పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/అర్చిపృథుల జననము


తెభా-4-434-క.
ని వార నపత్యుం డగు
నుజేంద్రుని బాహులంత థియించిన నం
ఘం బగు నొక మిథునము
నియించెను సకల జనులు మ్మద మందన్.

టీక:- కని = చూసి; వారు = వారు; అనపత్యుండు = పిల్లలు లేనివాడు; అగు = అయిన; మనుజేంద్రుని = రాజు యొక్క; బాహులు = భుజములు; అంత = అంతట; మథియించినన్ = మథించగా; అందు = అందులో; అనఘంబు = పవిత్రమైనది; అగు = అయిన; ఒక = ఒక; మిథునము = స్త్రీపురుషుల జంట; జనియించెను = పుట్టినది; సకల = సమస్తమైన; జనులు = వారు; సమ్మదము = సంతోషము; అందన్ = పొందగా.
భావము:- మునులు సంతానహీనుడైన వేనుని హస్తాలను మథించగా ఆ చేతులనుండి ఒక స్త్రీపురుషుల జంట జన్మించింది. అది చూచి సమస్త ప్రజలూ సంతోషించారు.

తెభా-4-435-వ.
అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున నొక్క పురుషుండును హరికి నిత్యానపాయిని యైన లక్ష్మీకళాకలితయు, గుణంబులను భూషణంబులకు నలంకార ప్రదాత్రియు నగు కామినియు జనియించె; అందుఁ బృథుశ్రవుండును బృథుయశుండు నగుట నతండు ‘పృథు చక్రవర్తి’ యనుపేరం ప్రసిద్ధుండయ్యె; అయ్యంగనయు ’నర్చి’ యను నామంబునం దనరుచు నతని వరియించె; నా సమయంబున.
టీక:- అందున్ = దానిలో; లోక = లోకములను; రక్షణ = కాపాడుట; అర్థంబుగా = కోసము; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; అంశంబునన్ = అంశతో; ఒక్క = ఒక; పురుషుండును = మగవాడును; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడును; అనపాయిని = విడిచిపెట్టనిది; ఐన = అయిన; లక్ష్మీ = లక్ష్మీదేవి యొక్క; కళా = అంశతో; కలితయు = కూడినది; గుణంబులు = సుగుణములు; అను = అనెడి; భూషణముల్ = అలంకారముల; కున్ = కు; అలంకార = అలంకార మనెడి లక్షణము; ప్రదాత్రియున్ = కలిగించునది; అగు = అయిన; కామినియు = స్త్రీ; జనియించెన్ = పుట్టినది; అందున్ = వారిలో; పృథు = పెద్ద; శ్రవుండున్ = చెవులు కలవాడును,; పృథు = పెద్ద; యశుండున్ = కీర్తి కలవాడును; అగుటన్ = అగుటచేత; అతండు = అతడు; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; అను = అనెడి; పేరన్ = పేరుతో; ప్రసిద్ధుడు = ఖ్యాతిపొందినవాడు; అయ్యెన్ = ఆయెను; ఆ = ఆ; అంగనయున్ = స్త్రీ; అర్చి = అర్చి; అను = అనెడి; నామంబునన్ = పేరుతో; తనరుచున్ = అతిశయించి; అతని = అతనిని; వరియించెన్ = పెండ్లాడెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.
భావము:- వేనరాజు బాహువులనుండి లోకసంరక్షణార్థం శ్రీమన్నారాయణుని అంశతో ఒక పురుషుడు, ఆయనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశతో ఒక కన్యక ఉదయించారు. ఆ కన్యక సుగుణాలే ఆమెకు సహజ భూషణాలు. ఆమె అలంకారలకే అలంకారం. పెద్ద చెవులు, పెద్ద యశస్సు కల ఆ పురుషుడే పృథు చక్రవర్తి అనే పేరుతో సుప్రసిద్ధు డయ్యాడు. ఆ స్త్రీ పేరు అర్చి. ఆమె పృథు చక్రవర్తిని వరించింది. ఆ సమయంలో…

తెభా-4-436-సీ.
అందంద కురియించి మరులు మునినాథ!-
వితతి మోదం బంద విరులవానఁ;
రమానురక్తి శుంల్లీలఁ జూపట్టె;-
సుపతి వీట నచ్చల యాట;
ర్ణ రసాయన క్రమమున వీతెంచెఁ;-
ర పైన తేట కిన్నరులపాట;
నిమిషకరహతం బై చాలఁ జెలఁగెను;-
వివోత్సవంబు దుందుభిరవంబు;

తెభా-4-436.1-తే.
మునినుతి చెలంగె శిఖి గుండముల వెలింగె
నంత నచటికి సరసీరుహాసనుండు
రుడ గంధర్వ కిన్నర ణముతోడ
ర్థిఁ జనుదెంచె సమ్మోద తిశయిల్ల.

టీక:- అందంద = అక్కడక్కడ; కురియించిరి = కురుపించిరి; అమరుల్ = దేవతలు; ముని = మునులలో; నాథ = గొప్పవారి; వితతి = సమూహము; మోదంబున్ = సంతోషమును; అందన్ = పొందగా; విరుల = పూల; వానన్ = వాన; పరమ = మిక్కిలి; అనురక్తిన్ = ఆదరముతో; శుంభత్ = తీరైన; లీలన్ = విధముగ; చూపట్టెన్ = కనబడెను; సురపతివీటన్ = అమరావతిలో {సురపతివీడు - సురపతి (ఇంద్రుడు) యొక్క వీడు (పట్టణము), అమరావతి}; అచ్చరల = అప్సరసల; ఆట = నాట్యము; కర్ణ = చెవులకు; రసాయన = ఇంపైన; క్రమమున = విధముగ; వీతెంచెన్ = వినబడెను; బరపైన = చిక్కటి; తేట = నిర్మలమైన; కిన్నరుల = కిన్నరుల; పాట = పాట; అనిమిష = దేవతల యొక్క {అనిమిషులు - రెప్పపాటులేనివారు, దేవతలు}; కర = చేతులచే; హతంబు = కొట్టబడినవి; ఐ = అయ్యి; చాలన్ = మిక్కిలి; చెలగెన్ = చెలరేగెను; విభవ = వైభవములు; ఉత్సవంబున్ = ఉత్సవములు; దుందుభి = భేరీల; రవంబున్ = శబ్దములు.
ముని = మునుల; నుతి = స్తోత్రములు; చెలంగె = చెలరేగెను; శిఖి = అగ్నులు; గుండములన్ = హోమగుండములందు; వెలింగెన్ = ప్రకాశించెను; అంతన్ = అంతట; అచటికిన్ = అక్కడకి; సరసీరుహాసనుండు = బ్రహ్మదేవుడు {సరసీరుహాసనుడు - సరసీరుహము (పద్మము)న ఆసీనుడు (కూర్చుండువాడు), బ్రహ్మదేవుడు}; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరల; గణము = సమూహము; తోడన్ = తోటి; అర్థిన్ = కోరి; చనుదెంచెన్ = వచ్చెను; సమ్మోదము = సంతోషము; అతిశయిల్ల = అతిశయించగా.
భావము:- దేవతలు పూలవాన కురిపించారు. మునులు సంతోషించారు. స్వర్గంలో అప్సరసలు కనుల విందుగా నాట్యం చేశారు. కిన్నరులు వీనుల విందుగా గానం చేశారు. దేవ దుందుభి ధ్వనులు చెలరేగాయి. మునులు సన్నుతించారు. అగ్నిహోత్రాలు హోమకుండాలలో బాగా వెలిగాయి. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు గరుడ గంధర్వ కిన్నరులతో వేంచేసాడు.

తెభా-4-437-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అప్పుడు…

తెభా-4-438-కవి.
యఁగ వైన్యుని దక్షిణహస్తము నందు రమారమణీసుమనో
రులలితాయుధచిహ్నము లంఘ్రుల యందు సమగ్రహలాంకుశభా
స్వ కులిశధ్వజ చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు వి
స్ఫుగతి నొప్పఁ బితామహముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్.

టీక:- అరయగన్ = పరిశీలించిన; వైన్యుని = పృథుచక్రవర్తి {వైన్యుడు - వేనుని కొడుకు, పృథుడు}; దక్షిణ = కుడి; హస్తము = అరచేతి; అందున్ = లో; రమారమణీసుమనోహరు = విష్ణుమూర్తి {రమా రమణీ సుమనోహరుడు - రమారమణి (లక్ష్మీదేవి) సుమనోహరుడు (భర్త), విష్ణువు}; లలిత = సుందరమైన; ఆయుధ = ఆయుధముల; చిహ్నములు = గుర్తులు; అంఘ్రులు = పాదముల; అందున్ = లో; సమగ్ర = సంపూర్ణమైన; హల = నాగలి; అంకుశ = అంకుశము; భాస్వర = ప్రకాశమానమైన; కులిశ = వజ్రము; ధ్వజ = ధ్వజము, జెండా; చాప = ధనుస్సు; సరోరుహ = పద్మము; శంఖ = శంఖము లతో; విరాజిత = విలసిల్లిన; రేఖలున్ = రేఖలును; విస్ఫుర = స్పష్టమైన; గతిన్ = విధముగ; ఒప్పన్ = ఒప్పియుండగ; పితామహ = బ్రహ్మదేవుడు; ముఖ్యులు = మొదలగువారు; చూచి = చూసి; సవిస్మయులు = ఆశ్చర్యము కలవారు; ఐరి = అయిరి; తగన్ = అవశ్యము.
భావము:- బ్రహ్మాది దేవతలు పృథుని కుడిచేతిలో విష్ణుదేవుని ఆయుధమైన చక్ర చిహ్నం, పాదాలలో హలం, అంకుశం, వజ్రం, ధ్వజం, ధనుస్సు, పద్మం, శంఖం మొదలైనవాటి రేఖలు విరాజిల్లుతూ ఉండడం చూచి ఎంతో ఆశ్చర్యపడ్డారు.

