సరిపడని సంగతులు/మొదటి యంకము/రెండవ రంగము

సరిపడని సంగతులు

మొదటి యంకము - రెండవ రంగము.

(మొదటిరంగమునకు ఈరంగమునకు నడుమ రెండుమూడు దినములు కాలము రాత్రి 9 1/2 ఘంటలు, వెన్నెల వెలుతురు కొంచెము మందముగా నుండును. వీదిలొ జనుల సంచారములేదు.

లోపలినుంచి శ్రీఆంధ్రనాటక పితామహుని ప్రమీలా నాటకము యొక్క ఉత్తర రంగములోని-

   "ఏరాజ్యంబున దరుణు లు
   దారకళాకుశల సుస్వతంత్రలుగలరో
   యారాజ్యంబున బురుషులు
   ధీరులు నదికారు లమధీసువిచారుల్"

అనుపద్యము చదువుచు కాలేజి స్టూడెంట్లు భాస్కరుడు, రాజా, రఘునాధాచారి, మరియు గుమాస్తా శ్రీధరుడు ప్రవేశింతురు)

భాస్కర:--ఆహా! ప్రమీలా పార్టుచేసిన కుర్రవాడు ఎంత రసవంతముగ ఆక్టుచేసినాడురా? ఆడుదాని శక్త్రిముందు మగవానిది ఏమినిక్కుతుంది. అర్జునుడో ప్రమీలా మహారాణిని చూడగానే తరతరలాడి డంగు అయిపోయినాడు రఘునాధా! చూచితివా! ఆడువారిని ఎప్పుడునునేలపెట్టి కాలరాచవలెనని వారించు చుంటివే, ప్రమీలారాజ్యములో ఏమి తక్కువగ నుండె? ఒక్క మగపురుగైన లేకనే ఎంతశక్తితొ, ఎంత శోభావహముగ ప్రమీలా రాజ్ఞ రాజ్యమేలుచుండె? అందులకే కవి చక్కగా వ్రాసినాడు;.

   "ఏరాజ్యంబున జెలు లవి
    చారలు పరతంత్రలస్తసత్వలుగలదో
    యారాజ్యము పురుషు లవా
    ధారులు నవిచారు లస్వతంత్రవిహారుల్"

రఘూ:-- పోరా! పోరా!! నాయభిప్రాయ మేమన-అర్జునుడు దలదలచి ఆడుదాని కెందుల కపజయము కలుగవలెనని ఆమెను

15

మోహించి ఓడినట్లు నటించెనుకాని అర్జునుడేమి? ఓడుటయేమి! ఆ గాండీవము నొక్కమాటు టంగుమని మ్రోగించితే ప్రమీల ఏమైపొయి యుండునో!

భాస్కర:--బుద్దిమంతుడంటే నీవేరా! నీయట్టివాడు పుట్టునదే యపురూపము.

రాజ:--బాస్కరా! ఆడువాండ్రు కేవలము ప్రజొత్సాదక యంత్రములు (Chil Manufacturing Machines) అనుశాస్త్రము నేర్పరచియుండు మారఘునాధునకు అంతకంటె బుద్దిఎక్కడనుంచి రావవలెను?

భాస్కర:--రఘూ! నీవు హిందూదేశ చరిత్రను (Indian History) జదివినావుగదా! అహల్యాబాయి, హూల్కరు, ఝాన్సీ లక్ష్మిబాయి వీరిచరిత్రలు అస్వత్యములా! చెప్పద వినుము. రఘూ! ఈ విషయంలో ఈనాటికిని ఆడుది చేయజాలని యసాధ్యకార్యమే లేదు. ఆంగ్లేయ కృతక నదిని (English channel) ఒకగుక్కలోదాటివేసినది. సరియేనా! ఆకసమున వేలకొలది మైళ్లు ఎగిరి పోయినది! ఇంకొకటి, రఘూ! వేదాధ్యయనము జదివి, 'ఈకాలమందును, సంపూర్ణ సనాతన ధర్మము ' నుద్దరించు వాడై బ్రహ్మతేజస్సు, బ్రాహ్మణ ప్రబావము వీనితో నిండిన మీఆచార్యులవారు క్రింద, వేదాధ్యయనమున కదికారమేలేని ఆడుదిపైన విమానములో, ఆడుదానికి విమానము, ఆచార్యుల వారికి అవమానము.

