సకలనీతికథానిధానము/ప్రథమాశ్వాసము

శ్రీ

సకలనీతి కథా నిధానము

ఎఱ్ఱయ ప్రణీతము

శ్రీలలనాధినాథుఁ డతసీకుసుమాంచితమూర్తి యష్టది
క్పాలకిరీటరత్నరుచిభాసి పదాబ్జుఁడు మిత్రసర్వభూ
పాలుని గుంటముక్లపినభైరవపాత్రుని నేలు సత్కృపా
లోలుఁడు వేంకటేశ్వరుఁడు లోకము లెప్పుడుఁ బ్రోచుగావుతన్.

1


ఉ.

గోత్రతనూభవోరుకుచకుంభపటీరసుగంధిపక్షుఁ డ
క్షిత్రయశోభి శంకరుఁడు శ్రీకరు గంగయభైరపాత్రునిన్
బాత్రవరేణ్యు నేలు శశిభాసికిరీటుఁడు, బ్రోచు గాత లో
కత్రయవాసులన్ సకలకాలము వాంఛితభవ్యసిద్ధులన్.

2


ఉ.

బ్రహ్మమయుండు భారతికిఁ బ్రాణసఖుండు పదాంబుజాశ్రిత
బ్రహ్మ మునీశ్వరుండు [1]సితపంకజమందిరుఁ డప్పరాశర
బ్రహ్మకులాధినాథుఁ బినభైరవునిన్ మహపాత్రశేఖరున్
బ్రహ్మముగాఁగ నేలు వరభావుఁడు లోకముఁ బ్రోచుగావుతన్.

3


ఉ.

కొక్కటె[2] వాహనంబు తలకుం గుసుమంబటె లేతచందురుం
డొక్కటి యట్టెదంతము సముజ్వలమై వెలుగొందుమూర్తిచే
మ్రొక్కినవారి కిష్టఫలముల్ గృపసేయు గణేశ్వరుండు సొం
పెక్కగఁ బిన్నబయ్యన హృదీశుఁడు మర్త్యులఁ బ్రోచుగావుతన్.

4

క.

వాల్మీకిఁ దలతు నపగత
కల్మషరఘురామ కావ్యఘటశీలుం బు
ణ్యోల్మ ? విహీనుం బ్రజ్వలి
తోల్ముకనిభనేత్రు బ్రహ్మయోగపవిత్రున్.

5


క.

వేసరక గొల్తు నిగమా
భ్యాసుని శ్రీరమణపాదపంకజసేవా
వాసున్ ముక్తీ ? పురపద
వీసంచరదృష్టివాసు వేదవ్యాసున్.

6


క.

భారవిని గాళిదాసున్
చోరున్ జయదేవు మాఘు సూర్యకవీంద్రున్
బేరెన్నికగల సంస్కృత
సారకవీశ్వరులఁ దలతు సజ్జనఫణితిన్.

7


చ.

వినుతి యొనర్తు వాంధ్రసుకవీంద్రుల నన్నయభట్టుఁ దిక్కయ
జ్వను నమరేశ్వరుం జెదలువాడమహాత్ముని మారనార్యు నా
చనసుతు సోము భాస్కరుని జక్కయనుం[3] గవిసార్వభౌమునిం
వనరుహపుత్రసన్నిభుల వర్ణిత కావ్యకళావిధిజ్ఞులన్.

8


ఉ.

నూతనశబ్దబంధములు నోటికి శక్యముగాక బొంతగా
బాతులుగూయు కైవడిని పాఁచి కవిత్వము లల్లి వాడలన్
గూఁతలు గూయు దుష్కవులకు వశమే కరఁగింప నీటిపై
వ్రాతలువోలె బోవు కవివైఖరులున్ విలసిల్లనేర్చునే.

9


క.

సుకవులు చెప్పిన కవితా
నికరములు శిలాక్షరముల నిలుకడ గాంచున్
గుకవులు చెప్పిన కవితా
నికరములు జలాక్షరముల నీచత నణఁగున్.

10

వ.

అని యిష్ట దేవతా ప్రార్థనంబును బురాతనకవీశ్వరుల నమస్కారంబును గుకవితిరస్కారంబును నాచరించి యొక్క విచిత్రకథాప్రబంధంబు విరచింపఁదలంచి తన్మాతృకార్చనా[4]పరాయణుండనై యున్న సమయంబున.

11


సీ.

ప్రభవించె నేవీటి పర్వతాగ్రంబున
           వరిగిరీశ్వరుడు శ్రీనాయకుండు
వసియించె నేవీటి వర్ణితసాలాంత
           రమున మూలస్థానరాజమౌళి
యుదయించె నేవీటి యుత్తరాశాతట
           భూషణీకృతనింబ పుట్టలమ్మ
వరియించె నేవీటి వలదిశాకోణంబు
           నందు గుబ్బటల మైలారమూర్తి


తే.

వినుతిగాంచిరి యేవీటి విప్రరాజ
వైశ్యశూద్రాది బహువిధవర్ణసమితి
యట్టిపురరత్న మొప్పు భవ్యాంబుజాత
మండితామరతరువల్లి కొండపల్లి.

12


క.

ఇటువంటి కొండపల్లీ
పుటభేదనమంత్రిమకుటభూషణ మరి(రా)
క్కటకవిభేదనఘటనో
ద్భటుఁడగు[5] కుటముక్ల పిన్నభైరవుఁ డొప్పున్.

13


క.

వనితాజనకందర్పుఁడు
ఘనదాన ఘనాఘనంబు కమనీయనిభా
దినకరుఁడు కుంటముక్కుల
పినభైరవమల్లమంత్రి పృథుతరకీర్తిన్.

14

క.

గురుశేఖరప్రభావుఁడు
తిరుకులయాచార్యుఁ డాత్మదేశికుఁడన సు
స్థిరకీర్తిసప్తసంతతి
పరుఁడగు పినభైరవుండు ప్రతిదివసమునన్.

15


చ.

సరసకవీంద్రులున్ విబుధసంఘము నాప్తులు నిష్టభృత్యులున్
తరుణులు వందిమాగధులు దత్త్వవిధిజ్ఞులు రాయబారులున్
సరవి భజింప బూర్వనరనాథకథల్ వినువేడ్క మానసాం
బురహమునందుఁ దోచుటయు మున్ను ననుం బిలువంగబంచినన్.

16


క.

ఏనునుఁ దన్మంత్రీశ్వరు
నానతి నాస్థానమునకు నరిగి మనోజ్ఞా
సీనుఁడనై యున్నను[6] బహు
మానముతో జూచి మంత్రిమణి యిట్లనియెన్.

17


సీ.

శ్రీవత్సగోత్రవారిధి పూర్ణశీతాంశుఁ
        డగు కూచిమంత్రికి నాత్మజుఁడవు
వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌఢిఁ
        బూర్వకవీంద్రులఁ బోలినాఁడ
వఖలపురాణేతిహాసకావ్యస్మృతి
        చయము రచించిన చారుమతివి
మాపినతండ్రైన మల్లమంత్రికినిఁ గొ
        క్కోకంబు చెప్పిన కోవిదుఁడవు.


తే.

రసికు లభినుతి సేయఁ బురాణసార
మనుపదంబుగ నాకిచ్చినట్టిప్రోడ
వట్లుగావున నొకటి నిన్నడుగఁ దలఁచి
యిచ్చటికి బిల్వబంచితి నెఱ్ఱనార్య!

18

క.

భావమునఁ దోచె గలియుగ
పావనభూపాలకథలు బంధురకావ్య
శ్రీ వెలయ నంధ్రభాషను
గావింపఁగవలయు సుప్రకాశత నాకున్.

19


క.

జపితుని నధ్వరశీలుని
తపసిఁ బతివ్రతను భోగి త్యాగిన్ శూరున్
నృపతినిఁ దలఁచినఁ దడవిన
నవవర్గఫలంబు లబ్బు నందురు విబుధుల్.

20


తే.

అట్లుగావున దొల్లిఁటి యవనిపతుల
కథలు పెక్కులు వింటి సత్కవులవలనఁ
గలియుగక్ష్మాతలేంద్రుల కథలు వినఁగ
వలయు రచియింపు మంధ్రకావ్యంబుగాఁగ.

21


క.

మాకిష్టదైవమగు నా
శ్రీకాంతుఁడు వేంకటాద్రిశిఖరావాసుం
డాకృష్ణున కర్పణముగ
నీ కవితకథానిధాన మిమ్ము సభక్తిన్.

22


వ.

అని కర్పూరతాంబూలకనకాభరణంబరాదు లొసంగి యనిపిన యాత్మగృహంబున కరుగుదెంచి యొక్కశుభముహూర్తంబునం గృతి చెప్ప నుద్యోగించి.

23


ఉ.

హేమము కమ్మదావుల వహించుట జాతిలతాంతసౌరభం
బామని సోడుముట్టుట కళాశ్రయ కామినియౌట యిక్షువం
గామితమైన సత్ఫలము గల్గుటగాదె తలంచిచూచినన్
నామృదుకావ్యకన్య కధినాథుడు వేంకటభర్త యౌటకున్.

24


వ.

అని తలంచి మదీయసకలనీతికథానిధానంబున కధీశ్వరుండైన శ్రీవేంకటాచలేశ్వరు మహిమ మద్గోచరవిధంబున వినుతించెద.

25

సీ.

ఆదికాలమున నారాయణాచలమను
        నామంబు దాల్చె నేనగవరంబు
త్రేతాయుగంబున శ్వేతాచలంబను
        ప్రఖ్యాతి గాంచె నేపర్వతంబు
ద్వాపరంబున శేషధాత్రీధరంబను
        పొగడిత గాంచె నేభూధరంబు
కలియుగవేళ వేంకటశైలమనుపేరు
        ధరియించె నేవసుధాధరంబు


గీ.

దేశభాషల నేగిరి తిరుమలనగ
గోరికల నిచ్చు జనుల కేకొండఱేడు
గరుడనామంబు దాల్చె నేగిరులరాజు
తగదె ప్రస్తుతి సేయ నయ్యగకులేంద్రు.

26


వ.

అట్టి వేంకటాచలాధీశ్వరుండు.

27


సీ.

శరభశార్దూలకేసరిమృగంబుల వేఁట
        లాడుచో చెంచులగూడి యాడు
వాసంతవిభవోత్సవంబుల సతులతో
        దెప్పల గోనేటఁ దేలియాడు
కలితకన్యామాసకల్యాణదర్శనా
        మర్త్యమర్త్యులతోడ మాటలాడు
సతతసేవాసమాగతదేశికులు చూడ
        తేఱెక్కి పురవీథిఁ దిరిగి యాడు


గీ.

కొలుచువారికి గొలువంగఁ దలఁవు గలిగి
వచ్చువారికి గోరిన వరము లిచ్చి
యాదరంబున ముచ్చటలాడువాఁడు
నగును వేంకటశైలరమాధివరుఁడు.

28

షష్ఠ్యంతములు

క.

ఈ దృశమహిమాస్పదునకు
వేదాంతశిఖాప్రదీప్తవిద్యామణికిన్
శ్రీదయితాకుచఘుసృగా
మోదాయితవక్షునకును మునిరక్షునకున్.

29


క.

కోనేటిసలిలకేళీ
మానితసరసానురాగమదమానవతీ
సూనశరక్రీడాసం
ధానవిధానునకుఁ ద్రిజగదావాసునకున్.

30


క.

పాపవినాశనతీర్థ
వ్యాపారనిదర్శితాఘవారణలీలా
టోపఘనగండశైల
స్థాపితవేంకటగిరీంద్ర సదనస్థితికిన్.

31


క.

మహనీయవిభవభైరవ
మహపాత్రమనోంబుజాతమందిరున కురో
విహితేందిరునకు నమితా
మహాముఖి? సురతతికి దాసమానసగతికిన్.

32


క.

ఆకాశవాహినీజల
శీకరభవశిశిరపవనశిధిలితలక్ష్మీ
భూకామినీరతిశ్రమ
జాకల్పస్వేదబిందుసంసిక్తునకున్.

33


క.

నవరసభావవిశేషో
ద్భవరచనాచిత్రమధురబంధురకావ్య
స్తవవచనామృతలహరీ
కవితానాథునకు శ్రీజగన్నాథునకున్.

34

వ.

దండప్రణామంబులు సమర్పించి యేను రచియింపంబూనిన సకలనీతికథానిధానంబునకు నుపక్రమం బెట్టిదనిన.

35


ఉ.

సారసపత్రనేత్రుఁడు ప్రసన్నత నొంది స్వకీయమందిర
ద్వారము గాఁచియుండ బలిదైత్యవరుండు రసాతలంబు దు
ర్వారత నేలె నాగపురవల్లభమానససంచరప్రతా
పోరుభుజప్రవృత్తిని మహోగ్రశరాసనబాణహస్తుఁడై.

36


ఉత్సాహ.

నాగలోక మిట్లు దైత్యనాథుఁ డేలుచుండియున్
యాగ మద్భుతంబుగా మురారి గూర్చి సేయుచో
భోగవతిని తీర్థమాడఁ బోయి యంత నారదుం
డాగరిష్ఠు యజ్ఞశీలు నట్లు చూడవచ్చుడున్.

