- గుణం, రూపం, నడవడి ఈ కన్యామణికి, నాకు సమానంగా ఉన్నాయి. కనుక ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను నేను వరించి స్వీకర్తిస్తాను.

తెభా-3-789-క.
విలాత్మ! దీని కొక సమ
ము గల దెఱిఁగింతు విను గుణాకర యగు నీ
ణికి నపత్యపర్యం
ము వర్తింపుదు గృహస్థర్మక్రియలన్.

టీక:- విమల = నిర్మల; ఆత్మా = మూర్తీ; దీని = దీని; కిన్ = కి; ఒక = ఒక; సమయము = నియమము; కలదు = ఉన్నది; ఎఱిగింతున్ = తెలిపెదను; విను = వినుము; గుణ = సుగుణములకు; ఆకర = నివాసము; అగున్ = అయిన; ఈ = ఈ; రమణి = స్త్రీ {రమణి - రమ్యము (మనోహరము) ఐనామె, స్త్రీ}; కిన్ = కి; అపత్య = సంతానము కలుగకుండగ; పర్యంతము = ఉండు వరకు; వర్తింపుదున్ = నడచెదను; గృహస్థధర్మ = గృహస్థ ధర్మముల {చాతుర్ధర్మములు - 1బ్రహ్మచర్యములు 2గృహస్థధర్మములు 3వానప్రస్థధర్మములు 4 సన్యాసధర్మములు}; క్రియలన్ = ప్రకారముగ.
భావము:- ఓ పుణ్యాత్మా! దీనికొక నియమం ఉంది. అది చెపుతాను విను. గుణవతియైన ఈమెకు సంతానం కలిగేవరకు మాత్రమే నేను గృహస్థధర్మాన్ని నిర్వర్తిస్తాను.

తెభా-3-790-ఆ.
అంతమీఁద విష్ణు నాజ్ఞ యౌఁదలఁ దాల్చి
మదమాదియోగరణిఁ బొంది
న్యసించువాఁడ లజనేత్రుని వాక్య
కాణమునఁ జేసి ధీచరిత!

టీక:- అంతమీద = ఆపైన; విష్ణున్ = విష్ణుమూర్తి; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఔదలన్ = శిరసున; తాల్చి = ధరించి; శమ = శాంతి; దమ = ఇంద్రియ నిగ్రహము; ఆది = మొదలగు; యోగ = యోగము యొక్క; సరణిన్ = విధానమును; పొంది = గ్రహించి; సన్యసించువాడన్ = సన్యసించెదను; జలజనేత్రుని = విష్ణుమూర్తి {జలజనేత్రుడు - జలజము (పద్మము)ల వంటి నేత్రములు (కన్నులు) కలవాడు, విష్ణువు}; వాక్య = ఆదేశించిన; కారణమునన్ = కారణము; చేసి = వలన; ధీర = స్వతంత్రమైన; చరిత = వర్తనకలవాడ.
భావము:- ఓ సచ్చరిత్రా! ఆ తర్వాత విష్ణువుయొక్క ఆజ్ఞను శిరసావహించి, అతడు చెప్పినట్లుగా జితేంద్రియుడనై సన్యసిస్తాను.

తెభా-3-791-క.
శ్రీవిభునివలన నీ లో
కాళి యుదయించుఁ బెరుఁగు డఁగును విను రా
జీ భవాదుల కతడే
భూర! నిర్మాణహేతుభూతుం డరయన్.

టీక:- శ్రీవిభుని = విష్ణుమూర్తి {శ్రీవిభుడు - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి విభుడు, విష్ణువు}; వలనన్ = వలన; ఈ = ఈ; లోక = లోకముల; ఆవళి = సమస్తమును; ఉదయించున్ = సృష్టింపబడును; పెరుగున్ = పెరుగును; అడగున్ = నాశనమగును; విను = వినము; రాజీవభవ = బ్రహ్మదేవుడు {రాజీవ భవుడు - రాజీవము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; ఆదుల్ = మొదలగువారి; కున్ = కి; అతడే = అతడే; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}; నిర్మాణ = సృష్టికి; హేతుభూతుడు = కారణమాతృడు; అరయన్ = తరచి చూసినచో.
భావము:- ఓ రాజా! విష్ణువు వల్లనే లోకాలన్నీ పుట్టి, పెరిగి, నశిస్తాయి. బ్రహ్మాదుల కతడే కారణభూతుడై ఉన్నాడు.

