ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు రాగం: నీలాంబరి తాళం: ఆది పల్లవి: ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు పన్నుగఁ గనుగొనని కన్నులేలే కన్నెమిన్నలేలే ॥ఎ॥ చరణము(లు) మోహముతో నీలవారి వాహకాంతిని గేరిన శ్రీహరిని గట్టుకొనని దేహమేలే ఈ గేహమేలే ॥ఎ॥ సరసిజ మల్లె తులసీ విరజాజి పారిజాత విరులచేఁ బూజించని కరములేలే ఈ కాపురములేలే ॥ఎ॥ మాలిమితో త్యాగరాజునేలిన రామమూర్తిని లాలించి పొగడని నాలికేలే సూత్రమాలికేలే ॥ఎ॥