37


వ.

అర్ఘ్యాదివిధులం బూజించి తోడ్కొని తెచ్చి యుచితపీఠంబున నుపవిష్టుం జేసి కరపుటఘటితనిటలుండై వినయోక్తుల నిట్లనియె.

38


ఆ.

బ్రహ్మతనయ! నీదురాకకు గత మేమి
యద్భుతంబు వొడమె నాత్మ ననిన
సకలలోకములును జరియించి నిను జూడ
వచ్చినాఁడ దైత్యవర బలీంద్ర.

39


క.

మీవాకిళ్లే గతియని
యావనమాలియును హరుఁడు ననవరతంబున్
నీవాకిలియును నీసుతు
నావాసము గాచియుందు రట్టె మహాత్మా.

40


ఆ.

అనిన బ్రహ్మమునికి నబ్బలిదైత్యేంద్రుఁ
డనియె గలియుగంబునందుఁ బుడమి
జనుల వర్తనంబు జనపాలచరితంబు
వినఁగవలయు ననిన మునియుఁ బలికె.

41

ఆ.

దానభోగశౌర్యధైర్యధర్మాచార
సాహసప్రతాపసత్యనీతి
బుద్ధికపటగతులు భూలోకజనులకు
గలిగియుండు నెపుడు గలియుగమున.

42


వ.

అట్లు గావున నేతద్వృత్తంబులు దెలుపు భూతభవిష్యద్వర్తమానకథలు కల వవి యథాక్రమంబున నెఱిగించెద.

43


ఉ.

పాండుకుమారవిక్రముఁడు భాగవతప్రియకారివైభవా
ఖండలమూర్తి యర్థిజనకామితదాయి సమస్తధారుణీ
మండల మెల్ల నేలె రఘుమానవనాథుని భంగి శూరతన్
దొండమచక్రవర్తి రిపుదుర్మదదానవచక్రవర్తియై. ?

44


క.

అతఁ డొక్కనాఁడు మృగయా
రతుఁడై గహనమున సత్త్వరాసులవెంటన్
గుతుకమున దిరిగి పొంతటి
కుతలధరం బెత్త నుగ్రకోలం బంతన్.

45


ఉ.

అగ్రమునందు దోఁచిన నృపాగ్రణి కార్ముక మెక్కువెట్టి య
త్యుగ్రనిశాతబాణము మహోద్ధతి నేసిన నవ్వరాహ మా
నిగ్రహవిగ్రహంబునకు నిల్వక యాగ్రహవృత్తి బారి ని
ర్వ్యగ్రత నొంది నాకకుహరంబున డిగ్గి యదృశ్యమౌటయున్.

46


తోటకము.

ధరణీశ్వరుఁ డాస్థలి ద్రవ్వగ న
క్కిరిరత్నము నంతనె గేలిగతిన్
హరిరూపము దాల్చి నరాధిపతిరిన్
కర మద్భుతచిత్తుని కట్టెదురన్.

47

క.

ప్రత్యక్షంబై కేశవుఁ
డత్యాదరణమున బలికె నచ్యుతు నీశున్
నిత్యుని నను గనుగొనుమా
యత్యుత్తమమైన ఫలము లందెద వనినన్.

48


వ.

సర్వాంగాలింగితోర్వీతలంబగు దండప్రణామం బర్పించి యిట్లని స్తుతియించె.

49


చామరము.

నమో గదాబ్జళంఖచక్రనవ్యబాహుపంకజా!
నమః కృపాకటాక్షలబ్ధనాకరాజ్యవైభవా!
నమ స్సమస్తలోకపాలనప్రశస్తమానసా!
నమో రమాధరాంగనాధినాథ! వేంకటేశ్వరా!

50


క.

అని వినుతించి రమేశ్వరు
ననుమతి నచ్చోటఁ గర్చురాగల్పనికే
తనసౌధసాలగోపుర
ఘనవిశ్రుతమంటపములు గట్టించి తగన్.

51


మత్తకోకిల.

మత్తకోకిలకీరనిస్వనమండితక్షితిజాలియున్
నృత్తగీతకళాప్రవీణవనేరుహస్ఫుటనేత్రలున్
హత్తి సేవయొనర్చుదాసులు నాదియైన నియోగమున్
చిత్తసంభవుతండ్రి కర్పణచేసె భక్తి దలిర్పగన్.

52


ఆ.

కట మనంగ బాస కాష్ఠంబు వెంబన
దహననామ మయ్యె ద్రవిడభాష
బాసకటము వెంబభస్మంబు సేయుట
వేంకటాద్రి యనఁగ వెలసెఁ బేరు.

53

చ.

కటములు జేవురింప దెలిగన్నులవాఁ డుదయింప బాదసం
ఘటన నలంగ గోరికలు గాంచెదమంచును దీర్థయాత్రకై
యిటునటు లేఁగనేల నరు లెట్టియఘాత్ములకైన గల్గు వేం
కటమనుపేరు జిహ్వతుది గాపురముండినముక్తిసంపదల్.

54


వ.

ఇవ్విధంబున వేంకటాధీశ్వరుండు తొండమచక్రవర్తికి నభీష్టవరంబు లొసంగుచు నతని సేవ గైకొనుచుండె నింక శ్రీ శైలప్రశంసయు, విక్రమార్కాదిరాజచరిత్రంబులును వినుపించెదనని యిట్లనియె.

55


సీ.

ప్రవహించు నేయద్రిపర్యంకమునఁ బాప
        దళనోత్తరంగ పాతాళగంగ
వసియించు నేయద్రి వక్షోరుహన్యస్త
        బంధురప్రాలంబభ్రమరికాంబ
విహరించు నేయద్రి వివిధపిశాచకం
        ఠీరవుండగు బొబ్బభైరవుండు
చరియించు నేయద్రి జనులను గావంగ
        వీరమూర్తి ప్రతాప విజయమూర్తి


తే.

పర్వతాఖ్య ద్విజన్మతపఃప్రభావ
లబ్ధవరదానమస్తకాలయగిరీశ
పాదసంచారపావనప్రస్తరంబు
ప్రస్తుతింపగ దగదె శ్రీపర్వతంబు.

56


క.

శిల లెల్లను లింగంబులు
పొల మెల్లను బరుసవేది భూరుహవల్లుల్
సెలయేరు లెల్ల సురనదు
లిల శ్రీగిరిమహిమ దెలియ నెవ్వం డెఱుంగున్.

57

క.

కాశిపురిలోన బ్రాణ
క్లేశము బొందింపవలదు కేదారజల
ప్రాశనము జేయవలవదు
శ్రీశైలము జూచినపుడె చేకురు ముక్తుల్.

58


క.

తలయేరువట్టి శ్రీగిరి
తలయంపిగబడిన జనవితానంబులకున్
తలయేరు వాయ దెప్పుడు
తలలేరినపేరు నొడల దడబడుచుండున్.

59


తే.

అట్టి శ్రీగిరి చేరువన చల మొకటి
యాద్యమై యుండు చంద్రగుప్తాఖ్య మగుచు
నట్టిగిరి యేలు చంద్రవంశాబ్ధిభవుఁడు
చంద్రగుప్తుండునా నొక్కజనవరుండు.

60


మాలిని.

ఆనరనాయకు మోహపు బుత్రి సితాంబుజలోచనచంద్రికనా
మానిని మాన సుగంధిసమంచిత మత్తకరిప్రతియాన కళా
సూనవిలాసిని చంపకనాస వినూత్నవిభూషణ నిత్యము ను
ద్యానవనంబునకుం జని మల్లెలదండల నర్చన సేయు శివున్.

61


క.

ఈగతి నాబాలామణి
శ్రీగిరిపై శివుని బూజసేయగ నంతన్
నాగవిభూషణుఁ డయ్యెల
నాగకుఁ బ్రత్యక్షమయ్యె నగజాయుతుఁడై.

62


వ.

అక్కామిని కోరిన యట్ల మల్లెవిరులం బూజించుటం జేశి మల్లికయను నబిధానంబు నొసగి యాత్మనామంబు [7]మల్లికార్చనుండనియును ధరియించి తన్ను దర్శించినవారికి భోగమోక్షంబులు గృపసేయుచుండె.

63

క.

ఆరాజన్యుఁడు నొక్కకు
మారికయేకాని సుతుఁడు మఱికల్గమి న
న్నారీరత్నంబునుఁ గడు
గారవమున బెనుప గొంతకాలంబునకున్.

64


ఆ.

బ్రహ్మరాక్షసుండు బ్రాహ్మణపుత్రుని
బ్రహ్మచారిబలిమి బట్టి యచట
యారునెలలదాక యాహారనిద్రల
నుడిపి చదువు చెప్పి విడుచుటయును.

65


వ.

అతం డచ్చంద్రగుప్తపురంబు చొచ్చి తత్పురోహితబ్రాహ్మణమందిరముఖశాలావేదిక పైఁబడి నిద్రాలసుండై యుండుసమయంబున.

66


క.

భోజనసమయం బగుటయు
రాజపురోహితుఁడు భూసురప్రవరనుతున్
రాజితరూపోత్కృష్టుని
దేజోనిధి జూచి నిద్రదెలుపఁగ బంచెన్.

67


ఉ.

నిద్దుర దేలి లేచి ధరణీసురపుత్రుఁడు నిత్యకృత్యముల్
తద్దయు జేసి భుక్తిగొని తత్సుతరాజికి నేర్చినట్టియా
విద్దెలు చెప్పుచున్ బయటివేదికపై నుపవిష్టుడైనచో
ముద్దియ యోర్తు వర్ణివరు మోహనరూపమునందు లగ్నయై.

68


క.

తలవరి కూతుర నీకున్
వలచితి వరియింపు మనిన వర్ణియు బలికెన్
లలనా! శూద్రాంగనవే
నిలాసురబ్రహ్మచారి నెటుగా గూడున్.

69

ఉత్సాహ.

అనుచు ధిక్కరించుటయును నతివ మన్మథాగ్నిచే
గనలి తండ్రి కెఱుగజెప్ప కన్నకూతుమీఁద భ
క్తిని నృపాలు నెఱుగజేయ క్షితివరుండు విప్రసం
దనుని జూచి యాత్మపుత్రి దానమిచ్చె వర్ణికిన్.

70


ఆ.

మొదల విప్రతనయ పిదప భూపతి కూఁతు
పెండ్లియాడి వైశ్యుప్రియతనూజఁ
గరమువట్టి శూద్రచరణంబు ద్రొక్కె భూ
సురతనూభవుండు వరుసతోడ.

71


వ.

అంత.


ఉ.

అల్లుని మల్లికారమణు నాత్మపురంబున కయ్యవంతికిన్
వల్లభు జేసి శ్రీనగవనంబున నుండె దపోనిరూఢి న
య్యల్లుఁడు చంద్రగుప్తుఁడను నాహ్వయమున్ వహియించి భూతలం
బెల్లను నేల నల్వురుమృగేక్షణలుం దను గొల్వ నున్నతిన్.

72


వ.

అంత నచ్చంద్రగుప్తుండు నలువురు భార్యలయందును విప్రకామినికి వరరుచి భట్టుండును, క్షత్రియసతికి విక్రమార్కుఁడును, వైశ్యరమణికి భట్టియును, శూద్రాంగనకు భర్తృహరియును ననుకుమారులం బడసి, పూజ్యంబగు రాజ్యవిభవం బనుభవింపుచు జరాభారపీడితుండై యొక్కనాఁడు.

73


క.

తనయుల మంత్రుల ధరణీ
జనముల రప్పించి శూద్రజలజాక్షికి ని
చ్చిన వరము జెప్పి యాసతి
తనయుని నాభర్తృహరిని ధరణిపు జేసెన్.

74


క.

వివరియగు విక్రమార్కుని
యువరాజుం చేసి భట్టి నురుమతి మంత్రి

ప్రవరుని జేయుచు వరరుచి
ధవునకు హితుఁడుగ బురోహితస్థితి నిలిపెన్.

75


తరల.

నరవరుండగు చంద్రగుప్తుడు నైధనంబును బొంద న
వ్వరరుచిన్ వరణాశిబొమ్మన వాడునుం జనె నంత నా
హరిధరాతల మేలుచుండగ నర్కనాముఁడు రాజ్యమున్
మురువుసేయగ భట్టి నిచ్చలు బుద్ధి చెప్పగ నున్నతిన్.

76


క.

ఆకాలంబున విప్రుఁడు
శ్రీకంఠుని గోరి తపము సేయగ హరుఁ డ
స్తోకకృప జరామరణ
వ్యాకులములు లేని ఫలము వరముగ నీయన్.

77


ఆ.

ఫలము గొనుచు నాత్మభవనంబునకు నేఁగ
భార్య జూచి యాత్మభర్త కనియె
సంప దడుగ కిట్లు జరయు జావును లేని
ఫలము వరముగాఁగ బడయదగునె.

78


క.

ధనముగలవాఁడె పుణ్యుఁడు
ధనమే సౌభాగ్యకరము ధర్మస్థితికిన్
ధనమే మూలము గావున
ధనహీనుఁడె మృతుఁడు ప్రాణతనుఁడై యున్నన్.

79


ఆ.