తెభా-3-792-వ.
అదిగావున; నమ్మహాత్ముని యాజ్ఞోల్లంఘనంబు సేయరా"దని కర్దముండు పలికిన విని స్వాయంభువుండు నిజ భార్య యైన శతరూప తలంపును, బుత్రియైన దేవహూతి చిత్తంబును నెఱింగిన వాఁడై, ముని సమయంబున కియ్యకొని ప్రహృష్ట హృదయుం డగుచు సమంచిత గుణాఢ్యుం డయిన కర్దమునకు దేవహూతిని విధ్యుక్త ప్రకారంబున వివాహంబు సేయించె; తదనంతరంబ; శతరూపయును బారిబర్హసంజ్ఞికంబు లైన వివాహోచిత దివ్యాంబరాభరణంబులు దేవహూతి కర్దముల కొసంగె; నివ్విధంబున నిజ కులాచార సరణిం బరిణయంబు గావించి విగతచింతాభరుం డై స్వాయంభువుండు దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతు డై; కూఁతుం గౌఁగలించుకొని, చుబుకంబుఁలు బుడుకుచుఁ, జెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని ప్రేమాతిరేకంబున బాష్పధారాసిక్తమస్తకం జేసి "తల్లీ! పోయివచ్చెద"నని చెప్పి, కర్దమునిచేత నామంత్రితుం డై నిజ భార్యా సమేతంబుగ రథం బెక్కి స పరివారుం డై.
టీక:- అదిగావునన్ = అందుచేత; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; ఆజ్ఞన్ = ఆదేశమును; ఉల్లంఘనంబున్ = దాటుటను; చేయన్ = చేయ; రాదు = కూడదు; అని = అని; కర్దముండు = కర్దముడు; పలికినన్ = పలుకగా; విని = విని; స్వాయంభువుండు = స్వాయంభువుడు; నిజ = తన; భార్య = భార్య; ఐన = అయినట్టి; శతరూప = శతరూప యొక్క; తలంపునున్ = ఆలోచనను; పుత్రి = కుమార్తె; ఐన = అయినట్టి; దేవహూతి = దేవహూతి యొక్క; చిత్తంబునున్ = మనసును; ఎఱింగిన = తెలుసుకొన్న; వాడు = వాడు; ఐ = అయ్యి; ముని = ముని యొక్క; సమయంబున్ = నియమమున; కున్ = కి; ఇయ్యకొని = ఒప్పుకొని; ప్రహృష్ట = సంతోషము చెందిన; హృదయుండు = హృదయము కలవాడు; అగుచున్ = అవుతూ; సమంచిత = ప్రకాశిస్తున్న; గుణ = గుణములందు; ఆఢ్యుడు = గొప్పవాడు; అయిన = అయినట్టి; కర్దమున్ = కర్దమున; కున్ = కు; దేవహూతిన్ = దేవహూతిని; విధి = విధినిషేధములందు; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబున్ = విధముగ; వివాహంబున్ = పెండ్లి; చేయించెన్ = చేయించెను; తదనంతరంబ = తరువాత; శతరూపయునున్ = శతరూపకూడ; పారిబర్హ = పారిబర్హములు అని {పారిబర్హము - పారిబర్హము, పెండ్లి కానుకలు(సర్వారాయాంధ్ర నిఘంటువు)}; సంజ్ఞికంబులు = పిలవబడునవి; ఐన = అయినట్టి; వివాహ = పెండ్లిసమయమునకు; ఉచిత = తగిన; దివ్య = దివ్యమైన; అంబర = వస్త్రములు; ఆభరణంబులు = ఆభరణములు; దేవహూతి = దేవహూతి; కర్దముల్ = కర్దముల; కున్ = కు; ఒసంగెన్ = ఇచ్చెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; నిజ = తన; కుల = వంశము యొక్క; ఆచార = ఆచారముల; సరణిన్ = ప్రకారముగ; పరిణయంబున్ = వివాహమును; కావించి = చేసి; విగత = పోయిన; చింత = దిగులుతో; భరుడు = భారము కలవాడు; ఐ = అయ్యి; స్వాయంభువుండు = స్వాయంభువుడు; దుహితృ = పుత్రిక యొక్క; వియోగ = ఎడబాటునకు; వ్యాకులిత = కలతబడిన; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; కూతున్ = కూతురిని; కౌగలించుకొని = కౌగలించుకొని; చుబుకంబున్ = గడ్డమును; పుడుకుచున్ = తడవుచూ; చెక్కిలిన్ = చెంపమీద; ముద్దుకొని = ముద్దుపెట్టుకొని; శిరంబున్ = శిరస్సును; మూర్కొని = వాసనచూసి; ప్రేమ = ప్రేమ; అతిరేకంబునన్ = అతిశయముచే; బాష్ప = కన్నీటి; ధారా = ధారలచేత; సిక్త = తడసిన; మస్తకన్ = శిరము కలదానిని; చేసి = చేసి; తల్లీ = అమ్మా; పోయివచ్చెదను = వెళ్ళొస్తాను; అని = అని; చెప్పి = చెప్పి; కర్దముని = కర్దముని; చేతన్ = చేత; ఆమంత్రితుండు = వీడ్కోలు చెప్పబడినవాడు; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; భార్యా = భార్యతో; సమేతంబుగన్ = సహా; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; సపరివారుండు = పరివారముతో కూడినవాడు; ఐ = అయ్యి.
భావము:- కావున ఆ దేవుని ఆజ్ఞను జవదాటకూడదు” అని కర్దముడు పలుకగా విని స్వాయంభువ మనువు తన భార్య అయిన శతరూప అభిప్రాయాన్ని, కూతురైన దేవహూతి అభిప్రాయాన్ని తెలిసికొని ఆ కర్దముని నియమానికి ఒప్పుకొని, సంతోషిస్తూ ఉత్తమ గుణ సంపన్నుడైన ఆ కర్దమునికి దేవహూతిని ఇచ్చి యథావిధిగా వివాహం చేయించాడు. ఆ తరువాత శతరూప తమ కూతురు అల్లుడు యైన దేవహూతి కర్దములకు పారిబర్హం అనే పేర్లు గల వివాహానికి తగిన దివ్య వస్త్రాలను, ఆభరణాలను ఇచ్చెను. ఆ విధంగా తన కులాచారాన్ని అనుసరించి పెండ్లి చేసి చింతను పోగొట్టుకొన్నవాడై స్వాయంభువ మనువు కుమార్తెను ఎడబాసి పోతున్నాననే విచారంతో ఆమెను కౌగిలించుకొని, చుబుకం పుణికి, చెక్కిలి ముద్దాడి, శిరస్సు మూర్కొని, అతిశయించిన ప్రేమతో ఉబికిన బాష్పధారలతో ఆమె శిరస్సును తడిపి “తల్లీ! పోయి వస్తాను” అని చెప్పి కర్దముని వీడ్కొని భార్యతో రథమెక్కి సపరివారంగా బయలుదేరాడు.