రఘూ:--నోరుమూయుమురా. నీవు చెప్పినదంత యూరపు ఖండపు వార్త, వారియాచారము వేరు, మనయాచారము వేరు. వారి ధర్మమువేరె, చూడు! మనశాస్త్రములలో స్త్రీ, శూద్రులను తక్కువ దర్జాలొ పెట్తియున్నారు, చూడు, వారికి దర్జాఎక్కువ చేస్తే మనకు ధర్మము తక్కువ అయిపొతుంది.

శ్రీధరు;--అయ్యా! రఘునధాచార్యులవారూ! స్త్రీశూద్రులంటివే ఏశాస్త్రములొ నున్నది? ఈ 'జన్మనాజాయతేశూద్రు:, సంస్కారాధ్వీజ ఉచ్యతే”! అన నది ఋషి.ప్రోక్తము కదా! వసిష్ఠులవారు నారదమహా ఋషులు, వాల్మీకి, వ్యాసులు, పరాశరులు , వీరందరు బాహ్మణపుత్రు లేనా?

రఘు: _వకీలుగుమాస్తాగారూ! మీ కెప్పటికిని వక్రమార్గమే అల వాటు. వాల్మీకి, నారదులు, వ్యాసులు వీరంత మగ వారయ్యా ఆడువారలు కారు.

భాస్కర:- వారు మగవారు కనుక గొప్ప వారైరని మాయభిప్రా యమా, ఆచార్యుల వారూ! ఎంతమంది స్త్రీలు ఉపనిషత్కార లో తమకు తెలియునా? స్త్రీలే వేదముల కలంకార పాయులై యుండిరి. చెప్పెదను వినుము. జుహం-గోథ, యమి, శచి, ఆహా! వీరందరు ఆడవారయ్యా! ఋగ్వేదములోని పదియవ మండల మునకు గారణము స్త్రీ బుద్ధియే. పాపము! ఈ సమాచారము నీ కేమి తెలియును. మిగురువులగు శ్రీ మాణ విద్యాలంకారా చార్యుల వారికి కుడుముల తినుటకు తెలియును. పొట్ట పెంచుటకు తెలియును. ప్రపంచమునకు టోపి వేయుటకు తెలియును. వారి పేరు విద్యాలంకారులు. వారికి అలంకారానికే విద్య. నీవన్న నో గురువులను మించిన పరమానంద శిష్యుడు. “ఎద్దు మొద్దు స్వ రూపాయ. ఏనుఃపోతాయ మంగళం.”

రఘు:__చాలును లెమ్ము. నీసమాచారము తెలిసినదేకదా! వాదిం చడమునకు చేతకాకపోతే తిట్టడము మొదలు పెట్టుట నీకు వాడుకయే.

భాస్క:_ ఓ రే! పనికిమాలిన వాడా! ( Stupid) స్త్రీల మహిమను వర్ణించుటకు వాదము వేరు కావ లెనా? విను. శక్తి స్వరూపము స్త్రీ. సహన స్వరూపము స్త్రీ. సంసారము స్త్రీనుంచియే. ఆచార విచారములు స్త్రీ నుంచి యే. ఈ ప్రపంచమునకు ఆధా రము స్త్రీ రూపమే. అది కాక నీ తల్లి” స్త్రీయే. మరి స్త్రీలకు పుట్టిన వారు బ్రాహ్మణు లెట్లగుదురు? అర్థమాయేనా?

