చెంతనె సదా యుంచుకోవయ్య
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
కుంతలవరాళి రాగం - దేశాది తాళం
- పల్లవి
చెంతనె సదా యుంచుకోవయ్య
- అనుపల్లవి
మంతుకెక్కు శ్రీ - మంతుడౌ హను -
మంతురీతిగ, శ్రీకాంత !
- చరణము
తలచిన పనులను నేదెలిసి
తలతో నడచి సంతసిల్లుదుర;
పలుమారు బల్క బనిలేదు; రామ !
భరతునివలె, త్యాగరాజనుత !