తెభా-3-793-చ.
ళతరంగవీచి సముదంచిత బిందు సరస్సరస్వతీ
రిదరవింద తుందిల లత్తరు తీరనివాస సన్మునీ
శ్వ నికరాశ్రమా కలిత సంపదలం గనుఁగొంచు వేడ్క ము
ప్పిరిగొన నేగె నాత్మ పుటభేదన విస్ఫుటమార్గవర్తి యై.

టీక:- తరళ = మెరుస్తున్న; తరంగ = అలల; వీచి = కదలికలతో; సముదంచిత = చక్కగా నొప్పారుతున్న; బిందుసరస్ = బిందుసరోవరము; సరస్వతీ = సరస్వతి అనెడి; సరిత్ = నది అందలి; అరవింద = పద్మములుతో; తుందిల = సొగసైన; లసత్ = చక్కటి; తరు = చెట్ల; తీర = సమీపమున; నివాస = నివసిస్తున్న; సత్ = మంచి; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠుల; నికరన్ = సమూహములయొక్క; ఆశ్రమ = ఆశ్రమములందు; కలిత = కలిగిన; సంపదలన్ = ఐశ్వర్యములను; కనుగొంచున్ = చూస్తూ; వేడ్క = కుతూహలము; ముప్పిరిగొనన్ = పెనగొనగా {ముప్పిరిగొను - మూడు పురులు కలగి పెనవేసుకొనిపోయిన విధము పెన కొనుట}; ఏగెన్ = వెళ్లెను; ఆత్మ = స్వంత; పుట = పట్టణమును; భేదన = పరిష్కరించు; స్ఫువిస్ఫుట = చక్కగా తెలియుచున్న; మార్గ = దారి; వర్తి = పట్టిన వాడు; ఐ = అయ్యి.
భావము:- కదులుతూ ఉన్న కెరటాలు గల బిందు సరస్సును దాటి, సరస్వతీనదిని దాటి, ఆ నదీతీరంలో తామరపూలతోను, దట్టమైన చెట్లతోను ఒప్పుతున్న మునీశ్వరుల ఆశ్రమాలను ముప్పిరిగొన్న ఆనందంతో చూస్తూ స్వాయంభువ మనువు తన పట్టణమార్గాన్ని పట్టి వెళ్ళాడు.

తెభా-3-794-వ.
ఇట్లు చనిచని బ్రహ్మావర్తదేశంబు నందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చనిచని = వెళ్లి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము అనెడి; దేశంబున్ = దేశము; అందున్ = లో.
భావము:- అలా వెళ్ళి వెళ్ళి బ్రహ్మావర్తదేశంలో…

తెభా-3-795-సీ.
ఎందేనిఁ దొల్లి లక్ష్మీశుండు యజ్ఞసూ-
రమూర్తిఁ గైకొని రభసముగ
నొడలు జాడించినఁ బుడమిపై రాలిన-
రోమజాలంబులు రుచిర హరిత
ర్ణమై పొలుపార రకు శకాశమ-
యంబును యజ్ఞక్రియాకలాప
యోగ్యంబు నై చాల నొప్పారి బర్హిస్సు-
సంభవించిన దాన కలఋషులుఁ

తెభా-3-795.1-తే.
గ్రతువు లొనరించి తద్విఘ్నకారు లైన
సురులం ద్రుంచి రట్ల స్వాయంభువుండు
విష్ణుపరముగ మఖము గావించి రుచిర
మేధ సెలువొంద వచ్చి యాత్మీయపురము.

