దుడుకు గల న న్నేదొర
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
గౌళ రాగం - ఆది తాళం
- పల్లవి
దుడుకు గల న న్నేదొర - కొడుకు బ్రోచురా ? యెంతో
- అనుపల్లవి
కడు దుర్విషయాకృష్ణు డై - గడియ గడియకు నిండారు
- చరణము 1
శ్రీవనితాహృత్కుముదాబ్జావాజ్మానసగోచర
- చరణము 2
సకలభూతములయందు నీవై యుండగ మదిలేకబోయిన
- చరణము 3
చిరుత ప్రాయమునా డె భజనామృత - రసవిహీన కుతర్కు డైన
- చరణము 4
పర ధనముల కొరకు నొరుల మదిని - కర గ - బలికి కడుపునింప దిరిగినట్టి
- చరణము 5
తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు - సదా దినములు గడిపెడు
- చరణము 6
తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుప - దేశించి సంతసిల్లి స్వరలయంబు లెఱు గకను శిలాత్ములై సుభక్తులకు సమానమను
- చరణము 7
దృష్టికి సారంబగు లలనా సదనార్భ సేనామిత ధనాదులను, దేవదేవ ! నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన
- చరణము 8
చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ జేయకనే దుర్మదాంధ జనుల గోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధియై చపల చిత్తు డైన
- చరణము 9
మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక, మదమత్సర కామలోభ మోహములకు దాసు డై మోసబోతి గాక, మొదటి కులజు డగుచు భువిని శూద్రుల పనులు సల్పుచును యుంటిని గాక, నరాధములను గోరిసారహీనమతములను సాధింప తారుమారు
- చరణము 10
సతులకి కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన - తతులకై దిరిగితినయ్య, త్యాగరాజాప్త ! యిటువంటి