పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/చతుర్యుగపరిమాణంబు


తెభా-3-348-ఉ.
పూనిన యోగసిద్ధి దగఁ బొందిన నేత్రయుగంబునన్ బహి
ర్జ్ఞాము గల్గి యుండి భువనంబులఁ జూచుచునుండు వారికి
న్మానుగఁ గల్గు కాలగతి నా కెఱిఁగింపు మునీంద్ర!"నావుడు
న్నా యశాలి యవ్విదురు నాదర మొప్పఁగ జూచి యిట్లనున్.

టీక:- పూనిన = ధరించిన, సాధించిన; యోగ = యోగాభ్యాసము; సిద్ధిన్ = సిద్ధించుటవలన {సిద్ధి - పరిపక్వము}; తగన్ = చక్కగా; పొందిన = పొందిన; నేత్ర = కన్నుల; యుగంబునన్ = జంటతో; బహిః = బాహ్య; జ్ఞానము = జ్ఞానము; కల్గి = కలిగి; ఉండి = ఉండి; భువనంబులన్ = లోకములను; చూచుచున్ = చూస్తూ; ఉండు = ఉండు; వారి = వారి; కిన్ = కి; మానుగన్ = అవశ్యము; కల్గు = కలిగే; కాల = కాలము యొక్క; గతిన్ = గమనములు; నాకున్ = నాకు; ఎఱిగింపు = తెలుపుము; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; నావుడున్ = అని పలుకగా; ఆ = ఆ; నయశాలి = నీతిమంతుడు; ఆ = ఆ; విదురున్ = విదురుని; ఆదరము = ఆదరము; ఒప్పన్ = ఒప్పునట్లు; చూచి = చూసి; ఇట్లు = ఈవిధముగా; అనున్ = పలికెను.
భావము:- ఋషీశ్వరా! మైత్రేయా! ధృఢమైన యోగసిద్ధి వల్ల ప్రాప్తించిన నేత్రాలతో బాహ్య జ్ఞానం కలిగి, లోకాలను ఆలోకించే వారికి కలిగే, కాలపరిమాణం ఎటువంటిదో నాకు తెలుపుము.” అనగా మహనీయుడైన మైత్రేయుడు విదురుని ఆదరపూర్వకంగా వీక్షించి ఈ విధంగా అన్నాడు.

తెభా-3-349-సీ.
"ననుత కృతయుగ సంఖ్య నాలుగువేలు-
దివ్యవర్షములు. తదీయ సంధ్య
లెనిమిదినూఱేండ్లు. విను త్రేత వత్సర-
త్రిసహస్రములగు, తదీయ సంధ్య
లాఱునూఱేఁడులు గు. ద్వాపరము రెండు-
వేల వత్సరముల వెలయు. సంధ్య
లోలి నన్నూ ఱేఁడు లొగిఁ, గలియుగము స-
స్ర వర్షములు సంధ్యాంశ మరయ

తెభా-3-349.1-తే.
రెండునూఱేఁడులును నిల్చి యుండుఁ జువ్వె,
నఘ! సంధ్యాంశ మధ్యంబు నందు ధర్మ
తిశయించును సంధ్యాంశ మందు ధర్మ
ల్ప మై కానఁబడుచుండు నఘచరిత!

టీక:- జన = జనులచే; నుత = స్తుతింపబడువాడ; కృతయుగ = కృతయుగము; సంఖ్య = పరిమితి; నాలుగువేలు = నాలుగువేలు (4000); దివ్యవత్సరములు = దేవతల సంవత్సరములు; తదీయ = దానియొక్క; సంధ్యలు = సంధికాలము; ఎనిమిదినూఱు = ఎనిమిదివందల (800); ఏండ్లు = సంవత్సరములు; విను = వినుము; త్రేత = త్రేతాయుగము; వత్సర = సంవత్సరములు; త్రిసహస్రములు = మూడువేలు (3000); అగున్ = అగును; తదీయ = దానియొక్క; సంధ్యలు = సంధికాలము; ఆఱునూఱు = ఆరొందలు (600); ఏడులు = సంవత్సరములు; అగు = అగును; ద్వాపరము = ద్వాపరయుగము; రెండువేల = రెండువేల (2000); వత్సరములన్ = సంవత్సరములు; వెలయున్ = ప్రకాశించును; సంధ్యలు = సంధికాలము; ఓలిన్ = పరిమాణములో; నన్నూఱు = నాలుగువందల (400); ఏడులున్ = వత్సరములు; ఒగిన్ = క్రమముగా; కలియుగమున్ = కలియుగము; సహస్ర = వెయ్యి (1000); వర్షములు = సంవత్సరములు; సంధ్య = సంధ్యయొక్క; అంశము = భాగము; అరయన్ = చూడగా; రెండునూఱు = రెడొందలు (200); ఏడులునున్ = సంవత్సరములు; నిల్చి = కలిగి; ఉండున్ = ఉండును; చువ్వె = సుమా; అనఘ = పుణ్యుడ; సంధ్య = (2) సంధ్యా; అంశ = భాగముల; మధ్యంబున్ = నడుమ; అందున్ = లో; ధర్మము = (యుగ) ధర్మము; అతిశయించును = అధికమగును; సంధ్య = సంధ్యయొక్క (2 యుగముల మధ్య); అంశము = భాగము; అందున్ = లో; ధర్మము = (యుగ) ధర్మము; అల్పము = తక్కువ; ఐ = అయ్యి; కానంబడుచున్ = కనబడుతూ; ఉండున్ = ఉండును; అనఘచరిత = పుణ్యవర్తన.
భావము:- జనుల అభిమానం అందుకున్నవాడా! పవిత్ర చరితా! విదురా! విను, కృతయుగం నాలుగువేల దివ్యసంవత్సరాలు ప్రమాణం కలది. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్ళు. ఒక యుగానికి మరొక యుగానికి మధ్య కాలాన్ని, సంధ్య అంటారు. త్రేతాయుగ ప్రమాణం మూడువేలదివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్ళు. ద్వాపరయుగ ప్రమాణం రెండువేల దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ ప్రమాణం వెయ్యి దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. ఈ సంధ్యాకాలం మధ్య కాలంలో ధర్మం అధికంగా ఉంటుంది. సంధ్యాంకంలో ధర్మం అల్పమై ఉంటుంది.