టీక:- ఎందేనిన్ = ఎక్కడయితే; తొల్లి = పూర్వము; లక్ష్మీశుండు = విష్ణుమూర్తి {లక్ష్మీశుడు - లక్ష్మీదేవి యొక్క ఈశుడు (భర్త), విష్ణువు}; యజ్ఞసూకర = యజ్ఞవరాహ; మూర్తిన్ = స్వరూపమును; కైకొని = స్వీకరించి; సరభసముగన్ = మిక్కిలి వేగముగ; ఒడలు = శరీరము; జాడించినన్ = జాడించగా; పుడమి = భూమి; పైన్ = మీద; రాలిన = రాలిపడిన; రోమ = వెంట్రుకల; జాలంబులున్ = మొత్తములు; రుచిర = మెరయుచున్న; హరిత = ఆకుపచ్చని; వర్ణము = రంగు కలవి; ఐ = అయ్యి; పొలుపారు = ప్రకాశించుతున్న; వర = ఉత్తమమైన; కుశ = దర్భలును; కాశ = రెల్లును; మయంబునున్ = నిండినవియును; యజ్ఞ = యజ్ఞము; క్రియా = చేయుటకైన; కలాప = పనులకు; యోగ్యంబున్ = తగినదియును; ఐ = అయ్యి; చాలన్ = అధికముగ; ఒప్పారి = చక్కనిదై; బర్హిస్సు = అగ్ని; సంభవించిన = పుట్టగా; దానన్ = దానితో; సకల = సమస్తమైన; ఋషులున్ = ఋషులును; క్రతువులు = యజ్ఞములు; ఒనరించి = చేసి;
తత్ = దానికి; విఘ్న = విఘ్నములు; కారులు = కలిగించువారు; ఐన = అయినట్టి; అసురులన్ = రాక్షసులను; త్రుంచిరి = సంహరించిరి; అట్ల = ఆ విధముగ; స్వాయంభువుండు = స్వాయంభువుడు; విష్ణు = విష్ణుమూర్తి; పరముగన్ = చెందునట్లు; మఖమున్ = యజ్ఞమును; కావించి = చేసి; రుచిర = ప్రకాశించునట్టి; మేధ = బుద్ధిబలము; చెలువొందన్ = ప్రకాశించుతూ; వచ్చి = చేరవచ్చి; ఆత్మీయ = స్వంత; పురమున్ = పట్టణమును.
భావము:- పూర్వం విష్ణువు యజ్ఞవరాహరూపం ధరించి ఒక్కసారిగా ఒళ్ళు విదిలించగా అతని శరీరం మీది బిరుసైన వెంట్రుకలు ఆ ప్రదేశంలో రాలాయి. వాటివల్ల పచ్చని దర్భలూ, రెల్లుగడ్డీ, యజ్ఞకార్యాలకు యోగ్యమైన అగ్నీ పుట్టాయి. వాటితో ఋషులు అక్కడ యజ్ఞాలు చేశారు. యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్న రాక్షసులను తుదముట్టించారు. అటువంటి బ్రహ్మావర్తదేశంలో స్వాయంభువ మనువు కూడా విష్ణువు నుద్దేశించి యజ్ఞం చేసి ప్రజ్ఞానిధియై విరాజిల్లిన తన పట్టణాన్ని సమీపించాడు.

తెభా-3-796-క.
డాయంజనఁ బురజనము లు
పానములు దెచ్చియిచ్చి హుగతుల నుతుల్
సేయఁగ మంగళతూర్యము
లాతగతి మ్రోయఁ జొచ్చె నంతఃపురమున్.

టీక:- డాయన్ = దగ్గరకు; చనన్ = వెళ్ళగా; పురజనములు = పౌరులు; ఉపాయనములు = కానుకలు; తెచ్చి = తీసుకువచ్చి; ఇచ్చి = ఇచ్చి; బహు = అనేక; గతులన్ = విధములుగ; నుతుల్ = స్తోత్రములు; సేయగన్ = చేయగా; మంగళతూర్యముల్ = మంగళవాద్యములు; ఆయత = పెద్దవైన; గతిన్ = విధముగ; మ్రోయన్ = మోగ; చొచ్చెన్ = సాగెను; అంతఃపురమున్ = అంతఃపురమును.
భావము:- ఆ విధంగా తన పట్టణాన్ని సమీపించగా పురజనులు కానుకలను తెచ్చి ఇచ్చి అనేక విధాలుగా స్తుతిస్తుండగా, మంగళవాద్యాలు మ్రోగుతుండగా స్వాయంభువ మనువు తన అంతఃపురం ప్రవేశించాడు.

