హైందవ స్వరాజ్యము/ఆరవ ప్రకరణము
ఆరవ ప్రకరణము.
నాగరకము.
చదువరి: అయిన నాగరకమన మీయర్థమేమో తెలుపవలసియుందురు.
సంపా: నాయర్థము కాదు. నాగరక మను పేరిట నేది ప్రబలియున్నదో దానిని నాగరకమనరాదని యెందరో ఆంగ్లేయ గ్రంథకర్తలే వ్రాసియున్నారు. ఎన్నియోగ్రంథము లావిషయమున వెలువడియున్నవి. ఆంగ్లజాతిని నాగరకదోషమునుండి యుద్ధరించుటకు సంఘములు సభలు ఏర్పడియున్నవి. గొప్ప ఆంగ్లరచకుడొకడు "నాగరకము - దాని కారణము--దానికి ప్రతీకారము" అని యొక యుధ్ధంథము ప్రకటించినాడు. అందులో నాగరకమొక రోగమని యతడు వర్ణించినాడు.
చదువరి: మనకెందుకిది సామాన్యముగా తెలియరాలేదు?
సంపా: కారణము విదితము. ఎవ్వరును తమకు వ్యతిరేకముగా తాము విమర్శించుకొన నిచ్చగింపరు. నవనాగరికమును దిగద్రావి గఱ్ఱున త్రేపువారు దాని దూషించుచు వ్రాయజాలరు.
దానిని సమర్థించుటకు కావలసిన సంగతులు వ్యాఖ్యలు తమకు తెలియకయే వెతకికొనుచుందురు. వానిని నిజములని యాలో పూర్వము వారు కప్పుకొనుటకు తోళ్లుపయోగించుచుండిరి. ఈటెలనే ఆయుధములుగా వాడుచుండిరి. నేడో వారు పొడుగాటి షరాయిలు ధరించి దేహము నలంకరించు కొనుటకు వివిధ వస్త్రములను తొడగుచున్నారు. ఈటెలకు బదులు ఐదు ఆరు గుండ్లుపారు రివాల్వరులను పట్టుచున్నారు. ఇదివరకు ఎక్కువగా గుడ్డలు బూట్సు మొదలైనవి వేసుకొననట్టి జాతివారు నేటిదినము యూరోపియను వస్త్రములు మున్నగునవి ధరింతురేని వారు అడవితనము నుండి నాగరకమునకు వచ్చినట్లెన్న బడుచున్నారు. పూర్వము యూరపులో ప్రజ చేతికష్టము చేసిభూములు దున్ను
చుండిరి. ఇప్పుడు ఆవిరినా గేళ్లు పెట్టుకొని ఒక్కడే అనేక యక
రములుదున్ని ద్రవ్యము సంపాదించి భాగ్యవంతుడగుచున్నాడు.
ఇది నాగరక చిహ్నములలో నొక్కటిగా పరిగణింపబడుచున్నది.
'పూర్వము అతిస్వల్ప సంఖ్యాకులు గ్రంథరచన చేయువారు.
ఆ గ్రంథములు ఉత్తమములుగా ఉండును! నేడు ఎవ్వనికి ఇష్టము
వచ్చినది నాడు వ్రాసి అచ్చు వేసి ప్రజలమానసము మంటగలుపు
చున్నాడు. పూర్వము మనుష్యులు బండి కుక్కిలో బడి ప్రయాణము
చేతురు. ఇప్పుడు మనో వేగముతో బోవువిమానములలో నెక్కి
భూమిసోకకుండ గంటకు నాలుగుసూర్లమైళ్లు పరగుచున్నారు.
ఇది యంతయు నాగరకశిఖరోత్తుంగముగ ' నాలోచింపబడు
31
నాగరకము.
ప్రపంచములోని ఏమూల కై నను గంటల ప్రయాణమున చేరవచ్చు
నని చెప్పుకొనుచున్నారు. మనుష్యులకు చేతులు కాళ్ల సుపయో
గించుపని యుండ నేయుండదు. ఒక బొత్తామునొత్తిన కావలసిన
యుడుపులు ప్రక్కకువచ్చి పడియుండును. మరియొక బొత్తాము
నొత్తిన వలయు వార్తాపత్రిక ప్రత్యక్షమగును. ఇంకొక్క-బొత్తా
మునొత్తిన మోటారు బండి ముంగిట నిలబడును. ఇట్లే ఆకటి
వేళకు అన్ని రుచులయన్నము అట్టెయెదురగును. అన్ని పనులను
యంత్రములు చేసి పెట్టును. పూర్వము యుద్ధము చేయునప్పుడు
ఒండొరులు బలపరాక్రమముల ప్రకటించు కొనుచుండిరి. ఇప్పుడు
ఒక్కడు మరఫిరంగి వెనుక దాగిన చాలును. వేన వేలను చంప
వచ్చును. ఇది నాగరకము. పూర్వము మానవులు బహిరంగణ
మున తమశక్తికొలది పాటుపడుచుండిరి. ఇప్పుడు వేనవేలు కర్మ
కరులుచేరి కడుపు కక్కుతి కై కర్మాగారములలో గనులలో
పనిచేయు చున్నారు. వారి స్థితి పశువుల స్థితికంటె నన్యాయము.
