సకలనీతికథానిధానము/ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీకలితకుంట ముక్కుల | |
వ. | అవధరింపుము నారదుండు బలీంద్రున కిట్లనియె. | |
సీ. | భోజుఁ డీరీతిన పూర్వసింహాసన | |
ఆ. | కాన గద్దె యెక్కగా నర్హుఁడవు గావు | 2 |
సీ. | చంద్రగుప్తక్షమాచక్రేశు తనయుండు | |
| సాహసోదారరక్షా విక్రమాఢ్యుండు | |
తే. | దానధర్మోపకారవిద్యాప్రతాప | 3 |
వ. | అని యతనిగుణంబులు ప్రశంసించి నీకతంబున శాపముక్తుల మైతి మనిన మీ కీశాపం బెట్లు వచ్చెననిన నాపుత్రికాస్త్రీ లిట్లనిరి. | 4 |
క. | గిరిజకు సఖులగు మే మా | 5 |
వ. | అని చెప్పి యధాస్థానంబున కరిగిన భోజుం డాసింహాసనం బెక్కక యుమామహేశ్వరప్రతిష్ఠ గావించి కొలుచుచుండె ననిస నభ్భోజునిజన్మంబు చెప్పుమనిన నారదుం డిట్లనియె. | 6 |
ఉ. | ముండికుడాప్రయాగ వసుముఖ్యము లొల్లక తీర్థవాసులన్ | 7 |
ఆ. | ఆత్రివేణి గూలె నంత మూడవదియు | 8 |
క. | ఈముండలు మువ్వురకు | 9 |
వ. | అట్లు చెప్పి యిట్లనియె. | |
ఉ. | మానవలోకనాథుఁ డసమానచరిత్రుఁడు నందుఁ డంగనా | 10 |
వ. | ఇవ్విధంబున స్త్రీలోలుండై భూపరిపాలనంబునం బ్రమత్తుండై యున్న నతనికి బహుశ్రుతుం డిట్లనియె. | 11 |
ఆ. | జాతిసంకరములు జరగంగ నీయక | 12 |
క. | లోలాక్షులు మనసీయరు | 13 |
వ. | అని మంత్రి హితంబు చెప్పిన నిట్లనియె. | 14 |
క. | హరుఁడును హరియును నజుఁడును | 15 |
వ. | అనిన మంత్రి యిట్లనియె. | 16 |
ఆ. | అధికు లాచరించు విధములు దలపంగ | 17 |
వ. | అనిన సతీవిరహితుండనై యుండ లే నేమి సేయుదు ననిన బహుశ్రుతుం డొక్కచిత్రపటంబున భానుమతి రూపంబు చిత్రించి ముందట నిడి యీపటంబు చూచుచుం గొలువుండి భూమిఁ బాలింపు మనిన నతం డట్ల సేయుచుండ నంత నొక్కనాఁడు. | 18 |
తే. | శారదానందుఁడను గురుస్వామి యొక్క | 19 |
క. | విలిఖంచఁ డేలకో యీ | 20 |
వ. | అని మంత్రి జూచి శారదానందుని వధియించుమని పంపిన బహుశ్రుతుం డట్లగా యని శారదానందునిం గొని చని యొక్కభూగృహంబున డాఁచియుండె నంత నొక్కనాఁడు. | 21 |
ఆ. | నందభూమిపాలనందనుఁడు విజయ | 22 |
సీ. | యెండినతరువుననుండి కాకము గ్రోల్చె (?) | |
| సవ్యబాహువు వణకెనశ్వంబు మ్రొగ్గె | 28 |
వ. | ఇవ్విధంబున నపశకునంబులైన మగుడ యారాజకుమారుండు మృగయావ్యసనపరాయణుండై చని యవ్వనంబున. | 24 |
క. | మృగముల ౙంపుచు గోలము | 25 |
ఆ. | అట్లు మ్రాను వ్రాకి యగ్రశాఖకు జేర | 26 |
క. | కోపించిన పులి దిగువం | 27 |
వ. | అంత క్రిందనున్న పులి మీఁదనున్న భల్లూకంబున కిట్లనియె. | 28 |
క. | మనుజుం డస్థిరచిత్తుఁడు | 29 |
వ. | అని బోధించి యమ్మనుష్యునిం బడద్రోయుమనిన నయ్యచ్ఛభల్లం బిట్లనియె. | 30 |
క. | తనునమ్మి శరణుజొచ్చిన | 31 |
వ. | అట్లుగావున నితం డెట్టివాఁడైన బడద్రోయనని నిద్రాలసుండైన యారాచకొమరనిం దొడమీఁద నిడుకొని. ...........నిద్రవోయి మేలుకొనిననంత భల్లూకం బతని హృదయం బెఱుఁగదలచి నిద్రించునదియుం బోలె నారాచకొమరునితొడ దలయంపిగా గన్నులు మూసికొన నాశార్దూలంబు రాచకొమరున కిట్లనియె. | 32 |
క. | మృగములకును మానవులకు | 33 |
ఆ. | బల్లిదుండు గినిసి పైనెత్తి వచ్చిన | 34 |
వ. | అట్లు గావున నీభల్లూకంబును బడద్రోచి నీవును సుఖంబునం బొమ్మనిన నతఁడును నట్ల చేసిన. | 35 |
క. | ఋక్షంబు దిగువబడ కా | 36 |
ఉత్సాహం. | పులి దొలంగిపోవుటయును భూరుహంబు డిగ్గి యా | 37 |
వ. | ఈనాలుగక్షరంబుల కర్థం బెవ్వఁడు చెప్పిన దానివలన శాపముక్తుండ వవుదు పొమ్మనె నతండును విభ్రాంతి వహించి వనంబున 'ససేమిరా' యనుచు దిరుగుచున్న తజ్జనకుండైన నందుండు దోడ్కొని చని వీనిజాల్మత్వం బెవ్వండు దీర్చిన నర్ధరాజ్యం బిచ్చెదనన మంత్రౌషధవిదు లెల్ల వచ్చి మాచేతంగాదని తొలంగిన బహుశ్రుతుం డిట్లనియె. | 38 |
క. | అవిచారపరత విప్ర | 39 |
తే. | నరనుతుండైన శారదానంద గురువు | 40 |
క. | భూపతిముందటఁ బెట్టిన | 41 |
వ. | కుమారుని నిందించి శారదానందుని ముందర నిడిన వాఁడెప్పటియట్ల 'ససేమిరా' యని పలుకుటయును. | 42 |
క. | సమరముల శత్రునృపతుల | 43 |
వ. | అని శారదానందుండు పలికిన సవర్ణంబు విడిచి "సేమిరా” యనుచుండె ననుటయును. | 44 |
క. | సేతువు జూచిన గంగా | 45 |
వ. | అనుటయు రెండవ యక్షరంబును విడిచి “మిరా" "మిరా” యని పల్కుటయును. | 46 |
క. | మిత్రద్రోహి కృతఘ్నచ | 47 |
వ. | అనిన మూడవయక్షరంబును విడిచి 'రా'యని పల్కుటయును. | 48 |
