సప్తమైడ్వర్డు చరిత్రము/నాల్గవ అధ్యాయము

టలకుఁ జెవి నిచ్చి, ఆరుముయిష్ట ప్రకారము వర్తింప సంగీకరించెను.

మంత్రులు ఎడ్వర్థునకు వివాహము సేయుట బా గని విక్టోరియాకు: "చెప్పిరి. ఆయిల్లాలు మామాటలు లెస్స అనియెంచీ, తనకోడుకునకు వివాహము చేయుటకు సమ్మతించి, దానికిఁ దగిన యుద్యమములు సేయవలయు సని వాటికి ననుజ్ఞ నిచ్చెను. వారును పెండ్లి కార్యములుసేయ నారంభించి.

నాలవ అధ్యాయము.

ఎడ్వర్డు షెండ్లి.

శ్రీ విక్రయా మసూరాశీ భక్తిను గోలు పోయినది "మొదలు రాచ కార్యములుసేయఁబూనక ఉండెను. ఆల్లుడు జీవించి యుండి సపుడు ఆదేవేరి అతని సాయంబు నన్ని కార్యములను నిర్వర్తించు చుండెను. ఇప్పుడొంటరిగ సన్ని పనులామె నిర్వహింపనలసి యుండెను. ఆమెకు సన్నిఁటం దోడుప దుటకు ఎడ్వర్డు యుక్త వయస్సున నుండెను. అతను తండ్రి మరణంబున కై చింతిల్లు చుండెను. మం త్రులు వానికిఁ బెండ్లి చేసిన నాయఱువుర శోకము తుదముట్టు నను తలంచి, రాణి నాలోచించి తగిన యుద్యమములు సేయసాగిరి.

ఎడ్వర్డు ఒక నాఁడు తన మిత్రులతో సరిససల్లాపంబులు

సేయు చుండెను. అప్పుడు వారిలో నొకని చేతిలో గాగితపుటట్టపై వ్రాసిన చిత్రపట మొక్కటి ఉండెను. ఎడ్వర్లు దానిని గైకొని చూచి, డెనార్కు ఱేనిపట్టి అని యెఱింగి, ఆ మేనియం దంబును డెందంబున 'మెచ్చుకొని, అమె పై వలపుఁ గొని దాని వెలిబుచ్చక, అతరుణీమణిని గనుంగొనఁ గోరు చుండెను. ఆదిమొద లాతడు ఏపనులయందు నాసక్తి లేక ఆ చెలియపై మోహ ముంచి, ఆమే నెప్పు నెప్పుడు గనుగొందు నా యని ఉవ్విళ్లూరు చుండెను. ఇంతలో మంచి సమయము తటస్థించెను. డెన్మార్కు. రాజు తన ప్రియపుత్రిక యగు నలెగ్జాండ్రాలో హిడల్ బర్గునకు వచ్చునటుల డెలియ వచ్చెను, ఎడ్వర్డు ఆమాటను విని అచెలియ: జూచి వచ్చుటకు నాచోటికి వెళ్లెను. అచ్చట సంతకుముం దే ఎడ్వర్డు రూపు కలచిత్ర పటమును గాంచి యాతనిఁ జూడవలయు నని యపేక్షించు చుండిన ఆ లెగ్జాండ్రా ఆతనిని జూచి సుతుష్టాం తరంగయయ్యే. ఆతడాకన్నియుఁ గాంచి, తదీయ రూప లావణ్యాదిగుణంబుణంబులం గని విమోహితుం డై ఆమె చూపు లను సంకెలల చేఁ గట్టఁబడిన హృదయము కలవాడడై యాచోటువిడువ నొల్లక ఎట్టకేలకు కొంత దైర్యము తెచ్చుకొని " ఆఁడు దాని యందమునకు మింతలో మగ వారు బేలు పోఁగూడునా?" అని స్వాంతంబునఁ దలంచి, తనయింటికీ జనుదెంచెను.

ఇంగ్లండు నేలురాణి తనకుమారునకు వివాహ ప్రయ త్నములు సేయుచుండెనని విని జర్మని దేశపు రాజుకూఁతుండ్ర పటములను, స్వీడ దేశపు ఱేసిపట్టి ఫలకమును, ఇట్టివి యెన్నియో అనేకములు ఇంగ్లండు రాణీ సముఖమున వచ్చి యి చ్చెను. రాణీ వానిని గాంచి ఎడ్వర్డునకుఁ జూ పెను అతఁడునానిని జూచియుఁ జూడనియట్టుల నుండి వానియొడ దనకుగలయ నాదరణను గాన్పించెను. బుద్ధిశాలియైన సుహారాణి వానిభావం బెంఱింగి అయాపటము లాయరాజ్యములకుబంపెను. అంత రాణి ఎడ్వర్డు మనోభీష్టంబుఁ దెలిసికొని డెన్మార్కు రాతనయను వివాహమాడఁ దలంచినాఁడని ఊహించి ఆదేశ పుటోడయనికి నాశుభవర్తమానమును దెలియఁబంపె.అతఁడునుతనకూఁతునకుఁ దగినవరుఁడు లభించెనని మహానంబు నొంది, శుభముహూర్తము నిశ్చయింపవలసిస దని రాణికి నెరుక పరచెను. ఆమెయును మంత్రులతోను కాంటెర్బెరి ఆర్బీబిషపు తోడను, ఆలోచించి 1862 సం. న ఫిబ్రవరి నెల 16 వ తేది నాడు 'పెండ్లి ముహూర్తమును నిర్ణయించినటుల శుభ వర్తమానమును - డెన్మార్కు, ప్రభువునకు నెఱింగిం చెను. అతఁడు ఇంగ్లండునకుఁ దనతనయను వెంట నిడుకొని వత్తు నని రాణికి సమాచారమును బంపెను. ఇటుల రెండిండ్ల వారును బెండ్లికి వలయు నుద్యమములు సేయుచుండిరి !

