అమ్మ! రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ

త్యాగరాజు కృతులు

అం అః

అమ్మ! రావమ్మ తులసమ్మ (రాగం: కళ్యాణి) (తాళం : ఝంప)
పల్లవి

అమ్మ! రావమ్మ తులసమ్మ నను పాలింప వమ్మ! సతతము పదములే నమ్మి నానమ్మ ॥అమ్మ॥

అనుపల్లవి

నెమ్మదిని నీ విహ పరమ్ము లొసగుదు వనుచు కమ్మవిల్తుని తండ్రి గలనైన బాయడట ॥అమ్మ॥

చరణము

నీ మృదు తనువును గని - నీ పరిమళమును గని నీ మహత్వమును గని - నీరజాక్షి తామరస దళనేత్రు - త్యాగరాజునిమిత్రు ప్రేమతో శిరమునను - బెట్టుకొన్నాడట ॥అమ్మ॥


ammaa raavamma (Raagam: kalyaaNi) (Taalam: jhampa)

pallavi :

amma! rAvamma, tulasamma nanu pAlimpu mamma! satatamu padamulE namminAnamma || (amma)

anupallavi :

nemmadini nI vihaparammulOsagudu vanucu kamma viltuni tandri galanaina bAyadaTa (amma)

caraNam :

nI mrdu tanuvunu gani nI parimalamunu gani nI mahatvamunu gani nIrajAkSi || tAmarasa daLa nEtrudu tyAgarAjuni mitruDu prEmatO Siramunanu peTTu konnAdaTa || (amma)