ఒరుల నాదుకోవలసినదేమి
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఒరుల నాదుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ రాగం: శుద్ధ సావేరి తాళం: ఆది పల్లవి: ఒరుల నాదుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ ॥ఒరుల॥ అను పల్లవి: పరితాపము తాళక మొఱలిడగా కరుణ లేక నీవే నను జూడగ ॥ఒరుల॥ చరణము(లు) మంచివారి సహవాసము బాసి కొంచెపు నరుల కొఱకు నుతి జేసి యెంచిన కార్యము గూడని గాసి స హించ కుండెడిది నా పేరు వాసి ॥ఒరుల॥ రాశియనుచు నరులను చేబూని వాసి యుండెడిది భవాని ఆశప్రియ! నే ముందురాని జేసిన కర్మ ననుకోవలె గాని ॥ఒరుల॥ దేవ త్యాగరాజ వినుత! సనక భావనీయ! రఘుకుల తిలక! ఈ వరకును నాదు తను వలయక నీవే తెలుసుకోవలె గాక ॥ఒరుల॥