జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 20
అధ్యాయము 20
జీతములు , ఫించనులు,
జర్మనీ లోని ప్రభుత్వోద్యోగులందరున్ను , ఏశాఖలో పనిచేస్తున్న వారైనా పన్నెండు తరగ తులుగా ఉంటారు. ఒకొక్క తరగతిలోని వారం దరికీ ఒకేరీతిగా జీతములిస్తారు. ప్రాథమిక పాఠశాల లో పాధ్యాయులకు సంవత్సరమునకు 120 పౌనులనుంచి 200 పౌనులవరకున్ను, మాధ్యమిక పాకశాలలకోని నాచిక 120 పౌనులనుంచి 230 పౌనులవరకున్ను జీతాలిస్తారు. ఈ పాకశాలలలోని ప్రధానోపాధ్యాయులకు మరి 50 పౌనులు ఎల వెన్సుఇస్తారు. ఉన్న త పాఠశాలల లోని ఉపాధ్యాయులు ఓబర్ లెహ్రర్ (Ober In liter) అనిన్ని ఓబర్ స్టూడి యేన్ రాట్ ((}ber Studiarrat) అనిన్నీరెండు తరగతులుగా ఉంటారు. యుద్దానికి పూర్వము ఈ రెండో తరగతి వారిని ప్ర ఫేసర్లని పిలిచే వారు గాని ఇప్పుడా పేరు తీసి వేసినారు. విశ్వవిద్యాల యాలలోని పెద్ద అధ్యాపకులను మాత్రమే ఇప్పుడు ప్రఫేసర్ల ని పిలుస్తారు. ఉన్నత పాఠ శాలో పాధ్య
175
యులకు సంవత్సరమునకు 220 పౌనులనుంచి 420 పౌనులవరకున్ను ఇస్తారు. ప్రధానోపాధ్యాయులకు సంవత్సరమునకు మరి 60 సౌనులు ఎల నెన్సు ఇస్తారు. ఇన్స్పెక్టర్ల జీతము సంవత్సరమునకు 310 పౌనులనుంచి 500 పౌనులవరకు ఉంటుంది.అంద రుస్ను 20 ఏళ్ళలో పై మెట్టు జీతమునకు చేరేటట్లు ఏటేటజీతము హేచ్చు చేస్తారు. అరవై అయిదో యేట సాధారణముగా ఉప్యోగము చాలించుకొం టారు. నలభై యేళ్ళు పని చేసిన తరువాత జీతములో 5వంతులలో 4 వంతులు ఫించను ఇస్తారు. ఉద్యోగి చచ్చి తే, అతని భార్యకు ఫించను అయిదోవంతున్ను వారిపిల్లల పోషణకోసము పిల్లలకింత అని వారి 8 దేండ్లు వయస్సువరకు కొంతసొమ్మున్ను కూడా ఇస్తారు. ప్రఫెసరుకు సంవత్సరమునకు 500 పౌ నులనుంచి 800 పౌనుల వరకు జీతమిస్తారు. వీరు సాధారణముగా అరవై అయిదోయేట పనిచాలిం చుకొన్న , వారీ ప్రఫెసరు బిరుదముగాని, జీతము గాని పోదు. ఆతరువాత వారప్పుడప్పుడు విశ్వ విద్యాలయములో తమకిష్టముంటే ఉపన్యాసాలివ్వ
176
కొంతసొమ్మి వ్వవలెను. ఆసొమ్మంతా ఈ రిటైర యినప్రఫెసర్లకే ఇచ్చి వేస్తారు.
అధ్యాయము 21
వయస్సుమించిన వారి విద్య,
ఫోక్ హాక్ షూలె (Volkhoch Schule)
చిన్నప్పుడు చదువుకొనడానికి మంచి అవ కాశాలు లేకపోయినవారు యావజ్జీవమున్ను చ దువులేక ఉండనక్కర లేకుండా, వయస్సుమీ రనవారి కోసము జర్మనీలో బడులను ఏర్పాటు చేసినారు, యుద్ధమయిన తరువాత ఈవిషయమై మిక్కిలి శుద్ధ తీసుకొంటున్నారు. ఇటువంటి విద్యను మొదట ఆరంభించిన వారు డెన్మార్కు వారు, 1844 సం|రములో వ్యయసాయదారుల పిల్లల కోసము డెన్మార్కులో ఇట్టి మొదటి "ఫోక్ హాక్ షూలే'ను స్థాపించినారు. ఈబడి 'మొదట మత సంస్థగా ఉండేది. దీనిమీదజనుల కౌదరమెక్కువ
177