సప్తమైడ్వర్డు చరిత్రము/రెండవ అధ్యాయము

పదిసంవత్సరములుమాత్రము రాష్ట్రమును బాలించెను. అతని కాలమున నీటియావిరిబలమున నావలును, రైలు బండ్లును నడవఁ దొడంగెను. అతనికి బిడ్డలు లేరు. అతనితమ్ముఁడు నాలవ విల్లియము ఇంగ్లండునకు 1830 సం. న అధిపతి యాయెను. అతఁడు ఏడేండ్లు రాజ్య మేలెను. అతని దొరతనమున బానిస వర్తకము తుదముట్టెను. అతనికి కొడుకులుగాని కొమార్తలు గాని లేనందున అతని తమ్మునికొమార్త యగుశ్రీవిక్టోరియా మహారాజ్ఞి పదునెనిమిదియవ యేఁట రాజ్యమునకు వచ్చెను.

రెండవ అధ్యాయము.

ఎడ్వర్డు పుట్టుక

శ్రీ విక్టోరియా మహారాజ్ఞి కెంటురాజ్యముయొక్క ప్రభువునకు జన్మించె. ఈ కెంటుభూస్వామి భార్యయును, శ్రీ విక్టోరియారాణికిఁ దల్లియును అయినసాధ్వికి సాక్సుకోబర్గు గోతా (Saxe Coburg Gotha) అను రాజ్యమునకు నొడయఁడు సమానోదరుఁడు, అతని రెండవకుమారుఁడు, ప్రిన్సు ఆల్బర్టను నాతఁడు తనకు మేనయత్తకోమార్త యగువిక్టోరియా మహారాణిని వివాహ మాడెను. విక్టోరియా తన మేనమామ కుమారుని వరియించి పెండ్లి చేసికొనె ననిభావము. ఇంగ్లం

డజను లీయిద్ద ఱయందు నింగ్లండునకు నేడయఁడు విక్టోరియారాణి తొలిచూలా లైనపుడు పుట్టు నని మిక్కిలికోరిరి. కాని వారియ: భిలాష పర్తిపూ కాలేదు. విక్టోరియా ఆల్బర్టును జేఁబట్టినకొలది నెలల కే గర్భవతియై ఆఁబిడ్డ నొక దానిం గనెను. విక్టోరియా మగబిడ్డను గను నని మిక్కిలి "కాంక్షతో నెదురు చూచు చుండిన జనులు తా మొకటి తలంచిన దైవ మొకటి తలఁచును.” అను లోకోక్తి నిజమని డెందంబుల నమ్మి రెండవతడవ నొకాంత గర్భమైనపు డైనను పురుష శిశువు పుట్టడా యని యెదురు చూడసాగిరి.

పదునెనుమి దివందల నలువది యొక సంవత్సగుంబున మేనెలలో విక్టోరియు మహారాణి ద్వితీయగర్భమును ధరింవెనని జను లుప్పొంగఁ గడంగిరి. కొందఱీ తడ వయై నను మగ బిడ్డ పుట్ట: డా" అని తలంచి. మఱికొందరు " అడు వారికి గర్భము వచ్చుట యొక గండము. పురుష శిశువైన నేమి? అను బిడ్డైననేమి? ఆడశిసువు చేదా? ఏమి? పురుషుని మోసిన నాఁడు బిడ్డను దొమ్మి ది నెలలు ఆ సాధ్వీ మోయ లేదా? ఎనరై? నేమి? ఆమహా రాణికి సుఖ ప్రసవమై, రెండుతలలు వేరు పడి భూమిని జీపము నుండి మనల నేలుట యే కొడుకును గని నంతభాగ్య ము." అనిరి. వెండియుఁ గొందరాయమ్మను గండము తప్పించుకొని బ్రతుకుటయే తమ మేలని. ఇటుల ననేకు లగేక భంగులఁ జెప్పుకొను చుండిరి.

ఇంతలో నామహారాజ దొమ్మిది నెలలు సంపూర్ణములయ్యే. కాని అదేవేరి యిసుమంత యైనను శ్రమము సెందక నడుము బలిసి దేహము భారముతో నుండినను అటు నిటఁ దిరుగాడుచు నే ఉండె. 1841 వ సంవత్సరమున నవంబరు నెల 8-న తేది నాడాయిల్లాలు సంపూర్ణ గర్భభారమున బకింగ్ హామున తిపుర పుటు ద్యానవనమున నుదయంబునఁ గోంత కాలము నడిచెను; నాఁటి మధ్యాహ్నంబున నాయమ బండిలో గొంతదూరము కాని పోయెను. సాయంకాలమునందనయింట నడిచినవిందు. నారగించి, యచటికి విచ్చేసిన వారితోఁ గొంత కాలము ముచ్చట లాడుకొను చుండి సుఖనిద్రఁ జెందెను.


ఇంతలో గోడి కూసెను. తూర్పు దేసం జుక్క వుడమె.పిట్టలు చెట్టులతుదకు కిలకిలా రవములు సేయఁ దొడంగెను.చీకటులు మూలమూలలఁ బరుగిడఁ జొచ్చెను. అరుణోదయమయ్యే. ఉదయాద్రిని మిత్తుండు వుడమెను. వందిమాగధులు విక్టోరియా రాణిని నిదుర లేపుటకు గానము సేసి.. అతరుణీ మణియును కొంచె మలసటతో లేచి భగవంతుని ధ్యానించి,యుదయ కార్యముల నెరవేర్చి యప్పుడప్పుడు నడుము క ళుక్కని నొప్పీ సూపినను దాని నంతగ గమనింషక వేదన లేని దాని కై వడి రాచ కార్యములను విచారించు చుండెను. కాని రానురాను ఆబాధ మఱింత వృద్ధి చెందెను. అయిల్లాలు మిక్కిలి యోర్పుతో. నా వేదన ననుభవించు చుండెను. ఉదయ

మున "నెనిమిది గంటల కాగృహిణి ప్రసవ వేదన చెందు చుండెసని ఆ సాధ్వి తల్లి గారికిని, ఇంకను 'రాజు బంధువులకును, మంత్రులకును, సేనానాయకులకును, 'కాంటెగ్బెరి ఆక్చిబిషపు, లండను బిషపు, మున్నగువారికి వార్త వెళ్లను.

ఈ శుభవార్త లండను పురమంతట నల్లుకొనెను. మహారాణి బకింగు హాముమందిరంబున నెప్పులు బొందు చుండెను. ఒకో కొకరుగ నలు:గడలనుండి పెక్కురు నచ్చు చుండిరి.రాణి గృహకృత్యముల విచారించు: ప్రభువు, మొదట వచ్చెను. అవలఁ బ్రధానమంత్రి సర్ రాబట్టుపీలును, రాణి తల్లియును, లండను బీషపును, డ్యూక్ ఆఫ్ వెలింగ్టను మున్నగుదొడ్డవారేతెంచిరి. "రాణీ భర్తప్రిన్సు ఆల్బర్టును, "వీరులా కాక్కును, దాది లిల్లియును, రాణి కొడుకును గనిన కాలంబున నాయమ దగ్గర నుండిరి. అచ్చట గుంపు చేరిన నా యమబాధ మరింతహెచ్చు సని తలంచి అక్టు రాచకుమారుఁ డిని జేర నియ్యక రాణిసమిషంబున నుండె. 1841 - వ సంవత్సరమున నవంబరు నెల 9వ తేదీని ఉదయమునఁ బదునొండు గంటలగుటకు బండ్రెండు నిమిషములకు ముందు రాణి శుభలగ్నంబున మగశిశువును గనెను. అప్పుడు రాణి తల్లి పురుటి గదికి ఒక్క గొట్టున నుండెను. పురిటి గదికి నెదుట నుండు గదిలో వైద్యుల నేకులు రాణి గారికి మందు లొసుగుటకు సర్వసిద్ధులై యుండిరి .ప్రధానులును, సేనా నాయకులును, మతగురువర్యులును, ము న్నగువారు క్రిక్కిఱిసి గుంపులు చేరి యుండిరి. రాణీకి పురుష శిశుపు పుట్టగానే, డాక్టరు లా కాకు సర్ జేస్సు క్లార్కుతో నామేలిమాట 'నెరుక పఱచెను. అతఁడు మంత్రులకు నా శుభ వార్త తెలియఁ జేసెను. వా రందజు నానం దాబ్దిని మునిఁగిరి దాది రాణిగారి తల్లికి నాశిశువును జూపెను. ఆపల నామంత్ర సానిబిడ్డను దన కేలను గొని ప్రిన్సు ఆల్బర్టు ననుజ్ఞను గైకొని యచ్చట గుమి కూడిన గొప్ప వారండఱకు నా బిడ్డను జూపెను. అందురు ఆ రాచబిడ్డను గాంచి తమకుఁ బ్రభువు పుట్టెగదా యని మనంబున సంతోషించిరి.


మంత్రు లింతలో నాశుభ వార్తను లండనుపురి గలయ జల్లిరి. ఆయుధ శాలలయందలి పెరంగులు ఇంగ్లండునకు నోడయఁడు పుట్టె నని తెల్పెను. గుడులలో వ్రేలాడుగంటలుమ్రోగె. కోటల పై బతాకలు, తల 'లెత్తియాడసాగెను. బకింగుహాము భసనము చుట్టు ననేకులు గుంపులుగూడి రాణికి మగశిశువు పుట్టెనని పలుకు నుండిరి. వేయేల? నాఁ పురవరంబున “ఓసీ అక్క ! మనకాణి చిన్న మగశిసువును గన్నందటే? పోయి చూతము రారమ్ము.” అనునారీమణులును, "ఓయి! "నేడు మనతో గూడి యాడుటకు రాణికి ఒక పురుష శిశువు పుట్టినాడట! వానితో మసము గోలీలు బొంగరములు బాగుగ నాడుకోనవచ్చునోయి ? అబిడ్డను చూచి వత్తము. రండి." అని పలికికొను బాలకులును, “ఎన్నాళ్ల కెన్నాళ్లకు

ఇంగ్లండు రాణికి గొడుకు పుట్టట? మన కేమి కొఱత? దేవుడా బిడ్డకుఁ జిరాయు వొసంగి రక్షించుగాత !" అనునట్టి జనంబులనేకు లుండిరి.

