పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/స్వారోచిషమనువుచరిత్ర

2స్వారోచిషమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-14-సీ.
స్వారోచిషుం డన ప్తార్చిబిడ్డఁడు-
నువు; వానికి నా ద్యుత్సుషేణ
రోచిష్మదాదు లారూఢ పుత్రులు ధాత్రి-
నేలిరి; రోచనుఁ డింద్రుఁ డయ్యె;
ధికులు తుషితాదు మరు లూర్జస్తంబ-
ముఖ్యు లాఢ్యులు సప్తమునులు నాఁడు;
వేదశిరుం డను విప్రుని దయితకుఁ-
దుషితకుఁ బుత్రుఁడై తోయజాక్షుఁ

తెభా-8-14.1-ఆ.
వతరించెను విభుఁ న నశీత్యష్ట స
స్ర మునులు నధికు యినవారు;
ను లనుగ్రహింపఁ గౌమారకబ్రహ్మ
చారి యగుచు నతఁడు లిపె వ్రతము.

టీక:- స్వారోచిషుండు = స్వారోచిషుడు; అనన్ = అని; సప్తార్ఛి = అగ్నిదేవుని {సప్తార్చి - సప్త (ఏడు, 7) అర్చి (జ్వాలలుగలవాడు), అగ్ని}; బిడ్డడు = పుత్రుడు; మనువు = మనువు; వాని = వాని; కిన్ = కి; ఆ = ఆ; ద్యుమత్ = ద్యుమంతుడు; సుషేణ = సుషేణుడు; రోచిష్మత్ = రోచిష్మంతుడు; ఆదులు = మున్నగువారు; ఆరూఢ = ప్రసిద్ధులైన; పుత్రులు = కుమారులు; ధాత్రిన్ = భూమిని; ఏలిరి = పరిపాలించిరి; రోచనుండు = రోచనుడు; ఇంద్రుడు = ఇంద్రుడు; అయ్యెన్ = అయ్యెను; అధికులు = గొప్పవారు; తుషిత = తుషితుడు; ఆదులు = మున్నగువారు; అమరులు = దేవతలు; ఉర్జస్తంబ = ఊర్జస్తంభుడు; ముఖ్యులు = మొదలగు; ఆఢ్యులు = శ్రేష్ఠులు; సప్తమునులు = సప్తర్షులు; నాడు = ఆ కాలములో; వేదశిరుండు = వేదశిరుడు; అను = అనెడి; విప్రుని = బ్రాహ్మణుని; దయిత = భార్య; కున్ = కు; తుషిత = తుషిత; కున్ = కు; పుత్రుడు = కుమారుడు; ఐ = అయ్యి; తోయజాక్షుడు = విష్ణుమూర్తి {తోయజాక్షుడు - తోయజ (పద్మముల వంటి) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అవతరించెను = జన్మించెను.
విభుడు = విభుడు; అనన్ = అని; అశీత్యష్టసహస్ర = ఎనభైఎనిమిదివేలమంది (88,000); మునులు = మునులు; అధికులు = శ్రేష్ఠులు; అయిన = ఐన; వారు = వారు; ఘనులు = గొప్పవారు; అనుగ్రహింపన్ = అనుగ్రహించగా; కౌమారక = కౌమారవయసు; బ్రహ్మచారి = బ్రహ్మచర్యదీక్షగొన్నవాడు; అగుచున్ = అగుచు; అతడు = అతడు; సలిపె = ఒనర్చెను; వ్రతమున్ = బ్రహ్మచర్యవ్రతమును.
భావము:- రెండవ మనువు స్వారోచిషుడు అగ్ని కుమారుడు. ఆ మనువు గొప్ప పుత్రులు ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు, మొదలైనవారు మిక్కిలి ప్రసిద్ధులై భూమిని పరిపాలించారు. ఆ మన్వంతరంలో ఇంద్రుడు రోచనుడు. దేవతలు తుషితులు మొదలైన వారు. సప్తర్షులు ఊర్జస్తంబుడు మొదలైనవారు. విభుడు అను పేరుతో విష్ణువు వేదశిరుడు అను బ్రాహ్మణుడు అతని భార్య తుషిత లందు అవతరించాడు. ఆ అవతారంలో అతను కుమార బ్రహ్మచారి అయి ఎనభై ఎనిమిదివేల మహా మునులు అనుగ్రహంతో వ్రత దీక్షాపరుడు అయ్యాడు.

తెభా-8-15-వ.
తదనంతరంబ.
టీక:- తదనంరంబ = అటుపిమ్మట.
భావము:- ఆ తరువాత