పరాకు నీ కేలర రామ

త్యాగరాజు కృతులు

అం అః

కిరణావళి రాగం - దేశాది తాళం


పల్లవి

పరాకు నీ కేలర ? రామ !


అనుపల్లవి

చరాచరముల వసియించు, ఓ -

సారసాక్షా ! నా పనులనిన నీ


చరణము

పురాన శబరి యొసంగిన యటు నే

భుజించు కొన్న శేషమా ? రామ !

ధరాతలమున గుహునివలె బత్ర

తల్ప మొనర్చితినా ? శ్రీత్యాగరాజుపై