క. | రాజును రాజకుమారుఁడు | 49 |
వ. | అనిన 'రా' యక్షరంబు విడుచుటయు తోడనే విభ్రాంతి బాసినకుమారునిం జూచి సంతోషచిత్తుండై యితం డడవిలో చేసినపని యెఱిఁగితి రనిన శారదానందుం డిట్లనియె. | 50 |
క. | (దేవ)బ్రాహ్మణభక్తి | 51 |
వ. | శారదానందునకు నమస్కరించి కొనియాడి మంత్రియగు బహుశ్రుతునిం జూచి యిట్లనియె. | 52 |
క. | హితవును బుద్ధియు గలిగిన | 53 |
వ. | అని మంత్రిఁ గొనియాడి శారదానందుని నర్థరాజ్యంబు గైకొనుమనుటయు. | 54 |
క. | యతివరుఁడు రాజయోగ | 55 |
వ. | అని నారదుండు యింక నొక్కయద్భుతంబు వినుమని యబ్బలీంద్రున కిట్లనియె. | 56 |
క. | నరుఁ డెట్టికులజుఁ డైనన్ | 57 |
వ. | అట్లు గావున. | 58 |
క. | మానవనాథుండు బృహ | 59 |
ఆ. | అనిన సంతతియును నాహవజయమును | 60 |
వ. | అతనివలన నీకు శత్రుజయంబును కులాభివృద్ధియు నగునని వరం బిచ్చి శంకరుం డరిగిన ప్రతాపవిషయాధీశ్వరుం డటువంటికన్యకం గాంచి యది యౌవనవతియైన హరుం డానతిచ్చిన దివ్యపురుషుం డెన్నఁడు వచ్చునొకో యని సౌధాగ్రంబున నిడి యుండు నంత. | 61 |
సీ. | కాళింగుఁ డనియెడు కంసాలి యొక్కండు | |
| అనిననిజ................. | 62 |
క. | కాళింగు జూచి నిక్కమె | 63 |
వ. | ఇవ్విధంబు నక్కన్యారత్నంబును భోగింపుచుండునంత. | 64 |
క. | హరి దనకు నల్లుఁ డయ్యెన్ | 65 |
ఆ. | అతనియల్లుఁడైన హరిచేత జచ్చిన | 66 |
సీ. | తనభక్తు ప్రహ్లాదు దండిత ...... | |
తే. | యెవ్వ డెటువంటివాడన్న నవ్విధంబు | 67 |
సీ. | [2]వ్రేపల్లెలోపల గోపకాంతారతి | |
తే. | కాలయవనుని ముచికుందు పాలు చేసి | 68 |
వ. | అని దుఃఖంపుచున్న నతనికూతురు తనపెనిమిటియగు కుహకవిష్ణుపదంబులఁ బడి యేడ్చుచు నిట్లనియె. | 69 |
తే. | అధిప విష్ణుండు తనయల్లుఁ డనుచు నస్మ | 70 |
వ. | అని నతండు ఖిన్నుండై యిట్లని తలంచుచు. | 71 |
క. | తమచేతగాని పనులకు | 72 |
ఉ. | ఏవిధ మాచరింతు నిక నెక్కడికిం జనువాఁడ నెప్పుడుం | 73 |
చ. | హరి జనుదెంచితిన్ నృపతు లాజికి బాసి చనుండ పోవరే | 74 |
క. | అరినృపతుల చరణంబులు | 75 |
వ. | అట్లు చనుదెంచిన బృహత్సేనుఁ డల్లునకు సాష్టాంగదండప్రణామం బొనర్చి యప్పటి యట్ల సేవించుచుండె గావున. | 76 |
క. | దైవము కృపగల దినముల | 77 |
వ. | అని నారదుండు చెప్పిన నబ్బలీంద్రుం డిట్లనియె. | 78 |
ఆ. | విక్రమార్క (భూమి) విభుఁడు బేతాళుని | 79 |
వ. | అనిన నిట్లనియె. | 80 |
సీ. | విక్రమార్కుఁడు జగద్విఖ్యాతసత్కీర్తి | |
తే. | నద్భుతము బొంది ముని దెచ్చునవియు జూడ | 81 |
తే. | వచ్చు కృష్ణచతుర్దశీవాసరమున | 82 |
వ. | అని చనుటయు నారాత్రి యతనికడకుం జని యతని యనుమతి మౌనస్థుండయి దన్నికటవటజటలో దగిలి తలక్రిందయి వ్రేలుచున్న బేతాళునిం బట్టి కట్టి మూపున బెట్టుకొని వచ్చునప్పుడు. | 83 |
క. | బేతాళుఁ డనియె వినుమో | 84 |
వ. | ఆప్రశ్నల కెఱింగి యుత్తరం బీకున్న వజ్రాయుధంబు తలద్రెంచు ననుచు గథ జెప్పదొడఁగె నది యెట్టిదనిన. | 85 |
సీ. | (కర్ణోత్పలం) బనఁగల దొక్కనగరంబు | |
తే. | యంబుకేలి జరింప నయ్యధిపసుతుఁడు | 86 |
వ. | కమలద్వయంబు కర్ణద్వయంబు మోపిపుచ్చి[3] దంతంబుల ఖండించి చరణయుగళంబున వైచి మఱియొక్కకమలంబు కుచంబుల నదిమి కంపించి తలయూచి పురంబున కరిగిన వజ్రమకుటుం డవ్విధంబు సచివపుత్రునకుం జెప్పిన నతం డిట్లనియె. | 87 |
సీ. | శ్రుతుల నంబుజములు సొనుపుట కర్ణోత్స | |
తే. | కంప మొందుట నావెంట గదలుమనుట | 88 |
వ. | చని యొక్కభూసురవృద్ధాంగన గృహంబున వసియించి యది తదంతఃపురవర్తిని యగుట యెఱిఁగి యొక్కనాఁ డాయవ్వం బిల్చి తమవృత్తాంతంబు పద్మావతి కెఱిగింపుమని పంపిన. | 89 |
ఉ. | ఆవిధవాశిరోమణి రయంబున నేఁగి రహస్యవేళ ప | 90 |
క. | యెన్నఁడు నాపై నలుగని | 91 |
వ. | విరహభరాక్రాంతుఁడై యుండ మంత్రిసుతుం డిట్లనియె. | 92 |
తే. | కానుపింపదె శుక్లపక్షంబు పదియు | 93 |
వ. | అనిన నూఱడిల్లి యప్పదిదినంబులు గడపి పదునకొండవనాఁ డెప్పటియు నా విశ్వస్త నొడంబరచి చెప్పుమని పంపిన నది యట్లచేసిన. | 94 |
క. | అమ్మగువ కుంకు మలదుచు | 95 |
తే. | ఎన్ని మాటలు చెప్పిన నియ్యకొనదు | 96 |
వ. | బుద్ధిశరీరుం డిట్లనియె యిట్లేల పరవశుండవైతివి తా రజస్వలను దివసత్రయానంతరంబునం జనుదెమ్మని పట్టించుమనిన నర్ధాంగీకారంబున నుండె నంత. | 97 |
