నీ దయ గల్గుటే భాగ్యమని
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
రీతిగౌళ రాగం - ఆది తాళం
- పల్లవి
నీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో ?
- అనుపల్లవి
నాద రూప ! నీరద సన్నిభ ! దిన -
నాథాన్వయభూషణ ! మృదు భాషణ !
- చరణము 1
అవివేకులైన దార తనయుల - ననుదినమును గలసి
భవ సాగరమున నీదలేక - భయమున జెయ్యలసి
యవనీశుల గాచి సుఖము - లేక ఆయాసము సొలసి
వివిధములగు నీ మాయ లోపల
దగిలిన తన కీ యవధులను దెలిసి
- చరణము 2
వేగి లేచి తా నతి లోభి జనుల - వెంబడిగ దిరిగి
రోగియై తా కోరిన కోర్కెలు - రోయక మేను కరగి
భోగ భాగ్యముల కొర కన్యసురుల భూసురుల గోరి తిరిగి
యేగతియు లేక యీ సుఖంబు
లిట్లని తన మదిని తా నెఱిగి
- చరణము 3
నాగ నాయక శయ ! నేందు దిననాథనయన ! సీతాంక !
యోగి వందిత పదారవింద యుగ శరణా ! కళంక !
గాగ లోభ మదాదుల గొట్టి - రక్షించెడు బిరుదాంక !
త్యాగరాజ పూజిత రఘునాయక !
తారకమని తెలియు నిశ్శంక