తెభా-3-350-వ.
మఱియు ధర్మదేవత గృతయుగంబున నాలుగు పాదంబులును, ద్రేత యందు మూఁడు పాదంబులును, ద్వాపరంబునం బాద ద్వయంబును, గలియుగంబున నేక పాదంబును గలిగి సంచరించు అట్లగుటం జేసి.
టీక:- మఱియున్ = ఇంకనూ; ధర్మదేవత = ధర్మదేవత {ధర్మదేవత - ధర్మమునకు అధిదేవత}; కృతయుగంబునన్ = కృతయుగములో {కృతలో - పూర్తి ధర్మము ఉండును}; నాలుగు = నాలుగు (4); పాదంబులునున్ = పాదములును {కృతలో - నాలుగు పాదములు - , నాలిగింటనాలుగు (4, 4) వంతులు కలిగి ఉండుట}; త్రేత = త్రేతాయుగము {త్రేతలో - నాలుగింట మూడు వంతుల (3, 4) ధర్మము ఉండును}; అందున్ = లో; మూడు = మూడు (3); పాదంబులునున్ = పాదములును; ద్వాపరంబునన్ = ద్వాపరయుగము లో {ద్వాపరలో - నాలుగింట రెండు వంతులు (2, 4) ధర్మము ఉండును}; పాద = పాదములు; ద్వయంబును = రెండు (2); కలియుగంబునన్ = కలియుగములో {కలిలో - నాలుగింట ఒక వంతు (1, 4) ధర్మము ఉండును}; ఏక = ఒకటే (1); పాదంబున్ = పాదమును; కలిగి = కలిగి ఉండి; సంచరించున్ = నడచును, వర్తించును; అట్లు = ఆవిధముగ; అగుటన్ = అగుటవలన; చేసి = వలన;
భావము:- ఇంకా; ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతోనూ, త్రేతాయుగంలో మూడు పాదాలతోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలతోనూ, కలియుగంలో ఒక్క పాదంతోనూ నడుస్తూ ఉంటుంది.

తెభా-3-351-క.
పావిభేదంబున మ
ర్యాలును దఱుఁగు నధర్మ మాకొలదినె యు
త్పాదిల్లి వృద్ధిఁ బొందు ధ
రాదివిజులు పాద బుద్ధి తు లగుదు రిలన్.

టీక:- పాద = పాదములందలి; విభేదంబునన్ = తేడా ప్రకారము; మర్యాదలున్ = కట్టుబాట్లు, పద్ధతులు; తఱుగున్ = తరిగిపోవును; అధర్మము = అధర్మము; ఆ = ఆ; కొలదినె = కొలత ప్రకారమే; ఉత్పాదిల్లి = పుట్టి, (పుట్టుకు వచ్చి); వృద్ధిన్ = పెరుగుటను; పొందున్ = పొందును; ధరాదివిజులు = బ్రాహ్మణులు {ధరాదివిజులు - ధర (భూమి)కి దివిజులు (దేవతలు), బ్రహ్మణులు}; పాద = పాదముల లెక్క ప్రకారము; బుద్ధి = బుద్ధి; రతులు = పరిమాణము కలవారు; అగుదురు = అవుతారు; ఇలన్ = భూమిమీద, ఈలోకమున.
భావము:- ఈ పాదాల వ్యత్యాసాల వలన ప్రజలు పరిధులు తప్పి నడుస్తారు. మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి. దానితో సమంగా అధర్మం ఆవిర్భవించి అభివృద్ధి పొందుతుంది. లోకంలో బ్రాహ్మణులు విపరీత బుద్ధులు యందు ఆసక్తిగలవారు అయి మెలగుతారు.

తెభా-3-352-సీ.
భూర్భువస్స్వర్లోకములకంటెఁ బొడువునఁ-
డు నొప్పు సత్యలోకంబు నందు
నుండు బ్రహ్మకుఁ జతుర్యుగ సహస్రము లేగ-
దిన మొక్కటి యగు, రాత్రియును నిట్ల
న ధాత నిద్రవో గము లడంగు, మే-
ల్కని చూడ మరల లోములు పుట్టుఁ
ద్దినమ్మునఁ జతుర్దశ మను లగుదు రం-
దొక్కొక్క మనువున కొనర దివ్య

తెభా-3-352.1-తే.
యుగము లోలిని డెబ్బదియొక్క మాఱు
నిన మనుకాల మయ్యె, నమ్మనుకులంబు
సులు మునులును సప్తర్షు య భగవ
దంశమునఁ బుట్టి పాలింతు ఖిల జగము.