తే. | దివసములు మూడు నరిగిన తెరవగరపె | 98 |
వ. | అరుగుదెంచి అవ్విధంబు జెప్పిరండని యరిగిన మంత్రిసూనుండు రాజకుమారునిం జూపి నీకు నాగమనమార్గంబు నిర్దేసించెననియె నంత. | 99 |
క. | రవి గ్రుంకి మధ్యరాత్రం | 100 |
వ. | ఇవ్విధంబున పద్మావతీపరాయణుండై వజ్రమకుటుండు మంత్రిసుతుండైన బుద్ధిశరీరుని మఱచియుండు నాసమయంబున నొక్కనాఁడు. | 101 |
క. | కులమును నాచారంబును | 102 |
తే. | అనుచు పద్యము లిఖయించి యతివచేత | 103 |
వ. | అనినఁ బద్మావతి యిట్లు బుద్ధిశరీరుని యిన్నిదినంబులుదాక యెఱిఁగింప కిట్లేల చేసితివని భక్తి గలదియును బోలె నొక్కనాఁడు. | 104 |
ఆ. | భవ్యభోజ్యలేహ్యపానీయచోష్యప | 105 |
వ. | అవ్విధంబున వజ్రమకుటు నట్లుగ లిఖించి (?) పద్మావతి హారంబులు పుచ్చికొని స్తనమధ్యంబున నఖక్షతత్రయంబు నిలిపిరమ్మని పత్రిక పంపిన నారాజకుమారుండు అట్ల చేసి యేతెంచుటయును. | 106 |
ఆ. | అంతఁ దెల్లవార నామంత్రిపుత్రుఁడు | 107 |
దోదకము: | అంగడిహారము లమ్మెదననుచున్ | 108 |
క. | మీభూపతి యరుదెంచిన | 109 |
సీ. | వచ్చి యీభావంబు వచియింపు మనవుండు | |
తే. | కంటి గనుగొందు నురమున గానవచ్చు | 110 |
ఆ. | దంతఘాటకుండు తనయకు దుఃఖంచి | 111 |
వ. | బుద్ధిశరీరుండు స్వామిహితంబునకు గపటంబు చేసిన దోషంబు లేదు అవిచారంబున నారాజు ప్రధానినందనను వెళ్ళగొట్టించెం గావున నాప్రధానమరణదోషంబు రాజునకు ప్రాప్తం బగునని పలికిన మరలి వటంబునకు బరచి యప్పటియట్ల వ్రేలుచున్న నివ్విక్రమార్కుఁడు. | 112 |
క. | వెంటనె చని బేతాళుని | 113 |
సీ. | బ్రహ్మశంఖాగ్రహారంబువ నగ్నిషో | 114 |
తే. | యొకడు దేశాంత్రియై చని యొక్కవివ్రు | 115 |
క. | శిశుహంతవు నీగృహమున | 116 |
క. | ఈసంజీవని నాకి | 117 |
ఆ. | అట్లు చేరి తొల్లి యచ్చట గాపున్న | 118 |
క. | మువ్వురు తమతమ సతియని | 119 |
తే. | అస్థి గొని చన్నవాఁడు తదాత్మజుండు | 120 |
వ. | పట్టితెచ్చు నెడ నిట్లనియె. | 121 |
సీ. | వాలిపుత్రాఖ్యమౌ పట్టణమ్మునను వి | |
| నాగతాతీతమనాగతంబు నెఱింగి | |
తే. | కాంతయనుకన్య యనుచు శుకంబు చెప్పె | 122 |
వ. | నాచంద్రప్రభయుం బరాక్రమకేసరియుం క్రీడాగృహంబున రతి(పరాయ)ణులై యున్న సమయంబునఁ బంజరద్వయంబుననున్న కీరద్వయంబునందు రాచిలుక శారికం జూచి యిట్లనియె. | 123 |
ఉ. | ఊరక యేలయుండ మనమో శుకరత్నమ యస్మదీయసం | 124 |
వ. | అని విడనాడిన కీరంబు శారికం జూచి యిట్లనియె. | 125 |
చ. | తరుణుల నమ్మవచ్చునె వృథాకలహాత్మలు కల్మషక్రియా | 126 |
క. | అని యిరువురు వాదడవఁగ | 127 |
సీ. | అంతిపురంబున నర్ధరథుండను | |
ఆ. | ....................... | 128 |
ఆ. | కొడుకు మారుగాఁగ గోరి నాయింటిలో | 129 |
వ. | అల్లునిం గూఁతును ననేకవస్త్రాభరణభూషితులఁ జేసి యొక్కదాసి నిచ్చి యనిపిన పత్నీసహితుండై చనుచుండి యొకగహనమధ్యంబున నయ్యాభరణంబు లన్నియుం బుచ్చుకొని తనభార్యను నద్దాసిని నొక్కప్రానూఁతం బడండ్రోచి యెందేనియుం జనుటయు. | 130 |
క. | ఇరువురును మొఱలువెట్టగఁ | 131 |
వ. | ఆవైశ్యకన్యకయుఁ బధికులంగూడి పితృగృహంబున కేతెంచినం దలితండ్రు లాశ్చరచిత్తులై పోయివచ్చిన తెఱం గెరిగింపు మనిన నిట్లనియె. | 132 |
క. | నట్టడవిలోన మమ్మున్ | 133 |
వ. | అనిన నల్లుండు చోరులచేతఁ దగులువడుటం జేసి వణిజుండు దుఃఖంబున నుండినంత గొన్నిదినంబులకు నాసొమ్మంతయు వెచ్చించి ధనవంతుఁడు తనమామకుఁ గూఁతురు చావు చెప్పి తత్పరలోకక్రియార్థంబు కొంతధనమ్ము పుచ్చుకోదలచి మామగృహంబుసకు వచ్చునపుడు. | 134 |
ఆ. | ఇంటిలోన మెలఁగు నిందునిభాననఁ | 135 |
వ. | మామయు నల్లునిరాకకు సంతోషించి తొల్లిటియట్ల కలపుకొని యుండునంత. | 136 |
క. | కొన్నిదినము లరుగ నన్నీచవర్తనుం | 137 |
వ. | అనినరాజకుమారుండు తనకీరంబు జూచి నీ వేమి చెప్పెద ననిన నచ్చిలుక యిట్లనియె. | 138 |
సీ. | హర్షపురంబున కధిపతి ధర్ముండు | |
తే. | లల్లు నొద్దకుఁ గూఁతును ననుపుటయును | 139 |
వ. | ఉద్యానంబు ప్రవేశించు నంతకుమున్న యవ్విప్రునిం జోరులు మక్కించినం గొనప్రాణములతోనున్న విప్రకుమారుని గౌఁగిలించుకొని చుంబింపంబోయిన నతండు ముక్కు గరుచుకొని మరణంబు నొందిన నింటికి వచ్చి మగండు ముక్కు గోసెనని కుయ్యువెట్టుటయును. | 140 |
క. | నేరం బెఱుఁగని మత్సుత | 141 |
ఆ. | దొంగ నృపతి కనియె దోషి గాఁ డీతఁడు | 142 |
