నీ చిత్తము నిశ్చలము

త్యాగరాజు కృతులు

అం అః

ధన్యాసి రాగము - చాపు తాళం


పల్లవి

నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నె నమ్మినాను


అనుపల్లవి

నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి; శ్రీరామ !


చరణము

గురువు చిల్లగింజ గురువే భ్రమరము

గురు డే భాస్కరు డు - గురు డే భద్రు డు -

గురుడే యుత్తమగతి - గురువునీ వనుకొంటి

ధరను దాసుని బ్రోవ, - త్యాగరాజనుత !