టీక:- భూ = భూలోకము; భువర్ = భవర్లోకము; సువర్ = సువర్లోకము; లోకముల = లోకముల; కంటెన్ = కంటె; పొడువునన్ = పరిమాణములో పెద్దగ; కడున్ = మిక్కిలి; ఒప్పు = ఒప్పియుండు; సత్యలోకంబున్ = సత్యలోకమున; అందున్ = అందు; ఉండున్ = ఉండు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; చతుర్యుగ = నాలుగు యుగములు, మహాయుగములు; సహస్రముల్ = వెయ్యి (1000); ఏగన్ = జరుగగా; దినమున్ = పగలు; ఒక్కటి = ఒకటి; అగున్ = అగును; రాత్రియున్ = రాత్రికూడ; ఇట్ల = ఈవిధముగా; చనన్ = జరుగగా; ధాత = బ్రహ్మదేవుడు {ధాత - ధరించు వాడు, బ్రహ్మదేవుడు}; నిద్రన్ = నిద్రలోకి; పోన్ = వెళ్ళగా; జగములు = భువనములు; అడంగు = అణగును; మేల్కొని = నిద్రలోంచిమేలుకొని లేచి; చూడన్ = చూడగా; మరల = మళ్లీ; లోకములు = లోకములు; పుట్టున్ = పుట్టును; తత్ = అతని; దినమునన్ = పగలుకాలములో; చతుర్దశ = పద్నాలుగు (14); మనులు = మనువులు; అగుదురు = కలుగుదురు; అందున్ = అందులో; ఒక్కొక్క = ఒక్కొక్క; మనువున్ = మనువున; కున్ = కు; ఒనరన్ = చక్కగా; దివ్యయుగముల్ = మహాయుగము; ఓలిన్ = వరుసగా; డెబ్బదియొక్క = డెబ్బైయొక; మాఱున్ = సార్లు; చనినన్ = జరుగగా; మనుకాలము = మన్వంతరము; అయ్యన్ = అయ్యెను; ఆ = ఆ; మను = మనువు యొక్క; కులంబున్ = కులములో; సురలు = దేవతలు; మునులును = మునులూ; సప్తర్షులున్ = సప్తఋషులు; అరయన్ = తరచి చూసి; భగవత్ = భగవంతుని; అంశమునన్ = అంశలో; పుట్టి = పుట్టి; పాలింతురు = పరిపాలింతురు, ఏలెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకమును.
భావము:- భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం కంటె పైన సత్యలోకం అని ఒకటుంది. ఆ సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవునికి, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు నాలుగు కలిపిన మహాయుగాలు వేయి గడిస్తే, ఒక్క దినం అవుతుంది. రాత్రి కూడా అంతే పరిమాణం కలిగి ఉంటుంది. బ్రహ్మ నిద్రపోతే, లోకాలకు ప్రళయం వస్తుంది. నిద్ర మేల్కొని చూస్తే మళ్లి లోకాలు పుడతాయి. బ్రహ్మదేవుని ఆ ఒక్క దినంలో పద్నాలుగు మంది మనువులు ఉద్భవిస్తారు. అంటే పద్నాలుగు మన్వంతరాలు గడుస్తాయి అన్నమాట. వారిలో ఒక్కొక్క మనువు కాలం (మన్వంతరం) డెబ్బది ఒక్క దివ్యయుగాలు. అట్టి మనువు కాలాన్నే మన్వంతరం అంటారు. మనువులు, దేవతలు, మునులు, సప్తర్షులు, భగవంతుని అంశతో ఆయా మన్వంతరాలలో పుట్టి లోకాలను పాలిస్తారు.

తెభా-3-353-క.
రి పితృ సుపర్వ తిర్య
ఙ్న రూపములన్ జనించి యమున మన్వం
ముల నిజ సత్త్వంబునఁ
రిపాలించును జగంబుఁ బౌరుష మొప్పన్.

టీక:- హరి = విష్ణుమూర్తి; పితృ = పితృదేవతలు; సుపర్వ = సురలు; తిర్యక్ = జంతువులు {తిర్యక్ – చలనము కలవి, జంతువులు}; నర = నరుల; రూపములన్ = రూపములలో; జనించి = పుట్టి; నయమునన్ = చక్కగా; మన్వంతరములన్ = మన్వంతరములలో; నిజ = తన; సత్త్వంబునన్ = శక్తితో; పరిపాలించును = పరిపాలించును; జగంబున్ = లోకములను; పౌరుషము = పౌరుషము, మగతనము; ఒప్పన్ = ఒప్పునట్లు.
భావము:- ఈ మన్వంతరాలలో శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాల్లో ఉద్భవించినవాడు అయి ఆత్మ శక్తితో పౌరుష ప్రతాపాలతో విశ్వాన్ని పరిపాలిస్తాడు.

తెభా-3-354-క.
క్రమునఁ ద్రైవర్గిక స
ర్గము సెప్పంబడె సరోజర్భుఁడు దివసాం
మునఁ దమఃపిహితపరా
క్రముఁ డై శయనించు నిద్రఁ గైకొని యంతన్.

