చిన్ననాడె నా చెయి బట్టితివి

త్యాగరాజు కృతులు

అం అః

కళానిధి రాగం - దేశాది తాళం


పల్లవి

చిన్ననాడె నా చెయి బట్టితివి

అనుపల్లవి

ఎన్నరాని యూడిగము గైకొని

యెంతో నిన్ను, పాలమున సేతునని


చరణము

ఇట్టి వేళ విడనాడుదా మనియో;

యేలుకొందామనియో, యెంచినవో తెలియ;

గుట్టు బ్రోవవే, సుగుణ వారినిధి !

గొప్ప దైవమా ! త్యాగరాజనుత !