రాజమంత్రులు ఎడ్వర్డునకు డెన్మాగ్కు- ప్రభువు పుత్రిక నిచ్చి వినాహముజరుగు నని లండను పత్రికలలో ప్రచురించిరి.

తత్పూర్వము కొద్దిమందికి మాత్రము తెలిసిన ఎడ్వర్డలెగ్జాండ్రా వివాహము అందఱును ఎఱింగి, దానిని గనుటకుగుతూహలాయ త్తచిత్తులై యుండిరి. ఈవాహమువలన రాజ్య ము సిరిసంపదలు మిక్కిలివర్ధిల్లు నని అనేకులు కోరిరి.రాణికి లోబడిన రాజ్యంబులలోని జనులు తమరాచబిడ్డ కు సదాచార సంపన్నురాలును, సుగుణగణమణీయును, సౌందర్యము భాంగియును, అయినటు లెగ్జాండ్రా రాచకూఁతును వివాహమాడ బోవు ననియును, ఆపరిణయంబును గాంచవలయు ననియును, కోరిరి. ధననంతులును, రాఁగలిగిన వారును మాత్రము ఇంగ్లండునకుఁ జనుదెంచి యూవివాహమ మోత్సవమునుజూడ నుద్యమించిరి.. అనేకులు తాము రాలే మని నిరాశ చేసికొని తమతమ యింటి పట్టులయందే యుడి ఎడ్వ, లెగ్జాం డ్రుల వినాహము నిర్విఘ్న ముగఁ బరిసమాప్తిస్ నొందవలె సని కోరు చుడిరి.

డెన్నార్కు రాజతనయ యగున లెగ్జాండ్రి" ఇంగ్లమునకు క్రొత్తది కాదు. ఆపురికి రెండుమూఁడుతడవలాకన్నియ పసి తనంబున వచ్చి దానిసొబగును, గాంభీర్యంబును, జనులకు: జూపి ఉండెను. ఆమె తన మేనయత్త యైన కేం బ్రిడ్జి రాణిని జూడనే తెంచిన పుడు లియొసాల్డను భూనేతను జూడఁ బోవు చుండిన విక్టోరియాను గాంచెను. ఆమహారాణి అప్పుడే అడెన్మార్కు ప్రభుతనయను గని దానివినయగాంభీర్య సౌశీల్యాది సద్గుణం బులకు మిగుల సంతసంబందెను. ఇదియునుగాక రెండవతడవ నాపూఁబోడి తనతండ్రి వెంట నింగ్లండునకుఁ జనుదెంచి ఆస్బోరనులో నుండిన విక్టోరియాను జూచి తన రాజ్యమునకు మఱ లెను. లండనుపురి పౌరు లాచిన్న దాని సొబగును విన్న వారు కాని ఆతరుణిని గని యెఱుంగరు. అనేకు లనేకభంగుల నాయమ సౌదర్యంబును మదిలోఁ బొగడు చుంచుడిరి. కొందఱు ' మే మా య లెగ్జాండ్రాను, డెనార్కులోఁ గన్నారము. జను లనుకొమరీతిని అంతచక్క నీపూఁబోడి కాదు. ఏమో గొప్ప రాజుకుబత్ని కాఁబోవు చున్నది. అయిన సద్గుణగణఖని యుట,” అని వక్కాణించిరి. మణికొందఱు "అలెగ్జాండ్రా మంచి చక్కనిది.మిక్కిలిచదువరి. నిగర్వ ఆశ్రయించిన వారి పాలిట కల్ప వృక్షము.మనలఁ గన్న తల్లి మాదిరి గాపాడును.” అనిరి. ""ఓ ! ఈయలెగ్జాండ్రా ఎవ రో? అనుకొంటిని. మొన్న నాతోఁగూడి యాడు కొన్న చిన్న దా? దాని "కా పెండ్లి ! ఆతరుణియేనా మన యెడ్వర్డును బెండ్లియాడఁ బోవు చున్నది : ? 'దానికి సంతభాగ్యము? దాని యదృష్ట మే అదృష్టము." అని వెండియుఁ గొందుఱు పల్కిరి...“ఆయ లెగ్జాండ్రా మనకు రాణి అగుట మనకు లాభమును, , డెన్మాక్కు- దేశస్థులకు గొప్పనష్టమును గాదా? అని ఇంక గొందఱు వాక్రుచ్చిరి, విక్టోరియాయాస్థానపుఁగ వీశ్వరుండైన టెనిసనను కవి చంద్రుఁ.డు.. పెండ్లి కై ఇంగ్లండునకు నేతెంచు చుండిన అలెగ్జాండ్రాకు నిటులఁ బద్య రూపంబున స్వాగత మెచ్చెను.