పసిఁడిగలుగువాని పలుకులు పలుకులు
పసిఁడిగలుగువాని బలిమి బలిమి
పసిఁడిగలుగువాని బలగంబు బలగంబు
పసిఁడిలేని గుణియు బాపి యతఁడు.

80


క.

అనిపతి దిట్టుటయును దాఁ
దిననొల్లక భర్తృహరికి దెచ్చిచ్చిన న

జ్జనపతి ఫలము మహత్త్వము
విని మోహపుదేవి కిచ్చె వెలఁదియు దానిన్.

81


ఆ.

కోరికలరనిచ్చె గుఱ్ఱాలకాపరి
కతఁడు లద్దిదుడుచు నతివ కిచ్చె
గొల్ల కిచ్చె నదియు గొల్లయునున్ బేఁడ
మోసి కుప్పవేయుదాని కిచ్చె.

82


వ.

అదియును శూర్పపూరితంబైన గోమయంబుపై నిడుకొని తెచ్చు సమయంబున.

83


తే.

భర్తృహరివెంటవోయి యావనమునందు
నరుగుదెంచుచు నగ్గోమయంబుమీఁది
విశ్రవరలబ్ధమైన యుర్వీజఫలము
కాంచి యద్దాసి నడిగి తత్క్రమము దెలిసి.

84


క.

సరసిజనేత్రల శీలము
నరనాథులకృపయు గ్రూరనాగంబుల త
త్పరతయు మిథ్యావచనుల
వరములు దలపంగ నీటివ్రాతలు గావే.

85


వ.

అదియునుంగాక.

86


క.

మాయయు నసత్యవాక్యము
కాయకమును ? కోపగుణము క్రౌర్యము శీలా
సాయము మూర్ఖత్వంబును
తోయజదళలోచనలకు దోడజనించున్.

87


ఉ.

ఒక్కనిఁ జూచు వేఱొకని నొల్లక మారుమొగంబు పెట్టు నొం
డొక్కని కాస చూపు మఱియొక్కనితో రమియించు వేడ్కతో
నొక్కని గౌఁగిలించు తలపొక్కని పైనిడి తాల్మిదూలు నే
దిక్కున బట్టిచూడ సుదతీజనవర్గము నమ్మవచ్చునే.

88

వ.

అని విచారించి స్వకీయభార్యలైన త్రిశతసంఖ్యాకామినీజనంబుల విడిచి యాత్మాగ్రజుండైన విక్రమార్కునిం బట్టంబు గట్టి భట్టి దొల్లిటియట్ల యమాత్యకృత్యంబునకుం బ్రతిష్ఠించి రాజయోగియై యరుగుచున్న నతనిభార్యాశతత్రయంబును జనుదెంచి యిట్లనిరి.

89


ఆ.

ఏమి సేయువార మిటువలె మము డించి
నీవు చనినపిదప నృపవరేణ్య
యనిన గదుట నూలు నాకులు తాడిని
గలిగియుండునట్టికాలములును.

90


వ.

విధవాత్వంబు లేకుండునట్లుగ వరం బిచ్చితి బొండని చనియె. నాటనుండియు శూద్రకులంబు గొందఱు మున్నూ రనంబడి రంత.

91


స్వాగతము.

విక్రమార్కుఁ డుఁరు విక్రమ మొప్పన్
శక్రులీల బురసంహరుమాడ్కిన్
చక్రిభంగి బరచక్రాధిపులన్?
విక్రమించి పృధివీతలమేలన్.

92


వ.

అతం డొక్కనాఁడు మృగయార్థం బడవి కరిగి.

93


సీ.

గహ్వరద్వత్సమారంహసాహసభీమ
        సింహపోతంబుల చెండి చెండి
అద్రిసన్నిభశరీరోద్రేకమదపూర్ణ
        భద్రసింధురములఁ బట్టి పట్టి
దుర్గమాభీలవిధుంతుదోద్భటవక్త్ర
        శార్దూలములవీఁపు చరచి చరచి
కోలాహలాభీలకాలాభ్రసన్నాహ
        కోలసమూహంబుఁ గొట్టి కొట్టి

తే.

శరభభల్లూకవృకముఖసత్త్వచయము
చండభుజశక్తి నిలఁబెట్టి ౘమరి ౘమరి
భయదగహనాంతరంబునఁ బరచి పరచి
విక్రమార్కుఁడు కడిమిమై వేఁటలాడె.

94


వ.

అంత.

95


క.

కనుమరి లోహపుఁబిండం
బనలములోఁ దిగిచి నీఁట నార్చినభంగిన్
దిననాథుఁ డస్తమించిన
వనరుహముల నెగయు నళిరవంబు చెలఁగన్.

96


ఉ.

చల్లనిగాడ్పుతో జలదసంఘము చీఁకటిగూడి భూతలం
బెల్లను నాక్రమించుటయు నీఱపుద్రోవలు వాగుపుంతలున్
పల్లముమిఱ్ఱునుం దెలియఁబాళముగాక స్వకీయసైన్యముల్
వెల్లినివిచ్చిపారుటయు విక్రమసూర్యుఁడు ద్రోవదప్పినన్.

97


క.

కోల మెఱుఁ గప్పటికిదివె
కోలగ నాసాహసాంకకువలయపతియున్
గాలునడ నరుగుచును మహా
కాళీసదనంబు జొచ్చెఁ గడువేగమునన్.

98


పాదపము.

కాళికి దిండుగగట్టినరారా
త్సేలశరీరము సీతమడంపన్ ?
కాలొక టంబికకాయముమీఁదన్
బోలగజాపుచు భూస్థలి ద్రెళ్ళెన్.

99


తోటకం.

పరమేశ్వరి నిర్భయు నానృపునిన్
పరికించి మహాభయదాకృతియై

కరశూలము భీకరమై మెఱయన్
నరపాలుని ముందట నార్పులతోన్.

100


క.

ఇచ్చటికి వెఱవ కిటుదా
వచ్చితి నాయెదుర బ్రతుకవచ్చునె నీకున్
జచ్చితివి లెమ్ము లెమ్మన
నచ్చండిక బలికె నట్టహాసముతోడన్.

101


చ.

వెఱ పొకయింత లేదు గుడి వెళ్ళుము నా కిరవిచ్చి వర్షముల్
వఱపిన గాని పోవనన వానిసమద్దతి చూచి యిట్లనున్
గొఱఁతలు గాచితిన్ వరము గోరు ఘటించెద నన్న నీకు న
క్కజగలదేని న న్నడుగు కైకొనఁ గామిను లిచ్చుకోరికల్.

102


తే.

అనినఁ గానిమ్ము వర మిత్తు ననెదవేని
చక్కబలికించుమని ఫాలచర్మ మెత్తి
యజుఁడువ్రాసిన లిపి పెంపు మట్లు గాక
యధిక మైనను వ్రాయు నీ వనినఁ బలికె.

103


ఆ.

బ్రహ్మ వ్రాయు నక్షరంబులు దుడువంగ
వ్రాయనైన నొరుల వశముగాదు
యీశుచేత వరము లిప్పింతు రమ్మని
రాజుఁ దోడుకొనుచు రమణి యరిగె.

104


ఉ.

కాళికవెంట నేఁగి కుతుకంబున భూపతి గాంచె నమ్మహా
కాళునిఁ బార్వతీకుచసుగంధపటీరమనోజ్ఞవాసనా
లోలుని సింధురాసురవిలుంఠన నిష్ఠురబాహువిక్రమా
భీలుని పంచ................ .చండశాసనున్.

105


క.

అమ్మహాకాళునకు విక్రమార్కనృపతి
దండ మొనరింప కాళి భూధవునిఁ జూపి
ఉగ్ర! నా చేతి వర మితం డొల్ల ననియె
నీవు వర మిచ్చి నన్ను మన్నింపు మనిన.

106

కవిరాజవిరాజితము.

అడుగర యేవరమైనను నిచ్చెద నర్కనృపాలక యన్న నతం
డడిగె దయాకర భట్టికి నాకు సహస్రసమంబులు తేజమునం
బుడమి భరింపగ నిమ్మని వేడిన భూతగణేశ్వరుఁ డిచ్చిచనెన్
గడుముద మొంది పురంబునకుం జనకల్యముఖంబు దయం బగుడున్.

107


క.

భట్టిఁ బిలిపించి రాత్రి
కట్టడి వినిపించ నతఁడు కడువేడుకతో
నెట్టన వేవత్సరములు
గట్టిగ నిచ్చితి నటంచుఁ గరణన్ బల్కెన్.

108


వ.

పలికి యాక్రమంబుననే యుపాయంబూహించి సంవత్సరంబున పూర్వార్థంబున రాజ్యంబును అపరార్థంబున వనవాసంబునుగా నియమించుకొని రాజ్యంబు సేయుచుండ నొక్కనాఁడు.

109


క.

ఒక్కదిగంబరముని నృపు
చక్కటి కరుదెంచి సాహసప్రియ యిట నే?
నొక్కక్రతు వాచరించెద
నక్కడి కేతెమ్ము మత్సహాయతకొఱకున్.

110


చ.

అనవుడు నట్లకాకయని యమ్మునివెంటను విక్రమార్కభూ
జనపతి యేఁగి యాతఁడు పిశాచమఖక్రియ నాచరింపుచున్
దనుజుని బట్టి చెమ్మన బ్రతాపభయంకరుఁ డట్ల సేయ, న
మ్మనుజభుజుండు మెచ్చి రిపుమర్దనవిక్రము జూచి యిట్లనున్.

111


క.

భూతలనాయక! విను నే
భేతాళుఁడ నీకు నిష్టభృత్యుఁడనై నీ
వేతరి దలఁచిన వచ్చెదఁ
జేతోగతి ననుచు నష్టసిద్ధులు నిచ్చెన్.

112


వ.

అవి యెయ్యవి యనిన.

113

సీ.

తనువు జరారోగతతిఁబీడ బొందక
        కాంతిఁ బొందించుట కాయసిద్ధి
అభివాంఛితార్థంబు లనుకూలగతి బరి
        స్పష్టంబు సేయుట భీష్టసిద్ధి
ఆడినమాట సత్యాచారసంశీల
        వర్తనం బొందుట వాక్యసిద్ధి
ఉచ్చరించిన మాత్రమెచ్చి మంత్రస్ఫూర్తి
        మహిమ లొసంగుట మంత్రసిద్ధి


తే.

రాజ్య మప్రతిగ్రహమౌట రాజ్యసిద్ధి
మోహకోపంబు లుడుగుట మోక్షసిద్ధి
విక్రమోద్దామభుజశక్తి విజయసిద్ధి
అంతరంగప్రమోదంబు స్వాంతసిద్ధి.

114


వ.

అనిపలికి భేతాళుం డడుగఁదలంచిన దిగంబరమునిప్రయోజనంబు తీర్చిపొమ్మని తెచ్చి యమ్ముని కొప్పించిన.

115


క.

ముని విక్రమార్కు గనుగొని
యనియె న్నాకష్టసిద్ధు లందెడికొఱకున్
బనిచితి నవి వృథ యయ్యెను
జనుమనినన్ సాహసాంక జనపతి యనియెన్.

116


క.

యతివర! భేతాళునిచే
బ్రతిగ్రహమ్మైన యష్టభవ్యంబులు ని
చ్చితి నన ముని దీవించెను
క్షితిపతియును నరిగె నరిగె గిన్నరవరుఁడున్.

117


వ.

కావున.

118


క.

ఉపకారము నుద్యోగము
నపవాదము బాయుటయును నాశ్రితులయెడన్
గృపఁ దలచుటయును దానము
నుపమింపగరాని జనుల కుత్తమగుణముల్.

119

వ.

అనవుండు.

120


మ.

బలిదైతేయుఁడు నారదుం బలికె భూభాగంబునన్ విక్రమా
ర్కులసత్కీర్తులు ప్రస్తుతింతురు బుధుల్ రూపింపగా నట్టివా
రలకీర్తుల్ వినుపింపవే యన నుదారస్ఫారకీర్తిచ్ఛటా
నలితాకాశుడు దాని వానిగుణముల్ వర్ణింపగా శక్యమే.

121


క.

వెయిమాడ లిచ్చు జూచిన
అయితం బవి యిచ్చు బలుక హసితుండై ల
క్ష యొసంగు విక్రమార్కుఁడు
దయ మెచ్చిన కోటి యిచ్చు దగ నర్ధులకున్.

122


వ.

అని వినిపించి మఱియు నిట్లనియె.

123


క.

ఊహింప విక్రమార్కుని
సాహసము నుదారగుణము చర్చింపంగా
నాహరున కైన వశమే
బాహాబలుఁ డతని వినుము బలిదైత్యేంద్రా!

124


ఆ.

సాహసాంకు డిట్లు జగతివృత్తాంతంబు
లరయబంప బోబోయినట్టిజనము
లరసివచ్చి చెప్పి రాశ్చర్య మొక్కటి
చిత్రకూటనగ విచిత్రమహిమ.

125


ఉ.

చెప్పిన విక్రమార్కనృపశేఖరఁ డగ్గిరి చూచు వేడ్క దా
నప్పుడ యేగి యందుల శివాలయనైకటభూమియందు బా
రప్పులు పాపకర్ముతను వంటిన కాటుకవర్ణ మౌటయున్
బొప్పగ పుణ్యునిం దనువు సోఁకిన దుగ్ధము లౌట చూచుచున్.