తెభా-4-439-వ.
ఇతండు నారాయణాంశ సంభూతుండు నితని యంగన రమాంశ సంభూతయుం గానోపుదు; రని తలంచి యయ్యవసరంబున బ్రహ్మవాదు లగు బ్రాహ్మణోత్తము లతనికి విధ్యుక్తప్రకారంబున రాజ్యాభిషేకంబు గావించిరి; తదనంతరంబ.
టీక:- ఇతండు = ఇతడు; నారాయణ = విష్ణుని; అంశ = అంశతో; సంభూతుండున్ = చక్కగ పుట్టిన వాడు; ఇతనిన్ = ఇతని; అంగన = భార్య; రమ = లక్ష్మీదేవి యొక్క; అంశ = అంశతో; సంభూతయున్ = చక్కగ పుట్టినామె; కానోపుదురు = అయ్యుంటారు; అని = అని; తలంచి = అనుకొని; ఆ = ఆ; అవసరంబున = సమయమున; బ్రహ్మవాదులు = వేదధర్మ మందు నిష్ఠ కలవారు; అగు = అయిన; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; ఉత్తములు = ఉత్తములు; అతని = అతని; కిన్ = కి; విధి = వేదవిధులలో; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబునన్ = విధముగ; రాజ్యాభిషేకంబున్ = రాజ్యమునకు పట్టాభిషేకము; కావించిరి = చేసిరి; తదనంతరంబ = తరువాత.
భావము:- ‘ఈ పృథువు నారాయణాంశతో, ఇతని భార్య లక్ష్మీదేవి అంశతో జన్మించారు కాబోలు’ అని భావించారు. అప్పుడు బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణోత్తములు పృథువుకు యథాశాస్త్రంగా రాజ్యాభిషేకం చేశారు. ఆ తరువాత…

తెభా-4-440-క.
రిదంభోనిధి ఖగ మృగ
ణీ సురవర్త్మ పర్వప్రముఖములై
రఁగిన భూతశ్రేణులు
వరునకుఁ దగ నుపాయము లిచ్చె నొగిన్.

టీక:- సరిత్ = నదులు; అంభోనిధి = సముద్రము; ఖగ = పక్షులు; మృగ = జంతువులు; ధరణి = భూమి; సురవర్త్మ = ఆకాశము {సురవర్తము - దేవతలు తిరుగునది, ఆకాశము}; పర్వత = కొండలు, పర్వతములు; ప్రముఖములు = మొదలగునవి; ఐ = అయ్యి; పరగిన = ప్రసిద్ధపొందిన; భూత = సమస్త భూతముల; శ్రేణులు = సమూహములు; నరవరున్ = రాజు; కున్ = కి; తగన్ = తగినట్లు; ఉపాయనములు = కానుకలు; ఇచ్చెన్ = ఇచ్చెను; ఒగిన్ = వరసగా.
భావము:- నదులు, సముద్రాలు, పక్షులు, మృగాలు, భూమి, ఆకాశం, పర్వతాలు మొదలైన సర్వభూతాలు పృథు మహారాజుకు చక్కని కానుకలు సమర్పించాయి.

తెభా-4-441-తే.
మధికఖ్యాతి నా పృథుక్రవర్తి
దేవి యగు నర్చితోఁ గూడ దివ్యవస్త్ర
గంధ మాల్య విభూషణ లితుఁ డగుచుఁ
బావకుఁడుఁ బోలె సత్ప్రభాభాసి యయ్యె.

టీక:- సమధిక = బహు మిక్కిలి; ఖ్యాతిన్ = కీర్తితో; ఆ = ఆ; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; దేవి = భార్య; అగు = అయిన; అర్చి = అర్చి; తోన్ = తో; కూడ = కలిసి; దివ్య = దివ్యమైన; వస్త్ర = వస్త్రములు; గంధ = సువాసనగల; మాల్య = మాలలుతో; విభూషణ = చక్కటి యలంకారములతో; కలితుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; పావకుండున్ = అగ్నిదేవుని; పోలెన్ = వలె; సత్ = మంచి; ప్రభా = కాంతితో; భాసి = ప్రకాశిస్తున్నవాడు; అయ్యె = అయ్యెను.
భావము:- పృథు చక్రవర్తి, అతని దేవేరి అయిన అర్చి దివ్య వస్త్రాలు కట్టుకున్నారు. తావులు వెదజల్లే పుష్పమాలికలు తాల్చారు. భూషణాలు ధరించారు. అర్చితో కూడిన పృథువు ప్రభతో కూడిన అగ్నివలె ప్రకాశించాడు.

తెభా-4-442-సీ.
రాజరాజా పృథురాజుకు హేమమ-
యంబైన వీరవరాసనంబు
లపతి జలకణ స్రావకం బగు పూర్ణ-
చంద్ర సన్నిభ సితచ్ఛత్రము మఱి
వమానుఁ డమలశోన మగు వాలవ్య-
న సమంచిత సితచామరములు
ర్ముండు నిర్మలోద్యత్కీర్తిమయ మగు-
హనీయ నవ పుష్ప మాలికయును

తెభా-4-442.1-తే.
జంభవైరి కిరీటంబు మనుఁ డఖిల
న నియామక దండంబు లజభవుఁడు
నిగమమయ కవచంబు వాణీలలామ
స్వచ్ఛ మగు నవ్యహార మొసఁగిరి మఱియు.

టీక:- రాజరాజు = కుబేరుడు {రాజరాజు - రాజ (వైభవములకు) రాజు అధిపతి, కుబేరుడు}; పృథురాజు = పృథుచక్రవర్తి; కున్ = కు; హేమ = బంగారముతో; మయంబు = నిండినది; ఐన = అయిన; వీర = వీరులలో; వర = ఉత్తముల; ఆసనంబు = ఆసనము; జలపతి = వరణుడు {జలపతి - నీటికి అధిపతి, వరుణుడు}; జల = నీటి; కణ = కణములచే; అస్రావకంబు = చెమర్చనిది; అగు = అయిన; పూర్ణ = నిండు; చంద్ర = చంద్రబింబముతో; సన్నిభ = సమానమైన; సిత = తెల్లని; ఛత్రము = గొడుగు; పవమానుడు = వాయుదేవుడు; అమల = స్వచ్ఛమైన; శోభనము = శోభకలిగినది; అగు = అయిన; వాల = చమరీమృగము యొక్క; వ్యజన = తోకకుచ్చుతో; సమంచిత = చక్కగకూర్చిన; సిత = తెల్లని; చామరములు = వింజామరములు; ధర్ముండు = ధర్ముడు; నిర్మల = స్వచ్ఛమైన; ఉద్యత్ = ఉన్నతమైన; కీర్తి = ప్రకాశముతో; మయము = నిండినది; అగు = అయిన; మహనీయ = గొప్ప; నవ = నవనవలాడుతున్న, తాజా; పుష్ప = పూల; మాలికయును = మాల.
జంభవైరి = ఇంద్రుడు {జంభవైరి - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు}; కిరీటంబున్ = కిరీటము; శమనుడు = యముడు {శమనుడు - శమన (చీకటి)లోకమునకు అధిపతి, యముడు}; అఖిల = సమస్తమైన; జన = జనులను; నియామక = నియమించెడి; దండంబున్ = దండమును; జలజభవుడు = బ్రహ్మదేవుడు {జలజభవుడు - జలజ (పద్మమున) భవుడు (పుట్టివాడు), బ్రహ్మదేవుడు}; నిగమ = వేదములతో; మయ = నిర్మింపబడిన; కవచంబున్ = కవచము; వాణీలలామ = సరస్వతీదేవి {వాణీలలామ - వాణి (వాక్కునకు దేవి) అనెడి లలామ (ఉత్తమ స్త్రీ), సరస్వతీదేవి}; స్వచ్ఛము = నిర్మలమైనది; అగు = అయిన; నవ్య = కొంగ్రొత్త; హారము = ముత్యాలదండ; ఒసిగిరి = ఇచ్చిరి; మఱియు = ఇంకా.
భావము:- పృథు చక్రవర్తికి కుబేరుడు బంగారు సింహాసనం ఇచ్చాడు. వరుణదేవుడు పూర్ణచంద్రునివలె ప్రకాశించే చల్లని వెల్లగొడుగు ఇచ్చాడు. వాయుదేవుడు స్వచ్ఛమైన తెల్లని వింజామరలను, ధర్మదేవత విశాల యశోరూపమైన పుష్పమాలికను, ఇంద్రుడు కిరీటాన్ని, యముడు రాజదండాన్ని, బ్రహ్మదేవుడు వేదమయ కవచాన్ని, సరస్వతీ దేవి క్రొంగ్రొత్త ముత్యాల హారాన్ని బహూకరించారు.

తెభా-4-443-సీ.
దామోదరుండు సుర్శన చక్రంబు-
వ్యాహతైశ్వర్య బ్జపాణి
చంద్రార్ధధరుఁ డర్థచంద్ర రేఖాంకిత-
మనీయ కోశసంలిత ఖడ్గ
మంబిక శతచంద్ర ను ఫలకముఁ జంద్రు-
డుమృతమయ శ్వేతచయంబుఁ
ద్వష్ట రూపాశ్ర యోదాత్త రథంబును-
భానుండు ఘృణిమయ బాణములును

తెభా-4-443.1-తే.
శిఖియు నజగోవిషాణ సంచిత మహాజ
వ మనందగు చాపంబు వనిదేవి
యోగమయమైన పాదుకాయుగము గగన
రులు గీతంబు లిచ్చిరి సంతసమున.

టీక:- దామోదరుండు = విష్ణుమూర్తి {దామోదరుడు - దామము (పద్మము) ఉదరుడు (ఉదరమునకలవాడు), విష్ణుమూర్తి}; సుదర్శన = సుదర్శనము అనెడి; చక్రంబున్ = చక్రాయుధము; అవ్యాహత = తిరుగులేని; ఐశ్వర్యము = సంపదలను; అబ్జపాణి = లక్ష్మీదేవి {అబ్జపాణి - పద్మమును చేత ధరించినామె, లక్ష్మీదేవి}; చంద్రార్థధరుడు = శివుడు {చంద్రార్థధరుడు - అర్థచంద్రుని ధరించువాడు, శివుడు}; చంద్రరేఖ = చంద్రవంక; అంకిత = అలంకరించిన; కమనీయ = అందమైన; కోశ = ఒరతో; కలిత = కూడిన; ఖడ్గము = కత్తి; అంబిక = పార్వతీదేవి; శతచంద్రము = శతచంద్రము {శతచంద్రము - నూరుగురు చంద్రుళ్ళుకలది, ఒక డాలు పేరు}; అను = అనెడి; ఫలకము = డాలు; చంద్రుడు = చంద్రుడు; అమృత = అమృతము (అంతులేని శక్తి); మయ = నిండిన; శ్వేత = తెల్లని; హయ = గుఱ్ఱముల; చయంబున్ = సమూహమును; త్వష్ట = విశ్వకర్మ {త్వష్ట - విశ్వకర్మ, ద్వాదశాదిత్యులలోనొకడు}; రూప = రూపము, అందము; ఆశ్రయ = ఆశ్రయించిన, కలిగిన; ఉదాత్త = గొప్ప; రథంబును = రథము; భానుండు = సూర్యుడు; ఘృణి = వెలుగులు; మయ = నిండిన; బాణములును = బాణములు.
శిఖియును = అగ్నిదేవుడు; అజ = గొఱ్ఱె; గో = ఎద్దుల; విషాణ = కొమ్ములతో; సమంచిత = చక్కగాకూర్చిన; మహాజగవము = మహాజగవము; అనన్ = అనుటకు; తగు = తగిన; చాపంబున్ = విల్లు; అవనిదేవి = భూదేవి; యోగమయము = యోగమయము; ఐన = అయిన; పాదుకా = పాదుకల, కాలిజోళ్ళ; యుగమున్ = జంట; గగనచరులు = ఖేచరులు; గీతంబులు = గీతములు; ఇచ్చిరి = ఇచ్చిరి; సంతసమున = సంతోషముతో.
భావము:- విష్ణువు సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి తరిగిపోని సంపదను, పరమేశ్వరుడు అర్ధచంద్రాకారం గల ఒరతో కూడిన కరవాలాన్ని, పార్వతీదేవి శతచంద్రం అనే డాలును, చంద్రుడు అమృతమయాలైన తెల్లని గుఱ్ఱాలను, త్వష్ట అందమైన వెండి రథాన్ని, సూర్యుడు వెలుగులు వెదజల్లే బాణాలను, అగ్ని అజగవం అనే ధనుస్సును, భూదేవి యోగమయాలైన పాదుకలను బహూకరించారు. దేవతలు యశోగీతాలను సంతోషంతో సమర్పించారు.

