పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుని బిక్షా గమనము

వామనునిబిక్షాగమనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-525-క.
ప్రక్షీణ దివిజ వల్లభ
క్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
భిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్
.
టీక:- ప్రక్షీణ = మిక్కిలిదీనుడైన; దివిజవల్లభ = దేవేంద్రుని; రక్షా = కాపాడుటయందు; పరతంత్రుడు = నిమగ్నమైనవాడు; అగుచున్ = అగుచు; రాజీవాక్షుండు = హరి; ఆ = ఆ; క్షణమునన్ = వెంటనే; బలి = బలి యొక్క; ఇంటికిన్ = నివాసమున; కిన్ = కు; భిక్షా = యాచించుటకు; ఆగమనంబున్ = చేరుటను; చేసెన్ = చేసెను; పేదఱికము = పేదరికము; తోను = తోటి.
భావము:- వామనుడు మిక్కిలి దీనుడై ఉన్న దేవేంద్రుడిని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకుని, పేదరికాన్ని ప్రదర్శిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు.

తెభా-8-526-క.
రిహరి; సిరి యురమునఁ గల
రిహరిహయుకొఱకు దనుజు డుగం జనియెన్;
హితరత మతియుతులగు
దొలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.

టీక:- హరిహరి = అయ్యయ్యో; సిరి = లక్ష్మీదేవి; ఉరమునన్ = వక్షస్థలమున; కల = కలిగిన; హరి = విష్ణుమూర్తి; హరిహయు = ఇంద్రుని; కొఱకున్ = కోసము; దనుజున్ = రాక్షసుని; అడుగన్ = అడుగుటకు; చనియెన్ = బయలుదేరెను; పర = ఇతరులకు; హిత = మేలుచేయుటయందు; రత = ప్రీతికల; మతి = బుద్ధి; యుతుల = కలవారు; అగు = అయిన; దొరల్ = దొడ్డబుద్ధిగలవారల; కున్ = కు; అడుగుటయున్ = యాచించుటకూడ; ఒడలి = దేహ; తొడవు = అలంకారము; అగున్ = అయి ఉండును; పుడమిన్ = లోకమునందు.
భావము:- ఔరా! రొమ్మున లక్ష్మీదేవి కలిగిన మహా సంపన్నుడు విష్ణుమూర్తి. అయినా, అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో.
ఈ పద్యంలోని అలంకార వైభవం ఎంతబాగుందో. (1) హరిహరి – అయ్యో, ఔరా వంటి పదం, (2) హరి అంటే విష్ణువు, (3) హరిహయుడు అంటే ఇంద్రుడు.

తెభా-8-527-క.
ర్వప్రపంచ గురుభర
నిర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేరన్
ర్వుని వ్రేఁగు సహింపక
యుర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్
.
టీక:- సర్వ = అఖిల; ప్రపంచ = లోకముల; గురు = బరువును; భర = భరించుట; నిర్వాహకుడు = చేయువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; నెఱిన్ = క్రమముగా; చనుదేర = వెశ్ళుచుండగ; ఖర్వుని = పొట్టివాని; వ్రేగున్ = భారమును; సహింపక = తట్టుకొనలేక; ఉర్వీస్థలి = భూమండలము; క్రుంగెన్ = కుంగిపోయినది; మ్రొగ్గెన్ = వంగిపోయెను; ఉరగేంద్రుండున్ = ఆదిశేషుడు.
భావము:- భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే, అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయాడు.

తెభా-8-528-వ.
ఇట్లు చనిచని .
టీక:- ఇట్లు = ఈ విధముగ; చనిచని = సాగిపోయి.
భావము:- ఆ వామనమూర్తి అలా వెళ్ళి వెళ్ళి . . . .