126

క.

ఆతటమున నొకవిప్రుఁడు
శ్రీతరుఫలహోమమొకటి చేయుచునుండెన్
భూతలనాథుఁడు డగ్గరి
యాతని నీవేల వ్రేల్చెదని యడగుటయున్.

127


వ.

ఆతం డిట్లనియె.

128


క.

శతహాయనంబు లయ్యెను
క్షితివర యీరీతి వ్రేల్మి సేయుదు దుర్గా
వ్రతినై యుండుట పర్వత
సుతయును ననుచాలుననక చూచుచునుండెన్.

129


ఆ.

అనిన నతని నుడుగుమని యొక్క మాలూర
ఫలముతేనెఁ దోఁచి పవనసఖుని
యందు వ్రేల్చుటయును నంబిక మెచ్చక
యున్న [8]తేజఖడ్గ ? మొకటియెత్తి.

130


చ.

తనతల ద్రించి వ్రేల్తునని తత్పరతన్ ఝళిపించు సాహసుం
గనుగొని దుర్గ హస్తమున కత్తికరంబు గ్రహించి వల్లువ
ల్దనిన మహీసురోత్తము ప్రయాసము వ్యర్థముగాకయుండ గో
రినవర మిమ్ము శీతలగిరిప్రభుపుత్రిక! యన్న నిట్లనున్.

131


తే.

చిత్తశుద్ధి లేక చేసిన జపమును
తపము హోమవిధియు దానములును
దేవతార్చనములు భావింప నిష్ఫల
మట్లు గానవలయు నాత్మశుద్ధి.

132


వ.

కావున విప్రుండు శ్రద్ధాహీనుండు వీనికి నేల ఫలించు నిన్ను మెచ్చితి వర మిచ్చెద నడుగుమనిన విప్రుండుగోరిన వరం బిప్పించి యుజ్జయనిపురంబున కరిగె నట్లు గావున.

133

క.

సాహసదానంబులలో
సాహసమే లెస్స యవని జనపాలురకున్
సాహసుఁడు విక్రమార్కుఁడు
సాహసమునగాదె సాహసాంకుం డయ్యెన్.

134


వ.

అని మఱియు నిట్లనియె.

135


సీ.

ఉజ్జని నేలుచు నొక్కనాఁ డవ్విక్ర
        మార్కుఁ డధ్వరము సేయంగ దలఁచి
యంభోధి దోడి తెమ్మని విప్రు బనిచిన
        జని మహీదేవుండు వనధి బిలువ
పాధోధివిభుడు భూపతికి నిమ్మని తెచ్చి
        మణిచతుష్టయము బ్రాహ్మణున కిచ్చి
వేర్వేఱ నారత్నవిధములు వివరించి
        యనిపిన భూసురుం డరుగుదెంచి


తే.

జలధియిచ్చిన యారత్నములును నాల్గు
విభునిముందట నిడి వానివిధము చెప్ప
నడుగు మీ కిత్తు నొకరత్న మనిన ద్విజుఁడు
పుడమినాయక మావారి నడిగివత్తు.

136


ఆ.

అనుచు నింటి కరిగి యాలిని గొడుకును
గోడలికిని వానిగుణములెల్ల
ధనము రాజ్యములును గనకభూషణములు
నాయువును ఘటించు నని వచించి.

137


వ.

ఇందులో నేరత్నం బడుగుద మనిన నిట్లనిరి.

138


క.

ధన మడిగె బత్ని, కోడలు
కనకాభరణంబు లడిగె, ఘనరాజ్యశ్రీ
తనయుం డడిగెను, నాయువు
తనకును వలెననుచు ద్విజుఁడు తలఁపున నిడియెన్.

139

ఆ.

నాల్గుమణుల నిట్లు నల్వురు నాసించి
జగడ మడచి సాహసాంకునకును
నెఱుగఁ జెప్పి మగుడ నిచ్చిన నవ్వుచు
బుచ్చుకొనక నాల్గు నిచ్చి యనిపె.

140


క.

తలఁప నుదారగుణంబులు
కలపురుషుఁడు ధనము తృణముగా దలపోయున్
ఫలియించిన మణు లీఁడే
యలయక విప్రునకు సాహసాంకుఁడు గరుణన్.

141


క.

వేలుపులు వరము లిత్తురు
లోలాక్షులు తమకు దార లోనగుదు రమి
త్రాలి భయమందు విజయ
శ్రీ లబ్బు నుదారగుణముచే మనుజులకున్.

142


వ.

అనిమునీంద్రుఁడు బలీంద్రున కిట్లనియె.

143


క.

పురుషార్థ మెఱుఁగవలయున్
బురుషుం డది యెఱుఁకున్న పుణ్యము దలఁగున్
పురుషార్థ మెఱుఁగ నేర్చిన
పురుషుం డమరులకు నైన పూజ్యుఁడు కాఁడే.

144


వ.

అది యెట్లనినం దొల్లి యుజ్జయినీపురంబున గమలాకరుండను విప్రుండు గుణవతియను భార్యయు దానును శనిత్రయోదశివ్రతపరాయణుఁడై ఖండపరశువలన దేవదత్తుండను కుమారుని వరంబుగా బడసి యతని గృహస్థు జేసి దంపతు లిరువురు గాశీయాత్ర యరిగిన నంత నొక్కనాఁడు.

145


ఉ.

విక్రమసూర్యుఁ డొక్కరుఁడు వేఁటగ నేఁగి వనాంతచారణో
పక్రమభంగి నొచ్చియు పిపాసల గ్రుస్సియు దొట్రుపాటు పా

దక్రమ మంటగాఁ దెరువుదప్ప సమిత్తులు గొంచువచ్చు వే
దక్రమశాలియంబువులు ధాత్రిఫలంబులు నీయ దృప్తుఁడై.

146


చ.

పురము పథంబు చూప జని భూసురకోటికి దాన మిచ్చుచో
హరవరదత్తుఁ డాద్విజసహాయత రాజగృహంబులోనికిన్
వెరవున నేఁగి యర్కపృథ్వీపతి పుత్రుని రత్నహాటకా
భరణుని బట్టికొంచు జని బాలకుని న్వెస దాఁచి యంతటన్.

147


క.

తనయుఁడు దొడిగినమణిమయ
కనకాభరణంబు లమ్మఁగాంచి తలారుల్
తనయద్రోహుం డీతం
డని విప్రునిఁ గట్టి దుఃఖియగునృపు నెదురన్.

148


క.

నిలుపుటయు విక్రమార్కుఁడు
తల.. .. ..విప్రు గాఁచి తను గారడవిన్
మెలఁగ గని తెరువు చూపుట
తలఁచి ద్విజున్ విడువుమనియెఁ దలవరితోడన్.

149


క.

ప్రాణంబుఁ గల్గెనేనియు
(రాణులు) పుత్రులు ధనంబు రాజ్యము గలుగున్
ప్రాణమె బంధువు లోక
ప్రాణులకయి గావవలయు బ్రాణానిలముల్.

150


ఆ.

అనుచు విప్రునకును (నధికధనం బిచ్చి)
యనిపె నపుడు విక్రమార్కనృపతి
చిన్నమంతమేలు చేసిన సుజనుఁడు
చెప్పరాని మేలు చేయకున్నె.

151


క.

కృత మెఱుఁగ(కున్న) దైవము
కృతఘ్నునకు నిహము పరము నేలా కలుగున్
కృత మెఱిఁగి పుత్రహరుఁడగు
నతని న్విడిపించె విక్రమార్కుఁడు......

152

వ.

అప్పుడు.

153


ఆ.

ధరణిసురుఁడు దాను దాఁచిన నృపపుత్రు
దెచ్చి యిడిన శౌర్యదినకరుండు
బ్రాహ్మణుండ విట్టిపని యేలఁ చేసితి
వనిన నీదుభావ మరయ ననియె.

154


వ.

అని చెప్పి నారదమునీశ్వరుండు క్రమ్మర నిట్లనియె.

155


క.

క్షితినాథునాజ్ఞు యెవ్వం
డతిక్రమింపక చరించు నాతఁడు ధరణీ
(పతిచే) బూజితుఁ డగు నా
గతిదప్పిన నృపతిచేత గష్టత నొందున్.

156


వ.

అది యెట్లనిన.

157


సీ.

రత్నాక ? మందలి రత్నపేటికయను
        పురమున నొకవైశ్యపుంగవుండు
మాధవుఁ డనువాఁడు మాణిక్య మొక్కటి
        గొని తెచ్చి విక్రమార్కునికిఁ జూపి
దీనికి వెల కోటిదీనారతతి యని
        చెప్పి వెండియును విచిత్రమణులు
పదియున్న వింటను పరిజనంబుల బంపు
        కొనివచ్చు ననిన నజ్జనవిభుండు


తే.

సహచరుని బంప నామణిచయము గొనుచు
వచ్చుచో ద్రోవ నొకయేరు వారుచుండ
దాటనేరక యైదురత్నంబు లొక్క
యీతకానికి నిచ్చి వాఁ డేరు దాఁటె.

158


వ.

అద్దూతజనుండు కడమయైదురత్నంబులు దెచ్చి రాజునకు సమర్పించి తావెచ్చపెట్టిన పంచరత్నంబుల విధం బెఱిఁగింప....

159

క.

ఆజ్ఞాభంగము చేసిన
నాజ్ఞాపింపుదురు రాజు లధికులనైనన్
ప్రాజ్ఞులగువారి కవని ప
రాజ్ఞాభంగంబు సేయుట రుహంబగునే.

160


వ.

అనవుండు.

161


క.

(క్ష)నమున వచ్చెదనని తా
జని నాయాజ్ఞకును వెఱచి చనుదెంచెను వీఁ
డని పంచరత్నములు (పరి)
జనునకు గృప జేసి వైశ్యజనునకు నంతన్.

162


ఆ.

పదునొకండుఁ గోట్లు పసిడిటంకంబులు
మణుల విలువచేసి మనుజవిభుఁడు
నూరుభవున కిచ్చె నున్నతసత్కీర్తి
సాహసాంకునకును సాటి గలరె.

163


వ.

మఱియు నిట్లనియె.

164


క.

పరుల మనస్తాపం బే
పురుషుం డణఁగించు ప్రాణముల నిచ్చైనన్?
ధర నట్టిమనుజునకు నిహ
పరసౌఖ్యము లబ్బుననుచుఁ బల్కుదు రార్యుల్.

165


వ.

అది యెట్లనిన.

166


సీ.

ధనపాలుఁడనువైశ్యతనయుండు కాశ్మీర
        జగతి గట్టించెఁ గాసార మొకటి
నది యెల్లకాలంబు నంబుహీనంబైన
        జింతింప నాకాశసీమ పలికె

నిది లక్షణములు ముప్పదిమూఁడు కలుగు భూ
        (వరుని)రక్తంబున బలి యొనర్చి
ననుగాని యుదకపూర్ణంబు గా దనవిని
        యది సేయలేక వాఁ డలమటింప


తే.

చారు లెఱుగింప విని (సాహసాంకనృపతి)
సరసి చూడంగ నేఁగి యచ్చంద మెఱిగి
కంఠరక్తంబు బలియీయ ఖడ్గ మెత్త
శక్తి ప్రత్యక్షమై యందు జలము నించె.

167


క.

అవ్విధము విక్రమార్కుం
డవ్వైశ్యుం డెఱుగకుండ నరిగె బురికి ని
ట్టెవ్వం డుపకృతిచేసియు
నవ్విధ మెఱిగింపకుంట యార్యగుణంబుల్.

168


వ.

అని చెప్పి విరోచనపుత్రునకు బ్రహ్మపుత్రుం డిట్లనియె.

169


క.

ఏవెరవు లేని మనుజుని
దైవము రక్షింప నొక్కదాతం జూపున్
దేవత విక్రమసూర్యుని
భూవిభునిని నడుగుమనదె పుర మేలింపన్.

170


వ.

అది యెట్లనిన.

171


సీ.

మధుమాసమున విక్రమప్రభాకరుఁ డంగ
        నాయుక్తుఁ డగుచు వనంబునందు
క్రీడింప నొక్కదరిద్రవిప్రుఁడు వచ్చి
        యనియె భూపతి జూచి యవనినాథ
చండికం గోరి నేశతవత్సరములు త
        పంబు సేయంగ నయ్యంబ రాత్రి
వచ్చి విక్రమసూర్యువలన నీకోరిక
        ఫలియించు నని చెప్పి చనియె నన్న

ఆ.

యట్లుగాన చండికాఖ్యపురంబు గా
వించి నన్ను నందు విభుని జేసి
రాజచిహ్న లిచ్చిరక్షింపు మనవుండు
నట్ల చేసి వాని నందు నిలిపె.

172


వ.

అని మఱియు నిట్లనియె.

173


క.

పరులకు నైన నుపద్రవ
మరసి మహామతులు దమదు ప్రాణం బైనన్
కర మొసగి చక్కజేతురు
పరికింపగ నిదియు నిహముఁ బరమునుఁ గాదె.

174


వ.

అది యెట్లనిన.

175


సీ.