లండను సగర మంతకుఁ బూర్వము నిదుర పోవుచుండినరీతి నుండెను. ఇంద్రజాల మహిమచే నాపురవరము కను రెప్పుపాటు కాలములో నిదుర మేలు కొనినటులఁ గనుపట్టె. కుణ కాల ములో శ్రీ విక్టోరియా కొడుకుఁ గన్ననను శుభవార్త పట్టణము కలయ నల్లుకొ నెను. ఉద్యానవనముల యందలి సేనలును, గోపురశిఖరము లందలి పరి వారమును పిరంగులను గాల్చిరి. కోటబురు జుల పైఁ బతాకలు వెలుగఁ దొడుగెను.క్రైస్తన దేవాలయములలో గంటల మోత నింగిముట్ట జెలంగెను. పురమునందలి ప్రజలు శ్రీమంతులును, బీదలును,పెద్దలును, చిన్న లును, వేన వేల మంది గుంపులు గూడి బకింగుహాముభవము చుట్టు . 'బాలరాజ బింబమును గనులా ర వీక్షింపఁ గౌతూహలాయ త్తచిత్తు లై యుడిరి - వారు బకింగుహాము నగరునకు నెదుట, శ్రీరాణి గారు నేఁ! యుదముస బది గంటల పైని నలుబది యెనిమదినిమిషము లప్పు డొక రాకొమరుని: గని. రాణిగారును రాచబిడ్డనుచు మంచి రూగోగ్యస్థితి నున్నారు." జేమ్సు క్లార్కు, యం.డి. ..

  • చార్లస్ - లాకాక్, య.. డి.

“ రాబర్ట్ 'ఫెర్గూసన్ , యం. డి. « చర్డ్ బాల్ట్ డస్ .

  • బకింగుహాముని ధము .

1851 సం. ము. నవంబరు నెల తేది మంగళవారము ఉదయము పదునోకం డునర గంటలు". అని పెద్దయక్షరములు వ్రాసిన ప్రకటన పత్రికను గాంచి రాచకూనను జూడ వీలు లేనందునఁ దమతమపొందు పట్లకు వెళ్లిరి. .

ప్రీప్ కౌన్సిలు సభాసభ్యులు శ్రీ రాణిగారు బా లెంతయై యుండుటచే నాదేవేరి ప్రాణ నాథుడు “ఆల్ర్టు" ప్రభువు యొ క్క యాజమాన్యమునఁ గూడీ, శ్రీ విక్టోరియా రాణిగారు సుఖ ప్రసన మైనందులకు భగవంతునకు గృతజ్ఞతాపూర్వక వందన ముల నర్షింపనలయు ననియు నావందనములు కలవచనములు శ్రీకాం టెర్బెరి ఆర్చిబిషపు వ్రాయవలయు ననియును, 1841 సం. ననంబరు నెల తే 14 ది. ఆదివారమున ఇంగ్లండులో క్రైస్త దేవాలయము అన్నింటి యందును ఆయాగుడుల యధి కౌగులు తమతము గుడులలో నా వాక్యావళిని బఠింపవలయు ననియుఁ దీర్మానించిరి, కాంటెర్బరీ ఆర్చిబిషని.ఇటుల బలి కె.ను. భూతదయాత్మ స్వరూపుడైన ఓ దేవా!. మాతండ్రీ నీదయ వలస లోకమున జనులు వృద్ధి యగుచున్నారు. కరుణా మృతము లొలుకు నీ కటాక్షవీక్షణములచే స్త్రీలకుఁ బ్రసవసమ యమునఁ బొరయునాపదనుండి శ్రీరాణిని గా పాడి యాదేవి కడుపున నొక పుత్రుడు పుట్టునటుల దయచేసి న మ్మిక నేలు ఱేనిని మాకునందఁ జేసితివి. ఇంతవఱకు నాదేవిని రక్షించిన భంగి సింక పై నారాణిని గా పాడుచు నని మేము నిన్నుఁ బ్రార్థిం చుచున్నాము. ఆదే వేళకి బలము లేని వేళ మంచిసత్తువ నోసంగి సౌఖ్య 'మొదవఁ జేయుము. ఇప్పుడు మారాచబిడ్డనియత్మకు గాని శరీరమునకుఁగాని కీడుపొరయకుండునటులఁ గాపాడుము. అబాలుఁడు పెరుఁగను బెరుఁగను సుజ్ఞానము పొదలఁ జేయుము, ఈ ప్రాట స్టెంటును తాచారములను, మా దేశస్థులను, ప్రపంచ మును, గాసాడునీవు నీమేలిగొనములు గలవానిఁగ నారాచ బిడ్డని నొనర్పుము. మిక్కిలి ప్రేమతో మారాణిని, ఆయమ కాంతుఁ డగునాల్బర్టు ప్రభువును, ప్రాపంచిక సౌఖ్యముల నన్ని టిని నిరంతరాయముగ ననుభవించు నటుల దయ చేసి, నిష్క శంక మైనదియును, అచలమైనదియును, అయిన కీర్తి కాముడిని వారిద్దఱు పొందునటుల సనుగ్రహింపుము. నీ హృదయమునం దలి కరుణామృతము, నీ ప్రజలచి తంబునఁ బ్రవహింపఁ జే యుము; ఏవేళ విడువక నీయాజ్ఞలను నిర్వర్తింపఁ జేయు టకును, మే మందఱమును సోదరభావముతం మెలఁగు టకును, మా రాజును నిండు ప్రేముడిని గౌరవించుటకును,మాకు ననుజ్ఞ నిమ్ము. నీ పేరుల మాకు దయచేసి కలుగఁ జేసిన నీ యాజ్ఞలను నీ యెడ భయభక్తులతో శిరసావహించి చేయ, మాపుట్టువు సాఫల్యము మొందును. మాప్రభు వైనయేసునాధుని సాయమున మీ పొద సేవకుఁ దుట్టతుదను "మేము 'రాఁగలము.తథాస్తు" ఈ భాషగర్భిత మైన వాక్యముల సారాంశము శీఘ్రము సనే ఫలించెను.రాణీయును, శిశువును, ఆరోగ్యవంతు లై దినదినమున వర్ధిల్లుతుంది. నాటి సాయంసమయమున గుడులలోను,రాజవీథులయందును, లెక్కకు మిక్కిలి యైనదీషములు వెలుంగ సాగెను.జనులు " రాత్రియంతయు నిదుర నోవక వీధులలో గ్రుమ్మరుచుండిరి. ఎక్కడ జూచిన గుంపు.ఎవ్వరు మాట్లాడినను రాణిబిడ్డనివృత్తాంతమే. . కాని వేఱొంసంగతియే లేదు. నాటక శాలలయుదు నాట్యమునా డువారు " భగవతుడు రాణినిరక్షించుఁగాత ! " అని పొడిరి. లండను పురిపౌరులందఱును నాటీ రాత్రి నాకోమారుడారోగ్యవంతుడై దేవుని కృపవలన బ్రతుకుం గాక అని కోరిరి.

మజునాఁ డుదయమున లండను టైము పంచ్ మొదలగు వార్తాపత్రికలు వాణీ చిన్న కుమారుని బలువిధముల దీవించెను.

శ్రీ విక్టోరియా మహారాజ్ఞ కి పుత్రులను పుట్టే సనుశుభవార్త యనేక రాజ్యములకు నేగెను. అందలి జనులు దమ యనురాగమును భ క్తి విశ్వాసములను దెలుపుచు రాచబిడ్డడు చింరంజీవి యై మంచిమనుగఁడ గనవలయు నని కోరుచుఁ దమయాసందమును పలురీతుల వెలి బుచ్చిరి. శ్రీ విక్టోరియా మహారాణి కి లో బడిన రాజ్యములయం చెల్ల యెడల సుమంగలులు రాశిబిడ్డని “చిరంజవ " అని మంగళంబులఁ బాడీ. శ్రీరాణికి సీమం తపుత్రుడు పుట్టెనని సెయిం టుజార్జి చేపలున జనసమరణ లేఖలు పుస్తకమున దాఖలుచేయఁబడెను.

ఇంగ్లండు రాజు పెద్దకొడుకును కారన్ వాలుప్రభు ననియును(Duke of Cornwall) రోత్ సే రాజ్యమునకు నొడయఁజనియును (Duke of Rothesay) కారిక్ ప్రభు వనియును (Earl of Cartick) మొద లగుబిరుదు లలంక రించెను. కాని [1]* * ప్రిస్ ఆఫ్ వేల్సు" అను బి.రుదు నాతఁడు తాను పుట్టిన నెలదిసము లైన పిదప బొందెను.

రాణియును మంత్రులును మొదలగుగొప్పన వారు తొలి నెలయంతయును గాని కాక నాల్ ప్రభు వనీ పేర్కొనసాగిరి. ఆకూన పెట్టి వెన్నముద్దవలె దిన దిన ప్రవర్ధమాసయగు చుండెను. శ్రీరాణీయును కాకూనయును రాను రాను .............................................................................................. •

ఆరోగ్యవంతు లగుచుండిరి.

