ఆనంద సాగరమీదని దేహము భూమి భారము; రామ

త్యాగరాజు కృతులు

అం అః

ఆనంద సాగరమీదని దేహము భూమి భారము; రామ! 
రాగం: గరుడ ధ్వని
తాళం: దేశాది

పల్లవి:
ఆనంద సాగరమీదని దే
హము భూమి భారము; రామ! బ్ర ॥హ్మానంద॥

అను పల్లవి:
శ్రీనాయకాఖిల నైగమా
శ్రిత సంగీత జ్ఞానమను బ్ర ॥హ్మానంద॥

చరణము(లు)
శ్రీ విశ్వనాథాది శ్రీకాంత విధులు
పావన మూర్తులుపాసింప లేదా?
భావించి రాగ లయాదులఁ
భజియించు శ్రీత్యాగరాజనుత ॥ఆనంద॥