ఉజ్జనిపురమున నొక్కవైశ్యుఁడు ధన
        దత్తనాముఁడు దానధర్మపరుఁడు
వివిధదేశద్వీపవీక్షణాసక్తుఁడై
        పోవువాఁ డొకమహాపురము గాంచి
యాపురిచేరువ నడవిలో భైరవు
        గుడి గాంచి భక్తి నక్కడికి నరిగి
భైరవుముందటఁ బడియున్న తలలుఁ గ
        బంధంబులును జూచి భయము బొంది


ఆ.

మగుడి వచ్చి విక్రమార్కునకును జెప్ప
సాహసాంకు డధికసాహసమున
నచటి కేగి భైరవాకృతి వీక్షించి
మనుజనాథుఁ డిట్టు లని నుతించె.

176


మంగళమహాశ్రీ.

బాహాదండవ్యూహసమంచద్భహువిధచలదశిభవరుచి చెలఁగన్
వ్యూహాపోహప్రాప్తసురస్త్రీయుతనవకలకలహుంకృతు లమరన్

ద్రోహిశ్రేణి దుర్మదవిద్ధున్ దురమున బటుదోర్బలమున సం
వాహం బొప్పందోలుదు లీలన్ ప్రణతులు మెలపులు భైరవవరదా!

177


వ.

అని స్తుతియించి కబంధశిరంబు లదుకంజేయుమని ప్రార్థించిన నూరకున్న శాతాసినాత్మశిరంబు త్తరింపందలంచిన నద్దేవుండు ప్రత్యక్షంబై.

178


క.

నరులకబంధంబులతో
శిరములు దగనంటికొనగ జేసెను శివుఁడున్
వరము వెసంగాంచి తనపురి
కరుదెంచెను విక్రమార్కుఁ డనుపమశక్తిన్.

179


వ.

ఇంక నొక్కటి వినుమని యిట్లనియె.


క.

ధరణిసురు గోర్కె దీర్చుట
పరమోదారులకు నెల్ల భావ్యంబు సుమీ
నరభుజుని దునిమి ద్విజునకు
సరసిజముఖి నీఁడె సాహసాంకుఁడు గడిమిన్.

180


వ.

అది యెట్లనిన.

181


సీ.

ఉజ్జయనీపురి నొక్కవిప్రుఁడు కమ
        లాలయుఁడనువాఁడు లలితమూర్తి
క్షితి చూడ నేఁగి కాంచీపురంబున నొక్క
        నరమోహి ననియెడునలినముఖిని
వేశ్యవాటికలోన వీక్షించి రతి గోరి
        యడిగిన దనవంక కసుర యొకఁడు
వచ్చి యెవ్వరినైన వధియించు నన విని
        చనుదెంచి విక్రమార్కునకు జెప్ప

తే.

భూమిసురు గొంచు నచటికి బోయి యతివ
యొద్ద నారాత్రి వసియింపను దరి యసుర
వచ్చుటయు వాని వధియించి వారసతిని
భూసురున కిచ్చి చనుదెంచె బురమునకును.

182


వ.

అని యుపన్యసించి వెండియు దచ్చరిత్రంబు వినుమని నారదుం డిట్లనియె.

183


ఆ.

తపముచేసియైన జపములచేనైన
పొందుఫలముచేత భూమిజనుల
మరణరోగజరల మాన్పునుత్తములకు
నిందునందు సుఖము లంద గలుగు.

184


వ.

అది యెట్లనిన.

185


సీ.

ఉజ్జయనీపురి కొకదిగంబరముని
        యరుగుదెంచిన విక్రమార్కనృపతి
పిలువబంచుటయు నిస్పృహుడగు నమ్ముని
        రాకున్న దాబోయి యాకపర్ది
గనుగొని మ్రొక్క తత్కాయసిద్ధికి మెచ్చి
        యతని యాయుర్భావ మడుగుటయును
యోగికిం బేరు నాయుష్యంబు వలసిన
        జచ్చు నొల్లకయున్న జావఁ డనుచు


ఆ.

నొక్కసిద్ధమంత్ర ముపదేశ మిచ్చిన
నడవి కరిగి దాన నచట వ్రేల్ప
భవుడు మెచ్చి యొక్కఫల మిచ్చి యిది తిను
మరణరుజలు నీకు మాను ననుచు.

186

వ.

ఉపదేశించి శివుం డనిపినం బురంబున కరుగునప్పుడు.

187


క.

కాయంబు కుష్ఠరోగా
పాయంబున ముచ్చిముచ్చి పడుచును విప్రుం
డాయధిపతి కెదురైనను[9]
నాయన కది యిచ్చి విక్రమార్కుం డనియెన్.

188


క.

ఫల మారగింపు నీకుం
గలరోగము లెల్ల నుడిగి కాయంబు మహో
జ్వల మగుచు నిలుచు ననవుఁడు
ఫలభుక్తిని ద్విజుఁడు రోగబాధలఁ బాసెన్.

189


వ.

ఇంక నొక్కకథ వినుమని యిట్లనియె.

190


ఆ.

మ్లేఛ్ఛమనుజుఁడైన మెచ్చిన ఫల మిచ్చు
టేమి యరుదు దలపనెంచి చూడ
సాహసాంకు మెచ్చ జను భోజ ద్వాదశ
గ్రామభూమిసురల గాఁచెగాదె.

191


వ.

అది యెట్లనిన.

192


క.

వనవాస మాఱునెలలును
జనపాలన మాఱునెలలు జరుపుట తనకుం
బనియైన విక్రమార్కుఁడు
చనియెన్ వనమునకు దగ్రసాహసవృత్తిన్.

193


తరువోజ.

ఆరీతి జని విక్రమార్కుఁడు భీక
        రాటవీస్థలి నొక్కయవనీరుహంబు
చేరియుండంగ దచ్ఛిఖరాగ్రమున
        గూళ్లు జేసి సుఖించు పక్షిపుంజంబు?

లూరులు దిరుగుచో నొక్కుచో నురుల
        గానొడ్డిన బడి యాయురులు ద్రెంచి
కారుణ్యమున దమ్ము గాఁచిన ద్విజుని
        రక్కసుండు భక్షము చేయుకట్ట యనుచు[10].

194


వ.

తమదుఃఖంబు జెప్పు పలుకులు విని విక్రమార్కుఁ డవ్విప్రుం జంపు రక్కసుకడకుం జని యెదురనిలిచి యే తదగ్రహారబాడబునివరుసకై వచ్చితి భక్షింపు మనిన మెచ్చి యతం డిట్లనియె.

195


క.

వర మడుగు మనిన ద్వాదశ
వరభూసురవరుల భుక్తి వలదని యడుగన్
వరదు డయి గాచె విప్రుల
నరపతియును నరిగె నాత్మనగరంబునకున్.

196


వ.

ఇంక నొక్కటి వచించెదనని యప్పరమభాగవతుం డిట్లనియె.

197


క.

మగతనము గలుగు పురుషుఁడు
మగువలుఁ గుయ్యిడిన నరసి మాన్పగవలదా
జగతి నొకవిప్రసతికై
తెగిచంపడె దనుజుశౌర్యు దినకరుఁ డాజిన్?

198


వ.

అదియెట్లనిన.

199


సీ.

ఉజ్జయినీపురి నూరుజుఁ డొక్కఁడు
        మణిభద్రుఁడనెడు నామంబువాఁడు
నిర్ధనుండై పడి నిలువంగ నేరక
        పరదేశములవెంటఁ దిరిగి తిరిగి
మధురాపురీబహిర్మాలూరవనమున
        దైత్యు చేబడి యొక్కతరుణి కూయ
వినివచ్చి విక్రమారునకు జెప్పిన విని
        వానితోగూడ నవ్వనము జొచ్చి

తే.

రాత్రి యగుటయు నొకఘోరరాక్షసుండు
బాధపెట్టంగ నొకసతి బాతరింప
వాని వధియించి యవ్విప్రవనిత గావ
నతివ యిట్లనె నాసాహసాంకుతోడ.

200


క.

పతి నే మొరంగి యిటు లుప
పతులన్ భోగింప నాకు పతి యలి గిట్లీ
దితిజుని చేబడు మనుచును
పతి నన్ను శపింప నిట్టిపాటులు వచ్చెన్.

201


క.

పరపురుషుల నాశించిన
తరుణులకును నిందవచ్చు ధర్మము దప్పున్
విరసమున నుభయకులజులు
పరిహరణము చేతు రంత బాపము(తగులున్.)

202


వ.

అట్లు గావున రాక్షసబాధ మాన్పి నన్ను రక్షించితివి గావున తన్నిక్షిప్తధనంబు గైకొనుమని చూపిన నది తనవెంటవచ్చువైశ్యున కిచ్చి పురంబున కరిగె, నిదియుం గా కొక్కవిచిత్రంబు వినుమని యిట్లనియె.

203


క.

ధనహీనుని బోషించుట
ఘనులకు నది నైజగుణము కామాంధుని ని
ర్ధనుని ధన మిచ్చి మనుపడె
యనుపమసత్కీర్తి సాహసాంకుఁడు గడిమిన్.

204


వ.

అది యెట్లనిన.

205


సీ.

వనవాస మనుపేర జని విక్రమార్కుఁడు
        దీపించు చంద్రవతీపురమున
వీట దరిద్రుండు విప్రుండు ధనము లే
        దని దుఃఖమును బొంద విని మహేశు

డట యింద్రకీలాద్రి నష్టభైరవులకు
        నష్టాంగరక్తంబు ? తర్పణం. . . . .
...............
        ...............


ఆ.

నచటి కరిగి చెప్పినటువలెనే చేసి
మెచ్చి దేది యిచ్చు మేటిధన...
.............................
...... గెఁ బురికి సాహసాంకనృపతి.

206


వ.

మఱియు నొక్కవినోదంబు వినుము.

207


క.

దైవికమానుషములలో
దైవికమే యధిక మండ్రు తజ్ఞులు వినుమా
దైవికమె.............
................................

208


సీ.

దేశంబు చూడ నాదిత్యనాముం డొగి
        యొక్కకారడవిలో నున్న నొక్క
యవధూత.............
        యీరంపు పడవులని పెలతిరిగెద
నన్నదైవిక మిట్టులడదిరగ
        దైవికమునగా............
.....................
        .....................


తే.

...వినుపింతు ననుచు నయ్యతికి ననియె
రాజ్యమును బాసి ద్రవిడభూరాజ్యవిభుఁడు
పత్నియ..........................
........యపుడు...................

209

క.

వృక్షముననున్న యేవురు
యక్షులు దమలోన మాటల......
.................
.....యారాజ్యంబు గలుగు నది యెట్లనినన్.

210


సీ.

ఈతడు వోయిన యీనాకవు...
        దగిలించుకొనిపోయి తత్పురమున
సామంతు లొకమత్తసామజంబున కొక్క
        పూదండ యిచ్చి యప్పురము
........................
        కధిపతి చేయు బొమ్మని యక్షు
పట్టణముపొంత నొకశిలాపట్టమునను
        కూరుచుండంగ నాభద్రకుంజ ...
బెట్టుటయు వాఁడు బాలించె పృథివియెల్ల


తే.

అది సహింపక వీఁ డొక్కయాగఁడీఁడు
యవని యేలెదు ననచు సైన్యములతోడఁ
గడిమి మెయివచ్చి పురికి ముట్టడము సేయ
యక్షులను జింతనము సేయ నాక్షణంబ.

211


క.

ఆయక్షవరులు నృపునకు
రాయిడి సేయుటయు నాత్మరణమున నురుమై
పోయి రిల ధాతువాదఁవు[11]
మాయలఁ జెడకున్నయట్టిమనుజులు గలరే.

212


వ.

అని దైవికప్రధానంబైన యితిహాసంబు చెప్పిన విక్రమార్కునకు మెచ్చి ప్రతిదివసంబును ధనంబు గురియు చంద్రకాంతలింగంబు నొసంగి యరిగె. సాహసాంకుఁడునుం బురంబున కరుగుచు నాలింగంబు నొక్కదరిద్రవిప్రున కిచ్చి చనియె. తదనంతరవృత్తాంతంబు వినుమని యిట్లనియె.

213

క.

ధనమును విద్యయు శౌర్యము
తనకుం గలదనుచు వృద్ధతములను దా గై
కొనక వెస ధిక్కరించిన
దనుజుండై బుట్టు నిదియ తథ్యము సుమ్మీ.

214


వ.

అది యెట్లనిన.

215


సీ.

దేశంబు జూడ నాదిత్యాంకు డరుగుచు
        నగ్రహారం బొక టంతఁ గాంచి
యందుల నొకవిప్రనందను నొక(క్రోలు)
        మొసలి వట్టినదని మొఱ్ఱవెట్ట
విక్రమార్కుం డది విని వక్రమును జంపి
        విప్రుని విడిపింప విప్రుఁ డనియె
తపమున బడసిన దైవవిమానంబు
        నీ కిత్తు గొనుమన్న నృపవరుఁడు


తే.

ఉపకృతికి నింకఁ బ్రతికార మొల్ల ననిన
నతడు ప్రార్థించి యిచ్చిన నందికొనుచు
పురమునకు బోవ నడవి నాసురుఁడొకండు
వేడుటయు నిచ్చె వాఁడును వెడలె దివికి.