ఎడ్వర్డు " ప్రిన్స్ ఆఫ్ వేల్సు " అనుబిరుదు నొందుట.లండనుపురము జన బాహుళ్యము చే సనారోగ్యకర మైనదని వైద్యులు సెప్పినందున శ్రీ విక్టోరియాయును, భర్తయగు నాల్బర్టు ప్రభువును, తమ బిడ్డలను వెంట నిడుకొని మిక్కిలి యారోగ్యప్రదేశ మైనవింజరునగరున నివసింప 1841 సం. న డిసంబరు నెల 6 వ తేదీన 'వెళ్లిరి. అచ్చటఁ దల్లియును, శిశుపులును, క్రమముగ నారోగ్యవంతులైరి. ఆతావునకు "నే తించిన రెండవదినమున ననేక సామంతప్రభు పలయెదుట, శ్రీవిక్టోరియా మ హారాన్ని తన సీమంతపుత్రునకు "ప్రిన్స్ ఆఫ్ వేల్సు" అను బిరుదు నొసంగే. మొదటి ఎడ్వర్డు ఇంగ్లండును పాలించెను. అతడు " వేల్సు" అను రాజ్యభాగమును జయించి, తనరాజ్యములో దానిఁ జేర్చుకొని, ఇంగ్లండు ఱేనికిఁబుట్టు పెద్దకుమారుఁడు " వేల్సు కాజ్యభాగముగకు యువ రాజు , " అయి యుండునని శాశించెను. ఆయన చట్ట ప్రకార మప్పటినుంచి యిప్పటివఱకు నా యువరాజు పదము ఇంగ్లండు రాజు జ్యేష్టపుత్రునకు లభించు చున్నది. ఇప్పుడు సదేవిధమున నెడ్వర్డు 1841 సం. నడిశెం బరు నెల 8 వ తేదీని,వేల్సు రాజ్యభాగ ముసకు యౌవ రాజ్య పట్ట భద్రుఁడయ్యె.

శ్రీ యెడ్వర్డునకు జ్ఞానస్నానము జరుగుట,

1842 సంవత్సరమున ఎడ్వర్డునకు జ్ఞానస్నా సము జరు

గవలసి యుండెను.అతని తల్లితండ్రులును, ప్రధానవర్గంబులును, కాంటెబర్బెరీ ఆర్చిబిషప్ మున్నగుమతాచార్యులును, మొద లగు గొప్పవారు చేరి జనవరి నెల 25వ తేదీ మంగ ళవారమున ఎడ్వర్డునకు జ్ఞానస్నానము జరుగ వలయు నని నిశ్చయించిరి. వా రామహోత్సవము వేడుకను మిగుల వైభవమున నొనర్పవలయు నని కోరిక. రాణిగారును, ఆయమ ప్రాంణ మిత్రుఁ డగునాల్బర్టు దొరగారును, ఎడ్వర్డునకు జ్ఞానస్నానమునునామక రణమును, ముందు రాచబిడ్డలకు రాజుంతః పురమందిరంబున జరుగునటుల గాక సర్వసాధారణముగ నండఱ బిడ్డలకును జ్ఞానస్నానము నడుచువిధంబున దేవాలయంబున నడుపవలసిన దని తీర్పు నేసి, తమతీర్చును మంత్రులకు నెఱుక పజిచిరి . .వారును 'కాంటెర్బెరి ఆర్చిబిషపు నాలోచించి రాణిగారిమాట యుక్తియు క్రిముగ నున్న దని యెంచి యాదేవి మనో భీష్ట ప్రకారము వర్తించి నిశ్చయించుకొనిరి.

రాణీగారు అమ హోత్సవమును జూచుటకు రమ్మని అయిరోపా లోని దొరలకు పలుజాబులు వ్రాయించెను. ఇంగ్లండునందలి జనులు దమరాణీ ముద్దు శ్శువునకు నామక కణము జరుగు నని కౌతూహులు శ్రీ బాల రాజబింబమును దరింపు నువ్విల్లూరు. చుండిరి. వి.దేశములనుండి. భూపాలకు లనేకు లింగండ్లునకు విచ్చేసిరి. "వారివారి పదవులకుఁ దగిన రీతిని విడిదిలమరి యుండెను. రాణిగారును ఆయమభర్తయును తమయిం

టికి వచ్చినయతిథులకు స్వాగతం బొసంగి, వారిని పలు తెఱంగుల గారవించి, ఆ భూధవులలో జర్మనిచక్రవర్తి పరమ ముఖ్యుడు. ఆయన రాణి కుమారునకు నామకరణము సేయ నియమితుఁడై యుండె.

1842 సంవత్సరము జనవరి నెల 25వ తేదీని లండనున గరనరము సౌభాగ్య గరిమ నెంతని వర్ణింప నగు ? నాఁ డెచ్చటంజూచినను జను లనేకులు గూడి " నేడు రాణి వుత్రునకు నామకరణమట. రాజులును, రాణులును, రాజబంధువులునుప్రధానులును మున్నగువారు మిగుల వైభనంబున నశ్వంబుల బూన్చీన శకటంబుల పై లండనుపుర వీథుల నూ రేగుదురట! అతిమనోజ్ఞ మైనచూపు. ఆహా ! నేఁడుగదా మనము నోచిన నోము లన్నియు సఫలము లగుట " అని గుజగుజులు సల్పు చుండిరి, లండనుపురి వీదులతిరమణీయంబుగ నలంకృతం బై యుండె , నానావిధము లైనపచ్చతోరణములు రాజద్వారంబులం గట్టబడెను. పౌరులు తా మనేక రీతుల సింగారించుకొని మేడలపై రాజపరివారమును జూడ నిలుచుండిరి. వీధులకు నిరువైపుల ననేకులు నిలిచి యుండిరి.మికొందఱు ప్రాకారంబుల నెక్కి వానిమీఁదఁ గూర్చుండిరి. ఇంకఁ గొందఱు వృక్ష శాభాగంబుల నొక్కి, వారందఱుబాలరాజ వదసమును జూడ మిక్కిలికోరినవారైరి. 'రాజాంతఃపురము చాయ నే దృష్టి సారించి చూచు చుండిరి. రాణీకుమారునకు నామకరణము నాడు మధ్యాహ్నమున ఒక ఘంటకు నడువవలసి యుండెను. సెయింట్ జార్జి చేపలు భవన మతి రమ్యంబై యలంకరింపబడి . యుండెను. "కాంటెర్బరి అబిషన్ ముందు నందుఁ బ్రవేశించి తనపీఠము నలంకరించి యుండె. అతని వెంబడించి మతగురు లనే కులు విచ్చేసి వారి వారికి చేర్చంచిన యాసనముల పైఁ గూర్చుండిరి. విదేశ రాజులను, చక్రవర్తులును, రాణితల్లి గారును, మున్నగువారు వరుసగఁ జనుదెంచిరి ఆవక బ్రాష్యారాజు , విల్లియము ఏతేంచెను. అతని వెనుక రాణియును, ఆమె భర్తయును, బిడ్డఁ దమవొడి కి నిడుకొని సెయింట్ జార్జి: చేపలు గుడికిసరు చెంచి, నారును దమయాసనముల నలుకరించిరి .. సెయింటు; జెమ్సు చే పలు నిశ్శబ్దంబుగనుండె.. కాంటెర్బరిఆర్చి బిషప్ లేచెను. ఆతని హస్వంబున "రాణీ దాదిరాకోమారు నుని చెను. ఆ మతగువు ప్రష్యాచ వర్తిని పిలిచి చిరుత పేరు వచింపు మని వేడెను. ఆ పుడమి రేడు “ఆల్బర్టు ఎడ్వర్లు" అని గంభీర స్వరస్వసంబున స్పష్టము గ నందరి యెదుట: బలికెను. మతాచార్యుడంత ఆల్బర్టు ఎడ్వెర్డు నకు కూత (ల) జానస్నానము నాచరించు చున్నాను ". అని తన యెదుట నుండిన బంగారు కలశంబుల జలమును రా కొమరుని మోము నెల పైఁ బ్రోక్షించెను. మంగళ స్వనములు నింగి ముట్ట జెలంగె. పీరంగులు సేసల సంతోషమును దెలుపుచుండినను రీతిని . గుభా

ల్ గుభాల్ అని మ్రోగెను. గుడులలో ఘంటలు వాగెను.అనేకులు పెక్కు రీతుల జప్పట్లు తట్టి, తమ సంతోషమును తెల్పిరి. మతగురు వీ తెఱంగున 'రాకొమారునకు జ్ఞానస్నానమాచరించెను. నాటి సాయంకాలమున విదేశములయందుండి విచ్చేసిన రాజు బంధువులును, 'రాణిమంత్రులును, మతా చార్యులును, మొదలగువారు రాణిగారు చేసినవిందు నారగించి, తమతమ వీడులకు వేంచేసిరి.

