ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి రాగం: యదుకులకాంభోజి తాళం: దేశాది పల్లవి: ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి ॥ఎ॥ అను పల్లవి: సీతా లక్ష్మణ భరత రిపుఘ్న వాతాత్మజులతో నాడు నాటక ॥మే॥ చరణము(లు) ఆలు వజ్రాలు సొమ్ము లడిగిరో అనుజులు తల్లి దండ్రు లన్న మడిగిరో? శీలులైన వరభక్తులు బిలచిరో? చిరకాలము త్యాగరానుత ॥ఏ॥