ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెదవేరా? నే నీకు వేరా? రాగం: ఆరభి తాళం: చాపు పల్లవి: ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద వేరా? నే నీకు వేరా? ॥ఓ రాజీవాక్ష॥ అను పల్లవి: నేరని నాపై నేరము లెంచినఁ గారాదని పల్కెడు వారు లేని నన్ను ॥ఓ రాజీవాక్ష॥ చరణము(లు) మక్కువతో నిను మ్రొక్కిన జనులకు దిక్కు నీవని యతి గ్రక్కున బ్రోతువని యెక్కువ సుజనుల యొక్క మాటలు విని చక్కని శ్రీరామ దక్కితి గదరా ॥ఓ రాజీవాక్ష॥ మితి మేరలేని ప్రకృతిలోన దగిలి నే మతిహీనుఁడై సన్నుతి సేయనేరక బతిమాలి నీవే గతియని నెర న మ్మితిగాని నిను మరచితినా సంతతము ॥ఓ రాజీవాక్ష॥ మావర సుగుణ ఉమావర సన్నుత దేవర దయజేసి బ్రోవగ రాదా పావన భక్తజనావన మహాను భావ త్యాగరాజ భావిత ఇంక నన్ను ॥ఓ రాజీవాక్ష॥