జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 19

కొంచెము వేరుగా ఉంటుంది.వీరు ఒకకళాశా లలో మూడేళ్ళు చనువుకొని "స్టాటు” అనే పరీ క్షను మూడు విషయాలలో ఇవ్వవలెను-ఇదిగాక వారొక కొత్త విషయమును గురించి ఒక వ్యాస మును వ్రా యవ లెను- ఈ పరీక్ష, ఇంగ్లీషు విశ్వవిద్యా లయాలలోని బి.యే పరీక్షకు సరిపోతుంది, పరీక్షలు స్యాసయిన తరువాత ఉపాధ్యాయులు బోధనాభ్యసనకళాశాలలకు పోరు. వారిని ఆరు గురేసి చొప్పున హైస్కూళ్ళకుపోయి ప్రధా నోపాధ్యాయుల తనఖి కింద బోధనానుభవమును సంపాదిస్తారు. అచ్చట రెండేళ్ళయిన తరువాత ఇన్ స్పెక్టర్ సంఘ మొకటి ఏర్పడి వీరినిపరీక్షిస్తారు.

అధ్యాయము 19

జర్మను పరీక్షలు.

ఇంగ్లాండులోను. ఇండియాలోన వలె, జర్మ నీలో నెలకొకసారి, టెర్ముకొక సారి, సంవత్సరమున కొకసారి పరీక్షలు లేవు. ప్రతి సంవత్సరమున్ను

169

పరీక్షలు చేసి పై తరగతులలో వేసే ప్పద్దతి

ఆదేశములో లేదు. సంవత్సరమునకు మూడు టెర్ములు, టెర్ము ఆఖరున ఉపాధ్యాయుడు : ద్యార్థిని గురిం చిన తన అభిప్రాయమును ఒక (రిజిష్టరులో వ్రా స్తాడు. ఈ అభిప్రాయాలు మాటలలో ఉండవు. ఎ, బి, సి, అనిగాని, 1, 2, 3, అనిగానీ ఉంటవి. చాలాబడులలో ఇంగ్లాండులోవలె ఎ+, ఎ-బి + బి-- సీ+, సి-, మొదలయిన ఏ భాగమున్ను ఉంటుంది. సంవత్సరాంతమున ప్రధానోపాధ్యా యుడు ఉపాధ్యాయుల సలహాల మీదను, టెర్ము రిమార్కుల సహాయముతోను, పిల్లలను పై తర గతులలో వేస్తాడు. నూటికి పదిమంది కంటే ఎ క్కువమందిని వెనుకకు ఉంచి వేయడు. చదువు బాగుగ లేదని పిల్లలకున్న వారితండ్రుల కున్ను చా లాముందుగానే తెలియ జేస్తారు. కానీ, పరీక్షలలో ప్యాసయి తేనేతప్ప ప్యాసు చేయకపోడు. ప్రతి బడిలోను, ఆటలు, వ్యాయామక్రీడలు, కసరత్తు, విధేయత, మంచినడవడి, తెలివి తేటలకు కూడా మార్కులిస్తారు.

170

హైస్కూలులోని తుదిషరీక్షకు అబిట్యూరీ యెంటెన్ పరీక్ష అని పేరు. ఇది ప్యాసయినవారు వీశ్వవిద్యాలయములో గాని, కార్మిక, వృత్తి కళా శాలలలో గాని చేరవచ్చును- ఆబిట్యూరియెంటెన్ పరీకు విద్యార్థి పండోమ్మిదో యేట జరుగుతుంది. మన ఇంటర్మీడి యేట పరీక్ష అంత కఠినముగా ఉంటుంది.ఈ పరీక్షకు ఆమండలఇ న్స్పెక్టరు. తనిఖీ కింద, ఆయా విషయాలను చెప్పిన ఉపాధ్యాయు లే చేస్తారు. పరీక్ష వ్రాతలోను నో టితోను కూడా ఒకొక్క పేసరులో ఒక్క ప్రశ్నే ఉంటుంది. ఆవిషయమై విద్యార్థి ఒక వ్యాసమును వ్రాయవ లెను. మన పరీక్షలలోవలె అనేక ప్రశ్న లకు ఉత్తరములు వ్రాయనక్కర లేదు. ఉపా ధ్యాయుడు మూడు ప్రశ్నలు వ్రాసియిస్తే ఇన్స్పె క్టరు వాటిలోనుంచి ఒక్క ప్రశ్నను ఎంచు తాడు, సాధారణముగా పరీక్షకు మూడు నెలలకు పూర్వము ఒక పరీక్ష చేసి, తుదిపరీక్షలో నెగ్గగలరనితోచినవా ళ్ళనే అబిట్యూయరియెం టెస్ పరీక్షకు పోనిస్తాడు. ఈ విధముగా వెనుక నుండిపోయేవారు. నూటికి 15