టీక:- క్రమమునన్ = క్రమముగా; త్రైవర్గిక = మూడు (3)వర్గములుగా అయిన {త్రైవర్గికములు - 1 భూభువస్సువ ర్లోకములు మూడు వర్గములు 2 ద్రవ్యము శక్తి వెలుగు అను మూడు వర్గములు 3 ధర్మార్థకామములు అను మూడు వర్గములు...}; సర్గము = సృష్టిలో రకములు; చెప్పంబడెన్ = చెప్పబడినవి; సరోజగర్భుడు = బ్రహ్మదేవుడు {సరోజగర్భుడు - సరోజ (పద్మము)న పుట్టినవాడు}; దివస = పగలు యొక్క; అంతమునన్ = ఆఖరులో; తమస్ = చీకటిలో; పిహిత = కప్పబడిన; పరాక్రముడు = శక్తిసామర్ఠ్యములు కలవాడు; ఐ = అయి; శయినించున్ = పండుకొనును; నిద్రన్ = నిద్రను; కైకొని = స్వీకరించి; అంతన్ = అంతట.
భావము:- వరసగా మూడు వర్గాల సృష్టి విశేషాలనూ చెప్పాను కదా. అలా బ్రహ్మకు పగలు పూర్తి అయి రాత్రి కాగానే నిద్రపోతాడు. ఆయన శక్తి సామర్ధ్యాలు అంధకారంతో ఆచరింపబడతాయి.

తెభా-3-355-సీ.
రాత్రి భువన త్రము దమఃపిహితమై-
భానుచంద్రులతో విలీమైన
ర్వాత్ముఁ డగు హరి క్తిరూపం బయి-
డఁగి వెలుంగు సంర్షణాగ్ని
భునత్రయంబును విలి దహింప న-
య్యలకీలలఁ బొడమి మహోష్మ
లమినఁ గమలి మర్లోకవాసులు-
నలోకమునకును నుదు రపుడు

తెభా-3-355.1-తే.
విలయసమయ సముత్కట విపుల చండ
వాతధూతోర్మిజాల దుర్వార వార్ధి
భువనములు ముంచు నమ్మూడు భువనములను
త్పయోరాశిమీఁదఁ బద్మావిభుండు.

టీక:- ఆ = ఆ (బ్రహ్మయొక్క); రాత్రి = రాత్రి సమయమునన్; భువన = లోక {భువనత్రయము - ముల్లోకములు, భూర్భువస్సువ ర్లోకములు}; త్రయము = త్రయము, మూడు (3); తమస్ = చీకటిలో; పిహితము = కప్పబడినవి; ఐ = అయ్యి; భాను = సూర్యుడు; చంద్రులన్ = చంద్రుడుల; తోన్ = తో; విలీనము = కలిసిపోయినవి; ఐన = కాగా; సర్వాత్ముడు = సర్వాత్మకుడు {సర్వాత్ముడు - సర్వమునందును ఆత్మరూపమున ఉంచువాడు, సర్వాత్మకుడు}; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; శక్తి = శక్తి; రూపంబు = రూపము; అయి = అయ్యి; కడగి = విజృంభించి; వెలుంగు = ప్రకాశించు; సంకర్షణ = సంకర్షణ అను ప్రళయకాల; అగ్నిన్ = అగ్నిలో; భువనత్రయంబున్ = ముల్లోకములును; తవిలి = (మంటలు) అంటుకొని; దహింపన్ = కాలిపోగా; ఆ = ఆ; అనల = అగ్ని; కీలలన్ = మంటల వలన; పొడమినన్ = పొడచూపిన; మహా = గొప్ప; ఊష్మము = వేడిమి; అలమినన్ = వ్యాపించగా; కమిలి = కమిలిపోయి; మహర్లోక = మహర్లోకమున; వాసులు = వసించువారు; జనలోకమున్ = జనలోకమున; కున్ = కు; చనుదురు = వెళ్ళిపోతారు; అపుడు = అప్పుడు;
విలయ = ప్రళయ; సమయ = కాలమున; సమ = మిక్కిలి; ఉత్కటన్ = చెలరేగిన; విపుల = పెద్ద, విస్తారమైన; చండ = భయంకరమైన; వాత = పెనుగాలులచే; ధూత = ఎగురుతున్న; ఊర్మి = పెను అలల; జాల = సమూహములతో; దుర్వార = వారింపరాని; వార్థిన్ = మహాసముద్రమున; భువనములు = లోకములను; ముంచున్ = ముంచును; ఆ = ఆ; మూడు = మూడు (3); భువనములను = లోకములను; తత్ = ఆ; పయోరాశి = సముద్రము {పయోరాశి - పయస్(నీటి)ని రాశిపోసినది, మహాసముద్రము}; మీద = పైన; పద్మావిభుండు = విష్ణుమూర్తి {పద్మావిభుడు - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}.
భావము:- ఆ బ్రహ్మదేవుని రాత్రి సమయంలో మూడు లోకాలూ సూర్యచంద్రులతోపాటు కటిక చీకటితో కప్పబడి ఉంటాయి. సర్వాత్ముడైన విష్ణుదేవుని శక్తిరూపమైన సంకర్షణాగ్ని విజృంభిస్తుంది. ఆ అగ్ని జ్వాలలు ముల్లోకాలను దహించివేస్తాయి. తీక్షణమైన ఆ మంటల వేడికి తట్టుకోలేక తపించి మహర్లోక వాసులు జన లోకానికి వెళతారు. అప్పుడు ఆ ప్రళయకాలంలో భయంకరంగా ప్రచండ వాయువులు వీస్తాయి. ఆ వాయువుల వేగానికి ఉత్తుంగతరంగాలతో ఉప్పొంగిన మహాసముద్ర జలాలు మూడు జగాలనూ ముంచి వేస్తాయి. ఆ మహాసముద్ర మధ్యంలో రమాపతి, శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు.

తెభా-3-356-ఉ.
చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూ మృణాళహార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సా నిభాంగ శోభిత భుజంగమతల్పము నందు యోగని
ద్రాతిఁ జెంది యుండు జఠస్థిత భూర్భువరాది లోకుఁ డై.

