కాసిచ్చెడిదే గొప్పాయనురా
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
గౌళిపంతు రాగం - ఆది తాళం
- పల్లవి
కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు
- అనుపల్లవి
(హరి)దాసులు సేవింపరనుచు ప్రభువులు
దయ మానిరి, పర మెంచక పోయిరి
- చరణము
రాజాంగము కొరకు నాల్గుజాతుల రక్షణ పరసుఖమో ?
రాజసులై సన్మార్గ మెఱుగక పరాకు సేయ ఘనమో ?
ఆ జన్మము గొలిచెడి విప్రవరుల కానందము గలదో త్యాగ -
రాజ వినుత ! నీ మాయగాని,
నీరజనయన ! సుజనాఘ విమోచన !