తెభా-4-444-వ.
వెండియుం; బ్రతిదివసంబు నాకాశంబు పుష్పంబులు గురియింప మహర్షులు సత్యంబులైన యాశీర్వచనంబులు సలుప సముద్రుండు శంఖంబును, నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబు నొసంగెఁ; దదనంతరంబ సూత మాగధ వంది జనంబులు దన్ను నుతియించినం బ్రతాపశాలి యగు నవ్వైన్యుండు మందస్మిత సుందర వదనారవిందుండై చతుర వచనుం డగుచు మేఘగంభీర భాషణంబుల వారల కిట్లనియె.
టీక:- వెండియున్ = ఇంకను; ప్రతి = ప్రతీ ఒక్క; దివసంబున్ = దినమును; ఆకాశంబు = ఆకాశము; పుష్పంబులు = పూలను; కురియింప = కురిపిస్తుండగ; మహ = గొప్ప; ఋషులు = ఋషులు; సత్యంబులు = చక్కటివి; ఐన = అయిన; ఆశీర్వచనంబులు = ఆశీర్వాదములు; సలుప = చేస్తుండగ; సముద్రుండు = సముద్రుడు; శంఖంబును = శంఖము; నదంబులు = పడమటికి ప్రవహించడి నదులు; పర్వతంబులు = పర్వతములు; నదులును = తూర్పుకి ప్రవహించెడి నదులు; రథ = రథము వెళ్ళుటకు; మార్గంబున్ = దారి; ఒసంగెన్ = ఇచ్చెను; తదనంతరంబ = తరువాత; సూత = సూతులు; మాగధ = మాగధులు; వంది = వంది; జనంబులు = జనులు; తన్ను = తనను; నుతియించినన్ = స్తోత్రముచేయగ; ప్రతాపశాలి = శౌర్యవంతుడు; అగు = అయిన; వైన్యుండు = పృథుచక్రవర్తి {వైన్యుడు - వేనునికొడుకు, పృథుడు}; మందస్మిత = చిరునవ్వుతో కూడిన; సుందర = అందమైన; వదన = ముఖము అనెడి; అరవిందుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; చతుర = నేర్పుతో కూడిన; వచనుండు = మాటలు కలవాడు; అగుచున్ = అవుతూ; మేఘ = మేఘముల వలె; గంభీర = గంభీరమైన; భాషణంబులు = మాటలతో; వారల్ = వారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకా ఆకాశం ప్రతిదినమూ పృథు చక్రవర్తిపై పూలవాన కురిపించింది. మహర్షులు అమోఘమైన ఆశీర్వాదాలు చేశారు. సముద్రుడు శంఖాన్ని కానుకగా ఇచ్చాడు. నదీనదాలు, పర్వతాలు పృథు చక్రవర్తి రథానికి మార్గం ఇచ్చాయి. అనంతరం వందిమాగధులు, సూతులు ప్రతాపవంతుడైన పృథు చక్రవర్తిని పరిపరి విధాల ప్రస్తుతించారు. పృథువు వారి స్తోత్ర పాఠాలను ఆలకించి చిరునవ్వు నవ్వుతూ మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరంతో వారితో ఇలా పలికాడు.

తెభా-4-445-సీ.
వందిమాగధ సూతరులార! నా యందుఁ-
మనీయగుణములు లిగెనేని
ర్హంబు నుతిచేయ; వి లేవు నా యందు-
ది గాన మీ నుతి వ్యర్థ మయ్యె;
నిటమీఁద గుణముల నేపారి యుండిన-
పుడు నుతించెద గుట మీరు
భ్యనియుక్తులై తురత నుత్తమ-
శ్లోకుని గుణము లస్తోకభూప్ర

తెభా-4-445.1-తే.
సిద్ధములు గాన సన్నుతి చేయుఁ డజుని
తని బహువిధ భావంబు భినుతింప
లవి గాకయె యండుదు; దియుఁ గాక;
తుర మతులార! మాగధ నములార!

టీక:- వంది = వంది; మాగధ = మాగధులు; సూత = సూతులు యందు; వరులారా = ఉత్తములారా; నా = నా; అందున్ = అందు; కమనీయ = చూడదగ్గ; గుణములు = సుగుణములు; కలిగినేని = ఉంటే; అర్హంబున్ = తగును; నుతిచేయన్ = స్తోత్రముచేయగ; అవి = అవి; లేవు = లేవు; నా = నా; అందున్ = అందు; అదిగాన = అందుచేత; మీ = మీ యొక్క; నుతి = స్తోత్రము; వ్యర్థము = పనికిరానిది; అయ్యె = అయినది; ఇటమీద = ఇకపై; గుణములన్ = సుగుణములు; ఏపారి = అతిశయించి; ఉండిన = ఉన్నచో; అపుడు = అప్పుడు; నుతించెదరు = స్తుతించెదరు; అగుటన్ = ఉండుటను; మీరు = మీరు; సభ్య = సభలోనివారిచేత; నియుక్తులు = నియమింపబడినవారు; ఐ = అయ్యి; చతురతన్ = చమత్కారములతో; ఉత్తమశ్లోకుని = విష్ణుమూర్తి యొక్క {ఉత్తమశ్లోకుడు - ఉత్తములచే కీర్తింపబడువాడు, విష్ణువు}; గుణములన్ = గుణములను; అస్తోక = సమస్తమైన; భూ = భూమియందును; ప్రసిద్ధములు = ఖ్యాతికెక్కినవి; కాన = కనుక.
సత్ = మంచిగ; నుతి = స్తోత్రము; చేయుడు = చేయండి; అజుని = విష్ణుమూర్తి {అజుడు - జన్మములేనివాడు, విష్ణువు}; అతని = అతని; బహు = అనేక; విధ = రకములైన; భావంబుల = స్వభావములను; నుతింపన్ = స్తోత్రముచేయగ; అలవి = శక్యము; కాకయె = కాకుండగనె; ఉండుదురు = ఉంటారు; అదియున్ = అంతే; కాక = కాకుండ; చతుర = చమత్కార; మతులార = బుద్ధికలవారా; మగధజనములార = మాగధులూ.
భావము:- “ఓ వందిమాగధులారా! నాలో సద్గుణాలు ఉన్నట్లయితే మీరు పొగడవచ్చు. కాని అటువంటివి ఏవీ నాలో లేవు. కాబట్టి మీ పొగడ్త వ్యర్థం. ఇకముందు నాయందు సద్గుణాలు సమృద్ధిగా కనిపిస్తే అప్పుడు మీరు ఎక్కువగా పొగుడుదురు గాని. విష్ణుదేవుని సుగుణాలు సర్వలోకాలలో సుప్రసిద్ధాలు కనుక ఇప్పుడు మీరు సభ్యుల అనుజ్ఞను పొంది ఆయన గుణాలను అభివర్ణించండి. విష్ణుదేవుని అనంత కళ్యాణ గుణగణాలను పొగడటానికి అసాధ్యమే. అయినా మీరు నేర్పరులు కాబట్టి కొనియాడటానికి ఉపక్రమించండి.

తెభా-4-446-వ.
మఱియు; మహాత్ముల గుణంబులు దనయందు సంభావితంబులు చేయ సామర్థ్యంబులు గలిగిన నందు మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు గావునం దత్సమంబుగా నెట్లు నుతింపవచ్చు? నెవ్వండే నొకండు శాస్త్రాభ్యాసంబునం దనకు విద్యా తపో యోగ గుణంబులు గలుగు నని పలికిన వానిం జూచి సభ్యులు పరిహసింతు; రది కుమతి యగు వాఁ డెఱుంగండు; నదియునుం గాక.
టీక:- మఱియున్ = ఇంకను; మహాత్ముల = గొప్పవారి; గుణంబులున్ = గుణములు; తన = తన; అందున్ = లో; సంభావితంబులున్ = సంభవించునవిగ; చేయ = చేయగల; సామర్థ్యంబులు = సమర్థతలు; కలిగినన్ = ఉన్నప్పటికని; అందున్ = అప్పుడు; మహాత్ముల = గొప్పవారి; గుణంబులున్ = గుణములు; ప్రసిద్దములు = ప్రసిద్దమైనవి; కావునన్ = కనుక; తత్ = వానికి; సమంబులు = సమానమైనవి; కాన్ = అయినట్లు; ఎట్లు = ఎలా; నుతింపన్ = స్తోత్రముచేయగ; వచ్చును = కుదురును; ఎవ్వండేని = ఎవరైన; ఒకండు = ఒకడు; శాస్త్ర = శాస్త్రములను; అభ్యాసంబునన్ = అభ్యసించుటచే; తన = తన; కున్ = కు; విద్యా = విద్యలు; తపస్ = తపస్సు; యోగ = యోగము; గుణంబులున్ = గుణములు; కలుగును = ఉన్నవి; అని = అని; పలికినన్ = అన్నచో; వానిన్ = వానిని; చూచి = చూసి; సభ్యులు = మర్యాదస్తులు; పరిహసింతురు = నవ్వుదురు; అది = దానిని; కు = చెడ్డ; మతి = బుద్ధి కలవాడు; అగు = అయిన; వాడు = వాడు; ఎఱుంగండు = తెలియలేడు; అదియున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాదు… మహాత్ముల గుణాలు తనయందు లేకపోయినా ఉన్నట్లు స్తుతి పాఠకులు వర్ణిస్తారు. మహాత్ముల గుణాలు సుప్రసిద్ధాలు కాబట్టి వారు పొగడగలరు. పొగిడే శక్తి వారికి ఉన్నప్పటికీ లేని గుణాలు ఆరోపించి మహాత్ములను పొగిడినట్లుగా ఎలా పొగడగలరు? శాస్త్రాలు చదవడం వల్ల తాను విద్యా తపోయోగ గుణాలను పొందాను” అని ఎవడైనా అనవచ్చు. అటువంటి వానిని చూచి సభ్యులైనవారు నవ్వుకుంటారు. ఆ మందమతి ఆ సంగతి గ్రహింపలేడు. అంతేకాక…

తెభా-4-447-క.
తి విశ్రుతులు సులజ్జా
న్వితులు మహోదారు లధిక నిర్మలు లాత్మ
స్తుతి పరనిందలు దోషము
తి హేయము లని తలంతు రాత్మల నెపుడున్.

