చక్కని రాజ మార్గము

త్యాగరాజు కృతులు

అం అః

చక్కని రాజ మార్గము (రాగం: ఖరహరప్రియ) (తాళం : ఆది)
పల్లవి

చక్కని రాజ మార్గము లుండగ

సందుల దూర నేల ? ఓ మనస ! | | చక్కని | |


అనుపల్లవి

చిక్కనిపాలు మీగడ యుండగ

చీయను గంగా సాగర మేల ? | | చక్కని | |


చరణం

కంటికి సుందరతరమగు రూపమే; ము -

క్కంటి నోట చెలఁగెడు నామమే; త్యాగరా -

జింటనే నెలకొన్నది దైవమే, యిటు -

వంటి శ్రీసాకేతరాముని భక్తియను | | చక్కని | |


cakkani rAja mArgamu (Raagam: kharaharapriyaa) (Taalam: aadi)

pallavi

cakkani rAja mArgamu lunDaga sandula dUranela O manasA

anupallavi

cikkani pAlu mIgada unDaga chIyanu gangA sAgara mElE

caraNam

kanTiki sundaramagu rUpamE mukkaNTi nOTa celagE nAmamE tyAgarAjintanE nelakonnadi daivamE iTuvaNTi shrI sAkEta rAmunimuni bhaktiyanE