సప్తమైడ్వర్డు చరిత్రము/మూడవ అధ్యాయము
ఎడ్వర్లు "కేం బ్రిడ్జులోఁ జలి కాలమంతయును నుండెను. చలికాలపు రజారోజులు వచ్చెను. పాఠశాలలు మూసిరి, రాణి మున్నగువా రెడ్వర్లు "కూర్రా” అను చోట ధనుర్విద్యా పారంగ తుఁడు కావలె ననికోరి, ఆరజా దినములలో నచ్చటికి బంపిరి.ఎడ్వర్డు అచ్చోటికి వెళ్లి సేనానాయకుఁడైనకర్నల్ పెర్సీవానివలన రణశాస్త్రమర్మంబుల నేర్చుకొని యందుఁ బ్రవీణుడయ్యె.
మూఁడవ అధ్యాయము.
ఎడ్వర్డుతండ్రి మరణము.
ఎడ్వర్డు కేంబ్రిడ్జు కళా శాలయందు విద్యాభ్యాసము సేయు చుండెను. అతఁడాచోటఁ దనయుపాధ్యాయుల యజ్ఞలకు విధేయుఁ డై సహ పాఠకుల నందుఱకుఁ బ్రియుండై యుం డెను. అతడు చదువును ముగించి, అయిరోపా ఖండంబున నుండు డెన్మార్కు- రాజ్యమునకు నోడయనిపట్టి నలెగ్జాండ్రాను యువతీమణిని జూడవలయు నని అతనితండ్రి తలంచి, వారిద్దఱును జర్మనిలో సంధింపవలయు నని కోనెను. ఈ రహస్యము ఎక్వర్డు తండ్రికి హృదయ పేటికాంతర్గతమై యుండెను. కాని అయిరోపాఖండ మందలి వార్తాపత్రిక లారహస్యమును వెల్లడి పఱచెను. అంత సంగ్లండులోని పత్రికలు, ఈ మర్మమును కొంతవఱకు
వెల్లడి చేసినవి.. అయిన ఎడ్వర్డు ఆకాంతామణిని జూచి, తన మనస్సు నకుఁ బట్టినచిన్నదని చెప్పుటకు ముందే ఈ వార్తాపత్రికా భేకంబులు ఈ విషయమును నెల్లడి సేయుటకు నా యల్బర్టు
కొంత నొచ్చుకొనెను.
ఎడ్వర్లు తన భావి ప్రియురాలిని గని వచ్చుటకు స్పేయరు హిడల్ బిగ్గు అనుతావులకు వెళ్లెను. అచ్చట నాకాంతయుఁదస కాంతుని వీక్షించుటకు నే తేచియుండెను. వారిరువురును, ఆతావులలో "రెండురోజులు... వారిద్దఱి హృదయములు లీన మయ్యెను. అంతట ఎడ్వర్డాచోటు వదలి ఇంగ్లండునకువచ్చి, తన యిచ్ఛను తల్లిదండ్రులకు నెఱుక పజిచి కేంబ్రిడ్జి కి జనెను.
ఆల్బర్టు ప్రభువు తన కొడుకు డెన్మార్కు రాజ్యపు టోడయనిపట్టిని జేబట్టు సని సంతసించి వివాహ ప్రయత్నములుసేయ నాలోచించు చుండెను. కాని “తా నొకటిఁ దలఁచిన దైవమొకటి తలంచును" అనులోకోక్తి ఆసత్య మౌ నె? అతడు తనకోరిక ప్రకారము కొడుకు పెండ్లిని "జేసి చూడ లేదు. అతఁ డొకనాఁడు కేంబ్రిడ్జున నుండిన సుతుని జూచి వచ్చుటకు వెళ్లెను.నాడు కేంబ్రిడ్జిన ద్రోణవర్షము వర్షిం చెను. కాని అతఁడు దానిని లక్ష్యము సేయక కేంబ్రిడ్జినుండి ఇంటికిఁ జనుదెంచెను. అతఁడిల్లు సేరి చేరక ముందే జ్వర మాతని నాశ్రయించెను. అతఁడు దానిచే గొంతు శ్రమ పడెను. వైద్యుల నేకులు
తక్షణ మే వచ్చి దివ్వౌషధముల నిచ్చిరి . రానురాను రోగము ప్రబల మయ్యెను. వైద్యులు ఆల్బర్టు బ్రతుకఁ డని నిరాశ చేసి కోనినవారయ్యును, ఆఛానమును వెలి నిడిన రాణీగారు దైర్యమును గోల్పోవుదురని తలంచి, ఏమేమోమందుల నిచ్చు చుండిరి. విక్టోరియా తననాథుఁను జీవించడని నిశ్చయించుకొనెను. ఆమెహృదయసముద్రమునుండి శోకతరంగంబులు కన్ను లను చెలియలికట్ట మేర దాటి పాయలుగ వచ్చుచుండెను. కాని అదేవే తనశోకము నెలింబుచ్చినం బస్సిండ్రు మిగుల దుఃఖంచి దిగు లొందుదురనియేచి దాని లోన నడుచు కొని, అదేవేరితనశోకమును వెలిబుచ్చిన బసి వాండ్రు మిగుల దుఃఖింతురని యెంచి దాని లోన నడంచు కొని అశ్రు కణంబుల గొనగోట జిమ్మివైచుచుండెను.