టీక:- చారు = అందమైన; పటీర = చందనము, మంచిగంధము; హీర = వజ్రము; ఘనసార = కర్పూరము; తుషార = మంచు బిందువులు; మరాళ = హంస; చంద్రికాపూర = నిండు వెన్నెల; మృణాళ = తామరతూడు; హార = (ముత్యాల) హారము; పరిపూర్ణ = నిండుపున్నమి నాటి; సుధాకర = చంద్రుడు; కాశ = రెల్లుపువ్వు; మల్లికా = మల్లెపూల; సార = సారము; నిభ = సాటిరాగల; అంగ = శరీరముతో; శోభిత = శోభించుచున్న; భుజంగమ = పెద్దసర్పము అను (ఆదిశేషుడు); తల్పమున్ = పాన్పు; అందున్ = పైన; యోగనిద్రా = యోగనిద్ర యందు; రతిన్ = ఆసక్తిని; చెంది = పొంది; ఉండున్ = ఉండును; జఠర = ఉదరమున; స్థిత = ఉన్నట్టి; భూర్భువరాదిలోకుండు = ముల్లోకములును ధరించినవాడు {భూర్భువరాది - భూ భువర్ సువర్ లోకములు మూడు}; ఐ = అయి.
భావము:- అందమైన మంచిగంధలాగా, వజ్రంలాగ, కర్పూరంలాగ, మంచు బిందువులు లాగా, హంసలాగా, నిండు వెన్నెలలాగా, తామరతూడులాగా, ముత్యాలహారంలాగ, పున్నమ నాటి చందమామలాగా, రెల్లుపూవులాగా, మల్లెమొగ్గలాగ, తెల్లని కాంతులు విరిసే శేషశయ్య మీద, యోగనిద్రా ముద్రితుడై, చల్లగా శయనించి ఉన్న ఆ నల్లనయ్య ఉదరంలో భూ భువర్ సువర్ మున్నగు సహా ఎల్ల లోకాలూ విలసిల్లుతుంటాయి.

తెభా-3-357-క.
లోక నివాసకు ల
ర్థిని వినుతింపంగ నతుల దివ్యప్రభచేఁ
రుచు మీలిత నిజలో
నుఁడై వసియించు నతఁడు ముచితలీలన్.

టీక:- జనలోక = జనలోకమున; నివాసకులు = నివసించువారు; అర్థిన్ = కోరి; వినుతింపగన్ = స్తుతింపగా; అతుల = సాటిలేని; దివ్య = దివ్యమైన; ప్రభ = ప్రకాశము; చేనే = చే; తనరుచున్ = అతిశయించుచు; మీలిత = మూసిన; నిజ = స్వంత; లోచనుడు = కన్నులు కలవాడు; ఐ = అయి; వసియించున్ = నివసించును; అతడు = అతడు (నారాయణుడు); సముచిత = తగిన; లీలన్ = విధముగ.
భావము:- జనలోక నివాసులైన పుణ్యాత్ములు ఎన్నో విధాల స్తుతిస్తుండగా, సాటిలేని దివ్యమైన వెలుగులు వెదజల్లుతూ, శేషతల్పంమీద కన్నులు మోడ్చి స్వామి చక్కగా శయనించి ఉంటాడు.

తెభా-3-358-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధమున.
భావము:- ఈవిధంగా

తెభా-3-359-సీ.
కైకొని బహువిధ కాలగత్యుపలక్షి-
ము లై యహోరాత్ర తులు జరగ
తవత్సరంబులు నులకుఁ బరమాయు-
వైన రీతిని బంకజాసనునకుఁ
రమాయు వగు శతాబ్దంబు లందుల సగ-
రిగిన నదియ పరార్ధ మండ్రు
గాన పూర్వార్ధంబు డచుటఁ జేసి ద్వి-
తీయపరార్ధంబు దీని పేరు

తెభా-3-359.1-తే.
డఁగి పూర్వపరార్ధాది కాల మందు
బ్రహ్మకల్పాఖ్య నెంతయుఁ రఁగు నందు
బ్రహ్మ యుదయించుటం జేసి బ్రహ్మకల్ప
నియు శబ్దాత్మకబ్రహ్మ నియు నెగడె.

