పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/లక్ష్మీదేవి పుట్టుట

లక్ష్మీదేవి పుట్టుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-265-క.
తొలుకారు మెఱుఁగు కైవడి
తళ మని మేను మెఱవ గధగ మనుచున్
లుముల నీనెడు చూపులఁ
జెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా!

టీక:- తొలుకారు = వర్షాకాలపు; మెఱుగు = మెరుపుతీగల; కైవడి = వలె; తళతళ = తళతళ; అని = అని; మేను = దేహము; మెఱవన్ = మెరయుచుండగా; ధగధగ = ధగధగ; అనుచున్ = అనుచు; కలుములన్ = సంపదలను; ఈనెడు = కలిగించెడి; చూపులన్ = చూపుల; చెలువంబులు = సౌందర్యములకు; మొదలిటెంకి = మూలస్థానము; సిరి = లక్ష్మీదేవి; పుట్టెన్ = పుట్టెను; నృపా = రాజా.
భావము:- రాజా! పరీక్షిత్తూ! పాలకడలిలో ఆ తరువాత, అందచందాలకు ఆది రూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగల వంటి తళతళ మనే శరీరకాంతితో, సంపదలను వెదజల్లే ధగధగ మనే చూపులుతో విరాజిల్లుతున్నది.

తెభా-8-266-సీ.
"పాలమున్నీటి లోలి మీఁది మీఁగడ-
మిసిమి జిడ్డునఁ జేసి మేను పడసి
క్రొక్కారు మెఱుఁగుల కొనల క్రొత్తళుకుల-
మేనిచే గలనిగ్గు మెఱుఁగు జేసి
నాఁటి నాఁటికిఁ బ్రోది వకంపుఁదీవల-
నునుఁ బోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలఁకునఁ బ్రొద్దునఁ-
బొలసిన వలపులఁ బ్రోది పెట్టి

తెభా-8-266.1-తే.
సిడి చంపక దామంబు బాగుఁగూర్చి
వాలు క్రొన్నెల చెలువున వాడిఁ దీర్చి
జాణతనమునఁ జేతుల డ్డు విడిచి
లువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁడు నేఁడు.

టీక:- పాలమున్నీటి = సముద్రపు; లోపలి = అందలి; మీది = పైనయుండెడి; మీగడ = మీగడ మస్తువు; మిసిమి = మిసమిసలాడెడి; జిడ్డునన్ = మెరుగు; చేసి = వలన; మేనున్ = దేహమును; పడసి = పొంది; క్రొక్కారు = వర్షాకాలపు; మెఱుగుల = మెరుపులయొక్క; కొనలన్ = కొసలయొక్క; కొత్తళుకుల = సరికొత్తతళుకుల; మేనిచేగల = కాంతులుతేగల; నిగ్గు = అతియించెడి; మెఱుగుచేసి = మెరుగుపెట్టి; నాటినాటికి = అంతకంతకు; ప్రోదిన్ = పోగుపడెడి; నవకంపు = సరికొత్త; తీవల = తీగలయొక్క; నును = లేత; బోదన్ = కాండములచే; నెయ్యంబున్ = స్నేహమును; నూలుకొలిపి = కుదిర్చి; క్రొవ్వారు = అరవిరసిన; కెందమ్మి = ఎఱ్ఱతామరల; కొలకునన్ = కొలను యందు; ప్రొద్దున = ఉదయమే; పొలసిన = వ్యాపించిన; వలపులన్ = సువాసనలను; ప్రోదిపెట్టి = పోగుచేసి.
పసిడి = బంగారు; చంపక = సంపెంగల; దామంబున్ = దండలను; బాగుగా = చక్కగా; కూర్చి = కట్టి; వాలు = క్రిందికి దిగుచున్న; క్రొన్నెల = వెన్నెల; చెలువనన్ = సొగసుతో; వాడిదీర్చి = పదునుపెట్టి; జాణతనమునన్ = నేర్పుతో; చేతుల = చేతులయొక్క; జడ్డు = జడత్వమును; విడిచి = విడిచిపెట్టి; నలువ = బ్రహ్మదేవుడు; ఈ = ఈ; కొమ్మన్ = అందగత్తెను; ఒగిన్ = చక్కగా; చేసినాడు = చేసెను; నేడు = ఇప్పుడు.
భావము:- బ్రహ్మదేవుడు పాలసముద్ర జలాలపైన తేలే మీగడ మిసమిసలు నేర్పుగా తీర్చి దిద్ది ఆమె దేహాన్ని నిర్మించాడు; ఆపైన తొలకరి కాలపు మెరుపుల అంచులలోని సరిక్రొత్త కాంతిరేఖలతో మెరుగు పెట్టాడు; ఆపైన కోమలమైన తీగల నున్నని చెలువంతో ప్రతిదినం చెలిమి చేయించాడు; ఎఱ్ఱతామరల కొలనులో వేకువజామున వెదజల్లే సువాసనలు ప్రోదిచేసి; బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి; బాలచంద్రుని సొగసుతో పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లు లక్ష్మీదేవి ఒప్పారింది.