టీక:- అతి = మిక్కిలి; విశ్రుతులు = విస్తారమైన పాండిత్యము కలవారు; సు = చక్కటి; లజ్జా = సిగ్గుతో; ఆన్వితులు = కూడినవారు; మహా = గొప్ప; ఉదారులు = ఔదార్యము కలవారు; అధిక = మిక్కిలి; నిర్మలులు = స్వచ్ఛమైన మనసు కలవారు; ఆత్మ = తమను తాము; స్తుతి = స్తోత్రుచేసికొనుట; పర = ఇతరులను; నిందలు = నిందించుటలు; దోషములు = పాపములు; అతి = మిక్కిలి; హేయములు = అసహ్యకరములు; అని = అని; తలంతురు = అనుకొనెదరు; ఆత్మలన్ = మనసులలో; ఎపుడున్ = ఎప్పుడూ.
భావము:- సుప్రసిద్ధులైనా గొప్పవారు నిర్మల మనస్సు, లజ్జాభిమానులు కలిగి ఉంటారు. ఉదాత్త చిత్తులైనవారు ఆత్మాస్తుతిని, పరనిందలను అసహ్యించుకుంటారు.

తెభా-4-448-క.
వంది జనంబులు లోకము
లందు నవిదిత వరకర్ము గు భూపతులన్
నందించు టవశ్యంబై
నం గదు నుతింప శిశుజనంబుల పగిదిన్.

టీక:- వంది = వంది; జనంబులు = జనులు; లోకముల్ = లోకముల; అందున్ = లో; అవిదిత = తెలియని, అసలే లేని; వర = ఉత్తమ, మంచి; కర్ములు = కర్మలు కలవారు; అగు = అయిన; భూపతులన్ = రాజులను {భూపతి - భూమికి ప్రభువు, రాజు}; నందించుట = పొగడుట; అవశ్యంబు = తప్పనిసరైనది; ఐనన్ = అయినను; తగదు = తగినది కాదు; నుతింపన్ = పొగడుట; శిశు = పసిపిల్ల; జనంబుల = వాళ్ళ; పగిదిన్ = వలె.
భావము:- ఉత్తమ కార్యాలేవీ చేయకపోయినా లోకంలో రాజులను స్తుతిపాఠకులు స్తుతిస్తూనే ఉంటారు. అయినా మరీ పసిపిల్లలవలె స్తోత్రం చేయడం మంచిది కాదు.

తెభా-4-449-క.
సూత వంది మాగధ
ను లా నరనాయకుని వనములు వినియున్
మునిచోదితులై క్రమ్మఱ
నురాగము లుప్పతిల్ల మ్మనుజేంద్రున్.

టీక:- అనన్ = అనగా; సూత = సూత; వంది = వంది; మాగధ = మాగధ; జనులు = జనులు; ఆ = ఆ; నరనాయకుని = రాజు యొక్క {నరనాయకుడు - నరులకు నడిపించువాడు, రాజు}; వచనములు = మాటలు; వినియున్ = విన్నప్పటికిని; ముని = మునులచే; చోదితులు = ప్రేరేపింపబడినవారు; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; అనురాగములు = ఆదరములు; ఉప్పతిల్లన్ = పొంగిపోయేలా; ఆ = ఆ; మనుజేంద్రుని = రాజుని;
భావము:- అని పలుకుతున్న పృథు చక్రవర్తి మాటలు విని కూడా సూత వందిమాగధులు మునులచే ప్రేరేపింపబడినవారై, ఆ రాజును…

తెభా-4-450-వ.
అమృతోపమానంబు లయిన మధుర వాక్యంబుల నిట్లనిరి.
టీక:- అమృత = అమృతముతో; ఉపమానంబులు = సమానములు; అయిన = అయిన; మధుర = తియ్యటి; వాక్యంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అమృతం వంటి తీయని మాటలతో ఇలా అన్నారు.

తెభా-4-451-క.
వేనాంగ సంభవుండవు
శ్రీనాథ కళాంశజుఁడవు చిరతరగుణ స
మ్మానార్హుండ వతర్కిత
మై భవన్మహిమఁ బొగడ లవియె మాకున్.

టీక:- వేన = వేనుని యొక్క; అంగ = అవయవమునందు; సంభవుండవు = పుట్టినవాడవు; శ్రీనాథ = విష్ణుమూర్తి {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవే)కి భర్త, విష్ణువు}; కళ = కళ యొక్క; అంశ = అంశతో; జుడవు = పుట్టినవాడవు; చిరతర = బహుమిక్కిలి {చిర - చిరతర - చిరతమ}; గుణ = గుణములచే; సమ్మాన = సన్మానింప; అర్హుండవు = తగినవాడవు; అతర్కితము = ప్రశ్నింపరాని; భవత్ = నీ యొక్క; మహిమన్ = గొప్పదనము; పొగడన్ = పొగడుటకు; అలవియె = శక్యమా కాదు; మాకున్ = మాకు.
భావము:- “మహారాజా! నీవు వేనుని శరీరం నుండి జన్మించావు. శ్రీమన్నారాయణుని అంశతో జన్మించినవాడవు. కనుక నీలోని సుగుణాలు ప్రశంసనీయాలు. ఐనా నీ గొప్పతనాన్ని కొనియాడటం మాకు శక్యం కాదు”

తెభా-4-452-క.
ని వెండియు నిట్లని రై
ను నొక మార్గంబు గలదు నందింప భవ
ద్ఘ చరితామృతపానం
బునఁ జేసియు మునులవచనములఁ జేసి తగన్.

టీక:- అని = అని; వెండియు = మరల; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఐనను = అయినప్పటికిని; ఒక = ఒక; మార్గంబున్ = దారి; కలదు = ఉన్నది; నందింపన్ = పొగడుటకు; భవత్ = నీ యొక్క; ఘన = గొప్ప; చరిత = వర్తన లనెడి; అమృత = అమృతమును; పానంబునన్ = తాగుట; చేసియున్ = వలన; మునుల = మునులు యొక్క; వచనములన్ = మాటల; చేసి = వలన; తగన్ = తప్పక.
భావము:- అని ఇంకా ఇలా అన్నారు. “అయినప్పటికి నిన్ను అభివర్ణించటానికి మాకొక మార్గం చిక్కింది. నీ చరిత్ర అనే అమృతం త్రాగడం వల్లనూ, మహామునుల ప్రేరణ వల్లనూ మాకు అటువంటి శక్తి కలిగింది.

తెభా-4-453-వ.
శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల స్తుతియించెదము” అని యిట్లనిరి.
టీక:- శ్లాంఘ్యంబులు = పొగడదగినవి; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; చరిత్రంబులన్ = నడవడికలను; స్తుతియించెదము = స్తోత్రము చేసెదము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- శ్లాఘనీయాలైన నీ చరిత్రలను సంస్తుతిస్తాము” అని పలికి ఇలా కొనియాడారు.

తెభా-4-454-సీ.
వైన్యుఁ డఖిలలోకావళి ధర్మాను-
ర్తనముల నెప్డు ఱలఁ జేసి
నధర్మమార్గ వర్తనులలో ధన్యుఁడై-
ర్మ సేతువుఁ బ్రీతిఁ గిలి ప్రోచు;
ర్మ శాత్రవులను దండించు నష్ట ది-
క్పాలకమూర్తి సంలితుఁ డగుచు;
య్యయి కాలంబులందు భాషణదాన-
ములఁ బ్రజారంజనములఁ దనర్చు;

తెభా-4-454.1-తే.
వన సద్వృష్టి కరణాదిక్తుఁ డగుట
నుభయలోకంబులకుఁ బ్రీతి నొదవఁ జేయు;
న్యాయమార్గంబునను భూజనాళి ధనముఁ
బుచ్చుకొను నిచ్చు సూర్యుఁడుఁ బోలె నితఁడు.