““ అందంపు, బ్రోవ! మాయంగల రాణి
ఇందునిభానన! యెలు గిచ్చి నిన్ను
“మాలంకకును వచ్చి మములఁ బ్రీతి
బాలింపు మోతల్లి వద్మద జగంధి,
ఓయలెగ్జాండ్రాయ నోరిమి నెలమి
బాయనికూర్మిని పల్కు చున్నట్లు
ఖంగు ఖం గని మోసే ఘంటజాలంబు
బొంగా ర లెగ్జాండ్రపురిఁ జేరువేళ.”

రాజు బంధువు ల నేకులు ఎడ్వర్డు అలెగ్జాండ్రాకు మగఁడౌనని ప్రమోదభ తహృదయు లై పెండ్లి దిన మెప్పుడు నచ్చునా యని కోరుచుండిరి,

రాణియాజ్ఞను మంత్రులు పెండ్లి కార్యములు సేసిముగించిరి. వారు పెండ్లికి 'రావల సియుండిన సామంత ప్రభువులకును, సమాన రాజు పుంగవులకును ఇకననేక ప్రముఖులకును, వినాహాహ్వానపత్రికలను వ్రాసిరి. వారు లండనుపురము ననేకరీతుల శృంగారింపఁ గొలువు కాండ్రను "పెక్కు మందిని నియ:మించిరి. ఆ సేవకులును దమఱేడు చెలువంపుదీవి యనఁబరగు నలెగ్జాండ్రాను జేఁబట్టు నని సంతోష.చిత్తంబునఁ దమ రాజభ క్తిని వెల్లడి సేయుచు పురమును శృంగారించడి. రాజమందిరంబులు నానావిధంబు లైనవన్నెలతో 'మెరయసాగెను. రాజవీధులు చక్కని వై నిర్మలము లై కనుపట్టె.. "మహా చక్రవర్తి చక్కని

చిగురాకు బోడీని జేఁబట్టఁ బోవు చున్నాడు. పెండ్లి వేడుకలను జూడ ననేక దేశములయందుండి అనేకులు వత్తురు. "పెక్కుసరకులు విక్రయమునకుఁ బోవును. ద్రవ్యమును సంపాదించుటకు నిదియే మంచిసమయము, జాగు సేయకూడదు. అన్ని సామాను లను జేర్చుకొనుట లెస్స" అని వర్తలండఱకు ఆయావస్తువులు విక్రయమునకుఁ నెచ్చి పెట్టుకొనిరి. వీదు లూడ్చుకొని జీవించువాడు మొదలు రాణిమంత్రిపదంబుసనుండినవారి వఱకుఁ గలజనులందఱును తమతమమందిరంబుల సర్వవిధంబుల సలంకరొంచుకొనిరి. పరదేశములనుండి పరిణయవినోదంబలం గాంచుటకు నేతెంచుగోప్పవారును, శ్రీమంతులును, హీందూ దేశ మున నుండిన సామంత ప్రభునికరంబులును, తమకు నాపట్టణంబున నాతరుణంబున బస సేయుటకుఁ జోటు లభింపదనియెంచి, మున్ముందుగ నద్దెకు నియ్యవలసిన పైకమును బంపి, బసలను ఏర్పాటు చేసికొని యుండిరి. రాణిమంత్రులును వేవేగ నైరోపొఖండంబున నుండు చక్రవర్తులకుఁ దగిన మేడలును నియమించి "నా దేహసౌఖ్యములకు భంగము లేవియు లేకుండం జేయుటకుఁ బెక్కు మంది సేనకులను నియమించిరి. పనులన్నియు ముగియ గశ్యాణకళలచే లండనునగరవరము పెంపొందు చుండెను.

ఎడ్వర్డు తండ్రిపోయిన దాదిగ రాచ కార్యములు చేయు చుండెను. పరదేశములనుండి రాణిఁ జూడ నే తెంచిన ప్ర

భువుల నాతడు గౌరవించి వారి నాదరింప వలసి యుండెను.అతని కల్యాణమ ఘోత్సవమును జూడ సాముత ప్రభువర్గములును శ్రీమంతులై నవ కనికరంబులును, అతని రాజ్యంబు నాతని మాటుగఁ జాలించు రాజు ప్రతి నిధుల సమూహంబులును,సామాన్య జనంబులును, ఎన్ని యోమంది "లెక్క కుమిక్కిలి యై లండనువురి వైభవము హెన్నతముగ నానాదేశంబులయందు బెల్లుగ సల్లుకోనునటులం జనుదెంచు చుండిరి. వారు వారు తమకు నియమించి విడిదులలో బస చేసిరి.. హిందూదేశము, కన్నడా, ఆస్ట్రేలియా, కేవు కాలని మున్నగు రాజ్యంబులయం దలి సేనలును, సేనానాయకులును, లండను పురికి చేరిరి. రాణీ మంత్రులే యేవారల యేరీతుల నాదరింప వలయునో ఆయావారల నాయారీతుల నాదరించుటకు వారివారి హోదా లకుఁ దగిన పరివారమును ఏర్పాటు చేసిరి. 'వారందరునుఎడ్వర్డు కళ్యాణ మహోత్సవమును గాంచుటకు సతికుతూహలులై యుండిరి,