టీక:- కైకొని = పూనుకొని; బహు = అనేక; విధ = విధములైన; కాల = కాలముయొక్క; గతిన్ = గమనమును; ఉపలక్షితములు = ఎదురుచూచునవి; ఐ = అయ్యి; అహోరాత్ర = రాత్రింబవళ్ళ; తతులు = అనేకము; జరగన్ = జరగగా; శత = నూరు (100); వత్సరంబులు = సంవత్సరములు; జనుల = మానవుల; కున్ = కు; పరమాయువు = జీవితకాలము; ఐన = అయిన; రీతిన్ = విధముగను; పంకజాసనున్ = బ్రహ్మదేవుని {పంకజాసనుడు - పంకజము (పద్మము)న ఆసీనుడు (ఉన్నవాడు), బ్రహ్మదేవుడు}; కున్ = కును; పరమాయువు = జీవితకాలము; అగు = అయిన; శత = నూరు (100); అబ్దంబులన్ = (బ్రహ్మ) సంవత్సరములు; అందులన్ = అందులో; సగము = సగము (1/2); అరిగినన్ = జరిగిన; అదియ = అదే; పరార్ధము = పరార్ధము; అండ్రున్ = అందురు; కాన = కావున; పూర్వ = మొదటి; అర్ధము = సగము (1/2); కడచుటన్ = గడచిపోవుట; చేసి = వలన; ద్వితీయపరార్ధంబున్ = ద్వితీయపరార్ధము; దీని = దీని; పేరు = పేరు;
కడగి = విజృంభించి; పూర్వపరార్ధ = పూర్వపరార్ధ ముతో; ఆది = మొదలగు; కాలము = కాలము; అందున్ = అందు; బ్రహ్మకల్ప = బ్రహ్మకల్పము; ఆఖ్యాతన్ = పేరుతో; ఎంతయున్ = ఎంతో; పరగున్ = ప్రసిద్ధమగును; అందున్ = అందులో; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఉదయించుటన్ = పుట్టుట; చేసి = వలన; బ్రహ్మకల్పము = బ్రహ్మకల్పము; అనియున్ = అనియును; శబ్దాత్మకబ్రహ్మము = శబ్దాత్మకబ్రహ్మము; అనియన్ = అనియును; నెగడెన్ = వర్థిల్లెను.
భావము:- ఈవిధంగా అనేక విధాలైన కాలగమనాలతో కూడిన, పగళ్ళు రాత్రులు గడిచిపోతుంటాయి. మానవుల ఆయుఃప్రమాణం వంద సంవత్సరాలు. అలాగే బ్రహ్మదేవుని ఆయుఃప్రమాణం కూడా నూరు బ్రహ్మ సంవత్సరాలే. ఆ నూరు సంవత్సరాల మొదటి సగాన్ని పూర్వపరార్ధం అని; రెండవ సగాన్ని ద్వితీయపరార్ధ మని అంటారు. ఇలాంటి పూర్వపరార్ధం కాలం బ్రహ్మకల్పం అన్నారు. దీనినే శబ్ధబ్రహ్మం అని కూడా అంటారు.

తెభా-3-360-క.
విను మెన్నఁడు పంకజనా
భుని నాభీసరసి యందు భువనాశ్రయ మై
రిన పద్మము వొడవడు
ఘా యది పద్మకల్ప న విలసిల్లున్.

టీక:- వినుము = వినుము; ఎన్నడున్ = ఎన్నడైతే; పంకజనాభుని = విష్ణుని {పంకజనాభుడు - పంకజము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు}; నాభీ = నాభి అను; సరసిన్ = సరస్సున; అందున్ = లో; భువన = సకల లోకములకు; ఆశ్రయము = ఆశ్రయుంచుటకు స్థానము; ఐ = అయి; తనరినన్ = విలసిల్లిన; పద్మము = పద్మము; పొడవడున్ = పుట్టుతుందో అప్పుడు; అనఘా = పుణ్యుడా; అది = అది; పద్మకల్పము = పద్మకల్పము; అనన్ = అనగా; విలసిల్లున్ = విలసిల్లును.
భావము:- విదురుడా! వినవయ్యా! లోకాలు అన్నింటికీ ఆశ్రయమై ఉండే పద్మం, పద్మనాభుడు నారాయణుని నాభి అనే సరస్సునుంచి, ఉద్భవించిన ఆ సమయం పద్మకల్పంగా ప్రసిద్ధికెక్కింది.

తెభా-3-361-వ.
పూర్వార్ధాదినిం గలిగిన బ్రహ్మకల్పంబుఁ జెప్పితి; ఇంక ద్వితీయ పరార్ధంబు మొదల నెన్నఁ డేని హరి సూకరాకారంబు దాల్చె నది వరాహకల్పం బనం దగు; అట్టి వరాహకల్పం బిపుడు వర్తమానం బగుచున్నది; వెండియు.
టీక:- పూర్వార్థ = పూర్వార్థము యొక్క; ఆదినిన్ = మొదటి కాలమున; కలిగినన్ = ఏర్పడిన; బ్రహ్మకల్పంబున్ = బ్రహ్మకల్పమును; చెప్పితిన్ = చెప్పతిని; ఇంక = ఇంక; ద్వితీయపరార్థంబున్ = ద్వితీయపరార్థమును; మొదలన్ = మొదటగా; ఎన్నడున్ = ఏనాడు; ఏనిన్ = అయితే; హరి = విష్ణుమూర్తి; సూకర = (ఆది) వరాహము {సూకరము - వరాహము, పంది}; ఆకారంబున్ = ఆకారమును, అవతారమును; తాల్చెన్ = ధరించెనో, అవతరించెనో; అది = అది; వరాహకల్పంబున్ = వరాహకల్పము; అనన్ = అనుటకు; తగున్ = తగును; అట్టి = అటువంటి; వరాహకల్పంబున్ = వరాహకల్పము; ఇపుడు = ఇప్పుడు; వర్తమానంబునన్ = వర్తమానకాలమున; అగుచున్ = జరుగుతూ; ఉన్నది = ఉన్నది; వెండియున్ = ఇంకనూ.
భావము:- పూర్వపరార్ధం ఆది లోని బ్రహ్మ కల్పాన్ని గూర్చి చెప్పాను విన్నావు కదా; ఇక ద్వితీయపరార్ధం సంగతి విను. ఈ ద్వితీయపరార్ధం మొదట్లో హరి వరాహ రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడో అది వరాహకల్పం అంటారు. అటువంటి వరాహకల్పం ఇప్పుడు జరుగుతూ ఉంది.