తెభా-8-529-క.
ర్మద, యమదండక్షత
ర్మద, నతి కఠిన ముక్తి నితాచేతో
ర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్
.
టీక:- శర్మద = శుభములనిచ్చునది; యమ = యముని; దండ = దండనము యొక్క; క్షత = దెబ్బలనుండి; వర్మదన్ = కాపాడు కవచము వంటిదానిని; అతి = మిక్కిలి; కఠిన = గట్టిదైన, గడుసుదైన; ముక్తి = ముక్తి యనెడి; వనిత = స్త్రీ యొక్క; చేతస్ = మనసు; మర్మదన్ = మర్మమును తెలిపెడిదానిని; అంబు = (తన) నీటితో; నివారిత = నివారించబడు; దుర్మదన్ = దోషములుగలదానిని; నర్మదన్ = నర్మదానదిని; తరించెన్ = దాటెను; త్రోవన్ = దారిలో; వటుడున్ = బ్రహ్మచారి.
భావము:- నర్మదానది శుభాలను అందించేది. యమ బాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది; బహు గడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది; తన నీళ్ళతో దోషాలను నివారించేది. వామనుడు తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదానదిని దాటాడు.

తెభా-8-530-వ.
దాటి తత్ప్రవాహంబున కుత్తరతటంబు నందు .
టీక:- దాటి = దాటి; తత్ = ఆ; ప్రవాహంబున్ = నదికి; ఉత్తర = ఉత్తరపు; తటంబున్ = గట్టు; అందున్ = అందు.
భావము:- మంచి తేజస్సు గల ఆ వామనుడు నర్మదానదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న .. .

తెభా-8-531-శా.
చంస్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాల్పన్నిశాటంబు, ను
ద్దండాహూత మునీభ్యబిభ్యదమృతాంస్సిద్ధకూటంబు, వే
దండాశ్వధ్వజనీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా
ర్తాంస్యందన ఘోటమున్, బలిమఖాం ర్వేదికావాటమున్
.
టీక:- చండ = తీవ్రమైన; స్ఫూర్తిన్ = తేజస్సుగలవాడు; వటుండు = బ్రహ్మచారి; బహుధా = పెక్కవిధములుగ; జల్పన్ = వాగెడివారలను {జల్పనము - ఉపయుక్తముకాని, పెక్కు మాటలాడుట}; నిశాటంబునున్ = రాక్షసులను; ఉద్దండ = ఉద్దండులైన; ఆహూత = పిలువబడిన; ముని = మునులలో; ఇభ్య = శ్రేష్ఠులవలన; బిభ్యత్ = బెదురుచున్న; అమృతాంధస్ = దేవతల {అమృతాంధస్ - అమృతము ఆహారముగా కలవారు, దేవతలు}; సిద్ధ = సిద్ధుల; కూటంబున్ = సమూహములు కలది; వేదండ = ఏనుగులు; అశ్వ = గుఱ్ఱములు; ధ్వజనీ = సేనలు; కవాటమున్ = ద్వారమువద్దనున్నది; మహా = మిక్కిలి; ఉద్యత్ = చెలరేగుచున్న; ధూమ = పొగలతో; సంఛన్న = కప్పబడిన; మార్తాండ = సూర్యుని; స్యందన = రథముయొక్క; ఘోటమున్ = గుఱ్ఱములుకలది; బలి = బలి యొక్క; మఖ = యజ్ఞముయొక్క; అంతర = అంతర్భాగపు; వేదికావాటమున్ = సభాస్థలమును.
భావము:- బలిచక్రవర్తి యాగసాలను దర్శించాడు. అలా వామనుడు చూసిన బలి యాగసాలలో రాక్షసులు పెక్కువిధాలైన పెద్దపెద్ద సందడులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూసి దేవతలూ సిద్ధులూ భయపడుతున్నారు. ద్వారానికి ముందువైపు స్థలం ఏనుగులతో, గుఱ్ఱాలతో సైన్యాలతో నిండిపోయి ఉంది. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుఱ్ఱాలు పూర్తిగా కప్పబడి పోతున్నాయి.