ఎడ్వర్డును లేడి లిటల్టన్ పెంచుట,

ఎచ్చట నైనను శ్రీముతులలో లేక లేక పుత్రుఁడుపుట్టి పుట్టక ముందే వాన్ని తల్లిదండ్రులు నానికి బలుపలుకుల నేర్చుటకుఁ గోరు చుంచుదురు. శ్రీమహాచక్రవర్తిని బిడ్డని విద్యావిషయ మై వేఱుగ వచింపవలయు నా ?శ్రీరాణీగారును,ఆయముభర్తయును, తమసీమ తపుత్రు: బెంచుటకును, అతనికి దగినవిద్యాబుద్ధులను గఱపుటకు సర్హులైన ఉపాధ్యాయుని వెదకుటకు నారంభించిరి. రాణి రాచకార్యము "నర్పవలసి యుండె. ఆ యిల్లాలు డవబిడ్డలను బెంచుటకుఁ జాలినంత కాలము లేదు. పుట్టి సబిడ్డడు సామాన్యులకుఁ బుట్ట లేదు. అతఁడు ప్రపంచములోఁ బంచమాంశమునకు నేలికయగుసట్టి వాడు. అట్టీడు దుష్టుల పొత్తునఁ జేరక, మెలఁకువబెరుఁగవలసి యుండె. ఆంగ్లేయ దేశాచార వ్యవహారములాత ను 'బాగుగ నెఱుంగవలసియుం డె.. వారి మతస్వభావ

మిట్టి దని అతఁడు నేర్వవలసియుం డే. ఇంతియకాదు.. అతఁడు రాజనీతి యును, సమస్తశాస్త్రములను, నౌకాశాస్త్రమును,విలువిద్యయును, ఎఱుఁగవలసియుండె. ఇన్ని శాస్త్రములు, దెలిసినపండితుఁడు రాణికి లభించునా? లోకములో నిన్నియు నొక్కనికి తెలియునా? ఆఱు నెలల బాలుఁ డిన్ని వివిద్యలు నేర్చుకొన గలడా రాణిగా రివన్నియు దీర్ఘముగ భర్తతోను మంత్రులలో ప్రధాను. డైనమెల్ బోరన్ ప్రభుపుతోను, తన నాథునకు నంతరంగ మిత్రుఁ డైన స్టాకుమరుతోను, బాగుగ నాలోచించి, రాకోమరుఁ దేండ్ల వాఁడగుదాక వానిని బెంచుటకు మంచి తెలివి తేటలు కలదానిని నియమించుట లెస్స అని తీర్పు నే సె., అనేకు లాయుద్యోమునకు దర ఖాస్తులను బంపిరి. కానీ వారిలో లిటల్ టన్" ప్రభువు భార్యామణియును, రెండవ "స్పెన్సర్ ప్రభువు పుత్రికయును, అయిన " లేడీ లిటిల్ టన్ " అను చేడియను తన బిడ్డలను సాకుటకు విక్టోరియా మహారాణి తనహృదయేశు సమ్మతిని బొంది నియమించెను.

1842 సం. న ఏప్రిలు నేలలో నారాచు బొట్టె బెంచుటకు నాలిటిట్టను దాదిగ నమరి ఆహోదాలో బొమ్మిదేండ్లుండి, 1852 సః న ఈ యుద్యోగమును వదిలి, 1870 సం. 3. దీర్ఘనిద్రః జెందె. ఈ తొమ్మిదేండ్లలో నానారీమణి రాణీగారి బిడ్డలనుపోకిరీల డాయం బోనీక మిగుల జూగరూకతతో వారిని సాకి, .

శ్రీవిక్టోరియా ఆల్బర్టుల మనస్సు కెక్కు-నటుల వర్తించి, వారి'మెప్పు వడ సెను. ఆ చిఱుతలును, ఆముసలిది తమ్మువదలి వెళ్లుటను ఒల్లక కన్నీరు వరద లై ప్రవహింప నేడ్చిరి. కాని ఆవృద్ధు రాలు వార్ధక దశలోఁ బాటుపడ లేక విశ్రాంతి పొందఁ గోరి,రాచబిడ్డలకు దాదీయై ఉంట మానుకో నెను. సారవంత మగు నేల సదా మంచిపంట నిచ్చు చుండును, లోకములో మంచి దంపతు లని ఏయాలుమగలఁ జెప్పవచ్చును? గృహస్థునకుఁ దగినయిల్లాలును, ఇల్లాలికిఁ దగిన గృహస్థుఁడును, చేరి, యన్యోన్య ప్రీతిని మెలఁగి యేఁటేంట; గాకసోయినను రెండేండ్ల కొకతడవ యైన. "ఒక బిడ్డను గనుచుగన్న బిడ్డలు సురక్షితముగఁ జిరాయువ్రు లై యుంటఁ గాంచి సంతసించుచు నుందు లేని వారి దాంపత్య మన్నీ విధములఁ బొగడఁదగినది. ద్రవ్యమున్న నేమి ? లేకున్ననేమి ? ద్రవ్యయము శాశ్వతమా ? బీదఱికము శాశ్వతమా ? మన మొప్పటికీ జరజీవు లమై యుండు వారమా ? బీద సంసార మైనను లేదని మగని నలయింపక అతఁడు దెచ్చిన దానిని గుట్టుగ సంబలీగనో సంక టీగనోకాఁచి చేసి వానికి నిడి తాను కుడిచి బిడ్డలను గనుచు మనుగడ గాంచునదియే మంచి యిల్లాలు.

విక్టోరియా రాష్ట్ర భర్తయగు నాల్బర్టును పర దేశమునుండితన యింటిలోఁ గడుపుకూటి కై యిల్లంట్రముండఁ జనుదెంచినమగనికై వడిఁ దలపక ఆప్రభువు. ప్రేమించి ఆయనమనోరథ

ప్రకారము తానే వేళవర్తించు నాతని సుఖ మే తన సుఖమని తలంచి, మిక్కిలి కూర్మితో నాతనియెడఁ బ్రవర్తించు చుండెను.1848 సం. న విక్టోరియామహారాజ్ని క్రమ్మర గర్భవతి యై యేప్రెలు నేలలో నొక యాడు బిడ్డనును గనెను. ఆమె పేరు ప్రిన్సన్ అలైన్ రాణి పెద్ద కూతురును, పెద్ద కోమరుడును, లిటిల్టన్ దొరసాని స్వాధీనమున ““ వింజురు " గ్రామంబుననుండిరి. కాని యా రాజులంతులు తమ ప్రియశిసువులఁ జూడక యుండనొల్లక వింజరులో సుండినకూతుఁ గొడుకుఁ బిలువ నంప వారును లిటిల్టన్ దొరసాని వెంట: దమతల్లికడకు నేతెంచిరి. ఆమహారాణి రాచకార్యము లెన్ని యుండినను, లిటిల్టన్ దాదియెంత గారాబాముతోదన శిసువులను బెంచు చుండినను తానుస్వయము వారిని విచారింపక యుండిన నెన్నడును లేదు. అదేవేరి తన భర్తతో రాచ కార్యముల నిర్వర్తించుకోనుచుడనబిడ్డలు యాటపాటలను గాంచి యాసందసౌఖ్యంబులబొరయుచు నుండెను.

లండను నగరమున నా విక్టోరియా మహా రాణి భర్తతోను తన బిడ్డలతోను 'కాలము సుఖముగ ,గడుపు చుండెను. 1844 వ,సం. న ఆల్బర్టు ప్రభు వు పరలోక గతుడయ్యె. రాణి తండ్రి మరణమునకై వగ చెడితన ప్రాణసఖుని ఊరడించి యతని దుఃఖము శాంతిల్లఁ జేసెను. అప్పుడప్పుడ నేక రాజ్యముల యందుండి హాస్య గాండ్రును, నర్తకులును, పాటకులును పెక్కు

మంది "రాణీ యాస్థానమంటపంబునకు వచ్చి వారి వారి విద్యలనురాణికిని, ఆయమబిడ్డలకును, కనఁబతిచి, వారినానం దాబ్ధిని నోలలాడించి, వారివలన బహువిధ భూషణంబులఁ బొంది తమ తమ పొందుపట్లకు నేఁగు చుండిరి. ఉన్నట్టుండి యాయేఁట రుస్యా చక్రవ ర్తి నికల్ హా సనునాతఁడు లండనుపురికి నే తెం చెను. శ్రీ రాణీయును మంత్రులును ఆయనను బహుభంగుల గౌ'రం చిరి. ఆ పుడమిదోరయును 'రాణి నిసువులఁ గాంచి, వారి నెత్తుకొని, ముద్దాడి, అచ్చట గొన్ని దినము లుండి పిదపఁ దన రాజ్యంమునకు మఱ లెను. 1844సం. న ఆగస్టు నెలలో శ్రీమహా రాణి రెండవకొమరుఁ గనెను. జనులు రాణికి నాల్గుమంది బిడ్డలుదైవకృపాకటాక్షంబునఁ బుట్టి వర్ధిల్లుచుండి రని ప్రమోదభరిత చిత్తులై , కాయును భక్తయును ఆ పుట్టిన రాకొమురునకు " ఆల్బర్టు అర్నెస్టు" అని పేరు పెట్టిరి. ఆబిడ్డఁడును దినదిన ప్రవర్ధమానుఁ డగుచుండెను. రాణియును ఆయమహృదయేశ్వరుఁడును బిడ్డలును కొన్ని దినములు లండనుసగరమునను, వింజరుమందిరంబునను, మఱి కొన్ని రోజులు ఆస్బోర నను అంత్ః పురము నను మొద లగుచోటుల విశ్రాంతి జెందుచు నుండిరి , 1846 సం. న శ్రీమహా రాణి మఱొక యాఁడు శిశువును గనెను. దాని పేరు హెలీ. అవల సెడ్వర్డు తన తల్లిదండ్రులతో బడవలోఁ గారన్ వాలునకు నే గెను. అచ్చట ప్రజలు వానిని జూచి సంతసించి, రాణివెంట నతఁడు తిరిగి తనవీటికీ నరు.


చెంచి, యింటఁ గొన్ని రోజు లుండెను. అతని తల్లిదండ్రులుతమబిడ్డల నెచ్చటికీ బంపక, తమకడ నే ఉంచుకొని, వారిని గాంచి, తత్సుఖము కొంచుచుండిరి.

