త్యాగరాజు గారి పంచరత్న కృతులు
జగదానంద కారకా | దుడుకు గల | సాధించెనే | కనక రుచిర | ఎందరో మహానుభావులు
త్యాగరాజు కృతులు

అం అః


గౌళ - ఆది


దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో

॥దుడుకు॥


కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు

॥దుడుకు॥


శ్రీవనితా హృత్కుముదాబ్జ, అవాఙ్మానసగోచర

సకల భూతములయందు నీవై యుండగా మదిలేక బోయిన

॥దు॥


చిఱుతప్రాయములనాడే, భజనామృత రసవిహీన కుతర్కుడైన


॥దు॥


పరధనముల కొఱకు నొరుల మది

కరగబలికి కడుపునింప తిరిగినట్టి


॥దు॥


తన మదిని భువిని సౌఖ్యపు జీ-

వనమె యనుచు సదా దినములు గడిపే


॥దు॥


తెలియని నటవిట క్షుద్రులు వనితలు

స్వవశమవుట కువదిశించి,

సంతసిల్లి స్వరలయంబు లెఱుంగకను

శిలాత్ములై సుభక్తులకు సమానమను


॥దు॥


దృష్టికి సారంబగు లలనా సదనార్భక

సేవామిత ధనాదులను,

దేవాదిదేవ నెర నమ్మితి గాకను

నీ పదాబ్జ భజనంబు మఱచిన


॥దు॥


చక్కని ముఖకమలంబును సదా

నా మదిలో స్మరణ లేకనే

దుర్మదాంధ జనులకోరి పరి-

తాపములచేదగిలి నొగిలి

దుర్విషయ దురాసలను రోయలేక

సతత మపరాధినయి, చపలచిత్తుడనైన


॥దు॥


మానవతను దుర్లభమనుచు నెంచి

పరమానంద మొందలేక,

మదమత్సర కామలోభమోహాలకు

దాసుడయి మోసబోతిగాక,

మొదటి కులజుడగుచు భువివి

శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక,

నరాధములును రోయ రసవిహీన-

మయినను సాధింప తారుమారు

సతులకు కొన్నాళ్ళస్తికై సుతులకి కొన్నాళ్ళు

ధనపతులకై తిరిగితినయ్య

త్యాగరాజాప్త ఇటువంటి


॥దు॥


చుడండి:

  1. త్యాగరాజు
  2. తెలుగు సాహిత్యము
  3. తెలుగు
  4. పంచరత్న కృతులు
"https://te.wikisource.org/w/index.php?title=దుడుకు_గల&oldid=18802" నుండి వెలికితీశారు