వ. | అని విప్రశవవదనంబు చూపిన భూరమణుండు గోపించి యజ్జారిణికి గర్ణచ్ఛేదనంబునుం జేయించి యాచోరుణికిం దళవాయిపట్టంబు నిచ్చెనని కీరద్వయంబునుం గథలు చెప్పి శాపముక్తులై చనిరి. స్త్రీపురుషులలో పాపం బెవ్వఁరిదని యడిగిన. | 143 |
క. | వనితలకు సాహసంబును | 144 |
వ. | పురుషుండు పాపభీరుం డయ్యును పాపంబునకు జొచ్చెం గావున పురుషుం బేతాళుం డెప్పటియ ట్లన్యగ్రోధంబు నాశ్రయించిన పట్టితెచ్చునెడ నిట్లనియె. | 145 |
సీ. | శరభాంకపురి యేలు శౌద్రకుండను రాజు | |
తే. | యున్నరూకలు నూటగృహోచితంబు | 146 |
వ. | అంత నొక్కనా డర్ధరాత్రసమయంబున. | 147 |
లయవిభాతి: | మెఱుపులును నుఱుములును దఱచు వడగండ్ల | 148 |
మత్తకోకిల: | భూత మొక్కటి యూరివెలుపల భోరుభోరున నేడువన్ | 149 |
తే. | పురము బహిరంగణంబునఁ బొలఁతియొకతె | 150 |
వ. | ఏ నీశూద్రకభూపాలు భుజంబున వసించిన భూదేవిని యతండు మూడుదినంబులకు మృతుండు కాఁగలఁడు. ఇతనిపిదప నన్యు నాశ్రయింపనొల్లక యేడ్చెదననిన వీరవరుం డిట్లనియె. | 151 |
క. | ఈతం డతిదీర్ఘాయురు | 152 |
తే. | ఈ మహాశక్తికిని భవదీయసుతుని | 153 |
వ. | పుత్రునిం దోడ్కొని యరగువాని తల్లియుం జెల్లెలును తోడనె యరుదేర నమ్మహాశక్తి గుడి కరిగి యిట్లని స్తుతియించె. | 154 |
వనమయూరము: | అంబికృపాత్మ (జగదంబ) శుభమూర్తీ | 155 |
వ. | అని కరవాలంబున కంఠంబు దునిమినం దల్లియును సహోదరమరణంబు సహింపనోపక చెల్లెలును ప్రాణంబులు విడిచిన నవ్వీరవరుండు. | 155 |
క. | కరవాలధారచే దన | 156 |
ఆ. | ఇట్టి బంటు లేని యీ రాజ్య మేటికి | 157 |
వ. | ఈ శూద్రకుండును వా రెఱుఁగకుండ నాత్మసదనంబునకుం జనియె వీరవరుండును ఆమువ్వుర (నింటి కనిపి తాను) భూపతిద్వారంబు గాచికొని యుండునంత ప్రభాతం బగుటయును. | 158 |
క. | వీరవరు జూచి శూద్రకుఁ | 159 |
వ. | అతనివలన సంతోషించి యారాత్రివృత్తాంతంబు నమాత్యుల కెఱంగించి యతనికి మఱియు ననేకపదార్థంబు లిచ్చి (పుచ్చి రాజ్యమ్ము సేయు)చుండె నని చెప్పి బేతాళుం డిట్లనియె. | 160 |
క. | ఈ యేవురిలో సాహస | 161 |
వ. | ఎప్పటియట్ల తిఱిగి పరచినం బ్రతిక్రమ్మరం దెచ్చిన బేతాళుం డిట్ల యంగదేశాధిపతి(కడకు) విష్ణుస్వామి యనునతనిసుతులు ముగ్గురు వివేకనిధానులు గొలువంబోయిన మీ రేమిటి కెఱుఁగుదు రనిన భోజనశయనారీవారిసంగుల మనిన నభ్బూవరుండు. | 162 |
క. | భోజనసంగునకును దగు | 163 |
వ. | (భూపాలుండు) వీని పరీక్షించునపుడు స్మశానక్షేత్రంబున పండినధాన్యం బని యెఱింగి సంతోషించె మఱియును. | 164 |
క. | నారీసంగునికడ కొక | 183 |
వ. | ..........భూపాలుండు పరామరిశించునపుడు, మేకచన్ను గుడిచి పెఱిగినదని విని విస్మితుండయ్యె మఱియును. | 166 |
క. | శయ్యాసంగున కొకమృదు | 167 |
చ. | ఆభూపాలుండు వానిశరీరంబుననున్న తదీయలాంఛనంబు చూచి మువ్వుర సంతోషించి యేలె, మువ్వురియందును సుకుమార వివేకు లెవ్వరని యడిగిన విక్రమార్కుం డిట్లనియె. | 168 |
క. | వనితాసంగుండును భో | 169 |
క. | పుట మెగసి మూ పుడిగి య | 170 |
వ. | అది యెట్టి దనిన. | 171 |
సీ. | ఉజ్జయినీపురి నొక్కవిప్రుఁడు హరి | |
ఆ. | నిత్త మనుచు వారి నింటికి గొనివచ్చి | 172 |
క. | ఇవ్విధమున మువ్వురు నా | 173 |
వ. | ఇట్లు వోయిం జననీజనకసహోదర లతిదుఃఖతులయిన జ్ఞాని తదీయమార్గం బెఱింగించె విజ్ఞాని రథ మలవరించె నంత. | 174 |
క. | శూరుఁడు రథ మెక్కి మహా | 175 |
వ. | తిరిగినం బట్టి తెచ్చు నెడ నిట్లనియె, మాలావతీపురంబున ధవళుం డనురజకుండు కోడలిం దోడితేర కొడుకుం బంపిన నతం డత్తవారింటికిం జని తత్సహోదరుం డనుప రా, భార్య ననిపించుకొని వచ్చు నప్పుడు. | 176 |
చ. | తెరువున నున్న దుర్గ గని దేవికి మ్రొక్కిన మొక్కు దీర్ప భీ | 177 |
క. | మెచ్చితి బతిఁసోదరులకు | 178 |
క. | పెనిమిటితల, యనుజునకును | 179 |
వ. | అని యడిగిన "సర్వస్యగాత్రస్యశిరః ప్రధానం" బను వాక్యంబు గలదు గావున శిరంబున్నవాఁడె యింతికి వరుం డగునని బేతాళుం డెప్పటియట్ల చనినం బట్టి తెచ్చునెడ నిట్లనియె. | 180 |
సీ. | రమణఁ బ్రలిప్తపురం బేలుచుండు సిం | |
తే. | గాలనేమితనూజ పాతాళసిద్ధ | 181 |
క. | కల మెక్కి యరిగి, భీకర | 182 |
క. | ఉపకారపరునకునుఁ బ్ర | 189 |
వ. | అట్లు గావున నిందు నెవ్వరి దుపకారం బనిన నిష్కారణం బుపకారంబు చేసిన కిరాతుం డధికుం డనిన నెప్పటియట్ల బేతాళుండు వటవిటపికిం జనిన బట్టితెచ్చు సమయంబున నిట్లనియె. | 184 |