1847 సం. న ఆగస్టు నెలలో శ్రీ విక్టోరియా రాణిభర్తృస మేత యై "పెద్దకొడుకును, "పెద్దకూతును వెంట నిడుకొని స్కాంట్లండు దేశమునకు వెళ్లెను. ఎడ్వర్డురాక స్కాచు జనులకు నానందదాయకమై యుండెను. వారాతని జూడఁగోరుచుండిరి. రాణియును, ఆదే వేరి ప్రాణసఖుఁడును, బిడ్డలను, మిల్ 'ఫోర్డు హావక్ "రేవునఁ జేరఁగనే, అచ్చటి జనులు పెక్కుమంది ఎడ్వర్డును వీక్షింప గుంపులు గూడి వచ్చిరి. రాణి తనకోడుకులను వారికిఁ జూ పెను. అచ్చటనుండి ఇంగ్లండు నేలిక శిశు వుల తోడను ప్రాణేశు తోడను స్కాట్లండు పశ్చిమ ప్రదేశమంతయుఁ గ్రుమ్మరి యచ్చట వినోద బులం జూచి ప్రమోదభరిత చిత్తయై తనయింటికిఁ జను నెంచెను. 1848 -సం.. న రాణివేరొక యాడ శిశువును గ నెను. దానికి ప్రిన్సులూయి అను పేరు.

ఎడ్వర్డు విద్యను నేర్ప ప్రారంబించుట,

ఎడ్వర్డునకు నైదేండ్లు నిం డెను. అతని తల్లీతండ్రులుబాలునకుఁ జదువు నేర్ప వలయు నని నిష్కర్ష చేసిరి.. కాని ఎట్టివిద్య నా బాలునకు గ'ఱ పవలయునో వారికి తె లియక కొంత కాలము వారు తహతహపడు చుండిరి. ఇంతలో బారన్ స్టాకుమరును, ఆక్సుఫోర్లు బిషపును, జేమ్సు క్లార్కును. వీరలతో వా

'రాజదంపతు లాలోచించి, వారు చెప్పిన పద్ధతులఁ దమతనయునకు సకలవిద్యలను నేర్ప సమర్థుఁ డగుపండితుని హేన్రిబెర్చి అను నుపాధ్యాయుని నియమించిరి. అతఁడు నీతికోవిదుఁడు అతఁడు ఎడ్వర్డునకు సకల శాస్త్రంబుల నేర్ప సమర్థుఁడు.. ఎడ్వర్ణాయుపాధ్యాయుని వలనఁ జదువు నేర్వ నారంభిం చెను.రాణీయు:ను ఆయమహృదయేశుంకును ప్రధానులునుమున్నగు దొడ్డనారు ఎడ్వర్డు చిత్తరువులు వ్రాయుటను, గానకళను, అస్త్రవిద్యను, ఈవిద్య ఆవిద్య అని లేక సమస్త విద్య లను నేర్చుకొన వలయునని శాసించిరి. అన్ని విద్యలలో నిపుణుడు లభించుట దుర్లభము. బీర్చు ఆంగ్లేయ భాషా ప్రవీణుఁడు.ఆతనికి నితరశాస్త్రము లంతగఁ తెలియవు, ఆతఁడు ఎడ్వర్డునకు నేవేళ నంగలవిద్య నేర్పు చుండినను, అప్పుడప్పుడు నాతనికి వాచక ధాటియును, చిత్తరువు వ్రాయుట, మొద లగు విద్యల నేర్పుటకు ఆ విద్యలయందుఁ బ్రవీణు లైన పండితులను మంత్రులు నియమించిరి. వారు రాకొమకునకు నియమిత కాలములందుఁ దాము నేర్చిన విద్యలను నేర్చు చుండిరి. రాణి తన ముద్దు కొమారుఁడు క్రైస్తనమత స్వభావము నెఱుంగక ఉపేక్షించు నేమో అని ఆది వారములయందు నాబాలునకు క్రైస్తవమత గ్రంథంబుల నేర్పు చుండెను. ఎడ్వర్డు ఏయే కాలంబుల ఏయేగ్రంథంబుల నీర్చి చింతన చేయవలయునో ఆయా కాలంబులనొజ్జలు నింయమించుపాఠంబుల ననుదినంబునను తప్పక భయ

భక్తులతో నేర్చుకొని, నేర్చుకొన్న దానిని మఱవక వల్లించుచు, దన్నుఁ గన్న వారిని తా నికపైఁ బాలింపఁ బోవుజనులకును అల్లారుముద్దుగల బ్రవర్తించు చుండెను.

ఎడ్వర్డు ఆయిర్లండు దీనికి వెళ్లుట,

ఎడ్వర్డు పుట్టి 'యేండేండ్లాయెను. ఆతఁకు గురువులవలనవిద్యలను గ్రహించు చుండె.. 'రాణి మంత్రులాయనకుమారుని అయిర్లండు దీవికిఁ బిలుచుకొని వెళ్లి అచ్చ జనులకు నెడ్వర్డును జూపవలయు నని కోరెను. మంత్రు లాయముమనోరథ మీరునటుల ప్రయాణసన్నాహములు గావించిరి.1849 సం. న ఆగస్టు నెలలో రాణియును ఆల్బర్టు ప్రభువును, వారి బిడ్డలును, అయిర్లండులంకకుఁ బయన మై, నారి వెంటసాయుధపాణు లైన భటవర్గము చ నెను. ప్రయాణము 'లెస్సగజరిగెను. వారు క్షేమముగ నైర్లెండు చేరిరి. అచ్చట నరిషు జనులు దృడానురాగులై వారీ పదవికి దగిని రీతిని సంభావించిరి. అంత రాణీయును అల్బర్టును తమబిడ్డలను వెంట నిడుకోని క్వీన్సు టౌనును, డబ్లిక్ పురికిని, ఏగిరి. అయిర్లండు దీవికి నీ "డబ్లెను" పురి రాజధాని. మనలో నెచ్చట గాంచినను జనులు రాణీ తనయునిముఖ కమలమును వీక్షించుటకు మోము లెత్తి రాజమార్గంబుల నీరు కెలంకులఁ గ్రిక్కరసి.యుండిరి, రాణి వారి బావంబులు నెరింగి, తనకుమారు నెత్తి చూపెను. వా రతనిఁ జూచి సంతసించి. అప్పుడాపురమున

రాజమార్గంబులఁ బచ్చని తోరణంబులచే సలుకరింపబడి యుండె. అచ్చట నేల్లెడెల జూచినను 'వేన వేలుజనులు గుంపులు గూడి ఎడ్వర్లు రాకవలనఁ దమకుఁ గలిగిన సంతసమును ముచ్చ టించుకొను చుండిరి. ఎడ్వర్డు వారీదీవెనల నందుకొనుచుఁదల్లిదండ్రులతోడను, సోదరుల తోడను, తనతల్లి ప్రతినిధిగారి యింట బస సేసి అచ్చట నుండునుద్యానవసంబులను, ట్రినిటి సర్వకళాశాలను, మున్నగుచోటును గాంచి హర్షించెను.రాణి ఆపురి పౌరులకు విందు నొనర్చి యొక నా డాపురి రాజమార్గంబు బుల నాపౌరులు సంతృప్తి జెంద దనకొడుకు నందురు వీక్షించురీతి నాతని డనముందు ననుకోని యూ రేగేను.ఎడ్వ ర్డాపురిని విడిచి తలిదండ్రులును, తోబుట్టువులును, తనవెంట రా స్వరాజ్యమునకు నే తెం చెను. రాణి తనతనయునకు"అరల్ ఆఫ్ డబ్లీజ్ " అను బిరుదు -నొసంగె. ఎడ్వర్డీరీతిని బౌల్యదశలో నే తసజనుల నప్పుడప్పుడు వారివారి తాపులకుఁ జను దెంచి చూచు చుండుట చే నాతడు ప్రభు వైనపిమ్మట"రాతనియెడ దృడానురాగము కలవారై వర్దిల్లిరి.

1849 సం. న అక్టోబరు నెలలో రాణికి దట్టమ్మ వారుబోసెను. అప్పుడు కోల్ యక్స్ చేంజ్ " అనుభవనము క్రొత్తగా గట్టబడియుండె, అదే వేరి దానిని దెరువ వలసి యుండెను. కాని ఆయము తట్టమ్మవారిచే బాధపడుచుండినందున నాదేవేరితనకుమారు డెడ్వెర్డాపని సేయుటకు నర్హు డని యెంచి అతని

తండ్రి వెంట నాతనిని కోల్ యక్స్ చేంజ్ భవనము దెరువఁ బంపెను. లండను నగర నాసు లాకొమరుని వీక్షింప రాజమార్గంబుల నీరు కెలంకుల గుంపులుగూడి యుడి. అతఁడు తనతం డ్రి వెంట నామందిరంబు సమీపించెను. ఆల్బర్టు ప్రభువు తనకుమారుని ముందు నిలువఁ బెట్టి యాతనిచే నాళ వనంబును దెఱపించెను. ఒక నాఁడు రాణి తన బిడ్డలతో ఆస్బోర ననుభ వనంబున నుండెను, ఉద్యానవ సంబున నుండుపక్షుల వేఁటాడుకోరిక తోనెడ్వర్టు ఆయుధపాణు లైన యనుచరులు వెంట రానావనంబు సంగ్రుమ్మరు చుండెను. అతఁ డేయాయుధమును గొనిపోలేదు.అతని యనుచరులు మాత్రము పక్షులను గాల్చుచుండిరి. ఎడ్వర్డు పసివాఁ డైనందున చెట్టునుండి క్రిందఁబడి మరణావస్థలో నుం డిన పక్షి నొకదాని నెత్తుకొని వచ్చుటకు ముందుఁ బరుగిడెను.కానింగుప్రభు వీబిడ్డఁ దాని దాపునకు వెళ్లినది యెఱుంగక తుపాకు గుకి వెట్టి కాల్చేను. ఇంతలో నెడ్వర్డు కు నపాయము క లుగు సని యెంచి యొక శూరుఁడు దానికడ్డముగ నిలిచెను. ఆకాల్చినతుపాకీ వాని చొక్కాను జించుకొని పోయెను. కానిఎడ్వర్డున కెంతమాత్రము కీడు రాలేదు. 'రాణియును, ఆల్బ ర్టు ప్రభువును, ప్రభువు కానింగును, మున్నగువారు ఎడ్వర్డు ప్రాణాపొయమైన దెబ్బ వలనఁ దప్పించుకొనె ననీ సంతసిల్లి హనిప్రాణమును గాపాడిన వానికిఁ దగిన బహుమతుల నొసంగిరి,