171

గురుకంటె ఎక్కువమంది ఉండరు. వ్రాతపరీ

క్షలో బాగుగా చేయని వారిని నోటితో కూడా పరీ క్షిస్తారు. భాషా పరీక్షలలో విద్యార్థులు నిఘం టువుల నుపయోగించుకోవచ్చును. పరీక్షలలో ఏవోకొన్ని ముఖ్య విషయాలలో నే కాని, అన్నిటి లోను పరీక్ష చేయరు. జిమ్నేసియముబడు లలో భాషమీదను, ఓబర్-రియల్ -షూలెలో భాషలు, గణితము', శాస్త్ర ముమీదను పరీక్ష చేస్తారు. విశ్వవిద్యాలయములో డాక్టరు పరీక్ష ఒక్కటే ఉంటుంది. దీనిలో తరగతులనీ ఒకతర గతిలోనుంచి మరిఒక తరగతిలోనికి వేయడమనిన్ని ఉండదు.ఇండియాలోని పరీక్షలు ఇంగ్లాండులోని పక్షులను అనుకరిస్తున్నవి. జర్మనుపరీక్షలను గు రించి తెలుసుకోవలెనంటే మన ఇప్పటి పరీక్షలన, గురించి మరచిపోవలెను. జర్మను పరీక్షలు ఇంచు మించుగా మన దేశములో ఇంగ్లీషువారు రాక పూర్వ ముండేపక్షులను పోలి ఉంటవి. డాక్టరు పరీక్షకు పోయేవారు ఒక అధ్యాపకుని చేతికింద పరి శోధన చేయవలెను, ఆ అధ్యాపకుడు విద్యార్థి


172

పనిలో సహాయము చేస్తూ ఉంటాడు. పరీక్షకు అద్యాపకుడు ఒప్పుకొన్న ఒక విషయము మీద

వ్యాసము వ్రాయవలెను. వ్యాసము సరిగా ఉన్న దని ఒప్పుకొన్న తరువాత, ఒకసాయంకాలము ఏ ర్పరచి నోటి పరీక్ష చేస్తారు. ఈపరీక్షకు విద్యార్ధి రెండు విషయాలను ఎంచుకొంటాడు. ఇవి తానుపరిశోధన చేసిన ముఖ్యవిషయమునకు సంబంధించి ఉడనక్కరలేదు. గణికములో పరీక్ష ఇ చ్చేవాడు నోటి పరీక్షకు సంస్కృతమున్న, భూగర్భశాస్త్రము న్ను ఎంచుకోవచ్చును. ముగ్గురు పరీక్షకులను ఏర్పాటు చేస్తారు. ఏ ద్యార్థి పరీక్షకు ముందుదినమున 10 గంటలకున్ను 1 గంటకున్ను మధ్య సాయంకాలపు దుస్తులు వేసుకొని ఆ ముగ్గురు పరీక్షుకులను చూడవ లెను. “నీ వేమీ ఉపన్యాసాలు విన్నావు? ఏమిఫుస్తకాలు చదివినావు?” అనివా రతనిని అడుగుతారు. నోటిపరీక్ష సాధారణముగా రెండు గంటలు జరుగుతుంది. ఆయాఫాకల్టీల అధ్యక్షులు విద్యార్థి తీసుకొన్న విషయమును గు రించి తెలియని ఒక నిని నియమిస్తాడు; అతడు పరీక్ష


173

కులతో కూర్చొని జరిగినదంతా వ్రాస్తాడు. వ్రా తపరీక్ష కంటే నోటిపరీక్ష చాలా కఠినముగా ఉం టుంది; సూక్ష్మపరీక్ష చేస్తారు. గుడ్డి పాఠముగా వల్లె వేయడానికి అవకాశముండదు. పరీక్ష జర్మను భాషలో జరుగుతుంది; కాని, అవసరమును బట్టి ఇంగ్లీషులో కూడా చేస్తారు. విద్యా స్థలమును విడిచి పెట్టకముందే పరీక్ష ఫలితమును చెప్పి వేస్తాడు. పరిక్షలో తప్పిపో తే, ఆ అవమానము అతనికి చదువు చెప్పిన అధ్యాపకు నిదిగాని, విద్యార్థిది కాదు. విద్యార్థి తన జీవితములో సంపాదించుకొనే కీర్త్యపకీర్తులు కూడా అధ్యాపకుని వే. మనపండితులు ఫ లానావారి శిష్యులమని చెప్పుకొన్నట్లే జర్మను డాక్టరు పరీక్ష ప్యాసయిన వారు తమ అధ్యాపకుల పేళ్ళను చెప్పుకొంటారు.


174