రాణి తన వియ్యంకునకును, వియ్యపురాలికిని, వారిపరిజనములకును, దిగిన బసలను ఏర్పాటు చేసెను. వారిలోబెక్కు మంది వారి వారి కుటుంబములతో ముందుగ " విచ్చేసి యుండిరి. రాణి మంత్రులు వారికి నే కోదువ లేకుండునటుల వారికి వలయు సామానులను ఆంద జేయు చుండిరి. . డెన్మార్కు- ప్రభువు తసజన సమూహములకుఁ గావలసిన సామగ్రుల సన్నిం టీని బంపించెను. ఎవరును ఎలాటి కోఱతలు లేక " డెనార్కురాజుపుత్రిక యగునలెగ్జాండ్ర రాకకు నెదుఱు చూచు చుండిరి..ఇంగ్లండు పెక్కు భాగములుగ విభజింపఁబడి యున్నది.. ఒక్కొక్క దానికి “కౌంటి" అని పేరు. అట్టిదానిని మన రాజ్యమున “జిల్లా " అని పలుకు చుందుము. అచ్చట బ్రతి కౌంటియందును, వ్యాపార సంఘములు, వ్యవసాయదారుల సంఘ ములూ, నగర పాలకుల సంఘములు, (Municipal Bodies),గొప్ప గొప్ప జమీందారులు, మొదలైన సంఘములును, జనులును, పత్రికాముఖంబునఁ దమ తమ రాజభ క్తిని దెలుపుటను, ఎడ్వర్డు సంప్రీతిని గొని వానందఱుకు నుచిత భంగినిసత్కారములు సలుప వలసియుండెను. అతఁడు పార్లమెంటు సభసభ్యులకుఁ దాను వివాహ మాడఁ బోవు చున్నా ననితెలియఁబడు టకు నాసభలోఁ బ్రవేశించి వారియంగీ కారమునొందవలసి యుండెను. అతడాపనుల నన్నింటిని స్వయముగఁ జేసికొనెను. అతఁడు రాజ చిహ్నములచే నలంకృతుఁడై పార్లమెంటుసభలో బ్రవేశించెను.

ప్రభువులందురును లేచిరి. కాని లార్డు చాన్సలరుకు మాత్రమతి గాంభీర్యమున దనయాసంబునఁ గూర్చుండి యుండెను.ఎడ్వర్ణాతని డాయంజని " మేము డెన్మార్కు నొడయనిపట్టి యైన అలెగ్జాండ్రాను వివాహ మాడఁబోవు చున్నారము. ప్రభుపులందఱును మాకల్యాణ సమయమున విచ్చేసి, సమస్త కార్య ములను కొనసాగింతు రనికోరు చున్నారము." అను మొదలగుసంగతులు వ్రాసినపత్రికను ఆతని హస్తపల్లవంబున నిడెను.పార్లమెంటుక్లార్కు- ఎడ్వర్డునకుఁ గొన్ని ప్రమాణ వచనములను జెప్పెను. ఎడ్వర్డు దానిని ప్రభువుల యెదుట స్ఫుటముగఁ బలికెను. ఆంత నాతఁడు "కార న్వాలు ప్రభు పనియును, (Duke ofCornwall) ఛెసరునకు స్వామి అనియును, (Earl of Chester) కారిక్కునకు నొడయఁ డనియును, (Earl of Carric )రో దుసేకు నేలిక అనియును (Duke of Rothesay) లంకల ప్రభువనియును (Lord of the Isles) ప్రభువులు సెప్పిరి.పార్లమెంటు సభాసభ్యులలో రెండు తరగతులవా రుండిరి ఒక తరగతివారు ప్రాచీనాచారములును, చట్టములును, మేలై నవియును, వానిమార్చగూడ దనియును, చెప్పువారు.వీరికి "కంజర్వటీసు అని పేరు. రెండవనారు. ప్రాచీనాచారములలో మే లైన వానిని గ్రహించి, పనికి రానివానిని బోఁ ద్రోసి క్రొత్తవానిని నిర్మించి, వానిని ఆచారమునకు; దెచ్చి ఇంగ్లండున నుండు సన్న గాండ్రను తమతో సమానులుగఁ జేయుటకు నుద్యమించువారు. వీటికి "లిబరల్సు " అని పేరు. ఎడ్వర్డు ఈ రెం డు కక్షల వారిలో చేరక ప్రత్యేకముగ నుండి వీరివాదంబులనాసభలలో వినుచుండెడి వాడు. అయిన నాతఁడొకతడవమాత్రము " పెండ్లమును గోలుపోయనవాడు చచ్చిన పెండ్లము చెల్లెలిని క్రమ్మఱ వివాహము సేసికొనవచ్చును." అనుచట్టము