లండను పురంబున నుండు "సైడ్ పార్కు" అనునుద్యానవనము మిక్కిలివిశాల మై రమణీయ మైన పచ్చని చెట్లచే నిబిడీకృతం బై ఉండును. ఆల్బర్టు ప్రభువు తనకుమారుఁడు లోక మునందు కలచిత్ర నస్తువుల సన్నింటిఁ జూచి వానిస్వభానమునునేర్చుకొనుటకు నీ లగునటుల నొక సర్వవస్తు ప్రదర్శనశాలను1851 సం. న ఆ వనం బునఁ గట్టించెను. అతఁ డందు నింగ్లండున జేసినవియును, ఐరోపా, అమెరికా, ఆసియా మున్నగుఖండంబులలో నుత్పత్తి యైనవియును, ఆయాదేశస్థులబుద్ధికుశలతవెల్లడి యగునటులఁ జేయ బడిననియును, అయిన వస్తువులను సంపాదించి వరుసగ నుంచెను. ఆశాల యద్దము చేఁ గట్టంబడి,చూచుటకు నధిక సంతోషము ఒసంగుచుండిన దై చెన్ను మీరె పార్లమెంటు సభాసభ్యులలోఁ బెక్కు మందే దానిని నిర్మించుట వల దనిరి. ఎందరెన్ని మాటలు పల్కినను, ఆల్బర్టు ప్రభువువారిమాటల నాలకింపక ప్రదర్శన శాలను నిర్మించెను. శ్రీమహారాష్ట్ర తనయునిఁ గూఁతులను వెంట నిడుకోని నాల్గు గుఱ్ఱబు లఁ బూన్చినశకటంబుల నెక్కి భర్త ప్రక్క ఁ దాఁ గూర్చుండి ప్రదర్శన శాల కరుదెంచెను. లండను రాజమార్గంబుల జనులు వారిని వీక్షించి ప్రమోదభరితు లైరి. మంత్రులును, పార్లమెంటు సభ్యులును, రాణిని, ఎడ్వర్డును, మిగుల గౌరవించి, ప్రదర్శనశాలను దెఱపఁప్రార్థించిరి. రాణి వారి వేఁకోళ్లును వ్యర్థపుచ్చనొల్లక ప్రదర్శన మందిరంబును దెఱచుట కంగీక రించెను. ఆవల

భర్త వెంటరాణియును, ఆయన నెనుక ఎడ్వర్డును, మున్నగునా రందలివస్తువులను గాంచిరి. ప్రదర్శన శాల ఆవలఁ గొన్ని నెలలుండె..ప్రతిదినమును ఎవ్వళ్లు తనయయ్యవా రైనబీర్చు నెంటఁ బ్రదర్శనశాలకు జని, అందలివస్తు పులస్వభానమును, తన యు పాధ్యాయునివలన నేర్చుకొను చుండెను

రాణి కొడుకు బర్చివలన విద్యలను గ్రహించు చుండనాయు పాధ్యాయఁడు మడొక తావున నుద్యోగము సేయుటకువిడిచి పోవుటకు నిశ్చయించుకో నెను. ఎడ్వర్డు ఆ సమాచారము ను విని మిక్కిలి చింతాకాంతు డయ్యె కాని బిగ్చీ ఆపసిబాలుసూఱడించి, తానుపోయినందన స్థానమునకుఁ దనకంటె మిక్కిలిమేధావి యైనయు పాధ్యాయుఁకు వచ్చునని ఆయనకు మెప్పుఁ జెప్పిసను కొత్తపనికి గుదురుకొనెను. రాణీయును ఆల్బర్టు ప్రభువును బిర్చివల దమ కుమారరత్నముమంచినీతులను నేర్చబుద్ధిమంతుఁ డాయెన నీ సంతసించి యనేక విధంబులను నాతనికిదమ నెనరు. జూలవి చక్రవర్తిని కాబోవు వానికిఁ జదువు నేర్పుడానికి ఏమి కొఱంత!

బర్చిస్థానమున నెడ్వర్డునకు విద్యను నేర్పుటకుఁ దగినయుపాధ్యాయుఁడు లభించుట కష్టసాధ్యమై ఉం డె. నీను నాకుజదువు నేర్పుటకు బెక్కుమంది అయ్య వార లుందురు. చక్రవర్తి నాతడు నాతడు చదువవలయు నన్న నాతనికి పదవికిఁ దగు‌ఏద్వాంసు ల నవలయును కదా ! స జేమ్సు స్టీపన్ అను

లండనుపురంబున నుండు " హైడ్ పార్కు " అనునుద్యానవనము మిక్కిలివిశాల మై రమణీయ మైనపచ్చని చెట్లచే నిబీడీకృతం బై ఉండును, ఆల్బర్టు ప్రభువు తనకుమారుఁడు లోక మునందు కల చిత్రనస్తువుల సన్నింటిఁ జూచి వానిస్వభావమునునేర్చుకొనుటకు వీలగునటుల నొక సర్వవస్తు ప్రదర్శనశాలను 1851 సం. న ఆ వనంబునఁ గట్టించెను. అతఁ డందు నిండున జేసినవియును, ఐరోపా, అమెరికా, ఆసియ మున్నగు ఖండుబులలో నుత్పత్తి యైనవియును, ఆయా దేశస్థుల బుద్ధికుశలతవెల్లడి యగునటులఁ జేయఁబడి సవియును, అయినవస్తువులను సంపాదించి నరుస నుంచెను. ఆశాల యుద్దము చేఁ గట్టంబడి,చూపఱకు నధిక సంతోషము 'నెసఁగుచుండిన దై చెన్ను మీరె.పార్లమెంటు సభాసభ్యులతో బెక్కుమంది. దానిని నిర్మించుట వల దనిరి. ఎ.ందరెన్ని మాటలు పల్కినను, ఆల్బర్టు ప్రభువువారిమాటల నాలకింపక ప్రదర్శనశాలను నిర్మించెను. శ్రీమహారాజీ తనయునిఁ గూఁతులను వెంట నిడుకోని నాల్గుగుఱ్ఱబుల బూన్చినశకటంబుల నెక్కి భర్తప్రక్కఁ దాఁ గూర్చుండి ప్రదర్శన శాల కరుదెంచెను. లండను రాజమార్గంబులజనులు వారిని

వీక్షించి ప్రమోదభరితు లైరి. మంత్రులును, పార్లమెంటుసభ్యులును, రాణిని, ఎడ్వర్డును, మిగుల గౌరవించి, ప్రదర్శనశాలను 'దెజపఁ బ్రార్థించిరి, రాణి వాని వేడుకోలును వ్యర్థపుచ్చ నొల్లక ప్రదర్శనమందిరంబును దెరుచుట కంగీకరించెను. ఆవల

భర్త వెంట రాణియును, ఆయన వెనుక ఎశ్వర్డును, మున్నగువారందలివస్తువులను గాంచిరి. ప్రదర్శనశాల ఆవలఁ గొన్ని నెలలుండె. ప్రతిదినమును ఎడ్వర్డు తనయయ్య వా రైనబర్చు వెంటబ్రదర్శన శాలకుఁజని, అందలి వస్తువుల స్వభానమును, తనయుపాధ్యాయుసేనలను నేర్చుకొను నుండెను.

రాణీకొడుకు బీర్చవలన విద్యలను గ్రహించు చుండ నాయుపాధ్యాయుడు మరొక తావున నుద్యోగము సేయుటకు విడిచి పోవుటకు నిశ్చయించుకొనెను. ఎశ్వర్లు ఆసమాచారమును విని మిక్కిలి చింతాకాంతుం ఉయ్యె, 'కాని బిర్చిఅ.పసి బాలు నూరడించి, తానుపోయినఁద స్థానమునకుఁ దనకంటే మిక్కిలి మేధానియైన యుపాధ్యాయుడుసు వచ్చునని ఆయనకు నప్పు చెప్పి 1852 సం. నఁ తాను కొత్త పనికీ గుదురుకొనెను. రాణియును ఆల్బర్టు ప్రభువును బిర్చివలనఁ దమ కుమారరత్నము మంచినీతులను నేర్చి బుద్ధిమంతుఁ డాయెసని సంతసిం చి యనేక విధంబుల నాతనికిఁ దమ ననరు చూపిరి. చక్రవర్తి కాబోవువానికిఁ జదువునేర్పు దానికి నేమి కొఱంత ?

బిర్భస్థానము నెడ్వర్డునకు విద్యను నేర్పుటకుఁ దగిన యుపాధ్యాయులు లభించు ట కష్టసాధ్యమై ఉండె. నీకు నాకుజదువు నేర్పుటకుఁ బెక్కు మంది అయ్యవా లుందురు. చక్రవర్తి కాబోవు నాతఁడు సదువసలయు నన్న నాతని పదవికీ దగినవిద్వా ంసుఁడు లబింపవలయును కదా! సర్ జేమ్సు స్టీపన్ అను నాతఁదు బిర్చు స్థానమున మ-రా-శ్రీ ప్రెడరిక్కు డబ్లియు గిబ్సు అనునాతడు ఉండ నర్హుడని రాణి ఆల్బర్టులకు నెఱుకపఱచెను. వారు స్టీపను మాట ప్రకారము గీబ్సును తమ కుమారునకు విద్య నేర్పుటుకు నియమించిరి, గిబ్సు ఆపదవిని ఆజేం డ్లుండెను.ఆకాలమున నాతఁ డెడ్వర్డును విడిచి యెచ్చటికిఁ జనినవాడు కాడు, ఎడ్వర్డు ఆతని నేమరక వానితో నుండి, అతఁడు నేర్పినపలుకులను నేర్చుకొనెను.

