హైందవ స్వరాజ్యము
హైందవ స్వరాజ్యము.
(మహాత్మ గాంధి విరచితము)
గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిచే
నాంగ్లమునుండి యను వాదింపబడినది.
ఉపేంద్ర ప్రచురణాలయము
17 నారాయణ మొదలి వీధి
చెన్నపురి.
మొదటి ముద్రణము జూలై 1919 ప్రతులు 1000.
రెండవ ముద్రణము జూలై 1921 ప్రతులు 2000.
మొదటి మూడు ఫారములు "ప్రింటెర్సు పెస్సు” లోను 4,5,6,ఫారములు " వేదాంతా ప్రెస్సు" లోను 7,8,9,ఫారములు చదలవాడ సుందరరామ శాస్త్రులు వారి పెన్సు” లోను ముద్రణము కాబడినది.
పీఠిక.
ఆంధ్రభాషాలతలు దేశమందంతటను నల్లి బిల్లిగ నల్లుకొని యున్న తరి అందు రాజకీయ విషయిక సూనంబులు కానరా కుంట శోచనీయము. హైందవ జాతీయత ప్రతి భారతీయని అంత రాళముల రాణీల్లుచున్నయది. యుగంధరుని యుత్తమ రాజకీయ తత్వజ్ఞత, త్రిమ్మరుసు రాజ్యాంగ నిర్మాణ కౌశలము మనవారి రక్తనాళముల బ్రవహించుచున్నయది.
భారత దేశమున మనవార లె మున్ముందు దేశ భాషల ప్రాము ఖ్యతను కనుంగొనిరి. ముద్దులు మూటగట్టు మన తెలుంగే మన లను ద్బోధమునకు పురికొల్పగలదు. ప్రబోధంపుమొలకలు యిప్పుడిప్పుడే చిగిర్చి వికసించుచున్న వి.
ఫాశ్చాత్యు లెల్లరును ఆధ్యాత్మిక ధర్మమును తూలనాడి ఇహమే నిశ్చయమని నాగరికత, నాగరికత" యని పేరు పెట్టుకొని తుదకు ఐరోపామహాసంగ్రామమున ఒకరి నొకరు చిత్రవధల "గావించికొనిరి. ఇప్పుడిప్పుడే ' వారికి వారి నాగరికత వట్టిమిధ్యయని గోచరమగుచున్నది. హైంద వుల జీవనమే యుత్తమమని ఇప్పుడే వారు కన్నులు విప్పి చూచు
చున్నారు. మనము భారత సందేశమును లోరమంతటికిని ii
హైందవ స్వరాజ్యము
గొంపోవలసియున్నది. అట్టి సందేశమును గొంపోవ గాంధి మహామహులుద్భవించిరి. వారు అవతారపురుషులు. వారి కీర్తి లోకమున దివ్యకీర్తుల ప్రసరించి భారతసం దేశముంగొంపో వును. అట్టితరి వారిచే రచియింపబడిన హైందవ స్వరాజ్యము" ను ప్రచురించుటయే యుత్తమమని తలంచి మేమట్లోన రించితిమి,
ఈ మానూతనోద్యమమునకు సుధీ లోక మెల్ల ప్రోత్సాహ మొసంగి మమ్ము ఇకముందు నిట్టి యుద్గ్రంధముల ప్రకటించు నటుల చేయుదురుగాక యని. ప్రార్థించుచు యీ చిన్న పోత్తం బును బంధింపబడిన మనమాతకు నంకితంబుగావించి విరమించు చున్నారము.
రెండవముద్రణపు పీఠిక.
ఆంధ్రదేశమునం దనేకులకు సులభ లభ్యంబగుటకు రెండవ ముద్రణమును వేయించి చాల చౌకధరకిచ్చుచున్నారము. ఆంధ్రలోకము మాయుద్యమమునకు ప్రోత్సాహము నొసంగు కోరుచున్నారము.
ఉపేంద్ర ప్రచురణాలయము.
పూర్తి విషయసూచిక
మార్చుThis work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.