చలమేలరా సాకేత రామ

త్యాగరాజు కృతులు

అం అః

మార్గహిందోళ రాగం - దేశాది తాళం


పల్లవి

చలమేలరా ? సాకేత రామ !


అనుపల్లవి

వలచి భక్తి మార్గముతోను నిన్ను

వర్ణించుచున్న నాపై


చరణము

ఎందుబోదు నేనేమి సేయుదును ?

యెచ్చోట నే మొఱ బెట్టుదును ?

తందనాలతో ప్రొద్దు పోవలెనా ?

తాళజాలరా త్యాగరాజనుత !