17

రఘు:-- ఓ! అర్థమైనది, నీవు అవి వేకివని. నీవు ఎంత చెప్పినను స్త్రీ జాతి తక్కువయనియే నాయభిప్రాయము. తక్కువ కనుకనే ఏ రహస్యము వారిదగ్గర దక్కదు. ఇరువుకు స్త్రీలు కలిసిన కొట్లా టతప్పక ప్రారంభమగును. ఏడ్పు తప్ప వానికి వేరుతర్క వాదమే తెలియదు. కాలమంతయు సొగసు చేసికొనుటయందే గడుపు దురు, అదిగాక మన మఠములలో దేనియందైనను స్త్రీలు స్వాముల వారైనది చూచియున్నావా?

భాస్క: రఘునాథా! ఎంతటి మూర్ఖుడవు నీవు? ఈ దేశమునకు ప్రస్తుతము గలిగియుండు దైన్య దశకు ఇచ్చట స్త్రీలను ఆవరిం చియుండు అజ్ఞానమే కారణమని నీమనసునకు తోచదే! ఇంటి యందు గృహిణి దుఃఖించి రోదించు చున్నదన్న , నాయిఁట శుభ ముగలుగునా? ఇట్లుండ దేశములోని స్త్రీలందరు దుర్బలులై పరతంత్ర లై , అజ్ఞాను లై , సంస్కృతి లేక శుష్కించుచుండగ దేశ మునకు వైభవ మెట్లుండును? స్త్రీలకు విద్య లేకున్న . .

రాజ:-(అడ్డుపడి) భాస్కరా! మన దేశమునకు వచ్చినందుకు మన దేశమున జరుగుచుండు వివాహముల నుండియే, మనవివాహ ము' కు తలిదండ్రుల భీతి, నిర్బంధము కారణము కాని, దంపతుల ప్రీతికి అందుచోటే లేదు. అట్టివి విహముల నుంచి సరియైన సంతా నమెట్లు గలుగును? విద్య లేని, స్వేచ్ఛ లేని, బలము లేని, సరియైన ఆధర్శము లేని, తల్లికి ధైర్యశాలియగు పుత్రు రెట్లు గలుగును? పూర్వము మన క్షత్రియ వీరులు తమస్త్రీ సమూహములను రక్షించుటకు గదా ప్రాణముల యందు ఆశవీడి రణరంగమున పోరాడు చుండిరి! మనమన్ననో ఇప్పటి సమాజములో స్త్రీ మా నము కాపాకుట పోనిమ్ము, వారికి , అవమానము కలిగింపకున్న చాలును. క్లబ్బుస 'గతి తెలుసునుగదా! కొంచెము అవకాశము గలిగి, నలగురు మెంబర్లు ఒక్క చోట చేరినచో, సంభాషణ పర స్త్రీలను గురించియే! ఈ స్త్రీ ఇట్లు, ఆ స్త్రీ అట్లు -ఇంత తప్ప వేరె సంగతుల సంభాషణయే లేదు. ఆడవాండ్రు ఎట్టివారేకాని, వారి యందు ' ఎట్టిలోపము గలిగి యుండినను, వారిని గౌరవించి

18

ప్రేమించి దేశోద్ధారక కార్యములలో వారిని సహాచరులుగ భావించు మగవాడే నిజమైన మగవాడు. ఆడుదానిని నొప్పించి బాధించు మగవాడు దేశమునకు, దైవమునకును పగవాడే? రఘు:- Ladies & Gentlemen, Three Cheers for the mighty Speach.

ఔరా! రాజా!! Women's Champion నీవే!!! అనాధరక్షకు డవునీవే!!!! ఆహాహాహా! స్త్రీల పాలిటి చింతామణి ప్రాయుడవు నీ వేనయ్యా!

భాస్క:- రఘునాథా! ఇది నీతప్పుగాదు. ఇప్పటి సమాజపు తప్పు. మన సమాజమను నిర్బంధమున పెట్టి ముందు సంకెలలు, మన ము మన స్త్రీలకు తొడగిన ఆసం కెలలే......

రఘు:- భాస్కరా! ఇంక చాలు నీయుపన్యాసము. మాయింట మంగళ హారతికి వేళ అయినది, పోవుదము.

