త్యాగరాజు కృతులు

అం అః

శహస రాగము - ఆది తాళము

గిరిపై నెలకొన్న రాముని

గురి తప్పక గంటి భద్ర

॥గిరి॥


పరివారులు విరి సురటులచే నిల-

బడి విసరుచు కొసరుచు సేవింపగ

॥గిరి॥


పులకితుడై యానందాశ్రు-

వుల నింపుచు మాటలాగవలెనని

కలువరించగ గని పదిపూట లాపై

గాచెద నను త్యాగరాజ వినుతుని

॥గిరి॥

చూడాండి:

  1. త్యాగరాజు
  2. పంచరత్న కృతులు
  3. తెలుగు
  4. తెలుగు సాహిత్యము
"https://te.wikisource.org/w/index.php?title=గిరిపై&oldid=1538" నుండి వెలికితీశారు