తెభా-3-362-సీ.
దీపింపఁ గాలస్వరూపుఁ డైనట్టి ప-
ద్మాక్షుఁ డనంతుఁ డనాదిపురుషుఁ
ఖిలవిశ్వాత్మకుఁ గు నీశునకుఁ బర-
మాణ్వాది యుగపరార్ధాంత మగుచు
రుగు నీ కాలంబు ర్చింప నొక్క ని-
మేష కాలం బయి మెలఁగుచుండుఁ
గాని యీశ్వరునకుఁ ర్త గాఁజాల ది-
క్కాలంబు విను మది గాక దేహ

తెభా-3-362.1-తే.
మందిరార్థాది కర్మాభిమానశీలు
రైనవారికి నాశ్రయం గుటఁజేసి
రయ హరి తద్గుణవ్యతిరుఁడు గాన
కాల మమ్మేటి కెన్నఁడు ర్తగాదు.

టీక:- దీపింపన్ = ప్రకాశిస్తున్నట్టి; కాల = కాలము యొక్క; స్వరూపుడు = స్వరూపము కలవాడు; ఐనట్టి = అయినట్టి; పద్మాక్షుడు = విష్ణుమూర్తి {పద్మాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు - అనంతమే స్వరూపమైన వాడు, విష్ణువు}; అనాదిపురుషుడు = విష్ణుమూర్తి {అనాదిపురుషుడు - అనాది (అత్యంతఆది) నుండి ఉన్న పురుషుడు, విష్ణువు}; అఖిలవిశ్వాత్మకుడు = విష్ణుమూర్తి {అఖిలవిశ్వాత్మకుడు - సమస్తమైన భువనములకు ఆత్మయైనవాడు, విష్ణువు}; అగున్ = అయిన; ఈశున్ = విష్ణుమూర్తి {ఈశుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; కున్ = కి; పరమాణువు = పరమాణువు; ఆది = మొదలగు; యుగ = యుగములు; పరార్దమున్ = పరార్దములు; అగుచున్ = అవుతూ; జరుగు = జరిగే; ఈ = ఈ; కాలంబున్ = కాలమును; చర్చింపన్ = ఆలోచిస్తే; ఒక్క = ఒక; నిమేష = నిమేషము; కాలంబున్ = కాలము; అయి = అయ్యి; మెలగుచున్ = తిరుగుతూ; ఉండున్ = ఉండును; కాని = కాని; ఈశ్వరున్ = విష్ణుని; కున్ = కి; కర్త = కర్త; కాజాలదు = కాలేదు; ఈ = ఈ; కాలంబున్ = కాలము; వినుము = వినుము; అదిగాక = అంతేకాక; దేహ = దేహము; మందిర = గృహములు; అర్థ = ధనము; ఆది = మొదలగు;
కర్మ = కర్మము లందు; అభిమానశీలురు = అభిమాన స్వభావము కలవారు; ఐన = అయిన; వారికిన్ = వారికి; ఆశ్రయంబు = ఆశ్రయము; అగుటన్ = అగుట; చేసి = వలన; అరయన్ = తెలిసికొనిన; హరి = విష్ణువు; తత్ = ఆ; గుణ = గుణములకు; వ్యతికరుడు = వ్యతిరేకత కలవాడు; కాన = కనుక; కాలము = కాలము; ఆ = ఆ; మేటికిన్ = గొప్పవానికి; ఎన్నడున్ = ఎప్పడును; కర్త = కర్త; కాదు = కాదు.
భావము:- కాలస్వరూపుడు అయి ప్రకాశించేవాడూ, కమలాల వంటి కన్నులు గలవాడు, ఆద్యంతాలు లేని మహాపురుషుడు, పురాణపురుషుడు, అఖిల లోకాలకూ ఆత్మ అయినవాడు అయిన పరమేశ్వరునకు, పరమాణువు మొదలుకుని పరార్ధం పర్యంతం గల కాలం ఒక్క నిమేషంతో సమానం అవుతుంది. కనుకనే భగవంతుడే కాలానికి కర్త; కాని కాలం భగవంతునికి కర్త కాదు. అంతేకాక దేహాలూ, గృహాలూ, సంపదలూ, మొదలైన వాటియందు అభిమానం కలవారికి ఆశ్రయమైనది కాలం. భగవంతుడు ఆ గుణాలకు అతీతుడు. అందుకే ఆయన కర్త యై కాలాన్ని నడిపించుతాడు. కానీ ఆయన్ని కాలం నడిపించదు.

తెభా-3-363-వ.
మఱియు షోడశవికారయుక్తంబై పృథివ్యాది పంచభూత పరివృతం బయి దశావరణంబులుగలిగి పంచశత్కోటి విస్తీర్ణంబై బ్రహ్మాండకోశంబు దనర్చుచుండు.
టీక:- మఱియున్ = ఇంకనూ; షోడశ = పదహారు (16) {షోడశవికారములు = ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) }; వికార = మార్పుల; యుక్తంబున్ = కూడినది; ఐ = అయి; పృథివి = పృథివి; ఆది = మొదలగు; పంచభూత = పంచభూతముల {పంచభూతములు - 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము}; పరివృతంబు = ఆవరించినది; అయి = అయి; దశ = పది {దశావరణలు - 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయ 8 జ్ఞానమయ 9 మహత్త్వము 10 ప్రకృతి}; ఆవరణంబులు = ఆవరణలు; కలిగి = కలిగి; పంచశతకోటి = అయిదువందలకోట్ల (500 కోట్లు); విస్తీరణంబున్ = విస్తీర్ణము కలది; ఐ = అయి; బ్రహ్మాండ = బ్రహ్మాండముల; కోశంబున్ = కోశాగారము; తనర్చుచున్ = విలసిల్లుతూ; ఉండున్ = ఉండును.
భావము:- ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) అనే పదహారు వికారములతో కూడి; పృథ్వి జలం వాయువు తేజస్సు ఆకాశం అనే పంచభూతాలతో అవరించబడి; 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయము 8 జ్ఞానమయము 9 మహత్త్వము 10 ప్రకృతి అనే పది విధాలైన ఆవరణలు కలిగి; అయిదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణం కలది అయి బ్రహ్మాండకోశం విరాజిల్లుతుంది.