తెభా-8-267-క.
కెంపారెడు నధరంబును
జంపారెడి నడుము సతికి శంపారుచులన్
సొం పారు మోముఁ గన్నులుఁ
బెంపారుచు నొప్పుగొప్పు పిఱుఁదును గుచముల్."

టీక:- కెంపారెడు = ఎఱ్ఱగామెరసెడి; అధరంబును = పెదవులు; జంపారెడి = ఊగుతున్న; నడుము = నడుము; సతి = స్త్రీ; కిన్ = కి; శంపా = మెరుపుల యొక్క; రుచులన్ = కాంతులతో; సొంపారు = చక్కదనాలుపొంగెడి; మోమున్ = ముఖము; కన్నులున్ = కళ్ళు; పెంపారుచును = పెద్దవగుచు; ఒప్పు = చక్కనగు; కొప్పు = సిగ; పిఱుదునున్ = పిరుదులు; కుచముల్ = స్తనములు.
భావము:- “ఎఱ్ఱని కెంపులలా మెరిసే పెదవులూ; ఊగుతున్న సన్నని నడుమూ; మెరుపు కాంతుల మేలైన మొగమూ; తళుకులొత్తు కన్నులూ; పెంపొందిన కొప్పు; పెద్ద కటిప్రదేశమూ; చిక్కని కుచాలూ ఎంత చక్కగా ఉన్నాయో” అంటూ. .

తెభా-8-268-వ.
అని జనులు పొగడుచుండ
టీక:- అని = అని; జనులు = లోకులు; పొగుడుచుండన్ = కీర్తించుచుండగ.
భావము:- అంటూ ప్రజ లందరూ పొగడుతూ ఉండగా.

తెభా-8-269-సీ.
రుణికి మంగళస్నానంబు చేయింత-
ని పెట్టె నింద్రుఁ డర్ఘమైన
ణిమయ పీఠంబు; మంగళవతులైన-
వేలుపు గరితలు విమల తోయ
పూర్ణంబులై యున్న పుణ్యాహ కలశంబు-
లిడిరి; పల్లవముల నిచ్చె భూమిఁ;
డిమి గోవులు పంచవ్యంబులను నిచ్చె-
లసి వసంతుండు ధు వొసంగె;

తెభా-8-269.1-తే.
మునులు గల్పంబుఁ జెప్పిరి; మొగిలుగములు
ణవ గోముఖ కాహళ టహ మురజ
శంఖ వల్లకీ వేణు నిస్వనము లిచ్చెఁ;
బాడి రాడిరి గంధర్వ తులు సతులు.

