హైందవ స్వరాజ్యము/రెండవ ప్రకరణము

రెండవ ప్రక ర ణ ము.

బంగాళా విభజనము.


చదువరి : మీరు చెప్పు వైఖరిని ఆలోచించినయెడల దేశీయమహాసభ స్వరాజ్యమునకు బునాదులు వైచినదనుట న్యాయముగానున్నది. అయిన దానివలన నిజమైనప్రబోధము కలిగినదని అనుటకు రాదు. మీరును దీనిని అంగీకరింతు రనుకొనెదను. ఎప్పుడు ఏవిధముగా ఆ నిజమయిన ప్రబోధము కలిగినదో చెప్పుదురా?

సంపా : విత్తన మెప్పుడును ప్రకటముకాదు. దాని పని యంతయు భూగర్భమున జరుగుచున్నది. తరువాత విత్తనము నాశమందుచున్నది. విత్తనమునుండి బయలుదేరు వృక్షము మాత్రము పైకినిక్కి కానవచ్చును. దేశీయమహాసభసంగతిలో గూడ ఇట్టి స్థితియే కాననగును. అయినప్పటికిని మీరు ఏది

నిజమైన ప్రబోధమని అనుకొనుచున్నారో అది బంగాళావిభజనమునకు తరువాత కలిగినది. అందులకుగాను మనము కర్జను ప్రభువునకు కృతజ్ఞులమై యుండవలసియున్నది. విభజనకాలమున బంగాళీలు కర్జనుగారికి సంగతిసందర్భములు విశదీకరించిరి. కాని అతనికి అధికార గర్వమున్నందున వారు చెప్పి
12

హైందవ స్వరాజ్యము.


సది వంట బట్ట లేదు. వారి ప్రార్థనలు నిరాకృతములయ్యెను. హైందవులు ఊరక వదరకలరుగాని కార్య 'మేమి చేయగలరని అతను పరాఙ్ముఖుడయ్యెను. అవమానకర భాషణము చేసి అత డు బంగాళమును విభజించెను. నాటిదినమును బ్రిటిషు సామ్రా జ్య విభజన దినమనుకొనవచ్చును. ఈ బంగాళా విభజనమున బ్రిటిషు అధి కారమునకు కలిగిన నష్టము మరి దేనివలనను కలుగ లేదు. హైందవ భూమికి జరిగిన ఇత రాన్యాయములు బంగాళా విభజనమునకంటే తక్కువవి యని ఇందువలన తలంపరాదు. ఉప్పు పన్ను చిన్న యన్యాయము కాదు. ముందుకు ఇట్టివింకను ఎన్నో యో వివరింతును. ప్రస్తుత మనుసరింతము. బంగళా విభజనమును ఎదుర్చుటకు ప్రజలు సిద్ధముగా నుండిరి.సంవే దనలు తీక్షణమయ్యెను. బంగాళీ లనేకులు తమ సర్వస్వ మును సమర్పింప సిద్ధమైరి. స్వశక్తి విజ్ఞానము కలిగినందున తైక్ష్ణ్తము అపారమయ్యెను. ఇప్పుడా తైక్ష్ణ్యైము అడంపరానిదై నది. అడంప నవసరమును లేదు, బంగాళా విభజనము పోవుట సిద్ధము. బంగాళీలకు పునస్సమాగమము సిద్ధము. "కాని ఇంగ్లీషు పరిపాలన నౌకలో ఏర్పడిన రంధ్రముమాత్రము మూతపడదు.. అది దిన క్రమముగా పెద్దది యగును. ప్రబోధితమైన 'హైందవ భూమి మరల సుషుప్తి జెందబోదు. బంగాళా విభజనము రద్దు చేయగోరుట స్వరాజ్యమును గోరుటయే. బంగాళ నాయకులు" దీని నెరుంగుదురు. అధికారులు దీనిని గుర్తించినారు. అందుచేతనే బంగాళావిభజనము బోలేదు. కాలక్రమమున హైందవ జాతి బలవత్తరముగ ఏర్పడుచున్నది. రాష్ట్రములొక్కనాట నిర్మితములు కావు. సంవత్సరములు పట్టును.


చదువరి: బంగాళా విభజన ఫలము లేమి యని మీయభిప్రాయము.


సంపా: నాటివరకు మనకు తెలిసియుండినదిది. మనకష్టనిష్ఠూరాలు తీర్చుకొనుటకు మనము చక్రవర్తిగారి వరకు అర్జీ చేసుకోవలసినది. ప్రతీ కారము లేకపోయిన ఎడల కూర్చొని మరల మరల అర్జీ చేసుకోవలసినది. బంగాళా విభజనకు తరువాత ప్రజలకొక సంగతి తెలిసినది. అర్జీలకు బునాదిగా మనశక్తి ఏర్పడ వలెను. మనము కష్టపడుటకు వెనుదీయరాదు. ఈక్రొత్త తేజస్సే విభజనము యొక్క ముఖ్య ఫలము. ఈఫలము నిర్భయముగా పత్రికలలో ప్రకటిత మైనది. ప్రజలు లోలోన రహస్యము రహస్యముగా గుజగుజలాడుకొనినది బహిరంగముగా నిర్భీతిగా వ్రాయంబడినది. ప్రకటన నందినది. స్వదేశోద్యమము ప్రారంభ మయినది. ముందు పిల్లలు పెద్దలు అంగరు ఇంగ్లీషువారిముఖము చూచిన భయము పరుగెత్తు చుం ఇప్పుడా భయము పోయినది. తగాదావచ్చినను ఇప్పుడు లక్ష్యము లేదు. జైలుకుపోవలసినను లక్ష్యములేదు. భారత భూమి యుత్తమపుత్రులలో కొందరు ఇప్పుడు ప్రవాసములలోనున్నారు. వట్టి అర్జీలు పెట్టుకొనుటకును దీనికిని ఎంతో తారతమ్యమున్నది. ప్రజలీ విధముగా మారినారు. బంగాళములో పుట్టిన నవశక్తి ఉత్తరమున పంజాబుకు, దక్షిణమున కన్యాకుమారికి వ్యాపించినది.


చదువరి: మరి యేస్ఫుటమైన ఫలమైనను కలిగినదందురా?


సంపా: బంగాళావిభ జనము ఇంగ్లీషు నౌకలో రంధ్రముతొలచుటే కాక మన నౌకలో కూడ రంధ్రమును తొలచినది. మహాసంభవములకు మహాఫలములు దప్పవు. మన నాయకులు రెండు కక్షులయినారు―మిత వాదులు జాతీయవాదులు. ఒకటి మందగామి మరియొక్కటి శీఘ్రగామి యునవచ్చును. కొందరమతమున మితవాదులు భయస్థులు, జాతీయవాదులు పోటరులు. ఎవరి యెవరి ఆలోచనులు బట్టి వారు వారు వీనికర్థము చెప్పుదురు. ఒక్కటిమాత్రము నిజము. ఈ రెండు తెగలవారికిని వైరుధ్యము గలిగినది. పరస్పరము అవిశ్వాసపడుచు ఈ రెండుకక్ష కొండొంటిని చూపించుకొనుచున్నవి. సూరతు దేశీయమహాసభ సమయమున రమారమి యుద్ధ మేపొసగినది. ఈవిభేదము దేశమునకు మంచిది కాదనియే నాయభిప్రాయము కాని ఇట్టి విభేదములు ఎంతోకాలము నిలుచునవియు గావు.