టీక:- ఈ = ఈ; వైన్యుడు = పృథుచక్రవర్తి {వైన్యుడు - వేనునికొడుకు, పృథుడు}; అఖిల = సమస్తమైన; లోక = లోకముల; ఆవళి = సమూహములను; ధర్మ = ధర్మమును; అనువర్తనములన్ = అనుసరింపబడుటలను; ఎప్డు = ఎప్పుడు; వఱలన్ = ప్రవర్తిల్లునట్లు; చేసి = చేసి; ఘన = గొప్ప; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గ = మార్గములో; వర్తనుల = నడచెడివారి; లోన్ = లో; ధన్యుడు = సార్థకుడు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మమును; సేతువున్ = రక్షించెడిదానిని; ప్రీతిన్ = ఆదరముతో; తగిలి = నిష్ఠతో; ప్రోచున్ = కాపాడును; ధర్మ = ధర్మమునకు; శాత్రవులను = విరుద్దులను; దండించున్ = శిక్షించును; అష్టదిక్పాలక = అష్టదిక్పాలకుల; మూర్తిన్ = స్వరూపములను; కలితుడు = కలిగినవాడు; అగుచున్ = అవుతూ; అయ్యయి = ఆయా; కాలంబులు = సమయముల; అందున్ = లో; భాషణ = మాటలు; దానములన్ = దానములలో; ప్రజా = ప్రజలను; రంజనములన్ = సంతోషపెట్టువిధానములలో; తనర్చు = అతిశయించు;
సవన = యజ్ఞములు; సత్ = మంచి; వృష్టి = వర్షములను; కరణా = కురిపించుట; ఆది = మొదలగు; సక్తుడు = ఆసక్తికలవాడు; అగుటను = అగుటచేత; ఉభయ = పరాపరములు రెండు; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ప్రీతిన్ = సంతోషము; ఒదవన్ = కలుగునట్లు; చేయు = చేయును; న్యాయ = న్యాయమైన; మార్గంబునను = మార్గములో; భూజన = మానవ {భూజన - భూమియందలిజనులు, మానవులు}; ఆళి = సమూహము యొక్క; ధనమున్ = ధనమును; పుచ్చుకొను = తీసుకొనును; ఇచ్చున్ = ఇచ్చును; సూర్యుడు = సూర్యుని; పోలెన్ = వలె; ఇతడు = ఇతను.
భావము:- “ఈ పృథు చక్రవర్తి సమస్త లోకాలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. ధర్మప్రభువులకు తలమానికమై ధర్మసేతువును రక్షిస్తాడు. ధర్మ విరోధులను శిక్షిస్తాడు. ఈయన అష్ట దిక్పాలకుల స్వరూపం ధరించి ఆయా కాలాలలో మంచి మాటలతోను, దానాలతోను ప్రజలను సంతోష పెడతాడు. ఈయన చేసే యజ్ఞాలకు సంతుష్టులై దేవతలు వర్షాలు కురిపిస్తారు. ఈ విధంగా ఈ మహారాజు ఉభయ లోకాలకు ప్రీతి కలిగిస్తాడు. సూర్యుడు భూమిమీద జలాలను పీల్చి మేఘంగా మార్చి వాన కురిపించే విధంగా ఈయన న్యాయమార్గంలో ప్రజల నుండి పన్నులు పుచ్చుకొని సరి అయిన సమయంలో ఆ ధనాన్ని మళ్ళీ వారికి ఇచ్చి రక్షిస్తాడు.

తెభా-4-455-వ.
మఱియును.
టీక:- మఱియున్ = ఇంకను.
భావము:- ఇంకా…

తెభా-4-456-సీ.
ర్వభూతములకు ముఁడును బర్యతి-
క్రమమున లోకాపరాధములను
తిశాంతి సంయుక్తుఁడై సహించుచు నార్తు-
గు వారి యెడఁ గృపాత్తుఁ డగుచు
రరూపధారియౌ రిమూర్తి గావున-
నింద్రుండు వర్షించి యెల్ల ప్రజల
క్షించుగతిఁ దాను క్షించు; నమృతాంశు-
న్నిభ వదనాబ్జ స్మితాను

తెభా-4-456.1-తే.
రాగ మిళితావలోకన రాజిఁ జేసి
కల జనులకు సంప్రీతి సంభవింపఁ
జేయు సంతతమును గూఢచిత్తుఁ డగుచు
త్రువరుల కసాధ్యుఁడై సంచరించు.

టీక:- సర్వ = సమస్తమైన; భూతముల = జీవుల; కున్ = కు; సముడును = సమత్వభావముకలవాడు; పరి = మిక్కిలి; అతిక్రమమున = వ్యతిరేకముతో; లోక = లోకమునకు; అపరాధములను = అపరాధములను; అతి = మిక్కిలి; కాంతి = శోభతో; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; సహించుచున్ = సహిస్తూ; ఆర్తులు = బాధలలో యున్నవారు; అగు = అయిన; వారి = వారి; ఎడ = ఎడల; కృప = దయతో; ఆయత్తుడు = కలిగినవాడు; అగుచున్ = అవుతూ; నర = నరుని; రూప = రూపమును; ధారి = ధరించినవాడు; ఔ = అయినట్టి; హరి = విష్ణువు యొక్క; మూర్తిన్ = స్వరూపమువాడు; కావున = కనుక; ఇంద్రుండు = ఇంద్రుడు; వర్షించి = వర్షము కురిపించి; ఎల్ల = సమస్తమైన; ప్రజల = జనులను; రక్షించు = కాపాడెడి; గతిన్ = విధముగ; తాను = తను; రక్షించున్ = కాపాడును; అమృతాంశు = చంద్రుని; సన్నిభ = సమానమైన; వదన = మోము అనెడి; అబ్జ = పద్మము యొక్క; సస్మిత = చిరునవ్వుకల; అనురాగ = ఆదరముతో.
మిళిత = కూడిన; అవలోకన = చూపుల; రాజిన్ = వరుసల; చేసి = వలన; సకల = సమస్తమైన; జనుల = వారి; కున్ = కి; సంప్రీతి = చక్కటి ప్రియము; సంభవింపన్ = కలుగునట్లు; చేయున్ = చేయును; సంతతమును = ఎల్లప్పుడు; గూఢ = నిగూఢమైన; చిత్తుడు = చిత్తము కలవాడు; అగుచున్ = అవుతూ; శత్రు = శత్రువులలో; వరులు = ఉత్తముల; కున్ = కి; అసాధ్యుడు = అగమ్యుడు; ఐ = అయ్యి; సంచరించు = సంచరించును.
భావము:- ఈ చక్రవర్తి సర్వ ప్రాణులను సమానంగా చూస్తాడు. ప్రజల నేరాలను శాంతంతో సహిస్తాడు. ఆర్తుల యందు దయ చూపిస్తాడు. ఈ మహామహుడు మానవరూపం ధరించిన మహావిష్ణువు. కాబట్టి ఇంద్రుడు వాన కురిపించి ఎల్ల ప్రజలను రక్షించే విధంగా తాను రక్షిస్తాడు. అమృతం చిందే చందమామ వంటి ముఖంతో ఎప్పుడూ చిరునవ్వులు విరజిమ్ముతూ చల్లని దయార్ద్ర వీక్షణాలు వెదజల్లుతూ సర్వజనులకు సంతోషం కలిగిస్తాడు. నిగూఢ చిత్తుడై శత్రువులకు అగమ్యుడై సంచరిస్తాడు”