టీక:- తరుణి = స్త్రీ; కిన్ = కి; మంగళస్నాంబున్ = మంగళస్నానములను; చేయింతము = చేయించెదము; అని = అని; పెట్టెన్ = నియమించెను; ఇంద్రుడు = ఇంద్రుడు; అనర్ఘమైన = వెలలేని; మణి = మణులు; మయ = పొదిగిన; పీఠంబున్ = పీటను; మంగళవతులు = పునిస్త్రీలు, ముత్తైదువలు; ఐన = అయిన; వేలుపు = దేవతా; గరితలున్ = ఇల్లాండ్రు; విమల = స్వచ్ఛమైన; తోయ = నీటితో; పూర్ణంబులు = నిండినవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; పుణ్యాహ = మంగళాకరమైన; కలశంబుల్ = కడవలను; ఇడిరి = ఇచ్చిరి; పల్లవములను = చిగుళ్ళను; ఇచ్చెన్ = ఇచ్చెను; భూమిన్ = భూదేవి; కడిమిన్ = చివరగా; గోవులు = గోవులు; పంచగవ్యములన్ = పంచగవ్యములను; ఇచ్చెన్ = ఇచ్చెను; మలసి = పూని; వసంతుండు = వసంతుడు; మధువున్ = తేనెను; ఒసగెన్ = ఇచ్చెను.
మునులు = మునులు; కల్పంబున్ = సంకల్పమును; చెప్పిరి = చెప్పిరి; మొగిలు = మబ్బుల; గములు = గుంపులు; పణవ = ఉడుకలు, తప్పెటలు; గోముఖ = గోముఖములు; కాహళ = బాకాలు; పటహ = తప్పెళ్ళు; మురజ = మద్దెలలు; శంఖ = శంఖములు; వల్లకీ = వీణలు; వేణు = పిల్లనగ్రోవుల యొక్క; నిస్వనములన్ = ధ్వనులను; ఇచ్చెన్ = చేసెను; పాడిరి = పాడిరి; ఆడిరి = నాట్యములుచేసిరి; గంధర్వ = గంధర్వ; పతులు = పురుషులు; సతులు = స్త్రీలు.
భావము:- ఇలా జనులు అందరూ పొగడుతుండగా, జవరాలైన లక్ష్మీదేవికి మంగళస్నానం చేయించడం కోసం ఇంద్రుడు వెలకట్టలేని రత్నాలు పొదిగిన పీఠం అమర్చాడు. దేవతా ముత్తైదువలు కడవలతో నిండుగా నిర్మలమైన నీళ్ళు తెచ్చారు, భూదేవి ఆ కళశాలలోకి చిగుళ్ళను ఇచ్చింది. ఆవులు పాలూ పెరుగూ నెయ్యీ పంచిత గోమయాలు అనే పంచ గవ్యాలనూ ఇచ్చాయి. వసంతుడు విరివిగా తేనె అందించాడు. మునులు సంకల్పం చెప్పారు. మేఘాలు పణవాలూ, గోముఖాలూ, బాకాలూ, తప్పెట్లూ, మద్దెలలూ, శంఖాలూ, వీణలూ, వేణువులూ మ్రోగినట్లు ధ్వనించాయి. గంధర్వులు పాడారు. గంధర్వ కాంతలు నాట్యాలు ఆడారు.

తెభా-8-270-క.
పండిత సూక్తుల తోడుతఁ
దుండంబులు చాఁచి తీర్థ తోయములెల్లం
దుంముల ముంచి దిగ్వే
దండంబులు జలక మార్చెఁ రుణీ మణికిన్.