216


వ.

వాఁడును విద్యాగర్వంబునం బెద్దల ధిక్కరించిన పాపంబున నిట్లైతి ముక్తుండ నైతి ననుచుం జనియె. విక్రమార్కుండును పురంబున కరుగుదెంచె. నింక నొక్కటి వినుమని యిట్లనియె.

217


తే.

దుష్టులగు స్వప్నములు...... ?
తగినదానంబు జేసిన దలుగకున్నె
విక్రమార్కుఁడు దుస్వప్నవిద్ధుఁ డగుచు
దానములు జేసి యాకీడు దలఁగికొనఁడె.

218

ఉ.

కాసరవాహనుం డనిన కాంచినస్వప్నము కీడువాపుకో
భూసురకోటికిన్ ధనముప్రోగులుగా నిడె నెం. . .
. . . వైభవంబులును వచ్చును దానముచేత నట్టిచో
దోసము వాయకున్నె ఖలదుర్మదధూర్తులకైన నిమ్మహిన్.

219


వ.

అనిన నారదుండు బలీంద్రున కిట్లనియె.

220


క.

ప్రాణసఖుఁ డైనవానికి
ప్రాణము వెచ్చించియైన పని దీర్పదగున్
........జునకు.........
ప్రాణము వెచ్చించి శౌర్యరవిసతినీడే.

221


వ.

అది యెట్లనిన.

222


ఆ.

విక్రమార్కునగరి విప్రునితనయుఁడు
......... కేఁగి వచ్చునపుడు
తెరువునందు నొక్కస్త్రీ యేలుపురి గని
మెలఁతఁ జూడబోయె మేడమీఁద.

228


ఉ.

కామిని లోకమోహినిని గాంచి... . భూమి ను
ద్దామత గాఁగుతైలఘటతండము చూచి సిలాతలంబునన్
భామ లిఖించు వర్ణముల పద్ధతులం. . . . .
రామ వరించు తైలపిఠరంబున గూలినయట్టిసాహసున్.

224


క.

అనుపద్యము ప
య్యన నప్పు డనె...... కెరుగిం
చిన నా విప్రసుతుండె
తనకు సహాయముగ నరిగి తత్తైలమునన్.

225

ఆ.

మునుగబోవబట్టి........
తన్ను నేలి యాపురంబు నేలుమనిన
నన్ను వలదు విప్రనందను వరియింపు
మనుచును పరిచంచి..........

226


వ.

అనిన బలీంద్రుం డిట్లనియె.

227


ఆ.

విక్రమార్కనృపతి విక్రమంబె ...
.............
చెప్పుమ.....
మూడులక్షణవిశుద్ధుం డగుట సాగివచ్చు.

228


వ.

అని నారదుం డుపన్యసించి మరియును వినుమని యిట్లనియె.

229


చ.

అవని చరించ ...కడ్డము వచ్చి యొక్కభూ
దివిజుఁడు పల్కె కంచి బరదైవత ముప్పదిమూఁడుచిహ్నముల్
భువి జరియించుమా.........త్తుని శసం
భవరససిద్ధి నాకనియు బల్కెను నే వినుచుండ భూవరా.

230


ఆ.

అనిన సాహసాంకు డవ్విప్రుతో గం
....................కాత్మపురము
తెంపుకొనగ బట్టి దేవతరససిద్ధి
యిచ్చె నదియు ద్విజున కిచ్చె నతఁడు.

231


వ.

మరియు......దాతృత్వంబు వినుమని యిట్లనియె.

232


క.

క్షితిసురుని బెండ్లి చేసిన
అతిశయమగు పుణ్య మబ్బు నాతని...
....................
(...)తనూభవువలె యనుచు నందురు ఆర్యుల్.

233

వ.

అట్లు గావున.

234


చ.

ధరణి చరించి శౌర్య..... ...చుండ భూ
సురుఁ డొకఁ డేగుదెంచి తనసూనునిబెండిలి సేయుమన్న భూ
వరుఁ డొకకోటినిష్కముల..... నిచ్చె దానబం
ధురునకు నీయరాని యతిదుష్క వస్తువు గల్గ నేర్చునే.

235


వ.

అనిన మరియు నీ వెఱిగిన విశే......ప్పుమనిన దైత్యనాథునకు మునినాథుం డిట్లనియె.

236


క.

తల నరకబోవువానిని
తల నరక యుండగా......కిన
తలపోయ నశ్వమేధపు
ఫల మందగ గలుగు ననుచు పలుకుదు రార్యుల్.

237


వ.

 అది యెట్లనిన.

238


సీ.

........బులు[12] దిరుగుచు విక్ర
        జనపతి యొకచూతవనమునందు
పెదవు లెండగ గడుభీతులై పరత
        .. భేతాళాఖ్యపురమువారు
చంపవచ్చిన దప్పి చనుదెంచితిమి యన్న
        సాహసమూర్తి నచ్చటికి నరిగి. ... ..
...అటమున్న వధశిలాతటమున
        జంపంగబెట్టినని చేపట్టి తిగిచి


తే.

రక్తమాంసము నాశరీరమున గలదు
బలిగ జేయుఁడు త న్నని పల్కు నపుడు
పూజ యొనరించి పూజరి బొదివిపట్టి
దినకరుని జూపి పల్కె నద్దేవి యపుడు.

239

క.

నీసాహసమున కలరితి
యేసిద్ధుఁలనైన వేడు మిచ్చెద ననినన్
గ్రాసంబు మాను పూజల్
చేసినమానవుని విడువు? శుద్ధచరిత్రా.

240


వ.

అని మానుషాశనం బెన్నడు చేయకుమని యాపూజారి విడిపించె నని మఱియు నారదుం డిట్లనియె.

241


క.

పాయక ప్రాణము కెల్ల న
పాయము గావించు క్రూరపార్థివుహింసా
ప్రాయంబు మాన్పుమంత్రికి
నాయింద్రపదంబు జేరు ననిరి మహాత్ముల్.

242


వ.

అని యుపన్యసించి విక్రమాదిత్యుని విచిత్రం బొక్కటి గలదు విను మని యిట్లనియె.

243


క.

అపరాధి గానివారిని
నెప మిడి దండించెనేని నిజసుతునైనన్
రిపునిగతి దునుమజూచుట
నృపతులకును దండనీతి నిల్పుటగాదె.

244


వ.

అట్లు గావున.

245


క.

మునిమాట్కి విక్రమార్కుఁడు
చని దేశములెల్ల జూచుసమయమునందున్
వననిధితటమున నొకపురి
కనుగొని వసియించె నికటగహనమునందున్.

246


సీ.

ఆపురవర మేలునధిపతి సువిచారు
        డనుమహీపతి కూర్మితనయుఁ డొకఁడు
జయసేనుఁడనువాఁడు హయయానుఁడై వేఁట
        యరిగి సరితీర్థ మాడదలఁచి

తురగంబు డిగి నదీతోయంబు జొచ్చుచో
        నొకవిప్రు గాంచి తా నొక్క డగుట
కతన గుఱ్ఱము బట్టు క్షితిసుర యన వాఁడు
        పట్టకున్నను గశఁగొట్టుటయును


తే.

పారుఁ డరుదెంచి యాసువిచారునకును
జెప్పుటయు నాత్మసుతు గొంచు శుద్ధయోగి
విక్రమాదిత్యునకు నది విన్నవించి
సుతుని చెయి ద్రుంచు మన ద్రుంచ నతనిమీఁద.

247


ఆ.

హేమవృష్టి గురియ నాముని కది యీయ
మునియు నిచ్చె విప్రతనయునకును
కపటమునియు వాని కరమున సంధాన
కరణి మోపుటయును గరము మొలచె.

248


వ.

అందున కద్భుతచిత్తులయిన భూసురభూపతులచేత పూజితుండై యాత్మపురంబున కరిగె. మఱియును వినుమని యిట్లనియె.

249


క.

పాతకముల నణగించును
ఖ్యాతులు దిక్కుల ఘటించి కామితఫలముల్
చేతికి లోనగు నరునకు
భూతదయం బోలగలదె పుణ్యము ధరణిన్.

250


వ.

అది యెట్లనిన.

251


సీ.

విక్రమార్కుఁడు భూమి వీక్షింప నరుగుచో
        పథగహనంబున బడియలోన
నడుసున బడి బక్కయావు చిక్కిన దయ
        నెత్తెదనని పోయి యెత్తలేక

పెనఁగుచో బ్రొద్దుగ్రుంకిన బాసిపోలేక
        కడుభక్తి నయ్యావు గాచియుండ
పులి మీఁద నురికిన దలగక వధియించి
        పిడుగులు గాలియు బెడిదముగను


తే.

వరుష మొక్కటి గురియ నప్పురుషవరుఁడు
గోవునకు నడ్డముగ నిల్చి వేవుటయును
యతనిదయ జూచి సురభి ప్రత్యక్షమగుచు
మనుజభాషల నృపతి కిట్లనియె సురభి.

252


తే.

నీదయాళుత్వసాహసనిచయమునకు
నమరపతి మెచ్చి నిన్ను న న్నరయబంపె
నట్ల యరసితి యది దృష్ట మయ్యె నీకు
వరము లిచ్చెద యెద్ది నీవాంఛితంబు.

253


వ.

అనుటయు.

254


క.

ఉపకారపరుఁడు తాఁ బ్ర
త్యుపకారము గోరెనేని యుపకారంబా
నెపమున నొక్కటి(కొక్కటి?)
నుపమించుటగాక యనరె యుత్తమపురుషుల్.

255


వ.

అని నిజపురంబునకు జనియె నని చెప్పి మఱియును.

256


క.

మాయలు పన్నియు వివిధో
పాయంబులు చూపి హితము వల్కియు నానా
పాయములు చెప్పియును నర
నాయకులను.....నమ్మింతురు నన్.

257

వ.

అది యెట్లనిన విక్రమార్కుఁ డొక్కనాడు కొలువు కూర్చున్నసమయంబున గృత్రిమపత్నీసమేతుండై యొక్కయెంద్రజాలికుం డఱుగుదెంచి యిట్లనియె.

258


ఉ.

ఇంద్రునిబంట నేను దివిజేంద్రసమానక విక్రమార్క యీ
చంద్రనిభాస్య నిల్లడిడి శక్రవిరోధులతోడ పోరుని
స్త్రంద్రత జేయబోయెద ప్రతాపభయంకరసాహసక్రమో
పేంద్ర సమగ్రవిక్రమసమేత ? పరాక్రమ నన్ను జూడుమీ.

259


క.

అనిన గగనవీథి కెగయుచు
తనువు దిరస్కరిణి దాఁచి దర్పితగర్జా
నినదంబు చేయుచుండగ
పనిచేసినయట్ల యయ్యె నంబరవీథిన్.

260


వ.

అంత.

261


క.

కరములు బదములు శిరములు
ధరపై బడునట్లు దోప తరుణియు నాత్మే
శ్వరుగూడ బోదుననవుడు
మరణము నిజమౌనొ కాదొ మానవె యనినన్.

262


ఆ.

ఉడుగ కగ్ని నువిద యురికిన నటువలె
దలుగుటయును భటుఁడు గెలుపుతోడ
వచ్చినట్లు వచ్చి వనిత నా కిమ్మన్న
విక్రమార్కు డపుడు విస్మయమున.

263


వ.

భవదీయపత్ని త్వత్కరచరణశిరంబులు దునిసి ధరణిపై బడిన నగ్నిప్రవేశంబు చేసె ననుటయు వాఁ డిట్లనియె.

264


తే.

ప్రాణములతోడ దేవ నీపదము కొలువ
వచ్చి యుండంగ మత్కాంత చచ్చు టెట్లు

గొడ్డు తనతల్లియని కన్నకొడుకు చెప్పు
మాట నిజమయ్యె నిచ్చోట మనుజనాథ.

265


దోదకం.

ఈజగ మంతయు నేలుచు నాయీ
రాజముఖంబరి రంభణ సేయన్
తేజము గాదిది తే నావనితన్
రాజులు గోరిన రామలు లేరే.

266


వ.

అనవుఁడు.

267


క.

నివ్వెరపడి (జనపతి యిపు)
డెవ్విధమున నిత్తు వీని యిందునిభాస్యన్
నవ్వో నిజమో యని మది
నెవ్వగచే మాటలాడ నేరక యున్నన్.

268


ఆ.

అంత నింద్రజాలి యామాయ లెల్లను
దలగబెట్టి వచ్చి నిలుచుటయును
పాండ్యనృపతి తన కుపాయన మిచ్చిన
మేటివస్తుచయము మెచ్చి యిచ్చె.

269


వ.

అదియునుఁ గాక.

270


క.

పేదలగు విప్రు లడిగిన
నాదరణముతోడ నల్పమధికం బన కా
హ్లాదమున నిచ్చువాఁ డా
యాదిమదా తనుచు నుందు రార్యజనంబుల్.

271


వ.

ఈయర్థంబు దెలుపు నితిహాసంబు వినుమని యిట్లనియె.

272

సీ.