సీ. | లక్షణపుర మేలు లఘుభుజుండను రాజు | |
ఆ. | యరుగుదేరఁ బథము కడ్డమై మంచము | 185 |
క. | అది యెత్తివైచికొనుచుం | 186 |
వనమయూరము: | ఏమిటికి నవ్వితి మహీశ! యని పల్కన్ | 187 |
ఆ. | చెప్పకున్న నీవు జీవంబువిడుతువు | 188 |
వ. | అని స్మశానంబునం జితి బేర్పించుకొని యందుమీఁదం బవ్వళించి పత్ని కెఱింగించి ప్రాణంబు విడిచెద నను సమయంబున. | 189 |
తే. | ఒక్కచింబోతు తనమేక నుపచరించి | 190 |
క. | మతి నెఱిఁగి భూమిపాలుఁడు | 191 |
వ. | ఇమ్మేషనృపతులలో నెవ్వరు వివేకు లనిన తిర్యగ్జంతువయ్యును చింబోతు స్త్రీమోహంబు విడిచెం గావున నదియె వివేకి యనిన బేతాళుం డెప్పటియట్ల వటంబునకుం జనుటయును. | 192 |
ఆ. | అవనినాథుఁ డెప్పటట్లనే కొనితేర | 198 |
సీ. | ధనదత్తుఁడను వైశ్యు తనయను మదనస | |
ఆ. | మనిన నాఁటిరాత్రి యది పతి గదిసినఁ | 194 |
క. | తనవర్తనంబు దొంగకు | 195 |
ఉ. | వచ్చిన, కాంతఁ జూచి యిటు వత్తురె నాథుని డించి యన్న నీ | 196 |
క. | వాఁడును సూనృతయగు పూఁ | 197 |
క. | మువ్వురిలోపల నధికుం | 198 |
వ. | తిరిగి వటంబునకుం బారిన పట్టితెచ్చునెడ, బేతాళుం డిట్లనియె. | 199 |
సీ. | ధారాపురంబున ధర్మధ్వజుండను | |
తే. | కోమలంబైన తనువు దేకొమ్మ యనిన | 200 |
వ. | బేతాళుండు న్యగ్రోధంబున కరిగినతోఁడనే పారిపట్టితెచ్చునెడ విక్రమార్కున కిట్లనియె. | 201 |
సీ. | రత్నకాంచీపురిరాజు యశఃకేతు | |
తే. | పొత్తునకు రాక తా నన్నభుక్తిఁ గొనక | 202 |
క. | అది గావున నను గైకొను | 203 |
వ. | అమ్మంత్రి మరణంబునకు గారణం బెద్ది యనిన విక్రమార్కుం డిట్లనియె. | 204 |
క. | ఆదివ్యకాంతఁ గలసిన | 205 |
వ. | అనవుండు. | 206 |
క. | భుజము డిగి దానవుఁడు వట | 207 |
వనమయూరము: | శ్రీమెరయ వార(ణసి సీమ గల వేద) | 208 |
ఇంద్రవజ్రము: | గంధర్వుఁ డక్కామినిఁ గాంచి బాహా | 209 |
తోటకము: | ధరణీసురుఁ డత్తరి నొక్క(పురిన్) | 210 |
ఆ. | పాము జేరుటయను పాఱుండు భిక్షంబు | 211 |
వ. | భిక్షంబువెట్టిన గృహిణించూచి గృహస్థు నీ వావిప్రుని కేమి పెవెట్టితివో యతండు చచ్చె నీముఖంబు చూడ దోషం బని భార్యను వెడలంగొట్టె నాబ్రహ్మహత్య యెవ్వరి దని యడుగుటయును. | 212 |
క. | దోషంబు లేని యాని | 213 |
వ. | కావున దోషం బొకని కాపాదించినవానికి దోషంబు దగులుననిన బేతాళుం డెప్పటియట్ల మఱ్ఱికిం జనిన విక్రమార్కుండు చనిపట్టితెచ్చుసమయంబు నొక్కకథ వినుమని యిట్లనియె. | 214 |
సీ. | వీరకేతుం డనువిభుఁ డేలుతఱి నయో | |
ఆ. | యనిన మరునిచేత నటు చచ్చుకంటెను | 215 |
క. | వారిజముఖి జనకునకునుఁ | 216 |
క. | జనపతి సమ్ముఖమునకుం | 217 |
తే. | కొఱ్ఱు వాతించి తస్కరుఁ గొఱఁత వేయ | 218 |
తే. | అతనిప్రాణంబు గృపచేసి హరుఁడు చనియెఁ | 219 |
క. | ధనమెంత తనకు నిచ్చిన | 220 |
వ. | ఎప్పటియట్ల తిరిగి పరచినం బట్టితెచ్చునెడ బేతాళుఁ డిట్లనియె. | 221 |
సీ. | నేపాళదేశమహీపతియగు కీర్తి | |
తే. | యొ(కఁడు ఘు)టి కిచ్చి విప్రుని నువిద జేసి | 222 |
క. | ఆరాజన్యుఁడు నాత్మకు | 223 |
వ. | అంత నారాజకుమారికయు గర్భిణియైన నాలోన. | 224 |
ఆ. | మంత్రిసుతుఁడు రాజమందిరంబున నొక్క | 225 |
క. | ఆమంత్రిసుతుఁడు కృత్రిమ | 226 |
ఆ. | అతఁడు తీర్థయాత్ర యరిగినన దత్పూర్వ | 227 |
వ. | అంత నమ్మూలదేవుండను సిద్ధయోగి కపటశిష్యునిం దెచ్చి రాజునకుం జూపి మత్పుత్రిని నితనికి వివాహంబు సేయవలయు దెప్పించుమనిన భూపాలుండు. | 228 |
క. | ఆమూలయోగి పెట్టిన | 229 |
వ. | అతఁ డక్కాంత దోడ్కొని గృహంబునకు వచ్చుటయును. | 230 |
తే. | పడఁతి నని మున్ను సతికి గర్భంబు చేసి | 231 |
వ. | జగడంబు దీర్పలేడయ్యె నది యెవ్వరిసతి యగు ననిన విక్రమార్కుం డిట్లనియె. | 232 |
క. | తలిదండ్రు లీక వనితన్ | 233 |
వ. | అనిన నెప్పటియట్ల వటంబునకుం జారిన పట్టితెచ్చుసమయంబున నొక్కకథ వినుమని యిట్లనియె. | 234 |
ఉ. | యాచకనూత్నమేఘుఁడు సమంచితమానధనుండు గాఢబా | 235 |
వ. | ఆగంధర్వశేఖరుండు కామగమనంబైన(?) విమానారూఢుండై లోకములం జరియించుచుండుకాలంబున. | 236 |
క. | గరుడుం డుద్ధతబలుఁడై | 237 |
వ. | అంత నొక్కనాఁడు. | 238 |
ఆ. | శంఖచూడుఁడనెడు సర్పకుమారుండు | 239 |
వ. | తదీయజనని దుఃఖావేశంబున నిట్లని తలంచు. | 240 |
