చింతిస్తున్నాడే యముడు

త్యాగరాజు కృతులు

అం అః

ముఖారి రాగం - ఆది తాళం


పల్లవి

చింతిస్తున్నాడే యముడు

అనుపల్లవి

సంతతము సుజనులెల్ల - సద్భజన జేయుటజూచి


చరణము 1

శూల పాశ ధృత భట - జాలముల జూచి, మఱి మీ

కోలాహలము లుడుగు - కాల మాయెనే యనుచు


చరణము 2

వారిధి శోషింప జేయు - క్రూర కుంభజుని రీతి

ఘోర నరకాదుల నణచు - తారక నామమును దలచి


చరణము 3

దారి దెలియలేక తిరిగు - వారలైన చాలుననిన

సారమని త్యాగరాజ - సంకీర్తనము బాడెదనని