ప్రథమాద్రిమణినితంబప్రదేశమ్మున
        నొక్కపద్మాకర మొప్పుచుండు
దానిలో నొకమణిస్తంభంబు భాస్కరుఁ
        డుదయింప దానును నుదయమందు
నదియు మధ్యాహ్నంబునందు సూర్యనిమోచు
        నన విని యొకసిద్ధు డరుగుదెంచి
విక్రమార్కునకు నవ్విధ మెఱిగించిన
        సాహసనృపతి యచ్చటికి నరిగి


తే.

కంభ ముదయింప దాను నక్కంభ మెక్కి
యంబుజాతాప్తుబింబంబు నందుకొనిన
చండదీప్తికి నోర్చిన సాహసాంకు
మెచ్చి కుండలీయుగళంబు నిచ్చి యనిపె.

278


వ.

అట్లు సూర్యదత్తం బైనకుండళయుగళంబు ప్రతిదివసంబు అష్టబారువులు సువర్ణంబు గురియునని విన్నవాఁడు గావున నవి గైకొని పురంబున కేతెంచునప్పుడు మార్గంబున.

274


ఆ.

ఘనదరిద్రహతిని గడుడస్సి భూసురు
డర్ధ మొసగుమనుచు నడుగుటయును
కుండలంబులమహిమ గొనియాడి విప్రున
కిచ్చి యాత్మపురికి నేఁగుదెంచె.

275


వ.

అని మఱియు నిట్లనియె.

276


క.

ధరణిక వగ్రహదోషము
దొరకిన తచ్ఛాంతి సేయ దొడరుదు రవనీ
శ్వరులు దగదైవమానుష
చరణులచే వానగురియు చందంబునకున్.

277

వ.

అది యెట్లనిన.

278


ఆ.

సాహసాంకునకును సమయంబునందు బం?
చాంగ మొక్క విప్రుఁ డనునయించి
యధిప! పదియునారు నబ్దంబు లీయెడ
వాన గురియకుండ వగ్రహమున.

279


వ.

అది యెట్లనిన.

280


క.

ప్రాతఃకాలము మంచును
ఆతతమధ్యాహ్నవేళ నభ్రోచ్చయమున్
రాతిరి నిర్మలగగనము
నేతరి దోచినను నచట యేలా యుండున్.

281


వ.

ఇట్టియనావృష్టికి శాంతి చేయవలెననిన నీ రుద్రాభిషేకవారణజపాదిశాంతులు సేయించినం గురియకున్న విక్రమార్కుఁడు.

282


క.

విల్లును శరములు గొని దివి
తల్లడపడనేసి మేఘతండముచేతన్
వెల్లువగా గురియించెను
బల్లిదులకును చేయరాని పనులును గలవే.

283


వ.

మఱియును.

284


క.

క్రూరమృగబాధ లుడిపి ప్ర
జారక్షణ మాచరించు జనపాలునకున్
ధారుణి సురధేనువునా
కారంబున గురియుచుండు గామితఫలముల్.

285


286

మత్తకోకిల.

భిల్లుఁ డొక్కఁడు వచ్చి చెప్పెను భీకరంబగు ఘృష్టి భూ
మెల్ల ద్రవ్వుచు మర్త్యులన్ వధియింప నచ్చట మానవుల్
తల్లడించుచు బారిపోయిన ధాత్రినాయక వచ్చితిన్
పల్లెలన్ వసియింప మాకిక బాసె నేమని చెప్పుదున్.

287


తరల.

అనిన వేటకు నుత్సహించి ధరాధినాథుడు సింధువా
హనము నెక్కి తదుక్తమార్గమునందు నేగి వరాహమున్
కని రయంబున వెంటబెట్టిన గాడ బారి ధరాబిలం
బునను గృంగిన గుఱ్ఱముం డిగి పోత్రివెంటనే పోవుచున్.

288


వ.

ఆభూవివరంబున డిగ్గి సాహసాంకుండు తన్మధ్యంబున భోగవతీపురంబుఁ గాంచి భోగీంద్రునిం బొడగని నమస్కరించి.

289


(ఇక్కడ నొకపత్రము జారిపోయినది.)

290


తే.

ఒసగికొని పొమ్మటన్న వాఁడోపెనన్ని
కట్టుకొనిపోవ నర్థాధికారి వచ్చి
గణిత వినుమన్న నీవును గట్టుకొన్న
వాఁడు నెఱుఁగుట యది లెస్స వలదు లేఖ.

291


వ.

అనిన నుడుగక లెఖ వినుపించిన నర్థాధికారి విశ్వాసంబునకు సంతోషించె నని మఱియు నిట్లనియె.

292


క.

తమవంటివారు స్థితి చెడి
తము నిలువుమటంచు నడుగ తమబ్రతుకునకై
తమకించ కొసగునరులకు
తమ కింపగు ఫలము లబ్బు తథ్యము సుమ్మీ.

293


వ.

అవ్విధంబు వినిపించెద నని యిట్లనియె.

294

సీ.

చాంద్రగుప్తక్షితీశ్వరుఁడు దేశాంతర
        మరుగుచో తుహినభూభరముపొంత
ఘనుఁడు త్రికాలజ్ఞుఁడను సిద్ధు బొడగని
        మ్రొక్కిన నాసిద్ధముఖ్యుఁ డనియె
నెవ్వరి కిచటకిని నేతేరరాదు నీ
        వెట్లు వచ్చితివి నీ కిత్తు నెద్ది
యని గంతయును దండమును గరణియుగూడ
        నిచ్చి తన్మహిమల నెఱుఁగజెప్ప


తే.

అందికొని వచ్చు తెరువున నధిపుఁ డొకఁడు
రాజ్యహీనత్వ మొంది యరణ్యవీథి
దీనదశ చెంది తన్ను నర్థించుటయును
సిద్ధుఁ డిచ్చిన యవి యిచ్చి క్షితివరుండు.

295


వ.

వానిమహిమ దెల్పువాఁడై యిట్లనియె.

296


తే.

గంత ధరియింప మేదినీకాంతుఁ డగును
కరణి మోపిన ప్రాణసంగతులు గలుఁగు
దండధరుఁడైన రిపులదోర్దర్ప మణంచు
ననుచు నుపదేశ మిచ్చి దా నరిగె బురికి.

297


వ.

మఱియొకవిశేషంబు వినుమని యిట్లనియె.

298


క.

సోదరులు పాళ్ళుకొరకై
వా దడిచిన పిన్న పెద్ద వరుసానుగతిన్[13]
వా దడఁచి పంచిపెట్టిన
భూదేవుల వేల్పు లనుచు బొగడుదు రార్యుల్.

299


వ.

అది యెట్లనిన.

300

సీ.

విక్రమాదిత్యుం డుర్వీస్థలి పాలించ
        .....................
కాలాంతరమున బొందెడు వేలధనమెల్ల
        ధనమెల్ల శయన పాద మిలకింద
పాతినని పుచ్చు...............
        ............................
చూడనాధనంబు...............
        లెముకల బొగ్గులు నుముకయు మన్నునై
యన్నుల్గు బిందెల నున్నజు
        ..................భ్రమసెమీకు,


విన్నవింబంగ వచ్చితి మన్న నవ్వి
యవ్వనెవ్వని పాలనె దేది యుండె
అది................రిగియంత.

301


క.

భూమిసుర లాదిగా గల
గ్రామంబుల దగవు దీర కవుడు ప్రతిష్ఠా
...............................
భూమీశ్వరు నడుగ నతఁడు పొందుగ దీర్చెన్.

302


తే.

...................కరుడు
శాలివాహను బిలువంగ జారుబంప
నతడు రాకున్న గోపించి యర్కనృపతి
....................ర్వారుఁ డగుచు.

303


సీ.

శాలివాహుండు సాహసాంకుని సైన్యంబు
        విరివిగా బురము................
గమతండ్రి వాసుకి దలచిన నాప్రొద్దె
        ఫణిపతి దైత్యుల బంపుటయును

దారి..................
        సాహసాంకుఁ డొక్కశైలమునకు
దందశూకము గోరి తప ముగ్రము
        ..................కలశమియ్య


నందికొని రాగ నయ్యురగాధి విచుడు
భోగిపుత్రులుగువ..........
...గుండుచని విక్రమార్క ననుచు
బొంచుటయు వారువచ్చి దీవించి యపుడు.

304


తే.

అమృతకలశంబు ప్రార్థించి యడుగనీక
నించు కాలస్యమైన నీ వీయకున్న
నన్యదాతను వేడెద మన్నవారి
కపటభూసురచరితుల గా దలంచి.

305


క.

నిజము వచింపుఁడు భూమి
ద్విజులవి యడుగుటయు శౌర్యదినకర! మేమా
భుజగపతి యాత్మనందను
విజయ మపేక్షించి యనుప విప్రుల మగుచున్.

306


వ.

వచ్చి ని న్నమృతం బడిగితి మనిన భూపాలుండు.

307


క.

యాచకుఁడై రిపుఁడైనను
నీచాత్ముండైన పాపనిరతుండైనన్
యాచింప నర్థ మీయక
త్రోచుట త్యాగులకు నధికదోసము జేయున్.

308


సీ.

గువ్వకై దేహంబు గోసి పెట్టఁడె శిబి
        తనమేను వలెనని దాంచికొనినె
బలభేదిచేత ది త్తొలిపించుకొనే
        గర్ణుఁ డంగంబు దాచుకోనాసలేదె

......................
        ........................
........................
        .........................


తే.

దేహ మస్థిర మనుచు సందేహ ముడిగి
యిత్తు రుత్తము లీరాని విత్తమైన
.................................
..................................

309


వ.

అని తలంచి కుహకవిప్రులకు నమృతకలశం బిచ్చి యప్పటి యట్ల తపంబున వాసుకి నారాధించి తత్ప్రసాదంబున నాత్మబలంబులు ప్రాణములు వడసి తనపురంబున కరిగి రాజ్యంబు చేయుచుండె మఱి యొకకథ వినుమని యిట్లనియె.

310


క.

దానంబును సాహసమును
మానవుఁ డేకొలది గట్టిమనసున జేయున్
దానాకొలదినె ఫలసం
తానంబులు గలుగు నిదియె తథ్యము సుమ్మీ.

311


వ.

అది యెట్లనిన.

312


సీ.

విక్రమార్కుడు రాజ్యవిభవస్థుఁడై యుండ
        కవి వచ్చి వితరణకథలలోన
కనకవర్ముండను మనుజేశ్వరుండను
        దినమును దేవికి తనువు వేల్చి
యర్థంబు వడసిధనార్థుల దనుపుచు
        వర్తించునని జెప్పి వాని జూడ
నరిగి యాతఁడు వేల్చుననలంబులో దన
        దేహంబు వైచిన దేవి మెచ్చి

ఆ.

వరము వేడుమన్న వరదయ నృపతికి
ధరువు వేల్పకుండ ధనము లిమ్ము
అనిన నిచ్చె దేవి యతఁడును ముద మంది
యనుప విక్రమార్కుఁ డరిగెఁ బురికి.

313


వ.

మఱియు నొక్కవినోదంబు వినుమని యిట్లనియె.

314


క.

నేమములు దలచ నొల్లరు
సామాన్యం బనరు తమకు సాగిన కొలదిన్
కామిను లేకాంతంబున
కామించిన నొల్లమనరు కాముకజనముల్.

315


వ.

అది యెట్లనిన.

316


స్వాగతం.

శక్రసన్నిభుఁడు సాహసలీలా
విక్రముండు పృథివీతల మేలన్
శుక్రనీతిమతి శుద్ధుఁడు మంత్రీ
ప్రక్రముండు జనపాలకు వీఁటన్.

317


వ.

శుద్ధబుద్ధి యనువాడు తత్తనూభవుం డిచ్ఛావిహారుండనువాఁడు దుర్వర్తనుండై దేశంబు దిరుగుచు నుష్ణతీర్థంబున నుష్ణలింగంబు దర్శించి యారాత్రి యక్కడ వసియించియుండ నారాత్రియందు.

318


క.

శంభుని గొలువగ వచ్చిరి
రంభోర్వశలాదిగాగ రాజానన లు
జ్జృంభకుచకుంభసంభృత
శుంభద్గంధానుమోదశోభిత లగుచున్.

319

ఆ.

వచ్చి యుష్ణమూర్తి నచ్చట సేవించి
పోవునపుడు మంత్రిపుత్రు జూచి
మమ్మ గూడిరమ్ము మాపురి కనపోయి
చిత్త మద్భుతంబు జెంది మగుడి.

320


వ.

వచ్చి యవ్వార్త వినిపించిన నతని దోకొని విక్రమార్కుం డచ్చటి కరిగి.

321


ఉ.

ఆవసుధాధినాథుఁడు ప్రియంబున ముందటిభూమి గాంచె గో
దావరివారిమగ్నజనతాఘనకల్మషతాపవిస్ఫుర
ద్దావశృశానుతీవ్రపరిదాహశిఖాగణదహ్యమానకా
ప్లావనవృష్టిమేఘుటలస్ఫుటభాద్రపదాదిశధ్వరిన్.

322


వ.

తొల్లి యచ్చట శేషుండు యజ్ఞంబు సేయుచుండ అగ్నిహోత్రంబు మీఁద ప్రవహించుటం జేసి యది యుష్ణతీర్థంబునం బరగె.