ను విని ఆమోదించెను. కాని ఇంతకన్న మిన్న యగురాచ పనులలోఁ బసితనంబున నాతఁడు ప్రవేశించి పాటుపడినది లేదు ఇంగ్లండున నీ పెండ్లివారు సమస్త కార్యంబు లొనర్చు చుండ డెన్మారు రాజ్యమునందలి ప్రజలు తమరాజువుత్రిక లోకమునం గలపృధ్వీపతులలో మేటి యని చెప్పఁ దగు నెడ్వర్డును బెండ్లియాడఁ బోవు చుండె నని మిగులసంతోషించి ఆకన్ని యకు ననేక విధంబు లగుకానుకలం దెచ్చియిచ్చిరి .అలెగ్జాండ్రా "పెండ్లికిఁ దర్లి నపుడు తనతోడఁ గూడి యాడిన బాలికామణుల పెండ్లిండ్ల కై పెద్ద రొక్కంబు నొసంగే. ఆమె వెంట బెక్కు మంది చెలికత్తియలు షయన మైరి. ఆమెను ముందు నిడుకొని సమస్తరాజు వైభవములు, నాయమ తల్లిదండ్రులుసు, ఆమె చెల్లండ్రును తమ్ములును, పెక్కు మంది పరిజనములును, వెంటరా కొనుపను హేగును వదలి ఇంగ్లండు సునకుఁ బ్రయాణాద్యుక్తు లైరి. వీరిని బరివేష్టించి సేనాసమూహములు ఆయుధపొణులై ఇంగ్లండునకు నేఁగ సమకట్టిరి .

డెనార్కు మెడయఁడు తమ నెయ్యంపు: గూఁతును వెంట నిడుకొని 1863 సం, ము ఫిబ్రవరి నెల 26 తేది:కోపను హేగనువిడిచె. పెండ్లి వారు త్రోవలో కోలో నను (Cologne)న నిలిచి.. అచ్చటనుండిన యాంగ్లేయరాజ ప్రతినిధి తమకునేలికసాని కాబోవు అలెగ్జాండ్రాను దర్శించి స్వాగతమిచ్చి పెండ్లికూతు విందొనరించెను. ఫ్లాకుడర్సు ప్రభువు విక్టోరియా

వియ్యంకుని ఆయనయనుచరులను మిక్కిలి గౌరవించి ఫ్లషింగు(Flushing) అనుతావున నాంగ్లేయుల నావల సేనాసమూహము ఆలెగ్జాండ్రా ప్రభృతులను వెంట బెట్టుకొని పోవుటకుఁ "వేచి యుండి, పెండ్లి వారిని లండనుపురిని జేర్చెను,


లండనుపురి ధేమ్సునదిగట్టున నున్నది. ఆనదిలో నెల్లప్పుడును నానాదేశ నావలు క్రిక్కిరిసి యుండును. ఎడ్వర్లు తసభావి భార్యను బిలుచుకొని వచ్చుటకు నా నదిలో మంచి యోడయుండెను. ఆదిబహుబంగుల నలంకృతమై రాజిల్లుచుండె, దాని స్తంభపుఁగొనను వ్రేలాడు జండాలు లండనుపురికి వచ్చెడి యలెగ్జాండ్రాను రమ్మని చేవీచు చుండినవో అనురీతిని గాలికి నటు నిటు గదులుచుండెను. అందునంగల యోధులు మిక్కిలి భయభ క్తులతో నాయుధపాణులై నదీతీరంబున నిలిచియుండు జను లనేకులు అలెగ్జాండ్రా ముఖారవిందమును జూడ నచ్చోటికి నేతెంచి యుండిరి. నదిలో నుండిన యేడలలోని సామానులను పురిలోనికి పోవుకూలివాడ్రు తమతమ పనులు సాలించి మోములెత్తి పెండ్లి వారువచ్చు చుండిన చాయ దృష్టి సారించి నిలువఁబడి యుండిరి. దేశీయ బాండువాద్యము “మా రాజును “మా రాజును గట్టుకొనుము. - ఇచ్చట నున్నవాఁడు. మేము మీకు ప్రథమ స్వాగతము నిటనిచ్చుచున్నారము. రమ్మా మా 'రాణి ! " అని మందలించు చుండెనో అనుభంగిని శబ్దించు చుండె.

డెన్మార్కు నుండి లండనుపురికీ నే తెంచు చుండిన పెండ్లి వారినావ థేమ్సునదీ ముఖ ద్వారముఁ జేరెనను సమాచారము ఎడ్వర్లు ప్రభృతులకు నందెను. పిరంగులు “అలెగ్జాండ్రా రా వమ్మా! 'రావమ్మా మాపురికి" అని పిలుచుచుండె నను లాగున మ్రోగెను. బాండు వాద్య ధ్వనులు నింగి ముట్టె. లండను పురి "వా స్తవ్యుల కరతాళధ్వనులు జనుల చెవులు దూట్లు చేయుచుం డెను. ఇంతలో బెండ్లి వారు లండను నగరమును డాయం జను దెంచిరి. ఎడ్వర్డు ప్రభృతు లుండిన నాననుండి చిన్న పడవ నదిలోనికి.డిగి, అలెగ్జాండ్రాను బిలుచుకొని వచ్చుటకు నాయమ నావను సమీపించెను. పెళ్లి వారిలో ముఖ్యులు అందుదిగి ఎశ్వర్ణుండిన తావు సేరిరి.