తెభా-3-797-వ.
ఇట్లు ప్రవేశించి; తాపత్రయోపశమనం బగు భగవద్భక్తి వృద్ధిఁ బొందించుచుఁ బుత్ర మిత్ర కళత్ర సుహృద్భాంధవ సహితుం డై పరమానందంబున
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రవేశించి = ప్రవేశించి; తాపత్రయ = తాపత్రయములను {తాపత్రయములు - 1ఆధిభౌతికము 2ఆధ్యాత్మికము 3ఆదిదైవికము అనేమూడుతాపముల}; ఉపశమనంబున్ = అణగునట్లు; అగు = చేయునట్టి; భగవత్ = భగవంతుని ఎడ; భక్తిన్ = భక్తి; వృద్ధిన్ = పెరుగుటను; పొందించుచు = కలుగజేస్తూ; పుత్ర = పుత్రులు; మిత్ర = మిత్రులు; కళత్ర = భార్య; సుహృత్ = ఆప్తులు; బాంధవ = బంధువులతో; సహితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; పరమ = అత్యధికమైన; ఆనందమునన్ = ఆనందముతో;
భావము:- అలా ప్రవేశించి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికాలనే తాపత్రయాన్ని రూపుమాపే భగవద్భక్తిని పెంపొందించుకుంటూ పుత్రులు, మిత్రులు, ఆప్తులు, బంధువులతో కూడి పరమానందంగా ఉన్నాడు.

తెభా-3-798-మ.
తి భక్తిం బ్రతివాసరంబును హరివ్యాసంగుఁ డై మాధవాం
కి గంధర్వ విపంచికా కలిత సంగీతప్రబంధానుమో
దితుఁ డై యిష్ట విభూతు లందు ననురక్తిం బొంద కేప్రొద్దు న
చ్యు సేవైకపరాయణుం డగుచు నస్తోకప్రభావోన్నతిన్

టీక:- అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; ప్రతి = ప్రతి; వాసరంబునున్ = దినమును; హరి = విష్ణుమూర్తి యందు; వ్యాసంగుడు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; మాధవ = విష్ణుమూర్తి యందు; అంకిత = అర్పించిన; గంధర్వ = గంధర్వ; విపంచి = వీణతో; కలిత = కూడిన; సంగీత = సంగీతములతోను; ప్రబంధ = కావ్యములతోను; అనుమోదితుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ఇష్ట = కోరదగిన, అష్టఇష్టులు {అణిమాది - అష్టసిద్ధులు - అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది (8). 1 అణిమ - అణువుగ సూక్ష్మత్వము నందుట, 2 మహిమ - పెద్దగ అగుట, 3 గరిమ - బరువెక్కుట, 4 లఘిమ - తేలికగనౌట, 5 ప్రాప్తి - కోరినది ప్రాప్తించుట, 6 ప్రాకామ్యము - కోరిక తీర్చుట, 7 ఈశత్వము - ప్రభావము చూపగలుగుట, 8 వశిత్వము - వశీకరణము చేయగలుగుట}; విభూతులు = సంపదలు; అందున్ = అందు; అనురక్తిన్ = ఆపేక్షను; పొందక = లేకుండగ; ఏ = ఏ; పొద్దునన్ = సమయములోనైనా; అచ్యుత = విష్ణుమూర్తిని; సేవ = కొలుచుట; ఏక = మాత్రమే; పారాయణుండు = నియమముగ కలవాడు; అగుచున్ = అవుతూ; అస్తోక = అనల్ప; ప్రభావ = మహిమ యొక్క; ఉన్నతిన్ = గొప్పదనముతో;
భావము:- అతడు ప్రతిదినం మిక్కిలి భక్తితో విష్ణువునందే మనస్సు నిల్పి, గంధర్వవీణను మేళవించి విష్ణువున కంకితంగా కమ్మని గీతాలను గానం చేస్తూ సంతుష్టాంతరంగుడై భోగభాగ్యాల మీద ఆసక్తి లేనివాడై, సర్వదా నారాయణ సేవాపరాయణుడై అనంత మహిమాన్వితుడైనాడు.

తెభా-3-799-మ.
రి పాదాంబురుహద్వయార్పిత తులస్యామోదముం గొంచుఁ ద
చ్ఛరితంబుల్ దలపోయుచుం బొగడుచుం ర్చించుచున్ వించుఁ ద
త్పరిచర్యావ్యతిరిక్త సంసరణ సద్దర్మార్థకామంబులం
రిభూతంబులు సేసి మోక్షపద సంప్రాప్తిక్రియారంభుఁ డై.

