కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు

త్యాగరాజు కృతులు

అం అః

కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు 
రాగం: తోడి
తాళం: ఆది
పల్లవి:

కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు
పెద్దల మాటాలు నే డబద్ధ మౌనో ॥క॥

అను పల్లవి:
అద్దంపుఁ జెక్కిళ్లచే
ముద్దుగారు మోముఁ జూడ
బుద్ధి గలిగినట్టి
మావద్ద రావదేమిరా ॥క॥ 

చరణము(లు)
నిద్దుర నిరాకరించి ముద్దుగాఁ దంబురఁబట్టి
శుద్ధమైన మనసుచే సుస్వరముతోఁ
బద్దు తప్పక భజియించే భక్తపాలనముసేయు
తద్దయశాలివి నీవే త్యాగరాజ సన్నుత ॥క॥