ఓడకడుపున నుండిన ఎడ్వర్డు ఓడ పై ప్రదేశమునకు నే తెంచెను. అలెగ్జాండ్రా ఆయనను డాయం బోయెను. అతఁడా రాచపూఁబోడి కెం గేలును తన కేలుకో, గీలుకొలిపి ముద్దిడు కొనెను. అందఱు గొల్లున నవ్విరి. అనేకులు కరతాళ ధ్వనులు నింగి ముట్టం జెలంగఁ జేసిరి. మంత్రి ప్రభృతులు ఎడ్వర్ణ లెగ్జాండ్రాలిద్ద ఱికి మీద నన్యోన్యాను రాగంబునఁ బ్రవర్తించురని నిశ్చయించిరి,

రాణి ప్రధానులును, మతగురువులును, లండను నగరవా స్తవ్యులును, పరరాజ్య ప్రభు సమూహములును, సామంత రాజ ప్రకరం బులును, ఆయుధ పాణు లైన సేనానిచయంబులును, నలునై పుల బలిసి కొలువ పెండ్లి వారు నాలుగు గుఱ్ఱంబులు పూన్చీన బండ్లపై నెక్కి. 'రాజు మార్గంబున రాచ ఠీవినిరా బొడగిరి.మేడ చివరలమీఁద నుండిన నారీమణులు పూలవానను అలె గ్జాండ్రా ప్రభృతుల పై గురిపించిరి , శ్రీమంతులు ముత్యాల వర్షమునారాజ మార్గము మీఁద బోరస వర్షింపించిరి, అనేకులా యాఘట్టములలో వారిని నిలిపి, నానావిధమణులచే నలంకరింపబడిన సింగంపు బీఠముల పైఁ గూర్చుండఁ జేసి వారిని బహుభంగులగౌరవించి. లండను వంతెన చెంగట బూలచే నలంకృత మైనమంటప మొకటి యమరి యుండెను. అందు నెడ్వర్డు అలెగ్జాం డ్రాలు విశ్రమింప దివ్య మణిమయో పేతంబు లైన తిన్నెలువేసి యుండెను. వాని పై నాయాప్రభువులకు నుచితాసనములు రాజల్లు చుండెను. వాని నడుమఁ జక్కగ నలంకరింపండిన యున్న తాసనములు రెండు చూపఱుకు గనుపట్టు చుండెను. లుడను పుర పాలక సముదాయము( Londlon Municipal Cor-poration) అయాసనంబుల పై నాయ" రాజవర్గములు గూర్చుం డ నేర్పాటు చేసిరి. అంత నాసంఘమువారు ఆలగ్జాండ్రా ”ను బహురీతుల సంభావించి, స్వాగత మిచ్చిరి. పెండ్లి వారాచోటువాసి, కైతునెసు ప్రభువు దోలిన. ధూమశకటంబుపై వింజరుభవసము సమీ పించిరి. ఈటను పాఠశాలలో జదువు బాలు రెనమన్నూరుమంది ఆగ్జాండ్రా"ను నాయమ తల్లి దండ్రులను సగౌరసంబున తమపురికి విచ్చేయవలయు నని ఆహ్వానము సేసిరి. వింజురు

మందిర ద్వారమునఁ బుత్ర పుత్రి కాపరివృత యగు విక్టోరియామహాచక్రవర్తిని తన కోడలగు నలెగ్జాండ్రా నెదుర్కొని వింజరు మందిరాభ్యంతర ప్రదేశమునకుఁ దోడ్కొని వెళ్లెను.

పెండ్లిమూరుతము మిక్కిలి సమీపించెను. రాణీకి గావలసిన చుట్టాలందఱును విచ్చేసి వారి వారి విడుదులలో విడిసి యుండిరి. ప్రిన్సు ఆల్బర్టు వైపున గలబందుగులును ఏ తెంచి తమ తమ బసలలో వసియించి యుండిరి. సమస్త దేశాధిపతులాయా స్థానంబుల యందుండిరి. వారందఱును ముహూర్తదినంబున వధూవరుల వెంబడిఁ జనుదేర సర్వవిధంబుల నలంకరించు కొని కట్టాయితంబై యుండిరి. రాణీ రాజ్యముల యందలి సేనానాయకు లశ్వారూడు లై ఆయుధములఁ గేలం గోని 'రాజమార్గముల యందు పారా లిచ్చు చుండిరి.