ఎడ్వ ర్డే వేళ నుపాధ్యాయునిశిక్షలో నుండినను, అప్పడప్పుడు విడమర కాలమున నాతం డాడుకొను చుండెడివాడు.ఒకనాఁడు రాణి సింహాసనము మీఁదఁ గూర్చుండి యుండినపుడు, ఎడ్వర్డు ఆదే వేరి ప్రక్కఁ గూర్చుండెను. పార్లమెంటు సభ్యులు క్రిమియూలో యుద్ధము సలుపవలసి యుండెనని రా ణితో విన్న వించిరి. ఆయుమ దానికి సంగీకరిం చెను, క్రిమియాలోగొప్పరణము నడిచెను. అందు న నేకులు మృతి చెందిరని ఎడ్వర్డు వినెను. 1853 సం. న చాతముల" అను స్థలమున నుడిన గాయ ముల నొందిన రణశూరులను గాంచి వారికి దగిన కానుక నొసంగుటకు నేగెను. తల్లి వెంట న్యాయమబుడతడు తలకును, వెళ్లి గాయముల నొంది బాధ పడువారులను గాంచి, వారియెడ మిక్కిలిదయతో పర్తించెను. వారును వానిని జుడ గా నే తమశ్రమనివారణ మైన దని తలంచిరి. ఎడ్వర్డు ఈసంగ తులలో నెక దానినైనను మఱ చినవాఁడు కాడు. అతడు తనచిన్న నాడు నడిచిన సంగతుల నన్నింటిని బూస కూర్చినరీతిని వచించు చుండెడివాఁడు, అతని జ్ఞాపక శుద్ధి ప్రశంసనీయ 'మైన దని వేఱుగ వచింప వలయునా?

క్రీమియా యుద్ధమునఁ జచ్చినవారి భార్యాపుత్రాదులసాహాయ్యార్దమై ఇంగ్లండులో నిజనులు చందాలు వేసికొని పైకమును వసూలు చేసిరి. ఇందులకు బీర్లీంగటన్ శాలలో ఒక ప్రదర్శనము నడిచెను. అందు వసూ లగు ద్రవ్య మానిధికి బోవునట్టులు దీర్చు సేయుఁబ డెను. అప్పు డ నేకు లనేక వస్తువుల నా ప్రదర్శనమునకు నంపిరి. "రాణీబిడ్డలును యుక్తనయస్సుననుండి నందునఁ దనుకు బెలిసినరీతిని చిత్తరువులను వ్రాసి యూ ప్రదర్శనమున ఏక్రయమునకుఁ బంపి. వారిలో నెడ్వర్డు వ్రాసిన చిత్తరువులు 870 రూ. లకు నమ్ముడు వోయెను.

క్రిమియాలో రణము ముగిసెను, ఫ్రెంచీ రాజు విక్టోరియాను దసరాజ్యము సూడ రమ్మని యాహ్వానము పంపెను. రాణీయును ఆల్బర్టును ఎడ్వర్డును వెంటఁ బెట్టు కొని ఫ్రెంచిదేశ మునకు వెళ్లి దానికి రాజధాని యైనపారిసుపుర వరంబున ఎనిమిది దినము లుండి. ఎడ్వర్డు ననేకులు చూచి మిక్కిలి సంతోష పడిరి. ఫ్రెంచి రాజు రాణికి అనేక విందు లొనర్చెను. ఎడ్వర్డు విలువగల మంచివ స్త్రములను ధరించి రాచ ఠీవిని కొదమసింగంబు కై వడి నుండెను. రాణికి మార్సీల్సులో గొప్ప ఏందు నడిచెను. అందు ఎడ్వర్డును వానియప్పయును ఫ్రెంచి

రాణి రాజుల సమీపంబునఁ గూర్చుండి భుజించిరి. మంచి రాజునకు బిడ్డల పై గూర్మి యెక్కున. ఆతఁడాయెడ్వర్డును ప్రిన్సస్ రాయలునుజూచి విడువక వారి నాటలాడించుచుండెను. వారును హెచ్చు మచ్చికను నాయనతో నాడుకొను చుండిరి. ఆరాజు రాజ్యమును గోలుపోయి రాజ్యపద భ్రష్టుడై ఉండినప్పుడు ఎడ్వర్డు వానిఁ గాంచి పశ్చాత్తాపము నొంది వాని నప్పుడప్పుడు చూచు చుండెను.

రాణీ ఫ్రెంచి దేశమును విడిచి ఇంగ్లండునకుఁ దర్లుటకు నుద్యమించు చుండెను. ఎడ్వర్డు ఇంగ్లండునకుఁ బోవుటకు నిష్టపడక, తల్లితో ( ఆనూ ! 'నేను ఫ్రాన్సులో నుండెద. నేను లేకున్న నీ పుండ లేవా? 'నేను లేకున్న నేమి? నే నొకఁడనే నా నీ కొడుకను? నీవు వారిలో దృప్తినంది యుండుము. "అనెను; రాణి వానిమాటలకు నవ్వి వాని సచ్చట విడిచి పెట్టక తన దేశ ముసకుఁ బిలుచుకొని వచ్చెను.

ఎడ్వర్డు జనుల నిజ మైన స్థితిగతుల నెఱుంగ గోరి గూడ వేషమున ఇంగ్ల్గ్ండు. పశ్చిమ భాగమును జూడ దర్లెను. అతని వెంట నాతని యుపాధ్యాయుఁ, గిబ్సును తర్సల్ కావెండిషను, వెళ్లిరి. ఆతఁడు మాఱు వేషమున వారి వెంటఁ గాలి నడకను డివోన్ షై.రంతటను గ్రుమ్మరినను, జనులు తమయూళ్లలో కొమారుడు మాఱు వేషమునఁ గ్రుమ్మరు చుండెనని ఊహించి వాని జాడలు నెదుక బ్రయత్నించి. కాని కనుగొన లే రైరి ఎడ్వర్డు తన యిల్లు - ఫ్రాన్సుజర్మని మొద లగుతావులకు విద్యార్థియై వెళ్లెను.అతని సంట జనరల్ గ్రే అనునాతండును, గృహస్థధర్మముల నేర్చునట్టి హెచ్ పోన్ సన్ " బియును, శాస్త్రముల నేర్పుగిబ్సను, మున్నగువారు సనిరి. కొన్నిసమయములలో దేశములలో నందందు చిత్రవిచిత్రము లగు ధాతులతాదులఁ గాంచు నిమిత్త మాతఁడు కాలినడకను బోవు చుండెను. అడేవేళ ల నేయేచోటుల నేయేరీతుల నుడువలయునో అయా వేళల నాయాతాపుల నాయావిదంబుల నుండెను. అతఁడు తాను రాచబిడ్డఁ డనియును, తా నెచ్చో టికి నేఁగినను, రాజునకుఁ జేయఁ దగినగౌరవములు సేయవలయు నని కోరిన వాఁడు కాడు. అతని సామాన్యజనుని పగిది దస యు సౌధ్యాయుల వెంట నాయాతావులయంచుఁ గ్రుమ్మరి ఇల్లుచేరెను.

ఎడ్వర్డు విద్యాభ్యాసము

ఎడ్వర్డు నప్ప ప్రిన్సస్ రాయల్ అను చిన్నది వ్యక్తురాలయ్యె. ఆమెకుఁ బదు. నేండ్లు నిండెను. ప్రష్యాచక్రవర్తి ఫ్రెడరిక్కు విల్లియ మనురాకోమారుఁ డాతరుణిని 'జేపట్టగోరెను. రాణి తనకుమార్తెకు మంచివరుడు లభిచె సని కౌతూహలచిత్త యై మంత్రులతో నాలోచించి మిగులవైభ వంబుస నాచిన్న దాని నాయుర్వీశ్వరునకు నిచ్చి సెంటు జేమ్సు చేపలున వివాహము సేసెను. ఎడ్వర్డు తన యక్కకు సవరత్న

ములతోఁ జెక్కిన చంద్రహారమును కానుకగా నిచ్చెను. అతని బావ యాతనియప్పను వెంట నిడుకొని తన దేశమునకు నేగెను. ఎడ్వర్డు తనయప్పను విడిచి పెట్టి యుండుటకుఁ గొంత-చింతించి, ఆవలఁ దనహృదయము నూఱట పడుచుకొని యుండె ..

ఎడ్వర్డు వయస్సు పదునేడేండ్లుండెను. అతఁడు సకలశాస్త్రంబుల నేర్చుకొనుటకు నాతనిబు ద్ధిబలము తగినస్థితిలో నుండెను. ఆతఁ డింతదనుక ఇంటిలో నుపాధ్యాయుల నియ మించుకోని వారినలన నానావిధవిద్యల నేర్చుకొను చుండెను. ఇంక మీద నటుల కాదు.. అతఁడు సామాన్యులమాడ్కి ఆక్సుపోర్టు కేంబ్రిడ్జు, ఎడింరుకు మున్నగ సర్వకళాశాలలలోను, అయిరో పాఖండుబున నుండుక ళాశాలలయందును, ధనుర్విద్య యందును, వ్యాపారతంత్రంబులలోను, సమ స్తవస్తుజాలంబులఁ చేయుటలోను నేర్పఱి తనము పొరయవలె నని, ఆతనితల్లి దంద్రులు కోరి ఆతనితో గూడ చదుకొనుటకు ముగ్గురు సహపారులను నియమించి, రిచ్ మంమండ్. ఉద్యానవనంబున నుండు నైట్ లాడ్జ్ అనుసస్త్ర శాలయందు ధనుర్విద్యను నేర్చుకోను నటుకల నేర్పాటులు సేసిరి. ఎడ్వర్ణుధన్వుద్యను నేర్చుకొను సప్పుడు తనయుసాధ్యాయుల యాజ్ఞల నతిక్రమింషక సామాన్య బాలుని భంగి పర్తించి రణశాస్త్ర మర్మంబుల నన్నింటిని నేర్చుకొనెను. అతఁ డావిద్యలో బరిపూర్ణ ప్రజ్ఞానంతుఁ డై యొరులకుఁ దా నావిద్యను నేర్పునంతజ్ఞానమును సంపాదించి వీరవరుఁ డయ్యె.