లక్షాధి కారుల మేలున కై వీరు మహాపాయకరమగు వృత్తులలో
ప్రాణమునకు తెగి పరిశ్రమ చేయవలసియున్నది. పూర్వము భౌతి
కముగా మనుష్యుని' నిర్బంధించి దాసు నొనర్చుచుండిరి.
ఇప్పుడు ద్రవ్యము చూపి, ద్రవ్యము చే పొందనగు మోహపాశము
లను చూపి, మనుష్యుల దాసుల నొనర్చుచున్నారు. పూర్వ
హైందవ స్వరాజ్యము.
లక్షలకొలది వైద్యులువానికి ప్రతీకారములను వెదకుచున్నారు.
అందుచేత వైద్యాలయములు పెరిగిపోయినవి. ఇది నాగరకము.
పూర్వము ఉత్తరములు తీసికొనిపోవుటకు ప్రత్యేకము దూత
లవసరమయి యుండినారు. ఎంతో ద్రవ్యము వ్యయము చేయ
వలసి యుండినది. 'నేడో ఎవ్వరిని తిట్టదలచుకొనినప్పటికి కొణి
కాగితమువ్రాసి పడవేయ వచ్చును. అంతటితోనే అడకువతో
కృతజ్ఞతను కూడ తెలుపవచ్చుననుటయు నిజమే. పూర్వము
ఇంటిలో చేసిన బువ్వకూరలతో మూడుపూటల భోజనముండి
నది, ఇప్పుడో గంట గంటకు ఏదో తిండి కాఫీ హోటలులో
తినవలెను. దీస్ కే సగ మాయువు పట్టుచున్నది. వేరుపనికి వేళ
యేలేదు. ఇంకను నేను చెప్పవలసిన దేమికలదు ? ఇగంతయు
ఉత్తమ రచకులే వర్ణించినారు. ఇవియన్ని యునాగరకమునకు చి
హ్నము లే.ఎవరైనను కాదందురా వారుశుద్ధమూర్ఖులని తెలియ
వలసినదే. ఈ నాగరకములో నీతిమతములకు తావు లేదు. తద్భ
కులు మతము నేర్పుట మాపని గాదని ఘంటాపథముగ చెప్పు
దురు.అందులో కొందరు మతముమూఢవిశ్వాస మనియు నం
దురు. మరి ఇతరులో, వేషము వేసికొని శ్రీరంగనీతులు బోధిం
తురు. అయిన ఇరువది యేండ్ల అనుభవము మీద నాకొక్క
నమ్మక మేర్పడినది. నీతియని నేర్పునది యెక్కువగా అవినీతి
33
నాగరకము.
ఉద్దీపకము లేదను ఓ శిశువునకుగూడ అర్థము కాక పోదు. నాగ
రకము భౌతిక సౌఖ్యములను పెంచుటకు ప్రయత్నించుచున్నది.
ఆ ప్రయత్నమునందును అది యేమాత్రము ఫలసిద్ధి పొందుట
లేదు.
ఈ నాగరకము దుర్మతము. దీని ప్రభావము వర్ణనాతీతము..
యూరపులో దీనికి లోబడినవార నేకులు వెఱి వారికి తుల్యు
లుగా నున్నారు. వారికి ఋజు బలము కాని సహజ ధైర్యము కాని
లేదు. త్రాగుడు వలన వారిశక్తిని నిలువ బెట్టుకొనుచున్నారు,
ఒంటరిగా నుందురేని వారికి జీవన మే దుర్భర మగును. గృహాణి
దేవతలుగా, నుండదగిన స్త్రీలు వీధులలో నల్లాడుచుందురు.
లేదా, కర్మాగారములలో ముగ్గుచుందురు. గంజికిగాను ఇంగ్ల
డులో ఐదులక్షుల స్త్రీలు కర్మాగారములలోను మరియితర సంస్థ
లలోను మహానరక పరిస్థితులలో కుందుచు పని చేయుచున్నారు.
స్త్రీ స్వాతంత్ర్య వాదము దినదినము బలపడుట కీ గొప్పదురానస్థ
యొక కారణము,
ఈనాగరకము దానంతట తానె నశింపగలదు. మనము ఓపిక
మాత్రము పట్టియుండవలెను. మహమ్మదు బోధ ననుసరించిన
యెడల ఈనాగమును సైతాను నాగరకమనవ లెను. హిం
దూమతము దీనిని కలియుగమనుచున్నది. దీని పూర్ణరూప
హైందవ స్వరాజ్యము.
కొవ్వునంతయు కాజేయుచున్నది. దీనిని త్యజించి కావలెను.
రాజ్యాంగ సభలు నిజముగా దాసత్వ చిహ్నములు. వీరు
చక్కగా విషయము లాలోచించితి రేని ఈ సంగతి మీకు స్పష్ట
పడి ఆంగ్లేయులను మీరు దూరుట మాని వేయుదురు. వారిని
మనము నిజముగా కరుణింపప లెను. వారిజాతి యుక్తిక లజూతి.
తప్పక వారీకీడును తొలగించు కొందురని నానమ్మకము. వారు
పాటుపడువారు, సాహసులు. వారి భావమార్గము నీతి సహజ
ముగా అవి గలది కాదు. వారిహృదయంబును దోషాకరము
కాదు. కాబట్టి నేను వారిని గౌరవించుచున్నాను. నాగర
కము ఔషధము లేనిరోగము కాదు. కాని ఇంగ్లీషువారు మా
త్రము దానివలన బాధ పడుచున్నారనుట మరువరాదు.