తెభా-3-364-చ.
రి పరమాణురూపమున నందు వసించి విరాజమానుఁడై
రి వెలుఁగొందు నిమ్ముల నసంఖ్యము లైన మహాండకోశముల్
నెఱిఁ దన యందు డింద నవనీరజనేత్రుఁ డనంతుఁ డాఢ్యుఁ డ
క్షరుఁడు పరాపరుం డఖిలకారణకారణుఁ డప్రమేయుఁ డై.

టీక:- హరి = విష్ణుమూర్తి; పరమాణు = పరమాణువు; రూపమునన్ = రూపములో; అందున్ = దానిలోపల; వసించి = నివసించి; విరాజమానుండు = విలసిల్లుతున్నవాడు; ఐ = అయి; సరి = చక్కగా; వెలుగొందున్ = ప్రకాశించును; నిమ్ములన్ = చక్కగా; అసంఖ్యముల్ = లెక్కించలేనివి; ఐ = అయి; మహాండ = బ్రహ్మాండముల; కోశముల్ = కోశాగారములు; నెఱిన్ = నిండుగా; తన = తన; అందున్ = అందు; డిందన్ = ఇమడిపోగా; నవనీరజనేత్రుడు = విష్ణుమూర్తి {నవనీరజనేత్రుడు - నవ(కొత్త, తాజా) నీరజ (ఫద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు - అనంతమైన స్వరూపముల వాడు, విష్ణువు}; ఆఢ్యుడు = విష్ణుమూర్తి {ఆఢ్యుడు - శ్రేష్ఠమైనవాడు, విష్ణువు}; అక్షరుడు = విష్ణుమూర్తి {అక్షరుడు, క్షరము (నాశనము) లేనివాడు, విష్ణువు}; పరాపరుండు = విష్ణుమూర్తి {పరాపరుడు - పరము (బయట, పైన) ఐనవాటి అన్నిటికన్న పరము యైనవాడు, విష్ణువు}; అఖిలకారణకారణుడు = విష్ణుమూర్తి {అఖిలకారణకారణుడు - సమస్త కారణములకును కారణము యైనవాడు, విష్ణువు}; అప్రమేయుడు = విష్ణుమూర్తి {అప్రమేయుడు - ప్రమేయము (యదార్థముగా ఎరుగబడుట, కలుగజేసు కొనుట) కు అతీతమైన వాడు, విష్ణువు}; ఐ = అయి.
భావము:- లెక్కలేనన్ని మహా బ్రహ్మాండకోశాలు తన ఉదరంలో పదిలపరచుకొని ఉండే పరమేశ్వరుడైన విష్ణువు, పరమాణు రూపంతో ఆ బ్రహ్మాండకోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. తాజాగా వికసించిన కమలాలవంటి కన్నులు గల వాడు, అంతం లేనివాడూ, ఆదిదేవుడూ, అక్షర పరబ్రహ్మమూ అయిన ఆ పరమాత్మ సమస్త కారణాలకూ కారణమైనవాడే అయినప్పటికీ వాటితో ఎటువంటి సంబంధం లేనివాడై ఉంటాడు.

తెభా-3-365-క.
నితిశయోజ్జ్వల తేజ
స్స్ఫుణం దనరారు పరమపురుషుని విష్ణుం
బురుషోత్తము వర్ణింపను
సిజభవ భవులకైన క్యమె? చెపుమా."

టీక:- నిరతిశయ = సాటిలేని; ఉజ్జ్వల = ఉజ్వలమైన; తేజస్ = ప్రకాశము; స్పురణనన్ = స్ఫురించుతూ; తనరారు = అతిశయించు; పరమపురుషుని = విష్ణుని {పరమపురుషుడు - పరమ (అత్యుత్తమ) పురుషుడు, విష్ణువు}; విష్ణున్ = విష్ణుని {విష్ణువు - వ్యాపించువాడ, భగవంతుడు}; పురుషోత్తమున్ = విష్ణుని {పురుషోత్తముడు - పురుషు (కర్త, చేయువాడు) లలో ఉత్తముడు, విష్ణువు}; వర్ణింపను = వర్ణించుటకు; సరసిజభవ = బ్రహ్మదేవుడు {సరసిజభవ - సరసిజ (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; భవులు = శివుడు ల {భవుడు - భావము అనుదానికి కారణభూతుడు, శివుడు}; కున్ = కు; ఐనన్ = అయినప్పటికిని; శక్యమే = శక్యమా ఏమి; చెపుమా = చెప్పుము.
భావము:- సరిపోల్చరానిది అయిన అఖండ అద్భుత తేజస్సుతో విరాజిల్లే ఆ పరమపురుషుణ్ణి, ఆ పరాత్పరుణ్ణి, ఆ మహావిష్ణువును అభివర్ణించడానికి బ్రహ్మదేవునికీ, పరమశివునికీ కూడా సాధ్యం కాదు.”