తెభా-4-457-వ.
అని వెండియుఁ; “బ్రవేశ నిర్గమ శూన్యమార్గ నిరూఢ కార్యుండును, నపరిమిత మహత్త్వాది గుణగణైక ధాముండును, సముద్రునిభంగి గంభీర చిత్తుండును, సుగుప్తవిత్తుండును, వరుణుండునుబోలె సంవృతాత్ముండును, శాత్రవాసహ్య ప్రతాప యుక్తుండును, దురాసదుండును, సమీపవర్తియయ్యును దూరస్థునిభంగి వర్తించుచు వేనారణిజనిత హుతాశనుండు గావున హుతాశను చందంబున నన్యదుస్స్పర్శనుండును నై, చారులవలన సకలప్రాణి బాహ్యాభ్యంతర కర్మంబులం దెలియుచు, దేహధారులకు నాత్మభూతుండై సూత్రాత్మకుండైన వాయువు భంగి వర్తించుచు, నాత్మస్తుతి నిందలవలన నుదాసీనుం డగుచు, ధర్మపథంబున వర్తించుచు, నాత్మీయ సుహృద్బంధువుల వలనం దప్పు గలిగినను దండించుచు, నాత్మ శత్రువులనైన నదండ్యుల దండింపక ధర్మమార్గగతుం డగుచుఁ, దన యాజ్ఞాచక్రం బప్రతిహతం బగుచు, మానసాచలపర్యంతంబు వర్తింప సూర్యుండు నిజ కిరణంబులచేత నెంత పర్యంతంబు భూమిం బ్రకాశింపంజేయు నంత పర్యంతంబు నిజగుణంబులచేత లోకంబుల రంజిల్లం జేయు; నదియునుం గాక, ప్రకృతి రంజకంబులైన గుణంబులచేత దృఢవ్రతుండును, సత్య సంధుండును, బ్రహ్మణ్యుండును, సర్వభూతశరణ్యుండును, వృద్ధ సేవకుండును, మానప్రదుండును, దీనవత్సలుండును, బరవనితా మాతృభావనుండును, దన పత్ని నర్ధశరీరంబుగాఁ దలంచువాఁడును, నగుచుం బ్రజల యెడఁ దండ్రి వలెఁ బ్రీతి చేయుచు రక్షించుచుండు; మఱియును.
టీక:- అని = అని; వెండియున్ = ఇంకను; ప్రవేశ = చొచ్చుటకు; నిర్గమ = వెలువడుటకు; శూన్య = లేనట్టి; మార్గ = విధమున; నిరూఢ = నేర్పుగ; కార్యుండును = పనులు సాధించువాడు; అపరిమిత = అనంతమైన; మహత్ = ప్రభావకరము; ఆది = మొదలైన; గుణ = గొప్ప గుణములు; గణ =అనేకమైనవానికి; ఏక = ముఖ్య; ధాముండును = నివాస మైనవాడును; సముద్రుని = సముద్రుని; భంగి = వలె; గంభీర = లోతైన; చిత్తుండును = మనసు కలవాడు; సుగుప్త = చక్కగ భద్రపరచెడి; విత్తుండును = సంపదలు కలవాడును; వరుణున్ = వరుణదేవుని; పోలెన్ = వలె; సంవృత = సంయుతమైన; ఆత్ముండును = స్వభావము కలవాడు; శాత్రవ = శత్రువులకు; అసహ్య = సహింపలేని; ప్రతాప = శౌర్యము; యుక్తుండును = కలిగినవాడు; దురాసదుడును = అలక్ష్యము చేయుటకు వీలు కానివాడును; సమీపవర్తి = దగ్గరగ నుండువాడు; అయ్యును = అయినప్పటికిని; దూరస్థుని = దూరముగ నుండు వాని; భంగి = వలె; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; వేనా = వేనుడు అనెడి; అరణిన్ = అరణి యందు; జనిత = పుట్టిన; హుతాశనుండు = అగ్నిదేవుడు; కావున = కనుక; హుతాశను = అగ్నిదేవుని; చందంబునన్ = వలె; అన్య = శత్రువులకు; దుస్పర్శనుండును = స్పృశింప రాని వాడును; ఐ = అయ్యి; చారుల = వేగుల; వలన = ద్వారా; సకల = సమస్తమైన; ప్రాణి = జీవుల; బాహ్య = వెల్లడిగను; అభ్యంతర = రహస్యముగను; కర్మంబులన్ = చేయువానిని; తెలియుచున్ = తెలిసికొనుచు; దేహధారుల్ = జీవు లందరి; కున్ = కిని; ఆత్మభూతుండును = ప్రాణమైనవాడును; సూత్రాత్మకుండు = ఆధారభూతుడు {సూత్రాత్మకుడు - పువ్వులలోని దారము పువ్వులకు ఆధారమైన విధమగువాడు, ఆధారభూతుడు}; ఐన = అయిన; వాయువు = వాయుదేవుని; భంగిన్ = వలె; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; ఆత్మ = తన; స్తుతి = పొగడ్తలు; నింద = నిందించుటల; వలన = ఎడల; ఉదాసీనుండు = పట్టించుకొనని వాడును; అగుచున్ = అవుతూ; ధర్మ = ధర్మబద్ధమైన; పథంబున = మార్గమున; వర్తించుచున్ = నడుస్తూ; ఆత్మీయ = తనకు దగ్గరి; సుహృత్ = హితులు; బంధువుల = బంధువుల; వలనన్ = వలనైనను; తప్పు = అపరాధము; కలిగినను = చేయబడినచో; దండించుచున్ = శిక్షించుచున్; ఆత్మ = స్వంత; శత్రువులన్ = శత్రువులను; ఐనన్ = అయినప్పటికిని; అదండ్యుల = అనపరాధులను; దండింపక = శిక్షింపక; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గ = దారిలో; గతుండు = నడచువాడు; అగుచున్ = ఔతూ; తన = తన యొక్క; ఆజ్ఞా = ఆజ్ఞ అనే; చక్రంబున్ = చక్రబంధము; అప్రతిహతంబున్ = తిరుగులేనిది; అగుచున్ = ఔతూ; మానస = మానసోత్తరము, లోకాలోకము అనెడి; అచల = పర్వతంబున్; పర్యంతంబున్ = వరకు; వర్తింపన్ = చెల్లుతుండగ; సూర్యుండు = సూర్యుడు; తన = తన యొక్క; కిరణంబుల్ = కిరణముల; చేతన్ = చేత; ఎంత = ఎంత; పర్యంతంబున్ = వరకు; భూమిన్ = భూమిని; ప్రకాశింపన్ = వెలుగు కలుగు నట్లు; చేయున్ = చేయునో; అంత = అంత; పర్యంతంబు = వరకు; నిజ = తన; గుణముల్ = సుగుణముల; చేతన్ = వలన; లోకంబులన్ = లోకములను; రంజిల్లన్ = సంతోషించునట్లు; చేయున్ = చేయును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ప్రకృతి = సప్తాంగములు, స్వభావసిద్ధముగ {ప్రకృతి - స్వభావముచేతనే, సప్తాంగములు (1స్వామి 2మంత్రులు 3మిత్రులు 4కోశము 5రాష్ట్రము 6దుర్గము 7సైన్యము)}; రంజకంబులు = సంతోషింప జేయునవి; ఐన = అయిన; గుణంబుల్ = గుణముల; చేతన్ = వలన; దృఢ = గట్టిగ; వ్రతుండును = ఆచరించువాడును; సత్య = సత్యము నందు; సంధుండును = కట్టుబడినవాడు; బ్రహ్మణ్యుండును = వేదవిధిని వర్తించువాడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులకును; శరణ్యుండునున్ = శరణు ఇచ్చువాడు; వృద్ధ = పెద్దల ఎడ; సేవకుండును = గౌరవము చూపెడివాడు; మాన = మన్నన; ప్రదుండును = చక్కగ ఇచ్చువాడును; దీన = దీనుల ఎడ; వత్సలుండును = వాత్సల్యము కలవాడు; పర = ఇతర; వనితా = స్త్రీలను; మాతృ = తల్లి వలె; భావనుండును = భావించువాడు; తన = తన యొక్క; పత్నిన్ = భార్యను; అర్థ = సగభాగము; శరీరంబున్ = దేహముగా (సమానత్వముతో); తలంచువాడును = తలచెడివాడును; అగుచున్ = అవుతూ; ప్రజలన్ = ప్రజల; ఎడన్ = అందు; తండ్రి = తండ్రి; వలెన్ = వలె; ప్రీతిన్ = ప్రేమించుట; చేయుచున్ = చేస్తూ; రక్షించుచుండు = కాపాడుచుండును; మఱియునున్ = ఇంకను.
భావము:- అని చెప్పి ఇంకా ఇలా అన్నారు “ఈ పృథు చక్రవర్తి తన రాకపోకలు ఎవరికీ తెలియకుండా సమస్త కార్యాలు సాధిస్తాడు. ఈయన అపరిమితమైన మహత్త్వాది గుణగణాలకు ఆటపట్టు. సముద్రుని వలె లోతైన మనస్సు కలవాడు. సంపదను భద్రంగా నిక్షిప్తం చేస్తాడు. వరుణుని వలె సంయుతమూర్తి. శత్రువులకు సహింపరాని ప్రతాపం కలవాడు. ఎవరికీ తేరిపార చూడరానివాడు. దగ్గరనే ఉంటూ దూరంగా ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. వేనరాజు అనే అరణి నుండి పుట్టిన అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నివలె ఇతరులకు స్పృశింపరానివాడు. చారచక్షువై రాజ్యం లోపల, బయట జరిగే చర్యలను తెలుసుకుంటాడు. శరీరధారు లందరికీ ఆత్మ వంటివాడై పువ్వులలో దారంలా ఉంటూ వాయువు వలె సంచరిస్తాడు. తనను ఇతరులు పొగడినా, తెగడినా పట్టించుకోడు. దగ్గరి చుట్టాలైనా సరే తప్పక శిక్షిస్తాడు. తన శత్రువులైనా సరే శిక్షింప దగని వారిని శిక్షింపడు. ఏమాత్రం పక్షపాతం లేకుండా ధర్మంగా ప్రవర్తిస్తాడు. ఇతని ఆజ్ఞ ఎదురులేనిదై లోకాలోక పర్వతం వరకూ చెల్లుతుంది. సూర్యుడు తన కిరణాలతో భూమిని ఎంతవరకు ప్రకాశింప జేస్తాడో, అంతవరకు తన గుణాల చేత ప్రజలను రంజింపజేస్తాడు. దృఢవ్రతుడై, సత్యసంధుడై, బ్రహ్మణ్యుడై, సర్వభూత శరణ్యుడై పెద్దలను గౌరవిస్తూ, దీనులను కనికరిస్తూ, ప్రజానీకాన్ని తన సద్గుణ సముదాయంతో సంతోషింపజేస్తాడు. అందరి గౌరవాన్ని కాపాడుతాడు. పరస్త్రీలను తల్లులుగా భావిస్తాడు. తన భార్యను అర్ధశరీరంగా ఆదరిస్తాడు. ప్రజలను కన్నతండ్రివలె గౌరవించి రక్షిస్తాడు.

తెభా-4-458-సీ.
లపోయ బ్రహ్మవిద్యానిష్ఠ జనముల-
నయంబుఁ గింకరుం డైనవాఁడు;
ఖిలశరీరగుఁ డాప్త సుహృజ్జన-
తానంద కరుఁ డన లరువాఁడు;
సంసారఘనకర్మ సంగహీనుల యందు-
సంగసంప్రీతుఁడై రగువాఁడు;
దుర్మార్గమనుజ సందోహంబునకు నుగ్ర-
దండధరుం డనఁ నరువాఁడుఁ;

తెభా-4-458.1-తే.
బ్రకృతి పురుష కావేశుఁడై రఁగువాఁడు;
వదవతారయుక్తుఁడై నెడువాఁడు;
గుచు వర్తించు సమ్మోద తిశయిల్లఁ
జారుతరమూర్తి యీ రాజక్రవర్తి.

టీక:- తలపోయ = పరికించగ; బ్రహ్మవిద్యా = బ్రహ్మవిద్యయందు; నిష్ఠ = పారంగతులైన; జనముల = వారి; కిన్ = కి; అనయంబున్ = ఎల్లప్పుడు; కింకరుండు = సేవించువాడు; ఐనవాడు = అయినవాడు; అఖిల = సమస్తమైన; శరీరగుడు = జీవులయెడనుండువాడు; ఆప్త = ఆప్తులైనట్టి; సహృత్ = హితులైన; జనత్ = వారికి; ఆనంద = ఆనందమును; కరుండు = కలుగజేయువాడు; అనన్ = అనునట్లు; అలరువాడు = విలసిల్లెడివాడు; సంసార = సంసారమందలి; ఘన = మిక్కిలిపెద్దవైన; సంగ = కర్మబంధములు; హీనుల్ = లేనివారి; అందున్ = ఎడల; సంగ = కూడుటయందు; సంప్రీతుడు = ఆదరముకలవాడు; ఐ = అయ్యి; జరగువాడు = వర్తించెడివాడు; దుర్మార్గ = దుష్ట; మనుజ = మానవుల; సందోహంబున్ = సమూహముల; కున్ = కు; ఉగ్ర = భయంకరమైన; దండధరుండు = శిక్షించువాడు, యమునివంటివాడు; అనన్ = అనగా; తనరు = అతిశయించు; వాడు = వాడు; ప్రకృతిన్ = స్వభావసిద్ధముగ; పురుష = మానవులకు; కున్ = కు ఆవేశుడు = స్తూర్తిప్రధాతయైనవాడు; ఐ = అయ్యి.
పరగువాడు = నడచుకొనును; భగవత్ = భగవంతుని; అవతార = అవతారమై; యుక్తుండు = కూడియుండువాడు; ఐ = అయ్యి; నెగడువాడు = వర్థిల్లువాడు; అగుచున్ = అవుతూ; వర్తించున్ = నడచుకొనును; సమ్మోదము = సంతోషము; అతిశయిల్లన్ = అతిశయించగ; చారుతర = బహుచక్కని {చారు - చారుతర - చారుతమ}; మూర్తిన్ = మూర్తిత్వముకలవాడు; ఈ = ఈ; రాజ = విశిష్టమైన; చక్రవర్తి = చక్రవర్తి.
భావము:- సౌందర్యమూర్తి అయిన ఈ చక్రవర్తి బ్రహ్మవిద్యా పారంగతులైన పెద్దలను ఆరాధిస్తాడు. సమస్త శరీరాలలోను తానే ఉన్నట్లు బంధుమిత్రులకు సంతోషాన్ని కలిగిస్తాడు. సంసార లంపటులు కానివారితో సాంగత్యం చేస్తాడు. దుర్మార్గులకు యమధర్మరాజువలె భయంకరు డౌతాడు. ప్రజలకు ఉత్సాహం కలిగిస్తాడు. సాక్షాత్తు భగవంతుని అవతారమని సమస్త జనులు భావించేటట్లు ఈ పృథు చక్రవర్తి ప్రవర్తిస్తాడు.

