నిన్ను బాసి యెట్ల యుందురో
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
బలహంస రాగం - ఆది తాళం
- పల్లవి
నిన్ను బాసి యెట్ల యుందురో ? - నిర్మలాత్ములౌ జనులు
- అనుపల్లవి
అనఘ ! సుపుణ్య అమర వరేణ్య !
సనక శరణ్య ! సత్కారుణ్య !
- చరణము
కనులకు చలువ, చెవుల కమృతము,
విను రసనకు రుచి, మనసుకు సుఖము,
తనువుకు యానందమును గల్గజేయు
త్యాగరాజ హృద్ధామ ! పూర్ణకామ !