టీక:- పండితుల = పండితులయొక్క; సూక్తుల = మంగళాశీస్సుల; తోడుతన్ = తోటి; తుండంబులున్ = తొండములను; చాచి = చాచి; తీర్థ = పుణ్యతీర్థముల; తోయముల్ = నీళ్ళు; ఎల్లన్ = అన్నిటియందు; తుండములన్ = తొండములను; ముంచి = ముంచి; దిగ్వేదండంబులు = దిగ్గజములు; జలకము = స్నానము; ఆర్చెన్ = చేయించెను; తరుణీ = స్త్రీలలో; మణి = రత్నమువంటియామె; కిన్ = కి.
భావము:- మహా పండితులు మంగళాశీస్సులు పలుకసాగారు. దిగ్గజాలు తొండాలు చాచి పుణ్యతీర్థాల లోని జలాలు తెచ్చి, అన్నులమిన్న అయిన లక్ష్మీదేవికి స్నానం చేయించాయి.

తెభా-8-271-సీ.
ట్టంగఁ బచ్చని ట్టుఁబుట్టపు దోయి-
ముదితకుఁ దెచ్చి సముద్రుఁ డిచ్చె;
త్తాళి నికరంబు ధ్వాశ మూఁగిన-
వైజయంతీమాల రుణుఁ డిచ్చెఁ;
గాంచన కేయూర కంకణ కింకిణీ-
టకాదులను విశ్వర్మ యిచ్చె;
భారతి యొక మంచి తారహారము నిచ్చె-
బాణిపద్మము నిచ్చెఁ ద్మభవుఁడు;

తెభా-8-271.1-ఆ.
కుండలివ్రజంబు గుండలముల నిచ్చె;
శ్రుతులు భద్రమైన నుతులు జేసె;
"నెల్ల లోకములకు నేలిక సానివై
బ్రతికె" దనుచు దిశలు లికె నధిప!

టీక:- కట్టంగన్ = కట్టుకొనుటకు; పచ్చని = పచ్చటి; పట్టుబట్టపు = పట్టుబట్టల; దోయి = జత; ముదిత = స్త్రీ; కున్ = కి; తెచ్చి = తీసుకొని వచ్చి; సముద్రుడు = సముద్రుడు; ఇచ్చెన్ = ఇచ్చెను; మత్తాళి = తుమ్మెదల; నికరంబు = గుంపులు; మధువు = పూతేనెపైని; ఆశన్ = ఆశతో; మూగిన = గుంపుగాచేరిన; వైజయంతీమాలన్ = వైజయంతీమాలను; వరుణుడు = వరుణుడు; ఇచ్చెన్ = ఇచ్ఛెను; కాంచన = బంగారపు; కేయూర = దండకడియములు; కంకణ = కంకణములు; కింకిణీ = గజ్జల; కటక = కడిమయులు; ఆదులను = మున్నగువానిని; విశ్వకర్మ = దేవశిల్పియైన విశ్వకర్మ; ఇచ్చెన్ = ఇచ్చెను; భారతి = సరస్వతీదేవి; ఒక = ఒక; మంచి = మేలైన; తారహారమున్ = ముత్యాలహారము; ఇచ్చెన్ = ఇచ్చెను; పాణిపద్మమున్ = చేతిలోకిక్రీడాపద్మము; ఇచ్చెన్ = ఇచ్ఛెను; పద్మభవుడు = బ్రహ్మదేవుడు;
కుండలి = నాగుల; వ్రజంబు = సమూహము; కుండలములన్ = చెవికుండలములను; ఇచ్ఛె = ఇచ్ఛెను; శ్రుతులు = వేదములు; భద్రమైన = మంగళకరమైన; నుతులు = స్తోత్రములను; చేసె = చేసెను; ఎల్ల = సమస్తమైన; లోకముల్ = భువనముల; కున్ = కు; ఏలిక = పరిపాలించెడి; సానివి = అధిపురాలివి; ఐ = అయ్యి; బ్రతికెదు = జీవించెదవు; అనుచున్ = అనుచు; దిశలు = దిక్కులు; పలికెన్ = పలికినవి; అధిప = రాజా.
భావము:- ఓ గొప్పవాడా! పరీక్షిన్మహారాజా! సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు. వరుణుడు పూతేనెలకోసం మధుకరాలు మూగుతున్న వైజయంతీ మాల సమర్పించాడు. విశ్వకర్మ బంగారపు బాహు పురులూ, కంకణాలూ, కాళ్ళకు గజ్జలు, కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు, బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలాకమలాన్ని ఇచ్చాడు. నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు. వేదాలు మంగళకరమైన స్తోత్రాలను సమకూర్చాయి. దిక్కులు “ఎల్ల లోకాలకు ఏలికసానివి అయి జీవించు” అని దీవించాయి.