తెభా-4-459-వ.
మఱియుం; ద్ర్యధీశుండుఁ గూటస్థుండుఁ బరమాత్మయు బ్రహ్మకళా రూపుండు నగువాఁడునునై యుదయించెం; గావున నితని యందు నవిద్యారచితం బైన భేదంబు నిరర్థకం బగు” నని పెద్ద లగువారలు చూతురు; మఱియును.
టీక:- మఱియునున్ = ఇంకను; త్రి = త్రిగుణములకు; అధీశుండున్ = అధిపత్యము వహించువాడు; కూటస్థుండున్ = దేహములందలి జీవుడుగ వసించువాడు {కూటస్థుండు - సర్వదేహములందు సర్వకాల సర్వావస్తలందు ఒక్కవిధముగ జీవుడుగా వసించెడివాడు}; పరమాత్మయున్ = పరమాత్మయైనవాడు {పరమాత్మ - పరమ (సర్వాతీతము) యైన ఆత్మతత్త్వము ఐనవాడు}; బ్రహ్మ = పరమబ్రహ్మము యొక్క; కళా = కళయే; రూపుండు = రూపుదాల్చినవాడు; అగు = అయిన; వాడును = వాడు; ఐ = అయ్యి; ఉదయించెన్ = అవతరించెను; కావునన్ = కనుక; ఇతనినన్ = ఇతని; అందున్ = ఎడల; అవిద్యా = అవిద్యచే, మాయచే; రచితంబైన = ఏర్పడెడినది; ఐన = అయిన; భేదంబున్ = భేదభావము; నిర్థకంబు = నిష్ప్రయోజనమైనది; అగున్ = అగును; అని = అని; పెద్దలు = జ్ఞానులు; అగున్ = అయిన; వారు = వారు; చూతురు = దర్శించెదరు, తెలిసికొందురు; మఱియునున్ = ఇంకనూ.
భావము:- ఇంకా ఈ పృథు చక్రవర్తి త్రిగుణాతీతుడై సర్వాంతర్యామి అయిన భగవంతుని అంశతో జన్మించాడు. ఈయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఈయన ఎవరినీ వేరుగా చూడడు. ఈయనను ఎవరూ వేరుగా చూడరాదు అని పెద్దలు గ్రహిస్తారు. అంతేకాక…

తెభా-4-460-సీ.
దయాద్రి పర్యంత ముర్వీతలం బేక-
వీరుఁడై రక్షించి వెలయు నీతఁ
డొకనాఁడు విజయ యాత్రోత్సవం బేపార-
న్నద్ధుఁడై మణి స్యందనంబు
నెక్కి చాపముఁ బూని దిక్కుల సూర్యుని-
గిదిని శత్రుభూపాలతమము
విరియింతు నని చాల వెలుఁ గొందుచును ధరా-
క్ర ప్రదక్షిణశాలి యగుచుఁ

తెభా-4-460.1-తే.
దిరుగునెడ సర్వ దిక్పాల సమేత
పార్థివోత్తమ నికర ముపాయనంబు
లిచ్చి తనుఁ జక్రపాణిని నెనయు నాది
రణివిభుఁ డని నుతియించి లఁతు రెదల.

టీక:- ఉదయాద్రి = పొద్దుపొడుచుకొండ {ఉదయాద్రి - పొద్దుపొడుచుకొండ, తూర్పుదిగంతమునందలిపర్వతము, పురోగమనమునకు సంజ్ఞామాత్రము}; పర్యంతమున్ = వరకు; ఉర్వీతలంబున్ = భూభాగమునకు; ఏక = ఏకైక {ఏకవీరుడు - ఏకైకశూరుడు, మంచినిష్ఠకలవాడు}; వీరుడు = శూరుడు; ఐ = అయ్యి; రక్షించి = పాలించుతూ; వెలయున్ = ప్రసిద్ధమగు; ఈతడు = ఇతడు; ఒక = ఒక; నాడు = దినమున; విజయ = దిగ్విజయ, జైత్ర {విజయయాత్ర - జైత్రయాత్ర, సాధనపరిపక్వత}; యాత్ర = యాత్ర; ఉత్సవంబున్ = ఉత్సాహము; ఏపారన్ = అతిశయించగా; సన్నద్ధుడు = సంసిద్ధుడు; ఐ = అయ్యి; మణి = మణులుతాపడముచేసిన {మణిసన్నద్ధుడు - అణిమాదిసిద్ధుడు}; స్యందనమున్ = రథమును; ఎక్కి = ఎక్కి; చాపమున్ = విల్లును (సూర్యమార్గపథము) {చాపము - విల్లు, సూర్యుడు గమనము చేసెడి మార్గము}; పూని = ధరించి; దిక్కులన్ = సర్వదిక్కులను; సూర్యుని = సూర్యుని; పగిదిన్ = వలె; శత్రు = శత్రువులైన; భూపాల = రాజులనెడి {భూపాల - భూమినిపాలించెడివారు, రాజులు}; తమము = చీకటి {తమము - చీకటి, తమోగుణావరణ}; విరియింతున్ = విడిపింతును, పోగొట్టెదను; అని = అని; చాల = మిక్కిలి; వెలుగొందుచునున్ = ప్రకాశిస్తూ; ధరా = భూమిని {ధరాచక్రప్రదక్షిణశాలి - భూమిచుట్టునుతిరుగుట, దేహసంబంధిలన్నిటిని చుట్టబెట్టుట}; చక్ర = చుట్టును గుండ్రముగా; ప్రదక్షిణశాలి = తిరుగువాడు; అగుచున్ = అవుతూ; తిరుగు = తిరిగెడు; ఎడన్ = సమయములో.
సర్వ = సమస్తమైన; దిక్పాల = దిక్పాలురు {దిక్పాలులు - ఇంద్రాదులు, ఇంద్రియసందోహము}; వర = ఉత్తములు {వర - ఉత్తమ, ఇయ్యబడిన}; సమేత = సహితముగ; పార్థివ = రాజులలో {పార్థివోత్తముడు - ఉత్తమ రాజు, ఉత్తపార్థివశరీరము (తగులములులేని) కలవాడు}; ఉత్తమ = ఉత్తముల; నికరమున్ = సమూహము; ఉపాయనంబుల్ = కానుకలు {ఉపాయనంబులు - కానికలు, సాధనకి ఉపయోగించునవి}; ఇచ్చి = ఇచ్చి; తనున్ = తనను; చక్రపాణినిన్ = విష్ణ్వంశభూతుడుగ {చక్రపాణి - చక్రమును ధరించువాడు, విష్ణువు, భ్రమణమును నియమించువాడు}; ఎనయున్ = ఎంచిచూడ {ఆదిధరణి విభుడు - మొట్టమొదటిరాజు, ఇంద్రియమూలములను నియమించువాడు}; ఆది = మొట్టమొదటి; ధరణి = భూప్రపంచమునకు; విభుడు = ప్రభువు, రాజు; అని = అని; నుతియించి = స్తుతించి; తలతురు = భావించెదరు; ఎదలన్ = మనసులలో.
భావము:- ఈ పృథు చక్రవర్తి ఉదయపర్వతం వరకు సమస్త భూమండలాన్ని ఏకైక తిరుగులేని వీరత్వంతో రక్షిస్తాడు. ఒకనాడు రత్నఖచితమైన రథాన్ని అధిరోహించి విల్లమ్ములు ధరించి జైత్రయాత్రకు బయలుదేరతాడు. దిక్కులందున్న శత్రురాజులనే కారుచీకట్లను సూర్యుని వలె పటాపంచలు చేస్తాడు. దేదీప్యమానంగా వెలుగుతూ భూచక్రమంతా చుట్టి వస్తాడు. ఆ సమయంలో సర్వ దిక్పాలకులు, రాజేంద్రులు ఈయనకు కానుకలు చెల్లిస్తారు. చక్రపాణికి సాటి వచ్చే ఆదిమహారాజుగా భావించి సేవిస్తారు.

తెభా-4-461-క.
నృపతి ధరాచక్రము
ధేనువుగాఁ జేసి పిదుకు ధృతి నఖిల పదా
ర్థానీకము విబుధులు స
న్మానింపఁగఁ బ్రజకు జీవప్రదుఁ డగుచున్.

టీక:- ఈ = ఈ; నృపతి = రాజు {నృపతి - నృ (నరులకు) ప్రభువు, రాజు}; ధరా = భూ; చక్రము = మండలము; ధేనువు = ఆవు; కాన్ = అగునట్లు; చేసి = చేసి; పిదుకు = పితుకు; ధృతిన్ = అవశ్యము; అఖిల = సమస్తమైన; పదార్థన్ = వస్తువుల; అనీకమున్ = సమూహములను; విబుధులు = జ్ఞానులు {విబుధులు - విశిష్టమైన బుద్ధి కలవారు, జ్ఞానులు}; సన్మానింపగన్ = గౌరవించునట్లు; ప్రజ = ప్రజల; కున్ = కు; జీవన = జీవనాధారములను; ప్రదుడు = సమకూర్చువాడు; అగుచున్ = అవుతూ.
భావము:- ఈ మహారాజు భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పిదుకుతాడు. ప్రజలకు నవజీవనాన్ని ప్రసాదించి మహనీయులైన విబుధుల మన్ననలు పొందుతాడు.

తెభా-4-462-చ.
రవరేణ్యుఁ బోలి యనయంబు నితండును గోత్ర భేదన
త్వమునఁ జెలంగుఁ దా నజగప్రదరాసన శింజినీ నినా
మున విరోధిభూపతులు ల్లడ మంద నసహ్యసింహ వి
క్రమున సంచరించు” నని కౌతుక మొప్పఁగఁ బల్కి వెండియున్.