(రాజ యింటిలోనికి పోవు చుండగా, తార లోనుండి వచ్చును. భాస్కరుడు, రఘు నాధుడు వెడలిపోవుదురు. శ్రీధరుడు మరగున నిలుచును)

తార:- రాజా! ఒక్కమాట. రాజ; — ఏమి యిట్లువచ్చితివి!?

తార:- రాజా! ఒక ప్రమాదము సంభవించినది. "స్త్రీలకు ఎట్టి విపత్తులు వచ్చినను సహాయము చేయవలసినది పురుషుల ధర్మ"మని నీవు ఎల్లప్పుడు ఉపన్యాసములిచ్చు చుంటివిగదా! నీ పరీక్ష సమీపమునకువచ్చినది.

రాజ:-అవును చెప్పుచుంటిని. ఆడుదానిని నొప్పించు మగవాడు మగవాడే కాడని ఇప్పుడుకూడ చెప్పితిని. అయిన నీమాటలు నాకు అర్థముగా లేదు. నాపరీక్ష సమయమేమి?

తార:- రాజా!...... నాయందు నీకు నిజమైన ప్రీకి యున్నది గదా?


19.

రాజ:- (ఇటునటు చూచి, శ్రీధరుని కానక , తారను సమీపించి)

తారా! నన్నడగ వలెనా? నీకొరకై నాప్రాణముల నర్పించుట కైనను సంసిద్ధుడనై యన్నానే!

తార:- రాజా! నీవు నన్ను పెండ్లియాడుటకు సిద్దుడ వై యుంటి విగదా!

రాజ:— ఏమి ఇప్పుడే పెండ్లియాడ వలయున నెదవా?. .. అవశ్య చేసి కొందును, విధవా వివాహము సంస్క రణమునకు మొదటి మెట్టు. అదియుగాక నీవు విధవ యేకాదని నాయభిప్రా యము. తొలుతనుండి మనము ఒకరికొకరు ప్రేమించియుం టిమి. హృదయ పూర్వకమైన ప్రేమతో మగ డేర్పడను గాని మంత్రములతో మగడు కాగలడా? ఇప్పుడు వివాహమున కేమి తొందర? నేను ఈతూరి ఖండితముగా B. A., పరీక్ష యందు కృతార్థత నొందుదును. పిదప తప్పక నాకు సర్కారు నెకరీ అబ్బును. నౌకరీలో చేరిన వెంటనే నిన్ను పెండ్లి చేసి కొందును. అప్పుడు తండ్రి భయము లేదు, గిండ్రి భయము లేదు.

తార:- రాజా! నేను గర్భిణిని. (నిర్విజ్ఞుడై దూరముగా నిలుచును.)

తార:-- రాజా! భయపడకుము. నాచేయి విడువ వలదు.

రాజ:- నిజమా?

తార:- అవును.

రాజు:— ఎంత ప్రమాదము గలిగెను! దీని కుపాయ మెద్దీ?

తార.- ఇది ప్రమాద మనుకుంటివా?

రాజు:— తారా! కనలుకుము. ఇట్టిది సంభవించుట ప్రస్తుతము అననుకూలమే కదా!

తార:- మీతండ్రికి తెలిసినది.

రాజ:- ఏమ నెను?

తార:- చెప్పరానిమాట చెప్పెను.

20

రాజ:......................

తార: __ నీకు సమ్మతమేనా?

రాజు:- తారా! తారా!! నేనంతటి కూరకర్ముడనా?

తార - క్షమింపుము. మీతండ్రి నన్ను బెదరించుచున్నాడు. ఎంత ప్రమాదము!! ఇప్పుడేమి చేయవలయును?

తార:- ఏమి చేయవలయునా, ధైర్యము వహించవ లెను.

రాజు:-వహించి?

తార - నన్ను బహిరంగముగ వివాహమాడ వలెను.

రాజ:-తారా! తారా!! ఇది నా చేత కాదు.

తార: - ఇదియేనా నీ ప్రేమ!!

రాజ; _ ఎంతకష్టము!