తెభా-8-272-వ.
మఱియును
టీక:- మఱియును = ఇంకను.
భావము:- అంతే కాదు, సాగరంలో పుట్టిన లక్ష్మీదేవి ఎంతటిది అంటే.

తెభా-8-273-సీ.
లుకుల నమృతంబు చిలుక నెవ్వానితో-
భాషించె వాఁడెపో బ్రహ్మ యనఁగ
నెలయించి కెంగేల నెవ్వని వరియించె-
వాఁడె లోకములకు ల్లభుండు
మెయిదీఁగ నెవ్వని మేనితోఁ గదియించె-
వాఁడెపో పరమ సర్వజ్ఞమూర్తి
నెలతుక యెప్పుడు నివసించు నేయింట-
నాయిల్లు పరమగు మృత పదము

తెభా-8-273.1-ఆ.
నింతి చూపు వాఱె నెచ్చోటి కచ్చోటు
జిష్ణుధనద ధర్మ జీవితంబు
గొమ్మ చిన్న నగవు గురుతర దుఃఖ ని
వారణంబు సృష్టి కారణంబు.

టీక:- పలుకులన్ = పలకరింపులలో; అమృతంబున్ = అమృతము; చిలుకన్ = చిలకరించునట్లు; ఎవ్వాని = ఎవని; తోన్ = తోనైతే; భాషించెన్ = మాట్లాడునో; వాడెపో = అతడుమాత్రమే; బ్రహ్మ = ఆనంద బ్రహ్మ; అనగన్ = అనగా; ఎలయించి = మెచ్చుకొనుచు; కెంగేల = ఎఱ్ఱనిచేతితో; ఎవ్వనిన్ = ఎవనినైతే; వరియించెన్ = ఇష్టపడెనో; వాడె = అతడుమాత్రమే; లోకముల్ = భువనముల; కున్ = కు; వల్లభుండు = అధిపతి; మెయి = దేహము యనెడి; తీగన్ = తీవతో; ఎవ్వనిన్ = ఎవనియొక్క; మేని = దేహము; తోన్ = తోటి; కదియించు = కౌగలించుకొనునో; వాడెపో = అతడుమాత్రమే; పరమ = అత్యుత్తమమైన; సర్వజ్ఞమూర్తి = అఖిలముతెలిసినవాడు; నెలతుక = అందగత్తె; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నివసించున్ = ఉండునో; ఏ = ఏ; ఇంటన్ = గృహమునందు; ఆ = ఆ; ఇల్లు = గృహము; పరము = అత్యుత్తమమైనది; అగు = అయిన; అమృత = శాశ్వతమైన; పదము = వైకుంఠము; ఇంతి = స్త్రీ యొక్క.
చూపు = దృష్టి; వాఱెన్ = ప్రసరించెనో; ఏ = ఏ; చోటి = ప్రదేశమున; కిన్ = కు; ఆ = ఆ; చోటున్ = ప్రదేశము; జిష్ణు = ఇంద్రుని; ధనదు = కుబేరుని; ధర్మ = యమధర్మరాజులకు; జీవితంబు = ఆయువుపట్టు; కొమ్మ = అందగత్తె యొక్క; చిన్ననగవు = చిరునవ్వు; గురుతర = మిక్కిలి భారమైన; దుఃఖ = దుఃఖములను; నివారణంబు = పోగొట్టునది; సృష్టి = సృష్టిని; కారణంబు = వెలిగింపజేయునది.
భావము:- లక్ష్మీదేవి అమృతాన్ని చిలికించే తన వాక్కులతో ఎవరితో పలుకుతుందో అతడే పరబ్రహ్మ. ఆమె మెచ్చుకుంటూ అందమైన తన చేతితో ఎవరిని వరిస్తుందో అతడే సమస్త లోకాలకూ అధిపతి. ఆమె తీగవంటి తన దేహాన్ని ఎవరి మేనుతో చేరుస్తుందో అతడే సర్వజ్ఞుడు. ఏ ఇంట్లో అయితే ఆమె ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో అది పరమాద్భుతమైన అమృత నిలయం. ఆమె చూపులు ఎచ్చట ప్రసరింపజేస్తూ ఉంటుందో అది ఇంద్రునికీ, కుబేరునికీ, యమునికీ ఆయువుపట్టు. ఆ సుందరి చిరునవ్వు దుఃఖాన్ని తొలగించుతుంది, సృష్టిని ప్రకాశింపజేస్తుంది.