టీక:- అమర = దేవతలలో {అమరులు – మరణము లేనివారు, దేవతలు}; వరేణ్యున్ = శ్రేష్ఠులను; పోలిన్ = వలె; అనయంబున్ = ఎల్లప్పుడును; ఇతడునున్ = ఇతను; గోత్ర = శత్రువుల వంశములను; భేదనత్వమునన్ = నశింపచేయుటలో; చలంగున్ = చెలరేగును; తాన్ = తాను; అజగవ = అజగవమనెడి {అజగవ - అజ (గొఱ్ఱె) గవ (గోవు, ఎద్దు)ల కొమ్ములు కలది}; ప్రదరాసన = విల్లు యొక్క {ప్రదరాసనము - ప్రదరము (బాణము)నకు ఆసనము, ధనస్సు}; శింజినీ = శిం యనెడి వింటినారి మోత యొక్క; నినాదమునన్ = శబ్దముచేత; విరోధి = శత్రువులైన; భూపతులు = రాజులు; తల్లడము = కళవెళపడుటను; అందన్ = చెందెడి; అసహ్య = సహింపరాని; సింహ = సింహమువంటి; విక్రమమునన్ = పరాక్రమముతో; సంచరించున్ = తిరుగును; అని = అని; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = కలుగునట్లుగ; పల్కి = పలికి; వెండియున్ = ఇంకనూ.
భావము:- ఈ నరేంద్రుడు సురేంద్రుని వలె గోత్రాలను భేదిస్తాడు. అజగవం అనే ధనుస్సును ధరించి, నారి మ్రోగించి, శత్రు రాజులను సింహవిక్రమంతో సంహరిస్తాడు” అని చెప్పి…

తెభా-4-463-వ.
ఇట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇలా అన్నారు.

తెభా-4-464-చ.
లజగన్నుతుం డితఁడు చారుయశోనిధి యశ్వమేధముల్
ప్రటముగా శతంబు దగఁ బావనమైన సరస్వతీతటీ
నిటధరిత్రిఁ జేయుతఱి నేర్పున నంతిమ యాగమందుఁ గొం
డొ మఖసాధనాశ్వమును జంభవిరోధి హరించు నుద్ధతిన్.

టీక:- సకల = సమస్తమైన; జగత్ = జగములచేత; సన్నుతుండు = స్తోత్రము చేయబడువాడు; ఇతడున్ = ఇతడు; చారు = చక్కటి; యశస్ = కీర్తికి; నిధి = నిధి వంటివాడు; అశ్వమేధముల్ = అశ్వమేధయాగములను; ప్రకటముగన్ = ప్రసిద్ధముగ; శతంబున్ = నూటిని (100); తగన్ = చక్కగ; పావనము = పవిత్రము; ఐన = అయిన; సరస్వతీ = సరస్వతి అనెడి నది యొక్క; తటీ = ఒడ్డునకు; నికట = దగ్గరి; ధరిత్రిన్ = నేలను, ప్రదేశమున; చేయు = చేసెడి; తఱిన్ = సమయములో; నేర్పునన్ = చక్కగ; అంతిమ = చివరి; యాగము = యజ్ఞము; అందున్ = లో; కొండొక = ఒకానొక; మఖ = యజ్ఞము యొక్క; సాధన = పరికరము యైన; అశ్వమున్ = గుఱ్ఱమును; జంభవిరోధి = ఇంద్రుడు {జంభ విరోధి - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు}; హరించున్ = దొంగిలించును; ఉద్దతిన్ = అతిశయముతో.
భావము:- “ఈ చక్రవర్తి సర్వలోక సంస్తూయమానుడై విశాలమైన యశస్సును గడిస్తాడు. పరమ పవిత్రమైన సరస్వతీ నదీతీరంలో వంద అశ్వమేధ యాగాలు చేస్తాడు. నూరవ అశ్వమేధం చేసేటప్పుడు ఈ రాజేంద్రుని యజ్ఞాశ్వాన్ని అమరేంద్రుడు అహంకారంతో అపహరిస్తాడు.

తెభా-4-465-సీ.
కనాఁడు నిజమందిరోపాంత వనముకుఁ-
ని యందు సద్గుణశాలి యైన
నుని సనత్కుమారునిఁ గాంచి యమ్ముని-
రు బ్రహ్మ తనయుఁగా నెఱిఁగి భక్తిఁ
బూజించి విజ్ఞానమును బొందు నచ్చట-
బ్రహ్మవేత్తలు మునిప్రవరు వలన
మానిత లబ్ధవిజ్ఞానులై వర్తింతు,-
రిమ్మహారాజు మహీతలంబు

తెభా-4-465.1-తే.
నందు విశ్రుతవిక్రముఁ గుచు మిగులఁ
న కథావళి భూ ప్రజాతి నుతింప
క్కడక్కడ వినుచు శౌర్యమున నఖిల
దిక్కులను గెల్చి వర్తించు ధీరయశుఁడు.

టీక:- ఒక = ఒక; నాడున్ = దినమున; నిజ = తన; మందిర = గృహము యొక్క; ఉపాంత = సమీపము నందలి; వనమున్ = తోట, అడవి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = దానిలో; సత్ = మంచి; గుణ = గుణములను; శాలి = స్వభావముగ కలవాడు; ఐన = అయిన; ఘనునిన్ = గొప్పవానిని; సనత్కుమారునిన్ = సమత్కుమారుని; కాంచి = దర్శించి; ఆ = ఆ; ముని = మునులలో; వరున్ = శ్రేష్ఠుని; బ్రహ్మ = బ్రహ్మదేవుని యొక్క; తనయున్ = పుత్రుడు; కాన్ = అగునట్లు; ఎఱిగి = తెలిసి; భక్తిన్ = భక్తితో; పూజించి = సేవించి; విజ్ఞానమును = తత్త్వజ్ఞానమును; పొందున్ = పొందును; అచటన్ = అక్కడ; బ్రహ్మవేత్తలు = బ్రహ్మణులు {బ్రహ్మవేత్తలు - వేద ధర్మములు బాగుగనెరినవారు, బ్రాహ్మణులు}; ముని = సనత్కుమారునిచే; మానిత = మన్నింపబడుటచేత; లబ్ధ = లభించిన; విజ్ఞానులు = విజ్ఞానము కలవారు; ఐ = అయ్యి; వర్తింతురు = తిరిగెదరు; ఈ = ఈ; మహారాజు = మహారాజు; మహీ = భూ; తలంబున్ = మండలము; అందున్ = లో.
విశ్రుత = మిక్కిలిగవినబడెడి, ప్రసిద్ధమైన; విక్రముడు = పరాక్రమము కలవాడు; అగుచున్ = అవుతూ; మిగులన్ = ఎక్కువగ; తన = తనయొక్క; కథా = కథల; ఆవళిన్ = సమూహమును; భూ = భూమియందలి; ప్రజా = ప్రజల; తతిన్ = సమూహములు; నుతింపన్ = స్తోత్రముచేయుచుండ; అక్కడక్కడ = అక్కడక్కడ; వినుచున్ = వింటూ; శౌర్యమునన్ = పరాక్రమముతో; అఖిల = సర్వ; దిక్కులనున్ = దిక్కులను; గెల్చి = గెలిచి; వర్తించున్ = తిరుగును; ధీర = బుద్ధిబలము; యశుడు = కీర్తియుకలవాడు.
భావము:- ఒకనాడు ఈయన రాజభవనానికి సమీపంలో ఉపవనానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ మానసపుత్రుడు, పవిత్ర చరిత్రుడు అయిన సనత్కుమారుణ్ణి సందర్శించి, భక్తితో పూజిస్తాడు. ఆయన వల్ల ఉత్తమ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అక్కడ ఉన్న బ్రహ్మవేత్తలందరూ ఆ సనత్కుమారుని ఉపదేశం వల్ల తత్త్వజ్ఞానులై ప్రవర్తిస్తారు. ఈ మహారాజు మహీమండలంలో సుప్రసిద్ధ వీరుడై తన వీరగాథలను లోకులు వినుతింపగా వీనుల విందుగా వింటాడు. శౌర్యాతిశయంతో సర్వదిక్కులను జయించి శాశ్వతమైన యశస్సును గడిస్తాడు.

తెభా-4-466-వ.
ఇట్లు విపాటిత విరోధిమనశ్శల్యుండు, సురాసుర జేగీయమాన నిజవైభవుండు నై ధరాచక్రంబున కీతండు రాజయ్యెడి"నని యివ్విధంబున స్తోత్రంబు చేసిన వంది మాగధ సూత జనంబులం బృథుచక్రవర్తి పూజించి మఱియుం బ్రాహ్మణ భృత్యామాత్య పురోహిత పౌర జానపద తైలిక తాంబూలిక నియోజ్య ప్రము ఖాశేష జనంబులం దత్త దుచిత క్రియలం బూజించె” నని మైత్రేయుండు చెప్పిన విని విదురుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; విపాటిత = బాగనాటిన; విరోధి = శత్రువుల; మనస్ = మనసులలోని; శల్యుండు = ముల్లు వంటివాడు; సుర = దేవతలచేత; అసుర = రాక్షసులచేత; జేగీయమాన = కీర్తింపబడెడి; నిజ = తన; వైభవుండు = వైభవము కలవాడు; ఐ = అయ్యి; ధరా = భూ; చక్రంబున్ = మండలమున; కున్ = కు; ఇతండు = ఇతడు; రాజు = రాజు; అయ్యెడిని = అగును; అని = అని; ఈ = ఈ; విధమునన్ = విధముగ; స్తోత్రంబున్ = స్తోత్రము; చేసినన్ = చేసినట్టి; వంది = వందిజనులు; మాగధ = మాగధులు; సూత = సూతులు యైన; జనంబులన్ = వారిని; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; పూజించి = గౌరవించి; మఱియున్ = ఇంకనూ; బ్రాహ్మణ = బ్రహ్మణులు; భృత్య = సేవకులు; అమాత్య = మంత్రులు; పురోహిత = పురోహితులు; పౌర = పౌరులు; జానపద = జానపదులు; తైలిక = తైల మర్దనములు చేయువారు; తాంబూలిక = తాంబులములను చుట్టిచ్చువారు; నియోజ్య = రాచ కార్యములకు నియోగింపబడిన వారు; ప్రముఖ = మొదలైన; అశేష = అనేకమైన; జనంబులన్ = జనులను; తత్తత్ = ఆయా; ఉచిత = తగిన; క్రియలన్ = విధములుగ; పూజించె = గౌరవించెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈయన కంటకప్రాయులైన విరోధులను పెకలించి వేస్తాడు. సురాసురులు కొనియాడుతున్న వైభవం కలవాడై, ధరామండలాని కంతటికీ రాజు అవుతాడు” అని వందిమాగధులు పృథు చక్రవర్తిని పరిపరి విధాల ప్రస్తుతించారు. పృథు చక్రవర్తి వారందరినీ యథోచితంగా సత్కరించాడు. బ్రాహ్మణులు, భృత్యులు, అమాత్యులు, పురోహితులు, పుర ప్రజలు, గ్రామవాసులు, తైల సేవకులు, తాంబూల వాహకులు మొదలైన సమస్త పరివారాన్ని తగినట్లుగా ఆదరించాడు” అని మైత్రేయుడు చెప్పగా విని విదురుడు ఇలా అన్నాడు.