323


తే.

ఉష్ణలింగంబు భజియించె నుర్విభర్త
యచట నారాత్రి వసియింప నర్ధరాత్రి
యప్సరస్త్రీలు వచ్చి యయ్యభవు గొలిచి
సాహసాంకుని దోకొని చనిరి దివికి.

324


వ.

అ ట్లరిగి తమ్ము వరించి తమలోకం బేలుచుండు మనిన నొల్ల మదీయమంత్రిపుత్రుని వరియించి తన్మనోరధంబు సల్పు డనిన నట్ల కాకయని యప్పటిచోటనే డించి యరిగిన.

325


క.

పురి కేతెంచెను విక్రమ
ధరణీపతి యప్సరసలు తన్మంత్రిసుతున్
వరియించి కొలుచుచుండిరి
విరోచనసుత నింక నొకటి వినుమని పలికెన్.[14]

326

క.

సారాచారసమగ్రో
దారుండగు నృపతిసుతుఁడు ధర పాలింపన్
మారీవ్యాధులు దరిద్రా[15] ?
చోరగ్రహగతులు ప్రజల సోకగయుండన్.

327


ఆ.

అట్లుగాన విక్రమార్కుఁడు రాజ్యంబు
పాలనంబు సేయ ప్రజల కెల్ల
దుష్టచోర రోగదుర్గత్య వగ్రహా
న్యాయవర్తనంబు లంటకుండు.

328


వ.

అనిన విక్రమార్కునకు ద్వాత్రింశత్పుత్రికాసింహాసనం బెట్లు గలిగె ననిన బలీంద్రునకు నారదుం డిట్లనియె.

329


క.

రంభయు నూర్వశియును ను
జృంభితనాట్యంబు చూప చింతారత్నా
దంభఘనవేదిపై నా
జనభారి వసించియున్నసమయమునందున్.

330


ఉత్సాహము.

ఏను బోయి మున్న జూచి యింద్రుడని యేవేడ్కనో
మౌనినాథ నృత్యశాస్త్రమార్గ మెవ్వఁ డెఱుఁగు నా
మానవేశుఁడైవ విక్రమార్కుఁ డెఱుఁగునన్న న
ద్దాన వారి రథము నంపె ధరణినాథుచోటికిన్.

331


ఉ.

పంపిన విక్రమార్క నరపాలకుఁ డింద్రునియాజ్ఞ పూని నై
లింప ధరిత్రి కేఁగి యట లేఖకులేంద్రుని గాంచి వజ్రి మ
న్నింపగ రత్నపీఠమున నిల్చె సురల్ వినుతింపగన్ యశ
స్సంపదుదారశౌర్యుడగు సాహసమూర్తి దిగీశవైఖరిన్.

332

క.

భరతాచార్య మతంబున
నొరవట్టగరాని నృత్య మూర్వశి చూపెన్
వరుసం దత్తిళమతమున
సరసముగా నాడె రంభ శక్రుఁడు చూడన్.

333


వ.

అప్పు డింద్రుఁడు విక్రమార్కుని జూచి యీయిద్దఱిలోన శాస్త్రసిద్ధం బైననృత్యం బెవ్వరి దనిన నతం డిట్లనియె.

334


క.

అంగములు ప్రధానంబులు
పాంగప్రత్యంగములు రసాస్పదభావం
బంగీకరింపవని యిది
సంగతి గాదనిరి భరతశాస్త్రజ్ఞవిధిజ్ఞుల్.

335


క.

అంగప్రత్యంగములే
అంగీకరణంబు గాఁగ నాడెనురంభా
భంగులు శాస్త్రక్రియలకు
భంగంబగు నండ్రు చూడు భరతవిధిజ్ఞుల్.

336


వ.

మఱియు శుద్ధాంగవిధాంగ దేశిమార్గ నృత్యంబుల నిపుణత చూపిన నూర్వశి మత్తల్లి హల్లీసక ప్రేక్షణి పేరణీ కుండలి దండలాసతాది నృత్యంబులు విధాంగలక్షణం బగుటను శుద్ధాంగవిధాంగంబులలో శుద్ధాంగం బుత్తమం బగుట నూర్వశి మేలనిన ద్వాత్రింశత్పుత్రికాయుక్తంబైన సింహాసనం బిచ్చి యనిపిన విక్రమార్కుడునుం బురంబునకు వచ్చి తత్సింహాసనారూఢుండై రాజ్యంబు సేయుచుండ గొంతకాలంబునకును.

337


ఆ.

కంప మొందె ధరణి గజముల మద మింకె
తురగనేత్రములను దొరగె నీరు
కురిసె రక్తవృష్టి కూపెట్టె నక్కలు
రవికి దేజ మణఁగె రాజె దిశలు.

338

తే.

ఇట్టి యుత్పాతములు ధర బుట్టుటయును
భట్టి వినుపించుటయు నరపాలవరుఁడు
యిందులకు నేమి కారణ మెఱుఁగ జెప్పు
మనిన నాభట్టి జెప్పె నేకాంతమునను.

339


సీ.

నీతపశ్శక్తికి నీలకంఠుఁడు మెచ్చి
        యిల యేల వెయేండ్లు నిచ్చె నీకు
ఇటు బుద్ధిబలిమి వేయేడులు నే నీయ
        రెండువేలేం డ్లిల నుండగలిగె
హరుఁడు చెప్పిన కాలమయ్యె మాసాధిక
        సమవయఃకన్యకాజాతుఁడైన
బాలుచే బడ నీకు బ్రాప్తంబు గలదని
        వచియించె నటువంటివాఁడు ధరణి


తే.

బుట్టగాబోలు నరయంగ బెట్టిపంపు
మనిన బేతాళు దలచె నయ్యవనినాథుఁ
డతఁడు చనుదేర నరయ బొమ్మనిన వాఁడు
నరసి యేతెంచి యావిక్రమార్కునకును.

340


క.

వినుపించెఁ బ్రతిష్ఠానం
బనుపురి నెల యెక్కుడైన హాయనపువయో
వనితకు పుట్టిన బాలుం
గనుగొంటిని విప్రకన్యకానందనునిన్.

341


వ.

అని చెప్పి యదృశ్యం బయ్యె. విక్రమార్కుండు వాని బట్టితే బంపినవారునుం జని ప్రతిష్టానపురం బవరోధించిన.

342

క.

వాసుకి తనపుత్రునికై
యాసురసైన్యముల బంప నాసైన్యములన్
వాసిచెడ నురిపి విడిచిన
నాసాహసమూర్తి వినియె హతశేషులచే.

343


క.

విని కోపంబున దా నే
గిన నబ్బాలకుఁడు కోలఁ గెడపిన గూలెన్
ఘనుఁడైన విక్రమార్కుఁడు
ఘనహీనత లొక్కరూపకాలంబునకున్.

344


క.

కాలవశంబున నొకపసి
బాలునిచేనైన ఘనుని ప్రాణము పోవున్
కాలము గూడక తల దెగి
వ్రాలిన ప్రాణంబు మగుడి రాదె తలంపన్.

345


సీ.

శాలివాహనుచేతికోలచే విక్రమ
        శిర మట్లు దెగుచు నుజ్జయినిపురము
నందు సాహసమూర్తి యంగన ముందర
        బడుటయు నాకాంత భట్టి జూచి
గర్భములో నున్న యర్భకు వెడలించి
        యతనిచేతికి నిచ్చి యగ్ని జొచ్చె
భట్టియు నాబాలు పట్టభద్రుని చేసి
        యేలించె నిల యెల్ల నింతలోన


ఆ.

గగనవాణి పలికె గద్దియ యెక్కంగ
పాత్రుఁడైన భూమిభర్త లేడు
గాన ధరణిలోన గప్పుడు మీరని
చెప్పె భట్టి యట్ల జేసె నంత.

346

వ.

కొంతకాలంబునకు నాస్థలంబు నిర్మానుష్యంబై యడవి పెరిగిన నొక్క భూసురుండు.

347


ఆ.

చెట్టుగొట్టి చేనుచేసి నాఁగటదున్ని
గొజ్జు గొట్టి నడిమిగుట్ట లేరి
[16]సవర జేసి గోరుతగాగజేశిని శాఖ (?)
విత్తులలికి కంచెవెలుగు వెట్టి.

348


క.

మిడుతులకు దప్పిచాలే
ర్పడ బాయఁగ పెఱిగి పేనువట్టకవలమై
సుడి చావక యెలుకలచే
బడినొవ్వక జొన్న పెఱిగి పండగనంతన్.

349


శా.

ధారాపట్టణ మేలు భోజుఁడు మహోదారుండు వాహ్యళిగా
నారణ్యంబున కేఁగివచ్చునెడ బ్రహ్మప్రాప్తభూయోవనో
చారంభస్థలి[17] జేరువం జనఁగ సైన్యవ్రాతముం జూచి య
ప్పారుం డిట్లనె జొన్నచొచ్చివలెనేభక్షింపుడీ బియ్యమున్.

350


క.

అని మంచెమీఁదఁ బలుగక
విని నిజమని జొన్నవెన్ను విరువగ మంచం
బును డిగ్గి వెంటదొలంగం
జని కుయ్యో యనిన సైన్యజను లతిభీతిన్.

351


ఆ.

చేను వెడలిపోవ దా నెప్పటిని మంచె
యెక్కి వెడలిపోవ నేల మీకు
నూచబియ్యమైన నోపినలాగున
దిను డనంగ వారు తిరిగి చొరగ.

352

వ.

తొల్లిటి యట్ల మంచ డిగ్గి యప్పటిగుయ్యిడిన భోజుండు విస్మితుండై యమాత్యుని నడుగుటయును నతండిట్లనియె.

353


క.

విత్తంబుమీఁదనుండిన
మత్తుండై పలుకునట్టి మానవుఁడైనన్
విత్తము ప్రలాపయుతమని
చిత్తంబునఁ దలఁచి వ్రయము సేయుదు రార్యుల్.

354


వ.

అట్లుగావున నితండెక్కిన మంచెక్రింద నధికధనం బుండ బోలు నది శోధింపవలయు ననిన నబ్భోజుండు.

355


క.

[18].......త్రమునకు
భూవరుఁడును ద్విగుణమిచ్చి భూఖనికులకున్
క్ష్మావిభుఁడు మంచెక్రిందను
భూవివరము సేయుమనుచు బొందుగ బలికెన్.

356


క.

జనపతియానతిచే నా
ఖనికులు ధర ద్రవ్వ నచట గనుపట్టె లస
త్కనకమణిరుచులు వెలుగును
ఘనసింహాసనము పుత్రికాసహితంబై.

357


వ.

అది మోయించుకొని ధారాపురంబునకుం జనియెననుటయును.

358


తే.

అట్టిసింహాసనము భోజుఁ డాత్మపురికి
యివ్విధంబున గొనిపోయి యేమిచేసె
నద్బుతంబయ్యె నది నాకు నానతిమ్ము
బ్రహ్మఋషివర్య! ఆదిమబ్రహ్మపుత్ర!

359



ఉ.

వేంకటనాథపుణ్యపదవీ గతయోగసనాథ విస్ఫుర
త్పంకజనేత్ర భైరమహపాత్రమనోంబుజ మిత్రశంక చ
క్రాంకిత బాహు[19]పద్మనిగమాంత మనోహరపద్మకౌస్తుభా
లంకృతపీనవక్ష కమలాముఖ లగ్నకటాక్షవీక్షణా!

360


క.

కుటిలసుర విమత మదహృ
త్పుటచటుల విఘటనచక్ర భూషణ బాహా
కటితటఘట నాహాటక
పటరాజిత కుంటముక్ల భైరవు వరదా!

361


వనమయూరము:

శ్రీమహితరూప! పదసేవితసురేంద్రా!
క్షేమకర! తల్పగత! శేషగత శోభా!
భామహిత గంగవిభు భైరవసుధి హృ
ద్ధామ! తిరువేంకటనిధాన! జగదీశా!

362


గద్య.

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకల నీతికథా నిధానంబునం బ్రథమాశ్వాసము.

363

  1. రణ
  2. ఒక్కట గ్రంథపాాతము
  3. జెన్నయుని అని పాఠాంతరము
  4. తన్మాతృకాన్వేషణా
  5. పుటభేదనమంత్రిమకుటభూషణ మరిరా
    ట్కటకవిభేదనఘటనోద్భటుఁడగు
  6. సీనుఁడనైన ననున్ — సమంజసముగా కన్పించుచున్నది.
  7. మల్లికార్జునుండని?
  8. జేతిఖడ్గ మొకటి యెత్తి
  9. డోయయ్య నాకు నిమ్మన
  10. 194వ పద్యము సరిగా లేదు. ఉన్నది యున్నట్లుగానే ప్రకటించితిమి.
  11. పోయిరి ధాతుర్వాదఁపు
  12. దేశదేశంబులు
  13. పిన్న పెద్ద వరుస ననుగతిన్
  14. విరోచనకుమార యొకటి వినుమని పలికెన్.
  15. దుర్గతి
  16. సవరచేసి గొరుత చదునుకాగ విశాఖ
  17. భూయోవనైకారంభస్థలి
  18. ఆవిప్రక్షేత్రమునకు
  19. పాణి