క. | ఒక నేత్రము నేత్రంబే | 241 |
వ. | అని విలాపించుసమయంబున జీమూతవాహనుండు మార్గవశంబున నచ్చటికిం జనుదెంచి దయాళుండై యప్పుడు. | 242 |
ఆ. | శంఖచూడుఁ దిగిచి సౌపర్ణుముందట | 243 |
చ. | వలదని శంఖచూడఫణి వారణ సేయఁగ మేఘవాహు ను | 244 |
క. | ఆతని యుదారమహిమకుఁ | 245 |
క. | మెచ్చితి నంబుదవాహన | 246 |
వ. | అనిన నిచ్చితినని గరుడుండు యధేచ్ఛం జనియె గరుడ జీమూతవాహనులలో నెవ్వం డధికుం డనిన విక్రమార్కుం డిట్లనియె. | 247 |
ఆ. | అధికదాతయైన యంబుదవాహనుఁ | 248 |
వ. | అనినం బరచినం బట్టితెచ్చునెడ నిట్లనియె. | 249 |
సీ. | కనకపురంబునఁ గలఁడు విశారదుం | |
ఆ. | పెండ్లియాడుటయును బృథివీశుఁ డొక్కనాఁ | 250 |
వ. | కైకొనక విరహతాపంబునం బ్రాణంబువిడిచె నమ్మంత్రియుం దనస్వామి మృతుండయ్యెనని తానును నట్లయయ్యె వీరిలోన నధికుం డెవ్వఁ డనిన విక్రమార్కుం డిట్లనియె. | 251 |
క. | చక్కనిదైనను గుణములు | 252 |
వ. | అట్లు గావున రా జెక్కుఁడనిన బేతాళుం డెప్పటియట్ల న్యగ్రోధంబున కరిగినం బట్టితెచ్చుసమయంబునఁ గథ వినుమని యిట్లనియె. | 253 |
ఆ. | పుష్పపురమునందు భూసురుండొక్కఁడు | 254 |
వ. | ఒక్కపురంబు నిర్మించి యొక్కబాలిక చేత నన్నము పెట్టించినం దృప్తుండై యయ్యోగీంద్రున కిట్లనియె. | 255 |
క. | ఈవిద్య నాకు నొసఁగుము | 256 |
వ. | తదీయోపదేశక్రమంబున జలంబులు చొచ్చి జపంబు సేయుచు ధ్యాననిద్రావశంబునఁ దా వివాహంబై పుత్రులం గాంచి ముద్దాడుచున్నాఁడని కలగాంచి జలంబులు వెలువడివచ్చి యప్పుడు. | 257 |
క. | అనలంబుఁ జొచ్చి భార్యయుఁ | 258 |
వ. | అయ్యోగీశ్వరుండు చింతింపుచుండె నిది సఫలంబుగాని కారణం బేమి యనిన విక్రమార్కుం డిట్లనియె. | 259 |
క. | జపములు జేసెడువారును | 260 |
వ. | అనిన నెప్పటియట్ల వటమునకు నరిగిన బేతాళుని బట్టి కట్టికొని తెచ్చునప్పుడు విక్రమార్కునకుఁ గథ వినుమని యిట్లనియె. | 261 |
ఆ. | ఒక్కవైశ్యుతనయ యుత్పలదళనేత్ర | 262 |
క. | సంతానము సుఖహేతువు | 263 |
వ. | అని కించిత్ప్రాణావశేషుండైన తస్కరుం డక్కన్య తల్లికిం గన్నుదనియధనంబు తననిక్షేపంబు నిచ్చి దానిఁ దా వరియించినవాఁడై యిట్లనియె. | 264 |
ఆ. | సూర్యదీప్తిపురము చొచ్చి మత్సఖుఁడైన | 265 |
వ. | అని చోరుండు ప్రాణంబు విడిచె దల్లియుం గూఁతురు ధనంబు గైకొని తత్సఖుగృహంబునకు వచ్చియుండునంత నొక్కనాఁడు కూతుం జూచి విప్రునివలన సంతానంబు వడయుమనిన సమ్మతిలకున్న నిట్లనియె. | 266 |
క. | వరుని యనుజ్ఞను వేఱొక | 267 |
వ. | అని యొడంబరచుటయును. | 268 |
క. | హేమస్వామి యనంగను | 269 |
క. | వనపాలకుచే విని య | 270 |
వ. | అంతఁ గొంతకాలంబున కారాజు మృతుండైన నక్కుమారుండు. | 271 |
ఆ. | గయను పిండ మిడుచు గంగ నస్థులు నిల్ప | 272 |
వ. | అని తలఁచి గయకుం జని పిండప్రదానంబు సేయు నప్పుడు. | 273 |
క. | హస్తములు పిండభుక్తికి | 274 |
వ. | ఇందు నెవ్వరిహస్తంబునఁ బిండం బిడవలయుననిన విక్రమార్కుం డిట్లనియె. | 275 |
ఆ. | పోషకుండు భూమిభుజుఁడు గూఢాచారి | 276 |
వ. | అనిన బేతాళుం డరిగి పరచినఁ బట్టి కట్టితెచ్చుచో నొక్కకథ వినుమని యిట్లనియె. | 277 |
సీ. | చిత్రకూటం బేలు క్షితిపతి యొకనాఁడు | |
| గుంజరాశన[10]తరుకుంజాంతరంబున | |
ఆ. | మిట్లు సేయకున్న నిప్పుడె భక్షింతు | 278 |
వ. | ఇచ్చి తదీయజననీజనకులచేత శిరఃపదంబులు వట్టించి ఖడ్గం బెత్తి వేయ డగ్గరిన నవ్విప్రకుమారుండు నవ్వె నేమిటికిం జెప్పుమనిన విక్రమార్కుం డిట్టులనియె. | 279 |
ఆ. | తల్లిదండ్రు లలర ధరణీశుచేఁ దెగ | 280 |
వ. | ఎప్పటియట్ల పట్టితెచ్చునెడ నొకకథ వినుమని యిట్లనియె. | 281 |
ఆ. | వసుధ నొక్కపురము వైశ్యుండు తనకూఁతు | 282 |
క. | మామ నొడఁబరచి తనప్రియ | 283 |
క. | సతి ననుపు మనుచు వచ్చిన | 284 |
ఆ. | భూమిసురుఁడు వైశ్యపుత్రియు సమరతిఁ | 285 |
వ. | అనిన బేతాళుం డెప్పటియట్ల చనినఁ బట్టితెచ్చునెడ నొకకథ వినుమని యిట్లనియె. | 286 |
సీ. | బ్రహ్మస్థ లాగ్రహారమున విష్ణుస్వామి | |
తే. | డిట్లు నలువురు దమవిద్య లెఱుఁగుకొరకు | 287 |
వ. | అన నిట్లనియె. | 288 |
క. | హీనమతు లెందఱైనను | 289 |
వ. | అట్లు గావున ప్రాణంబు వోసిన విప్రుసకు పాపంబు దగులుననిన దిరిగిచనినం బట్టితెచ్చునెడ నొక్కకథ వినుమని బేతాళుం డిట్లనియె. | 290 |
సీ. | యజ్ఞశూలంబను నగ్రహారంబున | |