రాణి రెండవకూతెఉరు ప్రిన్సన్సు అలిన్సు అను చిన్నది పసి దయ్యును, బుద్ధిమంతురాలును, దీర్ఘాలోచన కలదియును, ముందు నేమి కలుగునో అని సంశయించి, కేబ్రిడ్జులో నుం
డిన తనయన్న కుఁ దండ్రి జబ్బుస్థితిలో నుండే సనియును, బ్రతుకుట దుర్లభం బనీయును, తంతెవార్త చేసెను. అతఁడామూటను విని, శోకముచేఁ బీడింప బడినవాఁ డయ్యును, ధైర్య
లక్ష్మిని త్యజింపక వాయు వేగ మనో వేగంబుస వింజరుభవసముఁజేరెని.
అతఁడు తనతండ్రి యైనఆల్బర్టు మరా ణానస్థలో నుంటఁగాంచెను. హృదయము శోక పూరిత మయ్యె. కనులనీరుజులజల రాలి చిన్న చిన్న కాలువలై కడపట గొప్ప ప్రవాహము లయ్యె - . ఆల్బర్టు మోమువన్నె రానురాను కృశించెను. దంతచ్ఛాయ డీలుపడెను. 'పెదవులు నల్ల నయ్యె. ఆల్బర్టు, జుట్టు ముట్టి ఉండిసరాణి ప్రభృతులు ఈచిహ్నము లన్నీ యుఁ గాంచి, ఆల్బర్టు మృఁతి జెందెనని నిశ్చయిం చిరి. రాణీ గొల్లు మని యేడ్చె. ఆయనుపుత్రుడు ఆక్రందనము సేసె. మిగిలిన 'వాండ్రును మిగుల దుఃఖంచిరి. మంత్రు లింతలో విచ్చేసి, రాణికీని ఎవ్వ ర్డునకును, ఊఱటపలుకులు సెప్పి, ఆల్బర్టు శరీరమును, సమస్త రాజచిహ్నములతో వింజరు నుండు సెంటుజార్జి చేపలుస బూడ్చిరి. అప్పుడనేక పరరాజులును విచ్చేసి, రాణికి నామెతన యునకును దుఃఖోపశాంతి వచనంబులు పల్కి, నా యుమ్మలికంబును దొలఁగఁ జేసి, తమతము దేశములకు వెళ్ళిరి . ఎడ్వర్డును, తండ్రి మరణమున కై సర్వదా దుఃఖించుచుం డెను. అతఁడు తనపనులన్నింటిని వదలుకొని, "తండ్రిపోయెను, మనమును పోవు వారమే కదా ? మనకు నీరాజ్యంబు 'లేల ? గీజ్యంబు లేల పుట్టుట చచ్చుట కొరకే, ప్రాపంచిక సౌఖ్యంబు లస్థిరంబులు, ఉన్నంతవఱకు ధర్మ కార్యములు సేసి కొనుచు,భగవప్రీతికర మగుమార్గమున నడుచుచు నుండుట మేలు." అని తలంచి, రాచకార్యంబులకు మనస్సుఁ దగులనియ్యక ఉండెను. రాణియును, మంత్రులును, ఎడ్వర్డు తండ్రి మరణముచే గలిగిన విరక్తిని నుండెనని యెంచి, ఆయన మనస్సు రాచకార్య ములపై విరుగునటుల వాని బురికోల్పిరి. అతఁడును తల్లిమా
టలకుఁ జెవి నిచ్చి, ఆరుముయిష్ట ప్రకారము వర్తింప సంగీకరించెను.
మంత్రులు ఎడ్వర్థునకు వివాహము సేయుట బా గని విక్టోరియాకు: "చెప్పిరి. ఆయిల్లాలు మామాటలు లెస్స అనియెంచీ, తనకోడుకునకు వివాహము చేయుటకు సమ్మతించి, దానికిఁ దగిన యుద్యమములు సేయవలయు సని వాటికి ననుజ్ఞ నిచ్చెను. వారును పెండ్లి కార్యములుసేయ నారంభించి.
నాలవ అధ్యాయము.
ఎడ్వర్డు షెండ్లి.
శ్రీ విక్రయా మసూరాశీ భక్తిను గోలు పోయినది "మొదలు రాచ కార్యములుసేయఁబూనక ఉండెను. ఆల్లుడు జీవించి యుండి సపుడు ఆదేవేరి అతని సాయంబు నన్ని కార్యములను నిర్వర్తించు చుండెను. ఇప్పుడొంటరిగ సన్ని పనులామె నిర్వహింపనలసి యుండెను. ఆమెకు సన్నిఁటం దోడుప దుటకు ఎడ్వర్డు యుక్త వయస్సున నుండెను. అతను తండ్రి మరణంబున కై చింతిల్లు చుండెను. మం త్రులు వానికిఁ బెండ్లి చేసిన నాయఱువుర శోకము తుదముట్టు నను తలంచి, రాణి నాలోచించి తగిన యుద్యమములు సేయసాగిరి.
ఎడ్వర్డు ఒక నాఁడు తన మిత్రులతో సరిససల్లాపంబులు