డెన్మార్కు పృథ్వీతనయ అలెగ్జాండ్రాకుఁ జెలికత్తియలు పరిమలోపేతంబగు నుష్ణోదకంబున స్నాసబు గావించి, సర్వవిధంబుల నలంకరించిరి. ఒక చేడియ నాయమకు భూషణంబుల నందించెను. ఇంకొకతె వాని నామె మేనిపైఁ దొడంగెను. వేరొక్కతె ఆతరుణీ మణి నీలాలకములు చిక్కు. దీసి పూలు దురిమి ముడిచెను. వెండియు నొక్క ఆకాంతాలలామంబునకు దివ్యపట్టు వస్త్రంబులు కట్టఁ బెట్టెను. ఒండొక్కతె నానావిధము లైనపూలు కట్టిన పూబంతి నా యలెగ్జాండ్రా “ పాణి

వల్లవంబన బెట్టెను. ఆమె దానిని గొని ఎడ్వర్డు పాణి గ్రహణము సేయ మిక్కిలి తమకంబున నుండె ఎడ్వర్డు నమ స్తరీతుల నలంక రించుకొని, అలెగ్జాండ్రా పాణి కమలంబు చేబట్ట నువ్విళ్లూరు చుండెను. ఆయన పినతండ్రి సాక్సుగోబర్గు గోతాప్రభువును, ప్రష్యా రాజ్యాధి పతి పెద్దకు మారుఁడను, అతని వెంటఁ జనుటకు నియమితులై యుండిరి. అతడును సమస్తరాజ చిహ్నములు ధరించి, జగములనుండు పూబోడుల వలపించ నభినవమన్మద ములక యోయను రీతి నెప్పారుచుండెను.

పెక్కు మంది సెయింటుజార్జిచే పలునకు: బయన మై ముందు నుంచి జనంబులు రాజమార్గంబులం దిరు కెలంకుల గిక్కిరిసి యుండిరి. ఆనేకులు మేడల పై నిలిచి వధూవరుల వీక్షింప గౌతుహలాయ చిత్తులై యుండిరి, జనులనేకులు తాపు చిక్క దని సెయింటు జార్జి చేపలును బండం ద్రోయుదురో అను భయము జనించుభంగిని గుంపులు గూడి దాని జుట్టు ముట్టి యుండిరి. ఆగుడిలోనికి; బోనర్హులైనవారు ముందు నేగి వారివారికి నమర్చిన యుచితాసనంబుల నధి ష్టించిరి.

రాణీ జలకంబు లాడి మంచి యుడుపులను దరియించి దేవాలయమునకు నేఁగ నుద్యుక్తురాలై యుండెను. నష్టభర్తృక యగుటచే నాయమ యందఱ వెంట. బో నొల్లక మున్ముం దుగఁ నేగి మతగురువు నాససంబునకు నుత్తరపు జాయ నమర్చిన గదిలో నున్న తాసనంబునఁ గూర్చుండి. తనయుని వైహి హిక క్రియలు నడుచుటను జూడఁ గోరు చుండెను.

పెండ్లి కూతువంక నా కొకచాయనుండి.గుడిఁ బ్రవే శించిరి.l. మంత్రులు మహారాజులు మున్నగువారు రాజు పెడ్డిని గన విచ్చేసిరి. ఎడ్వర్డు ఒక బండిలో నెక్కెను. .. యల్లుడు ఆయన కిరు కెలంకులఁ గూర్చుండిరి. ఆయనబండి మ్రోల సాయుదు లై నపరిజను లశ్వంబుల నారోహించి ముందుఁ జను చుండిరి. ఠాణాదారులు సామాన్యజనులను జేర నియ్యక దూరమున నుండుడని 'బెత్తంబులచే వారితలల పై నాడించు చుందిడిరి. . అలెగ్జాండ్రా వేరొక బండి నెక్కి కడలి బిడ్డ "వెన్ను ని జెందఁ బోవుపగిదిఁ గనుపట్టె. ఆమె చెలికత్తియ లామె కెలఁకులు నుండిరి. ఇటల నారాజవధూవరులు మెల్లగ రాజవీథిని ఠీవిగ జని దేవాలయమును బ్రవేశించిరి. జనులయానందముసకు మేర లేదు. వారు తమ సంతోషముఁ బెక్కు తెరంగుల నెఱిగిం చిరి. కొందురు చప్పుట్లు తట్టిరి. మఱికొందరు కోలాహల ధ్వనులు నింగి:ముట్ట: చేసిరి, భేరీ మృదంగాది 'వాద్యములు మ్రోసె. వందిమాగధులు రాజు బిరుదులను బాడి కీర్తించిరిl. అప్పు డా కోవెలచుట్టు నిసుక వేసిన రాలనం తజనసమూహము లాసమయంబున నుండిరి.

ఇంతలోముహూర్త కాలము సమీపించెను. చప్పుడడం గెను. గుడి నుండినజనులు మాటలాడక మౌనమును ధరించినవా రై ఎడ్వర్డు నలెగ్జాండ్రాను గాంచు చుండిరి. అలెగ్జాండ్రా లజ్జావనతవదన యై మతగురువు నెదుటఁ జని నిలిచెను. ఎడ్వర్డు ఆమె యోర నిలఁబడెను. మతగురువు లేచితనహ స్తంబును వధూవరులళిరస్సు పై నిడి కొన్ని మంత్రంబులు పఠియించి,ఎడ్వర్డును, అలెగ్జాండ్రను, గొన్ని ప్రశ్నల నడిగెను. ఎడ్వర్లు స్పష్టముగఁ " జేయుదును.” అని వాక్రుచ్చెను. ఆయంగనయుఁజిరులునగవు మోము నెలఁ గులుకు లాడ సన్నపు టెలుంగునఁబల్కెను. ఆమెమాటలు దాపున నుండినవారికిఁ గూడవినంబడ లేదు. డెన్మార్కురాజు తనతనయను ఇంగ్లండు ప్రభువు కొరకుఇచ్చెను. ఎడ్వర్డారాణి పాణీకమలమును గేలం గీలు కొల్పెను.పెండ్లి కూతును కుమారుడును, సభా సభ్యుల యెదుట నిలుచుటకుఁ బూర్వము ఉన్న తాసనంబు నలంకరించిన విక్టోరియాపాద కమలంబులకుఁ బ్రణమిల్లి .. "చిరంజీవులై జనుల నాయనంతరము చల్లగఁ బ్రోతురుగాక” అని ఆ రాజగృహిణి ఆశీర్వదించెను. ఆవల నా రాజదంపతులు సభ్యులచాయఁ దిరిగి,వారికి నతు లోసర్చిరి. వారును కరతాళధ్వనులు చెలంగ నాశీర్వదించిరి,

