ఏటీ జన్మమిది హా ఓ రామ

త్యాగరాజు కృతులు

అం అః


ఏటీ జన్మమిది హా ఓ రామ 
రాగం: వరాళి
తాళం: చాపు

పల్లవి:
ఏటీ జన్మమిది హా ఓ రామ ॥ఏ॥

అను పల్లవి:
ఏటి జన్మమిది ఎందుకుఁ గలిగెనో
ఎంతని సైరింతు హా ఓ రామ ॥ఏ॥

చరణము(లు)
సాటిలేని మారకోటి లావణ్యుని
మాటి మాటికిఁ జూచి మాటలాడని తన ॥కే॥

సారెకు ముత్యాల హార మురము పాలు
గారు మోమును గన్నులారఁ జూడని తన ॥కే॥

ఇంగితమెరిగిన సంగీతలోలుని
పొంగుచుఁ దనివార గౌగిలించని తన ॥కే॥

సాగరశయనుని త్యాగరాజనుతుని
వేగమె కూడక వేగేని హృదయము ॥ఏ॥