తెభా-8-274-వ.
మఱియు నక్కొమ్మ నెమ్మనంబున.
టీక:- మఱియును = ఇంకను; ఈ = ఈ; కొమ్మ = అందగత్తె; నెర = నిండైన; మనంబునన్ = మనసులో.
భావము:- ఇంకా ఆ మనోహరాంగి లక్ష్మీదేవి తన నిండు మనసులో ఇలా భావిస్తుంది....

తెభా-8-275-సీ.
భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు-
నాటల బొమ్మరిల్లని తలంచుఁ
బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ-
న యింటిలో దొంతుని తలంచుఁ
బాటించి యొకమాటు బ్రహ్మాది సురలను-
న యింటిలో బొమ్మని తలంచు
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు-
లవడ బొమ్మపీఁని తలంచు

తెభా-8-275.1-ఆ.
సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల
చటి దీపకళిక ని తలంచు
భామ యొక్క మాటు భారతీదుర్గల
నాత్మసఖు లటంచు నాదరించు.

టీక:- భావించి = తలచి; ఒకమాటు = ఒకసారి; బ్రహ్మాండము = బ్రహ్మాండము; అంతయున్ = సమస్తము; ఆటల = ఆడుకొనుటకైన; బొమ్మరిల్లు = ఇల్లుబొమ్మ; అని = అని; తలంచున్ = అనుకొనును; పోలించి = పోల్చుకొని; ఒకమాటు = ఒకసారి; భవనంబులు = లోకములు; అన్నియున్ = సమస్తము; తన = తన యొక్క; ఇంటి = గృహము; లోన్ = అందలి; దొంతులు = కుండలపేర్పు; అని = అని; తలంచున్ = అనుకొనును; పాటించి = పూని; ఒకమాటు = ఒకసారి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; సురులను = దేవతలను; తన = తన యొక్క; ఇంటి = గృహము; లోన్ = లోని; బొమ్మలు = బొమ్మలు; అని = అని; తలంచున్ = అనుకొనును; కొనకొని = పూని; ఒకమాటు = ఒకసారి; కుంభినీచక్రంబున్ = భూమండలమును; అలవడన్ = అమరిన; బొమ్మపీట = పీటబొమ్మ; అని = అని; తలంచున్ = అనుకొనును.
సొలసి = పారవశ్యముతో; ఒకమాటు = ఒకసారి; సుర్య = సుర్యుని; ఇందు = చంద్రుని; రోచులన్ = కాంతులను; అచటి = అక్కడి; దీప = దీపముల; కళికలు = కళికలు; అని = అని; తలంచున్ = అనుకొనును; భామ = అందగత్తె; ఒక్కమాటు = ఒకసారి; భారతీ = సరస్వతీదేవి; దుర్గలన్ = పార్వతీదేవిలను; ఆత్మ = తన యొక్క; సఖులు = చెలికత్తెలు; అటంచున్ = అనుకొనుచు; ఆదరించున్ = ఆదరించును.
భావము:- ఒక్కోసారి బ్రహాండం అంతా తన బొమ్మరిల్లుగా లక్ష్మీదేవి భావించేది. ఒకమారు, సకల లోకాలూ ఉండే బ్రహ్మాండ భాండాలు తన ఇంటిలోని కుండల దొంతరలుగా తలంచేది. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలను తన ఆట బొమ్మలుగా ఒకసారి అనుకునేది. ఒకమాటు భూమండలాన్ని తన బొమ్మల కొలువు అని భావించేది. సూర్యచంద్రులను అక్కడ ఉండే చిరు దీపాలు అని చూసేది. సరస్వతీదేవిని పార్వతీదేవిని తన అనుంగు చెలికత్తెలుగా ఆదరించేది.