అలెగ్జాడ్రా తల్లియును, సోదరీసోదర జనంబులునుతమతోడఁ బుట్టినది. తమ్ము నెడఁ బాసి చనుచుండె నని శోకపూరితనయను లై కనుపట్టిరి. డెనార్కు- ప్రభువు ధీరుఁ డయ్యును నెయ్యంపుఁబట్టి నన్యునకు నొసంగునప్పుడు, ఆతని ధైర్యము నీరై ఆతని నేత్రము లను తూముల గుండ పొర్లి పార్లి రాసాగెను. వీరి వంక వారు తమఱేనియుమ్ములికంబు నుపశాంతించుటకు నాతని నోదార్చు చుండిరి. అలెగ్జాండ్రా తండ్రి, మోముం గాంచి విస్మయ దుఃకాంత్ర స్వాంతయై తన నాథుని వంక వారిచాయఁ జూచెను. ఎడ్వర్డు తోబుట్టువులు తమయన్న దమ్ముల విడనాడి పరచేడియ ను జేఁబట్టె నని లోచనకమలంబులందుండి వేడినీరు పొంగి పొంగి దొర్లుచు వచ్చుచుండ దుఃఖిం చిరి. వారు తమదుఃఖంబు సన్యు లెఱుంగ కుండుటకై తమ వదనన నరుహంబుఁల బూబంతులచేకప్పు కొనిరి. పెండ్లికి వచ్చిన వారిలో గొలఁది మంది మాత్రము వారిని జూచి పశ్చాత్తా పడిరి.

.డెన్మార్కు ప్రభువు తన ముద్దుబిడ్డను, ఎన్ని నాళ్లు పెంచిసను, ఆకన్నియ పొరుగింటిబిడ్డయే అని తలంచి, కన్నీరుఁ గొనగోటఁ జమ్మి వైచి యల్లు నకును, కూతునకును, నానావిధము లైన కానుకలను సమర్పించెను. అపరంజ మయంబు లను పైడి గిన్నెలును సవరత్న ఖచితంబు లైన భూషణంబులును, వెలలేని దివ్యాంజంబులును, ఇంగ్లండు మహారాణి వియ్యంకునకు సమర్పించెను. ఈ రీతిని నా పెండ్లివారానందాబ్దిని మునిగి తమ తమ రాజ్యంబులకు నేఁగినుద్యుక్తు లై యుండిరి.


పెండ్లికి వచ్చిన పరరాజనికరంబు లెడ్వర్డ లెగ్జాండ్రులకు బహువిధంబులఁ గానుక లిచ్చి, తాము తమరాజ్య ములకు . జనుటకు రాణియనుజ్ఞ "వేడిరి. ఆమే వారందజకుఁ దగురీతిని గౌరవములు సలుప వలసిన దని మంత్రులకుఁ గట్టడ మెన ర్చె. వారును ఆ యా రాజులను వారి వారికి నర్హతములైన మార్గములు సత్కరించి, అభూధవులు రాణి సెలవు వొంది. నిజ దేశగమనో ముఖ లై. నూతన రాజదంపతులు ప్రజలకు నను రాగపర్తనులై పెండ్లి యైసయొక సంవత్సర పర్యంతము ప్రతిదినమునను విందులు గుడుచుచు సుఖం బుడిరి,

అయిదవ యధ్యాయము.

ఎడ్వర్డలెగ్జాండ్రాల నూతన దాంపత్యము.


విక్టోరియా భర్తను గోలుపోయినది మొదలు రాజకీయ వ్యవహారములలో, దాను ప్రవేశించక తనకుమారరత్నమును అందుఁ బ్రవేశంష జేయు చుండెను. అందువలన బర దేశ రాజుగాని, రాయబారులు గాని రాణి జూచుటకు వచ్చిసపుడు వారికీ చేయవలసిన గౌరవము లన్నింటిని ఎడ్వర్డుచేయు చుండెడివాడు. అతనికి బరిణియం బై కొన్ని దినములయ్యె. లండను నగరంబును, ఇంగ్లండు లోను, గొప్పగొప్పు పట్టణంబుల యందును, ఉండు శ్రీమంతులు ఈ నూతన రాజదంపతు లైనయెడ్వెర్డలెగ్జాండ్లను తమతమ యునికి పట్టులకుఁ బిలుచు కొనిపోయి వారికి యధాశక్తిని మర్యాదలు సలుపు చుండిరి.