తే. | తపసి యేటికి నేడ్చె నృత్యంబు సలిపె | 291 |
వ. | బాలశరీరంబు చొచ్చి భోగింపఁగలిగెనని సంతసంబున నటియించె ననిన బేతాళుం డెప్పటియట్ల చనినం బట్టితెచ్చుసమయంబున నిట్లనియె. | 292 |
సీ. | తామ్రశేఖరమనఁ దనరు పురంబున | |
తే. | యరుగుచో సుమ యనియెడు నాఁటదొకతె | 293 |
తే. | కందుకావతి యాగుడికడనె యుండ | 294 |
వ. | వైశ్యుం డధముండని వానిఁ గలయరోసి ప్రాణంబు విడిచిన వైశ్యుండును దనధనంబు రా జపహరించునని దానంబుచేసి యర్థనాశం బయ్యెనని చచ్చె నంత. | 295 |
ఆ. | ఇందురేఖ మఱచి కందుక మఱచు ట | 296 |
వ. | వీరిలో నెవ్వరిమరణం బధికం బనిన విక్రమార్కుం డిట్లనియె. | 297 |
| .......................... | 298 |
వ. | అనిన బేతాళుండు తిరిగిపరచినం బట్టితెచ్చునెడ నొక్కకథ వినుమని యిట్లనియె. | 299 |
సీ. | జనపతి యొకఁడు రాజ్యభ్రష్టుఁడై తన | |
తే. | గోరఁ బదములు పెద్దవి కూఁతునకును | 300 |
క. | తెలియక భూపతి యూరక | 301 |
తే. | వీని నమ్మకు కపటాత్ము వీఁడు నిన్ను | 302 |
క. | భూతలగతిఁ గొనిచన న | 303 |
క. | ఏలాగునఁ బెట్టుదునన | 304 |
వ. | మెచ్చి యాతని సాహసౌదార్యగుణకీర్తు లాచంద్రార్కంబుగా వరం బిచ్చి యనిపినఁ బురంబున కరిగె బేతాళుండును శాపముక్తుండై చనియె ననిన బలీంద్రుండు నారదున కిట్లనియె. | 305 |
క. | శాపం బెవ్వరివలనం | 306 |
తే. | అది ప్రకాశిత మైన నయ్యభవుఁ డెఱిఁగి | 307 |
వ. | అని నారదుం డింక నొక్కకథ వినమని యిట్లనియె. | 308 |
మ. | రవివంశంబున నుద్భవించి లవణే(రావత్తదంత)క్షమా | 309 |
క. | ఆరాజు మంత్రివర్యుఁడు | 310 |
ఆ. | వసుమతీశుఁ డాత్మవల్లభ యగురత్న | 311 |
క. | ఏకరసమత్తుఁ డయ్యెన్ | 312 |
సీ. | పనిచిన వారు వేచనివచ్చి వినిపించి | |
ఆ. | బాంధవంబు దలఁచి బలములఁ దోడుగా | 313 |
వ. | భాగురాయణుం డక్కుమారుని వెంటనిడుకొని యక్కన్యం బొందినవాఁడు సార్వభౌముం డగునని విన్నవాఁడు గావున రహస్యంబు వెలిఫుచ్చకయుండి యొక్కనాఁడు. | 314 |
క. | ఆరత్నసుందరీపరి | 315 |
వ. | రత్నసుందరికడకుం జని యిట్లనియె. మీ పినతల్లికొడుకు మృగాంకవర్మ తండ్రిపంపునం జనుదెంచి భాగురాయణి యింట నున్నాఁడని చెప్పి యామెయనుమతి వడసి తిరిగివచ్చి భాగురాయణి కెఱింగించుటయును. | 316 |
శా. | అమ్మంత్రీశుఁడు రాజమందిరములో హర్మ్యయంబు గట్టించి య | 317 |
వ. | వర్తింపుచుండ భాగురాయణి మేనల్లుఁడయిన సోమదత్తుండనువాఁ డంత నొక్కనాఁడు మామకు నీతికథలు వినుపింవుచు నిట్లనియె. | 318 |
ఆ. | కాంచి వైశ్యు డొండు సంచిబియ్యము వట్టి | 319 |
వ. | నిప్పచ్చకుండను కోమటిభార్య తైలంబు బోసెదనని వానిం బిలిచి పళ్ళెరంబున బియ్యంబు గొల్చికొని తానును నాపళ్ళెరంబుననే నూనె గొలిచి లాభంబు వొందె గావున. | 320 |
క. | వెలఁదులకు నరులకంటెను | 321 |
ఆ. | బుద్ధి గలుగవలయుఁ బురుషున కదియుఁ ద | 322 |
వ. | అదియెట్లనిన. | 323 |
క. | దక్షుఁడను విప్రుఁ డొకతెను | 324 |
క. | అది జపముతోఁడి మ్రొక్కని | 325 |
క. | తమకార్యము నడపెడును | 326 |
వ. | అది యెట్లనిన. | 327 |
సీ. | పీఠికాపురమున బింబోష్ఠిచతురిక | |
తే. | గలఁడు వాఁ డొక్కనాఁడు తత్కాముకులను | 328 |
క. | వారిజముఖి తనమీఁదనె | 329 |
సీ. | కౌఁగి లొక్కని కిచ్చుఁ గామించు నొక్కని | |
తే. | తడవు నొక్కని మనమునఁ దలఁచు నొకని | 330 |
క. | పెక్కుబొజుంగుల మెలఁపిన | 331 |
శా. | సాక్షా న్మన్మథుఁ గూడి యిష్టగతులన్ సంభోగముల్ సల్పినం | 332 |
వ. | అట్లు గావున ధనంబుదక్క దక్కినమోహంబులు లేవనిన విప్రుండు నవ్వుచుం జనియె నంత. | 333 |
సీ. | జనపతిచెలికాఁడు చారాయణుఁడు రత్న | |
తే. | వీరిజగడంబు మాన్ప నెవ్వారితరము | 334 |
వ. | అది యెట్లనిన. | 335 |
ఆ. | గంధదంతి యుకటి కాసారతటమునఁ | 336 |
శా. | కాసారంబు గలంచి వారిరుహసంఘాతంబు భేదించి త | 337 |
వ. | అనిన మఱియొక ర్తిట్లనియె. | 338 |
క. | అధములకైనను గలహపు | 339 |
వ. | అది యెట్లనిన. | 340 |
సీ. | బోయ యొక్కఁడు లాటపురవీధిఁ దేనియ | |
తే. | నాఖుభుక్కునుఁ బెంచిన యతఁడు కుక్క | 341 |
క. | క్షితిపతి పో రుడుపఁగఁ దా | 342 |
క. | పలువురు గలహము సేయఁగ | 343 |
వ. | అట్లు గావున మన మచ్చట నుండవలదని ప్రధాని కవ్విధం బెఱిఁగించుటయును. | 344 |
ఆ. | సచివశేఖరుండు చాగణరాయనిఁ | 345 |
విలసితము: | కపటసఖ్యమునుఁ గామినితోఁడన్ | 346 |