తెభా-8-276-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతరంబ = తరవాత.
భావము:- లక్ష్మీదేవి అలా అవతరించిన పిమ్మట

తెభా-8-277-ఆ.
చంచరీకనికర ఝంకార నినదంబు
నరు నుత్పలముల దండ పెట్టి
మేఘకోటి నడిమి మెఱుఁగుఁ బుత్తడి మాడ్కి
సురల నడుమ నిల్చె సుందరాంగి.

టీక:- చంచరీక = తుమ్మెదల; నికర = సమూహముల; ఝంకార = ఝుమ్మనియెడి; నినదంబు = శబ్దములతో; తనరు = అతిశయించెడి; ఉత్పలముల = కలువల; దండ = మాలను; పెట్టి = ధరించి; మేఘ = మబ్బుల; కోటి = సమూహముల; నడిమిన్ = మధ్యలో; మెఱుగు = మెరుపుల; పుత్తడి = బంగారము; మాడ్కిన్ = వలె; సురల = దేవతల; నడుమన్ = మధ్యలో; నిల్చెన్ = ఉండెను; సుందరాంగి = అందగత్తె.
భావము:- ఆ సుందరాంగి ఇందిరాదేవి దేవత లందరి మధ్య, ఝంకారం చేస్తున్న తుమ్మెదలతో కూడిన కలువల దండను చేతులలో పట్టుకుని, మేఘాల నడుమ మెరిసే మెరుపు తీగ వలె (తగిన వరుడిని వరించడానికి) నిలబడింది.

తెభా-8-278-క.
న్నులు నా చన్నులు
నా కురు లా పిఱుఁదు నడుము నా ముఖమా న
వ్యాకారముఁ గని వేల్పులు
చీకాకునఁ బడిరి కలఁగి శ్రీహరి దక్కన్.

టీక:- ఆ = ఆ; కన్నులు = కళ్ళు; ఆ = ఆ; చన్నులున్ = స్తనములు; ఆ = ఆ; కురులున్ = శిరోజములు; ఆ = ఆ; పిఱుదున్ = పిరుదులు; నడుమున్ = నడుము; ఆ = ఆ; ముఖము = మోము; ఆ = ఆ; నవ్య = నుతింపదగిన; ఆకారమున్ = రూపమును; కని = చూసి; వేల్పులు = దేవతలు; చీకాకునన్ = శ్రమము, నలకువ; పడిరి = పొందిరి; కలగి = కలతచెంది; శ్రీహరి = విష్ణుమూర్తి; తక్కన్ = తప్పించి.
భావము:- అపురూపమైన ఆకారం కలిగినామె ఆ మహాలక్ష్మి. నవనవోన్మేషమైన స్వరూపాలు కలిగిన ఆమె కళ్ళు, ఉరోజాలు, శిరోజాలూ, పిరుదులు, నడుము, ముఖము చూసి, ఒక్క శ్రీమహావిష్ణువు తప్ప దేవతలు అందరూ ధైర్యాన్ని కోల్పోయి తబ్బిబ్బు పడ్డారు