ఏమందునే విచిత్రమును? ఇలలోన మనుజులాడున
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఏమందునే విచిత్రమును? ఇలలోన మనుజులాడున రాగం: శ్రీమణి తాళం: దేవాది పల్లవి: ఏమందునే విచిత్రమును? ఇలలోన మనుజులాడున ॥దేమందునే॥ అను పల్లవి: నీ మంత్ర మహిమ నెఱుగలేక సామాన్యులై పల్కెదరు నీతో ॥నేమందునే॥ చరణము(లు) తామసంబుచేత తత్త్వముఁబల్కుచు కామదాసులై కరుణమాలి మదిని భూమిసంచరించి పొట్టనింపుచును తామే పెద్దలట; త్యాగరాజనుత! ॥ఏమందునే॥