టీక:- హరి = నారాయణుని; పాద = పాదములు అనెడి; అంబురుహ = పద్మముల {అంబురుహము - అంబువులు (నీరు) అందు పుట్టినది, పద్మము}; ద్వయా = జంటకు; అర్పిత = సమర్పించబడిన; తులసి = తులసి యొక్క; ఆమోదమున్ = పరిమళమును; కొంచున్ = గ్రహించుతూ; తత్ = అతని; చరితంబుల్ = కథలు; తలపోయుచూ = గుర్తుచేసుకొంటూ; పొగడుచున్ = కీర్తించుచూ; చర్చించుచున్ = వివరిస్తూ; వించున్ = వింటూ; తత్ = అతని; పరిచర్యా = సేవ; వ్యతిరక్త = కాక ఇతరములైన; సంసరణ = సంసారమునకు చెందిన; సత్ = మంచి; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామంబులన్ = కామములను; పరిభూతంబులున్ = తిరస్కరింపబడినవిగ; చేసి = చేసి; మోక్ష = ముక్తి; పద = పదమును; సంప్రాప్తి = పొందునట్టి; క్రియా = ప్రయత్నములు; ఆరంభుడు = మొదలు పెట్టినవాడు; ఐ = అయ్యి.
భావము:- విష్ణువు పాదపద్మాలపై సమర్పింపబడిన తులసీదళాల ప్రవిత్ర పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ భగవంతుని లీలావిలాసలను స్మరిస్తూ, కీర్తిస్తూ, చర్చిస్తూ, వింటూ ఆ దేవుని సేవలకు ఆటంకాలై సంసారబంధాలైన ధర్మార్థకామాలను తిరస్కరించి మోక్షసాధకాలైన సత్కార్యాలను నిర్వహించాడు.

తెభా-3-800-క.
నిమార్థగోచరుం డనఁ
గు హరిచరితప్రసంగత్పర చిత్తుం
గు నతనికి స్వాంతరంగము
గు యామము లొగి నయాతయామము లయ్యెన్.

టీక:- నిగమ = వేద; అర్థ = అర్థముల; గోచరుండు = కనపడువాడు; అనన్ = అనుటకు; తగు = తగిన; హరి = విష్ణుమూర్తి యొక్క; చరిత = కథలు; ప్రసంగ = ప్రసంగము లందు; తత్పర = లగ్నమైన; చిత్తుడు = మనసు కలవాడు; అగు = అయిన; అతని = అతని; కిన్ = కి; స్వ = తన; అంతరంగములన్ = మనసులో; అగు = జరిగిన; యామముల్ = యామములు; ఒగిన్ = అవశ్యము; అయాత = జరగని; యామముల్ = యామములు; అయ్యెన్ = అయినవి.
భావము:- వేదార్థాలకు మాత్రమే గోచరమయ్యే ఆ భగవంతుని చరిత్రను ప్రసంగించడంలో ఆసక్తి కలిగిన మనస్సు కల ఆ స్వాయంభువ మనువుకు ఎన్ని జాములు గడిచినా గడువనట్లే ఉంది.

తెభా-3-801-సీ.
వెండియు నమ్మేటి విష్ణుమంగళకథా-
ర్ణన ధ్యానానుగాన నుతులు
లుపుచు స్వస్వప్న జాగ్రత్సుషుప్తులఁ-
లఁగించి యా పుణ్యముఁడు దాను
క్రిదాసుఁడు గాన శారీర మానస-
దివ్యమానుష భౌతివ్యధలను
గులక సన్మునీంద్రశ్రేణికిం దగఁ-
నరు వర్ణాశ్రమర్మగతులు

తెభా-3-801.1-తే.
ప్పకుండంగ నడపుచుఁ గిలి సర్వ
భూహితవృత్తి నతుల విఖ్యాలీల
నేసప్తతియుగము లస్తోచరితుఁ
గుచు వర్తించె సమ్మోద తిశయిల్ల."

