నన్ను బ్రోవ నీ కింత తామసమా
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఆభోగి రాగము - దేశది తాళము
- పల్లవి
నన్ను బ్రోవ నీ కింత తామసమా ?
నాపై నేరమేమి బల్కుమా ?
- అనుపల్లవి
చిన్ననాడె నీ చెలిమి గలుగ నోరి -
చింతింప లేదా ? శ్రీరామ !
- చరణము
నిజదాస వరులగు తమ్ములతో
నీవు బాగ బుట్టగ లేదా ?
గజరాజరక్షక ! తనయులను -
కనిపెంచ లేదా ? త్యాగరాజనుత !