1859 సం. న గీబ్బు విశ్రాంతి సెందుటకుఁ దనపనిని విడిచిన పిమ్మట నాతనిస్థానమునకు టార్వ రనునాతఁడువచ్చెను. ఎడ్వర్డు వాని వెంటఁ దనతల్లితండ్రుల యానతిని ఆయిగోపాలం డంబున నుండుకళాశాలు విద్యను నేర్చుకొనుటకు నెడ లెను. ఆతఁడుఇటలీ జీబ్రాలిరు, లిస్బను, స్పైను మొద లగు రాజ్యంబులను; పురంబులను జూచి, యందుఁ గొ"న్నాళ్లుండి, తనయింటికి వచ్చి తల్లిదం(క్షులకడం గొంత కాల ముండెను. విక్టోరియాయును, ఆల్బర్టు ప్రభువును, మంత్రులును ఎడ్వర్డు ఎడింబరులో కొంత కాలము విద్యాభ్యాసము సేయ వలసి సట్టులఁ గోరి, యూతనిని ఆచోటికీఁ బంపిరి. కళాశాల పద్ధతులు బహుకఠినము లైనవి. వాని సతిక్రమించి యే విద్యార్థి యును పోఁగూడదు. సామాన్య స్థితిలో నుండు బాలురు అయ్యవారలయాజ్ఞలకు లోబడి నడుచుకొనుట సహజము. ఎడ్వర్డు రాకోమారు డు. అదియునుగాక సర్వకళా శాలాపద్ధతుల స్వ భావ మాతఁడు గుర్తెరంగఁడు, అతనాగర్భ శ్రీమంతుడై తల్లిదండ్రుల పొత్తున నుండీ, వారి సమక్షమున ఉపాధ్యాయుని వలనఁ దనకు నిచ్చపచ్చినపుడు విద్యను గ్రహించుచుండెను, ఇప్పు డటులఁగాదు.

ఆత్మను సర్వసామాన్య బాలుని మాడ్కి కళాశాలా పద్ధతులకు బలుకు - సర్వకళా శాలలయందుఁ బలుకునోర్చుకొనుటకు సమకట్టెను.

ఎడ్వర్లు ఎడింబరో విద్యాలయమున రసాయన శాస్త్ర

మును, తత్సంబంధము లైన పారి శ్రామిక వృత్తులును, డాక్టర్ నలియాన్ ప్లే ఫేర్ (Dr. Lyon Play fair.) అను నాతనివలన నేర్చి, సామానులు సేయుచోటికిఁ దనయు సాధ్యాయుని వెంట వెళ్లి, వానిఁ జేయుమార్గములను దెలిసికోనెను. జర్మనీ దేశస్థుఁడును, ఎడింబరున హైస్కూలునకు డైరెక్టరును, అయిన డాక్టర్ షమిట్టు: (Dr. Schmitz.) అనునాతఁడు ఎడ్వర్డునుకు రోముపుచరిత్రమును దెల్చెను. ఎడ్వర్డు తనకుఁ దీరుపాటోదపినపుడు వారమునకు మూడుతడవల ఎడింబరుస నుండు ధనుర్విద్యాలయమున నావిద్యను చింతన చేయు చుండెడివాడు. మిగత కాలమున నాతడు ఇటలి జర్మని ప్రాన్సు మున్నగుదేశ భాషలు నేర్చుకొను చుండెను. ఎడ్వడ్లునకు న్యాయశాస్త్రమును (Law) దేశచత్రమును (History.) నేర్చుటకు ఫేష(Fisher) రను నాతఁడు కుదురుకొనెను. ఎడ్వర్డు ఏ వేళ నీ శాస్త్రములన వలనభ్యసించు చుండినను, కొంచెము తీరుబాటు కలుగ జేసికొని సర్ వా ట్టరుస్కాట్సు వ్రాసిన నవలలను, జర్మని ఫ్రెంచి భాషలతో వ్రాసినవవలలను, వెర్రి యెత్తిన వానికై నడీఁ జదువు చుండెడి వాడు. ఎడ్వర్డు ఎడింబరు జదువును పూర్తిగ సభ్యసించి, 'పండుగలకు నింటికి వచ్చెను.

ఎడ్వర్డు విద్య యింకను ముగియ లేదు. అతను ఆక్సుఫోర్డు(Oxford)సర్వకళాశాలలోఁ జదుప నుద్యమించెను. అతని తల్లిదండ్రు లాతని నచ్చటికిఁ బనుపసిద్దు లై యుండిరి. అతఁ

డును నాకోర్కి ప్రకార మాచోటికి వెళ్లి అచ్చట విద్యనుగ్రహింపసాగెను. అతఁడు విద్యాలయమున నందఱతో, మచ్చికతో మెలగుచు, నారిలో నెవ్వడితోను విరోధము సేసికొనక, అందఱకును మిత్రుడై వర్తించి సమస్తకళల సభ్యసించి అన్నిపలుకుల నుత్తీర్ణుండై తనయింటికి వచ్చి కొన్ని దినములు తల్లే దగ్గఱ నుండెను.

ఎడ్వర్లు కొన్ని రోజు లై నపిమ్మటఁ గన్నడా అమెరికాసంయుక్త రాష్ట్రములు మొద లగు రాజ్యములకు వెళ్లి తిరిగి యింటికి నే తెంచి, కేంబ్రిడ్డు సర్వకళాశాలలో విద్య సభ్యసిం చుటకు నచ్చోట ట్రినిటీ సర్వక ళాశాలయందుఁ జేరెను. అతఁడు పాఠశాలలో గణితశాస్త్రమునఁ బ్రవీణుడయ్యెను కట్టుదిట్టములకు లోబడి యెన్నడును ఉండిన. వా డుకాడు. ఇంటిలో నయ్య వారు వానియిష్టము నొప్పునఁ బలుకు నేర్పుచుండెను. ఇప్పుడాకేంబ్రిడ్జులో నట్లు కాదు. ఆతలను తనయుపాధ్యా యులయనుమతిని బొందవలసియుండెను. అతఁ డా నిబంధనల సహింస లేక ఒంటరిగ లండను సగరమునకు నయ్య వారల సెలవు వొందక ధపుడు కొట్టెను. అతనియొజ్జ లాతడు లాతడను 'నగరమును జేరక ముందే ఆతనిపోకను దెలిసికొని ఆ తల్లిదండలకు దెలియఁ జేసిరి. అతను రైలు స్టేషనులో దిగి దిగకము ముందే ఇంటిలో నుండు సేవకులు కొందఱు వచ్చి కాచుకోని యుండిరి. అతఁడు వారిని గాంచీ తలవంచి లజ్జితుఁ డయ్యె. ఎడ్వర్లు "కేం బ్రిడ్జులోఁ జలి కాలమంతయును నుండెను. చలికాలపు రజారోజులు వచ్చెను. పాఠశాలలు మూసిరి, రాణి మున్నగువా రెడ్వర్లు "కూర్రా” అను చోట ధనుర్విద్యా పారంగ తుఁడు కావలె ననికోరి, ఆరజా దినములలో నచ్చటికి బంపిరి.ఎడ్వర్డు అచ్చోటికి వెళ్లి సేనానాయకుఁడైనకర్నల్ పెర్సీవానివలన రణశాస్త్రమర్మంబుల నేర్చుకొని యందుఁ బ్రవీణుడయ్యె.

మూఁడవ అధ్యాయము.


ఎడ్వర్డుతండ్రి మరణము.

ఎడ్వర్డు కేంబ్రిడ్జు కళా శాలయందు విద్యాభ్యాసము సేయు చుండెను. అతఁడాచోటఁ దనయుపాధ్యాయుల యజ్ఞలకు విధేయుఁ డై సహ పాఠకుల నందుఱకుఁ బ్రియుండై యుం డెను. అతడు చదువును ముగించి, అయిరోపా ఖండంబున నుండు డెన్మార్కు- రాజ్యమునకు నోడయనిపట్టి నలెగ్జాండ్రాను యువతీమణిని జూడవలయు నని అతనితండ్రి తలంచి, వారిద్దఱును జర్మనిలో సంధింపవలయు నని కోనెను. ఈ రహస్యము ఎక్వర్డు తండ్రికి హృదయ పేటికాంతర్గతమై యుండెను. కాని అయిరోపాఖండ మందలి వార్తాపత్రిక లారహస్యమును వెల్లడి పఱచెను. అంత సంగ్లండులోని పత్రికలు, ఈ మర్మమును కొంతవఱకు

  1. మొదట ఎడ్వర్డు 1982 వ సంవత్సగము: ఇంగ్లండు: జేరని"వేల్పు" రాజ్యభాగమును గెలిచి స్వాధీనము చేసికొని, తమకు రాజు 'లేడని వగచు చుండిన వేల్పు జనులకు, "నా పెద్దకొడుకు ఎడ్వర్డు మీ దేశపు రాచ బిడ్డడు." అని చెప్పఁగా వారు రెండవ యెడ్వర్డును "ప్రిన్ సు ఆప్ వేల్సు" అని పేర్కొనికి, ఆనఁ గా వేల్సు రాజ్యము యొక్క - కొమారుడు. అది ముదలు ఇంగ్లండు "నేలుఱేని పెద్ద కొడుకు మాత్రము: " ప్రిన్సు ఆఫ్ వేల్సు" అని "చెప్పఁబడు చుండును,