టీక:- వెండియున్ = ఇంకను; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; విష్ణు = గోవిందుని; మంగళ = శుభకరమైన; కథా = కథలను; ఆకర్ణన = వినుట; ధ్యాన = ధ్యానము; అనుగాన = భజనలు; నుతులు = స్తోత్రములు; సలుపుచున్ = చేస్తూ; స్వ = తన; స్వప్న = స్వప్నావస్థ; జాగ్రత్ = జాగ్రదవస్థ; సుషుప్తలన్ = సుషుప్తావస్థలను; తలగించి = తొలగించుకొని; ఆ = ఆ; పుణ్యతముడు = అత్యంతపుణ్యుడు {పుణ్యుడు - పుణ్యతరుడు - పుణ్యతముడు}; తానున్ = తను; చక్రి = విష్ణుమూర్తి యొక్క; దాసుడు = సేవించువాడు; కాన = కనుక; శారీర = శరీర సంబంధమైన; మానస = మానసికమైన; దివ్య = ఆదిదైవిక; మానుష = ఆధ్యాత్మిక; భౌతిక = ఆదిభౌతిక; వ్యధలనున్ = బాధలందు; తగులక = చిక్కుకొనక; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; శ్రేణిన్ = సమూహమున; కిన్ = కి; తగన్ = తగి; తనరు = అతిశయించు; వర్ణ = వర్ణముల; ఆశ్రమ = ఆశ్రమముల; ధర్మ = ధర్మముల; గతులు = విధానములు; తప్పకుండగ = తేడాలురాకుండా;
నడపుచున్ = నడిపిస్తూ; తగిలి = చక్కగ; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; హిత = మేలుచేయు; వృత్తిన్ = ప్రవర్తనతో; అతుల = సాటిలేని; విఖ్యాత = ప్రసిద్ధిచెందిన; లీలన్ = విధముగ; ఏకసప్తతి = డెబ్బయిఒక్క; యుగముల్ = యుగములు; అస్తోక = అనల్ప; చరితుడు = ప్రవర్తన కలవాడు; అగుచున్ = అవుతూ; వర్తించెన్ = జీవించెను; సమ్మోదము = సంతోషము; అతిశయిల్లన్ = పెంపొందగా.
భావము:- ఆ స్వాయంభువ మనువు విష్ణువు దివ్యమంగళ చరిత్రలను వింటూ, ఆయన రూపాన్ని ధ్యానిస్తూ, ఆయన లీలలను గానంచేస్తూ, ఆయనను ఆరాధిస్తూ, తన స్వప్న, జాగ్రత్, సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. విష్ణుభక్తుడు కనుక శరీరానికి, మనస్సుకు సంబంధించిన వ్యథలను పొందలేదు. దేవతలవల్లా, మానవులవల్లా, పంచభూతాలవల్లా కలిగే బాధలలో చిక్కుకోలేదు. ఉత్తములైన మునీశ్వరులకు సంతోషం కలిగేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా నడుపుతూ, సర్వప్రాణులకు మేలు చేస్తూ డెబ్బైయొక్క మహాయుగాలు పాలించాడు. సమ్మోదంతో, సాటిలేని మేటి యశస్సుతో సచ్చరిత్రుడై విరాజిల్లాడు.

తెభా-3-802-క.
ని యమ్మనుచరితము విదు
రు కమ్మైత్రేయమునివరుఁడు దయతోడన్
వినిపించి కర్దమునికథ
రఁగ నెఱిఁగింతు నని ముదంబునఁ బలికెన్.

టీక:- అని = అని; ఆ = ఆ; మను = మనువు యొక్క; చరితము = కథ; విదురున్ = విదురురుని; కున్ = కి; ఆ = ఆ; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; వరుడు = ఉత్తముడు; దయ = కృప; తోడన్ = తో; వినిపించి = చెప్పి; కర్ధముని = కర్దముని; కథ = కథ; తనరగన్ = విజృంభించి; ఎఱిగింతున్ = తెలిపెదను; అని = అని; ముదంబునన్ = ముదంబునన్; పలికెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా విదురునికి మైత్రేయుడు దయతో స్వాయంభువ మనువు చరిత్రను వినిపించి “కర్దముని కథను వివరిస్తాను” అని సంతోషంగా చెప్పాడు.