గీతార్థము సంగీతానందము

త్యాగరాజు కృతులు

అం అః

సురటి రాగం - దేశాది తాళం


పల్లవి

గీతార్థము సంగీతానందము - నీ తావున జూడరా, ఓ మనస !

అనుపల్లవి

సీతాపతి చరణాబ్జము నిడుకొన్న

వాతాత్మజునికి బాగ దెలుసుర


చరణము

హరిహర భాస్కర కాలాదికర్మము

లను మతముల మర్మముల నెఱింగిన

హరి వర రూపుడు - హరహయ వినుతుడు,

వర త్యాగరాజ - వరదుడు సుఖిరా