రాజా! నిక్కంపు ప్రేమ కష్టములను లెక్కించునా? అగా ధమైన, అపారమైన, హృదయ పారావారము నుంచి వెడలు ప్రే మ ప్రవాహమును నిరోధింపజాలు కష్టము లెండైన గలవా? ఇపుడు నన్ను భరించి నగదా నీవు నాకు నిక్కంపు ప్రియుడవు కాగలవు!

రాజ:....................

తార: రాజా! మాటాడవేమి?

'రాజ:-- నా కేమియు తోచకున్నది. తార - రాజూ! నీవు నన్ను భరింప లేకున్న నాకగు నవమానము యోచించితివా? ఇది నీకిష్ట మేకదా!

రాజు:-ఒక వేళ ఎచ్చటికై నను పోయిన.........?

తార:- ఎచ్చటికి పొమ్మంచువు?

రాజ:-నా కేమియు తోచదు.

తార:- రాజా! నేనే, నాతండ్రి గారితో “నీవే” నాభర్త యని చెప్పుదును.


21

రాజు:- తారా! తారా!! వలదు, వలదు, నీవట్లు చేసిన, . నే నెం దై నను పోయి నాప్రాణముల బాసెద. అబ్బ బ్బా! నా చేత కాదు.

తార:- రాజా! దైవమా! నీవే నాగుదిక్కు. (అని వెడలిపోవును)

రాజ:-(కొంచెము సేపు ఊరకుండి, పిదప “My God" !! అని లోనికిపోవును , అదివరకు దూమునుండి వినుచుండిన శ్రీ దరుడు ముందరికి వచ్చి స్వగతము గా,)

శ్రీధ:-ఇప్పుడంతయు తెలిసెను. దుర్బలమగు ఈనాటి హైందవ సంఘ ధర్మము చే మోసగింపబడి సంకటముకు గుఱియైన నిరపరాధి యగు ఈపడుచు భ్రష్ట' యని పించుకొనును. మోసము చేసి మీసముల దువ్వుచుండు హీనుడు శిష్టుడనిపించు కొనును. ఎట్టి దుష్కార్యములు చేసినను, ఎట్టి అకృత్యము లొనరించినను ఇప్ప టి సమాజమున మగ వాడు మాననీయుడే. ఓరీ దుర్బలహృ దయా! సౌఖ్యము ననుభవించితివి. సౌఖ్య బీజము నిందునాటి తివి, దాని ఫలము మాత్రము నీకు విషమా యేగదా? నీవద్దనుం చుకొని సంరక్షించుటమాని ఆమెను హింసించుటయా! (తార నుగురించి తనలో) బిడ్డా! దుఃఖం పకుము. నేను సిద్ధుడుగా నున్నాను నీ సేవ జేయుటకు- పేద నగుగాక , కడుబీదనగుగాక , నిన్నాదరించు టకు- నేను సిద్ధుడ. దీనివలన నా కెట్టకష్టములు గలిగినను కలుగ నిమ్ము. తుదకు మరణము గలిగినను కలుగ నిమ్ము.

నిన్నాదరించితినా, నానౌకరీకథ ముగిసిపోవుట నిశ్చయము. భీమ సేన రావుగారు ఖండితముగా సన్ను గెంటి వేయుదురు! ఇంటిలో మహాలక్ష్మి పెద్దక్క తాండవ మాడుట తప్ప వేరు వైభవము లేదు. తల్లి వృద్ధురాలు.

శ్రీధరా! శ్రీధరా!! నీ కెట్టి జ్ఞానము? జేనెడు పొట్టకై , సర్వప్రపం చమును సర్వకాలముల యందు వ్యాపించి యుండు దైవానుగ్ర హము నే మరచితివా? కవి చెప్ప లేదా? 'ప్రతి గింజ పైననూ ఏదియేది ఎవ రెవరికి జేరవ లెనో వారివారి పేరు వాటిపై ముం దే వాయబడి యున్నదని'. పుట్టించిన దేవుడు నిన్ను సంరక్షింపక పోవునా? ధైర్యమొక్కటి కావ లెనుగాక.!

22

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.