తప్పి బ్రతికి పోవ తరమా

త్యాగరాజు కృతులు

అం అః

తోడి రాగము - రూపక తాళము


పల్లవి

తప్పి బ్రతికి పోవ - తరమా ? రామ ! కలిలో

అనుపల్లవి

ముప్పున విషయ తటాక - మున మునుగక దృఢ మనసై


చరణము 1

కంచు మొదలు లోహధన - కనకములను జూచి విష

మంచు మఱియ పెంచికనుచు - యెంచి యంటని మనసై


చరణము 2

నంగనాచుల మానగు - యంగ వస్త్రముల బాగగు

ముంగురులను గని యంత - రంగమునను యాశించక


చరణము 3

జాజి మల్లె మందార సరోజములను, మనసార

రాజపథముచే త్యాగ - రాజనుతుని పూజించక