వ. | అంత నొక్కనాఁడు. | 347 |
ఆ. | తనదుపుత్రుఁ డనుచు దాసిపుత్రునిఁ దెచ్చి | 348 |
వ. | ఉన్నయవసరంబున నడుగులం బడి తనమానభంగంబు విన్నవించిన నూరకున్న నది రాజకృత్యంబని కోపించి రత్నసుందరి యతఃపురంబున కరిగిన నక్కేయూరబాహుండు విరహభ్రాంతచిత్తుండై మధ్యమకుడ్యకుహరస్తంభవేదికాస్థలంబున విచారనిద్రాలసుండై యున్న సమయంబున నిద్దఱుదూతికలు తమలో నిట్లనిరి. | 349 |
క. | చారాయణుండు మెల్లన | 350 |
వ. | అనిన మఱి రెండవ దిట్లనియె. | 351 |
ఆ. | చేరఁదగనివానిఁ జేరుచుకొన్నను | 352 |
వ. | అది యెట్లనిన. | 353 |
ఆ. | చిత్రకూటనగము(శిఖరము)నందును | 354 |
వ. | కాలక్రమంబునం బెరిగి యూడలుదట్టి భూస్థలంబువమోఁచి యుండుటయును. | 355 |
ఆ. | ఒక్కబోయ యెక్కి యురియొడ్డి హంసలఁ | 356 |
వ. | అనిమఱియు నిట్లనియె. | 357 |
క. | అతివినయం బత్యంతము | 358 |
వ. | అది యెట్లనిన. | 359 |
సీ. | ఒక్కబ్రాహ్మణుపత్ని యుత్పలదళనేత్ర | |
తే. | నూరి కరిగెద ననుచు నయ్యువిద యెఱుఁగ | 360 |
వ. | అని సల్లాపంబులు సేయుచు మఱియొకర్తి యిట్లనియె. | 361 |
క. | అవివేకి పొందుకంటెను | 362 |
వ. | అది యెట్లనిన. | 363 |
ఆ. | బందుగుండు రాఁగ బ్రాహ్మణుఁడొక్కండు | 364 |
వ. | ఒక్కయమూల్యం బైనరత్నం బొసంగి పొమ్మని యనిపిన నతం డారత్నంబు మ్రింగి పయనంబై పోవ నొక్కపాటచ్చరుం డెఱింగి పథంబున బ్రాహ్మణు వధియించి రత్నం బపహరింతునని వెంటనె చనుచున్న చోరుండు బ్రాహ్మణుం జూచి యిట్లనియె. | 365 |
ఆ. | నీవు మ్రింగినట్టి నిర్మలరత్నంబు | 366 |
క. | నీకడువు రత్నదశకము | 367 |
వ. | ఇరువురిమాటలు విని దొంగం జంపి పదిరత్నంబులును, బ్రాహ్మణుఁ జంపి రత్నంబునుం బుచ్చుకొందమని యాయిద్దఱినిం బట్టికొనుటయు. | 368 |
క. | తనచావు దప్ప దీబ్రా | 369 |
వ. | అని తలంచి యచ్చోరుండు దొంగలతో నిట్లనియె. | 370 |
ఆ. | బ్రాహ్మణుండు నాకు బావ నేమఱఁదిని | 371 |
క. | మఱి విప్రుఁ జంపుడనఁ ద | 372 |
క. | అవివేకి చెలిమికంటెను | 373 |
వ. | అది యెట్లనిన. | 374 |
సీ. | ఒకనాఁడు నృపతి వేఁటకు నేఁగి మర్కట | |
| ఖండనము చేయుమనిన నక్కపియు నట్ల | 375 |
వ. | అట్లు గావున. | 376 |
క. | అవివేకి చెలిమికంటెను | 377 |
వ. | అట్లు గావున నవివేకియైన మేఖలతోఁడిపొందు చారాయణునికి[14] వలదని చెప్పుకొని రంత. | 378 |
ఆ. | భాగురాయణుండు పనిచెం గళావతి | 379 |
సీ. | అల్లనఁ దోకొని యరిగి భూపతి నిద్ర | |
తే. | నామృగాంకయు నటువలె నాచరించి | 380 |
వ. | అంత ప్రభాతంబైన సర్వసఖుండైన చారాయణుని రప్పించి రాత్రివృత్తాంతం బెఱంగించిన నతం డిట్లనియె. | 381 |
మాలిని: | లాటనరేశ్వరపుత్రుఁడు గా దది లక్షణభార్యవిశేషలస | 382 |
వ. | భాగురాయణుండు కళావతిం బిలిపించి రత్నసుందరికి హితుండునుఁ బోలె మేఖలామానభంగంబునకుం బ్రతీకారంబుగా మృగాంకవర్మను నాడురూవు గాఁబన్ని కేయూరబాహునకుం బెండ్లి జేయుదమని రత్నసుందరికి వినుపింపుమని పంచుటయును. | 383 |
క. | అది పోయి యట్ల చెప్పిన | 384 |
క. | తనయుఁడని మున్ను మీ యొ | 385 |
క. | అని లేఖఁ ౙదువ నాసతి | 386 |
వ. | అని రత్నసుందరి ధైర్యంబవలంబించియుండెఁ గావున. | 387 |
క. | రాజును రాష్ట్రము నిల్పెను | 388 |
ఉ. | హాటకనేత్ర! నేత్రకలితాబ్జ దివాకర! వాకరక్రియా (?) | 389 |
క. | శ్రీమద్వేంకటశైలమ | 390 |
కవిరాజితము: | కమలవిలోచన! కౌస్తుభభూషణ! కంజభవా | 391 |
గద్య: | ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయ ప్రణీతంబైన సకలనీతికథా నిధానంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. | 392 |
- ↑ పెంపుడుపక్షులను విడిచి పట్టెడు వేఁట.
- ↑ [వ్రేవిల్లెలోగల గోపకాంతారతి తేర జూరాడినదిట్టకాఁడె
తన పుత్రుడగు నరకుని జంపి యాతని లలనలజేకొన్న ఖలుఁడుగాఁడె
ఉరవుగ చైద్యునకొసగినకన్యక పెండ్లియాడినమహాపెద్దగాఁడె
కపటవిప్రుని రూపు గైకొని మాగధు దునుమబంచినయట్టిదోషిగాఁడె] - ↑ మానిపుచ్చి
- ↑ ఘర్మలిప్త
- ↑ చేసినది సన్న యది గాని చెఱపు గాదు
- ↑ వింటే
- ↑ తలింకిశారియో
- ↑ రాగ
- ↑ సూర్యోదయ అనుటలో ప్రాస చెడినది, “ సూరోదయ" అనుట బాగుగనుండును.
- ↑ కుంజరాశన = రావిచెట్టు
- ↑ "నిన్ను ననిన నృపతి శీఘ్రమునను" అని గ్రంథపాఠము యతిభంగముగా కన్పించుచున్నది.
- ↑ సరట = తొండ
- ↑ జయతి = యుద్ధము
- ↑ చారాయణుఁడే చాగణరాయఁడు.